Go to full page →

మంచి నేలలో COLTel 37

విత్తువాడికి ఎల్లప్పుడూ ఆశాభంగమే ఎదురు కాదు. మంచి నేలలో పడ్డ విత్తనాల్ని గురించి మాట్లాడుతూ “అట్టివారు సఫలులై యొకడు సూరంతులగాను ఒకడు అరువదంతులుగాను ఒకడు ముప్పదంతులు గాను ఫలించెను”. “మంచి నేలన పడిన (విత్తనము పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువాడు” అన్నమాట రక్షకుడు. COLTel 37.1

ఉపమానం ప్రస్తావిస్తున్న “యోగ్యమైన మంచి మనస్సు” పాపరహిత హృదయం కాదు. ఎందుకంటే సువార్త నశించిన వారికి ప్రకటించవల ఉంది. “నేను పాపులనే (పశ్చాత్పాపడటానికి) పిలుప వచ్చితిని. గాని నీతిమంతులును పిలువరాలేదు” అని క్రీస్తు అన్నారు. మార్కు 2:17 పరిశు ద్దాత్మకు విధేయుడయ్యే వ్యక్తి యదార్ధ హృదయం కలవాడు. అతడు తన అపరాధాన్ని ఒప్పుకొని తనకు దేవుని కృప ప్రేమ అవసరమని గ్రహిస్తాడు. సత్యాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించాలని చిత్తశుద్ధితో కోరకుంటాడు. మంచి మనసు విశ్వసించే మనసు. దేవుని వాక్యం మీద నమ్మకముంచే మనసు విశ్వాసం లేకుండా వాక్యాన్ని స్వీకరించడం ఆసాధ్యం. “దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. హెబ్రీ 11:6 COLTel 37.2

ఇతడు “వాక్యము విని గ్రహించువాడు”. క్రీస్తు రోజుల్లోని పరిసయ్యులు చూడకుండా తమ కళ్ళని వినకుండా తమ చెవుల్ని మూసుకున్నారు. అందువల్ల సత్యం వారి హృదయాలికి చేరలేదు.తమ ఇష్టపూర్వక అజ్ఞానానికి సొంతంగా విధించుకున్న గుడ్డితనానికి వారు శిక్ష అనుభవించాల్సి ఉ న్నారు. ఉపదేశానికి తమ మనుష్యులు తెరిచి నమ్మటానికి సిద్ధంగా ఉ ండాలని క్రీస్తు తన శిష్యులకి బోధించాడు. వారు విశ్వసించే కళ్ళతో చూసి విశ్వసించే చెవులతో విని నమ్మారు గనుక ఆయన వారిని దీవించాడు. COLTel 37.3

మంచినేల పోలిన శ్రోత దేవుని వాక్యాన్ని “మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని”నమ్ముతాడు. 1 థెస్స 2:13 లేఖనాల్ని తనతో మాట్లాడుతున్న దైవ స్వరంగా స్వీకరించే వాడే చిత్తశుద్ధితో నేర్చుకునే వ్యక్తి. వాక్యం చదివేటప్పుడు భయంతో వణుకుతాడు. ఎందుకంటే అది అతడికి ప్రాణం గల వాస్తవం. దాన్ని స్వీకరించేందుకు అతడు తన అవగాహనను హృదయాన్ని తెరుస్తాడు. COLTel 38.1

కొర్నేలీ అతడి మిత్రులు అలాంటి శ్రోతలే. వారు “ప్రభువు నీకు ఆజ్ఞాపించి నవన్నియు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నాము”. అని అపొస్తలుడైన పేతురుతో అన్నాడు. అ.కా. 10:33 COLTel 38.2

సత్యాన్ని గూర్చిన జ్ఞానం మానసిక శక్తి కన్నా కార్య పవిత్రత మీద సామాన్యమైన స్వచ్చమైన విశ్వాసం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. దీన హృదయంతో పరిశుద్దాత్మ నడుపుదలను అన్వేషించేవారికి సమీపంగా దేవదూతలు వస్తారు. వారికి సత్య ధన నిధుల్ని తెరవటానికి దేవుడు పరిశు దాత్మను అనుగ్రహిస్తాడు. COLTel 38.3

మంచినేల పోలిన శ్రోతలు వాక్యం విని దాన్ని ఆచరిస్తారు. తమ దుష్ట శక్తులన్నిటితోను సాతాను వారిని ఎత్తుకుపోలేడు. వాక్యాన్ని కేవలం వినటం లేక చదవటం చాలదు. లేఖనాల ప్రయోజనాన్ని పొందాలని అభిలషించే వ్యక్తి తనకు వచ్చిన సత్యం పై ధ్యానించాలి. సత్య వాక్యాల్ని శ్రద్ధతో పరిశీలించి ధ్యానించి దాని భావాన్ని గ్రహించి స్పూర్తిని ఆస్వాధించాలి. COLTel 38.4

గొప్ప తలంపులతో పవిత్ర యోచనలతో మనస్సును నింపుకోవాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మనం తన ప్రేమ పై కృపపై ధ్యానించి రక్షణ ప్రణాళికలో తన అద్భుత కార్యాన్ని అధ్యయనం చేయ్యాలని ఆయన ఆశిస్తున్నాడు. అప్పుడు మాత్రమే తన సత్య జ్ఞానం స్పష్టంగా నిర్దిష్టంగా ఉంటుంది. హృదయ శుద్ధికి, ఆలోచన స్వచ్చతకు మన కోరిక, సమున్నతంగా పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధమైన ఆలోచన వాతావరణంలో నివసించే ఆత్మలేఖన పఠనం ద్వారా దేవునితో సహవాసం వలన మార్పు చెందుతుంది. COLTel 38.5

“సఫలులై.... ఫలించును.” వాక్యాన్ని విని ఆచరించేవారు విధేయతా ఫలాలు ఫలిస్తారు. హృదయం స్వీకరించిన వాక్యం సత్కైయల్లో వెల్లడవు తుంది. దాని ఫలితాలు క్రీస్తు వంటి ప్రవర్తన గల జీవితంలో కనిపిస్తాయి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది” క్రీస్తు చెప్పెను. కీర్త 40:8”నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను”.యోహా 5:30 వాక్యం ఇలా అంటున్నది. “ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే నడుచుకొన బద్దుడైయున్నాడు”.1 యోహా 2:6 మానవడు వంశపారంపర్యంగా పొంది నది, నేర్చుకున్న ప్రవర్తన లక్షణాలు, అలవాట్లు తరుచు దైవ వాక్యంతో సంఘర్షణ పడుతుంటాయి. COLTel 39.1

అయితే మంచి నేల శ్రోత వాక్యాన్ని స్వీకరించడంలో దాని షరతుల్ని విధుల్ని అంగీకరిస్తాడు. అతడి అలవాట్లు ఆచారాలు, ఆభ్యాసాలు, దైవ వాక్యానికి అనుగుణంగా ఉంటాయి. నిత్యుడైన దేవుని వాక్యంతో పోలిస్తే తప్పులు చేసే మానవుడి ఆజ్ఞలు లెక్కలోకి రావు. అతడు పూర్ణ హృదయము తో కార్యదీక్షతో నిత్య జీవాన్ని అన్వేషిస్తున్నాడు. నష్టం కలిగినా, హింస వచ్చినా లేక మరణం సంభవించినా అతడు సత్యానికి విధేయుడ వుతాడు. COLTel 39.2

అతడు “ఓపికతో ఫలించు” వాడు. దైవ వాక్యాన్ని స్వీకరించిన వారైవ్యరు కష్టాలు శ్రమల నుంచి మినహాయింపు పొందరు. కాని శ్రమ వచ్చినప్పుడు యదార్ధ క్రైస్తవుడు ఆందోళన చెంది అవిశ్వాసానికి నిస్పృహకు లోనుకాడు. పరిస్థితుల పర్యవసానాల్ని నిర్దిష్టంగా చూడలేకపోయినా లేదా దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోయినా మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని కృప దయ కనికరాన్ని గుర్తుంచుకొని చింతలు విచారాన్ని ఆయనపై మోపి ఆయన ఇచ్చే రక్షణ కోసం ఓపికతో కని పెట్టాలి. COLTel 39.3

ఆధ్యాత్మిక జీవితం సంఘర్షణ ద్వారా బలోపేతమౌతుంది. సహనంతో భరించే శ్రమలు సుస్థిర ప్రవర్తనను ప్రశస్త ఆధ్యాత్మిక సద్గుణాల్ని పెంపొదిస్తాయి. విశ్వాసం, సాత్వీకం, ప్రేమ ఓర్పు సంపూర్ణ ఫలం తుఫాను మేఘాల చీకటి నడుమ చక్కగా పరిపక్వమవుతుంది. COLTel 39.4

“వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవిర వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా”. యాకో 5:7 అలాగే క్రైస్తవుడు దైవ వాక్య ఫలానికి తన జీవితంలో ఓపికతో కని పెట్టాలి. మనం ఆత్మ మూల సద్గుణాల కోసం ప్రార్ధన చేసేటప్పుడు ఈ ఫలాల్ని వృద్ధిపర్చే పరిస్థితుల్లోకి మనల్ని నడిపించడం ద్వారా మన ప్రార్ధనకు సమాధానం ఇవ్వటానికి దేవుడు తరుచు పనిచేస్తాడు. అయితే మనం ఉద్దేశాన్ని అర్ధం చేసుకోం నిరాశ చెందుతాం. అయినప్పటికి పెరుగుదల ఫలాలు ఫలించటమన్న ప్రక్రియ ద్వారా తప్ప మరే విధముగాను ఎవరు ఈ సుగుణాల్ని పెంపొందించుకోలేరు. దైవ వాక్యాన్ని స్వీకరించి దాని యందు నిలిచి దాని అదుపుకి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం మనం నిర్వహించాల్సిన పాత్ర. అప్పుడు దాని ఉ ద్దేశ్యం మనలో నెరవేరుతుంది. COLTel 40.1

క్రీస్తు అన్నాడు. “ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడునా మాట గైకొ నును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము”.యోహా 14:23 మన మీదికి బలమైన పరిపూర్ణమైన మనసు ప్రభావం వస్తుంది. ఎందుకనగా సమస్త శక్తికి మూలమైన ప్రభువుతో మనకు సజీవ సంబంధం ఉంది. మన దైవిక జీవితంలో మనం క్రీస్తుకు బానిసలమవుతాం. మనం ఇక సామాన్య స్వార్ధ జీవితం జీవించడం. క్రీస్తు మనలో నివసిస్తాడు. ఆయన గుణ లక్షణాలు మన స్వభావంలో పునరుత్పత్తి అవుతాయి. ఇలా మనం పరిశుద్దాత్మ ఫలాలు పలిస్తాం “కొందరుముప్పది కొందరు అరువది కొందరునూరురెట్లు” పలిస్తాం. COLTel 40.2