Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    6వ అధ్యాయం - విశ్వాసం, అంగీకారం

    పరిశుద్ధాత్మ వలన మీ అంతరాత్మ చైతన్యవంతం కాగా పాపం దుర్మార్ధతను, దాని శక్తి, దానిదోషాన్ని, దానివల్ల దుఖాన్ని మీరు కొంతమేరకు చూడగలుగుతున్నారు. అది మీ దృష్టికి హేయమైందిగా కనిపిస్తుంది. మీకు దేవునితో ఎడబాటు కలిగిందని దుష్టశక్తికి మీరు బందీలై ఉన్నారని భావిస్తున్నారు. ఈ దుస్థితినుంచి తప్పించుకోవడానికి ఎంత గట్టిగా ప్రయత్నిస్తే మీ నిస్సాయత అంత స్పష్టంగా వ్యక్తమౌతుంది. మీ ఉద్దేశాలు శుద్ధమైనవికావు. మీ హృదయం నిష్కళంకంకాదు. మీ జీవితం స్వార్ధంతోను, పాపంతోను నిండినట్లు మీరు చూపిస్తున్నారు. క్షమాపణ, శుద్ధత, స్వేచ్ఛను మీరెంతగానో కోరుకుంటున్నారు. దేవునితో సామరస్యం, ఆయనను పోలి ఉండడం - వీటిని పొందడానికి మీరు ఏమి చేయగలరు?SCTel 39.1

    మీకు కావలసినది సమాధానం. దైవ క్షమాపణ, సమాధానం, అంతర్గతంగా ప్రేమ. దాన్ని డబ్బు కొనలేదు, ప్రతిభ సంపాదించలేదు. స్వప్రయత్నంద్వారా దాన్ని ఎన్నడూ పొందలేరు. అయితే దాన్ని మీకు “రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే” (యెషయా 55:1) దేవుడు ఉచితపరంగా ఇస్తానంటున్నాడు. చేయిచాపి అందిపుచ్చుకొన్నట్లయితే అదిమీదవుతుంది. ప్రభువంటున్నాడు. “మీపాపాములు రక్తము వలే ఎర్రనివైనను అవి హిమమువలే తెల్లబడును, కెంపువలే ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చువలే తెల్లనివగును” (యెషయా 1:18). ‘’నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావముమీకు కలుగజేసెదను” (యెషయా 36:26).SCTel 39.2

    మీ పాపాల్ని ఒప్పుకొని వాటిని దూరముగా ఉంచుతున్నారు. మిమ్మల్ని మీరు దేవునికి అంకితం చేసుకోవాలని నిర్ధారణ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లి మీ పాపాల్ని శుభ్రంగా కడిగి మీకు నూతన హృదయాన్నియ్యమని మనవి చేయండి. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తాడని విశ్వసించండి. ఎందుకంటే అది ఆయన పానము. యేసు ఈ లోకములో జీవించినపుడు నేర్పిన పాఠం ఇదే. దేవుడు వాగ్దానం చేసిన వరాన్నిపొందు తామని అది మనదని మనం విశ్వసించటం. ప్రజలుతన శక్తిపై విశ్వాసం కనపర్చినపుడు యేసు వారి వాధుల్ని నయం చేసాడు. వారు చూడగలిగిన విషయాల్లో వారికి నమ్మకం కలిగించి పాపాలు క్షమించేందుకు తనకున్న శక్తిని వారు నమ్మేటట్లు వారిని నడిపించాడు.SCTel 39.3

    పక్షవాత రోగిని బాగుచేయడంలో దీన్ని స్పష్టంగా చెప్పాడు. “పాపములు క్షమించుటకు భూమీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. అని చెప్పి (ఆపక్ష వాయువు గలవానినిచూచి) నీవులేచి మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, (మత్తయి 9:6) క్రీస్తు సూచక క్రియల్ని గూర్చి ప్రస్తావిస్తూ బోధకుడైన యెహాను కూడ ఇలా అంటున్నాడు. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను” (యోహాను 20:31).SCTel 40.1

    యేను వ్యాధి గ్రస్తులను స్వస్థపర్చడాన్ని గూర్చిన సామాన్య బైబిలు కథనాల నుంచి పాప క్షమాపణ వరకు ఆయన్ని ఎలా విశ్వసించాలో మనం కొంత నేర్చుకోవచ్చు. పక్షవాతంతో బెతెస్థ వద్ద ఉన్న వానికథకు తిరిగివద్దాం. వ్యాధిగ్రస్థుడు, నిస్సాహయకుడు. ముప్పయి ఎనిమిదేళ్ళుగాకాళ్ళు, చేతులు ఉపయోగించలేకపోయాడు. అయినా లేచినీపరుపు నెత్తుకునినడువుము ‘’అనియేసు అతణ్ణి ఆదేశించాడు. “ప్రభువా, నీవునన్నుస్వస్థపర్చి నట్లయితే నీమాటగెహ్లింటాను” అని అతడని ఉండవచ్చు, కాని అతడలా అనలేదు. అతడు క్రీస్తుమాటలు నమ్మాడు. తాని స్వస్థత పొందుతాడని నమ్మాడు. వెంటనే ప్రయత్నంచేసాడు. నడవడానికి ఇచ్చయించాడు. నడిచాడు. క్రీస్తుమాటమీద చర్యకు ఉపక్రమించాడు. దేవుడు అతనికి శక్తినిచ్చాడు. అతడు స్వస్థత పొందాడు.SCTel 40.2

    అలాగే మీరూ ఒక పాపే. మీ గత పాపాలకి నిష్కృతిలేదు. మీ హృదయాన్ని మీరు మార్చుకోలేరు. మిమ్మల్ని మీరు పరిశుద్ధుని చేసుకోలేరు. కాని క్రీస్తుద్వారా ఇదంతా మీకు చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని నమ్మండి. మీ పాపలను ఒప్పుకొనిమిమ్మల్ని దేవునికి సమర్పించుకోండి. ఆయనను సేవించడానికి ఇచ్చయించండి. మీరిది తప్పక చేస్తే మీకిచ్చినమాట దేవుడు నెరవేర్చుతాడు. మీరు ఆ వాగ్దానాన్ని నమ్మితే క్షమాపణ పొంది శుద్ధులయ్యారనీ నమ్మితే మీ లోపాల్ని దేవుడు పూరిస్తాడు. వ్యాధిగ్రస్థుడు తాను బాగుపడ్డానని నమ్మినప్పుడు అతడు నడపడానికి క్రీస్తు శక్తి ఎలాఇచ్చాడో అలాగే మీరు స్వస్థత పొందుతారు. ఇది నమ్మితే మీకలా జరుగుతుంది. స్వస్థతపొందానన్నమనోభావంకలిగేవరకు వేచిఉండక “అదినమ్ముతున్నాను; నేనను కుంటున్నందుకు అదీ అలాగుకాదుగాని, దేవుడు వాగ్దానం చేసినందుకు” అని చెప్పండి.SCTel 40.3

    యేసు ఇలా అంటున్నాడు, “ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగును” (మార్కు 11:24) ఈ వాగ్దానంలో మీకు ఒక షరతుంది. దేవుని చిత్తం ప్రకారం ప్రార్ధించాలన్నదే ఆ షరతు. మనల్ని తన బిడ్డలుగా తీర్చిదిద్దేందుకు, పరిశుద్ధ జీవితం జీవించేందుకు మనకు శక్తి నిచ్చేందుకు పాపంనుంచి మనలను శుద్ధి చేయడం అన్నది ఆయన చిత్తం. కాబట్టి మనం ఈ దీవెనలకోసం ప్రార్ధించి వాటిని పొందుతామని నమ్మి, వాటిని పొందామని దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. యేసు యొద్దకువెళ్ళి, శుద్ధిపొందిన దైవ ధర్మశాస్త్రం ముందుసిగ్గు, చింత లేకుండా నిలవడం మన ఆధిక్యత. “కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసు నందు వారికి ఏ శిక్షా వీధుయలేదు” (రోమా 8:1).SCTel 41.1

    ఇక నుంచి మీరుమీసొంతంకారు, విలువ పెట్టి కొన బడ్డ వారు. ‘’వెండి బంగారములవంటిSCTel 41.2

    క్షయ వస్తువుల చేత మీకు విమోచింపబడలేదుగాని, అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తురక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురుకదా, (1పేతురు 1:18,19). దేవుని నమ్మటమన్న ఈ సామాన్య క్రియ ద్వారా మీ హృదయములో నూతన జీవానికి పరిశుద్ధాత్మ జన్మనిచ్చాడు. మీరు దేవుని పరిశుద్ధకుటుంబంలోని జన్మించిన బిడ్డలావున్నారు. దేవుడు తన కుమారుని ప్రేమించినట్లు మిమ్మల్ని ప్రేమిస్తాడు.SCTel 41.3

    ఇప్పుడు మిమ్మల్ని మీరు యేసుకు సమర్పించుకొన్నారుగనుక వెనుదిరక కండి, ఆయన స్నేహం విడిచి దూరంగా వెళ్ళిపోకండి. అనుదిం ఇలా చెప్పండి, “నేను క్రీస్తు మనిషిని, నన్ను నేను ఆయనకు అంకితం చేసుకొన్నాను” తన ఆత్మ నిచ్చి, తన కృపలో మిమ్మల్ని ఎదిగింపజేయమని మనవి చేయండి. మిమ్మల్ని మీరు దేవునికి అంకితం చేసుకొని ఆయనను విశ్వసించటం ద్వారా ఆయన బిడ్డ ఎలా కాగలుగుతున్నారో, అలాగే మీరు ఆయనయందు మీరు నివశించాల్సి ఉన్నారు. అపొస్తుడిలా పలుకుతున్నాడి, “కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా... ఆయన యందుండి నడుచుకొనుడి”(కొలస్సీ 2:6).SCTel 41.4

    తాము కృపకాలములో ఉన్నట్లు, ప్రభువు అనుగ్రహించే మేళ్ళను పొందకముందు తాము మార్పు చెందినవారమని నిరూపించుకోవడం అవసరమని కొందరు భవిస్తున్నట్లు కనిపిస్తుంది. వారు ఇప్పుడు సహితం దేవుని దీవెన పొందవచ్చు. తమ బలహీనతల్లో సహాయం అందించేందుకు ఆయన కృప అనగా క్రీస్తు ఆత్మ వారికి అవసరం. ఆత్మ లేకుండా దుష్టుని ప్రతిఘటించటం అసాధ్యం. పాపులం, నిస్సాహాయకులం, అనాథలం, అయిన మనం సమస్త బలహీనత, అవివేక పాపంతో వచ్చి పశ్చాత్తాపంతో ఆయన పాదాలపై పడవచ్చు. ఆయన మహిమ మనల్ని ఆయన ప్రేమాబాహువుల్లో బంధిస్తుంది. మన గాయాలు మాన్పుతుంది. మన సకల దుర్నీతి నుంచి పరిశుభ్రం చేస్తుంది.SCTel 42.1

    వేలాదిమంది పొరబడేది ఇక్కడే. యేసు వారిని వ్యక్తిగతంగా, విడివిడిగా క్షమిస్తాడన్న సత్యాన్ని వారు నమ్మరు. దేవుని మాటను వారు నమ్మరు. షరతుల్ని పాటించే వారందరూ తమకే తామే తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతీ పాపానికి క్షమాపణ ఉన్నదని, దేవుని వాగ్దానాలు మాకు కాదేమోనన్న సందేహాన్ని మీరు విడనాడాలి. పశ్చాత్తాపం పొందిన ప్రతి పాపికి అవి వర్తిస్తాయి. క్రీస్తుద్వారా శక్తి, పరిశుద్ధత, నీతి పొందలేనంత పాపులేవరూలేరు. పాపంతో కలుషితమెన్ల మరకలు పడ్డ తమ వస్త్రాల్ని తీసివేసి వారికి నీతి వస్త్రం ధరింపజేయడానికి ఆయన వేచియున్నాడు. మరణించక జీవించేందుకు వారిని ఆహ్వానిస్తున్నాడు.SCTel 42.2

    మనుషులు ఒకరితోనొకరు వ్యవహరించే రీతిగా దేవుడు మనతో వ్యవహ రించడు. ఆయన ఆలోచనలు కృప, ప్రేమ, దయతో కూడిన ఆలోచనలు, ఆయన ఇలా అంటున్నాడు, “భక్తిహీనులు తమమార్గమును విడువవలేను, దుష్టులు తమ తలంపులను మానవలేను. వారు యెహోవావైపు తిరిగిన యెడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవునిపై తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును” “మంచువిడిపోవునట్లుగా నీ యతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచి వేసి యున్నాను” (యెషయా 55:7, 44:22).SCTel 42.3

    ”మరణము నొందువాడుమరణమునొందుటనుబట్టి నేను సంతోషించు వాడనుకాను.SCTel 42.4

    కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి. అప్పుడు మీరు బ్రతుకుదురు” (యెహెజ్కేలు 18:32). దేవుని వాగ్దానాన్ని ఎత్తుకుపోవడానికి సాతాను సన్నద్ధుడై ఉన్నాడు. ఆత్మలోని నిరీక్షణ వెలుగును తీసివేడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఇది జరగనీయకూడదు. శోధకుడు చెప్పేమాటలు మీరు వినకండి. ఇలా చెప్పండి: “నాకు జీవాన్నివ్వడానికి యేసు మరణించాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నడు. నేను నశించటం ఆయన చిత్తం కాదు. కృపా బాహుళ్యంగల పరలోక జనకుడు నాకున్నాడు. ఆయన ప్రేమను నేను అలక్ష్యం చేసినప్పటికీ, ఆయన దీవెనలు నేను దుర్వినియోగం చేసినప్పటికీ నేను లేచి నా తండ్రివద్దకు వెళ్ళి ఇలా అంటాను, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, నీయెదుట పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించికొనుటకు యోగ్యుడనుకాను; నన్ను నీకూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము. ఈ సంచారికి ఎలాంటి అంగీకారంలభించిందో ఈ ఉపమానంతెలుపుతున్నది. “వాడంకా దూరముగా నున్నపుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడమీద ముద్దు పెట్టుకొనెను’‘ (లూకా 15 :18-20). హృదయన్ని చలింపజేసే ఈ ఉపమానం కూడ పరలోకమందున్న తండ్రి అసమాన్య ప్రేమను వ్యక్తం చేయలేకపోవుచున్నది. తనప్రవక్త వూలంగా ప్రభువిలా అంటున్నాడు, “శాశ్వతవెన్ల ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను’‘ (యిర్మియా 31:3). పాపి తండ్రి గృహానికి దూరంగా ఉండి, దూరదేశములో తండ్రి ఆస్తిని పాడుచేస్తున్న తరుణంలో తండ్రి హృదయం అతడికోసం దుఖి:స్తుంది. దేవుని వద్దకు తిరిగి రావడానికి కలిగే ప్రతీ కోరిక సంచారిని తండ్రి ప్రేమాహృదయానికి ఆకర్షిస్తున్న పరిశుద్ధాత్ముని సున్నితమైన, ప్రేమ పూర్వకమైన్ల విజ్ఞాపన.SCTel 42.5

    బైబిలులోని చక్కని వాగ్దానాలు మీ ముందుండగా మీరు సందేహించడానికి తావేది? పాపి పశ్చాత్తాపడి తన పాపాల్ని విడిచిపెట్టి యేసు చెంతకు తిరిగి రావడానికి ఆశిస్తుంటే అతణ్ణి ప్రభువు తిరస్కారించాడంటే మీరు నమ్మగలరా? అలాంటి ఆలోచనలు మనకు దూరమౌనుగాక! మన పరలోకపు తండ్రిని గూర్చి ఇట్టి ఆలోచనలు మీ ఆత్మకు హాని కలిగిస్తాయి. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. కాని పాపిని ప్రేమిస్తాడు. ఇచ్చయించే వారందరూ రక్షణపొంది మహిమ రాజ్యంలో నిత్యమూ ధన్య జీవులయ్యేందుకు గాను క్రీస్తు రూపంలో ఆయన తన్నుతాను అర్పించుకున్నాడు. మన యెడల తన ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయన ఉపయోగించిన మాటలకన్నా సుతిమెత్తని పద ప్రయోగం ఇంకెక్కడైనా ఉంటుందా? ఆయన ఇలా అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటిపిల్లను మరచునా? వారైనా మరచుదురుగాని నేను మరువను. (యెషయా 49:15).SCTel 43.1

    సందేహిస్తూ భయంతో వణుకుతున్న మీరంతా మీ కన్నులు పెకైత్తండి; మీ కొరకు విజ్ఞాపన సల్పడానికి యేసు నివశిస్తున్నాడు. తన కుమారుడు యేసును వరంగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞలు తెలుపండి మీకోసం ఆయన మరణం నిరర్ధకం కాకూ డదని ప్రార్ధన చేయండి. నేడుమిమ్మల్ని ఆత్మ ఆహ్వానిస్తున్నాడు. మీ పూర్ణ హృదయంతో యేసు చెంతకు రండి.వచ్చి, ఆయన ఇచ్చే దావెనలు పొందండి.SCTel 43.2

    దేవుని వాగ్దానాలను చదివేటప్పుడు అవి వర్ణనాతీతమెన్ల ప్రేమను, కరుణను వెలిబుచ్చుత్ను మాటలను జ్ఞాపకము చేసుకోండి. అనంత ప్రేమకు నిలమైన దేవునిహృదయం పాపిపట్ల మితిలేని కనికరం కలిగివుంటుంది. ‘’దేవునికృపామహ దెశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది” (ఎఫెసి 1:7). దేవుడు మీకు సహాయూడని మాత్రం నమ్మండి. మనివుడిలో తన నెత్తిక స్వరూపాన్ని పునరుద్ధరించాలని ఆయన అభిలషిస్తున్నాడు. పాపపు ఒప్పుకోలుతోను పశ్చాత్తాపం తోను మీరు దగ్గరకు వస్తే, కృపతోను క్షమాపణతోను ఆయన మీ దగ్గరకు వస్తాడు.SCTel 44.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents