Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    15 అధ్యాయము - దేవుని ముద్ర మరియు మృగము యొక్క ముద్ర

    కేవలం రెండు తరగతులు

    కేవలం రెండే రండు తరగతులు మాత్రమే ఉంటాయి. ఇరు పక్షంలో జీవిస్తున్న వారు దేవుని ముద్ర లేదా మృగం లేదా అతని ప్రతిమ ముద్రను కలిగి ప్రత్యేకంగా ముద్రించబడినారు.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, జనవరి 30, 1900. LDETel 150.1

    విశ్వాసులు మరియు అవిశ్వాసులు మధ్య గొప్ప పోరాటములో మొత్తం క్రైస్తవ ప్రపంచం పాల్గొంటుంది. ప్రతివారు ఎవరు పక్షమున ఉండాలో ఎవరికి వారు నిర్ణయుంచు కొందురు. కొంతమంది. ఇరువైపులా సంఘర్షణలో పాల్గొనకపోవచ్చు. వారు సత్యాన్ని వ్యతిరేకిస్తు న్నట్లు కనిపించకపోవచ్చు, కాని వారికి ఆస్తి కోల్పోయే భయం మరియు శ్రమలకు, దూషణకు భయపడి క్రీస్తు కోసం ధైర్యంగా నిలువబడుటకు బయటపడరు. అటువంటి వారు క్రీస్తు విరోదులుగానే లెక్కించబడతారు. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, పిబ్రవరి 7, 1893.LDETel 150.2

    ముగింపు సమయమనకు మనము సమీపించేకొలది వెలుగు సంబంధము కలిగివున్న పిల్లల మరియు చీకటి సంబంధము కలిగివున్న పిల్లల మద్య విభజన మరింత నిర్ణయించబడుతుంది. వారు మరింత బిన్నంగా ఉంటారు. క్రీస్తు మాటలలో ఈ వ్యత్యాసం గూర్చి వివరించబడియున్నది, నీవు క్రొత్తగా జన్మించు, లేద క్రీస్తులో నూతనముగా సృష్టించబడాలి, లోకములో చనిపోయినను, నీవు దేవునిలో జీవించు. ఇవి పరలోకమునకును మరియు భూలోకమునకు వ్యత్యాసము కనపరిచిన విభజన గోడలు మరియు లోక సంబంధికులు మరియు లోకము నుంచి ఏర్పర్చబడి దేవుని దృష్టిలో విలువైన వారిగా ఎన్నుకోబడిన వారి మధ్య వున్న వ్యత్యాసమును వివరించ బడియున్నది..-స్పేషల్ టెస్టమని టూ ది బాటల్ క్రీక్ చర్చ్ (పి హెచ్155) 3 (1882).LDETel 150.3

    కుటుంబ సభ్యులు విడిపోతారు

    ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేరు చేయబడును. నీతిమంతులమీద ఒక సూచన ఉంది. ” నేను నియమించబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమైయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతును.[మలాకీ 3:17] దేవుని ఆజ్ఞలకు విదేయులుగా ఉన్నవారు, పరిశుద్దుల సహవాసములో వెలుగు సంబంధులతో కలిసిపోతారు. వారు పరలోకనగరములో ముఖ్య ద్వారం గుండా ప్రవేశిస్తారు, మరియు జీవి వృక్షము హక్కుపోందుతారు ఎవరైతే ఎత్తబడతారో వారు పేరు జీవి గ్రందములో వ్రాయబడుతుంది. అయితే అతనితో అనుబంధం కలిగి ఉన్న ఇతరులు వారు దేవుని నుండి శాశ్వతముగా వేరైపోయే గుర్తు కలిగియున్నారు కాబట్టి వారు దూరమైపోవుదురు.-టెస్టమోనిస్ మినిస్ట్రీస్ అండ్ గాస్ఫల్ వర్కర్స్ 234, 235 (1895).LDETel 150.4

    పొందుకొనిన వెలుగు బట్టి తీర్పు పొందుతాము

    మనకి వున్న ఆధిక్యతలు లేని వారెందరో, సత్యమనే గొప్ప వెలుగు పొందనివారు అందులో నడవనివారు మనకంటే ముందు వారు పరలోకం చేరేదరు. చాలా మంది తమకు తాము అత్యుత్తమ వెలుగులో జీవించారు, దానిని బట్టియే వారు అనుగుణంగా తీర్పు పొందుతారు.-లెటర్ 36, 1895.LDETel 151.1

    హెచ్చరిక ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరేవరకు, తగినంత వెలుగు సాక్ష్యం ప్రతి ఆత్మ ఇచ్చే వరకు. అందరు ఎర్పర్చబడినతగు సమయం వరకు వేచి ఉండాలి, కొందరు ఇతరులకన్నా తక్కువ వెలుగును కలిగివుంటారు, అయితే ప్రతి ఒక్కరూ స్వీకరించబడిన వెలుగు ప్రకారం తీర్పు పోందినారు. ఎంమ్ ఎస్ 77, 1899.LDETel 151.2

    ఈ చట్టం స్థిరమైన స్వబావము కనపరుచుచున్నది, దేవుని ధర్మశాస్త్రం విషయంలో మనకు గొప్ప సత్యము ఇవ్వబడింది. ఈ దర్మ శాస్త్రము స్వబావ స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనిషి ఇప్పుడు జీవించాలి మరియు దాని ద్వారా అతను గొప్ప అంతిమ దినమందు తీర్పు తూర్చబడును.ఆ దినమందు మనుషుడు పోందు కున్న సత్యమైన వెలుగు ప్రకారము తాను హ్యవహరించును. ది.గాస్పల్ హెరాల్డ్, జనవరి, 1901 (సప్లిమెంట్). ఈ గొప్ప సత్యము పొందిన చాలా మందిదాని అగౌరపరుచుట వలన చాలా హీనమైన స్థితిలో వున్నారు. అయితే వారు దేవునికికాక వారికి వారు హెంచ్చిచుకొన్నారు కాబట్టి వీరుకన్న తక్కవు సత్యము పొందుకొన్న వారికి అనేక అవకాశములువున్నాయి. అయితే ప్రతి సందర్భంలో దేవుని అగౌరపరుచుటవలన మానవుల మీదకి వచ్చిన శిక్ష. సరైనదే.-మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 8: 168 (1901).LDETel 151.3

    ప్రతి ఒక్కరు ఎవరి తీర్మానం వారు జ్ఞానయుక్తముగా చేసుకొనేందుకు వారికి చాలినంత లేఖన కాంతి లభ్యమవ్వాలి. మహా సంఘర్షణ 605 (1911).LDETel 151.4

    నిర్లక్ష్యపు అంధత్వమునకు క్షమాపణలేదు

    వెలుగు మరియు జ్ఞానము గూర్చిన హెచ్చరిక ఎన్నడు ఎరగకయు మరియు పోందుకొనే అవకాశము లేకయు ఉన్నవారిని ఎవరూ ఖండించరు. కానీ చాలామంది క్రీస్తు రాయబారుల ద్వారా వారికి సమర్పించిన సత్యానికి విదేయులగుటకు నిరాకరించారు,ఎందుకంటే వారు ప్రపంచం ప్రమాణమునకు మరియు వారి అవగాహనకు చేరుకున్న సత్యమునకు అనుగుణంగానే ఉండాలని ఆశిస్తారు, కాబట్టి వారి ఆత్మలో ప్రకాశించే సత్యమైన వెలుగును బట్టియే తీర్పులో వారు ఖండించబడతారు. - ది ఎస్ డి ఎబైబిల్ కామెంటరీ 5: 1145 (1884).LDETel 151.5

