Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    1వ అధ్యాయం - మానవుని యెడల దేవుని ప్రేమ

    ప్రకృతి, దైవ ప్రత్యక్షతలు రెండూ దేవుని ప్రేమను గూర్చీ సాక్ష్యమిస్తున్నాయి. పరలోక మందున్న మన తండ్రి జీవం, వివేకం, ఆనందానికి నిలయం. ఆశ్చర్యం కలిగించే ప్రకృతి సొగసుల్ని తిలకించినప్పుడు మానవుడి అవసరాలు ఆనందానికేగాక, సకల ప్రాణుల అవసరాలు సుఖ జీవనానికి అనుగుణంగా వాటి రూపకల్పన జరగడం గురించి ఆలోచించండి, భూమిని, కొండలను, సముద్రాన్ని, సువిశాలమైన్ల పంట భూముల్ని తెప్పరిల్లజేసి, ఉత్సాహపర్చే వర్షధారలు, సూర్యరశ్మి, సృష్టికర్త మన యెడల చూపుతున్న ప్రేమకు నిదర్శనాలు. తాను సృజించిన సకల ప్రాణుల దినదినావసరలను తీర్చేవాడు దేవుడే. కీర్తన కారుని ఈ చక్కని మాటలు గమనించండి...SCTel 7.1

    “సర్వ జీవుల కన్నులు నీవైపు జూచుచున్నవి
    తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు
    నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి
    పరుచుచున్నావు
    SCTel 7.2

    ” కీర్తనలు 145:15,16

    పరిశుద్ధంగా, సంతోషంగా జీవించేందుకు దేవుడు మానివుణ్ణి సృజించాడు. చూడ ముచ్చటగానున్న ఈ భూమి సృష్టికర్త చేతులనుండి వచ్చినప్పుడు క్షీణిత, శాపం చిహ్నాలు లేనేలేవు. ప్రేమ నిబంధనయైన దైవ ధర్మశాస్త్ర అతిక్రమణవల్ల దుఖ: మరణం ప్రాప్తించాయి. పాప ఫలితంగా చోటు చేసుకునే శ్రమల్లో సహితం దేవుని ప్రేమ ప్రదర్శితమౌతునేవుంది. మానవుడి నిమిత్తం దేవుడు నేలను శపించినట్లు బైబిలు చెబుబుతుంది. ఆదికాండము 3:17. ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, అనగా జీవితాన్ని శ్రమ ఆందోళనలతో దుర్భరంజేసే కష్టాలు, బాధలు, మానవుడి మంచికోరి ఏర్పాటయ్యాయి. పాపంవలన కలిగిన పతనం, దుస్థితినుంచి మానవుణ్ణి ఉద్దరించడానికి అవసరమైన శిక్షణకు దేవుని ప్రణాళికలో ఇవి ఒక భాగం. నైతిక స్థాయి దిగజారినప్పటికీ ఈ లోకంలో ఉన్నది దుఖ:ము, విచారమువూత్రమే అని అనుకోకూడదు. ప్రకృతి తీసుకోండి, అందులో నిరీక్షణ, ఆదరణ కలిగించే వర్తమానాలెన్నో వున్నాయి. ముళ్ళ పొదలపై పుష్పాలున్నాయి. ముళ్ళను కప్పివేస్తు గులాబీలున్నాయి. విచ్చుకుంటున్న ప్రతి మొగ్గమీద, మొలకెత్తుతున్న ప్రతీ గడ్డిపోచమీద “దేవుడు ప్రేమ అయిఉన్నాడు” అని వ్రాయబడివుంది. తమ ఉత్సాహ గీతాలతో వాయు మండలాన్ని కోలహలపర్చే అందమైన పిట్టలు సున్నితమెన్ల రంగులు పులుముకొని గాలిలో సువాసనలు విరజిమ్మే పూలు, పచ్చని ఆకులతో ఆకాశాన్నంటే అడవి వృక్షాలు దేవుని శ్రద్ధాశక్తులకు తమ బిడ్డల్ని సంతోషంగా ఉంచాలి అన్న ఆయన అకాంక్షకు సాక్ష్యాలు.SCTel 7.3

    దేవుని వాక్యం ఆయన శీలాన్ని ప్రత్యక్షపరుస్తుంది. తన ప్రేమను, కనికరాన్ని ఆయన తనంతట తానే ప్రచురపర్చుకొన్నాడు. “నీ మహిమను నాకు చూపుము’‘ అని మోషే ప్రార్ధించగా “నా మంచితనమంతయు నీ ఎదుట కనబర్చెదను’‘ అని ప్రభువు సెలవిచ్చాడు (నిర్గమ 33:18,19) ఇదే ఆయన మహిమ. మోషే ముందు దాటివెళ్తూ “యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన వేయివేలమందికి కృపను చూపుచు, దోషమును, అపరాధమును పాపమును క్షమించును” అని ప్రకటించుకొన్నాడు (నిర్గమ 34:6,7)’‘ ఆయన జాలియును బహు శాంతమును” గలవాడు (యోనా: 4:2). “ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు” (మీకా 7:18).SCTel 8.1

    ఇహపర లోకాల్లోని అసంఖ్యాకమైన్ల చిహ్నాలు దేవుడు మన హృదయాలను తన తట్టుకు ఆకర్షించుకొంటున్నాడు. ప్రకృతి లోని అంశాలద్వారా మానవ హృదయాలకు సుపరిచితమైన మిక్కిలి సన్నిహిత బంధాల ద్వారా మనకు తనకు తాను ప్రత్యక్షపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా ఇవి ఆయన ప్రేమకు అంతంత మాత్రపు సూచికలే. ఇన్ని నిదర్శనాలున్నా మంచికి విరోధియెన్ల సాతాను మనుషుల మనసులకు అంధత్వం కలిగించినందున దేవుని పట్ల వారికి భయం ఏర్పడింది. ఆయన క్షమా గుణం లేని కర్కోటకుడు అని భావించారు. దేవుని న్యాయ వ్యవస్థపట్ల ప్రజల్లో దురభిప్రాయాలు పుట్టించేందుకు సాతాను కృషి చేసాడు. దయ, దాక్షిణ్యాలు లేని న్యాయాధిపతిగా, కఠినమెన్ల అప్పుల వాడిగా దేవుని చిత్రించాడు. కఠినమైన తీర్పు ఇచ్చేందుకు గాను ప్రజల దోషాలు, అపరాధాలు కనిపెట్టడానికి అసూయగా పరిశీలించే వ్యక్తిగా సృష్టికర్తను చిత్రీకరించాడు. మితిలేని దెపై ప్రేమను లోకానికి ప్రత్యక్షపర్చడం ద్వారా ఈ అంధకార ఛాయను తొలగించడానికి యేసు మానవుల మధ్య నివశించడానికి ఈ లోకానికి వచ్చాడు..SCTel 8.2

    దైవ కుమారుడు తండ్రిని చూపించడానికి పరలోకంనుండి వచ్చాడు. “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున నన్ను అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను” (యోహాను 1:18). “కుమారుడు గాకను, కుమారుడెవరికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని యెరుగడు’‘ (మత్తయి 11:27). “తండ్రిని మాకు కనపరుచుము’‘ అని శిష్యుల్లో ఒకడు యేసును అడగ్గా, ” ఫిలిప్పూ , నేనింత కాలము నీవద్దనుండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనబరుచుమని యేల చెప్పుచున్నావు? అని యేసు బదులు పలికాడు. (యోహాను 14:8,9).SCTel 9.1

    లోకంలో తన కర్తవ్యాన్ని వివరిస్తూ యేసు ఇలా పలికాడు. ‘’బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును, నలిగిన వారిని విడి పించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటిచుటకును ఆయన నన్ను పంపియున్నాడు” (లూకా 4:18) ఇదీ ఆయన సేవ. ఆయన మేలు చేస్తూ సంచరించాడు. సాతానుడి బాధితులందరిని ఆయన స్వస్థత పర్చాడు. ఏ ఇంటిలోను వ్యాధి మూలంగా బాధపడుతున్నవారు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే యేసు ఆ గ్రామాల్లో తిరిగి వ్యాధి గ్రస్తులను బాగు చేశాడు. యేసు దేవుని వలన అభిషేకం పొందినవాడని ఆయన సేవ నిరూపించింది. ప్రేమ, దయ, కనికరాలు ఆయన ప్రతికార్యంలోను గోచరించాయి. చిన్నారుల పట్ల ఆయన కరుణ కటాక్షాలు మెండు. మానవ అవసరాలు తీర్చగలిగేందుకుగాను మానవ నైజాన్ని ఆయన స్వీకరించాడు. నీరు పేదలు, అత సావూన్యులు నిర్భయంగా ఆయనను కలవగలిగారు. ఒదిగి మోకాళ్ళమీదకెక్కి మమతానురాగాలుట్టిపడే ఆ ముఖంలో చూడడానికి ముచ్చట పడేవారు.SCTel 9.2

    ఒక్క సత్య వాక్కును కూడ యేసు అణిచివేయలేదు. ఎల్లపుప్పుడూ సత్యాన్ని ప్రేమతో పలికాడు. ప్రజలతో మసిలేటప్పుడు గొప్ప విజ్ఞతను దయతో నిండిని ఏకగ్రతను ప్రదర్శించాడు. ఆయన ఎన్నడును అమర్యాదగా ప్రవర్తించలేదు. ఎన్నడును అనవసరంగా ఒక్కమాటకూడ పలకలేదు. నొచ్చుకునే వ్యక్తికి అనవసరంగా నొప్పి కలిగించలేదు. మానవ బలహీనతను గర్జించలేదు. సత్యాన్ని వచించాడుగాని దాన్ని ఎల్లప్పుడూ ప్రేమతోనేపలికాడు. వేషధారణను, అవిశ్వాసాన్ని, దుర్మార్ధతను ఖండించాడు. అయితే ఇది చేసినప్పుడు ఆయన స్వరంలో కన్నీళ్ళు నిండేవి. యేసు యెరుషలేమును బహుగా ప్రేమించాడు. మార్గం, సత్యం, జీవం, ఆయన తనను అంగీకరించడానికి యెరుషలేము నిరాకరించినపుడు ఆయన ఎంతో దుఖి:ంచాడు. రక్షకుడైన తనను వారు నిరాకరించినా ఆయన మాత్రం వారిపట్ల జాలిచూపాడు, ఆయనది తన్నుతాను ఉపేక్షించుకొని పరుల ఉపకారార్థం జీవించిన జీవితం. ఆయన దృష్టిలో ప్రతి ఆత్మ ప్రసక్తమైనదే. ఆయన నిత్యమెన పరిశుద్ధ ఠీవితో మెలిగినా దైవ కుటుంబం సభ్యుల్లో ప్రతివారికి ఎనలేని గౌరవం చూపించాడు. నశించిన ఆత్మల్ని రక్షించడానికి తన నిబద్దత పరిధిలో మనుషులందరిని ఆయన చూశాడు.SCTel 9.3

    క్రీస్తు జీవితములో వెల్లడైన ప్రవర్తన ఇది. ఇదీ దేవుని ప్రవర్తన, క్రీస్తులో ప్రదర్శితమెపై కరుణా కటాక్షాలు తండ్రి హృదయం నుంచి ప్రవహిస్తున్నవే. దయ, కనికరాలు గల రక్షకుడైన యేసు “శరీరుడుగా ప్రత్యక్షుడైన’‘ దేవుడు (1తిమోతి 3:16).SCTel 10.1

    మనలను విమోచించేందుకు యేసు జీవించి, శ్రమలు పొంది మరణించాడు. నిత్యానందంలో మునం పాలిభాగస్తులవయ్యేందుకు ఆయన ‘’వ్యసనాక్రాంతు”డ య్యాడు. వర్ణింపశక్యంగాని మహిమాలోకంనుంచి పాపం, శాపం, మరణ ఛాయల్లో పసివాడిని ఈలోకంలోనికి రావడానికి దేవుడు కృపా సత్యాలకు నిలయమైన తన ప్రియ కుమారుణ్ణి అనుమతించాడు. కుమారుడు తన ప్రేమాబాహువును, దేవ దూతల ఆరాధనను విడిచి, సిగ్గు, పరాభవం, ద్వేషం, మరణం పొందడానికి తండ్రి ఆయనను అనుమతించాడు. “మన సమాధానార్ధమెన్ల శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది”SCTel 10.2

