Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    13వ అధ్యాయం - ప్రభువునందు ఆనందం

    దేవుని ప్రజలు క్రీస్తుకు రాయబారులుగా ఉంటూ ఆయన మంచితనాన్ని కృపను ప్రదర్శించడానికి ఆహ్వానితులు. యేసు తండ్రి ప్రవర్తనను బయలుపర్చు తున్నట్లే మనంకూడ క్రీస్తు కరుణాకటాక్షాలు ప్రేమానురాగాలు ఎరుగని వారికి ఆయనను బయలుపర్చాల్సివున్నాం. ‘’నీవు నన్ను లోకమునకుపంపిన ప్రకారము నేనునూ వారిని లోకమునకు వంపితిని’‘ అన్నాడు యేసు. “వారి యందు నేనునూ నాయందు నీవును ఉండుట వలన నీవు నన్ను పంపితివని లోకము తెలుసుకొనునట్లు” (యోహాను 17:18-23),SCTel 88.1

    అపొస్తలుడైన పౌలు యేసు శిష్యులకు ఇలా ఉద్భోధిస్తున్నాడు. “మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు”(2కొరింథి3:2,3)తన బిడ్డల ప్రతీ ఒక్కరిలోను యేసు లోకానికి ఒక లేఖ పంపుతున్నాడు. మీరు క్రీస్తు అనుచరులెల్లే మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మీ వీధికి మీకు ఒక ఉత్తరాన్ని పంపుతున్నాడు. మీలో నివశిస్తున్న క్రీస్తు తనతో పరిచయం లేని వారి హృదయాల తో మాట్లాడగోరుతున్నాడు. వారు బైబిలు చదవకపోవచ్చు, బైబిలు పుటల్లో నుండి వినవచ్చే స్వరాన్ని వారు వినకపోవచ్చు దైవ కార్యాలద్వారా వ్యక్తమౌతున్న ప్రేమను వారు చూడలేకపోవచ్చు. ఏమేన్టి మీరు యేసుకు నిజమెన్ల రాయబారి అయితే ఆయన మంచితనాన్ని కొంతవరకు మీద్వారా వారు గ్రహించి ఆయనను ప్రేమించి ఆయన సేవ చేయడానికి సాధ్యపడుతుంది.SCTel 88.2

    క్రైస్తవులు పరలోక మార్గంలో వెలుగు నింపేవారు. తమ ప్రకాశిస్తున్న క్రీస్తు వెలుగునువారు లోకానికి ప్రతిఫలింపజేయాల్సివున్నారు. వారి జీవిత సరళి, ప్రవర్తనను బట్టి క్రీస్తును, ఆయన సేవను గూర్చి ఇతరులు సరియైన అభిప్రాయం ఏర్పరచుకోగలిగి ఉండాలి. మనం క్రీస్తుకు రాయబారులమైతే, ఆయన సేవను ఆకర్షణీయం చేస్తాం. నిజం చెప్పాలంటే అది ఉత్సాహభరిత సేవ. భారంగా, విచారంగా మసలుతూ సణుగుకొంటూ గొణుగుకొంటూ ఫిర్యాదులు చేసేవారు దేవుని గురించి క్రైస్తవ జీవితం గురించి ఇతరులకు దురభిప్రాయం కలిగిస్తున్నారు. తనబిడ్డలుసంతోషంగా నివశీంచటం దేవునికి ఇష్టంలేదన్న అభిప్రాయాన్ని వారు కలిగిస్తారు. ఈ విధంగా వారు దేవునికి వ్యతిరేకముగా అబద్ద సాక్ష్యం పలుకుతారు.SCTel 89.1

