Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    9వ అధ్యాయం - సేవా నిరతి, జీవితం

    విశ్వమంతటిలో జీవం, వెలుగు, సంతోషానందాలకు దేవుడే నిలయం. సూర్యకిరణాల్లా నిత్యము గలగల ప్రవహించే సెలయేరులా దేవుని దీవెనలు ఆయన సృష్టిలోని సకల జీవులకు ప్రవహిస్తూవుంటాయి. దేవుడిచ్చిన జీవం మానవ హృదయాల్లో నుంచి ప్రేమగా దీవెనగా ఇతరులకు ప్రవహిస్తుంది.SCTel 59.1

    పాపంవల్ల పతనమైన మనుషుల్ని ఉద్దేశించి విమోచించడంలో మన రక్షకుడు ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. ఇందు నిమిత్తం ఆయన తనప్రాణాన్ని లెక్కచేయక సిలువను సహించాడు, సిగ్గును భరించాడు. అలాగే దేవ దూతలు, ఇతరుల ఆనందంకోసం పనిచేస్తుంటారు. ఆవని వారికి ఆనందానిస్తుంది. నిర్భాగ్యులు, అన్ని విధాల తక్కువ స్థాయిలో ఉన్నవారికి సేవలు హీనమైనై సేవగా స్వార్ధపరులు పరిగణిస్తారు. అయితే వారికి సేవ చేయడమే పాపరహిత దేవదూతలు నిమగ్నమైయున్న పని. ఆత్మ త్యాగంతో కూడిన క్రీస్తు ప్రేమ స్పూర్తితో పరలోకం నిండివుంది. ఆ స్పూర్తే పరలోక వాసులకి అమితానందం కూర్చుతుంది. ఆ స్పూర్తినే క్రీస్తు అనుచరులు కలిగివుంటారు. అదే వారు చేయనున్న సేవ.SCTel 59.2

    క్రీస్తు హృదయమందిరములో చోటు చేసుకున్నప్పుడు అది దాచలేని పరిమళంగా పరిణమిస్తుంది. మనతో సంబంధాలున్న వారందరూ దాని పరిశుద్ద ప్రభావానికి లోనౌతారు. హృదయంలో క్రీస్తు స్వభావం ఉంటే అది ఎడారిలో నీటి ఊటనుపోలి ఉంటుంది. అది అందరికోసం ప్రవహిస్తుంది. మరణానికి సిద్దంగా ఉన్నవారు జీవజలానికి తహతలాడేటట్లు చేస్తుంది.SCTel 59.3

    యేసు పట్లమన ప్రేమ మానవుల హితంకోరి వారిని ఉద్దరించాలన్న కోరికతో యేసు పనిచేస్తున్నట్లు పనిచేయడంలో వెల్లడవుతుంది. దైవ సృష్టిలో సకల ప్రాణుల యెడల ప్రేమ, దయ, సానుభూతి కలిగి ఉండడానికి ఆ ప్రేమ నడిపిస్తుంది.SCTel 60.1

    ఈ లోకంలో రక్షకుడు యేసు జీవితం సుఖజీవనానికి, స్వార్ధాసక్తులకి అంతిమవ్వలేదు. పాపం వల్ల నాశనమౌతున్న మానవాళి రక్షణార్ధం ఆయన చిత్తశుద్ధితో అవిరామంగా శ్రమించాడు. ఇందుకుగాను ఆత్మ నిరసన మార్గాన పయనించాడు. కఠిన పరిశ్రమను, బాధాకరమెపై ప్రయాణాన్ని, ఆయాస ప్రయాసాలతో నిండిన సేవల్ని శ్రమను తప్పించుకోవాలని ప్రయత్నం చేయలేదు. “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగానీ పరిచారము చేయుటకు అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను” అని ఆయన అన్నాడు. (మత్తయి 20:28). ఇదే ఆయన జీవిత పరమావధి. మరి దేనికీ ప్రాధన్యంలేదు. దేవుని చిత్తాన్ని జరిగించి ఆయన కార్యాన్ని ముగించడమే ఆయనకు అన్నాపనాలు. ఆయన సేవలో స్వార్థానికి, స్వార్థ ప్రయోజనాలకి తావులేదు..SCTel 60.2

    కాబట్టి ఎవరి నిమిత్తమైతే యేసు మృతిచెందాడో ఆ ప్రజలు దేవుని ఉచిత కృపలో పాలు పంచుకునేందుకు కోసం క్రీస్తు కృపలో ఉన్నవారు ఎట్టి త్యాగానికైనా సంసిద్ధులై ఉంటారు. లోకంలో తమ ఉనికి వల్ల వారు లోకాన్ని మెరుగైన తావుగా తీర్చి దిద్దుతారు. ఈ స్పూర్తి నిజమైన మారుమనసు పొందిన ఆత్మలో పుట్టి పెరిగిందే. ఒకడు క్రీస్తు చెంతకు వచ్చిన వెంటనే యేసులో గొప్ప మిత్రుణ్ణి తాను కనుగొన్నట్లు ఇతరులకు తెలియజేయాలన్న కోరిక అతడి హృదయంలో చోటుచేసుకుంటుంది. రక్షణ, శుద్దీకరణ ను అనుగ్రహించే ఈ సత్యాన్ని హృదయంలో దాచి ఉంచలేం. మనం క్రీస్తు నీతిని ధరించినవరం. పరిశుద్ధాత్మ అంతర్గత ఉనికి వల్ల కలిగే ఆనందంతో నిండిని వారం అయితే ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేము. యెహోవా ఉత్తముడని మనం రుచిచూసీతెలుసుకున్నట్లయితే, ఇతరులకు చెప్పడానికీ మనవద్దసమాచారముంటుంది.SCTel 60.3

    రక్షకుని కనుగొన్నప్పుడు ఫిలుప్పు మాదిరిగా రక్షకుని సన్నిధిలో మనం ఇతరులను ఆహ్వానిస్తాము. క్రీస్తులోని ఆకర్షణలకు, రానున్న లోకంలోని సత్యాలకు వారి మనసుల్ని ఆకర్షించడానికి మనం ప్రయత్నిస్తాం. యేసు నడిచిన మార్గంలో నడవాలన్న కోరిక ప్రబలమౌతుంది. “లోకపాపమును మోసుకొనిపోవుదేవుని గొర్రెపిల్ల” (యోహాను 1:29) మన చుట్టూ ఉన్న ప్రజలు చూడాలన్న వాంఛ మనకు కలుగుతుంది.SCTel 60.4

    ఇతరులకు మేలు చేసే కృషి మనకు మేలుగా పరీమమీస్తుంది. రక్షణ ప్రణాళికలో మన కొక పాత్ర నివ్వడంలో దేవుని ఉద్దేశం ఇదే. దైవ స్వభావంలో పాలు పంచుకునే ఒక విశిష్టావకాశాన్ని ఆయనమానవులకు అనుగ్రహించాడు. ఇక మానవులు తమ సహమానవులతో తమదీవెనలనుపంచుకోవాల్సివున్నారు. మానవులకు దేవుడి వ్వగలిగిన అత్యున్నత సన్మాన, ఆనందం ఇదే. అనురాగ సేవల్లో ఇలా పాలు పొందేవారు తమ సృష్టికర్త కు మిక్కిలి సన్నిహితులౌతారు. సువార్త సేవా బాధ్యతను, కారుణ్య సేవా నిర్వహణను దేవుడు పరలోక దూతలకు అప్పగించగలిగియుండేవాడే. తన కార్య నిర్వాహణకు దేవుడు ఇతర సాధనాల్ని ఉపయోగించగలిగియుండేవాడే, ఇలాగుండగా, ఆయన తన అనంత ప్రేమ కారణంగా తనతో క్రీస్తును, దేవదూతలతోను మనల్ని జత పనివారిగా ఎంపిక చేసాడు. ఈ స్వార్ధరహిత సేవ ఫలితంగా కలిగే శుభాలు, ఆనందం, ఆధ్యాత్మిక ప్రగతిని మనం పొందాలన్నదే ఆయన ఉద్దేశం.SCTel 60.5

    శ్రమలు, బాధలలో క్రీస్తుతో సహవాసం ద్వారా మనం ఆయన సానుభూతిని పొందగలుగుతాం. పరుల మేలుకోసం చేసేప్రతీ త్యాగం, దాత హృదయంలో ఉపకార గుణాన్ని పటిష్టంచేసి “ఆయన ధనవంతుడైయుండియు, మీరు తమ దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడు” (2కొరింథి 8:9) ఆయన లోక విమోచనకునితో అతడి ఆత్మీయతను పెంపుచేస్తుంది. మన సృష్టిలో దేవుని ఉద్దేశాన్ని ఇలా నెరవేర్చుతున్నప్పుడే బ్రతుకు మనకు దీవెనకరంగా ఉంటుంది.SCTel 61.1

    దేవుడు ఉద్దేశించినరీతిగా మీరు ప్రజల మధ్య పనిచేసి ఆత్మల్ని రక్షకుని చెంతకు ఆకర్షించినట్లయితే, దైవ విషయాల్లో మరింత అనుభవం, జ్ఞానం, అవసరమని గుర్తించి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగివుంటారు. దేవునితో విజ్ఞాపన చేస్తారు. గనుక మీ విశ్వాసం పటిష్టమౌతుంది. రక్షణ భావిలో నుంచి లోతెన నీళ్ళు చేదుకుని మీ ఆత్మ దాహర్తి తీర్చుకొంటారు. శ్రమలు, ప్రతికూలత ఎదురైనప్పుడు మీరు బైబిలుని, ప్రార్ధనను ఆశ్రయిస్తారు. మనప్రభువు రక్షకుడయిన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపలో ను జ్ఞానం లోను అభివృద్ధిపొందుతూ లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని గడిస్తారు.SCTel 61.2

    పరులకందించే స్వార్ధ రహిత సేవాస్పూర్తి దాత ప్రవర్తనకు గాంభీర్యం, స్థైర్యం క్రీస్తును పోలిన సౌమ్యతను చేకూర్చి ఆ వ్యక్తికి శాంతి ఆనందానిస్తుంది. ఉన్నతమైన కోరికలు చోటు చేసుకుంటాయి. సోమరితనానికి గాని స్వార్ధప్రయోజనాలకు గాని తావుండదు. క్రైస్తవ కృపల్ని ఇలా ఆచరణలో పెట్టేవారు వృద్ధిచెంది దేవుని పక్షంగా కృషి చేసేందుకు బలోపేతులౌతారు. వారికి స్పష్టమైన్ల ఆధ్యాత్మిక అవగాహన, స్థిరమైన, పెరుగుతున్న విశ్వాసం, ప్రార్ధన ద్వారా వృద్ధిచెందుతున్న శక్తి కలుగుతాయి. వారి హృదయాల్లో వైవాత్మ పనిచేస్తు దేవుని స్పర్శకు ఆత్మలోని పవిత్ర స్వర మాధుర్యాన్ని మేలుకొలుపుతాడు. ఇతరులకు మేలు చేయడంలో ఇలా నిస్వార్ధంగా సేవలు చేసేవారు నిశ్చయముగా తమ రక్షణనుసంపాదించుకుంటున్నవారనవచ్చును.SCTel 61.3

    మనం చేయాల్సిందిగా క్రీస్తు ఆశించినపనిని, అనగా మనం చేయగలిగిన సహాయాన్ని, మేలును, అవి అవసరమైన వారికి అందించడంలో ప్రత్యుపకారాపేక్ష లేకుండా, శక్తివంచన లేకుండా, చేయడమే మనం కృపలో పెరగడానికి గల ఒక మార్గం, వ్యాయామం వల్ల బలం కలుగుతుంది. శ్రమవల్ల ఆయువు పెరుగుతుంది. కృపవలన వచ్చే దీవెనల్ని అంగీకరించి క్రైస్తవ జీవితం జీవించడానికి ప్రయత్నిస్తూ క్రీస్తుకోసం ఎలాంటి సేవా చేయని ప్రజలు, పనిచేయకుండా తిని బ్రతకడానికి ప్రయత్నించే వ్యక్తులులాంటివారు. ఆధ్యాత్మికంగాను, ప్రకృతిపరంగాను ఇదెప్పుడూ క్షీణతకు, మరణానికి దారితీస్తుంది. కాళ్ళకు చేతులకు వ్యాయామమివ్వని వ్యక్తి అనతి కాలంలోనే వాటిని ఉపయోగించని స్థితికి దిగజారతాడు. అలాగే దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించడానికి నిరాకరించే వ్యక్తి క్రీస్తు పోలికగా పెరగటంలో విఫలమవ్వడమేగాక, తనకున్న శక్తిని కూడా కోల్పోతాడు.SCTel 62.1

    క్రీస్తు సంఘం మానవుల రక్షణ నిమిత్తం దేవుడు నెలకొల్పిన వ్యవస్థ, సువార్తను లోకానికందించటందానికర్తవ్యం. ఈకర్తవ్యభారం క్రైస్తవులందరిమీదా ఉంది. తమత మసమర్ధతలు అవకాశాలమేరకు ప్రతివారు రక్షకుడిచ్చిన ఈఆదేశాన్ని నెరవేర్చవలసి ఉన్నారు. క్రీస్తుని ఎరుగని ప్రజలకు ఆయన ప్రేమను గురించి చెప్పడానికి మనకు ప్రత్యక్ష పర్చబడ్డ ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నది. దేవుడు మనకు వెలుగునిచ్చాడు. అది కేవలం మనకోసమే కాదు; దేవుని యెరుగని వారికి చూపించడానికి కూడ దాన్ని మనకిచ్చాడు.SCTel 62.2

    క్రీస్తు అనుచరులు తమ విధి ఏమిటో గ్రహించగలిగి ఉంటే అన్యదేశాల్లో సువార్త ప్రకటించడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్న స్థలంలో వేలాదిమంది ఉండేవారే, ఈసేవలో వ్యక్తిగతంగా పాల్గొనలేని వారందరూ ఈ సేవను ద్రవ్య సహాయం, సానుభూతి, ప్రార్ధనలతో బలపర్చగలరు. క్రైస్తవ దేశాల్లో ఆత్మల రక్షణ దిశగా మరెక్కువ కృషి జరుగుతున్నది. క్రీస్తు సేవ చేయడానికి మనంఅన్యదేశాలకు వెళ్ళనక్కరలేదు. గృహపరిసరాల్ని విడిచి పెట్టనక్కర లేదు. సేవను మన కుటుంబ పరిధిలోనే, మన స్నేహితులమధ్య, మన వ్యాపార స్థలాల్లోనే మనం చేయవచ్చు.SCTel 62.3

    యేసు ఇహలోక జీవితంలో సింహ భాగం నజరేతులోని వడ్రంగి శాలలో ఓపికగా పరిశ్రమించడంలో గడిచింది. ఆయన శ్రామికులు కార్మికుల ప్రక్క గుర్తింపుగాని ఆదరణ గానిలేకుండా నడుస్తున్నప్పుడు సేవచేసే దూతలు ఆ ప్రభువుతో నడిచారు. వ్యాధిగ్రస్తుల్నిSCTel 63.1

    బాగుచేసినప్పుడు లేదా తుఫాను తాకిన గలలియా సముద్రంపై నడచినపుడు ఎంత నమ్మకముగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడో అంతే నమ్మకంగా తన సామాన్య వ్యక్తి విధుల్ని ఆయన నిర్వహించాడు. కనుక జీవితములో మిక్కిలి స్వల్పమెన్ల విధిల్లో, హోదాల్లో మనం యేసుతో కలసి నడవవచ్చు, పనిచేయవచ్చు.SCTel 63.2

    అపాస్తుడిలా అంటున్నాడు, “ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగియుండవలెను” (1కొరి7:24) ఒక వ్యాపారస్తుడు నమ్మకంగా వ్యాపారం చేయడం ద్వారా ప్రభువును మహిమపర్చవచ్చు. అతడు నిజంగా క్రీస్తు అనుచరుడె తన కార్యకలాపాలన్నీటిలోనూ తన మతాన్ని కనబర్చి క్రీస్తు స్వభావాన్ని బోధపర్చుతాడు. యంత్ర నిపుణుడు గలలియా కొండ ప్రాంతంలో అతి సామాన వృత్తిలోSCTel 63.3

    శ్రమించిన యేసుకు నమ్మకమైన ప్రతినిధి కావచ్చు. క్రీస్తునామం ధరించిన ప్రతీ వారు తాము చేస్తే మంచి పనులు చూసిన ప్రజలు సృష్టికర్త, విమోచకుడు అయిన క్రీస్తును మహిమ పర్చే విధంగా పనిచేయాల్సి ఉన్నారు.SCTel 63.4

    తమకన్నా ఇతరులకు మేలైన వరాలున్నాయన్న సాకుతో అనేకమంది తమ వరాల్ని క్రీస్తు సేవకు అంకితం చేయడంలేదు. విలక్షణమైన్ల వరాలున్న వారే తమ వరాల్ని దైవ సేవకు అంకితం చేయాల్సివున్నారన్న అభిప్రాయం ప్రచారమౌతుంది. తక్కిన వారిని తోసి రాజుని ఒక ప్రత్యేకతరగతికి చెందిన వారికే వరాలివ్వడం జరుగుతుందని, కృషిలోను, ఫలితంలోనువారు పాలు పంచుకోనవసరం లేదని ఒక భావన ఉంది. అయితే ఉపమానంలో వ్యక్తమైన అభిప్రాయం అదికాదు. గృహ యజమాని తన సేవకుల్ని పిలిచి ప్రతివారికీ వారివారి పని ఇచ్చాడు.SCTel 63.5

    జీవితంలో ప్రాముఖ్యంలేని చిన్న చిన్న విధుల్ని “ప్రభువునిమిత్తం” (కొలస్సి 3:23) ప్రేమా స్వభావంతో నెరవేర్చవచ్చు. హృదయంలో దేవుని ప్రేమ ఉంటే అది జీవితంలో ప్రస్పుటంగా కినిపిస్తుంది. క్రీస్తు పరమళం మనల్ని వరిస్తుంది. మన ప్రభావం ఉద్దరించి మేలు చేసేదిగా పరిణమిస్తుంది.SCTel 63.6

    దైవ సేవ చేసేందుకు గొప్ప తరుణాలకోసం లేక అసమాన్య శక్తి సామర్ధ్యాల కోసం మీరు వేచి ఉండనవసరంలేదు. లోకం మిమ్ములను గూర్చి ఏమి తలస్తుందని కూడ ఆలోచించవలసిన పనికూడాలేదు. మీ విశ్వాసం, చిత్తశుద్ది, నిజాయితీని మీ జీవితం నిరూపిస్తే, మీరు తమ శ్రేయస్సును కోరుతున్నట్లు నమ్మితే, మీ కృషిచాలా మట్టుకు ఫలిస్తుంది.SCTel 63.7

    క్రీస్తు అనుచరుల్లో అతి సామాన్యులు, నిరుపేదలు ఇతరులకు సహాయకారులు కావచ్చు. తాము గొప్ప మేలు చేస్తున్నామని వారు గుర్తించక పోవచ్చు. కాని వారికి తెలియకుండానే వారి ప్రభావం సముద్ర కెరటాలవలే విస్తరిల్లుతుంది. దాని ఫలితాలు అంతిమ ప్రతిఫలానిచ్చే ప్రభువు దినం వరకూ వారికి తెలియకపోవచ్చు. తాము గొప్ప పని చేస్తున్నట్లు వారు ఎరుగరు, భావించరు. జయాన్ని గురించి వారికి ఆందోళన అవసరంలేదు. దేవుడిచ్చిన పనని నమ్మకముగా, నిరాడంబరముగాచేసుకుంటూ ముందుకు సాగడమేవారి పని. అలా చేసిన నాడు వారి జీవితం వ్యర్ధం కాదు. వారి జీవితాలు దినదినం క్రీస్తుపోలికకు మార్పు చెందుతాయి. ఈలోక జీవితములో వారు దేవునితో జత పనివారు గనుక రానున్న నిత్య జీవనంలో ఉన్నతమైన సేవకు, స్వచ్ఛమైన ఆనందానికి అర్హులవుతారు.SCTel 64.1