    ( యెషయ 53:5) అరణ్యంలో గెత్సెమనేలో సిలువమీద ఆయనను చూడండి! కళంకంలేని దైవ కూమారుడు పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు. మానవుడికి దేవునికి మధ్య పాపం సృష్టించే భయంకర అగాధాన్ని దేవునితో ఒకడైయున్న ఆ ప్రభువు తన ఆత్మలో అనుభవించాడు. ఈ వేదనతో ఆయన పెదవులనుంచి ఈ మాటలు వెలువడ్డాయి.SCTel 10.3

    “నాదేవ నాదేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి?’‘ (మత్తయి 27:46) పాపభారం, దాని భయంకర పరిణామం, ఆత్మకు దేవునికి మధ్య అది సృష్టించే అగాధం - ఇది దేవ కుమారుని హృదయాన్నిబద్దలు కొట్టిన పరిణామం. తండ్రి హృదయములో మానవుని యెడల ప్రేమ పుట్టించ డానికో, రక్షించేందుకు ఆయనను సమ్మతించడానికో యేసు ఈ మహా త్యాగంచేయలేదు. అందుకు కానేకాదు! ‘’దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను” (యోహాను 3:16) తండ్రి ఈగొప్ప ప్రాయశ్చిత్తం కారణంగా మనల్ని ప్రేమించడంలేదు. మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకఈ ప్రాయా శ్ఛిత్తాన్ని ఏర్పాటు చేసియున్నాడు. దారి తప్పిన లోకంపై దేవుడు తన అనంత ప్రేమను కనర్చడానికి క్రీస్తు ఒక సాధనమయ్యాడు. దేవుడు... క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచు కొన్నాడు. (2 కొరింథీ 5:19) కుమారునితోబాటు దేవుడు కూడ బాధననుభవించాడు. గెత్సెమనే ఆవేదనలో, కల్వరి మరణంలో అనంత ప్రేమా హృదయం మన విమోచన మూల్యాన్ని చెల్లించినది.SCTel 10.4

    ప్రభువు అన్నారు. నేను దానిని మరలా తీసుకకొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు” (యోహాను 10:17) అనగా ‘’నా తండ్రి మిమ్ములను ఎంతగానో ప్రేమిస్తున్నాడు; మిమ్ములను విమోచించేందుకు నా ప్రాణాన్నిచ్చేందుకు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు” నా ప్రాణ త్యాగం ద్వారా మీ అతిక్రవూల్ని, పాపభారాన్ని స్వీకరించి మీకు ప్రత్యామ్నాయమూ పూటకపు అవ్వడంలో నా తండ్రికి నేను మిక్కిలి ప్రియుణ్ణియ్యాను. ఎందుకంటే నా బలిదానం ద్వారా దేవుడు తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసముంచు వానిని నీతిమంతునిగా తీర్చువాడు గాను ఉండగలుగుతాడు” అని భావము.SCTel 11.1

    దేవ కుమారుడు తప్ప వేరెవరూ మనకు రక్షణ నివ్వలేరు. ఎందుకంటే తండ్రి రొమ్మున ఉన్నవాడే తండ్రిని వెల్లడించగలడు. దైవ ప్రేమ ఎత్తులోతు ఎరిగినవాడే ఆ ప్రేమను ప్రదర్శించగలడు. పాపి పక్షంగా క్రీస్తు చేసిన మహా త్యాగం కన్నా నశించిన మానవుల పట్ల దేవుని ప్రేమను మరేదీ బయలు పర్చ జాలదు.SCTel 11.2

    “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. మానవుల మధ్య నివశించడానికే గాక వారి పాపాల్ని మోయడానికి వారి మరణాన్ని మరణించడానికే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. నశించిన మానవుల కోసం ఆయననుఅనుగ్రహించాడు. మానవుల అవసరాలు, ఆసక్తులు, క్రీస్తు అవసరాలు ఆసక్తులు కావలసివున్నాయి. దేవునితో ఒకడే ఉనికి సాగించిన యేసు తన్ను తాను మానవులతో తెగని బంధాలతో అనుసంధానం చేసుకున్నాడు. యేసు వారిని సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదు. (హెబ్రీ2:12) ఆయన మన బలి అర్పణ, ఉత్తర వాది, మన సహోదరుడు, తండ్రి సింహాసనం ముందు ఆయన మానవ రూపంలో ఉంటాడు. మనుష్య కుమారుడెన్ల ఆయన తాను రక్షించిన నరులతో యుగయుగాలుగా నిత్యమూ నివశిస్తాడు. పాపం వలన కలిగిన పతనం నుంచి మానవుని ఉద్దరించి, అతడు దేవుని ప్రేమను ప్రతిబింబించి పరిశుద్ధతలోని ఆనందాన్ని పంచుకొనేందుకే ఇదంతా జరుగుచున్నది.SCTel 11.3

    మన రక్షణకోసం చెల్లించబడ్డ మూల్యం, మన నిమిత్తం మరణించేందుకు తన కుమారుణ్ణి ఇవ్వడంలో పరలోక తండ్రి చేసిన మహత్తర త్యాగం, క్రీస్తు ద్వారా మన ఉజ్వల భవితను గూర్చి మనలో ఉన్నతాభిప్రాయాలు రేకెత్తించాలి. నశిస్తున్న మానవుల యెడల తండ్రి ప్రేమ ఎత్తు లోతు, వెడల్పులను ఆవేశపూరితమైన అపొస్తలుడు యోహాను తిలకించగా ఆయన హృదయం భక్తి, ఆరాధ్య భావాలతో నిండినది. ఈప్రేమ ఔన్నత్యాన్ని సున్నితత్వాన్ని వెలుబుచ్చడానికి తనకు దీటెన్ల భాష లేకపోవటంతో చూడమంటూ లోకాన్ని పిలుస్తున్నాడు. “మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు మనకెట్టి ప్రేమననుగ్రహించునో చూడుడి” (యోహాను 3:1) ఇది మానవుడికి ఎంత గొప్ప విలువను అపాదిస్తున్నది! ఆజ్ఞాతిక్రమం వలన మానవులు సాతాను పరిపాలనకు గురయ్యారు. క్రీస్తు ప్రాయశ్చితార్ధ బలిదానం ద్వారా ఆదాము కుమారులు దేవుని కుమారులు కావచ్చు. మానవ స్వభావాన్ని స్వీకరించటం ద్వారా క్రీస్తు మానవజాతిని ఉన్నత స్థాయికి లేపాడు. పాపులెన్ల మనుష్యులు నిజంగా “దేవుని పిల్లలు” కావడం క్రీస్తుతో ఈ సంబంధం సాధ్య పర్చుతుంది.SCTel 12.1

    ఇలాంటి ప్రేమకు సాటిలేదు. పరలోక రాజు పిల్లలు : ప్రస్తత విజ్ఞానం! ప్రగాఢ ధ్యానానికి గొప్ప అంశం! తనని ప్రేమించని లోకంపట్ల దేవుని సాటిలేని ప్రేమ! ఆ ప్రేమను గూర్చిన ఆలోచనే ఆత్మను వశపర్చుకొని మనసుని దేవుని చిత్తానికి బందీ చేసే శక్తిగలది. సిలువ వెలుగులో దేవుని శీలాన్ని ఎంతో లోతుగా అధ్యయనంచేస్తే , పక్షపాత రహిత న్యాయ సమ్మిళత క్షమాపణను, దయ, కనికరాన్ని అంత ఎక్కువగా మనం చూడగలుగుతాము. అంతులేని ప్రేమకు, మాట వినని పసివానిపే తల్లికుండే కరుణను మించిన కనికరానికి లెక్కకు మించిన నిదర్శనాల్ని అంత స్పష్టంగా గ్రహించగలుగుతాము,SCTel 12.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents