Go to full page →

రోగులను పరామర్శించటం MHTel 184

జబ్బుగా ఉన్నవారిని అతిగా సందర్శించటం అపార్థం చేసుకున్న దయవల్ల మర్యాదను గూర్చిన తప్పుడు అభిప్రాయం వల్ల జరగు తుంటుంది. తీవ్ర వ్యాధిగ్రస్తుల వద్దకు సందర్శకులు వెళ్ళకూడదు. ప్రశాంతత, అంతరాయం లేని విశ్రాంతి అత్యవసరమైనప్పుడు సందర్శకుల్ని ఆహ్వానించటంతో జతపడి ఉన్న ఉద్రేకం రోగికి అలసట కలిగిస్తుంది. MHTel 184.3

కోలుకుంటున్న రోగికి లేక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రోగికి తన పట్ల దయ సానుభూతి గలవారున్నారని తెలుసుకోవటం ఆనందా యకమే కాదు మేలురకం కూడా. అయితే సానుభూతిని వ్యక్తం చేసే ఈ హామీని ఓ వర్తమానం ద్వారానో లేక ఓ చిరుకానుక ద్వారానో ఏ హానీ జరిగే ప్రమాదం లేకుండా అందించటం వ్యక్తిగత పరామర్శ కన్నా ఎంతో మెరుగు. MHTel 184.4