Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    12వ అధ్యాయం - సందేహం కలిగినప్పుడు

    అనేకమంది, ముఖ్యంగా క్రైస్తవ జీవిత ప్రస్థానం ఆరంభంలో ఉన్నవాళ్ళు, సందేహాలతో సతమతమౌతుంటారు. వారు విశదం చేయలేని విషయాలు లేదా గ్రహించలేని విషయాలు బైబిలులో ఉంటాయి. వాటిని ఆసరాగా తీసుకుని లేఖనాలు దేవుని మూలంగా కలిగినవన్న సత్యాన్ని విశ్వసించకుండా వారిని ఉంచేందుకు సాతాను ప్రయత్నిస్తాడు. “నేను యధార్ధ మార్గాన్ని తెలుసుకోవడమెలా? బైబిలు వాస్తవంగా దేవుని వాక్యమే అయితే సందేహాలు, సంశయాల్నీ ఎలా నివారించుకోగలను?SCTel 81.1

    మన విశ్వాసానికి ఆధారంగా చాలినంత నిదర్శనం ఇవ్వకుండా నమ్మ వలసిందిగా దేవుడు మనల్ని ఎన్నడూ కోరడు. ఆయన ఉనికి, ఆయన ప్రవర్తన, ఆయన వాక్యం, వాస్తవికత సాక్షాధారాలతో నిరూపితమయ్యాయి. ఇది మనం అంగీకరిస్తున్న నిదర్శనం. ఇది కోకొల్లలుగా ఉన్న నిదర్శనంకూడ. అయినప్పటికినీ సందేహానికి ఆస్కారం లేకుండా చేయలేదు దేవుడు. మన విశ్వాసం, నిదర్శనంపై తప్ప ప్రదర్శన ఆధారపడకూడదు. శంకించగోరేవారికి బోలెడు అవకాశముంటుంది. సత్యం తెలుసు కోవాలని ఆశించేవారికి కావలసినంత నిదర్శనం ఉంది. వారి విశ్వాసం దీనిపైన ఆనుకొని ఉంటుంది.SCTel 81.2

    ఆది అంతాలులేని దేవుని ప్రవర్తనను గాని పనుల్ని గాని పూర్తిగా అవగతం చేసుకోవడం మానవ మనస్సులకు అసాధ్యం. చురుకైన బుద్ధికి, విద్యా వికాసంగల మనస్సుకు పరిశుద్ధదేవుడు నిత్యమూఒకమర్మంగానే మిగిలిపోతాడు. “దేవుని గాఢం శములనునీవుతెలుసుకొనగలవా? సర్వశక్తుడగుదేవునిగూర్చినీకు పరిపూర్ణజ్ఞానము కలుగునా? అది ఆకాశవీధి అంత ఉన్నతమెన్లది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా నున్నది. నీవేమి యెరుగుదువు?” ) యోబు 1:7,8) అపొస్తులైన పౌలు ఇలా విస్మయం చెందుతున్నాడు “ఆహా, దేవునిబుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఎంతో అశక్యములు; ఆయన మార్గములు ఎంతో అగమ్యములు” (రోమా 11:33). “మేఘాంధకారములు ఆయనచుట్టూ’‘ ఉన్నప్పటికీనీ “నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు” (కీర్త99:2) ఆయన మాతో వ్యవహరిస్తున్న తీరును, ఆయన కార్యచరణకు ప్రేరణను మనం ఈ మేరకు గ్రహించగలుగుతున్నాం గనుక గొప్పశక్తితో కూడిన అనంత ప్రేమను, మహిమనుమనం తెలుసుకోవచ్చు. ఎంతమేరకుతెలుసు కోవడంమనకు శ్రేయస్సుకరమో, అంతవరకు ఆయన ఉద్దేశాల్ని మనం అవగాహన చేసుకోవచ్చు. దీనికి మించి సర్వ శక్తిగలఆయన హస్తాన్ని, విస్తారమైన ప్రేమతో నిండిన ఆయన హృదయాన్ని మనంకేవలం విశ్వసించ వలసివున్నాం .SCTel 81.3

    దేవుని ప్రవర్తన వలే ఆయన వాక్యం మర్మాలతో నిండి ఉంది. ఈ మర్మాల్ని పరిమిత జ్ఞానంగల మానవులు పూర్తిగా గ్రహించలేరు. అభిప్రాయాలు పుట్టిస్తాడు. అప్పుడు మన పరమ జనకుని గూర్చిన సత్యాలపై మనసు నిలవడానికి బదులు సాతాను సృష్టించే అపోహలపై మనసుపెట్టి దేవుని శంకించటం, ఆయననుగూర్చి గొణుక్కోవడం చేస్తాం. మన మతపరమైన జీవితంలో సంతోషం లేకుండా చేయడానికి సాతాను సర్వదా ప్రయత్నిస్తునేవుంటాడు. అది శ్రమతో, కష్టంతో కూడిన పనిగా కనిపించేటట్లుగా చేస్తాడు. మతాన్ని గూర్చి క్రైస్తవుడు తన అపనమ్మకము ద్వారా ఈ దృక్పధాన్ని కనపర్చితే అతడు సాతాను అబద్దానికి మద్దతు పలుకుతున్నట్లే.SCTel 82.1

    జీవిత మార్గాన పయనించే అనేకులు తమ వైఫల్యాలు, ఆశాభంగాల్ని గురించి ఆలోచించి నిరాశ నిస్పృహలకు గురవుతారు. నేనుఐరోపాలో పర్యటించే తరుణంలో ఇదే పనిచేస్తు తీవ్ర వ్యధకు గురయిన ఒక సోదరికి తనను ఉద్రేకపర్చే సలహా ఇవ్వమంటూ నాకీ లేఖ రాసారు. ఆమె లేఖ చదివిన మరుసటి రాత్రి ఒక తోటలో ఉన్నట్లు కలగన్నాను. ఆ తోట యజమానిలా కనిపించిన ఒకరు ఆతోట దారులగుండా నన్ను నడిపిస్తున్నారు. పూలు ఏరుకుంటూ, వాటి సువాసనలు పీల్చుకుంటూ నేను ఎంతో ఆనందిస్తున్నప్పుడు నా ప్రక్కనే నడుస్తున్న ఈ సహోదరి తన మార్గానికి అడ్డంగా ఉన్న కొన్ని ముళ్ళ పొదలపెక్షి నా గమనించి ఆహ్వానించారు. దుఖి:స్తూ ఆమె అక్కడే నిలిచిపోయారు. తోటమాలి వెంట దారిలో నడవడంలేదు. ముళ్ళ గచ్చ పొదల్లో నుంచి నడుస్తున్నారు. “ఇంత చక్కనితోట అందాన్ని ఈముళ్ళు పాడుచేస్తున్నాయని నిట్టూర్చారు”. “ఆ ముళ్ళ జోలికి పోకండి. అవి మీకు గాయాలు చేస్తాయి. గులాబీలు, మల్లెలు, కనకాంబ్రాలే ఏరుకోండి” అన్నాడు తోటమాలి,SCTel 82.2

    మీ అనుభవంలో ఉజ్వల ఘట్టాలు లేవా? దేవుని ఆత్మకు స్పందిస్తూ మీ హృదయాన్ని తృప్తి పరచిన ప్రశక్త సమయాలు లేవా? మీ జీవిత అనుభవ అధ్యాయాల్ని తిరగవేసేటప్పుడు సంతోషం కలిగించే పుటలు మీకు కనిపించటంలేదా? దేవుని వాగ్దానాలు మీ దారి పొడుగునా సువాసన విరజిమ్మే పువ్వుల్లా లేవా? వాటి అందాలు సుగంధాల ఆనందంతో మీ హృదయమ నిండనీయండి.SCTel 83.1

    గతంలోని ఆ ప్రేయ స్మృతుల్ని అనగా దోషాలు, ఆశాభంగాన్ని పాలుచేసుకొని నిరుత్సాహం, ఆశాభంగం కలిగేంతగా వాటి గురించి ప్రస్తావించి ప్రలాపించటం మంచిది కాదు. నిరాశ చెందిన వ్యక్తిని అంధకారం అలుముకొంటుంది. అది దేవునివెలుగు ప్రకాశించకుండా ఆత్మను మూసివేసి ఇతరుల మార్గంలో చీకటి నీడలు నింపుతుంది.SCTel 83.2

