Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    10వ అధ్యాయం - దేవుని గూర్చిన జ్ఞానం

    దేవుడు నమకు తన్ను తాను బయలు పర్చుకొని మనతో సాంగత్యం చేయడానికి ఎన్నో వీధులుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రకృతి ఎడతెరిపిలేకుండా మన జ్ఞానేంద్రియాలతో సంభాషిస్తుంటుంది. దేవుని హస్త కృత్యాలువెలువర్తిన్న ఆయన ప్రేమ మహిమలు నిష్పక్షపాత హృదయానికి ఎంతోతృప్తినిస్తాయి. ప్రకృతి విన్యాసాలద్వారా దేవుడు పంపే వర్తమానాన్ని వినే చెవి వినగ్రహిస్తుంది. పచ్చని పొలాలు, ఆకాశానం టుతున్న వృక్షాలు, మొగ్గలు, పువ్వులు, పయనించే మేఘాలు,చిటపట పడే చినుకులు, గలగలపారే సెలయేర్లు ఆకాశ విశాలంలోని మహిమలుమన హృదయాన్ని పలకరించి వాటి సృష్టికర్త తో పరిచయానికి మనల్ని ఆహ్వానిస్తున్నాయి.SCTel 65.1

    మన రక్షకుడు విలువైన పాఠాల్ని ప్రకృతిలో గుప్త పరిచాడు. చెట్లు, పక్షులు, కొండ లోయల్లోని పుష్పాలు, కొండలు, సరస్సులు, అందమెన్ల ఆకాశం దైనందన జీవితంలోని సంఘటనలు, పరిసరాలు - ఇవన్నీ దేవుని సత్యవాక్కు లతో జతపడి ఉన్నాయి. మానవ జీవితంలోని శ్రమలు, చింతలనడుమ కూడ దేవుడు ఉద్దేశించిన పాఠాలు తరచు ఇలా స్మృతి పథంలో కదలాడ్డాయి.SCTel 65.2

    తన బిడ్డలమైన మనం తన సృష్టిని అభినందించాలని మన భూలోక గృహాన్ని సాదాగా నిరాడంబరముగా, కాని అందంగా అలంకరించడంలో ఆనందం పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన అందాన్ని ప్రేమిస్తాడు. బాహ్య సౌందర్యంకన్నా గుణ సౌందర్యాన్ని ఆయన ప్రేమిస్తాడు. పవిత్రత, నిరాడంబరతలు పువ్వుల మూగ సొగసు వంటివి. వీటిని సాధించలసిందిగా దేవుడు మనల్ని కోరుతున్నాడు.SCTel 65.3

    మనం వినడానికి ఇష్టపడే దైవ సృష్టి, విధేయత, నమ్మకం గురించి విలువైన పాఠాలు మనకు నేర్పుతుంది. తమకు నిర్దేశించిన మార్గంలో యుగాలు తరబడి అతరిక్షంలో పయనిస్తున్న నక్షత్రాలు మొదలుకొని అతి సూక్షమమైన అణువు వరకు ఉన్న ప్రకృతి జాలం సృష్టినాధుని చిత్తాన్ని నెరవేర్చుతున్నాయి. తాను సృజించిన సమస్తాన్ని దేవుడు పరిరక్షించి పోషిస్తాడు. అంతరిక్షంలో లెక్కకు మించిన లోకాన్ని సంరక్షిస్తున్న దేవుడు జంకులేకుండా పాటలు పాడే పిచ్చుకనుకూడా సంరక్షిస్తాడు. మనుషులు పార్ధనవంటి తమ దిన కార్యకలాపాల్లో నిమగ్నులైనప్పుడు, రాత్రి పడుకొన్నప్పుడు, ఉదయం నిద్రలేచి నప్పుడు ధనవంతుడు తన భయంతో విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నప్పుడు లేదా పేదవాడు తన పిల్లల్ని పోగు చేసుకొని చాలీచాలని భోజనానికి కూర్చున్నప్పుడు పరలోకమందున్నతండ్రిప్రతివారీని ప్రేమతో పరిశీలిస్తాడు. ఆయన ఎరుగని కన్నీళ్లులేవు.SCTel 66.1

