Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    5 అధ్యాయము - శేషించిన వారి భక్తి జీవితం

    రెండంతల జీవితం

    ఈ యుగంలో, ఆకాశ మేఘాలలో నుండి, క్రీస్తు రెండవ సారి రాక మును:-- (బాప్తీస్మము ఇచ్చు యోహాను చేసిన పనినే చేయవలసి ఉన్నది. దేవుని యొక్క గొప్ప దినమున నిలబడటానికి ప్రజలను సిద్ధం చేయగలిగే వ్యక్తులను దేవుడు పిలుస్తాడు..... యోహాను ఇచ్చిన సందేశం ఇవ్వాలంటే, అతనుకు ఉన్న ఆద్యాత్మిక అనుభవము ఉండాలి.అదే పనిలో మనము నిమగ్నమైవుండాలి, మనము దేవుణ్ణి చూడలి ఎప్పుడైతే ఆయనను దర్శిస్తామో అప్పుడు స్వార్ధ దృష్టిని వీడేదము. -సంఘమునకు సాక్ష్యము 8: 332, 333 (1904).LDETel 42.1

    దేవునితో సహవాసము కలిగివుంటే ప్రవర్తన మరియు జీవితము గౌరవించ బడుతుంది, యేసుతో ఉన్న మొదటి శిష్యులవలె, మనము కూడ ఉంటే మనుష్యులు మనలను గూర్చి తెలుసుకుంటారు. ఇది సేవకునికి శక్తిని ఇస్తుంది, దానికి మించినది ఏది ఇవ్వగలదు, ఈ శక్తి చేత తనకు తాను నష్టము చేసుకొనుటకు అవకాశము తెచ్చుకో కూడదు. మనం రెండంతల జీవితము గడపాలి, ఆలోచన మరియు కర్తవ్యము గల జీవితమలో మౌన ప్రార్ధన మరియు యదగ్ధమైన జీవితం కలిగి వుండాలి, మినిస్ట అప్ హీలింగ్ 512 (1905).LDETel 42.2

    ప్రార్ధన మరియు ప్రయత్నం, ప్రయత్నం మరియు ప్రార్థన, ఇది మీ జీవితం యొక్క అనుదిన కర్తవ్యము. దేవునికి మనము సమర్థతలోను మరియు ప్రశంసములతో ను ఆరాదిస్తున్నప్పటికి, మరియు ఈ పని నా సొంతమైనదిగా బాద్యతతో చేస్తున్నప్పటికిని, మీరు ప్రార్ధన చేయాలి, సంఘమునకు ఉపదేశములు 4: 538 (1881)LDETel 42.3

    ఎవరు ప్రార్ధన లేకుండా ఒక దినముగాని లేదా ఒక గడియగాని సురక్షితంగా ఉంటారు. - మహా సంఘర్షణ530 (1911)LDETel 42.4

    ఎవరు ఏమీ చేయకుండ వుంటారు కాని ప్రార్ధన మాత్రము ఎడతెగగా ప్రార్ధన చేసేటట్లు చేస్తుంది. క్రీస్తు యెద్దకు మెట్లు, 101 (1892).LDETel 42.5

    దృఢముగా క్రీస్తులో నాటబడుట

    తుపాను చెలరేగుతుంది, ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసం ఏ విదమైనదిగావున్నాయని తుపాను కనిపెట్టుచున్నది, విశ్వాసులు ఇప్పుడు క్రీస్తులో బలంగా పాతుకుపోతారు, లేదంటే కొందరు పొరపాటు వలన తప్పుదారి పడతారు.. ఎవంజీలిజం. 361, 362 (1905).LDETel 42.6

    క్రీస్తు జీవితపు ఆలోచనా ధోరణిలో మనము ప్రతిరోజూ ఒక గంట సమయము శ్రద్ధగా గడుపితే మంచిది. మనము విషయము వెంబడి విషయము తీసుకోవాలి మరియు ప్రతి సన్నివేశాన్ని, మరిముఖ్యముగా సమిపముగా ఉన్న వాటిపై దృష్టి సాదించుము. యుగయుగాల ఆకాంక్ష, 83 (1898)LDETel 43.1

    క్రీస్తుని మన హృదయములో ధ్యానించుచు అతని నీతి యందు విశ్వాసము కలిగి యున్నప్పుడు దుష్టత్వమును చేదించగలము, మనము దేవునితో సన్నిహిత సంబంధము కలిగి వుండకపోయున యెడల మనము స్వార్ధపూరితమైన ప్రేమ, స్వయం సంతృప్తి మరియు పాపము చేయాలనే కోదన లాంటి దుష్ట ప్రభావలను ఎన్నడూ అడ్డుకోలేము. మనము సాతానుతో దూరముగా ఉండే సమయములో మనము చాలా చెడు అలవాట్లను వదిలివేస్తాము, కానీ దేవునితో విషేశమైన సంబంధం లేకుండా వుంటే అది సాద్యము కాదు, ఎప్పుడైతే మనము క్షణక్షణము ఆయనకు పూర్తిగా సమర్పించు కుంటామో అప్పుడు అదిగమించగలము, క్రీస్తుతో వ్యక్తిగత పరిచయము లేకుండా మరియు నిరంతర సంబంధము లేకుండా వుంటే , మనము శత్రువు యొక్క దయలో ఉంటాము కాబట్టి చివరకు అతని ఆజ్ఞనుసారముగా చేస్తాము.- యుగయుగాల ఆకాంక్ష 324 (1898).LDETel 43.2

    సంభాషణ, మరియు మన అత్యంత సంతోషకరమైన భావోద్వేగాలు అనేవి క్రీస్తు మరియు ఆయనను సిలువ వేయడం గూర్చిన అంశమై ఉండాలి. క్రీస్తు యొద్దకు మెట్లు, 103, 104 (1892).LDETel 43.3

    పరిశుదాత్మ ద్వారా మలుచుట

    దేవుని ఆత్మచేత మనము మలచబడుటకు సమర్పించబడునంత వరకు మానవ హృదయంలో సంతోషము ఎన్నటికీ పొందలేదు. యేసు క్రీస్తుకు అనుగుణంగా రూపు దిద్దుకున్న నూతనమైన ఆత్మ అని పరిశుదాత్మ రూడుపర్చును, ఆత్మ ప్రబావం వలన దేవునికి వ్యతిరేకంగావున్న శత్రుత్వం, అది విశ్వాసమునకును, ప్రేమకును, మరియు అహంకారం వినయమునకు మార్చును. ఆత్మ సత్యము యొక్క సౌందర్యమును గ్రహించును, మరియు క్రీస్తు ఘనతలోను మరియు పరిపూర్ణమైన స్వబావములోను గౌరవించబడును. అవర్ హై కాలింగ్, 152 (1896)LDETel 43.4

    మన స్వభావం యొక్క ప్రేరణ కాదు, మనస్సు యొక్క సామర్థ్యం కాదు హృదయం యొక్క అభిరుచి కాదు, కానీ దేవుని ఆత్మ యొక్క నియంత్రణలో క్షణం క్షణం ఉండటం అవసరం.- పితరులు - ప్రవక్తలు, 421 (1890).LDETel 43.5

    ఆత్మ మనలోనున్న చీకటిని వెలుగుగా మార్చుచున్నాడు, మన అజ్ఞానాన్ని తెలియచేస్తున్నాడు, మరియు మన ఆవశ్యక అవసరాలలో మనకు సహాయపడు తున్నాడు. అయితే మనస్సు నిరంతరం దేవుని వైపు పరిగెత్తాలి . మనము ప్రార్థన చేయాలనే కోరిక లేదంటే, బలం మరియు జ్ఞానములకు మూలమైన, ఆయనతో సహవాసము కోరుకోకపోతే, ఆత్మ మనతో ఉండడు.- అవర్ హై కాలింగ్, 154 (1904).LDETel 43.6

    బైబిల్ బోధ యొక్క అవసరము

    అనుదినము వాక్యమనే ఉప్పులో వేయబడకపోయిన యెడల పునరుద్ధరించబడిన హృదయము కమ్మని సారము కలిగి వుండదు.. దైవ కృప ప్రతిరోజు పొందుకొవాలి, లేని యెడల ఏ మనుష్యుడు మారిన వ్యక్తిగా వుండడు. అవర్ హైడ్ కాలింగ్, 215 (1897).LDETel 44.1

    మన విశ్వాసం దేవుని వాక్యము ద్వారా నిరూపించబడాలి. సత్యమైన సజీవ సాక్ష్యాన్ని గట్టిగా పట్టుకోండి. క్రీస్తు వ్యక్తిగత రక్షకునిగా విశ్వాసం కలిగి ఉండండి. ఆయన మనకు ఎల్లప్పుడు ఆశ్రయ దురముగా వుండును,గొప్ప ఆశ్చర్యకరమైన రీతిలో ప్రపంచం దేని కొరకైనను విచ్చిన్నమైపోతున్న విస్మయానికి క్రైస్తువులు సిద్ధపడాలి, మరియు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా, దాని నియమాలకుLDETel 44.2

    తమ జీవితాలను అనుగుణంగా కృషి చేయడం ద్వారా వారు సిద్ధపడాలి -- ప్రవక్తలు - రాజులు, 626 (c. 1914) (c. 1914). బైబిలు సత్యాలతో మనసును బలపర్చినవారే తప్ప మరి ఎవరు కాదు ఈ అంతిమ గొప్ప పోరాటముల ద్వారా నిలదొక్కుకుందురు.మహా సంఘర్షణ, 593, 594 (1911)LDETel 44.3

    కేవలం లేఖనాల యెడల శ్రద్ధగల విద్యార్థులు మరియు సత్యమైన ప్రేమను పొందుకోనినవారు మాత్రమే లోకాన్ని చెరపట్టే మెసాల్లో పడకుండ కాపుదల పొందుతారు. ..- మహా సంఘర్షణ, 625 (1911).LDETel 44.4

    దేవుని యొక్క వాక్యము మన ప్రజలు అర్థం చేసుకోవలసిన అవసరము వుంది, వారు వెల్లడించిన సత్య సూత్రాలపై క్రమబద్ధమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి, కనుక భూమి మీద ఏమి జరుగుతుందనేది వారికి అవగాహనము ఉంటుంది మరియు వారు సిద్ధాంత పరమైన ప్రతి ఉద్రేకమునుండి నిరోదించవచ్చును, సంఘమునకు ఉపదేశములు. 5: 273 (1885)LDETel 44.5

    జ్ఞప్తికి తెచ్చుకొనుటకు లేఖనములను సమర్పించు

    ప్రతి దినము అనేక సార్లు మన ప్రార్ధనలు మరియు లేఖనాల అధ్యయనం విలువైన బంగారు క్షణము వలే పవిత్రంగా ఉండాలి, అది జ్ఞాపకార్థానికి ఒక వచనాన్ని మాత్రమే స్వాధీనము చేసుకుంటే అది ఆద్యాత్మిక జీవితము ఉనికిలో ఉంటుంది.- సంఘమునకు ఉపదేశములు 4: 459 4: 459) )LDETel 44.6

    దేవుని విలువైన వాక్యం యువకులకు ప్రమాణముగా ఉండాలి అది అకాశమందున ఆశీనుడైయున్న రాజుకు నమ్మకముగా వుండే విదముగా చేస్తుంది.వారు అధ్యయనము చేయుటకు లేఖనాలు వెంబడి లేఖనాలను, మరియు దేవుడు చెప్పిన విషయములో జానమును సంపాదించుకొనుటకు సమర్పించుకొననీయుడి-మై లైప్ టుడే, 315 (1887) మీ చుట్టూ దేవుని వాక్యమనే గోడని నిర్మించుకొనవలెను మరియు ప్రపంచములో ఏ శక్తి దానిని పడగొట్టలేకపోవపటం మీరు చూస్తారు, దైవ లేఖనములు జ్ఞాపకములో వుంచుకొనిడి, సాతానుడు శోధించుటకు వచ్చినప్పుడు అతనిపై దైర్యముగా బానము వేసినట్టు విసరండి. ఇలాగా “వ్రాయబడియున్నది” మన ప్రభువు సాతాను యొక్క శోధనలను ఈ విదముగానే ఎదురుకొని దానిని జయుంచెను.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఏప్రిల్ 10, (1888)LDETel 44.7

    జ్ఞాపకాలను గుర్తి చేసే గదిలో క్రీస్తు యొక్క అమూల్యమైన మాటలు బద్రము చేయవలెను. అవి వెండి లేదా బంగారు కన్నా ఎంతో విలువైనవిగా ఉండాలి.సంఘమునకు ఉపదేశములు 6:81 (1900)LDETel 45.1

    మీరు పని చేసేటప్పుడు జేబులో బైబిలును మీతో ఉంచుకొనుము, దాని విలువైన వాగ్దానాలను సమర్పణతో కంఠస్తము చేసే అవకాశాన్ని మెరుగు పరుచుకొనుము.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఏప్రిల్ 27, 1905. ఒక సమయముంటు వస్తుంది అనేకులు వ్రాయబడిన వాక్యం లేకుండ చేయుదురు, అయితే ఈ వాక్యము జ్ఞాపకంలో ముద్రితమైతే, ఎవరూ మన నుండి తీసివేయలేరు.-మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 20:64 (1906).LDETel 45.2

    దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, విలువగల వాగ్దానములను జ్ఞాపకముంచు కొనిడి, ఎప్పుడైతే బైబిలును మన యొద్దనుండి తీసుకొనినపుటికిని దేవుని వాక్యమును చేప్పగలిగే స్థితిలో వుంటాము.-మాన్యుస్క్రిప్ట్ రిలీజెస్ 10: 298 (1909).LDETel 45.3

    ప్రకటన 14 దేవుని ప్రజలకు ఒక పట్టు కొమ్మ

    ఈ కడవరి కాలములో మనము మొదటది, రెండవది మరియు మూడవ దేవాదూతలు వర్తమానం యొక్క పూర్తి అర్థం తెలుసుకునే బాధ్యత వుంది. మన వ్యవహారములన్ని దేవుని వాక్యమునకు అనుగుణంగా ఉండాలి. మొదటది, రెండవది, మరియు మూడవ దూతల సందేశాలు అన్ని ఐక్యమై ఉన్నాయి మరియు ప్రకటన పదునాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి చివరి వరకు వెల్లడి చేయ చున్నది.- మాన్యుస్క్రిప్ట్ రిలీజెస్ 13:68 (1896).LDETel 45.4

    మూడవ దూత వర్తమానం స్వీకరించిన చాలామంది. మొదట రెండు దూతల సందేశాలలో అనుభవం కలిగి ఉండరు. సాతాను ఈ విషయాన్ని గ్రహించాడు కనుక వారిని పడగొట్టుటకు అతని కను దృష్టి వారి మీద పడుతుంది. అయితే మూడవ దూత వర్తమానము అత్యంత పవిత్ర స్థలానికి గురిపెట్టి వారికి చూపిస్తున్నాడు, మరియు పూర్వ సందేశాల్లో అనుభవజ్ఞులైన వారికి పరలోక గూడారము వైపు చూపిస్తున్నాడు.చాలామంది మూడు దూతల వర్తమానం యొక్క సంబంధ విధానమువున్న సత్యాన్ని చూసి, వారి క్రమంలో వారిని సంతోషంగా స్వీకరించి, విశ్వాసము ద్వారా క్రీస్తుని అనుసరించి పరలోక గూడారములోనికి ప్రవేశించారు, ఈ సందేశాలు నాకు దేవుని ప్రజలకు ఒక పట్టు కొమ్మ వలే సూచించబడినది, ఎవరైతే వాటిని అర్థం చేసుకుని, అంగీకరించించెదరో వారు సాతాను యొక్క భ్రమలలో మునిగిపోకుండా బద్రము గవుంచును - ,ఎల్లీ రైటింగ్స్ 256 (1858).LDETel 45.5

