Go to full page →

ప్రవర్త పరీక్ష MHTel 170

“బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు. మీ కిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును”.“తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా.. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండ తన్ను తాను కాపాడుకొనుటయునే” మార్కు 14:7 యాకోబు 1:27 MHTel 170.1

తమ సంరక్షణ పై ఆధారపడటానికి ఆసహయుల్ని బీదలను తమ మధ్య ఉంచటంలో క్రైస్తవులుగా చెప్పుకునే తన అనుచరులను క్రీస్తు పరీక్షిస్తున్నాడు. లేమిలో ఉన్న తన బిడ్డలను మన ప్రేమ సేవల వలను ఆయన పట్ల మన ప్రేమ నిజాయితీని నిరూపించుకుంటాం. వారిని నిర్లక్ష్యం చెయ్యటం మనల్ని మనం అబద్ద శిష్యులుగా క్రీస్తును ఎరుగనివారిగా ప్రకటించుకుంటాం. MHTel 170.2

దిక్కులేని పిల్లలకు కుటుంబాల్లో గృహాలు ఏర్పాటు చెయ్యటానికి చెయ్యగలిగందంతా చేస్తే, సంరక్షణ అవసరమయ్యే పిల్లలు ఇంకా చాలామంది ఉంటారు. వారిలో చాలామంది దుష్టత్వాన్ని వారసత్వంగా పొందినవారు. వారిలో బాగుపడే సూచనలు, ఆకర్షణ ఉండవు. వారివీ వక్రబుద్ధులు. కాని వారు క్రీస్తు రక్తంతో కొన్న ఆత్మలు. ఆయన దృష్టిలో వారు మన చిన్నారులంత ప్రశస్తమైనవారు. వారికి సహయ హస్తం చాపితే తప్ప వారు అజ్ఞానంలో పెరిగి దుర్మార్గతలోకి నేరంలోకి కొట్టుకుపోతారు. ఆనాధ శరణాలయాల ద్వారా వీరిలో అనేక మంది బిడ్డల్ని కాపాడవచ్చు. MHTel 170.3

అటువంటి సంస్థలు ఫలప్రధమవ్వాలంటే అవి క్రైస్తవ గృహప్రణాళి కను దగ్గరగా అనుసరించాలి. పెద్ద సంఖ్యలో పిల్లల్ని తీసుకొనివచ్చి పెద్ద సంస్థల్ని స్థాపించే బదులు వివిద స్థలాల్లో చిన్న చిన్న సంస్థలు స్థాపించాలి. ఓ పట్టణంలో గాని లేక పెద్ద నగరంలో గాని వాటికి సమీపంలో గాని స్థాపించటం కన్నా పిల్లలు ప్రకృతితో సంబంధము లకిగి ఉండి. పారిశ్రామిక శిక్షణ సదుపాయాలున్న గ్రామ ప్రాంతాల్లో వాటిని స్థాపించాలి. MHTel 170.4

అలాంటి ఆనాధ గృహ నిర్వహణకు బాధ్యులైన వారు విశాల హృదయములు సంస్కారం గలవారు. ఆత్మ త్యాగ స్పూర్తి గల పురుషులు స్త్రీలు అయివుండాలి. క్రీస్తు పట్ల ప్రేమను బట్టి పనిని చేపట్టి ఆయన కోసం పిల్లల్ని తర్బీతు చేసే పురుషులు స్త్రీలు. అటువంటి శ్రద్ధాశక్తుల్లో నిర్వాసితులు, నిర్లక్ష్యానికి గురి అయిన అనేక మంది పిల్లలను సమాజంలో ఉపయోగకరమైన సభ్యులుగా క్రీస్తును గౌరవించేవారిగా ఇతరులకు తమ వంతు సహాయం చేసేవారిగా తీర్చి దిద్దవచ్చు. MHTel 171.1

అనేకులు పిసినారితనంగానో సంకుచిత బుద్దిగానో అపార్ధం చేసు కొని పొదుపును ద్వేషిస్తారు. కాని పొదుపుకి విశాల ఔదర్యానికి మధ్య వైరుద్యం లేదు. దానం చేసేందుకు మనం ఆదా చెయ్యాలి. MHTel 171.2

ఆత్మ త్యాగ స్పూర్తి లేకుండా ఎవరు నిజమైన పరోపకారాన్ని ఆచరించలేదు. సాదాసీదా జీవితం తనను తాను ఉపేక్షించు కోటం పొదుపు ఆచరించటం ద్వారా మాత్రమే క్రీస్తు ప్రతినిధులుగా మనకు నియమితమైన పనిని ముగించగలం. అతిశయం లోకసంబంధమైన ఆశ మన హృదయాల్లో నుండి తీసివేసుకోవాలి. క్రీస్తు జీవితంలో వెల్లడైన నిస్వార్ధతా నియమాన్ని మనం ఆచరణలో పెట్టాలి మన ఇళ్ళ గోడలమీద పటాల మీద, సామాన్ల మీద “దిక్కుమాలిన బీదను నీ ఇంట చేర్చుకొనుము” అన్న మాటల్ని మనం చదవాలి దేవుని వేలుతో రాయబడినట్లు “వస్త్రహీనునికి ... వస్త్రము” ఇమ్ము అని మన దుస్తుల పై రాని ఉన్న మాటల్ని మనం చదవాలి. ఆహార సమృద్ధితో నిండిన భోజనం గదిలో భోజన బల్ల మీద”నీ ఆహారము ఆకలి గొనినవారికి పెట్టుట” గదా; అని రాసి ఉన్న మాటల్ని మనం చూడాలి. యెషయా 58:7 MHTel 171.3

మనముందు ప్రయోజకనకరమైన వెయ్యి తలుపులు తెరవబడి ఉన్నాయి. వనరులు అరకొరగా ఉన్నాయని తరుచు వాపోతుంటాం. అయితే చిత్తశుద్ది పట్టుదల కలిగి ఉంటే వనరుల్ని క్రైస్తవులు వెయ్యిరెట్లు పెంచుకోగలుగుతారు. మన ప్రయోజకత్వానికి అడ్డుకట్ట వేస్తున్నది. స్వార్ధం స్వార్ధ కోరికల్ని తృప్తిపర్చటం. MHTel 171.4

ఉన్నత ప్రయోజాలకు ఉపయోగించాల్సిన ద్రవ్యం ఎట్టి విగ్రహా ల్లాంటివి, వాటికి మన తలంపుల్ని సమయాన్ని శక్తిని హరించే వాటికి, ఎంత వ్యయమౌతున్నది! ఖరీదైన గృహాలు వస్తువుల పై స్వార్ధ వినోదాల పై విలాసవంతం అనుచితం అయిన ఆహారం పై హానికరమైన కోర్కెలను తృప్తిపర్చుకోవటంపై ఎంత ద్రవ్యం వ్యర్ధమౌతున్నది! ఎవరికీ ఏ ప్రయోజనం లేని బహుమానాల పై ఎంత డబ్బు దుబారా అవుతున్నది! క్రైస్తవులమని చెప్పుకునేవారు శోధకుడి నుంచి ఆత్మలను రక్షించుటంలో కన్నా అవసరం లేని,తరుచు హానికరమైన విషయాలకు ఎంతో ద్రవ్యం వ్యయం చేస్తు న్నారు. MHTel 172.1

క్రైస్తవులుగా చెప్పుకునే అనేకులు దుస్తులపై ఎంత ద్రవ్యం ఖర్చ చేస్తున్నారంటే ఇతరుల అవసరాలకు ఇవ్వటానికి వారి వద్ద ఏమి మిగలనంతగా! ఎంతో కష్టం మీద అతి సామాన్యమైన వస్త్రాలు కూడా కొనలేని వారి అవసరాల్ని లెక్క చెయ్యకుండా, ఖరీదైన ఆభరణాలు, వెలగల దుస్తులు తమకు అవసరమని వారు తలస్తారు. MHTel 172.2

నా సహోదరీల్లారా, బైబిలులో ఇవ్వబడ్డ నిబంధనలకు అను గుణంగా మీరు వస్త్ర ధారణను ఆచరిస్తే పేదలైన మీ సహోదరీలకు సహాయం చెయ్యటానికి మీకు చాలినంత ద్రవ్యముంటుంది. ద్రవ్యమే కాదు సమయం కూడా ఉంటుంది. తరుచు ఇది చాలా అవసరం. మీ సలహాలు, సామర్ధ్యం, మీరు నిపుణతతో సహాయం చెయ్యగలవారు. చాలామంది ఉన్నారు. సామాన్యంగా, అయినా నాగరికంగా, వస్త్రాలు ధరించటం వారికి చూపించండి. ఇతరులు ధరించే దుస్తులకు భిన్నంగా సరిగా పెట్టకుండా, తమ దుస్తులు అసహ్యంగా ఉన్నందు వల్ల అనేక మంది స్త్రీలు గుడికి వెళ్లకుండా ఉండిపోతారు. ఈ భిన్నత వలన సున్నిత స్వభావం గల అనేకమందికి పరాభవ భావం అన్యాయ భావం కలుగు తుంది. ఇది అనేకులు మతంలోని వాస్తవికతను సందేహించటానికి సువార్తకు వ్యతిరేకంగా తమ మనసుల్ని కఠినపర్చుకోవటానికి దారి తీస్తుంది. MHTel 172.3

“ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడి” అని క్రీస్తు ఆదేశిస్తున్నాడు. ప్రతి రోజు వేలాది ప్రజలు కరవు, హత్య, అగ్ని, వ్యాధి వల్ల మరణిస్తుండగా, ఏదీ అనవసరంగా వ్యర్ధం కాకుండేందుకు, తద్వారా ఓ మనిషికి ఉపకారం చెయ్యటానికి సాటి మనుషుల్ని ప్రేమించే ప్రతీ వ్యక్తి ఏమి వ్యక్తం కాకుండా చూడటం అతడి లేక ఆమె ధర్మం. MHTel 172.4

మన సమయాన్ని వ్యర్ధం చెయ్యటం తప్పు. మన ఆలోచన్ని వ్యర్ధం చేయటం తప్పు. స్వార్ధ ప్రయోజనాల్ని వెదకటంలో మనం పెట్టే ప్రతీ నిమిషం మనకు నష్టమే. మనం ప్రతీ నిమిషాన్ని విలువగలదిగా ఎంచి సరిగా వినియోగిస్తే మనకు అవసరమైన ప్రతీ దాని కోసం పని చెయ్యటానికి లేక లోకం కోసం పని చెయ్యటానికి మనకు సమయం ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టటంలో సమయం శక్తి అవకాశాలు వినియోగించటంలో ప్రతీ క్రైస్తవుడు దేవుని నడుపుదల పై ఆధారపడాలి. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను. అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికినీ ధారాళముగ దయ చేయువాడు”. యూకోబు 1:5 MHTel 173.1