Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  16 అధ్యాయము - కృప కాలము ముగింపు

  కృప కాలము ముగింప ఎప్పుడో ఎవరికి తెలియదు

  ఈ సందేశం ఎప్పుడు ముగుస్తుందో లేదా కృపకాలం ఎప్పుడు అంతమునకు వస్తుందో దేవుడు మనకు వెల్లడించలేదు. వెల్లడి చేయబడిన విషయాలు మనం మరియు మన పిల్లలు అంగీకరించుచున్నాము. అంతేగాని సర్వశక్తిమంతుడైన దేవుని ఆదీనములో రహస్యంగా ఉంచబడినది ఏమిటో తెలుసుకోవడానికి మనము ప్రయత్నించ కూడదు... కృపకాల తీర్పు ఎప్పుడు ముగిస్తుందో ఆ సమయము చెప్పడానికి మీదగ్గర ఏదైన ప్రత్యేకమైన సత్యము ఉన్నదా అని నాకు ఉత్తరములు వ్రాసినారు. అప్పడు నేను పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. అని సమాదానము ఇచ్చెను.” సెలెక్ట్డ్ మెసెజన్స్. 1: 191 (1894). LDETel 158.1

  బలత్కారమగు ఆదివారం-చట్టం కృప కాలము ముగుంపునకు నడుపును

  ఆదివారం-చట్టం అమలుపరిచే సమయమునకు కృపకాలం ముగుస్తుంది, ఈ కృపకాలం ముగింపునకు రాక మునుపు మృగం యొక్క ప్రతిమ ఏర్పాటు చేయ బడిందని స్పష్టంగా నాకు ప్రభువు చూపించేను, ఇది గొప్ప పరీక్షగా వున్నది (మునుపటి అద్యాయం చూడండి, ఎక్కడ దేవుని ప్రజలకు గొప్ప పరీక్ష వస్తాయో, అక్కడే బలవంతము చేయుచున్న ఆదివారం చట్టం అమలోకివచ్చునని దేవుడు నాకు చూపంచెను. దీని ద్వారా దేవుని బిడ్డలకు వారి గమ్యము నిర్ణయించబడుతుంది. - సెలెక్ట్డ్ మెసేజన్స్. 2:81 (1890). క్రూరమృగమునకు ప్రతిమ ఏమిటి? దానిని చేయుడము ఎలా? ప్రతిమను రెండు కొమ్ములు మృగం చేస్తుంది. అది మృగానికి చేసే ప్రతిమ ఎలా వుంటుంది? అది ఎలా రూపొందుతుంది అన్న విషయాలు తెలుసు కోవటానికి ఆమృగం లేదా, పోపు వ్వవస్థ సూలక్షణాల్ని అధ్యనం చేయలి. తొలి దినాల సంఘము సరళ సువార్త ప్రబోధాన్ని విడిచి పెట్టెదువల్ల బ్రష్టమైనప్పుడు ఆది దేవుని ఆత్మను దేవుని శక్తిని పోగొట్టుకొన్నది. కాబట్టి ప్రజలు మన సాక్షుల్ని అదుపు చేయటానికి సంఘం లౌకిక అధికారుల అండదండలు ఆశ్రయించింది. పలితంగా పోపుల వ్వవస్థ రూపుదాల్చింది. పోపుల సంఘం రాజకీయ ప్రభుత్వ అధికారాన్ని అదుపుచేసి దానిని తన ఉద్దేశలు నెరవేర్చుకోటానికి మఖ్యముగా సంఘసిద్ధాంత వ్యతిరేకతను, శిక్షించటానికి ఉపయోగించింది. సంయుక్త రాష్ట్రాలు మృగము విగ్రహాన్ని చేయాలంటు మతాధికారం రాజకీయ ప్రభుత్వాధికారాన్ని అదుపు చేయాలి. ఇలా తన సంఘము తన ద్యేయాలన్ని సాదించటానికి రాజ్యదికారాన్ని కూడ ఉపయోగించు కోవచ్చు. - మహా సంఘర్షణ 443, 445 (1911).LDETel 158.2

  ముద్రించడం ముగియగానే కృప కాలము ముగుస్తుంది

  మనము శ్రమ కాలములో ప్రవేశించించగానే ముద్రవేయుటం పూర్తి అవుతుంది కృపకాలం అప్పుడు ముగుస్తుంది, మనము జీవముగల దేవుని ముద్రను పొందు కుంటాము. అప్పుడు నాలుగు దేవదూతలు నాలుగు దిక్కల వాయవులను పట్టు కునేందుకు నిలిచెను. నేడు కరువు, తెగులు, ఖడ్గం, దేశం మీదకి దేశం లేచేను, ప్రపంచమంత గందరగోళంలోనే ఉంది. - ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 968 (1846).LDETel 159.1

  పరలోకంలో దేవదూతలు ఇటు అటు తిరుగుట నేను చూశాను. ఒక దేవదూత సీరా కలము పట్టుకొని భూమి నుండి తిరిగి వచ్చెను మరియు అతని పనులు పూర్తి అయినవని యేసుకు నివేదిక ఇచ్చెను మరియు పరిశుద్దులు లెక్కించబడి ముద్రించ బడినారు. అప్పుడు పది ఆజ్ఞలను కలిగి ఉన్న మందసము ఎదుట సేవచేస్తున్న యేసు, అ దూపాత్రను పారవేసి ఆయన తన చేతులను ఎత్తి, గంభీర స్వరముతో సమప్తమైనది అని అనేను- ఎర్లీ రైటింగ్స్, 279 (1858).LDETel 159.2

  అది క్షణకాలం మాత్రమే వున్నటుంది, కాని ఇంకా ఉంది. అయితే దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి మరియు రాజ్యం వ్యతిరేకంగా లేస్తున్నాయి, ఇప్పుడు ఒక సాధారణ ఒప్పందము లేదు. ఇక యుద్ధ సమరమే జరుగును. దేవుని సేవకులు వారి నొసటమీద ముద్ర వేసేవరకు నాలుగుదిక్కల వాయువుని దేవదూతలు పట్టుకొని ఉండేను. భూమి యొక్క అధికారము వారి సైన్య బలగాలను ఇక అంతిమ మహా భయాంకర యుద్ధము నకు నడిపించును. సంఘమునకు ఉపదేశములు 6:14 (1900).LDETel 159.3

  భూమి నుండి పరలోకానికి తిరిగి వస్తున్న ఒక దేవదూత తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్లు లోకానికి చివరి పరీక్ష జరుగునట్లు దేవుని ధర్మశాసనాలకు విదేయులై నివసించిన వారందరు “జీవముగల దేవుని ముద్రను పొందినట్లు ప్రకటించాడు. అప్పుడు పరలోక గుడారములో యేసు చేస్తున్న విజ్ఞాపన పరిచర్య ఆగిపోతుంది.... ఆయన తన చేతులు పైకెత్తి గొప్ప స్వరముతో సమాప్తమైనది అని అనును. - మహా సంఘర్షణ 613 (1911). 579LDETel 159.4

  అకస్మాత్తుగాను మరియు తెలియనిరీతిగా కృప కాలము ముగుస్తుంది

  ఊహించని విధంగా పరిణామములు చోటు చేసుకుంటాయి, అకస్మాత్తుగా కృపకాలం అంతమునకు వచ్చేను, మనుష్యుల కొరకు విజ్ఞప్తి ముగించినప్పుడు, ఇక నిశ్చయముగా అన్ని ముగించడానికి నిర్ణయుంచబడెను.కృపకాలం ముగుసిందంటే,క్రీస్తు మద్యవర్తిత్వం పరలోకంలో నిలిచిపోతుంది. ఈ సమయం అంతము అకస్మాత్తుగా వస్తుంది, మరియు వారి ఆత్మలను శుద్ధి చేయబడుటకు సత్యమునకు విదేయత చూపకుండ నిర్లక్ష్యం చేసిన వారు మరణించుట నీతిమంతులు గమనిస్తాం,సంఘమునకు ఉపదేశములు. -2: 191(1868)LDETel 159.5

  కృపకాలము అంతమునకు వచ్చినప్పుడు, ఇక అంతా అకస్మాత్తుగా, మనము అంతగ ఎదురు చూడని సమాయమందు ఊహించని రితిలో వస్తుంది-- అయితే నేడు మనకి పరలోకంలో పరిశుద్ధ గ్రంద మందు అంత స్పష్టముగా ఉంటుంది మరియు దేవుడు మనల్ని అంగీకరించినట్లు తెలుసుకుంటాం. ది ఎస్ డి ఎ బైబిల్ కామెట్రీ 7: 989 (1906).LDETel 160.1

