Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    18 అధ్యాయము - చివరి ఏడు తెగుళ్ళు మరియు నీతిమంతులు

    (గొంప్ప శ్రమకాలము 2వభాగము).

    కృపకాలముముగిసిన వెంటనే శ్రమకాలము ప్రారంభము.

    మానవుడు తరుపున ఉత్తరవాదిగా క్రీస్తు తన పరిచర్యను పూర్తిచేసిన తర్వాత ఈ శ్రమ కాలం ఆరంభమౌతుంది. అప్పటికి ప్రతీ వ్యక్తి కేసు తీర్మనమై ఉంటుంది. పాపాన్ని శుద్ధి చేయటానికి ప్రాయశ్చిత్తం రక్తం ఉండదు. దేవుని సమక్షంలో మానవుడి ఉత్తరవాది హోదాను యేసు విడిచిపెట్టినప్పుడు ఈ గంభీర ప్రకటన వెలువడుంది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రమైనవాడు ఇంకను అపవిత్రుడు గానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండ నిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము.ప్రకటన 22.11 అప్పుడు దేవుని నియంత్రణ శక్తి లోకంలో నుంచి ఉపసంహరించబడుతుంది. పితరులు ప్రవక్తలు.201 (1890). LDETel 176.1

    దేవుని ప్రజలు ముందువున్న అంతిమ ఘడియ కోసం వారు సిద్ధపడుదురు

    మూడవ దేవదూత వర్తమానం సమాప్తమైనప్పుడు పాప భూనివాసులు పక్షముగా ఇక కృపా జ్ఞాపన ఉండదు. దేవుని ప్రజలు తమ కర్తవ్యమును నెరవేరుస్తున్నారు. వారు కడవరి వర్షము “ప్రభువు సన్నిది నుండి విశ్రాంతి కాలములు పొందుతారు. తమ ముందున్న ఆపత్కాలానికి వారు సన్నద్ధంగా వుంటారు. పరలోకంలో దేవదూతలు ఇటూ అటూ పరుగెత్తుతున్నారు. భూమి నుండి పరలోకానికి తిరిగి వస్తున్న ఒక దేవదూత తన కరవ్యాన్ని నెరవేర్చినట్లు లోకానికి చివరి పరీక్ష జరుగునట్లు దేవుని ధర్మశాసనాలకు విధేయులై నివసించిన వారందరు జీవముగల దేవుని ముద్రను పొందినట్లు ప్రకటించాడు. అప్పుడు పరలోక గుడారములో యేసు చేస్తున్న విజ్ఞాపన పరిచర్య ఆగిపోతుంది.... క్రీస్తు తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి వారి పాపాలు తుడిచివేశాడు. ఆయన “రాజ్యపౌరుల సంఖ్యను కూడ నిర్ధారించటం జరిగింది. ఆకాశ మంతటి క్రింద నున్న రాజ్యములను ఆధికారమును రాజ్యమహాత్మ్యమును రక్షణకు అర్హులైన భక్తులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. యేసు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలన చేయునున్నాడు.- మహా సంఘర్షణ 1913 , 614 (1911)LDETel 176.2

    ఉహకు అందని ఘోరం.

    మన ముందున్న శ్రమలు దుఃఖల కాలం అలసట ఆకలిని సహించగలిగే విశ్వాసాన్ని, కఠిన పరీక్ష వచ్చినప్పుడు సొమ్మసిల్లి పడకుండా నిలవబడే విశ్వాసాన్ని కోరుతుంది --- ఎన్నటికిని కలుగునంత ఆపద త్వరలోనే మన పై విరుచుకుపడనై వుంది. మనకు ఇప్పుడు లేని అనుభవము అవసరము అవుతుంది. సోమరులై ఉన్నందునకు దానిని చాలా మంది గడించలేకపోతున్నారు. శ్రమ వాస్తవంగా వచ్చిన ప్పటికన్న ఎదురు చూస్తున్నప్పడు ఎక్కువ బాధాకరంగా వుంటుంది. కాని మన మందున్న శ్రమ విషయంలో ఇది నిజముకాదు. ఈ సంక్షోభం స్వభావము స్వరూపాల్ని అది స్పష్టమైన వర్ణన కూడ విషదం చేయలేదు. మహా సంఘర్షణ 621, 622 (1911)LDETel 176.3

    యేసు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలము విడిచిపెడతాడే అప్పుడు పరిశుదాత్మడు నాయకులు నుండి మరియు ప్రజలు నుండి ఉపసంహరించుకొనెను. అప్పుడు అధికారం దుష్ట ఆత్మల చేతులకు అప్పగించబడెను సాతాను యొక్క నాయకత్వములో ఇటువంటి చట్టాలు అమల్లోకి వస్తాయి, అప్పుడు సమయం చాలా తక్కువ చేయబడక పోత ఏ శరీరియు రక్షింపబడదు, .-సంఘమునకు ఉపదేశములు. 1: 204 (1859)LDETel 177.1

    శ్రమకాలము రాకముందే ఎందరో నిద్రించెదరు

    షరతులు మించిన స్వస్థత చేకూర్చమని అడగడం ఎప్పుడు కూడ సురక్షితమైనది కాదు .... ఆయనకు సమస్తము తెలుసు, విజ్ఞాపన చేసినవారి జీవించిన కాలములో వారి మీదకు వచ్చిన శోదనలు మరియు పరీక్షను సహించగలుగుతారో లేదో ఆయనకు తెలుసు. ఆయనకు ఆరంభం నుండి అంతము వరకు తెలుసు. ప్రపంచం అంతట అగ్ని పరీక లాంటి శ్రమ కాలము రాక మునుపు చాల మంది నిద్రించెదరు.- కౌన్ సల్ ఆన్ హెల్త్ 375 (1897).LDETel 177.2

    శ్రమకాలము సమీపించక మునుపు ఎందర్ చిన్న పిల్లలు దానిని చూడకుండా గతంచిపోతారు అని ప్రభువు నాకు తరుచుగా ఆదేశిస్తున్నాడు. అయిన మరల మనము మన పిల్లలను చూస్తాము. మనము వారిని కలుసుకుని, పరలోక న్యాయ స్థానాలలో వారిని గుర్తించగలుగుతాము.- సెలెక్ట్డ్ మెసేజన్స్ 2: 259 (1899).LDETel 177.3