    దేవుని బిడ్డల్లో అపనమ్మకం నిస్పహ పుట్టించగలిగినప్పుడు సాతాను ఎంతో సంతోషిస్తాడు. దేవుని మనం అనుమానించటం, మనల్ని రక్షించేందుకు ఆయనకున్న శక్తి సామర్థ్యాన్ని శంకించి చూడడం అతడికి అమితానందం. తన కార్యాలవల్ల మనకు హాని కలిగించడమే దేవుని ఉద్దేశమని మనల్ని నమ్మించడానికి చూస్తాడు. ప్రభువు దయ, కనికరాలు లేనివానిగా చిత్రించడానికే సాతానుడీ అవిశ్రాంతకృషి, దేవుని గూర్చిన సత్యాన్ని అదే పనిగా వక్రీకరిస్తాడు. దేవుని విషయమె మనసులో తప్పుడు ఊహలు అభిప్రాయాలు పుట్టిస్తాడు. అప్పుడు మన పరమ జనకుని గూర్చిన సత్యాలపై మనసు నిలవడానికి బదులుసాతాను సృష్టించే అపోహలపై మనస పెట్టి దేవుని శంకిచటం, ఆయ నను గూర్చి గొణుగుకోవటం చేస్తాం. మన మతపరమెన్ల జీవితంలో సంతోషం లేకుండా చేయడానికి సాతాను సర్వదా ప్రయత్నిస్తునేవుంటాడు. అదీ శ్రమతో, కష్టంతో కూడిన పనిగా కనిపించేటట్లు చేస్తాడు. మతాన్ని గూర్చి క్రైస్తవుడు తన నమ్మకం ద్వారా ఈ దృక్పధాన్ని కనబర్చితే అతడు సాతాను అబద్ధానికి మద్దతు పలుకుతున్నట్లే..SCTel 89.2

    దేవుని ప్రేమను శంకించి ఆయన వాగ్దానాలని నమ్మనట్లు కనిపించినప్పుడు మనం దేవుని అగౌరవపర్చి పరిశుద్ధాత్మను దుఖ:పరుస్తున్న వారమవుతాము. ఒక తల్లి తన జీవితమంతా తనబిడ్డలమంచికోసం సదుపాయంకోసం ధారపోసినప్పుడు తన బిడ్డలు ప్రతి నిత్యం ఆమె గురించి ఫిర్యాదులు చేస్తుంటే ఆమె ఏమనుకుంటుంది? ఆమె ప్రేమ నిజమైనదికాదని వారు నమ్మరనుకుందాం. అది ఆమె హృదయాన్ని బద్దలుకొడు తుంది.SCTel 89.3

    తన బిడ్డలు ఇలా వ్యవహరిస్తే ఏ తండ్రి అయినా ఎలా స్పందిస్తాడు? మనకు జీవం కలిగేందుకు గాను మనపట్ల తనకున్న ప్రేమను బట్టి తన అద్వితీయ కుమారుని అర్బీంచిన మన పరమ జనకుని ప్రేమను మనం శంకించినపుడు ఆయన మనల్ని ఎలా వరిగణిస్తాడు? అపొస్తలుడిలా వ్రాస్తున్నాడు, “తనసొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? “(రోమా 8:32) అయినా ఎందరు తమ మాటల్లో కాకపోయినా తమ క్రియల్లో ఇలా అంటున్నారు, “నావిషయములో ఇది ప్రభువుచిత్తం కాకపోవచ్చు. ఆయన ఇతరుల్ని ప్రేమిస్తున్నాడేమోగాని నన్ను మాత్రం ప్రేమించలేదు”..SCTel 89.4

    ఇదంతా మీ ఆత్మకే హానికరం. మీరు వెలుబుచ్చే ప్రతి సందేశం సాతాను శోధనకు ఆహ్వానం. మీలో సంశయించే తత్వాన్ని అది బలోపేతం చేస్తుంది. సేవలందించే దూతల్నిదుఖ:పర్చిమీవద్దనుంచి తరిమివేస్తుంది. సాతాను మిమ్ములను శోధించినపుడు సందేహాల్ని సూచించే ఒక్క మాటకూడ పలకకండి. అతడి సలహాలకు తలుపు తెరవడానికి మీరు ఎంపిక చేసుకుంటే మీలో అపనమ్మకం చోటుచేసు కుంటుంది. మీరు తిరుగుబాటు ధోరిణిలో ప్రశ్నించటం మొదలుపెడతారు. మీరు మీ మనో భావాలు వ్యక్తంచేస్తే, మీరు వెలిబుచ్చే ప్రతీ సంశయం మీపే ప్రతి స్పందించడమే కాక, అది ఒక విత్తనంగా పరిణమించి మొలకెత్తి ఇతరుల జీవితంలో ఫలాలు ఫలిస్తుంది. మీ మాటల ప్రభావాన్ని నిర్వీర్యంచేయడం అసాధ్యం. సాతాను శోధననుంచి ఉరుల నుంచి మీరు తప్పించుకోవచ్చునేమోగాని మీ ప్రభావం స్పశించిన వారందరూ మీరు రగిలించిన అవిశ్వాసజ్వాలల నుంచి తప్పించుకోలేకపోవచ్చు. మనం ఆధ్యాత్మిక శక్తిని జీవాన్ని ఇచ్చే మాటలే మాట్లాడడం ఎంతో ప్రాముఖ్యం.SCTel 90.1