    గుర్తించని మందహాసంలేదు.SCTel 66.2

    ఇది వునం పూర్తిగా నమ్మితే మన అనవసర ఆందోళనలన్నీ మటుమాయమౌతాయి. ఇప్పటికి వలే నిరుత్సాహం ఇక ఉండదు. ఎందుకంటే అది చిన్నదేగాని, పెద్దదేగాని మన సమస్తం దేవునికి విడిచిపెడాం. ఈ చింతలు, ఆందోళనలు ఆయనను తికమక పెట్టలేవు. వాటి భారం ఆయనను కృంగదీయలేదు. ఎంతోమందికి దూరమవుతున్న ఆత్మ శాంతి అప్పుడు మనకు లభిస్తుంది.SCTel 66.3

    సుందరమైన ఈ జగత్తు అందాలు చూసి ఆనందానుభూతి పొందుతున్న తరుణంలో పాపం, మరణం ఇక ఉండవని పరలోకం గురించి ఆలోచించండి. అక్కడ ప్రకృతిపై శాప ఛాయలు ఉండనే వుండవు. రక్షణ పొందేవారి నివాసం ఎలా ఉంటుందో ఒకింత ఆలోచించండి. మీ అతిచక్కని ఊహా చిత్రం కన్నా అది ఎంతో ఉజ్వలమైన్ల జీవనం. ప్రకృతిలో దేవుడు మనకిస్తున్న ఉచిత వర్గాల్లో ఆయన మహిమ ప్రకాశత అంతంత మాత్రమే మనకు కనిపిస్తుంది. “దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏమి సిద్దపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు” (1కొరి2:9)అంటున్నది వాక్యం.SCTel 66.4

    ప్రకృతి గురించి కవి, ప్రకృతి శాస్త్రవేత్త ఎన్నో విషయాలు చెప్పుతారు కాని భూమిని ఎక్కువగా అభినందించి దాని అందాన్ని చూసి ఆనందించేవాడు క్రైస్తవుడే. కారణమేటంటే పువ్వులోను, ముళ్ళపొదల్లోను చెట్టులోను దేవుని హస్తకృత్యాన్ని అతడు గుర్తిస్తాడు. కొండను, లోయను, నదిని, సముద్రాన్ని మానవుడి పట్ల దేవుని ప్రేమకు నిదర్శనంగా పరిగణించని వారిపైనా వాటి ప్రాముఖ్యతను పూర్తిగా గుర్తించడంలేదని చెప్పాలి.SCTel 66.5

    తన కృపాకార్యాల ద్వారా తన ఆత్మ ప్రభావం మన హృదయాలపై ప్రసరించటం వల్ల దేవుడు మనతో మాట్లాడతాడు. మన పరిస్థితులు, పరిసరాలు, మన చుట్టూ రోజూ చోటు చేసుకుంటున్న మార్పుల్ని గ్రహించడానికి మన హృదయాలు సిద్ధంగా ఉన్నట్లయితే మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. తన కృపా బాహుళ్యాన్ని బట్టి దేవుని కొనియాడుతూ కీర్తనకారుడిలా అంటున్నాడు, “లోకమ యెహోవా కృపతో నిండియున్నది”(కీర్త33:5) “బుద్దిమంతుడెన్ల వాడు ఈ విషయములో ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక’‘ (కీర్త 107:43).SCTel 67.1

    దేవుడు తన వాక్యంద్వారా మనతో మాట్లాడతాడు. వాక్యంలో ఆయన ప్రవర్తన, ప్రత్యక్షత, మనుషులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు, విమోచనా మహత్కార్యం గురించిSCTel 67.2

    మనకు స్పష్టమైన వివరణ ఉన్నది. పూర్వం పితరులు, ప్రవక్తలు, పరిశుద్ధ జనుల చరిత్ర మనముందున్నది. వారు “మనవంటి స్వభావముగవ మనుష్యులే” (యాకోబు 517) మనం గురవుతున్న ఆశా భంగాలకే వారు గురయ్యారు. మనకు వలే వారుకూడ శోధనకు లొంగారు. అయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని దేవుని కృపవల్ల విజయం సాధించారు. వారిని చూసి ధైర్యం తెచ్చుకుని, నీతి కోసం ప్రయాసపడడానికి మనలో ఉత్సాహం కలుగుతుంది. వారికి కలిగిన అనుభవాల్ని, వారు పొందిన వెలుగు, ప్రేమ, దీవెనను, కృప ద్వారా వారు సాధించినకార్యాలు, వారినిఆవేశపర్చిన ఆత్మను గురించి చదువుతున్నప్పుడు వారి మాదిరిని అనుసరించాలన్న కోరిక, వారి ప్రవర్తన వంటి ప్రవర్తన కావాలన్న తపన, వారికి వలే దేవునితో నడవాలన్న ఆశ మనలో ఒక జ్వాల అయి మండుతుంది.SCTel 67.3