    దేవుడు మన కందిస్తున్న చిత్రాలు తేటగా స్పష్టంగా ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆయన ప్రేమను గూర్చిన వాగ్దానాన్ని వక్రీకరించి వాటిని నిత్యం చూస్తువుందాం. మానవుణి సాతాను ప్రాబల్యంనుండి కాపాడేందుకుగాను దైవ కుమారుడుతండ్రీసింహాసనాన్ని త్యాగం చేయడం; పరలోకాన్ని వెనుక ప్రభువు మహి మను మరుగుపర్చే మర్మాలున్నాయి. ఈ మర్మాలు అవగాహన విషయంలో మనస్సును చిక్కులు పెట్టినా సత్యాన్వేషణలో భక్తివిశ్వాసాలు పుట్టిస్తాయి. ఎంతో లోతుగా బైబిలును పరిశోధిస్తే అది సజీవ దేవుని జీవ వాక్యమన్న విశ్వాసం అంత బలీయం చేస్తుంది. ఉన్నతమైన దైవ ప్రత్యక్షత ముందు మానవ ఆలోచన వినమ్రతతో వంగుతుంది.SCTel 83.3

    బైబిలులోని మహత్తర సత్యాల్ని సంపూర్ణముగా గ్రహించలేమని తెలుసు కోవడం పరిమితులుగల మనసు అపార జ్ఞానియెన్ల దేవుని అవగాహన చేసుకోవడానికి సరిపోదని ఒప్పుకోవడమే; మనుషుడు పరిమితమైన తన మానవ జ్ఞానంతో సర్వ జ్ఞానియైన దేవుని ఉద్దేశాల్ని గ్రహించలేడని గుర్తించడమే.SCTel 83.4

    దైవ వాక్యంలోని మర్మాలన్నిటిని గ్రహించలేకపోతున్నందువల్ల నాస్తికులు, అవిశ్వాసులు, దైవ వాక్యాన్ని విసర్జిస్తారు. బైబిలు నమ్ముతున్నట్లు చెప్పేవారందరూ ఈ విషయంలో క్షేమంగా ఉన్నారని చెప్పలేం. అపొస్తులుడిలా హెచ్చరిస్తున్నాడు, “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందెన్లను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి’‘ (హెబ్రి3:12) లేఖనాల్లో బయలు పర్చబడినంత వరకు బైబిలు బోధనాల్ని “దేవుని మర్మములను’‘ (1కొరి2:10) జాగ్రత్తగా పఠించటం మంచిది. రహస్యాలు మనదేవుడైన యెహోవాకు చెందినవెన్లప్పటికినీ “బయలు పర్చబడినవి ఎల్లప్పుడు మనవి” (ద్వితి 29:29) కాగా మనసుకున్న పరిశీలక శక్తిని భ్రష్టు పట్టించేందుకు సాతాను కృషి చేస్తాడు. బైబిలు సత్య పరిశీలనలో కొంత అహంభావం సమ్మిళత మవ్వడం వల్ల ఒక లేఖన భాగాన్ని తృప్తికరంగా విశదం చేయలేకపోయినప్పుడు మనుషులు సహనాన్ని కోల్పోయి నిరాసక్తులవుతారు. పరిశుద్ధ వాక్యంత వుకుఅర్ధ మువ్వడంలేదన్నది వారినెంతో కించపర్చుతుంది. ఆసత్యాన్నిదేవుడు తమకు బయలు పర్చడానికి ఎన్నుకున్న సమయం వరకు ఓపికగా కనిపెట్టడం వారి కిష్టముండదు. లేఖనాల్ని అర్ధం చేసుకోవడానికి ఏ సహాయము లేకుండా తమ మానవ వివేకమే సరిపోతుందని వారి భావన. ఇది జరగనప్పుడు లేఖనాల అధికారాన్నే వారు త్రోసిపుచ్చుతారు. బైబిలు బోధిస్తున్నదన్న ప్రజాభిప్రాయముగలసూత్రాలు, సిద్ధాంతాలెన్నో బెల్జిలు ఆధారితాలు కావన్నది వాస్తవం.SCTel 83.5

    ఇంకా చెప్పాలంటే అవి బైబిలు స్పూర్తికే విరుద్ధం. ఇలాంటి విషయాలు అనేకమంది మనసుల్లో సంశయాలు కావు; వాక్యాన్ని వక్రీకరించి మనుషులు సృష్టించే సమస్యలు.SCTel 84.1

    దేవుని గురించి ఆయన కార్యాలగురించి మానవులకు పూర్తిగా అవగాహన సాధ్యమైతే ఇది సాధించిన తదుపరి కనుగోవల్సిన సత్యం. పెంపొందించుకోవడానికి జ్ఞానం ఇక ఉండవు. మానసిక వికాసానికి ఇక తావుండదు. ఇక దేవుని సర్వాధికారం ఉండదు. ఉన్న జ్ఞానానంతా సముపార్జించడంతో మానవుడు పురోభివృద్ధి సాధించడం మానేస్తాడు. ఇదిలా జరగడంలేదు కనుక దేవునికి ధన్యవాదాలు. దేవుడు పరిమితులు లేనివాడు. “బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములై వున్నవి’‘ (కొలస్సి 2:3)నిత్య కాలమంతా మనుషులు వేదుకుతూ ఉన్నా, నేర్చుకుంటూ ఉన్నా ఆయన జ్ఞానం, మంచితనం, శక్తి, సర్వ సంపదల్ని పూర్తిగా గ్రహించలేరు.SCTel 84.2

    తన వాక్యంలోని సత్యాలు తన ప్రజలకు ఈ జీవితంలో సహితం విశద మవ్వాలన్నది దేవుని వాంఛ. ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఉంది. దైవ వాక్యం ఎవనివలన కలిగిందో ఆ పరిశుద్ధాత్మ వికాసం వల్లనే మనం వాక్యాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.SCTel 84.3

    “ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు” (1కొరింథి 2:10,11). రక్షకుడు తన శిష్యులకిచ్చిన వాగ్దానం ఇది. “అయితే ఆయన, సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన వాటిలో నివి తీసుకుని మీకు తెలియజేయును” (యోహాను 16:13,14).SCTel 84.4

    మనవుడు తన హేతువాది శక్తిని వినియోగించాల్సిందిగా దేవుడు కోరు తున్నాడు. ఇతరాత్ర బైబిలు పఠనం దేనికంటేకూడ మనసును ఎక్కువగా బలపర్చి, ఉన్నతం చేస్తుంది. అలాగని ఈ హేతువాదశక్తిని దేవుణ్ణి చేసి ఆరాధించకూడదు. ఇది మానవ బలహీనతలకు, దౌర్భగ్యానికి లోనేవుంటుంది. మన లేఖన అవగాహన పైమబ్బులు కమ్ముకున్నందువల్ల స్పష్టమైన సత్యాలే అర్ధంకాకుండా ఉంటే, చంటి బిడ్డవంటి విశ్వాసం తో నేర్చుకోవడానికి సిద్ధపడి సిద్ధపడి పరిశుద్ధాత్మ సహాయం ఆర్థించాలి. దేవునిశక్తి వివేకాల్ని గూర్చిన స్పృహ, ఆయన ఔన్నత్యాన్ని గ్రహించడానికి మన అశక్తత మనలో దీన మనసు పుట్టించాలి. అప్పుడు ఆయన సముఖంలో ప్రవేశిస్తున్నట్లుగా పరిశుద్ద భీతితో మనం ఆయన వాక్యాన్ని తెరవాలి. బైబిలు విషయానికి వచ్చేసరికి హేతువాదం తనకన్నా మిన్న అయిన అధికారాన్ని గుర్తిం చాల్సివుంటుంది. హృదయం, మనస్సు, “నేనుఉన్న వాడను” అనుగొప్ప దేవుని ముందు వంగి నమస్కర్రించాలి.SCTel 85.1

    అర్ధం చేసుకోవడానికి కష్టమనిపించేవి, స్పష్టంకానివి చాలా సంగతులున్నాయి. వాటిని గ్రహించాలని కోరేవారికి బోధపడేందుకు దేవుడు వాటిని సరళపర్చుతాడు. ఇందుకు పరిశుద్దాత్మ సహాయం అవసరం. పరిశుద్దాత్మ నడుపుదల లేకుండా మనం లేఖనాల్ని వక్రీకరించడానికి వాటికి అపార్ధాలు చెప్పడానికి అవకాశముంది. ఉపయోగం లేని బైబిలు పఠనం ఎక్కువగా జరుగుతుంది. అనేక సందర్భాలలో అది హానీకరంగా పరిణమిస్తుంది. దైవ వాక్యాన్ని యథాపాలంగాను, ప్రార్థన చేసుకోకుండా తెరచినపుడు ఆలోచనలు, అనురాగాలు దేవునిపెనిలవనప్పుడు లేక అవి ఆయన చిత్తానికి అనుగుణంగా లేనప్పుడు మనసు సందేహంతో మసకబారుతుంది. ప్రతీ బైబిల్ పఠనం నాస్తిక భావాల్ని బలపర్చుతుంది. సత్య విరోధి తలంపులను అదుపు చేసి వాక్యానికి తప్పుడు అర్థాలు ప్రతిపాదిస్తాడు. మాటలోను, క్రియలోనుదేవునికి అనుగుణంగా వ్యవహరించినపుడు మనుషులు ఎంతటి విద్యావంతులేనా లేఖన అవగాహనలో పొరబడడం జరుగుతుంది. వారి వాక్యానాలు నమ్మడం క్షేమంకాదు. ఎవ లేఖనాలను తప్పులు పట్టుకోవడానికి పఠిస్తారో వారికి ఆధ్యాత్మిక అవగాహన వుండదు. వక్ర దృష్టిగల ఆ వ్యక్తులు సరళమెనై, స్పష్టమైన్ల సంగతుల్లో సందేహాల్ని, అపనమ్మకాల్ని చూస్తారు.SCTel 85.2

    కప్పి పుచ్చేందుకు వారెంత ప్రయత్నించినా పెక్కు సందర్భాల్లో సందేహానికి, నాస్తికతకు అసలు కారణం పాపాన్ని ప్రేమించడమే. గర్వంతో నిండిన హృదయానికీ, పాపాన్ని ప్రేమించే హృదయానికి దేవుని వాక్య బోధనలు, ఆంక్షలు నచ్చవు. దైవ వాక్య వీధుల్ని పాటించడానికి ఇష్టపడని వారు వాక్యాధికారాన్ని ప్రశ్నించడానికి సిద్ధమౌతారు. సత్యాన్ని నిగ్గుతేల్చడానికి సత్యమేదో తెలుసుకోవాలన్న కోరిక,దాన్ని అనుసరించాలన్న ఆసక్తిగల హృదయం అవసరం. ఈ ఉద్దేశంతో బెట్టిలు పఠనాన్ని చేపట్టే వారందరికి అది దేవుని వాక్యమని నమ్మడానికి బోలెడు నిదర్శనం దొరుకుతుంది. అందులో సత్యాల్ని గ్రహించి తద్వారా రక్షణ జ్ఞానం విషయంలో వారు వివేకవంతులౌతారు.’‘ ఎవడెన్లను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక సాయంతట నేనేబోధించుచున్నానో వాడు తెలిసికొనును” (యోహాను 7:17) అంటున్నాడు క్రీస్తు. మీకు గ్రాహ్యంగాని అంశాన్ని ప్రశ్నించి విమర్శించేబదులు ఇప్పటిదాకా మీరు పొందిన వెలుగు ననుసరించి జీవిస్తే మరింత వెలుగు మీకు కలుగుతుంది. క్రీస్తు కృపవల్ల మీరు అవగతం చేసుకున్న ప్రతీ వీధీని నెరవేర్చండి. ఇప్పుడు మీకు సందేహాత్మకంగా ఉన్నవాటిని గ్రహించి నెరవేర్చడానికి అప్పుడు మీకు శక్తి సామర్థ్యాలు లభిస్తాయి.SCTel 85.3

    విద్యావంతులకు, నిరక్షరాస్యులకు అందరికీ అందుబాటులో ఉన్న నిదర్శనం ఒకటుంది. అది అనుభవం, ఆయన వాక్యం, ఆయన వాగ్దానాలు వాస్తవికమైనవోకావో నిగ్గు తేల్చడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు . “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి” (కీర్తనలు 34;8) అంటూ ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఇంకొకరి మాటమీద ఆధారపడడం కన్నా, స్వయంగా మనమే రుచి చూసి తెలుసుకొనడం మంచిది.SCTel 86.1