    సత్యాన్ని వినడానికి అవకాశము వుండియు మరియు ఇంకా వినుటకును మరియు అర్థం చేసుకోనుటకు ఎటువంటి శ్రమ తీసుకొకపోయినను, మరియు వారు వినకపోయిన మేము జవాబు దారులంకాము. లేక్క అప్పగించవలసిన పని లేదని తలంచుచు దానిని వినియు మరియు తిరస్కరించినట్లయితే దేవుని యెదుట నేరస్థులగుదురు. ఇదే సత్యము అని ఎరిగియుండి కూడ ఇంక తప్పడు మార్గములోనే ఉంటానికి తీర్మానము తీసుకున్న వారికి ఎటువంటి క్షమాపణ ఉండదు. క్రీస్తు పొందిన వేదన మరియు మరణం అజ్ఞానమైన పాపాల నిమిత్తమే గాని ఉద్దేశపూర్వక అందత్వములో ఉన్న వారి కొరకు కాదు. మన దృష్టకి రాని సత్యము ఎదైతే నిరాకరించి మరియు ప్రతిఘటించితిమో దాని విషయమై మనము జవాబుదారులం కాదు. సత్యము ఒకనికి ఎన్నడు బోధించని యెడల ఆ మనుషుడు దానిని ఎలాగ తెలుసుకొనును కాబట్టి తాను ఎన్నడు ఎరగని సత్యము విషయములో ఖండించ బడడు.-దిఎస్ డి ఎబైబిల్ కామెంటరి5: 1145(1893).LDETel 152.1

    ఉపకారం చూపుటలో ప్రాముఖ్యత

    ఆఖరి రోజు తీసుకున్న నిర్ణయాలు మన ఆచరణాత్మక కృప మీద ఆదారపడి ఉంటాయి. చేసిన ప్రతి ప్రయోజనమైన కార్యము క్రీస్తుకు చేసినట్లు చేస్తే ఆయనే అంగీక రించును.- టెస్టమోనీస్ టూ మినిస్టర్స్ అండ్ గాస్పల్ వర్కస్ 400 (1896).LDETel 152.2

    వివిధ జాతుల ప్రజలు ఆయన ముందు సమావేశమైనప్పుడు అక్కడ రెండే రెండు తరగతుల ప్రజలుంటారు. బీదలవలే మరియు అబగ్యులవలే క్రీస్తు వ్యక్తిగతముగా వచ్చినప్పుడు ఆయనకు వారు ఏమి చేసియున్నారో లేక ఏమి చేయడానికి నిర్లక్షం చేశారు అన్న దానిమీద వారి నిత్య భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది..... అన్యజనులు తెలియకుండ దేవుని ఆరాదించు వారికి మానవ సాధనాల ద్వారా సత్యం అందలేదు, అయిన వారు రక్షణ పొందుతారు లిఖిత రూపములో ఉన్న దైవ దర్మశాస్త్రాన్ని వారు ఎరగక పోయినా ప్రకృతి ధ్వారా మాటలాడే ఆయన స్వరాన్ని విని దర్మశాస్త్రం కోరే పనుల్ని వారు చేస్తుయున్నారు, వారు దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందారని వారి క్రియలు వెల్లడిస్తున్నాయి. మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అన్నమాటలు రక్షకుని నోట నుంచి వినడం జాతుల్లోను అన్యజనులలోను మిక్కిలి అల్పులైన వారికి ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది, వారికింత ఆనందం కలుగుతుంది. ఆయన పలికే ఈ ప్రశంసా వాక్యాలు విని తన అనుచరులు ఆశ్చర్యాన్ని అమితానందాన్ని వ్యక్తం చేసేటప్పుడు అనంత ప్రేమామయుని హృదయం ఎంత ఆనందిస్తుంది. యుగయుగాల ఆకాంక్ష.615 (1898).LDETel 152.3