    పాత నిబంధన లేఖనాల్ని గురించి - క్రొత్తనిబంధన లేఖనాల్ని గురించి కూడ ఇదే నిజం - యేసు ఇలా అన్నాడు, “అవే నన్ను గూర్చిసాక్ష్యమిచ్చుచున్నవి” (యోహాను 5:39) ఆయనే మన రక్షకుడు. నిత్యజీవానికి మన నిరీక్షణ ఆయనే. ఔను, బైబిలు యావత్తు క్రీస్తును గురించే చెబుతున్నది. “కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు” అన్న మొదటి దాఖలా లగాయితు” ఇదిగో త్వరగా వచ్చుచున్నాను” (ప్రకటన 22:12) అన్న చివరివాగ్దాసంవరకుఆయనపనుల్ని గురించి చదువు చున్నాము.SCTel 67.4

    ఆయన స్వరం వింటున్నాము. రక్షకునితో పరిచయంకావాలని ఆశించి నట్లయితే పరిశుద్ధ లేఖనాలు అధ్యయనం చేయండి.SCTel 67.5

    దైవ వాక్కులతో మీ హృదయాన్ని నింపుకోండి. అవి మీదాహాన్ని చల్లార్చగల జీవ జలాలు, పరలోకంనుంచి వస్తున్న జీవాహారం. “మీరు మనుష్యకుమారుని శరీరము తిని, ఆయన రక్తము త్రాగితేనేకానీ మీలో మీరు జీవముకలవారు కారు” (యోహాను 653) అన్నాడు యేసు. దీన్ని ఇలా విశదపర్చుతున్నాడు, “నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు, జీవమునెయున్నవి” (యోహాను 6:63) మన శరీర నిర్మాణం మన ఆహార పానియాల్ని బట్టి ఉంటుంది. స్వాభావిక విషయాల్లో ఎలాగో ఆధ్యాత్మిక విషయాలోనూ అలాగే మనం దేనిమీద ధాన్యం నిలుపుతామో అది మన ఆధ్యాత్మిక వెళ్తరిని, శక్తిని రూప కల్పన చేస్తుంది.SCTel 67.6

    దేవదూతలు రక్షణాంశాన్ని పరిశీలించడానికి ముచ్చట పడతారు. అనంత కాలములో యుగయుగాలుగా ఇదే రక్షణ పొందిన జనులు అధ్యయనం చేయనున్న శాస్త్రం, పాడనున్న గానం. అందుచేత ఇది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అధ్యయనం చేయాల్సిన అంశం కాదా? యేసు అపారప్రేమ, మనకోసం ఆయన ఆత్మార్పణం, ఇవి మనం తీవ్రంగా పరిగణించవలసిన అంశాలు. మన ప్రయతమ విమోచకుడు, ఉత్తరవాది అయిన యేసు శీలంపే మనం ధ్యానం నిలపడం అవసరం. ప్రజల్ని తమ పాపాలనుంచి రక్షించేందుకు అవతరించిన ఆ ప్రభువు చేపట్టిన కార్యంపై మన దృష్టిని నిలపాలి. ఇలా పరలోక విషయాలపై మనం ధ్యానం నిలిపేకొద్దీ మన విశ్వాసం, ప్రేమా పటిష్టమౌతాయి. మన ప్రార్ధనలు దేవునికి మరింత ప్రీతికరంగా పరిణమిస్తాయి. ఎందుచేతనంటే అవి విశ్వాసంతోను, ప్రేమతోను మిళితమే పట్టుదల, విజ్ఞతతో కూడిన ప్రార్ధనలౌతాయి. వారికి యేసుపై మిక్కిలి స్థిరమైన్ల నమ్మిక కలుగుతుంది. తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారని సంపూర్ణంగా రక్షించడానికి యేసు శక్తిమంతుడని దినదినమూ నమ్మేందుకు వారికి ప్రత్యక్షానుభవం కలుగుతుంది.SCTel 68.1