    సబ్బాతు ఆచరించేవారి నినాశనం చెయ్యడమే సాతాను లక్ష్యము

    మన ప్రదావ సూత్రం సబ్బాతు దినమును ఆచరించిస్తున్న వారిని లక్షంగా చేసుకొని వారిని అనిచివేయడమే మన పని మరియు మా అధికారానికి దాసోహం కాని వారందరినీ నాశనం చేయుటకు ఒక చట్టం ఏర్పటుచేయుదము అని గోప్ప వంచకుడైన అపవాది అనెను. టెస్టమోనీస్ టూ మినిష్టర్స్ అండ్ గాస్పాల్ వర్కర్స్, 465 (1892). 472, 473 (1884). ఈ లోకము నుండి వారిని తుడిచిపెట్టినటైయితే భూమిపై తన ఆధిపత్యమునకు వివాదాస్పదంగా ఉండకుండా కొనసాగించవచ్చని సాతాను ఉద్దేశ్యం.టెస్టమోనీస్ టూ మినిష్టర్స్, అండ్ గాస్పాల్ వర్కర్స్ 37 (1893).LDETel 177.4

    శేషంచిన సంఘం గొప్ప పరీక్షలకును మరియు వేదనలకు గురికావలసి వస్తుంది.. దేవుని ఆజ్ఞలను గైకొనుచు మరియు యేసు గూర్చిన విశ్వాసాన్ని పాటించే వాళ్ళను చూస్తే, క్రూరమృగము మరియు అతని అనుచరుల ఎంతో ఆగ్రహాము. ప్రపంచములో వున్న ప్రజలెల్లరు తన వారని సాతాను లేక్కించుకొనెను, మతభ్రష్టత్వములో వున్న సంఘాలను తన స్వాదీనములో పెట్టుకొన్నాడు. అయితే ఇక్కడ అతని ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఒక చిన్న సంస్థ ఒకటి వుంది. దానిని గాని భూమి నుండి తొలిగించిన టైయితే అతని విజయం పూర్తి అవుతుంది, కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను నాశనం చేయటకు ఏ విధముగా అన్యజనుల దేశాలను రెచ్చగొట్టాడో ఆ విధముగా భవిషత్తులో దేవుని ప్రజలను నాశనం చేయడానికి భూమి యొక్క దుష్ట శక్తులను కదిలిస్తాడు. సంఘమునకు ఉపదేశములు. - 9: 231 (1909)LDETel 177.5

    దేవుని ప్రజలకు వ్యతిరేకముగా ఒప్పందము

    యేసు అతి పరిశుద్ధ స్థలములో తన కార్యము ముగిసేనంతవరకు ఆ నాలుగు దేవదూతలు నాలుగు దిక్కుల వాయువును పట్టుకొని వుండెను అటుపిమ్మట చివరి ఏడు తెగుళ్ళు కుమ్మరించబడును.దుర్మార్గులు పై ఈ తెగుళ్లు విరుచుకొని పడినప్పుడు వారు నీతిమంతుల మీదకి తిరగబడతారు, ఎందుకంటే ఈ తెగులు వారి ద్వారా దేవుని తీర్పులను వారి మీదకి వచ్చినవని, వారిని భూమినుండి తొలగించినటైయితే ఇక ఆ తెగుళ్ళు నిలబడిపోతాయని వారు భావిస్తారు. ఎల్లీ రైటింగ్స్ 36 (1851). కరుణగల దేవదూత తన రెక్కలను మూడుచుకొని వెళ్లిపోయినప్పుడు, సాతాను ఎంత వరకు దుష్టకార్యాలను చేయాలని కోరుకునే అంత వరకు చేస్తాడు. ప్రచండమైన గాలి వానలు, మరియు తుపాను, యుద్ధం మరియు రక్తపాతంతో కూడిన సంఘటన యందు అతడు ఆనందిస్తాడు, అతడు చేయుచు అలాగ ప్రతిపలము పంట దక్కించు కొంటాడు. మరియు మనుష్యులు పూర్తిగా మోసగించబడతారు వారువారంలోని మొదటి రోజు ఆచరించకుండా దిక్కరించి వేరుచేసినందుకే ఈ విపత్తులు సభవించాయని దాని వలన ఈ ప్రతి పలములు వచ్చాయని ప్రకటించెదరు. ప్రసిద్ధి పొందిన ఆలయాల వేదికల నుండి ఆదివారం గౌరవించే విధానములో అది గౌరవించబడుటలేదు, అందుకే ప్రపంచ మంత ఇలా శిక్షకు గురైనదని వారు ప్రకటనలు చేయుదురు. - రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టెంబర్ 17, 1901.LDETel 178.1

    కొద్ది మంది సభ్యులు గల ఒక వర్గము వ్యతిరేకించడం ప్రపంచమంతటా విద్వేశాన్ని పుట్టిస్తుంది. సంఘ సిద్ధాంతాన్ని ప్రభుత్వ చట్టలను వ్యతిరేకించే ఆ చిన్న వర్గాన్ని ఉపేక్షించకూడదని. దేశం యూవత్తు గందరగోళ పరిస్థితులకు ఆరాచకత్వానికి గురి అవడం కన్న, ఆకొద్దిమంది వ్యక్తులు బాదపడటం మేలని ని ఆబిప్రాయలు వ్యక్తమౌతాయి. పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం అదే వాదన “ప్రజల పాలకులు” ద్వారా క్రీస్తుకు వ్యతిరేకంగా తీసుకువచ్చారు. ఇది తిరుగులేని వాదనగా కనిపిస్తుంది,.మహా సంఘర్షణ 615 (1911).LDETel 178.2

    ఆదివారము గౌరవించని వారందరికీ మరణ శిక్ష

    పరిశుద్ధులను హతమార్చమని ఒక శాసనం ఉత్తర్వు జారిచేస్తారు, కాబట్ట విడుదల చేయుమని వారు రాత్రి పగలు రీధన చేయుటకు కారణము అవుతుంది.- ఎల్లీ రైటింగ్స్ 36, 37 (1851).LDETel 179.1

    బబులోను రాజైన నెబుకద్నెజరు నిలువబెట్టిన విగ్రహమునే ప్రతి ఒక్కరు సాష్టాంగ నమస్కారము చేసి ఆరాధించవలెను లేని యెడల మరణ శిక్ష విదంచబడునని ఒక ఆజ్ఞను జారీ చేసిన విదముగా ఎతంతే ఆదివారం ఆచరించే సంస్థలను వినయపూర్వ కంగా గౌరవించరో వారందరికీ జైలు శిక్ష లేక మరణం శిక్ష విధించిబడుతుందని ప్రకటించే దరు. ప్రకటన పదమూడవ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం, ఎందుకంటే అది చిన్నవారైన లేక గొప్పవారైన ప్రతి మానవ ప్రతినిదులు గూర్చి ఆలోచింపజేస్తుంది. .మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 14:91 (1896).LDETel 179.2

    శ్రమ కాలం యొక్క ఘడియలు దేవుని ప్రజలు మీదకి రావటానికి సిద్దముగా వుంది. అప్పుడు ప్రభు యొక్క సబ్బాతును ఆచరించే ప్రజలు ఘోరముగా శిక్షించాలని ఒక శాసనం వెలువడుతుంది. ఒక వేళ వారు గాని కయ విక్రయములు చేసినటైయితే వారికి భయంకరమైన శిక్ష విదించెదరు మరియు వారములో మొదటి రోజు సబ్బాతు దినముగా ఆచరించకపోయిన యెడల వారిని చంపుటకు వెనుకాడరు. ఇన్ . హెవెన్లీ ప్లేసెస్, 344 (1908).LDETel 179.3

    ఈ లోక పరిపాలకులు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోరాటానికి ఏకమై, కొద్దివారుగాని, గొప్పవారుగాని, దనుకులుగాని, దరిద్రులుగాని స్వతంత్రులుగాని, దాసులుగాని అందరును (ప్రకటన 13:16),తప్పుడు సబ్బాతు పాటించడములో సంఘ ముతో కలసి రావాలని శాసనం జారిచేస్తారు. అంగీకారాన్ని తిరస్కరించే వారందరికి జరిమానము అది పౌర చట్టమును దిక్కరించినందుకు మరణరదండన విధిస్తారు.- మహా సంఘర్షణ 604 (1911).LDETel 179.4

    ముఖ్యంగా నాలో ఆజప్రకారమ సబ్బాతును ఆచరించే వారిపై మానవుడి ఆగ్రహం రగులుతుంది. తుదకు వీరు మరణారనికి గురి అవ్వాలంటు లోకవ్యాప్తిగా ఒక ఆజ్ఞ జారిఅవుతుంది. ప్రవక్తలు రాజులు ,512 (c. 1914)LDETel 179.5

    అహష్వేరోషు జారీ చేసిన ఆజ్ఞలాంటిదే ఈ మరణశిక్ష

    దేవుని శేషించిన ప్రజలకు వ్యతిరేకముగా అంతమున జారికానున్న శాసనం యూదులకి వ్యతిరేకముగా అహష్వేరోషు జారీచేసిన శాసనం వలే వుంటుంది. నిజమైన దైవ సంఘానికి విరోదులు నేడు సబ్బాతును ఆచరించే చిన్న సంఘంలో గుమ్మం వద్ద నున్న ఒక మొద్దెకైను చూస్తాము. దేవుని పట్ల భయబీతులు విడిచి పెట్టి ఆయన సబ్బాతును కాలరాచే వారికి దేవుని ప్రజలు దైవ ధర్మశాస్త్రం పట్ల చూపే గౌరవము నిత్యం మందలింపుగా పరిణమిస్తుంది. ప్రవక్తలు రాజులు 605 (c1914).LDETel 179.6

    భూమి యొక్క ప్రధాన నాయకులు కలిసి సంప్రదింపులు జరుపుచున్నారు., మరియు సాతాను మరియు అతని దేవదూతలు ఎంతో ఉజ్జీవముగా పనిచేయుటకు అతని చుట్టు తిరుగుచున్నారు. నేను ఒక ప్రకటన చూశాను, అవి భూమిమీద వివిధ ప్రాంతాలలో చెల్లాచెదురుగా వున్న పత్రికలు, వీటిలో ఏముందంటే విశేషమైన విశ్వాసానికి చెందిన భక్తులు సబ్బాతు విడిచిపెట్టి వారములో మొదటి రోజైన ఆదివారం అచరించక పోయిన యెడల, స్వేచ, స్వతంత్రులైన ప్రజలు కొంత సమయానికి వారిని చంపెదరని శాసనము వ్రాయబడియున్నది. -ఎర్లీ రైటింగ్స్, 282, 283 (1858).LDETel 180.1

    దేవుని ప్రజలు ఆయన మీద నమ్మకము పెట్టుకొని విశ్వాసముతో ఆయన శక్తి మీద ఆదారపడి ఉంటే, మొర్దికై రోజులలో అతడు ఎలాగా ఒంటరిగా నిలువబడి యున్నాడో అలాగే మన సమయంలో కూడ సాతాను యొక్కు కుతంత్రములు ఓడించ గలము.- ది సైన్స్ అప్ ది టైమ్స్ , ఫిబ్రవరి 22, 1910.LDETel 180.2

    శేషించినవారికి దేవుడే రక్షణగా వుంటాడు

    ఆకాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అదిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీకాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీజనులలో గ్రందమునందు దాఖలైన వారెవ్వరు తప్పించుకొందురు. దానియేలు 12,1 ఈ సమయాలలో శ్రమ కాలము వచ్చినప్పుడు, ప్రతి సంఘటన నిర్ణయించబడుతుంది, ఇకపై కృపకాలం అనేది లేదు, అపరాదుల పైన ఇక ఏ మాత్రం దయ చూపించబడదు, జీవముగల దేవుని యొక్క ముద్ర అతని ప్రజల మీద ఉంది. భూమి యొక్క అధికారాలతో ఏకమై మృగము మరియు దాని అనుచరులు ద్వారా శేషించిన వారిని శిక్షిచబడుచున్న అ ఘోరమైన పోరాటములో వారికి వారు జయుంచలేక ఇక రక్షించేది దేవా నీవేనని దేవుని మీద భారము వేసియున్నారు. భూమి పై ఉన్నతమైన అధికారము పొందుకున్న వారు మృగమును పూజించమని బలవంతముచేయుదురు మరియు మరణము ద్వారానైనను మరియు హింసద్వారానైనను వారు ముద్ర వేయుదురు. దేవుడు ఇప్పుడు ఆయన ప్రజలకు సహాయం చేయును గాక. అలాంటి భయంకరమైన సంఘర్షణలో ఆయన సహాయం లేకుండా వారు ఏమి చేయగలరు! — సంఘమునకు ఉపదేశములు 5: 212, 213 (1882) . LDETel 180.3

    దేవుని ప్రజలు నగరాలు విడిచి పారిపోతారు; చాలా మంది ఖైదు చేయబడతారు

    క్రైస్తవ లోకములో వివిధ పాలకులు ఆజ్ఞలు ఆచరించ ప్రజలను వ్యతిరేకంగా జారీచేసే శాసనాలు ప్రభుత్వ పరిరక్షణను ఉపసంహరించి తనను నాశనం చేయుటానికి పూనుకొన్న శత్రువులకు వారిని విడిచి పెట్టగా దేవుని ప్రజలు నగరాలు ,పట్టణాలు మరియు గ్రామాలు విడిచిపెట్టి ప్రజలు లేని ఏకాంత స్థలాల్లో చిన్న చిన్న గుంపులుగా నివసిస్తారు. అనేకులకు పర్వతాల్లోన్ని స్థలాలు ఆశ్రయదుర్గాలవుతాయి .... కానీ అన్ని దేశాలలో మరియు అన్ని వర్గాలలో, అదికులలోను మరియు అదములలోను, ధనికులు మరియు పేదలు, నలుపు మరియు తెలుపువారిలోను అన్యాయమైన మరియు క్రూర మైన బానిసత్వానికి గురిఅవుతారు. దేవుని ప్రియమైన బిడ్డలు గొలుసులో కట్టబడి బందించబడతారు ఇలాగ శ్రమలు పాలైతారు, మరణ శిక్ష క్రింద ఖైదుల్లో మగ్గుతారు , కొందరు చీకటి కోట్లలో మరణించేందుకు మిగులివుంటారు. - మహా సంఘర్షణ , 626 (1911) LDETel 180.4

    దేవుని ప్రజలు నగరాలు విడిచి పారిపోతారు; చాలా మంది ఖైదు చేయబడతారు

    ఆజ్ఞలను ఆచరిస్తూ నివసించే వారిని చంపాడానికి సాదారణ శాసనం ఒక నిర్దిష సమయాన్ని పేర్కేంటున్నప్పుడు వారి శత్రువులు కొన్ని సందర్భాల్లో ఆ విషయము తెలుసుకొని నిర్దిష్ట సమయానికి ముందే వారిని చంపాడనికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రతి విశ్వాసి చుట్టు మోహరించి ఉన్న బలాడ్యులైన రక్షక భటుల్ని ఎవరు దాటి ముందుకు పోలేరు, పట్టణాలు, గ్రామలు నుండి పారిపోతున్నప్పుడు వారిని తమ శత్రవులు ఆటంకపరుస్తారు, కాని వారి మీదకు విసిరిన కత్తులు ముక్కలై గడ్డిపరకల్లా రాలిపోతాయి. ఇతరులు యుద్ధ శూరుల రూపముంలో ఉన్న దేవదూతలు ఆదుకొని కాపాడును. మహా సంఘర్షణ 631 (1911). పుట 596LDETel 181.1

    ఇట్టి సమయంలో దేవుని ప్రజలు ఒకే చోటులో అందరు లేరు. వారు వివిధ సంస్థలలో మరియు భూమి యొక్క అన్ని ప్రాంతాలలో ఉన్నారు; మరియు వారిని ఒంటరిగా విచారణ చేయుదురు, సమూహాముగా కాదు గానీ . ప్రతి ఒక్కరూ తన కొరకై పరీక్షలో నిలబడాలి.-ది ఎస్ డి ఏ . బైబిల్ కామెంటరీ 4: 1143 (1908).LDETel 181.2

    ప్రపంచంలో మరి ఇంకేవ్వరు లేనట్టు. సంఘములో వున్న సభ్యుల యొక్క వ్యక్తి గత విశ్వాసం పరీక్షంపబడుతుంది. ది ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 7: 983 (1890).LDETel 181.3

    గృహాలు మరియు పొలాలు ఉపయోగం లేదు.

    కష్ట సమయంలో ఇళ్ళు మరియు భూములు విశ్వాసులకు ఉపయోగపడవు, ఎందుకంటే వారు రౌద్రముతోను, కసితోనునిండియున్న ప్రజల మద్యనుండి పారిపోవలసి యున్నది, అప్పుడు ఆ సమయంలో సత్యము ముందుకు దూసుకొని వెళ్లిపోతున్న కారణమున, వారికున్న ఆస్థి ఐశ్వర్యము స్థితి గతులు ఎవరు పట్టించుకోరు వదిలి వేస్తారు...... కొందరు ఆస్తిని ఒదులుకొకుండ పట్టుకొని ఉండడం నేను చూచాను, వారి ప్రదాన కర్తవ్యము ఏమిటని దేవుని యొద్ద విచారించకపోతే ఆతని విది ఏమీటో అతనికి తెలియచేయబడకపోవును కాబట్టి అట్టి వారి ఆస్తిని ఉంచడానికి అనుమతి ఉంటుంది, మరియు ఆపద కాలములు వారిని నలుగగొట్టుటకు ఒక పర్వతమువలే వారి మీదకు దూసుకొని వస్తాయి, మరియు వారికి ఉండకుండ అమ్మి వేయుడానికి ప్రయత్నిస్తారు, కానీ అది వారికి సాధ్యము కాదు...... కానీ వారు నిజముగా ముందుగానే ఆలోచన చేసి ఉంటే, అవసరమైన సమయము వచ్చినప్పుడు ఎలా విక్రయించాలో మరియు ఎప్పుడు అమ్మాలో అతడు ఇతరులకు అవగాహనం కలుగ చేయువాడిగా ఉండును. -ఎల్లీ రైటింగ్ , 56, 57 (1851).LDETel 181.4

    ఇప్పుడు లోక సంపదలను పట్టుకొని వేలాడే సమయం లేదు ఇక చాలా ఆలస్య మైనది, అతి త్వరలో అవసరమైన గృహాలు మరియు భూములు ఎవరికైనా ప్రయోజనం వుండకపోవంచ్చు, ఎందుకంటే దేవుని శాపం భూమిపై మరింత ఎక్కువగా ఉంటుంది, మనకు హెచ్చరిక వస్తుంది “మీకు కలిగినవాటిని అమ్మి దర్మము చేయుడి (లూకా 12:33]. ఈ సందేశం విశ్వసము వున్న వారికి --హృదయాను సారముగా ప్రేమించే ప్రజలకు వారు గృహములు ఇచ్చుటకు ప్రేరేపించబడతారు, పంచంలోని తన పనిని పురోభివృద్ధి చేయడానికి దేవుని స్వంత ఆస్తి కానుకులు మరియు విరాళముల ద్వారా తిరిగి ఇవ్వబడవచ్చు. ---మాన్యుస్కిప్ట్ రిలీజ్ 16: 348 (1901).LDETel 182.1