    ప్రేరణ, కార్యసాదనకు రూపమిచ్చును

    తీర్పు దినాలలో కొందరు ఈ మంచి కార్యముల విషయములో వాదించెదరు అయితే వారు ఈ కారణమును బట్టి ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడు వారు ఇలా చెబుతారు, “నేను యువకులను వ్యాపారంలో స్థిరపడుటకు ఏర్పాటు చేసాను. నేను ఆసుపత్రులను నిర్మంచడానికి దనసహాయము చేసాను. నేను వితంతువుల అవసరాలను తీర్చి ఉపశమనం కలిగించాను, పేదలను నా ఇంటిలో చేర్చుకొన్నాను. అవును నీవు చేసావు కానీ మీ ఉద్దేశాలు స్వార్ధంగా ఉన్నవి కాబట్టి అవి అపవిత్ర మయ్యాయి అందుకని అవి దేవుని దృష్టిలో ఆమోదయోగ్యం కాలేదు. స్వార్దముతో మీరు చేసిన అన్ని విషయాల్లో ప్రముఖంగా వీక్షించడానికి తెబడెను. -శ్రీమతి 53, 1906.LDETel 153.1

    ఉద్దేశ్యం మన క్రియలకు గుణాన్ని ఇస్తుంది. మన క్రియల్ని , తుచ్చమైనవిగా లేదా ఉచ్చమైనవిగా ముద్రవేసేది ఉద్దేశమే. - యుగయుగాల ఆకాంక్ష .615 (1898).LDETel 153.2

    దేవుని ముద్ర అంటే ఏమిటి

    దేవుని ప్రజలు వారి నుదిటిలో ముద్రించబడిన వెంటనే, అది చూడడానికి అది ముద్ర లేదా గుర్తు కాదు, కానీ సత్యం లోకి తేటతెల్లంగా, బుద్ధి పూర్వకంగా మరియు ఆద్యాత్మికంగా స్థిరంగా ఉండడమే, కనుక వారు కదిలించబడరు-- దేవుని ప్రజలు ముద్రించబడినప్పుడు వారు జల్లించబడుటకు సిద్ధంగా ఉన్నరు అది తప్పకుండ వస్తాది, నిజానికి ఇది ఇప్పుడే ప్రారంభమైంది. ది ఎస్ డి ఎబైబిల్ కామెంటరీ 4: 1161 (1902).LDETel 153.3

    ప్రభువు యొక్క సబ్బాతు నిరంతరము ఆచరించిన వారి మీద జీవముగల దేవుని ముద్ర వేయబడును.-ది ఎస్ డి ఎబైబిల్ కామెంటరీ 7: 980 (1897). (చెప్పబడిన ఈ మాట మరియు అటువంటి వివరములు మరియు గత అధ్యాయంలో పేర్కొబడిన విషయాలు ప్రకారం వాటిని గ్రహించవలెను. ఇది కేవలం మనుషులకు వున్న జ్ఞానము లేదా వారు పోందుకున్న దానిని బట్టియే దేవుడు బాధ్యత వహిస్తున్నారని సూచింస్తుంది.) దేవుని ముద్ర వేయబడినవారు నాలుగవ ఆజ్ఞ అయిన సబ్బాతును ఆచరించాలి. అది ఎస్ డి ఎబైబిల్ కామెంటరీ 7: 970 (1899).LDETel 153.4

    సబ్బాతు నిజాయితీని అనుసరించడం దేవునిపట్ల విశ్వసనీయతకు సూచన.-ది ఎస్ డి ఎ. బైబిల్ కామెంటరీ 7: 981 (1899).LDETel 153.5

    పది ఆజ్ఞలు సారం కేవలం ఈ నాల్గవ ఆజ్ఞతో ముడిపడివున్నది, భూమ్యాకాశములు సృష్టించిన సృష్టికర్త అగు మన గొప్ప న్యాయాధిపతి అయున దేవుని యొక్క ముద్ర అయున్నది. సంఘమునమకు ఉపదేశములు 6: 350 (1900LDETel 153.6

    దేవుని స్మరణకు లేదా జ్ఞాపకమునకు సంబంధించినది ఏదెనులో ప్రారంభించిన సబ్బాతు ఆచరణ, ఏడవ దినము సబ్బాతులో మనము దేవుని పట్ల విశ్వసనీయతకు పరీక్షిగా వున్నది -లెటర్ 94, 1900.LDETel 154.1

    ప్రజలను నాశనంకాకుండా వారిని కాపాడడానికి హీబ్రూ నివాస స్థలంలోని వారి తలుపుల మీద ఒక గుర్తు వేయుబడునట్టుగా, దేవుని ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఒక గుర్తు ఉంటుంది. దేవుడు ఇలా ప్రకటించెను“నేను వారిని పవిత్రపరుచువాడని వారు తెలిసి కొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను సూచనగా నేను నియమించి తిని (యెహెజ్కేలు 20:12] .- ది ఎస్ డి ఎబైబిల్ కామెంటరీ7: 969 (1900).LDETel 154.2

    క్రీస్తు పోలిన స్వభావము

    సజీవుడైన దేవుని ముద్ర కేవలం క్రీస్తును పోలిన స్వబావము కలిగియున్నవారి మీదనే వెయబడును-ది ఎస్ డి ఎబైబిల్ కామెంటరీ 7: 970 (1895).LDETel 154.3

    జీవముగల దేవుని ముద్రను పొందినవారు శ్రమ కాలములో వారు కాపాడబడుదురు కనుక వారు యేసు పరిపూర్ణ స్వభావమును ప్రతిబింబించెదరు.ఎర్లీరైటింగ్స్ 71 (1851).LDETel 154.4

    దేవుని ముద్ర అపవిత్రమైన పురుషుడు లేదా స్త్రీ నుదిటిపై ఎన్నడూ ఉంచబడదు. ఈ లోకమును ప్రేమించి దాని ఆశలు వెంట పరిగెత్తే స్త్రీ పురుషులు నుదిటిమీద ఎన్నడు పెట్టబడదు. అది తప్పుడు బోదచేసే నాలుక లేదా మోసపూరిత హృదయాలుగల పురుషులు, మహిళల నుదురు మీద ఉంచరు. ముద్ర స్వీకరించిన వారందరూ దేవుని యెదుట మచ్చలేనివారిగా ఉంటారు. వారే పరలోకానికి అర్హులైన వ్యక్తులు - సంఘమునకు ఉపదేశములు 5: 216 (1882).LDETel 154.5

    దేవుని ప్రేమ విదేయతలో వ్యక్తమవుతుంది, మరియు పరిపూర్ణ ప్రేమ అన్ని భయాల నుండి పారద్రోలుతుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి, వారి నుదుటిపైన దేవుని ముద్ర ఉంది, మరియు వారు దేవుని కార్యములు చేయుదురు. సన్స్ అండ్టర్స్ అప్ గాడ్, 51 (1894).LDETel 154.6

    ఈ లోకమును, శరీరాశను మరియు దుష్ట శక్తిని అధిగమించేవారు, సజీవుడైన దేవుని ముద్ర పోందుకోనుటకు ఇష్టపడే వారుగా ఉంటారు . టెస్టమోనిస్ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 445 (1886).LDETel 154.7

    క్రీస్తులో ఉన్న స్త్రీ పురుషులు వలే ఉన్నతమైన స్థాయికి చేరుకొనుటకు దేవుడిచ్చిన శక్తితో మనము పోరాడుచున్నమా? మనము అతని సంపూర్ణతను వెతుకుచు ఇంక ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకోనుటకు ఆయన పరిపూర్ణ స్వబావము పొందుటకు ప్రయత్నిస్తున్న మా దేవుని సేవకులు ఈ స్థానాన్నికి చేరుకున్నప్పుడు, వారి నోసట మీద ముద్ర వేయబడతారు. ” ఇది సమప్తమైనదని లేఖికుడైన దేవదూత ఇలా ప్రకటిస్తాడు, సృష్టి ద్వారా మరియు విమోచన ద్వారా వారు ఆయనకు పరిపూర్ణులై యున్నారు. “సెలెక్టెడ్ మెసెజన్స్,:3: 427 (1899).LDETel 154.8

    ఇప్పుడు ముద్రించే కాలములో

    పరిశుద్ధ స్థలంలో యేసు యొక్క మధ్యవర్తిత్వం ముగిసేనంత వరకు ప్రస్తుతం సబ్బాతు విషయమై పరీక్ష రాదని నేను చూచాను. మరియు ఆయన రెండవ తెర దాటి వెళియున్నాడు, 1844 చివరి మాసములో మద్య రాత్రి కేక వేయబడినప్పుడు అతిపరిశుద్ధ స్థలములో తలుపు తెరవక ముందే ఎందర్ క్రైస్తువులు నిద్రించారు. అయితే వారు నిజమైన సబ్బాతు అచరించకుండ జీవించారు. అయినా ఇప్పుడు వారు నిరీకణలోనే నిద్రిస్తున్నారు.. వారికి సత్యము లేదు కాని మనకి ఇప్పుడు ద్వారం తెరవ బడియున్నది కాబట్టి మనవలే వారికి సబ్బాతు పరిక్ష ఉండదు. ఈ సంఘటనలో సాతానుడు దేవుని ప్రజలలో కొందరు శోదించడం నేను చూశాను. ఎందుకంటే చాల మంది మంచి క్రైస్తవులు విశ్వాస పోరాటములో నిజమైన సబ్బాతుని ఆచరించకుండనే వారు నిద్రంచారు. వారు అనుమానించారు కాని ఇప్పుడు అది మనకి గొప్ప పరిక్షగా ఉన్నది. ఇప్పుడు సాతాను ఈ ముద్ర వేయు సమయంలో ప్రస్తుత సత్యం నుండి దేవుని ప్రజల మనస్సులు సంకోచించునట్లు అతను అన్ని ఉపాయములు పన్నుచునే వున్నాడు.- ఎర్లీ రైటింగ్స్ 42, 43 (1851LDETel 155.1

    [శ్రీమతి. హేస్టింగ్స్ ] ఆమే మద్ర వేయబడియునట్లు నేను చూశాను, ఆమె దేవుని స్వరం విని బయటకు వచ్చును,ఆమే భూమిమీద నిలబడి, 144,000 మందితో ఉంటారు. మనము ఆమె కోసం విచారించనవసరం లేదు ఎందు కంటే శ్రమల కాలములో ఆమే విశ్రాంతి తీసుకోనును- సెలెక్టేడ్ మెసేజస్,: 2: 263 (1850).LDETel 155.2

    తొంబై సంవత్సరాల వయసు దాటినవారు మన భూమిమీద జీవిస్తున్నారు. వృద్ధాప్య సహజ పలితాలను వారి బలహీనతలో చూడవచ్చు. కానీ వారు దేవుణ్ణి నమ్ము యున్నారు మరియు దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుని ముద్ర వారి మీద ఉంది, మరియు ప్రభువు చెప్పియున్నాడు ప్రభువు నందు నిద్రించినవారు దన్యులు వారు ఆ సంఖ్యలో ఉంటారు,- ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 982 (1899).LDETel 155.3

    అహో, దేవుని ముద్రమ నిమీద ఉంచవచ్చు!

    ఇకత్వరలోనే, దేవుని కుమారులుగా ఉన్న ప్రతివాని మీది అయన ముద్ర వేయబడును. అహా, ఇది మన నొసటి మీద ఉంచబడుతుంది! దేవుని సేవకులనుదిటి మీద ముద్ర వేయడానికి దేవదూత వెళ్ళినప్పుడు ఆఆలోచనను ఎవరు సహించగలరు? -ఎస్ డి.ఎ బైబిల్ కా మెంటరీ 7: 969, 970 (1889).LDETel 155.4

    శాంతియుతమైన రోజుల్లో సత్యములో నిలిచియున్న భక్తులు వారి విశ్వాసములోనే నిలకడలేకుండ ఉంటే వారి మీదకి గొప్ప పరీక్ష వచ్చినప్పుడు మరియు మృగం యొక్క ప్రతిమను ఆరాధించని వారందరికి వ్యతిరేకంగా తీర్పు వెలువడినప్పుడు వారిని ఎవరు అదుకొందురు. నొసటి లేదా వారి చేతుల్లో ముద్ర వెయవలసిందిగా ఆజ్ఞ జారి చేయుదురు? ఈ భయంకరమైన కష్టకాలం చాలా దూరములో లేదు. కనుక బలహీనులుగా మరియు అగౌరవంగా మారటము కన్న, దేవుని ప్రజలుగా కష్ట సమయంలో బలాన్ని. దైర్యాన్ని కూడగట్టుకోవడం మేలే కదా!.. సంఘమునకు సాక్ష్యాలు. 4: 251 (1876)LDETel 156.1

    మృగము యొక్క ముద్ర అనగానేమి

    వారం మొదటి దినమున ఆచరించుటం ద్వారా మృగమును లేదా దాని ప్రతిమను ఆరాధించేవారి నుండి వేరుగా వున్న ప్రజలను చూడమని యోహాను పిలువబడేను. ఈ దినము పాటించువారు మృగం యొక్క ముద్రకు గూర్తుగానున్నది.- (టెస్టమోనిస్ మినిస్టీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 133 (1898). పోపుల సబ్బాతు ఈ మృగం యొక్క ముద్ర అయున్నది. -ఎవాంజలిజం, 234 (1899). పరీక్ష అనేది వచ్చినప్పుడు మృగం యొక్క ముద్ర ఏమిటో స్పష్టంగా చూపబడు తుంది. అదే ఆదివారం ఆచరించడము. .-ది ఎస్ డి ఎబైబిల్ కామెంటరీ 7: 980 (1900).LDETel 156.2

    దేవుని యొక్క స్పష్టని జ్ఞాపకం చేసుకోవడమే ఏడవ దినము సబ్బాతు ఆచరణఅని దేవుని యొక్క ముద్ర లేదా గుర్తు మనకు బయలుపరుచుచున్నది. దీనికి వ్యతిరేకం మొదటి రోజు ఆచారయే మృగం యొక్క ముద్రను బహిర్గతముచేసింది. సంఘమునకు ఉపదేశములు. 8: 117 (1904).కొద్దవారు గాని గొప్పవారుగాని, అందరు తమ కుడిచేతిమీదనైనను తమ నొసటి యందైనను అ ముద్రను వెయించుకొనునట్లును బలవంతము చేయును, (ప్రకటన 13:16). ఆదివారం నాడు వారి చేతులతో పని చేయకూడదు, అని భావించదమే కాకుండ ఆదివారమే సబ్బాతు దినమని వారు మనసులో అంగీకరించెదరు. స్పెసల్ టెస్టమోని టూ బాటిల్ క్రీక్ చర్చి 6, 7 (1897)LDETel 156.3

    మృగము యొక్క ముద్ర ఎప్పుడు వస్తుంది

    మృగం యొక్క ముద్ర ఎవరూ ఇంకా పొందలేదు. -ఎవాంగెలిజం, 234 (1899). ఆదివారము ఆచరించడం ఇది ఇంక మృగం యొక్క ముద్ర కాదు, మరియు ఈ విగ్రహారదన సబ్బాతును ఆరాధించేలా బలవంతము చేయుచున్న చట్టం అమలుపర్చె అంత వరకు అది వుండదు. ఒక సమయము అంటువస్తుంది ఈ దినము ఒక పరిక్షగా ఉంటుంది. అయితే ఆసమయము ఇంకను రాలేదు. దిఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ7: 977 (1899).LDETel 156.4

    విధేయతను పరిక్షించుటకుగాను దేవుడు వారికిని మరియు ఆయనకును మద్య సబ్బాతు ఒక సూచనగా మనుష్యునికి ఇచ్చెను. దేవుని దర్మశాస్త్రానికి సంబంధించి కాంత వారికి వచ్చినప్పటికిని వారు ఇంక అవిదేయత చూపించెదరు, వారు ముందున్న గొప్ప సంక్షోభంలో దేవుని నియమాల కంటే మానవ చట్టాలను హెచ్చించెదరు, కాబట్టి అప్పుడు మృగం యొక్క ముద్ర వారికి ఇవ్వబడును. ఎవాంజలిజం, 235 (1900). సబ్బాతు విశ్వసనీయతను నిగ్గుతేల్చే పరిక్ష సంఘర్షణకు ముఖ్య కారణము సబ్బాతు సత్యమే. మనుషులకు ఈ చివరి పరిక్ష వచ్చినప్పుడు, దేవుడు సేవించే వారికి, సేవించని వారికి మధ్య భేదము కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. నాల్గొవ ఆజ్ఞకు విరుద్ధంగా దేశశాసనాన్ని ననుసరించి జరిగే తప్పుడు సబ్బాతు ఆచరణ దైవ వ్యతిరేక అధికారానికి నమ్మకంగా ఉండటానికి సూచన అయితే దైవ ధర్మశాస్తాను సారంగా నిజమైన సబ్బాతును ఆచరించటం సృష్టికర్త పట్ల విశ్వాసనీయతకు సూచన. లౌకిక అధికారానికి లోంగుబాటును సూచించే చిహ్నాన్ని అంగీకరించటం ద్వారా ఒక తరగతి ప్రజలు మృగం ముద్రను పొందితే దైవాదికారాన్ని సూచించే చిహ్నాన్ని అంగీకరించే తక్కిన తరగతి ప్రజలు దేవుని ముద్రను పొందుతారు. మహా సంఘర్షణ, 605(1911).LDETel 157.1

    ఆదివారం బలత్కారముగా ఆచరింటం ఒక పరిక్ష

    సత్యము పోందుకున్నంత వరకును మరియు నాల్గవ ఆజ్ఞకు బద్దుడై ఉన్నారని గమనించినంత వరకు వారిని ఎవరు కూడా ఖండించరు. కానీ నకిలీ సబ్బాతు ఆచరించాలని బలవంతముగా అమలు చేయబడిన చట్టము వచ్చినప్పుడును మరియు మూడవ దూత యొక్క గొప్ప స్వరముతో మృగం మరియు దాని ప్రతిమకు సమస్కారము చేయవద్దని మనుష్యలకు హెచ్చరిక ఇచ్చినప్పుడును. నిజమైన సత్యము మరియు అబద్దము మద్య వున్న వారు ఎవరు అనేది స్పష్టంగా తేలిపోతుంది , ఎవరైతే ఇంకను అతిక్రమణలో కొనసాగుతున్నవారు మృగం యొక్క ముద్ర పోందుకుంటారు. . ఎవాంజలిజం, 234, 235 (1899). ఆదివారాచరణను చట్టం ద్వార అమలు పర్చినప్పుడు యధార్ధ సబ్బాతును గూర్చి లోకమంత చైతన్యవంతం అయునప్పుడు రోమా అధికారం కన్న ఉన్నతమైన దేవుని ఆజ్ఞను ఎవరు మీరతారో, వారు ఆ విధంగా దేవుని కన్న పోపు అదికారాన్ని గౌరవించిన వారవుతారు. వారు రోముకి రోము ఏర్పటుచేసిన వ్వవస్థను అమలుపర్చే అధికారానికి పాదాభివందనం చేస్తున్నవారవుతారు. వారు క్రూరమృగానికి దాని ప్రతిమకు నమస్కారము చేస్తున్నారు. తన అధికారానికి చిహ్నంగా దేవుడు నిర్దేశించిన వ్వవస్థను మనుష్యులు త్రోసిపుచ్చి దానికి మారుగా రోము తన విశ్వాసపాత్రకుగురువైన, మృగము ముద్రను పొందుతారు. సమస్య ఈ విదంగా సృష్టింగా ప్రజల ముందుకు వచ్చి వారు దేవుని ఆజ్ఞలనో మనుష్యులు కల్పించిన ఆజ్ఞలనే ఎంపికచేసుకొనే వరకు ఆజ్ఞాతి క్రమంలో జీవిస్తున్న ప్రజలు మృగము ముద్రను పొందరు. - మహా సంఘర్షణ 449 (1911).226.LDETel 157.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents