Go to full page →

నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు MHTel 43

తూర్పు దేశాల్లో వ్యాధులన్నిటిలో అతి భయంకరమైనది కుష్టు వ్యాధి. అది నివారణ లేని అంటువ్యాధి స్వభావం కలది. బాదితుల పై దాని భయంకరఫలితాలు మిక్కిలి ధైర్యశాలిని సయితం భయంతో నిం పేవి. పాప పర్యవసానంగా వచ్చిన తీర్పుగా యూదులుపరిగణించారు. గనుక దాన్ని “పక్షవాతం అది “దేవుని మేలు” అని పిలిచేవారు. వేళ్ళు తన్నిన, నయంచెయ్యలేని ప్రాణాంతకమైన ఈ వ్యాధి పాపానికి గుర్తుగా పరిగణించ బడుతున్నది. MHTel 43.1

ఆచార ధర్మశాస్త్రం ప్రకారం కుష్టు రోగి అపవిత్రుడు అతడి శ్వాస వల్ల గాలి మలినమౌతుందని భావించడం జరిగేది. మరణించిన వాడిలా అతణ్ణి మనుషుల నివాసాలకు దూరంగా ఉంచేవారు. ఆ వ్యాధి ఉన్నట్లు అనుమానించబడ్డ వ్యక్తి తనను తాను యాజకులకు చూపించుకోవాలి. వారు అతణ్ణి పరిక్షించి ఆ కేసు పై తీర్పు చెప్పే వారు. కుష్టురోగిగా తీర్మానమైతే అతణ్ణి కుటుంబము నుండి వేరు చేసేవారు. అతణ్ణి ఇశ్రాయేలు సమాజం నుండి వేరు చేసేవారు. అతడు ఆ వ్యాధిగలవారితో మాత్రమే సహవాసం చేసేవాడు. రాజులు, పరిపాలకులు ఈ ఏర్పాటుకి మినహా యింపు కాదు. ఈ వ్యాధికి గురి అయిన ఓ చక్రవర్తి సయితం తన రాజ దండాన్ని సమాజాన్ని విడిచి పెట్టి పారిపోయేవాడు. MHTel 43.2

మిత్రుల్ని బంధువర్గాన్ని విడిచి దూరంగా ఉంటూ కుష్టురోగి తన వ్యాధి శాపాన్ని భరించాల్సి ఉండేది. అతడు తన దురదృష్టాన్ని ప్రకటించాల్సి ఉండేది. తన వస్త్రాల్ని చింపుకోవాల్సి అంటూ వ్యాధి గల తమ సముఖం నుండి అందరూ పారిపోయేందుకు గాను హెచ్చరిక చేస్తూ కేకలు వేయ్యాల్సి ఉండేది. ఆ బహికృతుడినుండి దు:ఖ స్వరంతో “అపవిత్రం! అపవిత్రం!” అంటూ వచ్చే కేకను ప్రజలు భయంతోను ద్వేషంతోను వినేవారు. MHTel 43.3

“పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడును పుట్టనేరడు”.యోబు 14:4 దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగజేయుము,నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము”. కీర్తనలు 51:10 MHTel 43.4

క్రీస్తు పరిచర్య చేరస్తున్న ప్రాంతములో ఈ రకం బాధితులు అనేకులున్నారు. ఆయన పరిచర్యను గూర్చిన వార్త వారికి చేరగా ఒక బాధితుడి హృదయంలో విశ్వాసం మొలకెత్తింది. అతడు యేసు వద్దకు వెళ్తే తనకు స్వస్ధత కలుగవచ్చు అయితే అతడు ఆయిన్ని ఎలా కనుగోగలడు? అంతంలేని ఒంటరితనానికి బహిష్కృతుడైన అతడు స్వస్థత కూర్చే ఆయన వద్దకు ఎలా వెళ్ళటం! క్రీస్తు తనను స్వస్ధపర్చుతాడా? పరిసయ్యుల్లాగ, వైద్యుల్లాగ సయితం, తన మీద శాపం మోపి జనావాసాలనుంచి పారిపొమ్మని హెచ్చరిస్తాడా? MHTel 44.1

యేసు గురించి తాను విన్నదాన్నంతటి గురించి అతడు ఆలోచించడం మొదలు పెట్టాడు. తన సహాయాన్ని అర్ధించిన ఒక్క వ్యక్తిని ఆయన తోసిపుచ్చలేదు. ఆ ఆభాగ్యుడు రక్షకుణ్ణి కనుగొనటానికి తీర్మానించుకున్నాడు. పట్టణాలకు దూరంగా ఏకాంత స్థలాల్లో ఉంటున్నా పట్టణాల వెలపల ఏదారి పక్క స్థలంలోనే ఆయన బోధిస్తున్న చోట ఆయన్ని కనుగొనటం సాధ్యపడవచ్చునన్న ఆశాభావంతో ఉన్నాడు. సమస్యలు పెద్దవి అయినా అతడికున్న నిరీక్షణ అదొక్కటే. MHTel 44.2

జనసమూహహం నుండి అల్లంత దూరంలో నిలబడి ఆ కుష్టురోగి రక్షకుడు చెప్పిన కొన్ని మాలు విన్నాడు. వ్యాధిగ్రస్తుల పై ఆయన చేతులు పెట్టటంచూసాడు. కుంటి వారు గుడ్డివారు పక్షవాత బాధితులు, వివిధ రోగాలతో మరణిస్తున్నవారు ఆరోగ్యంతో పైకిలేచి తమ స్వస్థతకు దేవున్ని స్తుతించడం చూసాడు. అతడి విశ్వాసం బలపడింది. ఆయన మాటలు వింటున్న జనసమూహనికి దగ్గరగా అంచెలంచెలుగా వెళ్ళాడు. తన మీద ఉన్న నిషేదాలు ప్రజల క్షేమం ప్రజల్లో అతడి విషయంలో ఉన్న భయం అన్నిటిని మర్చిపోయాడు. స్వస్థతను గూర్చిన కమ్మటి నిరీక్షణ గురించే అతడి తలంపులన్ని... MHTel 44.3

చూడటానికి అతడు అసహ్యంగా ఉన్నాడు. కుష్టు వ్యాధి అతడి శరీరాన్ని భయంకరంగా పాడుచేసింది. కుళ్లిపోతున్న అతడి శరీరం చూడటానికి భయంకరంగా ఉన్నది. అతణ్ణి చూడగానే ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఆభయంతో అతణ్ణి ముట్టుకోకుండా తప్పించకోవటానికి ఒకరి మీద ఒకరు పడుతూ పరుగులు తీస్తున్నారు. అతడు యేసు దగ్గరకు రాకుండా అడ్డుకోవటానికి వ్యర్ధంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతడు వారిని పట్టించుకోవడంలేదు. తన వల్ల ప్రజల జుగుప్సను లెక్క చెయ్యడం లేదు. దేవుని కుమారున్ని మాత్రమే చూస్తున్నాడు. మరణిస్తున్న వారికి జీవంపోస్తూ ఆయన పలుకుతున్న మాటలన్ని మాత్రమే వింటున్నాడు. MHTel 44.4

యేసును సమీపించి ‘ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు’ అంటూ ఆయన పాదాలపై పడ్డాడు మత్తయి 8:2,3 MHTel 45.1

“అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి... నాకిష్టమే నీవు శు దుడవు కమ్ము” అన్నాడు మత్తయి 8:2,3. MHTel 45.2

వెంటనే ఆ కుష్టురోగిలో మార్పు చోటు చేసుకుంది,. అతడి రక్తం ఆరోగ్యవంతమయ్యింది. నరాలు చురుకయ్యాయి కండరాలు పటిష్ట మయ్యాయి. కుష్టు వ్యాధి లక్షణమైన, శరీం పై ఏర్పడే ఆస్వాభావికమైన తెల్లని పొలుసువంటి పొర మాటుమాయ మయ్యింది. అతడి శరీరం చిన్న పిల్లల దేహంలా తయారయ్యింది. MHTel 45.3

ఈ కుష్టురోగి స్వస్ధత గురించి వాస్తవాలు యాజకులను తెలిస్తే క్రీస్తు పట్ల తమ ద్వేషం ఓ అబద్ద తీర్పు తీర్చటానికి దారి తియ్యవచ్చు. ఓ నిస్పా క్షిక తీర్మానాన్ని వ్యాధి బాధితుడు పొందాలని యేసు కోరాడు. అందుకే తన స్వస్థత గురించి ఎవరికి చెప్పవద్దని కాని ఆలస్యం చెయ్యికుండా ఆ సూచన క్రియ గురించి పుకార్లు వ్యాపించకముందే ఓ కానుకతో దేవాలయంలో తనను తాను కనపర్చుకోవలసినదిగా యేసు అతన్ని ఆదేశించాడు. అట్టి కానుకను స్వీకరించకముందు అర్పించే వ్యక్తిని పరీక్షించి అతడి పరిపూర్ణ ఆరోగ్యాన్ని యాజకులు ద్రవ పర్చాల్సి ఉంది. MHTel 45.4