    మీపరమగురువుయేసుని గూర్చి లోకానికి మీరు ఎలాంటి నివేదికను సమర్పిస్తున్నారో తెలుసుకోవడానికి దేవదూతలు అతిశ్రద్ధగా వింటున్నారు. మీ పక్షంగా తండ్రిముందు విజ్ఞాపన చేయడానికి జీవిస్తున్న ఆ ప్రభువు గురించే సంభాషణ జరగనీయండి. ఒక స్నేహితునితో కరచాలనం చేసినపుడు మీ పెదవులపై నుంచి, మీ హృదయంలోనుంచి దేవ సంస్తుతి మాటలు వెలువబడనీయండి. అతడి తలంపులు యేసుపై కేంద్రీకృతం కావడానికి ఇది తోడ్పడుతుంది. శ్రమలు అందరికి కలుగుతాయి. భరించలేని దుఖాలు, జయించలేని శోధనలు ఎదురవుతాయి. మీ కష్టాల్ని మీతోటి మానవులకు చెప్పుకోక వాటన్నిటినీ ప్రార్ధన ద్వారా దేవునికి నివేదించుకోండి. సందేహం, నిరాశ వెలిబుచ్చే ఒక్క మాటకూడ పలకకూడదన్న నియమాన్ని పాటించండి. నిరీక్షణ పుట్టించి, ఆనందాన్ని కలిగించే మాటలు మాట్లాడడం ద్వారా ఇతరుల జీవితాన్ని ఉత్తేజపర్చి వారి కృషికి చేయూతనివ్వడంలో మీరు ఎంతో సాయం చేయగలుగుతారు.SCTel 90.2

    స్వార్ధంతో, దుష్ట శక్తులతో పోరాటంలో శోధన తీవ్ర వత్తిడికి గురై కూలిపో వడానికి దాదాపు సిద్దంగావున్న వీరులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తి జరుపుతున్న పోరాటంలో తడిని నిరుత్సాహపర్చవద్దు. ధైర్యం, నిరీక్షణ కలిగించే మాటలతో అతనిని ఉద్రేకపర్చి ముందుకు సాగమంటూ ప్రోత్సహించండి. ఈ విధంగా క్రీస్తువెలుగు మీనుంచి ప్రకాశించవచ్చు. “మనలో ఎవడును తనకోసమే బ్రతకడు’‘ (రోమా14:7) మనకు తెలియ కుండానే మనం చూసే ప్రభావం వల్ల ఇతరులు ఉద్రేకాన్ని, బలాన్ని పొందవచ్చు. లేదా అధైర్యంచెంది క్రీస్తునుంచి, సత్యంనుంచి వెనుదిరిగి పోవచ్చు. క్రీస్తు జీవితం, శీలాన్ని గురించి పెక్కుమందిలో తప్పుడు అభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ఆయనలో ఉత్సాహం, ఉద్రేకం లేదని, యన కొరకొరలాడుతూ కఠిన ముఖ వైఖరితో ఉంటాడనీ, సంతోషం లేని వాడని వారి ఊహ. ఈ దురభిప్రాయాలు పెక్కు సందర్భాలలో మతానుభావాన్ని పూర్తిగా మార్చివేస్తాయి..SCTel 91.1

    యేసు కన్నీళ్ళు విడిచాడని ఆయన ఎన్నడూ మందహాసం చేయలేదని తరచు వింటాం. మనరక్షకుడు నిజంగా వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించిన వాడుగాను జీవించాడు. ఎందుకంటే మనుషుల విచారాలు, దుఖాలు ఆయన హృదయాన్ని బహుగా గాయపర్చాయి. ఆయన జీవితం ఆత్మ ఉపేక్షతోను, చింతల బాధలతోను నిండి ఉన్నప్పటికీ ఆయన మానసికంగా కుంగిపోలేదు. ఆయన ముఖంలో దుఃఖం బాధల ఛాయలు కనిపించలేదు. ఆయన ముఖంలో శాంతి ప్రశాంతతలు ఉట్టిపడేవి. ఆయన హృదయం జీవపు ఊటల నిలయం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ విశ్రాంతి, సమాధానం, సంతోషం, ఆనందాన్ని పంచాడు.SCTel 91.2