    యాకోబు శ్రమలువలే వుంటుంది ఈ సమయము

    నాలుగవ ఆజ్ఞ పేర్కొంటున్న సబ్బాతు ఘనపరిచే ప్రజలకు వ్యతిరేకముగా శాసనం చివరగా వెలువడుతుంది. అట్టివారు అతి కఠిన శిక్షకు అర్హులని ఆ శాసనం పేర్కొంటు వారిని కొంత కాలము వ్యవది అనంతరము ప్రజలే చంపవచ్చునని స్వేచను ప్రకటిస్తుంది. పాత ప్రపంచములో రోమను మతం నవీన ప్రపంచములో ప్రోబస్టాంట్ మతం దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నవారి పట్ల అదే విధానాన్ని అవలంబించును.అప్పడు యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినముగా ప్రవక్త వర్ణించిన శ్రమలు దైవ ప్రజల మీద విరుచుకు పడ్డాయి. మహా సంఘర్షణ 615, 616 (1911)LDETel 182.2

    అయినప్పటికిని పూర్వము హతసాక్షులకు వలే దేవుని ప్రజలు తమ సాక్షాన్ని ప్రాణాత్యాగాలను ఇవ్వాల్సి వుంటుంది. మానవుల దృష్టిలో తోచినట్లు కనిపిస్తుంది. తమ శత్రువుల చేతిలో మరణించటానికే ప్రభవు తనను వదిలేశాడని వారు భయపడటం మొదలుపెట్టారు. అది నిజంగా భయాందోళనలు చోటుచేసుకొనే సమయం. విడుదల కోసం అహోరాత్రులు దేవునికి వారు మొర పెట్టుకొంటారు. అందరూ యాకోబులాగే దేవునితో పోరాడుతున్నారు. అంతర్గతంగా సాగుతున్న సంఘర్షణ వారి ముఖాల్లో కనిపి స్తుంది. ప్రతీ ముఖం వాలిపోయినట్లు కనిపిస్తుంది, అయినా వారి విజ్ఞాపన ఆగదు. మహా సంఘర్షణ 630 (1911)LDETel 182.3

    పోరాటం జరిగిన ఆ రాత్రి యాకోబుకు కలిగిన బాధాకరమైన అనుభవము క్రీస్తు రాకడముందు దేవుని ప్రజలు అనుభవించవలసిన మహా శ్రమను సూచిస్తుంది. పరిశుద్ధ దర్శనంలో ఈ కాలం వరకు చూస్తూ యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు, సమాధానము లేని కాలమున భీతిచేతను దిగులుచేతను జనులు కేక వేయగా వినుచున్నాము..... వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి, అయ్యోయెంత భయంకరమైన దినము, అట్టి దినము మరియొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చిన దినము. అయునను వారు దానిలోపడకుండ రక్షింప బడుదురు. యిర్మీయా(30, 5-7) పితరులు ప్రవక్తలు 30. 5-7LDETel 182.4

    దాగియున్న తప్పిదములు నీతిమంతుకు బహిర్గతం కాదు

    శ్రమకాలములో హింస, భీతి, బాధ గుప్పెట్లో ఉన్నప్పుడు దేవుని ప్రజలకు తాము ఒప్పకోకుండా ఉన్న పాపాలు తమ కళ్ళుముందు ఆడుతుంటే వారు నిస్పృహకు లోనవుతారు అనిన స్పృహవారి విశ్వాసాన్ని ఆపివేస్తుంది. విడుదలకోసం దేవునితో విజ్ఞాపన చేయుటానికి వీరికి దైర్యము చాలదు.తమ అయోగ్యతను గూర్చిన స్పృహ ఉంటుందిగాని, బహిర్గతం కావలసిన రహస్య పాపములు వారి కుండవు. అవి ముందే తీర్పులో పరిగణకు రావటం, క్షమాపణ పొంది తుడిచివేయబడటం జరిగింది. అవి వారికి జ్ఞాపకానికి రావు. మహా సంఘర్షణ 620 (1911)LDETel 183.1

    ఆయనకున్న శక్తి విషయములో వారి ఓర్పును, వారి నమ్మకాన్ని దేవుడు పరీక్షిస్తాడు. తమ పరిస్థితి నిరాశాజనకమని ,తమ పాపాలు ఎంతో ఘోరమైనందున వాటకి క్షమాపణ ఉండదని వారిని భయపెట్టటానికి సాతాను ప్రయత్నిస్తాడు. తాము చేసిన పాపాలు గురించి వారికి బాగా తెలుసు. తమ జీవితాన్ని అవలోకన చేసుకొన్నప్పుడు వారికి నిరీక్షణ కనపించదు, కాగ దేవుని మహా కృపను చిత్తశుద్ధితో కూడిన తమ సొంత పశ్చాతాపాన్ని జ్ఞాపకము చేసుకొని పశ్చాతాపము పొందిన పాపులకు క్రీస్తు ద్వారా ఆయన చేసిన వాగ్దానములను వారు విశ్వసించెదరు. తమ ప్రార్ధనలకు వెంటనే జవాబు రానందున వారి విశ్వాసము సన్నగిల్లదు. యాకోబు దూతను గట్టిగా పట్టుకొనట్లు , వారు దేవుని పట్టుకొని , నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నిన్ను పోనియ్యమంటారు.- పితరులు ప్రవక్తలు ,202 (1890).LDETel 183.2

    పరిశుద్ధులు వారి జీవితాలను కోల్పోరు

    దుష్టులు ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో మరియు మృగం యొక్క శాసనమునకు గాని లేదా దాని యొక్క ముద్రకు గాని నమస్కారము చేయకుండా దైర్యముగా నిలువబడుతారో వారిని దేవుడు బాదించడు, పరిశుద్ధులను హత మార్చుము అని దుష్టులకు అనుమతి ఇవ్వడం నేను చూచాను, సాతాను మరియు అతని దుష్ట ప్రతినిదులు మరియు దేవుణ్ణి అసహ్యించుకున్న వారందరూ సంతోష పడ్డారు, మరియు ఈ అంతిమ పోరాటములో ఆయనను ప్రేమించి ఆయన రాకడ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వారి మీద సాతాను విజయము సాదించే శక్తి కలిగి ఉండటం ఆహా అతనికి ఎంత గొప్ప గౌరవం! అయితే పరిశుద్ధుల ఆలోచనను వెక్కిరించిన వారందరు, దేవుని ప్రజలు రక్షించబడుటము మరియు గొప్ప దివ్యమైన విడుదల పొందటం వారు ప్రత్యక్షంగా చూస్తారు, దానికి వారే సాక్ష్యలు.- ఎల్లీ రైటింగ్స్, 284 (1858).LDETel 183.3

    దేవుని ప్రజలకు శ్రమలు కలుగుతాయి. అయితే వారు హింసకు దుఃఖానికి గురి ఆయునప్పుడు ఆకలిగొని బోజనానికి అల్లాడేటప్పుడు మరణించటానికి వారిని విడిచి పెట్టడు దేవుడు. మహా సంఘర్షణ 629 (1911).నమ్మకమైన క్రీస్తు సాక్షుల రక్తం ఈ సమయంలో బందించటం జరిగితే అది హతసాక్షుల రక్తంలా దేవుని ఆద్యాత్మిక పంట పండటానికి విత్తే విత్తనంగా వరిణ మించును.- మహా సంఘర్షణ 634 (1911)LDETel 184.1

    దేవుడు అనుగ్రహించును

    శ్రమ కాలములో తాత్కాలికమైన సంపదలకై ప్రణాలికలు ఏర్పాటు చేసుకోవడం బైబిలుకు విరుద్ధమని దేవుడు పదే పదే నాకు చూపించినాడు., మరణాలు కరువులు, తెగుళ్లు భూమిమీద హింసకు గురి చేస్తున్నప్పుడు ఆ కష్ట సమయమందు భక్తులు కొరకు ఆహారము సమకూర్చుకోవడంగాని లేక పొలములో పంటలు పండించుకోవటం చేస్తే, కఠినాత్ములు దోచుకుపోవడం మరియు అన్యులు పండిన పంటలను కోసుకొని పోవుటం నేను చూచాను. అట్టి సమయమందు మనము పూర్తిగా దేవునిపై నమ్మకము కలుగివుండాలి, ఆయన మనల్ని కాపాడును ఆ సమయంలో మనకు అహారం మరియు నీళ్ళు ఖచ్చితంగా దోరుకుతాయని నేను చూశాను మరియు మనకు కొదువుగాని లేక ఆకలితో అలమటించంగాని వుండదు, దేవుడు అరణ్యంలో అహారం ఒక బల్ల మీద పరుచునట్టుగా ఏర్పాటుచేయును. అవసరమైతే ఆయన కాకోలంతో ఎలీయాను పోషించిన రీతిగా మనకు ఆహారం పంపించగలడు, అలాగే ఇశ్రాయేలీయుల కోసం మన్నా ఆకాశము నుండి కురుపించి తృప్తి పరిచిన విదముగా మనలను పోషించగలడు- ఎర్లీ రైటింగ్స్ 56 (1851) కష్టకాలం మనకు ముందు ఉందని నేను చూచియున్నాను, ఖచ్చితమైన అవసరతలు బలవంతం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని ప్రజలను ఆహారం మరియు నీళ్లు కొసం అలమటించి జీవించాలి.... అపద కాలములో పని చేయుటకు అవకాశం లేదు ఎవ్వరు పని ఇవ్వరు, వారి బాధలు మానసికంగా ఉంటాయి, అయితే దేవుడు వారికి ఆహారాన్ని అనుగ్రహిస్తాడు.. ఎం ఎస్ 2, 1858.LDETel 184.2

    అపదకాలములు మన ముందు ఉంది, అప్పుడు కఠినమైన అవసరతలు ఏర్పడునప్పుడు దేవుని ప్రజలు స్వయముగా తిరస్కరించబడతారు మరియు కేవలం వారి జీవితం నిలుపుకోవడానికి తింటారు. అయితే ఆ సమయము కొరకు దేవుడు మనలను సిద్ధం చేస్తాడు. ఆ భయానక గడియలో మన అవసరాలు తీర్చుటకుదేవుని అవకాశం అప్పుడే ఆయన శక్తిని అనుగ్రహించి ఆయన ప్రజలను కాపాడును. - సంఘమునకు ఉపదేశములు 1: 206 (1859).LDETel 184.3

    కష్టకాలములో శేషించిన వారు కొర గానము చేయబడిన ఆహారం మరియు నీళ్లు దొరుకుతాయి. -- ది స్టోరీ ఆప్ రెడెంప్షన్, 129 (1870).LDETel 185.1

    క్రీస్తు రాకడముందు సంభవించున్న శ్రమ కాలములో నీతిమంతులకు పరిశుద్ధ దూతలు పరిచర్య ద్వారా భద్రత కలుగుతుంది. పితరులు - ప్రవక్తలు 256 (1890).LDETel 185.2

    మధ్యవర్తి అవసరము లేదు క్రీస్తుతో నిరంతరము సంభాషిచవచ్చు

    క్రీస్తు తన ప్రజలనిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి వారి పాపాలు తుడిచి వేస్తాడు, ఆయన రాజ్యపౌరుల సంఖ్యను కూడ నిర్ధారించటం జరిగింది. ఆయన గుడారాన్ని విడిచి పెట్టినప్పుడు భూనివాసుల్ని అధికారం అలుముకుంటుంది. ఆ భయంకర సమాయంలో నీతిమంతులు పరిశుద్ధ దేవుని సముఖంలో విజ్ఞాపకుడు లేకుండా నివసించాలి.- మహా సంఘర్షణ 613, 614 (1911).LDETel 185.3

    ఈ భయంకర గడియల్లో ప్రభువు తన ప్రజలను మర్చిపోతాడా? శత్రువులు వీరిని ఖైదులో వేసినా వారి ఆత్మలకు మద్య ఉత్తర ప్రత్యుత్తరములు ఖైదు గోడలు ఆపలేవు. వారి బలహీనతల్ని చూడగలిగినవాడు, ప్రతి శోధనను ఎరిగిన వాడు. ఆయన ప్రభువు లోక అధికారలన్నిటికిని పైగా వున్నాడు. పరలోకం నుంచి వెలుగును సమాధానాన్ని పట్టుకొని వచ్చి దేవదూతలు వారి వద్దకు వస్తారు. ఖైదు రాజభవనం అవుతుంది. ఎందుచేతనంటే విశ్వాసంలో భాగ్యవంతులు అక్కడ నివసిస్తారు. పిలిప్పులోని చెరసాలలో పౌలు, సీలలు మధ్యరాత్రిలో ప్రార్ధన చేసి స్తుతి గీతలు పాడినప్పుడు సంభవించినట్లు చీకటి గదులు వెలుగుతో నిండుపోవును. -మహా సంఘర్షణ 626, 627 (1911).LDETel 185.4

    దేవుని యొక్క మహిమయు మరియు గత కాలము యొక్క వేధింపుల పునరావృతం మిళితమైనప్పుడు ఆ కాలమందు భూమి మీద జీవించిన దేవుని ప్రజలు ఏవిధమైన అనుభవము పొందియున్నారో అని ఒక ఆలోచన ఇవ్వటం అసాధ్యం. వారు దేవుని సింహాసనం నుండి వచ్చిన వెలుగులో నడుస్తారు. దేవదూతల ద్వారా పరలోకమునకు మరియు భూమికి మద్య నిరంతర సంభాషణ ఉంటుంది .... రానైయున్న ఆపద కాల సమయంలో - భూమి పుట్టినది మొదలుకొని ఏన్నడు ఎరగని శ్రమల సమయమది-- దేవుని ఎంపిక చేసుకోనిన ప్రజలు ఆయన కొరకు నిలబడతారు,LDETel 185.5

    సాతాను, ఆయన సమూహం వారిని నాశనం చేయలేడు, శక్తివంతమైన దేవ దూతలు వారిని కాపాడుతారు.. సంఘమునకు ఉపదేశములు.. 9:16, 17 (1909)LDETel 185.6

    దేవుని ప్రజలు పాపభరిత కోరికలను పంచుకోరు

    మన ప్రదాన యాజకుడు మన కోసం ఇప్పుడు ప్రాయశ్చిత్తము చేయుచుండగా మనము క్రీస్తులో పరిపూర్ణులం కావటానికి ప్రయత్నించాలి. మన రక్షకుడు శోదనలకు లోంగటమన్నది తలంపులో కూడ సాధ్యంకాని పని. మాన వహృదయాలలో సాతనుకు చోటు దోరికే అంశము ఏదోవుంటుంది. ఏదో పాపవాంఛ చోటుచేసు కుంటుంది. దాని ద్వారా అతని శోధనకు స్థానము దొరుకుతుంది. క్రీస్తు తన్ను గూర్చి తాను ఇలా అన్నాడు ఈ లోక అదికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబందమేమియు లేదు, యోహాను 14, 30 తనకు విజయము చేకూర్చే లక్షణం సాతనికి దైవకుమారునిలో కనిపించలేదు. ఆయన తన తండ్రి ఆజ్ఞల్ని ఆచరించాడు. సాతను ఉపయోగించుకోటానికి ఆయనలో పాపాము లేదు. ఆ ఆపత్కాలములో నిలవాలనే దైవ ప్రజలు పరిస్థితి ఇలా పరిశుద్ధంగా ఉండాలి. మహా సంఘర్షణ 623 (1911).LDETel 185.7

    అహంకారమునకు వ్యతిరేకముగా పోరాటం

    సాతను ఆధిపత్యం సాగినంత కాలం మనం స్వార్ధాన్ని జయంచాల్సి ఉంటుంది. చిక్కులు పెట్టే పాపాల్ని జయించాల్సి ఉంటుంది. ప్రాణం ఉన్నంతకాలం నిలిచేందుకు స్థలం ఉండదు. ఒక చోటుకి చేరి సంపూర్తిగా సాదించాను అనటానికి లేదు. జీవితాంతం కనపరిచిన విదేయత ప్రతిఫలముగా వచ్చెది పరిశుద్ధత. అపోస్తులుల కార్యములు 560, 561 (1911).LDETel 186.1

    శరీర సంబందమైన మనస్సుకు వ్యతిరేకంగా నిరంతరం జరిగే పోరాటం కొనసా గించాలి; మరియు దేవుని దయ యొక్క శుద్ధి ప్రభావము ద్వారా మనము సాయపడాలి, ఇది మనస్సును ఆకర్షించి స్వచ్చమైన మరియు పవిత్రమైన పనులను ధ్యానించుటకు ఇది అలవాటుపడుతుంది. సంఘమునకు ఉపదేశములు..2: 479 (1870)LDETel 186.2

    మన స్వంత మనసులో ఒక అవాస్తవమైన ప్రపంచాన్ని సృష్టించుకొనవచ్చు లేదా సాతాను యొక్క శోధనలకు చెడును ప్రలోభించలేని ఆదర్శవంతమైన ఆలయమును చిత్రీకరించవచ్చు, కానీ పరిపూర్ణత మన ఊహలోనే ఇమిడియున్నది. .-రివ్యూ అండ్ హెరాల్డ్, ఆగస్టు 8, 1893.LDETel 186.3

    మానవులు పవిత్ర శరీరమును పొందినప్పుడు, వారు భూమిమీద ఉండరు, అయితే వారుపరలోకానికి తీసుకొని పోబడతారు ఈ జీవితంలో పాపం క్షమించబడినా, దాని ఫలితాలు ఇప్పుడు పూర్తిగా తొలగించబడవు. క్రీస్తు రాకడ సమయమందు మన క్షయమైన శరీరమును మార్చు, మహిమగల శరీరమును వలే ఆయన స్వరూపములే పోలియుండను”- సెలెక్ట్డ్ మెసెజ: 2:33 (1901).LDETel 186.4

    144,000

    వారు సింహసనం ముందు ఒక క్రొత్త కీర్తన పాడేదరు, ఆకీర్తనను 144 వేల మంది తప్ప ఇంకెవరూ నేర్చుకోలేరు. అదే మోషే కీర్తన గొఱ్ఱపిల్ల కీర్తన. ఆకీర్తనను 144 వేల మంది మినాహా మరెవరూ నేర్చుకోలేరు. వారికి కలిగిన అనుభమం ఇంకే జనాంగానికి ఎన్నడు కలుగలేదు, వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లును ఆయనను వెంబడింతురు,వీరు జీవిస్తున్నవారి మధ్య నుంచి సజీవంగా కొనిపోబడ్డవారు.వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రదమపలముగా, పరిగణింపబడతారు. ప్రకటన 15, 2,3 14, 1-5,వీరు మహాశమల నుండి వచ్చినవారు, జనులు రాజ్యంగా కూడిన కాలము నుంచి నేటి వరకు ఎన్నడు కలుగనంత శ్రమను అనుభవించి ఉన్నారు. యాకోబు సంతతి వారికి వాటిల్లే ఆపదకాలములో వారు కఠోర శ్రమల్ని అనుభవించారు. చివరిగా దేవుని తీర్పులు లోకం మీద పడేటప్పుడు ఉత్తరవాదిలేకుండా శ్రమలు భరించి వారు స్థిరముగా నిలిచి ఉంటారు. -మహా సంఘర్షణ 648,649 (1911LDETel 186.5

    లక్ష నలభై నాలుగు వేల మంది పాడిన పాట ఎవరు స్వరకల్పన చేసారు అనే ప్రశ్నలు ద్వారా ఆద్యాత్మిక జీవితానికి తోడ్పడని వాటియందు వివాదాము పెంచుకొని ఘర్షణ పడడం ఆయన చిత్తమే కాదు? దేవునిచే ఎన్నుకోబడిన వారు కొద్దికాలంలోనే ప్రశ్న వేయకుండనే వారికి సమాధానము దొరుకుతుంది.. సెలెక్ట్ మెసెజన్స్ 1: 174 (1901).LDETel 187.1

    దేవుని ప్రజలకు విముక్తి

    సాతాను యొక్క సైన్యము మరియు దుష్ట జనాంగము భక్తులను చుట్టూ ముట్టెదరు, మరియు వారి నుండి తప్పించుకోవడానికి మార్గం కనిపించదు కాబట్టి వారు హరధ్వనులు చేయుదురు. కానీ వారి అనందడి లికలలోను మరియు విజయ ఆనందం హర్షద్వనుల మద్య గొప్ప ఉరుము శబ్దము వినిపిస్తుంది. ఆకాశమంత నల్లనిరూపము అలుముకొన్నది. అంతట పరలోకము నుండి జ్వలించే వెలుగు ప్రకాశించుచున్నది మరియు అమోగమైన మహిమ కాంతిలో తన పరిశుద్ధస్థలము నుండి దేవుడు యొక్క స్వరము వినిపించుచున్నది. భూమి యొక్క పునాదులు కదిలించబడేను, భవనాలు, భయంకరమైన ప్రమాదానికి గురవుతాయి. ఒక కుండలో నీరు కాగినట్లు సముద్రములో నీరు మరుగుచు మరియు భూమి మొత్తము అల్లకల్లోలంగా మారుతుంది, బందించ బడ్డ నీతిమంతులు మెల్లగా ఒకరి వైపు ఒకరు తిరిగి ఇది మదురమైన కమ్మని దేవుని స్వరం అంటు ఎంతో ఆశక్తితో మనము విడుదల పొందియున్నామని చెప్పుకొందురు “. సంఘమునకు ఉపదేశములు. 1: 353, 354 (1862)LDETel 187.2

    దైవ ధర్మశాస్త్రాన్ని గౌరవించే వారినుంచి ప్రభుత్వ శాసనాల పరిరక్షణ ఉపసంహరించుటం జరిగినప్పుడు వారిని నాశనం చేయాలంటూ వివిద దేశాలలో ఏక సమయములో ఉద్యమాలు లేస్తాయి. శాసనం నిర్దేశించిన సమయం దగ్గరపడే కొద్ది ద్వేషానికి గురి అవుతున్న ఆ వర్గం ప్రజల్ని మట్టుపెట్టటానికి ప్రజలు కుట్ర చేస్తారు. ఒక రాత్రి దాడి జరిపి చావుదెబ్బకొట్టుట ద్వారా అసమ్మతిగళాన్ని శాశ్వతంగా నొక్కేయాలని తీర్మానము తీసుకుంటారు. వైదుల్లో మగ్గుతు అరణ్యాలు కొండల్లో తలదాచుకొంటున్న దేవుని ప్రజలను కాపుదల కోసం విజ్ఞాపన చేస్తు ఉండగా దుష్టదూతలు ప్రోత్సహముతో ప్రతీ చోటా సాయుధులైన మనుష్యులు సంహరణ కార్యానికి సన్నద్ధమౌతారు. అతి తీవ్రమైన ఈ దశలో తాను ఎంపిక చేసుకొన్న ప్రజలు విడుదలకు ఇశ్రాయేలు దేవుడు కలుగజేసుకొంటాడు. జయనినాదాలు,ఎగతాళి కేకలు, శాపనార్ధాలతో దుష్టప్రజలు సమూహాలు బాధిత ప్రజలు మీదకి త్రోసుకురావటినికి సిద్ధంగా ఉన్న తరుణంలో రాత్రి చీకటిని మించిన దట్టమైన చీకటి భూమండలాన్ని ఆవరిస్తుంది...... తన ప్రజల విడుదల విషయంలో తన శక్తిని మద్యరాత్రిలో ప్రదర్శిస్తాడు. నల్లటి మేఘాలు వచ్చి ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. కల్లోలమైన అంతరిక్షములో స్పస్టంగా నిర్మలంగా కనిపించే స్థలము ఉంటుంది. అది వర్ణించలేని మహిమతో నిండి ఉంటుంది. అక్కడ నుండి విస్తార జలాలు ధ్వని వంటి దైవస్వరం సమాప్తమైనది, ప్రకటన 16, 17 అని చెప్పటం వినిపిస్తుంది. ఆ స్వరం శబ్దానికి భూమ్యాకాశములు కంపింస్తాయి. లోకంలోని ప్రఖ్యాత నగారలు కుప్పకూలిపోతాయి. తమ వ్యక్తిగత ప్రాభావాన్ని చాటుకోవటానికి ప్రఖ్యాత ప్రజాపాలకుడు నిర్మించుకొన్న రాజభవనాలు వారి కళ్లముందే కూలిపోతాయి. ఖైదు గోడలు బద్దలవుతాయి. తమ విశ్వాసం నిమిత్తం ఐదు పాలైన దైవ ప్రజలు విడుదల పొందుతారు. మహా సంఘర్షణ , 635-637 (1911).LDETel 187.3