    “అడుగుడి మీకు దొరుకును” (యోహాను 16:24) అంటున్నాడాయన. ఆయన వాగ్దానాలు నెరవేరతాయి. అవి ఎన్నడూ విఫలమవ్వలేదు. అయ్యే అవకాశమూలేదు. యేసు చెంతకు వచ్చి ఆయన ప్రేమలో మనం ఉత్సహించినపుడు ఆయన సన్నిధి కాంతిలో మన సందేహాలు, మన చీకట్లు మాయమౌతాయి. ఆయన మనలను అంధకార సంబంధమైనఅధికారములో నుండి విడుదల పొందుతాను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నీవాసులుగా చేసెను”( కొలస్సీ 1:13) అంటున్నాడు అపొస్తలుడైన్ల పౌలు. మరణంనుంచి జీవానికి వెళ్తున్న ప్రతీవాడు “దేవుని సత్యవంతుడను మాటకు ముద్ర (యోహాను 3:33) వేయగలుగుతున్నాడు. అతడు ఇలా సాక్ష్యమీయగలుగుతాడు. “నాకు సహాయం అవసరంకాగా, దాన్నీ యేసులో కనుగొన్నాను. ఆయన నా అవసరాలు తీర్చాడు; ఆకలిగొన్న నాహృదయాన్ని తృప్తిపరిచాడు. బైబిలు ఇప్పుడునాకు యేసు క్రీస్తును గూర్చిన ఆవిష్కరణ. యేసును నేనెందుకు నమ్ముతున్నాని అడుగుతారా ? ఎందుకంటే ఆయన నాకు పరమ రక్షకుడు. నేనుబేబీలును ఎందుకు నమ్ముతున్నాను? ఎందుకంటే అది నాఆత్మకు దేవునిస్వరం.” బైబిలు నిజమని, క్రీస్తు దేవుని కుమారుడని ఘోషించేసాక్ష్యం మనలోనే ఉంది. మనంచమత్కారంగా అల్లిన కథల్ని అనుసరించటం లేదనిమనకు తెలుసు.SCTel 86.2

    పేతురు విశ్వాసులకు ఇలా హితవు పలుకుతున్నాడు. “మన ప్రభువు రక్షకుడెన్ల యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును, జ్ఞానమందును అభివృద్ధిపొందుడి” (2 పేతురు 3:18). దైవ ప్రజలు కృషయందు పెరిగినప్పుడు, దేవుని వాక్యాన్ని గూర్చిన స్పష్టమైన అవగాహనను నిత్యము పొందుతూ ఉంటారు. వాక్యంలోని పవిత్ర సత్యాల్ని గూర్చి నూతన రమ్యం అయిన వెలుగును పొందుతారు. అన్ని యుగాల్లోను సంఘ చరిత్రను గూర్చిన సత్యం ఇదే. అంతవరకూ కొనసాగే నత్యం కూడ ఇదే. ‘’పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” (సామెతలు 4:18).SCTel 87.1

    మానసిక అభివృద్ధికి వాగ్దానాన్ని స్వీకరిస్తూ, మహాశక్తుల్ని దేవుని శక్తితో సంయుక్తపరచి మనకున్న ప్రతీశక్తిని వెలుగుకు నిలయమైన దేవునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పర్చుకుంటే మనం భవిష్యత్తును విశ్వాసంతో ఎదుర్కోవచ్చు. దైవ కృపల విషయంలో మనల్ని గజిబిజి పరచిందంతా అప్పుడు తేట తెల్లమవ్వనున్నందుకు ఉత్సహించవచ్చు. గ్రహించడానికి కష్టమైన విషయాలు అప్పుడు బోధపడతాయి. పరిమిత జ్ఞానంగల మన మనసులు ఎక్కడైతే గందరగోళం, లక్ష్య వైఫల్యం కనుగొన్నవో అక్కడ సంపూర్ణమైన, మనోహరమైన్ల సామరస్యాన్ని కనుగొంటాయి. “ఇప్పుడుఅద్దములో చూచినట్లు సూచ నగాచూచుచున్నాము. అప్పుడుముఖాముఖిగాచూతుము. ఇప్పుడు కొంతవరకే ఎరిగి యున్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును” (కొరి 1:12).SCTel 87.2