  దోష పరిశోధన తీర్పు ముగిసినప్పుడు అందలి భవిత నిర్ణయమౌతుంది సత్యజీవానికో మరణానికో ఆకాశమేఘాలలో ప్రభువురాకడకు కొంచెం ముందు కృపకాలం అంతమొందుతుంది.... జలప్రళయానికి ముందు నోవవు ఓడలో ప్రవేశించిన అనంతరం ఆయనను లోపల దుషులను ఓడ వెలువుల ఉంచి దేవుడు ఓడ తలుపులు మూశాడు. తన నాశనం ఖాయమయిన సంగతి ఎరుగని ఆ ప్రజలు ఏడు రోజులపాటు రానున్న తీర్పును గూర్చిన హెచ్చరికను ఎద్దేవాచేస్తు అజాగ్రత్తగా జీవిస్తు సుఖభోగాలలో మునిగితేలారు , అలాగునే మనుషుకుమారుని రాకడ ఉండును, అంటున్నాడు యేసు.LDETel 160.2

  ప్రతివ్యక్తి భవితను నిర్ధారించటం, దుర్మార్గులకు కృప చివరిగా ఉపసంహరించటం మధ్యరాత్రిలో దొంగ రాకలా సడిచప్పుడు లేకుండ జరిగిపోతాయి....వ్యాపారస్తులు లాభార్జనతో మునిగియుండగా సుఖభోగలపై ఆశక్తి గలవారు త్రాగితందనాలాచుండగా, ఫ్యాషన్ ను ప్రేమించే అమ్మకు అభరణాల అలంకారణలో తనమునకలై ఉండగా సర్వప్రపంచానికి తీర్పరి అయున న్యాయదిపతి ఈ తీర్పు చెప్పటానికి అ గడియనే ఎంపికచేసుకోవచ్చు, ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కవుగా కనబడితివి. దానియేలు 5. 27 -మహా సంఘర్షణ 490, 491 (1911).LDETel 160.3

  కృపాకాలములో నగిలిన తర్వాత మానవ కార్యాచరణ

  నీతిమంతులు దుర్మార్గలు తమతమ నైతిక స్థితిలో భూమిపై ఇంక జీవిస్తుంటారు. పరలోక గూడారములో తిరుగులేని అంతిమ తీర్మానం జరిగిన సంగతి గుర్తెరుగకుండా మనుష్యులు తోటలు నాటటములో ,ఇల్లు కట్టడములో,తినుటములో, త్రాగటములో, నిమగ్నులై ఉంటారు.- మహా సంఘర్షణ 491 (1911).LDETel 160.4

  అలాగే మార్పులేని పరలోక గూడార తీర్మనం వెలువడలో లోక ప్రజల భవితవ్యం నిర్ణయించబడటం జరిగినప్పుడు దాని గురించి లోక ప్రజలకు ఏమీ తెలియదు. దేవుడు ఆత్మను పోగొట్టుకొన్న ప్రజలు నామమాత్రపు మతాచారల్ని కొనసాగిస్తారు. సాతాను తను కార్యసిద్ధి కోసం తమ దుష్ట ప్రణాలికల్ని అనుసరిచటానికి ప్రజల్లో పుట్టించే ఉత్సహం దైవ సేవ నిమిత్తం చోటుచేసుకనే ఉత్సాహంలా పైకి కనిపిస్తుంది.- మహా సంఘర్షణ 615 (1911).LDETel 160.5

  కోత కాలము వరకు గోధుమలు మరియు గురువులు కలిసే పెరుగుతాయి.” జీవితపు బాధ్యతలను విడిచి పెట్టినప్పుడు చివరగా భక్తిహీనులతో కలవడానికి నీతిమంతులు ఆఖరున తీసుకొని రాబడుదురు.అందకార సంబంధమైన పిల్లలు, వెలుగు పిల్లను మద్య సంచరించెదరు. ఇట్టి భేదములు మనమందరము చూచెదము.సంఘమునకు ఉపదేశములు.- 5: 100 (1882) .LDETel 160.6

  క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు కొంతమంది వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై యుంటార, కొందరు పోలములలో విత్తెదరు, మరికొందరు పంట కోయుదురు మరియు పనలు కట్టెదరు, మరికొంతమంది దాన్యము ఆడించుటకు మిల్లులకు తీసుకొని వెళ్లెదరు అని క్రీస్తు. ప్రకటించెను - ఎంమ్ ఎస్ 26, 1901.LDETel 161.1

  అవిశ్వాసం మరియు నిషిద్ధమైన ఆనందాలు కొనసాగును

  విజ్ఞాన శాస్త్రము మరియు సంశయవాదం, బైబిలు ప్రకారముగా వున్న క్రైస్తవ ప్రపంచం యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తు ఘోరముగా దెబ్బతీస్తుంది. లోపములను మరియు కల్పితములను సంతోషంగా అంగీకరిస్తుంది, వారు స్వీయ ఆనందం యొక్క మార్గాన్ని కొనసాగించడానికి వారు భయపడకపోవచ్చు, ఎందుకంటే వారు తమ జ్ఞానములో దేవుడని నిలుపుకోవటానికి ప్రయత్నించరు. “కాబట్టి ఈ రోజు ఉన్నటు రేపు కూడ వుండోచ్చు మరియు మరింత సమృద్ధిగా ఉండించ్చు” అని వారు అంటున్నారు. అయితే వారలగా అవిశ్వాసంలో మరియు దైవములేని సుఖ సౌక్యలలో ఉన్నప్పుడు ప్రధాన దూత మరియు దేవుని బూర శబ్దము వినబడును. ఇలాగే మన ప్రపంచంలో ఉన్న వారందరు తమ తమ పనిలో పూర్తిగా నిమగ్నమైయున్నప్పుడు, లాభం కోసం స్వార్థపూరిత ఆశయంలో మునిగిపోయినప్పుడు, యేసు దొంగ వలే వచ్చును. ఎంమ్ ఎస్.15 బి, 1886.LDETel 161.2

  దైవజనులమని చెప్పుకుంటున్న వారు లౌకిక ప్రజల జీవన సరళిని అనుసరిస్తు వారితో ఏకమైనప్పుడు నిసిద్ధ భోగాలు అనుబవించడములో వారితో కలసినప్పుడు లోకభోగాలు సంఘ సుఖాలుగా పరిణమించినప్పుడు, పెండ్లి గంటలు మ్రోగుతుండగా సుదీర్ఘమైన లోక సుఖసంతోషాలకు అందరు ఎదురు చూస్తుండగా అప్పుడు హఠాత్తుగా ఆకాశం నుంచి మెరుపు వస్తుంది, ఉజ్వల భవిషత్తును గూర్చిన వారి కలల ఆశలు అంతమోందుతాయు . మహా సంఘర్షణ338,339 (1911).LDETel 161.3

  మనుష్యులు పూర్తిగా వ్యాపారంలో

  మునిగిపోతారు మనుషులందరూ వ్యాపారంలో మునిగిపోతారు, సొదొమ నాశనం చేయబడు తుందని లోతు తన కుటుంబ సభ్యులను హెచ్చరించినప్పుడు, వారు అతని మాటలను లక్ష్యపెట్టలేదు. కాని అతడు మూడభక్తి గల దురాబిమానంలో వున్నాడని వారు చూశారు.వారి మీదకి నాశనం వచ్చింది. అంటే వారు సిద్ధపడిలేరనే విషయము తెలుస్తుంది, ఆలాగే క్రీస్తు వచ్చినప్పుడు, రైతులు, వ్యాపారులు, న్యాయవాదులు, వర్తకులు, పూర్తిగా వ్యాపారంలో మునిగిపోతారు, మరియు వారి మీదకి ప్రభూ రాకడ దినము ఒక ఉచ్చువలే వచ్చును.- ది రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చ్ 10, 1904.LDETel 161.4

  సేవకులు, రైతులు, వర్తకులు, న్యాయవాదులు, మహానీయులు, గొప్పవారు “శాంతి, భద్రత అని ఎడ్చేదరు, “అకస్మాత్తుగా నాశనము వస్తుంది....... లూకా ఇలా వ్రాస్తున్నాడు ప్రభు రాకడ దినము ఉరివలే ఉన్నదని క్రీస్తు చెప్పిను ----- అడవుల్లో ఒక జంతువు ఆహారం కోసం వెతుకుడుండగా దానిని పట్టకొనుటకు వల పన్నాడు వేటగాడు అయితే అకస్మాత్తుగా అతడే ఆ దాగి ఉన్న వలలో చిక్కుకొనట్లుగా ఉంటాంది. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 10:266 (1876).LDETel 162.1

  మనుష్యులు స్వతంత్రముగాను సౌలబ్యంతో ఉన్నప్పుడు, విందు వినోదాలతోనే కాలం గడిచిపోతుంది కొనుగోలు మరియు విక్రయించడంతో శోషించబడినప్పుడు, దొంగ తెలియని రీతిగా వచ్చున విధముగానే ప్రభు రాకడ ఉండును. - లెటర్ 21, 1897.LDETel 162.2

  మత నాయకులు పూర్తి భిన్నవాదము కలిగివుంటారు.

  తత్వజ్ఞానుల తర్కం దైవ శిక్ష భయాన్ని కొట్టిపారేస్తున్న తరుణంలో, మత గురువులు శాంతి సౌభాగ్యాల కాలం వస్తుందని నమ్మబలుకుతున్న తరుణంలో లోక ప్రజలు తమ వ్యాపారాలలోను, వినోదాలలోను తలమునకలై ఉన్న తరుణంలో వారి మీదకి హఠాత్తుగా నాశనం వస్తుంది. వారికి తప్పించుకొనే మార్గం ఉండదు. 1 దెస్స 5. 3పితరులు- ప్రవక్తలు, 104 (1890)LDETel 162.3

  దేవుని ఉగ్రత దినము ఎప్పుడు వస్తుందోగాని అది వచ్చినప్పుడు అది దుష్టల విషయములో హఠాత్తుగా విరుచుకుపడుతుంది. జీవితంలో ఓమార్పు లేకుండా యదావిదిగా సాగుతున్నప్పుడు మనుష్యులు సుఖజీవనంలో వ్యాపార విషయములలో రాకపోకలలో డబ్బు సంపాదనకై తనమునకలైనప్పుడు మన నాయకులు, ప్రపంచ ప్రగతిని విజ్ఞానాన్ని కొనియాడుతున్నప్పుడు, తప్పుడు భద్రత బావముతో ప్రజలు ఆదమరిచి నివసిస్తున్నప్పుడు, అప్పుడు కావలికొరవడ్డ నివాసములోకి అర్ధరాత్రి దొంగ ప్రవేశించే రీతిగా అజాగ్రత్తగా ఉన్న వారి మీదకి దుష్టుల మీదకి నాశనం అర్ధంతరంగా వచ్చిపడుతుంది , వారెంత మాత్రమున తప్పించుకొనలేరు. మహా సంఘర్షణ,38 (1911).LDETel 162.4

  కృప కాలము ముగిసినదని సాతానుడు భావించును

  సాతనుడు శ్రమ కాలములో దుష్టులను అల్లరి పుటించుటకు రేపును, వారు దేవుని ప్రజలను నాశనం చేయటానికి చుట్టుముట్టేదరు. కానీ పరలోకపు గ్రంధములలో వారి పేర్లకు ఎదురుగా వారు క్షమాపణ పొందియున్నారు అనే విషయము ఆతనికి తెలియుదు. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, నవంబరు 19, 1908.”LDETel 162.5

  యాకోబు మీద దాడిచేయటానికి ఏశావును పురికొల్పినట్లు ఆ ఆపధకాలములో దేవుని ప్రజలను నాశనం చేయటానికి సాతాను దుర్మర్గులను పురికొల్పుతాడు....... వారిని దేవదూతలు కాపాడుదురని దానిని బట్టి వారు పాపాలు క్షమించబడతాయని అతడి గ్రహిస్తాడు, అయితే పరలోకములో ఉన్న గూడారములో వారి కేసులు తీర్మనం అయ్యా యని అతనికి తెలియదు.- మహా సంఘర్షణ ,618 (1911).LDETel 163.1

  వాక్యము కరువగును

  సేవకులు బోదించే దేవుని వాక్యమును అభ్యసించుటలోను మరియు అది గొప్ప విలువైన బహుమానముగా ఇప్పుడు అభినందించకపోయున యెడల, వారేవరైనను ఇకపై క్రూరంగా తరుచూ విచారమునకు కారణమగును. తీర్పు జరుగుచుండగా అ అఖరి సమయమున ప్రభువు భూమిమీద అంతట సంచరిచుట నేను చూశాను. ఇక భయంకరమైన తెగులు కుమ్మరించడం ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుని వాక్యాన్ని తృణీకరించినవారు, మరియు అది తేలికగా తీసుకొని అగౌరవించినివారు“ఈ సముద్రము నుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కు. నుండి తూర్పు దిక్కు వరకు వారు దేవుని వాక్యమును వెతుకుటకు సంచరించెదరు గాని అది వారికి దొరకదు. “(అమోసు 8:12) దేవుని వాక్యాన్ని వినడానికి భూమి మీద కరువు ఉంది.- ఎమ్ ఎస్ 1, 1857.LDETel 163.2

  దుష్టుల కోసం ఇక ప్రార్థనలువుండవు

  దేవుని సేవకులు వారి ఆఖరి పనిని పూర్తి చేసారు, తిరుగుబాటు చేసిన సంఘము కోసం వారు చేసిన చివరి ప్రార్ధనలు, మరియు భక్తిహీనులైన ప్రజల కోసం చివరగా బాదాకరమైన కన్నీరు విడిచారు. అయితే వారికి ఆఖరి గంభీరమైన హెచ్చరిక ఇవ్వబడి నప్పుడు.అహో! వారు ఎంత త్వరగా ఇళ్ళు మరియు భూములు, పిసినారి తనముతో దాచబడిన ధనము, మరియు బద్రముచేసినదియు మరియు బలవంతముగా లాగుకొన్న డాలర్లు, బాహాటముగా సత్యాన్ని చాటుచున్నవారికి ఇచ్చారు. కొంత ఓదార్పు కోసమే చేసారు, కానీ మోక్షానికి మార్గం వివరించినను, లేదా ఆశాజనకమైన మాట లేదా ప్రార్ధన లేదా ప్రబోధం వినడం కోసం మరియు వారు సేవను హెచ్చించుటకై ఎంత చేసినను వారు దానికి తగ్గట్టుగా నివసించలేదు, కానీ వారు నిష్పలమైన దాని యందు ఆకలి మరియు దాహం కలిగియున్నారు, వారి దాహం ఎన్నడూ తీరనిది. వారు ఓదార్పు పొందలేరు. వారి (కేసులు) సమస్య నిర్ణయించ బడినది మరియు శాశ్వతంగా స్థిరపడినది, ఇది భయమును కలిగించే అఘోరమైన సమయం. ఎంస్ ఎస్ 1, 1857.LDETel 163.3

  దేవుని తీర్పులు కనికరము లేకుండ మీదకి వస్తున్న సమయంలో, అహా, ‘సర్వోన్నతుడైన రహస్య స్థలంలో నివశించుచున్న వారు స్థానంలో దుష్టులకు ఆశించుచున్న స్థితి ఎలా వున్నది? ఆయనను ప్రేమించుచు మరియు ఆయన ఆజ్ఞలకు విదేయులగు వారందరిని ఆయన గుడారములో దాచును! నీతిమంతులు చాలామంది నిజగా ఆశింపదగినవారిగా అలాంటి సమయంలోవుండగా పాపులు మాత్రం వారి పాపల వలన బాధపడుతున్నారు. అయితే కనికరముగల తలుపు దుష్టులకు మూసివేయ బడింది. పరిశీలన ముగిసిన తర్వాత వారి తరపున ఇంకా ప్రార్థనలు చేయబడవు. అది ఎస్ డి ఎ. బైబిల్ కా మెంటరీ 3: 1150 (1901).LDETel 163.4

  స్వభావము మార్చుకొనుట అసాధ్యం

  యెహోవా శక్తితోను మరియు గొప్ప మహిమతోను వస్తున్నాడు. అప్పుడు ఆయ.... నీతిమంతులను మరియు దుష్టలను పూర్తిగా వేరుచేసే పని అతనిది.అయితే తైలము వున్నవారు, సిద్దెలలో నూనేలేని వారికి మార్చడం అసాధ్యం. అప్పుడు క్రీస్తు చెప్పినది నెరవేరుతుందని, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొని పోబడును ఒకడు విడిచి పెట్టబడును ఇద్దరు తిరుగలి విసురుచుందురు, ఒకతె తీసికొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడును. నీతిమంతుడు మరియు దుష్టులు జీవనాధారంలో కలిసి బ్రతకాలి కానీ ప్రభువు స్వబావమును చూస్తాడు. ఆయన ఆజ్ఞలను గౌరవిస్తూ, ప్రేమించే విధేయులైన పిల్లలను ఆయన గుర్తిస్తాడు. - టెస్టమోనీస్ టూ మినిస్టర్స్ అండ్ గాస్పల్ వర్కస్ , 234 (1895).LDETel 164.1

  చనిపోవడం ఒక మహత్తరమైన విషయం, కానీ జీవించడం అంతకన్న అద్భుతమైన విషయం. మన జీవితంలో ప్రతి ఆలోచనలు మరియు మనమాడిన ప్రతి మాట మరియు మన పని మరలా మనల్ని కలుపుతాయి. మనమందరము కృపకాలం సమయములో మనమేమి చేస్తున్నామో, అదే శాశ్వతకాలం వరకు ఉండాలి, మరణం శరీరాన్ని విచ్చిన్న చేస్తుంది, కానీ మన స్వభావమునకు ఎటువంటి మార్పు రాదు. క్రీస్తు వచ్చున ప్పుడు మన గుణశీలములో మార్పు ఏది వుండదు ఇది అలాగే ఎప్పటికి మార్చు లేకుండ స్థిరముగా ఉండిపోతుంది. సంఘమునకు ఉపదేశములు. 5: 466 (1885) LDETel 164.2

  కృప కాలము మరొకటివున్న దుష్టుడు మారుమనస్సు పొందలేడు.

  మన ప్రస్తుత అవకాశాలను ఉత్తమంగా చేసుకోవాలి. మనము పరలోకం కోసం సిద్దపడుటకు మనకి మరోక పరిశీలన అంటు ఏది ఉండదు. ఆయన ఆజ్ఞలకు విదేయులుగా వున్న వారికి ప్రభువు సిద్ధము చేయుచున్న ఆ భవిష్యత్ గృహములో స్థిరముగా ఉండుటకు మన స్వబావములు మార్చుకోనుటకు ఇదే మనకు ఇవ్వబడిన చివరి అవకాశం . లెటర్ 20, 1899.LDETel 164.3

  ప్రభువు రాకడ తర్వాత పరిశీలన కాలమంటు ఉండదు. అయితే ఉంటుంది అని చెప్పేవారు మోసగించుచున్నారు మరియు తప్పుదారి చూపుచున్నారు. జలప్రళయానికి ముందు ఏ విదముగా వున్నదో క్రీస్తు రాకముందు అదే స్థితి వుంటుంది. మరియు రక్షకుడు ఆకాశ మేఘూలలో కనిపించిన తర్వాత ఎవరికి రక్షణ పొందడానికి మరొక అవకాశం ఇవ్వబడదు. అప్పటికే అందరు వారి వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు.లెటర్ 45, 1891.LDETel 164.4

  సత్యమును పొందుకున్న దానిని బట్టి అందరు పరీక్షింపబడతారు మరియు పరిశో దించబడతారు. సత్యం నుండి కల్పితమైన బోధల వైపుకు తిరిగెదరో వారికి రెండవ పరిశీలన కాలముండదు. తాత్కాలిక వెయ్యేండ్ల కాలము ఉండదు. పరిశుద్దాత్మ వారి హృదయాలకు నిశ్చయమైన నమ్మకము తీసుకొచ్చిన తరువాత, వారు సత్యాన్ని అడ్డుకోవడమే కాక ఇతరులు దానిని స్వీకరించలేని విధంగా వారి ప్రభావాన్ని ఉపయోగించుకుంటే, వారు ఎప్పటికీ తప్పు ఒప్పకోరు. వారు ఇచ్చిన పరిశీలన కాలములో వారి ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నించరు. మరియు క్రీస్తు వారికి మరల ఒక మారు తిరిగి వచ్చే అవకాశం ఇవ్వడు. అదే ఇక చివరి నిర్ణయము. - లెటర్ 25, 1900.LDETel 165.1