ఈ పరీక్ష జరిగింది, కుష్టురోగిని బహిష్కృతికి తీర్మానంచిన యాజకులే అతడి స్వస్ధతను ధ్రువీకరించారు. స్వస్థత పొందిన వ్యక్తి తన గృహానికి సమాజానికి తిరగి వెళ్ళడు.తిరిగి తనకు లభించిన పురుష శక్తి విషయంలోను తన కుటుంబంలోకి తన పునరుద్ధరణ విషయంలోను అతడు ఆనదిం చాడు. యేసు హెచ్చరిక చేసినా, తనను స్వస్ధత గూర్చిన సత్యాన్ని అతడు ఏంత మాత్రం దాచలేకపోయాడు. తనను స్వస్ధపర్చిన ఆ ప్రభువును సంతోషానందాలతో ప్రకటిస్తూ తిరిగాడు. MHTel 45.5

ఇతడు క్రీస్తు వద్దకు వచ్చినపడు ‘కుష్టువ్యాధితో నిండివున్నాడు” ఆ వ్యాధి విషయం అతడి శరీరమంతా వ్యాపించి ఉంది. తన ప్రభువు అతణ్ణి ముట్టుకోకుండా నివారించటానికి శిష్యులు ప్రయత్నించారు. ఎందకంటే అవి ప్రతమైన దాన్ని ఎవరు ముట్టుకుంటే అతడు అపవిత్రు డౌతాడు. కాని తన చెయ్యి కుష్టురోగి మీద వెయ్యటం ద్వారా యేసుకి అపవిత్రత అంటలేదు. కుష్టు పోయింది,. ఇలాగే పాప మనే కుష్టు విషయంలోనూ జరగుతుంది. లోతుగా వేళ్ళుతున్న ప్రాణాంతకమైన ఏ మానవ శక్తి శుద్ది చేయలేని కుష్టు వ్యాధి పాపం. “ప్రతి వాడు నడి నెత్తిన వ్యాధి గలిగియున్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరికాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచనినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు” యోషయా 1:5,6 కాని మానవత్వంలో నివసించటానికి వచ్చిన యేసుకు ఏ అపవిత్రతా అంటలేదు. ఆయన సముఖం పాపిక స్వస్థత నిచ్చే ప్రభావం. “ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్దు నిగా చేయగలవు” అంటూ ఎవరు ఆయన పాదాల మీద పడతారో “నాకిష్టమే నీవు శుదుద్దవు కమ్ము” అన్న జవాబు వింటారు. MHTel 46.1

స్వస్థత కూర్చిన కొన్ని సందార్బాల్లో కోరిన వరాన్ని క్రీస్తు వెంటనే ఇవ్వలేదు. కాని కుష్టురోగం సందర్భంలో కోరిన వెంటనే స్వస్థత కూర్చటం జరిగింది, లోకసంబంధమైన దీవెనల్ని కోరినప్పుడు మన ప్రార్ధనకు జవాబుకు ఆలస్యం కావచ్చు. కాని మనం పాపం నుంచి విముక్తిని కోరినప్పుడు కాదు. తన బిడ్డల్ని చెయ్యటానికి, పరిశుద్ధ జీవితాలు జీవించటానికి మనల్ని సమర్ధుల్ని చెయ్యటానికి, ఆయన చిత్రం ఏమిటంటే మనల్ని పాపం నుండి శుద్ది చెయ్యటం. ‘మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపంవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించు కొనెను.” గలతీ 1:4”ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి అలకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవి యెరుగదము.” 1 యోహాను 5:14,15 MHTel 46.2

దు:ఖంలో ఉన్నవారిని హృదయ భారం కలవారిని, ఆశలు భగ్నమైనవారిని, ఆత్మ వాంఛను సద్దణచటానికి ఐహిక ఆనందాన్ని అన్వేషిస్తున్నవారిని యేసు చూస్తున్నాడు. తనలో విశ్రాంతిని ఆకాంక్షిస్తున్న వారిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. MHTel 47.1

మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును MHTel 47.2

శ్రమ జీవులను పిలుస్తూ ఆయన అంటున్నాడు. “నేను సాత్వకుడను దీనమనస్సు గలవాడను.గనుక మీమీద నాకాడి ఎత్తికొని నా యొద్ద నేర్చు కొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి 11:29 MHTel 47.3

ఈ మాటలు ప్రతీ మానవుణ్ణి ఉద్దేశించి క్రీస్తు పలుకుతున్నాడు. వారికి తెలిసినా తెలియకపోయినా అందరు అలసి సొలసి పాప భారంతో కుంగిపోతున్నారు. క్రీస్తు మాత్రమే తొలగించగల భారాల కింద అందరు మగ్గుతున్నారు. మనం మోస్తున్న తీవ్రమైన భారం పాపం. ఈ భారాన్ని మనం మొయ్యాల్సివస్తే అది మనల్ని నలగగొడుతుంది. అయితే పాపరహితుడైన ఆ ప్రభువు మన స్థానాన్ని తీసుకున్నాడు. “యెహోవా మన యందిరిదోషమును అతని మీద మో పెను.” యెషయా 53:6 MHTel 47.4

మన అపరాధ భారాన్ని ఆయన భరించాడు. అలసిపోయివున్న మన భుజాల పై నుండి ఆ భారాన్ని ఆయన తీసుకుంటాడు. మనకు విశ్రాంతి నిస్తాడు. చింత దు:ఖ భారాన్ని కూడా ఆయన భరిస్తాడు. మన చింత లన్నింటిని తన మీద మోపాల్సిందిగా ఆయన మనల్ని ఆహ్వాని స్తున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయన తన హృదయం మీద మోస్తున్నాడు. MHTel 47.5

మనవాళి పక్షమున పెద్దన్నగా నిత్యం సింహాసంన పక్కనే ఉన్నాడు. రక్షకుడుగా తన పక్కకు తిరిగి ప్రతీ ఆత్మ ముఖాన్నీ ఆయన చూస్తాడు. మనావాళి బలహీనతలేమిటో మన కోరికలేమిటో మన శోధనల బలం ఎక్కడున్నదో అనుభవపూర్వకంగా ఆయనకు తెలుసు. ఎందుకంటే “సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.” హెబీ 4:15 భయంతో వణుకతున్న ఓ దేవుని బిడ్డా, ఆయన మిమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. మీరు శోధింపబడుతున్నారా? మిమ్మల్ని విడిపిస్తాడు మీరు బలహీనంగా ఉన్నారా? మిమ్మల్ని బలపర్చు తాడు. మీరు అజ్ఞానులా? మీకు వివేకమిస్తాడు. మీరు గాయపర్చబడ్డారా? ఆయన స్వస్థపర్చుతాడు., “నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి యున్నాడు.” అయినా ” గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు,” కీర్తనలు 147:4,3 MHTel 47.6

మీ ఆందోళనలు కష్టాలు ఏమైనా , మీ స్థితి ప్రభువు ముందు పెట్టండి సహింపుకు మీ ఆత్మ బలోపేతమౌతుంది. ఇబ్బంది నుండి సమస్య నుండి తప్పించుకోవటానికి మీకు ఓ మార్గం తెరుచుకుంటుంది. మీకు తెలిసినట్లు, బలహీనులు, నిస్సహాయులు అయిన మీరు ఆయన బలంలో మరింత బలవంతులౌతారు. మీ భారాలు ఎంత బరువుగా ఉంటే మీభారాలు వహించే ఆయన మీద మోసినప్పుడు మీ విశ్రాంతి అంత ఎక్కువ దీవెనకరంగా ఉంటుంది. MHTel 48.1

పరిస్థితులు మిత్రుల్ని విడదీయవచ్చు. మన మధ్య వారి మధ్య చంచలమైన విశాల సముద్ర జలాలు విరుచుకు పడవచ్చు. కాని ఏ పరిస్థితి. ఏ దూరం రక్షకుని నుంచి మనల్ని దూరం చెయ్యలేదు. మనం ఎక్కడున్నా మనల్ని అదుకోవటానికి, సరంక్షించటానికి, పైకి లేపి ఉత్సహా పర్చటానికి ఆయన మన కుడి పక్క ఉంటాడు. తన బిడ్డ పట్ల తల్లి ప్రేమ కన్నా సమున్నత ప్రేమను క్రీస్తు తాను విమోచించిన వారి పట్ల కనపర్చుతాడు. ఆయన ప్రేమలో విశ్రమిస్తూ “ఆయన తన ప్రాణాన్ని నా కోసం అర్పించాడు గనుక ఆయిన్ని నమ్ముతాను” అని చెప్పటం మన ఆదిక్యత. MHTel 48.2

మానవ ప్రేమలో మార్పు ఉండవచ్చు. కాని క్రీస్తు ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. సహాయం కోసం మన మొర పెట్టినప్పుడు మనల్ని MHTel 48.3

“పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగి పోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు” యెషయా 54:10 MHTel 49.1

*****