Go to full page →

తన కనికరము చొప్పున .... మనలను రక్షించెను MHTel 39

ఓ శతాధిపతి సేవకుడు పక్షవాత ంతో మంచం పట్టాడు. రోమీయ సమాజంలో సేవకులు బానిసలు, సంతల్లో వారిని కొనడం అమ్మడం జరిగేది. యాజమనులు వారితో క్రూరంగా ప్రవర్తించేవారు. కాని ఈ శతాదిపతి తన సేవకుడి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిచాడు. తన బానిస స్వస్థపడాలని బహుగా ఆశించాడు. యేసు అతన్ని స్వస్థపర్చగలడని విశ్వసించాడు. ఆ శతాధిపతి రక్షకున్ని చూడలేదు. అతడు విన్న వార్తలు అతడిలో విశ్వాసం పుట్టించాయి. యూదులు చాందసాల్ని లెక్క చెయ్యకుండా ఈరోమా అధికారి యూదులు మతం తన మతం కాన్న గొప్పదని నమ్మాడు. జయించిన వారికి జయించబడ్డ వారికి మద్య ఉన్న జాతీయ దురభిమాన మనే అడ్డు గోడను ద్వేషాన్ని అతడు అప్పటికే కూల్చివేసాడు. దేవుని సేవపట్ల అభిమానం ప్రదర్శించాడు. ఆయన ఆరాధకులుగా యూదుల పట్ల దయ కనికరాలు కలిగి మెలగాడు. తాను విన్న నివేదికలను బట్టి క్రీస్తు బోధనలో ఆత్మకు ఏది అగత్యమో దాన్ని అతడు కనుగొన్నాడు. అతడిలో ఆధ్మాత్మిక రక్షకుని మాటలకు సానుకూలంగా స్పందిచింది.కాని యేసును కలవటానికి తాను అర్హుణ్ణి కానని భావించి తన సేవకుడు స్వస్థత పొందేందుకు ఆయనకు విజ్ఞప్తి చేయ్యాల్సిందిగా యూదు పెద్దల్ని ఆర్ధించాడు. MHTel 39.4

యూదు పెద్దలు ఆవిషయాన్ని యేసుకు విన్నవించారు. “నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరమును తానే కట్టించెను” అంటూ విజ్ఞాపన చేసారు. లూకా 7:4,5 MHTel 40.1

అయితే శతాధిపతి ఇంటకి దారిలో అ అధికారి వద్ద నుండి యేసుకి ఈ వర్తమానం వచ్చింది. “ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా యింటి లోనికి వచ్చుటకు నేను పాత్రడనుకాను”. 6 వ వచనం. MHTel 40.2

అయినా రక్షకుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తునే ఉన్నాడు. ఆ వర్తమానాన్ని పూర్తి చేయటానికి శతాధిపతి వ్యక్తిగతంగా వచ్చి “నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపర్చబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పనిచేయమంటే చేయును”. 7వ వచనం మత్తయి 8:8,9 MHTel 40.3

“నేను రోము అధికారినికి ప్రతినిధిని నా సైనికులు నా అధికారాన్ని సర్వోన్నతంగా గుర్తిస్తారు. అలాగే నీవు సర్వశక్తి గల దేవుని ప్రతినిధివి. సృష్టి అయిన సమస్తం నీ మాటలకు విధేయంగా ఉంటుంది. వ్యాధిని పొమ్మని నీవు ఆజ్ఞాపిస్తే అది నీకు విధేయమౌతుంది. మాట మాత్రమే పలుకు. నా సేవకుడు స్వస్థత పొందుతాడు”. MHTel 40.4

“ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమ నీకు అవునుగాక” అని యేసు ఉత్తరమిచ్చాడు. ” ఆగడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను”. 13వ వచనం శతాధిపతి “మన జనులను” ప్రేమించాడు గనుక యూదు పెద్దలు క్రీస్తుకు అతన్ని సిఫారుసు చేసారు.అతడు మనకు” సమాజ మందిరము కట్టించాడు గనుక యోగ్యుడన్నారు. కాని తనను గూర్చి ఆ శతాధిపతి తాను “నేను యోగ్యుడను కాను” అన్నాడు. అయినా యేసు నుండి సహాయం కోరటానికి భయపడలేదు. అతడు తన మంచితనాన్ని నమ్ముకోలేదు. రక్షకుని కృపను నమ్ముకున్నాడు. తన గొప్ప అవసరమే అతడి వాదన. MHTel 41.1

అలాగే, ప్రతి మనుషుడూ క్రీస్తు వద్దకు రావచ్చు. “మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే.... మనలను రక్షించెను”. తీతుకు 3.5 మీరు పాపిగనుక దేవుని దీవెనలు పొందటానికి ఎదురు చూడలేనని మీరు భావిస్తున్నారా? క్రీస్తు పాపులను రక్షించాటా నికి ఈ లోకానికి వచ్చాడని గుర్తుంచుకోండి మనల్ని దేవునికి సిఫారసు చెయ్యటానికి మనలో ఏమి లేదు. ఇప్పుడు ఎప్పుడు నచ్చే విజ్ఞప్తి మన న్సిహాయ స్థితి. ఇది ఆయన విమోచన శక్తిని తప్పనిసరి చేస్తుంది. సొంత శక్తి మీద ఆధారపడటం మాని, కల్వరి సిలువ వంక చూస్తూ ఇలా చెప్పచ్చు. MHTel 41.2

ఇవ్వనేమి లేదు నే MHTel 41.3

హద్దు కొందు సిల్వనే MHTel 41.4

“(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే”. మార్కు 9:23 అది మనల్ని పరలోకంతో అనుసంధానపర్చి చీకటి శక్తుల్ని అధిగమించేందుకు బలోపేతం చేస్తుంది. ఎంత బలమైనదైనా ప్రతీ దుర్మార్గాన్ని అధిగమనించటానికి ప్రతీ శోదనను జయించటానికి దేవుడు క్రీస్తులో మార్గాన్ని ఏర్పాటు చేసాడు. కాని తమకు విశ్వాసం కొరవడిందని అనేకులు భావిస్తారు.. అందుకే వారు క్రీస్తుకు దూరంగా ఉంటారు. MHTel 41.5

” యెహోవా, నీవుదోషమును కని పెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువ గలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును... ఇశ్రాయేలూ యెహోవా మీద ఆశపెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప సంపూర్ణ విమోచన దొరుకును. కీర్త 130:3-7. MHTel 42.1

ఈ ఆత్మలు తమ నిస్సహాయ ఆయోగ్యతలో కరుణామయుడైన తమ రక్షకుని కృప పై అనుకొందురు గాక, మీపై మీరు ఆనుకోకండి క్రీస్తు మీద ఆనుకోండి మానవుల మధ్యనడిచినప్పుడు రోగుల్ని బాగుపర్చిన దయ్యాల్ని పారదోలిని ఆ ప్రభువు ఇంకా అదే శక్తి గల విమోచకుడు. కనుక జీవవృక్షపు ఆకుల్లా ఆయన వాగ్దానాల్ని పట్టుకోండి”. నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటకి త్రోసివేయును.”. యోహాను 6:37 ఆయన వద్దకు వచ్చేటప్పుడు ఆయన మిమ్మల్ని అంగీకరిస్తాడని విశ్వసించండి. ఎందుకంటే అది ఆయన వాగ్దానం. ఇది చేస్తే మీరు నశించరు.. ఎన్నడూ. “దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపర్చు చున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను”. రోమా 5: 8 “దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి యెవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమను మనకెందుక అనుగ్రహింపడు? ” రోమా 8:31,32 MHTel 42.2

“మరణమైనను జీవమైనను దేవదూతలైనను ఉన్నవినయైనను రాబోవునవియైనను అధికారులై పనను ఎత్తయియన లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరనవి రూఢిగా నమ్ము చున్నాను.”. 38,39 వచనాలు. MHTel 42.3