    మన రక్షకుడు గంభీరత, చిత్తశుద్ధి కనపర్చాడు. విచారం, అసంతృప్తి ఎన్నడూ కనపర్చలేదు. ఆయనను అనుకరించేవారి జీవితంలో చిత్తశుద్ధితో కూడిన కార్యదీక్ష ఉంటుంది. వ్యక్తి విషయంలోవారికి నిబద్ధత ఉంటుంది. నిర్లక్ష్య స్వభావాన్ని పెరగ నీయరు. అల్లరితో కూడిన వినోదం అసభ్య హాస్యం ఉండవు. యేసు మతంలో సమాధానం నదిలా ప్రవహిస్తుంది.అది ఉత్సాహజ్వాలనుర్పివేయదు. ఆనందాన్ని నియంత్రించదు. ముఖం మీదచిరునవ్వునుమరుగువర్చదు. క్రీస్తువచ్చింది సేవచేయడానికేగాని, సేవచేయించు కోవడానికి కాదు.హృదయంలో ఆయన ప్రేమరాజ్యమేలినప్పుడు మనంఆయన ఆద ర్మాన్ని అనుసరిస్తాం.SCTel 91.3

    ఇతరులు చేసిన అన్యాయాల్ని చూపిననిర్ధయను మరిచిపోకుండా మనసులో ఉంచుకుంటే క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నట్లు వారిని ప్రేమించటం మనకు కష్టమౌతుంది. అలాకాక, మనపట్ల క్రీస్తు ప్రేమ కనికరాల్ని మననం చేసుకున్నట్లయితే అదే స్పూర్తితో మనం ఇతరులకు సేవచేస్తాం, ఇతరులలోని పొరపాట్లు అసంపూర్ణతలు మనకు కొట్టుకొచ్చినట్లు కనిపిస్తున్నా, మనం ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకోవాలి. వినయ మనస్సు, సార్థోపేక్ష పెంపొందించు కోవాలి. ఇతరుల అపరాధాల విషయంలో సహనం, దయాళూ త్వం చూపించాలి. ఇది స్వార్ధాన్ని నిర్మూలించి మనల్ని విశాలహృదయుల్ని ఉదార స్వభావుల్ని చేస్తుంది.SCTel 91.4

    కీర్తనకారుడిలా అంటున్నాడు, “యెహోవాయందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివశించి సత్యము ననుసరించుము” (కీర్త37:3) “యెహోవా యందునమ్మికయుంచుము” ఏనాటిభారాలు, చింతలు, ఆందోళనలు ఆనాటికి ఉంటాయి. మనం ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు పరస్పర కష్ట సుఖాల్ని గురించి సహజంగా మాట్లాడుకుంటాము. ఎరువు తెచ్చుకున్న కష్టాలెన్నో అందులో వుంటాయి. ఎన్నో భయాందోళనలు వ్యక్తమవుతాయి. మన కష్టాల మొర ఆలకించి, మనప్రతీఅవసరములో సహాయం చేయడానికి దయగల, ప్రేమగల రక్షకుడు లేడా అని ఎవరైనా భావించేటట్లు వాటిని హావ భావాలతో ఆంధోళనగా నివేదిస్తాం.SCTel 92.1

    కొందరైతే నిరంతరం భీతి చెందుతూ లేనిపోని శ్రమలు తెచ్చిపెట్టుకుంటారు. ప్రతి దినమూ దైవ ప్రేమా చిహ్నాలు వారిచుట్టూవుంటాయి. ప్రతి దినమూ ఆయన అనుగ్రహించేసదుపాయాల్ని అనుభవిస్తుంటారు. కాని ఆ ఉపకారాన్ని వారు విస్మరిస్తారు. నిత్యమూవారిమనసులుఏదో అ ప్రియమెన్లదాన్నిగురించి ఆలోచించి అదిజరుగు తుందని భయపడతారు. లేదా ఏదో సమస్య ఏర్పడవచ్చు. అది చిన్నదే అయినా తాము పొందిన మేళ్ళ నిమిత్తము కృతజ్ఞతలు తెలపకుండా అది వారికి గుడ్డితనము కలిగిస్తుంది. తమకు ఎదురయ్యే సమస్యలు వారిని దేవుని చెంతకు నడిపించే బదులు ఆయన నుంచి వేరు పర్చుతాయి. ఎందుకంటే అవి అశాంతిని, ఆందోళనను రేపుతాయి.SCTel 92.2

    ఇలా అవిశ్వాసం కనపర్చడం మంచిదేనా? మనం కృతఘ్నులం, అవిశ్వాసులం ఎందుకవ్వాలి? యేను మన మిత్రుడు. మన సంక్షేమం పరలోకవాసులకు అమితాసక్తి. మన అనుదిన జీవిత ఆంధోళనలు ఆవేదనలు మనసును పాడుచేసి మొద్దుబార్బనీయ కూడదు. అలా జరగనిస్తే మన ఉద్రేకాన్ని, ఉద్వేగాల్ని రెచ్చగొట్టేది ఏదో ఒకటి ఎన్నడూ ఉంటూనే ఉంటుంది. కష్టాలు భరించడంలో తోడ్పడకపోగా మనల్ని బలహీనపర్చే ఆంధోళనలకు మనం గురి కాకూడదు. వ్యాపారంలో మీకు ఆందోళనలు కలుగవచ్చు. వ్యాపారంలో మీభవిష్యత్తు ఏమంత ఉజ్వలంగాకనిపించకపోవచ్చు. నష్టం వస్తుందన్న జంకుపుట్టవచ్చు. అయినా నిరుత్సాహపడవద్దు. మీఆంధోళన, చింతదేవుని ముందు ఉంచి ప్రశాంతముగా సంతోషముగా నుండండి. మీ వ్యవహారాల్ని విజ్ఞతతో నిభాయించి నష్టం వాటిల్లకుండా చూసేందుకు వివేకంకోసం ప్రార్థించండి. మంచి ఫలితాలు సాధించడానికి మీశక్తి మేరకుకృషి చేయండి. యేసు తన సహాయాన్ని వాగ్దానం చేస్తున్నాడు. కాని అది మన వంతు కృషి చేసిన తకువాతే మన సహాయకుడు, యేసుపై ఆధారపడి మీ శక్తి మేరకు కృషి చేసిన మీదట కలిగే ఫలితాన్ని సంతోషంగా అంగీకరించండి.SCTel 92.3

    తన ప్రజలు చింతలతో కృంగిపోవాలన్నది దేవుని చిత్తంకాదు. మన ప్రభువు మనల్ని వంచించడు. “భయపడకుడి, మీ మార్గములో అపాయములులేవు” అని మనతో చెప్పడు. శ్రమలు, అపాయాలు పొంచివున్నాయని ఆయనకు తెలుసు. ఆయన మనతో దాపరికం లేకుండా వ్యవహరిస్తాడు. తన ప్రజల్ని పావం, దుర్మాగత నిండిన ఈ లోకంలో నుంచి తీసుకుపోతానని ఆయన అనడంలేదుగాని వారికి నిత్య ఆశ్రయ దుర్గాన్ని చూపిస్తాడు. తన శిష్యులకోసం ఆయన ఇలా ప్రార్థన చేసాడు, “నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్ధించుటలేదుగాని, దుష్టునినుండి వారిని కాపాడుమని ప్రార్ధించుచున్నాను” “లోకములో మీకు శ్రమలు కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేనులోకమునుజయించియున్నాను’‘ (యోహాను17:15,16:33) అంటున్నాడాయన.SCTel 93.1

    దేవునియందు నమ్మకముంచడం అవసరం అన్న అంశంపే క్రీస్తు తన శిష్యులకు కొండమీది ప్రసంగంలో విలువైన పాఠాలు నేర్పించాడు. ఆ పాఠాలు అన్ని యుగాల్లోని దైవ జనులకోసం ఉద్దేశించబడ్డాయి, ఉపదేశం, ఆదరణ, అందించేందుకు అవి ఇప్పుడు మనకు వస్తున్నాయి. చీకు చింతా లేకుండా స్తుతి గీతాలు పాడుకుంటూ ఆకాశ విశాలంలో ఎగిరే పక్షుల వంక చూపిస్తూ తన అనుచరులతో యేసు ” అవి విత్తవు, కోయవు” అన్నాడు. అయినాపరమ జనకుడు వాటికి ఆహారం సమకూర్చుతున్నాడు. “మీరు వాటికంటే బహు శ్రేష్ఠులుకారా?” (మత్తయి6:26) ప్రశ్నిస్తున్నాడు రక్షకుడు. విశ్వపోషకుడెన్ల దేవుడు తన చేయి తెరచి మానవులు, జంతువులు సమస్త ప్రాణులకు పోషణ కల్పిస్తున్నాడు. ఆకాశ పక్షులుకూడ ఆయన గుర్తింపును పొందాయి. ఆయన వాటినోళ్ళలోనికి ఆహారం విడువడు, గాని వాటి అవసరాలు తీర్చడానికి ఏర్పాట్లు చేస్తాడు. వాటినిమిత్తం ఆయన చెల్లాచెదురుచేసిన గింజల్ని అవి ఏరుకొని తినాలి, తమ బుల్లిబుల్లి గూడులకు అవసరమైన్ల సామాగ్రిని అవి సమకూర్చుకోవాలి. అవి తమ పక్షి కూనల్ని సాకుకోవాలి. అవి పాటలు పాడుకుంటూ పనికి వెళ్ళిపోతాయి, ఎందుకంటే, ‘‘మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు “మీరు వారికంటే బహు శ్రేష్టుకారా?”SCTel 93.2

    జ్ఞానంగల ఆధ్యాత్మిక ఆరా ధికులుగా మీరుఆకాశ పక్షులకన్నా ఎక్కువ విలువేన్లవారు కారా? మన సృష్టికర్త,మన జీవానికి ఆధారభూతుడు, తన స్వరూపంలో మనల్ని సృజించినవాడు అయినా దేవుడు తనను నమ్మిన మనకు అవసరమైన్ల వాటిని అనుగ్రహించడా? పొలంలో విస్తారంగా పెరిగే అందమైన పువ్వులపైకి శిష్యుల గమనాన్ని త్రిప్పాడు క్రీస్తు,SCTel 94.1

    మానవుల యెడల తన ప్రేమకు ప్రతీకగా ఆయన వాటిని సూచిస్తున్నాడు. “అడవి పువ్వులు ఎలాగు పెరుగుచున్నవో ఆలోచించుడి అన్నాడు ఆయన. సామాన్యమైన, స్వాభావికమెన్ల ఈ పువ్వుల సౌందర్యం సొలోమోను రాజు వైభవం కన్నా ఎంతో గొప్పది. మానవ కళా నైపుణ్యం ఉత్పత్తి చేయగల అతి రమ్యమైన వస్త్రం, దేవ సృష్టిలోని అతి సామాన్యమైన, సుందరమైన పువ్వులతో సరితూగలేదు. “నేడుండి, రేపు పొయ్యిలో వేయబడుడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించిన యెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయునుగదా’ (మత్తయి6:28-30). అని యేసు ప్రశ్నిస్తున్నాడు. ఒకరోజుండి ఎండిపోయే పువ్వులకు ఆ దివ్యకాళాకారుడు వివిధమైన రంగులువేస్తే, తన పోలిక చొప్పున తాను సృజించిన మనుషుల విషయములో ఆయన ఇంకేంత ఎక్కువ శ్రద్ద తీసుకుంటాడు? విశ్వాసంలేని హృదయంలో పుట్టే ఆంధోళన, సందిగ్ధత, సంశయాలకు క్రీస్తు నేర్పిన ఈ పాఠం ఒక గద్దింపు.SCTel 94.2

    తన బిడ్డలందరూ సంతోషముగా, సమాధానంగా, విధేయులుగా ఉండాలని ప్రభువు ఆకాంక్షిస్తున్నాడు. “శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను. నాశాంతినే మీకనుగ్రహించచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనివ్యు కుడి, వెరవనీయ్యుకుడి ‘‘ ‘’మీయుందు సంతోషముఉండవలెననియు, మీసంతోషము సంపూర్ణము కావలెననియు ఈ సం గతులు మీతో చెప్పు చున్నాను” (యోహాను 14:27,15:11)SCTel 94.3

    స్వార్థ ప్రయోజనాల దృష్టితో విధి నిర్వహణ వెలుపల మనం పొంద జూసే ఆనందం సమతూకాన్ని కోల్పోయి, క్షణికమే గతించిపోతుంది. ఆత్మ ఒంటరితనానికి దుఖాఃనికి లోనవుతుంది. అయితే ఆత్మకు దేవుని సేనలో ఆనందం, సంతృప్తి కలుగుతాయి. అనిశ్చత మార్గాల్లో నడవడానికి దేవుడు క్రైస్తవుణి విడిచిపెట్టడు. సంతాపాలు, ఆశాభంగాలు, అనుభవించాడనికి అతణివిడువడు. ఈ జీవితంలో ఆనం దాన్నిపొందలేక పోయినా నిత్య జీవానికి నిరీక్షించడంలో ఆనందాన్ని మనం పొందవచ్చు.SCTel 94.4

    ఈలోకంలో సయితం క్రైస్తవులకు క్రీస్తుతో సహవాస సంతోషం కలుగవచ్చు. ఆయన ప్రేమ, ప్రకాశత, ఆయన సన్నిధీ, ఓదార్పు వారికి లభించవచ్చు. జీవితంలో ప్రతీ మెట్టు మనల్ని క్రీస్తుకు మరింత దగ్గరచేయవచ్చు. ఆయన ప్రేమలో మరింత లోతైన అనుభూతి కలిగించవచ్చు. ధన్యమెన్ల ఆ సమాధాన గృహానికి ఒక మెట్టు దగ్గరకు చేర్చవచ్చు. అందుచేత మన నమ్మకాన్ని విడిచి పెట్టక ముందు స్థిరమైన నిశ్ఛయతను కలిగి ఉందాం. “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను”(1సమూ9:12).SCTel 95.1

    అంతం వరకు ఆయన మనకు సహాయం చేస్తాడు. సంహారకుడి చేతినుంచి మనల్ని రక్షించడానికి, మనల్ని ఓదార్చడానికి ప్రభువు చేసిన కార్యాల్ని స్మరణకుతెచ్చే చిహ్నాలని మన ముందు ఉంచుకొందాం. దేవుడు, మన యెడల కనబర్చుతున్న కృపాతిశయాల్ని ఆయన తుడిచివేసిన కన్నీరు, చల్లార్చిన ఆవేదనలు, తొలగించిన భయాందోళనలు, తీర్చిన అవసరాలు, కుమ్మరించిన దీవెనలు, స్మృతి పథంలో తాజాగా ఉంచుకొని మన జీవిత యాత్ర శేష భాగంలో మన ముందున్న సమస్తాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన్ల బలాన్ని, శక్తిని సంపాదించుకొందాం.SCTel 95.2

    మనముందున్న పోరాటంలో క్రొత్త ఆందోళనలు ఎదురవ్వడం తథ్యం. అయితే జరిగిపోయినా దాన్ని జరగాల్సినదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా చెప్పవచ్చు, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను” నీ కముములు ఇనువనియు, ఇత్తడివియునై యుండును” (ద్వితి 33:25) మనకు కలిగే శ్రమ, దాన్ని భరించడానికి దేవుడు మనకిచ్చే శక్తిని మించివుండదు. కనుక చేయాల్సినవని ఎక్కడ ఉంటే అక్కడ చేపట్టి ఏది ఏమైనా శ్రమకు చాలినంత శక్తిని ఆయిన అనుగ్రహిస్తాడని విశ్వాసంతో దాన్ని నిర్వహిద్దాం.SCTel 95.3

    నిర్ణీతకాలంలో దేవుని బిడ్డల ప్రవేశం కోసం పరలోక ద్వారాలు తెరవ బడతాయి. మహిమరాజు పలికే ఈ మాటలు హృదయ రంజకమైన్ల సంగీతంలా వారి చెవులకు వినిపిస్తాయి. “నాతండ్రి చేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్దపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి” (మత్తయి 25:34).SCTel 95.4

    యేసు తమ కోసం సిద్ధం చేస్తున్న గృహాన్ని స్వతంత్రించుకోవడానికి రక్షణ పొందినవారు అప్పుడు ఆహ్వానింపబడతారు. అక్కడ వారికుండే మిత్రద్రోహులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, నీతిబాహ్యులు, అవిశ్వాసులుకాదు. దైవ కృప వల్ల సాతానుపై విజయం సాధించి, పరిపూర్ణ ప్రవర్తనలు గలవారే వారికి మిత్రులు. వారిని ఇక్కడబాధంచే ప్రతీ పాప స్వభావాన్ని, ప్రతీ అసంపూర్ణతను క్రీస్తు రక్తం తుడిచివేస్తుంది.SCTel 95.5

    సూర్యకాంతిని తలదన్నే ఆయన మహిమ ప్రకాశత, ఔన్నత్యం వారీ కనుగ్రహింప బడుతుంది. ఆయనమానవసౌందర్యం, అనగాఆయన ప్రవర్తన సంపూర్ణత్వం వారి ద్వారా ప్రకాశిస్తుంది. బహిర్గతమెన్ల ఈ ఔన్నత్యానికన్నా ఇదెంతో విలువగలది. ఆ మహా శ్వేత సింహాసనం ముందువారు నిర్దోషులుగా నిలిచి దేవదూతల ఘనత, ఆధిక్యాల్లో పాలు పంచుకొంటారు.SCTel 96.1

    తాను పొందనున్న మహిమకరమైన్ల స్వాస్థ్యం దృష్ట్యా ‘ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగానేమియియ్యగలడు” (మత్తయి 16:26). అతడు నిరుపేదేకావచ్చు. అయినా లోకం ఇవ్వలేని భాగ్యం, గౌరవం, అతనిలో దాగి వుంటాయి. పాపం నుంచి విమోచన, శుద్ధీకరణ పొంది దేవ సేవకు తన సర్వ శక్తుల్ని అంకితం చేసుకున్న ఆత్మ అపారమైన విలువను సంతరించుకొంటుంది. పరలోకంలో పెద్ద సన్నీధిలోను దూతల మధ్యను విమోచన పొందిన ఒక్క ఆత్మను గురించి ఆనందం వెల్లువిరుస్తుంది. ఆ ఆనందం పరిశుద్ద విజయ గీతాపాలతో వ్యక్తం చేయ బడుతుంది.SCTel 96.2

    గ్రంధకర్త అయిన ఎలెన్ వైట్ ఈ పుస్తకమును వ్రాసినారు (1827-1915) ఆమె రచియిత్రిగాను, మత బోధకురాలుగాను మూడు ఖండములలో గొప్ప ప్రసిద్ధి పొందినారు. పోలెండ్లోవున్న మైనీ ప్రాంతములో జన్మించారు. న్యూ ఇంగ్లాండు రాష్ట్రములో ఆమె బాల్యం గడిపారు. సువార్త సేవకై (దేశాంతర సేవకై) అమెరికా సంయుక్త రాష్ట్రములలో మధ్య ప్రాంతము మరియు ఉత్తర భాగములో నివిశ్రామముగా ప్రయాణించారు. 1885 నుండి 1887 (సంవత్సరముల) వరకు ఐరోపా ఖండములో ఉన్న ప్రముఖ దేశములో గొప్ప సభలలో ప్రసంగించారు. అలాగే పరిచర్యకు సమర్పించుకొనినప్పటికినీ ఆమె గ్రంధాలు వ్రాస్తునేవున్నారు. ఆస్ట్రేలియాలోను మరియు న్యూజిలాండ్ లోను తొమ్మిది సంవత్సరములు ఉజ్జీవముగా గడిపారు. ఆమె కలమునుండి వేదాంతం, విద్య, వైద్య గృహము మరియు క్రైస్తవ అనుభవమునుగూర్చి చిన్న, పెద్ద గ్రంధములు నలుబది ఐదు వాల్యూములు వెలువడినవి. ఇంకా అనేక భాషలలో తర్జుమా చేయబడి, లక్షల కొలది ముద్రించబడి పంపిణీ చేయబడినవి. అందులో ప్రజాదరణపొంది, గొప్ప ప్రసిద్ధి కెక్కిన పుస్తకం క్రీస్తుయొద్దకు మెట్లు.SCTel 97.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents