Go to full page →

సహాయకుల విధులు MHTel 184

నర్సులు, రోగుల గదితో సంబంధమున్న వారందరూ ఉల్లాసంగా, నిలకడగా ఉండాలి. ఆతృత ఉద్రేకం లేక గందరగోళం అంతా నివారించాలి తలుపు తియ్యటం, వెయ్యటం జాగ్రత్తగా చెయ్యాలి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాలి. జ్వరం వచ్చిన సందర్భాల్లో క్లిష్ట పరిస్తితి వచ్చినప్పుడు జ్వరం తగ్గిపోతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. అప్పుడు రోగిని జాగ్రత్తగా చూడటం అవసరం. అజ్ఞానం మరపు లెక్కలేనితనం అనేకమంది మరణాలకు కారణమాయ్యయి. తెలివి జాగ్రత్త గల నరుసల నుంచి సరియైన శ్రద్ధ పొంది ఉంటే అనేకులు బతికి ఉండేవారు. MHTel 184.1

“నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు మిశ్రమ స్థలము నందును ఆశ్రయస్థానములయందును, సుఖమైన నివాసములయందును నివసించెదరు”. యెషయా 32:17, 18. MHTel 184.2