    దేవుని వాక్యమును నమ్మమని మనస్సుకు భోదించుము

    దేవుని వాక్యమును ప్రశ్నించాడినికి స్వేచ్చగా భావించేవారు అవిశ్వాసంగా ఉండటానికి అవకాశం ఉన్న ప్రతిదానిని అనుమానించెదరు అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసం కలిగి ఉండటానికి విపరీతమైన పోరాటం అవసరమవుతుంది. అవిశ్వాసం యొక్క విధానములో విద్యాభ్యాసం పొందిన యెడల మనస్సు బంధించే ప్రభావం అధిగమించడానికి దాదాపు అసాధ్యమౌతుంది, ఈ విధమైన మార్గము అనుస రించినప్పుడు సాతాను యొక్క వలలో మనసు బంధించబడుతుంది, ఆత్మచుట్టు దగ్గరా దగ్గరగా భయంకమైన రీతిలో అల్లిన వలను తెంచుటకు శక్తిహీనులగుదురు. సానుకూల స్థితిని తీసుకువచ్చేటప్పుడు, మానవుడు సాతాను యొక్క అనుచరులకు సహాయం చేస్తాడు. కానీ అవిశ్వాసం యొక్క విదానములో విద్యాభ్యాసం చేసినవారికి మాత్రమే ఒకే ఒక రక్షణ ఉన్నది, నేను నిస్సహాయుడును అని రక్షకుని యొద్ద మోకరిల్లి మరియు అతన ఆలోచన మరియు అతని మార్గము క్రీస్తుకు చంటి బిడ్డవలే సమప్పించుకొనినప్పుడు అతడు చీకటి నుండి అద్భుతమైన కాంతిలోనికి నడిపించ బడతాడు. ఎవరైతే ప్రశ్నంచడం, సందేహించడం, విమర్శలు చేయుడం, వంటి విధానములో విద్యావంతుడౌతాడో అటివాడు సాతాను వేసిన వలలో నుండి బయటకు రావటానికి మానవునికి శక్తి చాలదు, ఎమ్ఎస్ 3, 1895LDETel 46.1

    భవిష్యత్ శోధనలు కొరకు సిద్ధబాటు

    క్రీస్తు సేవకులు తమ విశ్వాసమును పరిక్షించేటప్పుడు వారు ఏవిధమైన వాక్యములు ముందుగానే సిద్ధంచేసుకోనవసరం లేదు. వారి హృదయాలలో నమ్మదగిన దేవుని వాక్యవు అమూల్యమైన సత్యములను బద్రముచేసి, క్రీస్తు బోధనపై ఆధారపడి నప్పుడే దిన దినము వారు సిద్ధపరుచుకుంటున్నారు, మరియు వారి విశ్వాసమును బలపర్చు కొనుచున్నారు, పరీశోదనలోనికి వారు తీసుకొని రాబడినప్పుడు, వినుటకు ఆశక్తిని కనపర్చె వారెవరైనను వారి హృదయాలను ఈ బలమైన సత్యములు చేరవేయు టకు పరిశుదాత్మడు వారికి జ్ఞాపకమునకు తీసుకొనివచ్చును, లేఖనాలను శ్రద్ధగా పరిశోధించుట వలన పొందిన జ్ఞానాన్ని అవసరమయ్యే సమయంలో జ్ఞాపకము లోనికి తెచ్చుకొనుటకు దేవుడు మెదడకు వాటిని పంపును. కౌన్సెల్ అన్ సెబాత్ స్కల్ వర్క 40,41(1900)LDETel 46.2

    పరిక్షించే సమయము వచ్చినప్పుడు, ఇతరులకు బోధించే మనుష్యులు ఉంటారు వారు ఎటువంటి హోదాలను కలిగియున్న వాటిని పరిశీలించించెదరు అయితే వారికి అసంతృప్తికరమైన కారణాలు అనేకమైనవి ఉంటాయి, ఈ విధంగా పరిక్షిస్తున్నంత వరకు వారికున్న గొప్ప అజ్ఞానం తెలియదు. మరియు సంఘములో అనేక మంది వారు నమ్మిన సత్యము ఏమైయున్నదో వారికి బాగుగా అర్ధమైనట్లుగా భావించెదరు, అయితే వివాదములు తలెత్తే వరకు వారికున్న బలహీనత ఏనిటీ వారికి తెలియదు. విశ్వాసులు అనే వారి నుండి వేరు పడి ఒంటరిగా నిలువబడి ఒక్కడివే అయునప్పుడు వారు నమ్మిన సత్యమును వివరించుటకు ప్రయత్నించినప్పుడు వారు సత్యం అంగీకరించిన విషయాలు గురించి వారి అభిప్రాయాలను ఎలా గందరగోళం చేశాయో చూచి ఆశ్చర్యపోతారు. సంఘమునకు ఉపదేశములు. 5. 707 (1889).LDETel 47.1

    నైతిక శక్తిని నియంత్రించుట

    మన విశ్వాసమునకు మంచి సాఫల్యమే కారణమని చెప్పడానికి సామర్థ్వత కావలి అయితే ఈ సత్యము లోతుగా నాటుకొనకపోతే ఆత్మ ఇక ఎన్నటికి రక్షింపబడదు హృదయం అనిన నైతిక పరమైన అపవిత్రత నుండి పరిపూర్ణముగా శుద్ధి పోందవలేను. అవర్ హై కాలింగ్. 142(1893)LDETel 47.2

    ఆలోచనలు మరియు ఊహలను నియత్రణను నిర్వరంచడానికి అది ఒక విది అని కొందరు బావిస్తారు. లాభదాయకమైన విషయాలపై క్రమశిక్షణ లేని మనస్సు స్థిరంగా ఉండటం కష్టం. ఆలోచనలు సరిగా పనిచేయకపోయిన యెడల ఆత్మలో మతమును వృద్ధిచెందదు. మనస్సు పవిత్రమైన మరియు శాశ్వతమైన విషయాలతో ముడిపడి ఉండాలి, లేకపోతో అల్పమైనదియు మరియు బూటకమైన ఆలోచనలు నిండిపోవును. వివేకము మరియు నైతికశక్తులు రెండూ క్రమ శిక్షణతో ఉండాలి మరియు వారు అభ్యసము చేయుట ద్వారా శక్తి మరియు అభివృద్ధి పొందగలరు, అవర్ హై కాలింగ్ 111(1881)LDETel 47.3

    అల్పమైన శరీరిక శక్తులు కంటి సద్గుణాలును పవిత్రమైన ఆలోచనలు మనము ప్రోత్సహించి పెంపొందించవలసిన అవసరము ఉంది, మన స్వీయ దుర్వినియోగమైన ఆకలి నుండి మేలుకొనుటకు దేవుడు మనకు సహాయంచేస్తాడు. మెడికల్ మినిస్టీ 278 (1896)LDETel 47.4

    హానోకు యొక్క ఉదాహరణ.

    హనోకు పరమునకు కొనిపోవకముందు దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడు మరియు ప్రపంచము ఇప్పుడు కంటే అప్పుడు పవిత్రమైన క్రైస్తవ ప్రవర్తనకు అనుకూలమైన స్థితియేమిలేదు, హనోకు దేవునితో ఎలా నడిచుకున్నాడు? అతడు దేవుని సమక్షములో ఉన్నడాని తన మనసును, హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించు కొనేవాడు మరియు అసంతృప్తితో ఉన్నప్పుడు దేవునితో సహవాసము కలిగియుండుటకు అతడు ప్రార్ధన చేస్తుండేవాడు. దేవుని కోపము కలిగించే ఏ విషయమైనను అతడు తీసుకోవడానికి నిరాకరించేవాడు, అతడు ఎల్లప్పుడూ తనకు ముందు యెహోవాను ఉండాలి అని కోరుకొనేవాడు, నేను తప్పిపోకండుటకు నీ మార్గమును నాకు బోధించుము. నీ మార్గము అనుసరించుట నేర్పుము. నా విషయములో నీ ఆనందం ఏమిటి? దేవా నిన్ను గౌరవించటానికి నేనేమి చెయ్యాలి? అతను ఇలా ప్రార్ధించివుండవచ్చు, ఆ విదముగా ఆయన డేవుని ఆజ్ఞలకు అనుగుణంగా తన మార్గాన్ని మరియు తన గమనములను నిరంతరము రూపొందించుకున్నాడు తనకు సహాయం చేస్తాడని తన పరలోక తండ్రిపై పూర్తి నమ్మకము మరియు బరోశకలిగియున్నాడు. ఆయన తప్పకుండ సహాయము చేస్తాడని తన సొంత ఆలోచనను లేదా ఉద్దేశములమీద అదారపడలేదు. అది అంతయు తన తండ్రి చిత్తమునకు అప్పగించెను. క్రీస్తు వచ్చినప్పుడు భూమిమీద ఆయన కొరకు సిద్ధపడివున్న ప్రతివాడు, మరణాన్ని చూడకుండా పరలోకానికి ఎత్తబడేవారికి ఇప్పుడు హానోకు ఒక ప్రతిధిగా ఉన్నాడు .- సర్మన్ అండ్ టాక్స్.-32 (1886).LDETel 47.5

    హనోకు మనవలేనే పరీక్షంప్పబడియున్నాడు, అతను చుట్టు వున్న సమాజము మనము ఎలా వున్నామో ఇప్పుడు కూడ నీతి దర్మములకు స్నేహపూరితముగా లేదు. మనము వుంటున్న వాతావరణం ఏలా పాపం అవి నీతి వుందో ఆ మాదిరిగానే ఉంది, అయినా అతను పవిత్రమైన జీవితాన్ని గడిపాడు. అతడు జీవించినంత కాలము పాపంలో పడిపోకుండా పరిశుద్దుడుగా బ్రతికాడు. కాబట్టి మనలో ఎందరో పరిపూర్ణము గాను మరియు పవిత్రముగాను ఉండగలుగుతారు. సంఘమునకు ఉపదేశములు. 2: 122 (1868).LDETel 48.1

    దేవుని యొక్కగత దీవెనలు గుర్తుంచుకొనట

    మన గత చరిత్రను సమీక్షిస్తూ, ప్రస్తుతము వున్న పరిస్థితిని మనము గమనిస్తే ప్రతి దశలో ఒక అడుగు ముందుగానే మనము ప్రయాణించినందుకు, దేవునికి స్తోత్రములు చెప్పుచున్నాము, ప్రభువు నాకు చేసిన సహాయము నేను చూడగా నేను ఆశ్చర్యంతో నిండిపోయాను మరియు క్రీస్తు నాయకత్వంలో విశ్వాసము కలిగి యున్నాను, ప్రభువు గతములో బోధంచినవి మరియు మనలను ఎలా నడిపించి యున్నాడో అనే విషయాలు మర్చిపోకుండ జ్ఞాపకం చేసుకోవడం తప్ప, ఇక భవిష్యత్తు కోసం మనము భయపడడం అవసరం లేదు.. లైప్ స్కీచ్ అప్ ఎలెన్ జి వైట్, 196(1902)LDETel 48.2

    తీవ్రమైన ప్రతిబింబం కోసం సమయం

    తీవ్రమైన ప్రతికూలములు ఎదురైన సమయములు గాని తటస్థచితే అందరు దేవునికి భయపడుతారు, ఇక ఇప్పుడు వ్యక్తిగత భక్తి అవసరమై ఉంది. నేను ఎవరిని ? మరియు ఈ కాలములో నా పని మరియు నా సేవా కార్యము ఏమైయున్నది ? అని విచారణ చేయవలసియుంది. క్రీస్తు వైపున లేదా శత్రు వైపున నేను ఎవరి పక్షాన పని చేస్తున్నాను? “ప్రతి ఆత్మ ఇప్పుడు తనను లేక ఆమేగాని దేవునికి యెడల అనుకువ కలిగియుండాలి, నిజముగా ఇప్పుడు మనము గొప్ప ప్రాయశ్చిత్త దినమున జీవించు చున్నాము. ఇప్పటికి అనేక మంది సమస్యలు దేవుని ఎదుట పరిశీలనలో ఉన్నాయి, ఎందుకంటే వారు వారి సమాదులలో కొద్దిగా కాలం నిద్రించెదరు,అ దినము నీ ప్రేమ అప్యాయతలు మద్యవున్న స్థితిని బట్టేగాని నియమముతో పాటించిన విశ్వాసం బరోశ ఇవ్వదు, భ్రష్టపట్టిన నీ హృదయమనే ఆలయం శుద్ధి చేయబడినదా?LDETel 48.3

    నా పాపములు ఒప్పుకొని మరియు నేను దేవుని ముందు పశ్చాత్తాపపడు తున్నానా? అవి మరకలుగానే ఉన్నయా? నేను చాలా తేలికగా లక్షపెట్టవలేనా? యేసు క్రీస్తును గురిచిన జ్ఞానంషయంలో ఏమైనా త్యాగం చేయడానికి నేను ఇష్టపడు తున్నానా? ప్రతి క్షణము నేను క్రీస్తు సొత్తును నాకంటు ఏమి లేదు అని భవిస్తున్నానా? నా సేవ దేవునికి చెందుతుందా,అసలు నేను ఎవరినని ఆలోచించ వలెను? ఎంమ్ ఎస్87, 1886LDETel 49.1

    మనము దేని కొరకు జీవిస్తున్నాం మరియు పని చేస్తున్నాము? దాని పలిత మేమిటి? మనకి మనము అడుగుకోవలసిన విషయములు.”- ది సైన్స్ ఆప్ ది టైమ్స్, నవంబరు 21, 1892.LDETel 49.2

    తీర్పు దినముకొరకు సూచనలుబట్టి జీవించుట

    మన పట్టణంలో ప్రజలను చూస్తే, ఇటు అటు పరిగెత్తుచు, వ్యాపారంలో చిక్కుకు పోయేటట్లు చూస్తున్నాము, మన మీదకి రానైయున్న దేవుని దినము గురించి వారు ఎప్పుడైనా ఆలోచించారా? అని నేను ప్రశ్న నా మనసులో వుంది, మనలో ప్రతి ఒక్కరు మన మీదకి త్వరలో రాబోయే గప్ప దినము గూర్చిన సబంధమును బట్టి జీవించవలేను.- సర్మన్ అండ్ టాక్స్.-25 (1886).LDETel 49.3

    తీర్పు దినానికి ఎటువంటి సూచన లేకుండా మనము సమర్ధత కలిగి జీవించలేము; దీర్ఘకాలం ఆలస్యం అయినప్పటికీ, ఇప్పుడు అది సమాపములోనే తలుపు వద్ద ఉంది, మరియు చనిపోయిన వారిని మేల్కోల్పుతుంది. .-చైల్డ్ గైడెన్స్, 560, 561 (1892).LDETel 49.4

    క్రీస్తు రాకడ కొసం సిద్ధపడుట

    పరలోక విషయాల ఆలోచనా ధోరణిలో ఇప్పుడు మనకు ఏ ఆనందాన్ని కలుగక పోతే; దేవుని జ్ఞానాన్ని వెతికేందుకు మనకు ఆసక్తి లేకపోయినా, క్రీస్తు స్వభావమును చూచి ఆనందము లేకున్నను. పరిశుద్ధత మన కోసం ఎటువంటి ఆకర్షణలను కలిగించకుంటే, అప్పుడు పరలోక నిరీక్షణ మనకు నిజముగానే వ్యర్ధమగును. దేవుని చిత్తానికి పూర్తి అనుగుణంగా వుంటే, క్రైస్తువుడిగా నిరంతరం ఉండటానికి ఉన్నత లక్ష్యం వుంది. అతడు దేవుని గూర్చి క్రీస్తుని గూర్చియు పరలోక గృహము గూర్చియు చాల ఇష్టముగా మాటలాడును మరియు క్రీస్తు అతనికి ఇచ్చిన పరిపూర్ణతను బట్టి అతడు ప్రేమించెను, దేవుని యొక్క ఆశీర్వాదమైన హామీల మీద ఆదారపడినప్పుడు మరియు ఆత్మయ ఆహారముగా తీసుకొనినప్పుడు ఈ ఇతివృత్తాల గురించి ఆలోచించడం, అపొస్తలుడు రాబోయే ప్రపంచపు శక్తులను రుచిగా పేర్కొన్నా. - సంఘమునకు ఉపదేశములు 5:745(1889).LDETel 49.5

    నీవు దేవునితో సరైనదిగా ఉంటే, క్రీస్తు ఈ దినమందే వస్తే నీవు సిద్ధంగా నే ఉంటావు, -హెవెన్లీ ప్లేసస్, 227 (1891).LDETel 50.1