    రక్షకును సంపూర్ణత్వంపై ధ్యానించే కొద్దీ పూర్తిగా మార్పు చెంది ఆయన పవిత్ర స్వరూపానికి మారాలని మనం ఆకాంక్షిస్తాము. మనం ఆరాధిస్తున్న ఆ ప్రభువు పోలికగా పరివర్తన చెందడానికి ఆత్మ ఆకలి దప్పులు గొంటుంది. క్రీస్తుమీద మన ధ్యానం ఎంత ఎక్కువగా నిలిస్తే ఆయనను గురించి పరులతో అంత ఎక్కువగా మాట్లాడతాం, అంత ఎక్కువగా ఆయన్ని లోకానికి కనబర్చుతాం.SCTel 68.2

    బైబిలు కేవలం విద్వాంసుల కోసమే వ్రాయబడిందికాదు. ఇంకా చెప్పాలంటే అది సామాన్య ప్రజానీకానికి ఉద్దేశించబడింది. రక్షణకు అవసరమైన మహత్తర సత్యాలు వట్టవగలులా విశదంగా కనిపిస్తున్నాయి. స్పష్టంగా, గోచరిస్తున్న దెపై చిత్తానికి బదులు తమసొంతతీర్మానాన్ని అనుసరించేవారుతప్ప ఇంకెవరూఅపోహపడిదారితప్పేవారుండరు.SCTel 68.3

    లేఖనాలు బోధిస్తున్నదేమిటి? అన్న విషయంపై మనం ఎవరి సాక్ష్యాన్ని అంగీకరించ కూడదు. దైవ వాక్కుల్ని మనంతటమనమే పరిష్కరించాలి. మనం చేయాల్సిన ఆలోచనను ఇతరులకు విడిచిపెడే మన శక్తి కుంటువడుతుంది. మన స్వార్ధాలు క్షీణిస్తాయి. ధ్యానానికి అర్హమైన అంశాలపై మానసిక శక్తుల వ్యాయామం జరగకుంటే, అవి క్షీణించి దైవ వాక్యం లోతైన భావాన్ని గ్రహించే శక్తిని కోల్పోతాయి. లేఖనంతో లేఖనం ఆధ్యాత్మిక సంగతులతో ఆధ్యాత్మిక సంగతులు సరిపోల్చుతూ, ఆయా బేబీలు అంశాల సంబంధాన్ని గ్రహించడంలో నిమగ్నమె మనస్సు వృద్ధి చెందుతుంది.SCTel 69.1

    బుద్ధిని బలోపేతం చేయడంలో లేఖన పఠనాన్ని మించిన సాధనం మరొకటిలేదు. బైబిలులో విశాల, ఉదాత్తసత్యాలుఆలోచల్ని ఉన్నతం చేసి, మానసిక శక్తుల్ని పటిష్టపర్చేశక్తి గలవి. ఏ ఇతర గ్రంథమూ ఈకార్యాన్ని సాధించలేదు. దైవ వాక్యాన్ని పఠించాల్సిందిగా పఠిస్తే మనుషుల మన సువిశాలవువుతుంది. ప్రవర్తన ఉదాత్తమవుతుంది. నేడు అరుదుగా కనిపించే స్థిరమైన్ల కార్యదీక్ష వారిలో చోటు చేసుకుంటుంది.SCTel 69.2

    అయితే లేఖనాన్ని ఆదరాబాదరగా పఠించటం వల్ల ప్రయోజనమేదీ ఉండదు. ఒక వ్యక్తి బైబిలును సంపూర్ణముగా చదివినా దాని రమ్యతను చూడలేకపోవచ్చు లేదా దాని అంతరార్ధాన్ని గ్రహించలేకపోవచ్చు. ఒక వాక్యభాగాన్ని దాని ప్రాముఖ్యత మనసుకు తేటతెల్లమె, రక్షణ ప్రణాళికతో దాని సంబంధం స్పష్టమెయ్యేంతవరకు అధ్యయనం చేయడం, ఖచ్చితమైన ఉద్దేశం లేకుండా సానుకూలమైన ఉపదేశం పొందకుండా, కొన్ని అధ్యాయాలు యధాపాలంగాచదవడం కన్నా ఎంతో లాభదాయకమవుతుంది. బైబిలుని దగ్గరుంచుకుని సమయం దొరికినప్పుడల్లా పఠించండి. వచనాల్ని కంఠస్తం చేయడం, వీధుల్లో నడిచేటప్పుడు సయితం ఒక వాక్య భాగాన్ని పఠించి, దానిపై ధ్యానించి, తద్వారా దాన్ని మనసులో నాటింపజేసుకోవచ్చు.SCTel 69.3

    ఏకాగ్రత, ప్రార్ధనాపూర్వక పఠనం లేకుండా జ్ఞానాన్ని ఆర్జించలేం. కొన్ని లేఖన భాగాలు సునాయాసంగాగ్రాహితమవుతాయి. కానికొన్నింటికి అర్ధం ఒకసారి చదివితే గ్రాహ్యమయ్యేంత సులువుగా లభించదు. లేఖనాన్ని లేఖనంతో పోల్చటం అవసరం. నిశితమైన పరిశోధనా, ప్రార్ధనాపూర్వక ధ్యానం అవసరం. ఇట్టి వాక్యాపఠనం ఎంతో లాభదాయకం. భూర్భములో నిక్షిప్తమైయున్న ప్రశక్త లోహ నాళాన్ని గని కార్మికుడుకనుగొనే రీతిగా వాక్యంలో జాగ్రత్తగా వెదికే వారికి కనిపించకుండా నిక్షిప్తమై ఉన్న సిరులకోసం వెదికే వ్యక్తి విలువైన్ల సత్యాన్ని కనుగొంటాడు. ఆవేశంతో నిండిని దేవ వాక్కుల్ని హృదయం ధ్యానిస్తే అవి జీవపు ఊట నుంచి ప్రవహించే సెలయేళ్ళవలే ఉంటాయి.SCTel 69.4

    ప్రార్ధన లేకుండా బైబిలు పఠనాన్ని ప్రారభించకూడదు. బైబిలు పుటలు తెరవక ముందు పరిశుద్దాత్మ చైతన్యం కోసం ప్రార్ధించండి. దేవుడు అనుగ్రహిస్తాడు. నతానియేలు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నాడు, “ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయడు, ఇతని యందు ఏకపటమూలేదు” అందుకు నతానియేలు “నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు?” అనగా, “ఫిలిప్పు నిన్ను పిలవకమునుపే ఆ అంజూరపు చెట్టుక్రింద వున్నప్పుడే నిన్ను చూచితిని’‘ (యోహాను 147,48) అని యేసు బదులు పలికాడు. సత్యాన్ని తెలుసుకునేందుకు సహాయమందించమని ఆయనను ఆర్ధిస్తే యేసు మనల్నికూడ రహస్య ప్రార్ధనా స్థలాల్లో చూస్తాడు. దేవుని మార్గ దర్శకత్వము కోసం వినయ మనస్సుతో వెదికే వారితో మహిమలోక దూతలు ఉంటారు.SCTel 70.1

    పరిశుద్ధాత్మ రక్షకుని హెచ్చించి మహిమపర్చుతాడు. యేసును, ఆయన పవిత్రనీతిని, ఆయన ద్వారా మనకుగల రక్షణను మనకు సమర్పించడమే పరిశుద్ధాత్మ నిర్వహించే అధికారిక బాధ్యత. ‘’ఆయనా వాటిలోనివి తీసుకొని మీకు తెలియ జేయును” (యోహాను 16:14). సత్య స్వరూపిఅయిన ఆత్మ ఒక్కటే దైవ సత్యాన్ని శక్తివంతంగా బోధించగల ఉపాధ్యాయుడు. మానవాళికోసం మరణించడానికి తన కుమారుని అర్పించి మానవుడి ఉపాధ్యాయునిగా, మార్గదర్శకుడిగా ఉండేందుకు తన ఆత్మను వినియోగించిన దేవుడు మన జాతిని ఎంతగా అభిమానిస్తుంది!SCTel 70.2