Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  13 అధ్యాయము - కడవరి వర్షము

  పరిశుద్ధాత్మకార్యమువర్షములకు సూచనగా వుంది

  [జెకర్యా 10: 1; హోషేయ 6: 3; యోవేలు 2:23, 28.చూడండి]” వర్షమును ఆయన మన యొద్దకు వచ్చును, తొలకరి వర్షము కడవరి వర్షమువలె వచ్చును. ఇదే సమయమందు తూర్పులో తొలకరి వర్షం వస్తుంది. విత్తనము క్రమముగా మొలకెత్తడానికి అది అవసరం. పలదీకరణ వర్షాల ప్రభావంతో లేతమెక్కలు భూమి నుండి బయటకు వచ్చును. కడవరివర్షం, ఋతువు ముగింపు దగ్గర పడెను, ధాన్యము పండినప్పుడు ఇక కోతకోయుటకు సిద్ధముగా వున్నది. పరిశుద్ధాత్మ యొక్క పనిని సూచించడానికి ప్రభువు ఈ ప్రకృతి కార్యకలాపాలను వినియోగిస్తాడు.LDETel 128.1

  విత్తనమును మొలకెత్తడానికి మంచు, వర్షము మొదట కారణమని చెప్పబడినది మరియు అటు తరువాత పండిన పంటను కోయును, అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధి విదానములో కూడ పరిశుద్దాత్మ ఒక దశ నుండి మరొక దశకు పనిని ముందుకు కొనసా గించుటకు జరుగును. దాన్యం పంటపండియున్నది అంటే ఆత్మలో దేవుని దయా కార్యము పూర్తి అయునదని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క నైతిక స్వరూపము ఆయన స్వబావములో పరిపూర్ణంగా ఉంటుంది. మనము పూర్తిగా క్రీస్తు పోలికగా రూపాంతరం పోందవలెను.LDETel 128.2

  కడవరి వర్షం, భూమిమీద పంటను పండించుచున్న విదముగా మనుష్యకుమారుని రాక కోసం సంఘమును సిద్ధపరుస్తున్న ఆధ్యాత్మిక కృప సూచిస్తుంది. అయితే తొలకరి వర్షం పడకపోతే, ప్రాణము ఉండదు కనుక పచ్చని ఆకు భూమినుండి బయటకు రాదు. భూమియొక్క తొలకరివర్షం ధానిపనిని చేయకపోతే, కడవరి వర్షం విత్తనమును పరిపూర్ణతకు తీసుకొనిరాదు -టెస్టమోనీస్ టా మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్.-506 (1897). A. ది హిస్టారికల్ అప్లికేషన్ టు ది చర్చ్ యాజ్ ఎ హోల్. (ఎ) సంఘమంతటికి చరిత్రా ప్రకారం తెలుపుటLDETel 128.3

  ఎడి 31 పెంటెకోస్ట్ దినమందు ఈ తొలకరి వర్షము వచ్చినది

  వాగ్దానం నెరవేర్పు కోసం వేచివున్న తరుణంలో శిష్యులు దీనులై పశ్చాతాపం పొంది తమ అవిశ్వాసానికి క్షమాపణ వేడుకోన్నారు...... మనుష్యుల్ని కలుపుకోవడానికి తమ దినదిన జీవన సంబందాల్లో పాపులను క్రీస్తు వద్దకు నడిపించే మాటలు మాట్లాడటానికి సామర్థ్యం కోసం శిష్యులు చిత్తశుద్ధితో ప్రార్ధించారు. సమస్త విబేదాల్ని గొప్పతనము కోసం వాంచను విడిచిపెట్టి క్రైస్తవ సహవాసములో వారందరు ఒకటయ్యారు. అపోస్తసలుల కార్యలు - 35-37 (1911)LDETel 128.4

  శిష్యులు పరిపూర్ణ ఐక్యతకు వచ్చిన తర్వాత, వారు హెచ్చించుకొనే స్థానం కోసం ఇక మరెన్నడు ప్రయత్నాలు చేయుకుండవుండినప్పుడు ఆత్మ వారి మీదకి కుమ్మరించబడెను.- సంఘమునకు ఉపదేశములు 8:20 (1904).LDETel 129.1

  లోకం చివరి కాలంలో, లోకంలో దేవుని సేవ ముగిసే తరుణములో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం క్రింద భక్తితత్పరులైన విశ్వాసుల పరిచర్యలో దైవ ప్రసన్న తను, సూచించే గుర్తులు చోటు చేసుకోంటాయి.- అపోస్తసలుల కార్యలు, 54, 55 (1911).LDETel 129.2

  పెంటెకోస్ట్ దినమందు ఈ తొలకరి వర్షము యొక్క ప్రభావము

  ఆత్మ ప్రభావం క్రింద పశ్చాతాపం పాపపు ఒప్పుకోలు చోటు చేసుకుంటాయి, క్షమాపణ లభించినందుకు స్తుతిగానం పైకి లేచింది, కృతజ్ఞతా స్తుతులు ప్రవచన వాక్కులు వినిపించాయి.....ఒక్క రోజునే వేలాది ప్రజలు మారుమనసు పొందారు. పరిశుద్దాత్మ వరము పొందిన శిష్యులు ఇంతకముందు పరిచయంలేని భాషలు అనర్గళంగా మాట్లాడారు...జీవిత కాలమంతా పనిచేసిన వారు చేయలేని పనిని పరిశుద్దాత్మ వారి పక్షమున సాదించాడు.- అపోస్తసలుల కార్యలు, 38-40 (1911).LDETel 129.3

  వారి హృదయాలు ప్రగాడమైన దయాళత్వముతో నిండి క్రీస్తు రక్షణ శక్తిని గూర్చి సాక్ష్యమివ్వడానికి దిగంతుల వరకు వెళ్లడానికి వారికి బలవంతం చేశాయి. - అపోస్తసలుల కార్యలు, 46 (1911).LDETel 129.4

  పెంతెకొస్తుదినాన పరిశుద్దాత్మ కుమ్మరింపు పలితముగా ఏమిజరిగినది? రక్షకుని పునరుత్థాన శుభవార్త ప్రపంచంలో ప్రజలున్న ప్రాంతలన్నిటికి వెళ్లింది...... అన్ని దిశల నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి సంఘములో చేరారు, ఆశక్తి కోల్పోయిన సభ్యులు తిరిగి మారుమనసు పొందారు....... ప్రభువు ఆదర్శం ఒక్కటే అన్నిటికన్నా ఆశక్తికరమైన అంశం క్రీస్తు మాదిరిగా నడుచుకో వడం ఆయన రాజ్యవ్యాప్తికి కృషిచేయుడం ఇదే విశ్వాసులు అశించినది. - అపోస్తసలుల కార్యలు.. 48 (1911)LDETel 129.5

  కడవరివర్షము యొక్క వాగ్దానము

  అపొస్తలుల కాలంలో ఆత్మకుమ్మరించడమంటే” తొలకరి వర్షము”, మరియు మహిమాన్వితమైన విజయము కానీ కడవరివర్షం మరింత సమృద్ధిగా ఉంటుంది. - సంఘమునకు ఉపదేశములు.8:21 (1904).LDETel 129.6

  కాగా లోకం పంట చివరి దశలో మనుష్య కుమారుని రాక కోసం సిద్ధం చేసేందు నిమిత్తం ప్రత్యేక ఆధ్యాత్మిక కృపావరాన్ని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ ఆత్మ కుమ్మరింపు కడవరి వర్షముతో పోల్చబడ్తుంది. అపోస్తసలుల కార్యలు 55 (1911).LDETel 129.7

  భూమి పై దేవుని తీర్పులు పడకముందు అపోస్తులుల దినాలనుంచి కనుమరుగైన సనాతన దైవభక్తి ప్రజలలో దర్శనమిస్తుంది. దేవుని ఆత్మ దేవుని శక్తి ఆయన ప్రజలLDETel 129.8

  మీదకి దిగివస్తాయి. ఆ సమయములో దేవుని ప్రేమిస్తునే లోకాశలపై మనస్సు నిలుపు తున్న సంపూలను అనేకమంది విడిచిపెడ్తారు. మహా సంఘర్షణ,464 (1911)LDETel 130.1

  ఈకార్యము పెంతుకొస్తునాడు జరిగిన కార్యన్ని పోలి ఉంటుంది. ఎంతో విలువైన విత్తనాలు మొలకెత్తేందుకు సువార్త ఆరంభములో తొలకరి వర్షము వచ్చినట్లు సువార్త పరిసమాప్తి తరుణములో పంటను సిద్ధపర్చేందుకు కడవరి వర్షము వస్తుంది. మహా సంఘర్షణ, 611 (1911)LDETel 130.2

  కడవరి వర్షము గొప్ప శబ్దముచేయును .

  కడవరి వర్షము కుమ్మరించే సమయమంటే, ప్రభు యొక్క రాకడ ఉనికిని మళ్ళి జ్ఞాపకము చేయుటము లేదా మూడవ దూత యొక్క గంభీర స్వరమునకు అదికారం ఇచ్చుటకు మరియు చివరి ఏడు తెగుళ్లు కుమ్మరించబడే సమయంలో భక్తులు నిలబడుటకు సిద్ధము చేయుట అని అర్ధము.- ఎర్లీ రైటింగ్స్ 86 (1854).LDETel 130.3

  కవచమును ధరించినవారు గొప్ప శక్తితో సత్యం మాట్లాడుచున్నారు. అయితే ఇది ప్రభావాన్ని కలిగించుచున్నది... ఇంత గొప్ప మార్పుకి రావటానికి కారణము ఏమిటి అని అడిగాను. ఒక దేవదూత, ఇది కడవరి వర్షము ప్రభు యొక్క రాకడ ఉనికిని మళ్ళీ జ్ఞాపకము చేసుకోనుట, మూడవ దూత యొక్క గభీర స్వరము అని సమాధానము ఇచ్చెను.- ఎర్లీ రైటింగ్స్, 271 (1858).LDETel 130.4

  (బి) వ్యక్తిగత క్రైస్తవునికి ఇది వ్యక్తిగత విజ్ఞాపన. LDETel 130.5

  తొలకరి వర్షం పశ్చాత్తాపము కలిగించును కడవరి వర్షం క్రీస్తు పోలికలో అభివృద్ధి చేయును

  మన అనుభవంలో ఎప్పుడైనా మనము మొదటగా చేయటానికి మాకు సహాయపడుతున్న దానితో వ్యవహారాలు నడిపించగలుగుచున్నామా. తొలకరి వర్షంలో పొందిన ఆశీర్వాదం మనకు అంతిమ కాలమున అవసరమైయున్నది... పరిశుద్ధాత్మ కోసం మనము దేవుణ్ణి కోరినప్పుడు, అది మనలో సాత్వికము వినయముగల మనస్సు కడవరివర్షము కొరకు మనము దేవునిపై జ్ఞానయుక్తముగా ఆధారపడటం నేర్పించు చున్నది. టెసమోనీస్ టూ మినిస్టర్స్ అండ్ గాస్పల్ వర్కస్, 507, 509 (1897)LDETel 130.6

  పరిశుద్ధాత్మ ప్రతి ఆత్మలో నివసించుటకు చుస్తున్నాడు. గౌరవనీయుడైన అతిదిగా ఎవరైతే ఆహ్వానిస్తారో వారు క్రీస్తులో పూర్తి పరిపూర్ణులగుతారు. ప్రారంబించబడిన మంచి పని పూర్తవుతుంది; అపవిత్రమైన ఆలోచనలు, వంచనాత్మక బావాలను, మరియు తిరుగుబాటు లక్షణాలు యొక్క స్థానములో పవిత్రమైన ఆలోచనలు, పరలోక అభిమానములు, మరియు క్రీస్తునిపోలిన కార్యలు చోటుచేసుకొను.- కౌన్ సిల్ ఆన్ హెల్త్ (1896).LDETel 130.7

  మనము దేవుని ఆత్మ గూర్చిన జ్ఞానము కలిగి ఉండవచ్చు, అయితే మనము ప్రార్ధన మరియు విశ్వాసం ద్వారా ఆత్మను నిరంతరము వెతుకువలసియుంది, మన ప్రయత్నాలను నిలిపివేయడానికి అతడు ఎప్పుడు అడ్డగించడు. అయితే మనం అభివృద్ధి పొందకపోతే,అంటే తొలకరి వర్షము మరియు కడవరి వర్షం ఈ రెండింటిని స్వీకరించడానికి మన వైఖరి సరైన స్థానములో ఉండకపోతే, మనము ఆత్మలను కోల్పోతాము, ఆ బాధ్యత అంతయు మన స్వంత ద్వారము యెద్దనే ఉంది.....శిబిరములు ఏర్పటు చేసిన సభలు వలే సంఘ సమావేశాలు, మరియు గృహ ఆలయములో కూటలుగా ఏర్పటు చేయాలి, ఈ సందర్భాలు అన్ని ఆత్మలు రక్షణ కొరకు వ్యక్తిగత శ్రమ తీసుకోనవలెను. ఇదే కడవరి వర్షము దేవుని భూమిమీద నిర్ణయించిన గొప్ప అవకాశాలు .-టెస్టమోనీస్ టూ మినిస్టర్స్ అండ్ గాస్పల్ వర్క్సు 508 (1897)LDETel 131.1

  దేవుని ఆత్మ కోసం మార్గం సిద్ధం చేసినప్పుడు, దీవెనలు వస్తాయి. సాతాను భూమ్మీద వర్షం కురవకుండ చేయుటకు ఆకాశము యొక్క కిటికీలను మూసేయ గలడా? అలాగ దేవుని ప్రజలపై ఆశీర్వదము పరలోకము నుండి కుమ్మరించ బడినప్పుడు అతడు అటంకపరచలేడు.. సెలెక్ట్డ్ మెసేజస్ 1: 124 (1887).LDETel 131.2

  పరిశుద్దాత్మ దిగురమ్మనిమనము యదార్ధముగా ప్రార్థించాలి

  పెంటెక్స్ట్ దినమున శిష్యులు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కొరకు ప్రార్ధించినట్టు మనము కూడ దృడమైన నమ్మకముతో ప్రార్ధించవలెను ఆ సమయంలో అది వారికి అవసరమైతే ఈ రోజులలో మనకు ఇంకెంత ఎక్కువ అవసరమైయున్నది ? - సంఘమునకు ఉపదేశములు 5: 158 (1882)LDETel 131.3

  భవిష్యత్తులో సంఘము మీద పరిశుద్దాత్మ కమ్మరిపు కొరకు మనము ఎదురు చూస్తువున్నాము కానీ ఇప్పుడు సంఘం అవసరమైయుండుటం మన ఆదిక్యత అయిన్నది. దాని కోసం ఎదురుచూడు, దాని కోసం ప్రార్థించు, దాని కోసం విశ్వసించు, అదిమనకు అవసరమైయున్నది. మరియు మన మీద కుమ్మరించడానికి పరలోకం వేచియున్నది. ఉంది. ఎవాంజలిజం, 701 (1895). మనకు పొందుకునే పరిశుద్దాత్మ యొక్క స్థానము మన కోరిక పరిమాణము మరియు దాని కొరకై పాటుపడిన విశ్వాసమునకు అనుగుణంగా ఉంటుంది, మరియు మనము పరిశుద్దాత్మ ద్వారా ఘనముగా ఉపయోగపడినప్పుడు మనకు ఇవ్వబడిన వెలుగును మరియు జ్ఞానమును మరింతగా మెరుగుపరుచుకుంటాము - రివ్యూ అండ్ హెరాల్డ్, మే 5 , 1896.LDETel 131.4

  మన విజ్ఞాపనలతోను మరియు పరిశుద్దాత్మ యొక్క బహుమానం కొరకు ప్రభువును అడిగి మరియు శ్రమపెట్టుటకు మనము అంతగా ఇష్టపడుట లేదు. అయితే ఈ విషయంలో ఆయనను వేదించమని ప్రభువే కోరుతున్నాడు. మన విన్నపములు ఆయన సింహాసనం ఎదుట ఒత్తిడి చేసే విధముగా వుండాలని ఆయన కోరుతున్నాడు.. పండమెంటల్స్ అప్ క్రీస్టయన్ ఎడ్యుకేషన్, 537 (1909).LDETel 131.5

  నిజమైన పశ్చాత్తాపముతో వినయముగల హృదయాముకలిగివుండాలి

  మనలో నిజమైన దైవత్వాన్ని పునరుద్దరించటం అనేది మన అవసరాలన్నింటిలో ఉన్నతమైనది మరియు అత్యవసరమైనది. దీనిని మనము వెతకడానికి ఇది మొట్ట మొదటి పని అయుండాలి. దేవుడు మన మీద అతని దీవెన పంపిచుట లేదు అని కాదుగాని మనము అది స్వీకరించడానికి సిద్ధముగా లేము కాబట్టి అందుకని దేవుని ఆశీర్వాదము పొందటానికి గట్టి ప్రయత్నం ఉండాలి. భూమిపైన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వలనుకొన్న దానికన్న మన పరలోకపు తండ్రి తన పరిశుద్ధాత్మను ఆయనను అడిగిన వారికి , ఇంకా ఎంతో సంతోషిసముతో ఇచ్చుటకు ఇష్ట పడుచున్నాడు. దేవుడుమనకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడనిచేసిన వాగ్దానాలను పొందు కొనుటలో వున్న షరతులు లోబడాలి, మనము ఒప్పకోవడం, అవమానము పోదటం పశ్చాత్తాపం మరియు యదరమైన ప్రార్ధన నెరవేర్చటం అదేమన బాద్యత అయున్నది. ప్రార్థనకు సమాదానం తప్పక వస్తదనే నమ్మకమునకు ఈ పునరుద్ధరణ అవసరం - సెలెక్టేడ్ మెజన్స్ 1: 121 (1887).LDETel 132.1

  మనలో శ్రద్ధగల పునరుద్దరణ ఉండాలి అని నేను మీకు చెప్తాను. మార్పును తీసుకొని వచ్చే ఒక పరిచర్య ఉండాలి. ఒప్పుకోలు, పశ్చాత్తాపం మరియు మార్పు చెందడం తప్పక ఉండాలి. వాక్యాన్ని బోదిస్తున్న చాలామంది తమ హృదయాలలో క్రీస్తు యొక్క కృప అవసరం. ఇక ఏది ఆలస్యము కాక మునుపే వారు ఏమీ కార్యము చేయాలని నిర్ణయించుకున్న వారి మార్గములో ఏదికూడ అడ్డురాకూడదు.- లెటర్స్51, 1886.LDETel 132.2

  పునరుజ్జీవముతో సంస్కరణ అనుసరించాలి

  పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణలో పునరుజ్జీవనం మరియు సంస్కరణ జరగాలి. పునరుద్ధరణ మరియు సంస్కరణ రెండు విభిన్న విషయాలు. పునరుజ్జీవనం ఆధ్యాత్మిక జీవితం యొక్క పునరుద్ధరణను సూచిస్తుంది, మనస్సు మరియు హృదయ శక్తులు వేగవంతమైనదిగా చేస్తుంది, ఆద్యాత్మిక మరణం నుండి పునరుత్థానము ఇది. సంస్కరణ ఒక పునర్వ్యవస్థీకరణ, ఆలోచనలు మరియు సిద్ధాంతాలు, అలవాట్లు మరియు అబ్యాసాల మార్పును సూచిస్తుంది. అది ఆత్మసంబందమైన పునరుద్ధరణవుంటేనే గాని సంస్కరణ నీతిగలదై మంచి పలములను తీసుకురాదు. పునరుజ్జీవనం మరియు సంస్కరణలు వారు నియమించిన పనిని చేయవలెను మరియు ఈ పనిని చేయటానికి మనముఐక్యమవ్వాలి. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్రవరి 25, 1902.LDETel 132.3

  భేదములు మరియు వివాదములన్ని దూరంగా చేయాలి

  సేవకులు క్రీస్తులో నిలకడగా జీవించినప్పుడు మరియు వారి సొంత ఆత్మలో స్వార్ధమనేది చచ్చిపోయినప్పుడు, ఎటువంటి శత్రుత్వం లేనప్పుడు, ఆధిపత్యం కొరకుLDETel 132.4

  నప్పుడు, వారిలో ఒకరి యెడల ఒకరిని చూసుకుంటారు మరియు అనుబావాలను పొందుకుంటారు., అప్పుడు పరిశుదాత్మ యొక్క కృపా వర్గం వారి మీదకి తప్పకుండ వస్తుంది దేవుని వాగ్దానం ఎప్పుడు రవంతగాని లేదా తునకగాని విఫలమౌవ్వదు. కానీ ఇతరుల పనిని తోసివేయబడినప్పుడు, సేవకులు వారి సొంత ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే, వారి స్వంత పనిలో ఎటువంటి అదికారంకలిగి ఉండదని వారికి వారే నిరూపించేదరు దేవుడు వారిని ఆశీర్వదించడు.- సెలెక్ట్డ్ మెసేజస్ 1: 175 (1896).LDETel 133.1

  క్రీస్తు మన ఉన్నతమైన ఆశ్రయముగా చేసుకొని ఆ గొప్ప దినమందు దేవునికి లోబడినప్పుడు, ప్రతి శత్రుత్వము, అధికారము కోసం ప్రాకులాటలు అన్ని ప్రక్కన పెడతాము. జీవితములో మరల అవి చిగురు పెట్టకుండ వుండుటకు అపవిత్రమైన పనుల మూలాలను పూర్తిగా నాశనం చేయాలి. మనము పూర్తిగా ప్రభువుపకమున నిలుచుటకు సమర్పించుకోవలి.- దిన్స్ డే విత్ గాడ్, 258 (1903).LDETel 133.2

  క్రైస్తవులు అన్ని వైరుధ్యాలను అణచివేసుకొని, నశించిన వారిని రక్షించుట కొరకు దేవునికి పూర్తిగా సమర్పించు కొనవలెను. వాగ్దానము చేయబడిన ఆశీర్వాదం కోసం విశ్వాసంతో వారిని అడగనీయండి మరియు అవితప్పక నెరవేరుతాయి. -సంఘమునకు ఉపదేశములు. 8: 21 (1904)LDETel 133.3

  ఒకరినొకరు ప్రేమించవలెను

  క్రైస్తవ్యము ఒకరి యెడల ఒకరికి సాత్వికమైన అభిమానము కనపర్చుచున్నది...... క్రీస్తు తాను సృష్టించిన మానవుల నుండి అత్యునతమైన ప్రేమను తాను పొందాలి. మరియు తన తోటి మనుష్యుల యెడల పవిత్రమైన గౌరవము వుండాలని ఆయన కోరుకొనుచున్నాడు. ప్రతి ఆత్మ ఇతరుల ప్రేమ ద్వారానే రక్షించబడతారు. అది దేవుని తోనే ప్రారంభమైయున్నది.. నిజమైన మార్పు దేవుని కొరకు మరియు ఒకరి కొకరు స్వార్థంనుండి పవిత్రమైన అభిమానములోనికి మార్పుచెందవలేను సెలెక్ట్డ్ మెసేజ: 1: 114, 115 (1901). కనికరము మరియు పరిపూర్ణత లక్షణాలు దేవుడు అనుగ్రహించు బహు మనములు. ఈ లక్షణాలు ప్రతీ క్రైస్తవడు ఇతరులతో పంచకోనవలేను.. సంఘమునకు ఉపదేశములు.5:85 (1882).LDETel 133.4

  సువార్తకు అనుకూలంగా ఉన్న బలమైన వాదన ప్రేమించటం మరియు ప్రేమగల క్రైస్తవులుగా ఉండటం.-ది మినిస్టీ అప్ హీలింగ్ 470 (1905).LDETel 133.5

  పూర్తి అంకిత భావము అవసరం

  దారళముగా సమర్పించుకొనిన వారికన్న దేవుడు ఇకఎవరిని అంగీకరించును. అర్దమనస్సుగల పాపులైన క్రైస్తవులు పరలోకములో ప్రవేశించలేరు, అక్కడ వారు ఎటువంటి ఆనందాన్ని పొందరు, ఎందుకంటే ఉన్నతమైన కుటుంబ సభ్యులను నియమించే అధికమగల, పవిత్రమైన సూత్రాల గురించి వారు అర్ధం చేసుకోలేరు............LDETel 133.6

  నిజమైన క్రైస్తవుడు తన హృదయ ద్వారం పరలోకమువైపు తెరుచును క్రీస్తుతో సహవాసములో జీవిస్తాడు. అతడు ఇంక క్రీస్తు పోలికలోనికి మారాలని ఉన్నతమైన కోరిక కలిగియుంటాడు. ది రివ్యూ అండ్ హెరాల్డ్, మే 16, 1907.LDETel 134.1

  మనము పరిశుద్ధత్మను ఉపయోగించుకోలేము, దేవుని ఆత్మ మనలను ఉపయోగించాలి. ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును దేవుడు ఆత్మ ద్వారా తన ప్రజల్లో పనిచేస్తాడు. పిలి. 2.13 కాగా అనేకులు దీనిని అంగీకరించరు. వారు స్వతంత్రముగా వ్యవహిరించాలని కోరుకుంటారు. ఇందువల్లనే వారు ఈ పరలోక వరాన్ని పొందలేక పోతున్నారు. ఎవరైతే వినయముగా దేవుని మీద ఆధారపడి వేచి ఉంటారో, ఎవరైతే ఆయన నడుపుదలకోసం, కృప కోసం కనిపెడతారో వారు మాత్రమే పరిశుద్దాత్మను పొందుతారు. - యుగయుగల ఆకాంక్ష, 672 (1898).LDETel 134.2

  కడవరివర్షం కోసం మార్గము సరళము చేయవలేను

  వత్తిడిమీద, కోపం మీద, గర్వం, స్వార్ధం, లోక ప్రేమ, మరియు ప్రతి తప్పుడు వాక్యలు మరియు ప్రతి తప్పుడు చర్యల మీద విజయాన్ని సాధించకపోతే ఎవరూ కూడ శుద్దీకరించబడరని నేను గమనించాను. కాబట్టి మనము దేవుని యెద్దకు అతి సమీపమునకు రావలెను మరియు దేవుని యొక్క దినమందు దైర్యముగా నిలువబడి పోరాడుటకు తగిన సిద్ధబాటు అవసరమని నమ్మకముగా ప్రార్ధించవలెను, అర్లీరేటింగ్స్ 71 (1851).LDETel 134.3

  ప్రతి అపవిత్రత నుండి మన హృదయమనే ఆలయము శుభ్రపరచడానికి, మన ప్రవర్తనలోవున్న లోపాలను నివారించడానికి ఇది మనకే విడిచిపెట్టబడియున్నది. ఆ తర్వాత పెంటెక్స్ట్ దినమున శిష్యుల మీద తొలకరి వర్షం కమ్మరించ బడినట్టు మన మీద కడవరి వర్షము కమ్మరించబడును.సంఘమునకు ఉపదేశములు 5: 214(1882)LDETel 134.4

  దేవుని ప్రజలు ప్రతి అడ్డంకులను తొలగించుకొని మార్గము సరాళము చేస్తునప్పుడు సాతానుడు ఇక భయపెట్టుటకు అతని దగ్గర ఏమివుండదు,అప్పుడు ప్రభువు తన ఆత్మను దీన సంఘము మీద కుమ్మరించును......... ప్రతీ శోధనను, ప్రతి వ్యతిరేకమైన ప్రభావంఅది బహిరంగమైన లేదా రహస్యమైనను సరే, తప్పకుండ, విజయవంతంగా నిరోదించబడవచ్చు, బలము చేతనైనను శక్తివలనను కాదు గాని నా ఆత్మచేత సైన్యము లకు అదిపతియగు యెహోవా చెపుతున్నాడు (జెకర్యా4:6) సెలెక్టెడ్ మెసేజర్స్ 1: 124 (1887).కడవరి వర్షం వస్తుంది, మరియు ప్రతి అపవిత్రత నుండి శుద్ధి చేయబడి దేవుని దీవెనచేతనింపబడును.మనము దేవుని సన్నిదిలో నుండి తిరిగి శుద్ధగు సమయము కొరకును మరియు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కొరకు అర్హత కలిగి ఉండుటకు నేడే మన ఆత్మలను క్రీస్తుకు సమర్పించుకో వలసిన బాధ్యత వునది. సెలెక్ట్డ్ మెసేజస్,: 1: 191 (1892).LDETel 134.5

  క్రీస్తు సేవలో చురుకైన పనివారిగా సిద్ధపడుము

  సంఘాలు సజీవంగా ఉన్నప్పుడు, కష్టించి పనిచేస్తున్న సంఘాలకు వారి యదార్ధమైన విజ్ఞాపనకు పరిశుద్ధాత్మ సమాదానం ఇవ్వబడుతుంది... అప్పుడు పరలోక ద్వారములు తెరవబడి కడవరి వర్షము కుమ్మరించబడును.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్రవరి 25, 1890.LDETel 135.1

  దేవుని జత పనివారంటే ఏంటో అనుభవ జ్ఞానము ద్వారా వికాసం పొందిన ప్రజలు ఉండే వరకు, సర్వజగత్తును తమ మహిమతో వెలిగించే దైవాత్మ కుమ్మరింపు జరగదు. క్రీస్తు సేవకు మనము పూర్తిగా హృదయపూర్వకముగా ప్రతిష్ఠించుకొన్నప్పుడు, తన ఆత్మను అపరిమితముగా కుమ్మరించటం ద్వారా దేవుడు ఆ విషయాన్ని గుర్తిస్తాడు, కాని సంఘంలో ఎక్కువ మంది దేవుని జతపనివారు కానప్పుడు ఇది జరగదు. - క్రైస్తవ పరిచర్య, 253 (1896) సోమరితనము మరియు బద్దకమును ఘోరంగా తిరస్కరించి, సంఘము నుండి పూర్తిగా దూరముచేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎంతో దయతో ప్రత్యక్షమగును, దైవికమైన శక్తి బయలుపర చబడును. సైన్యాదిపతి అయున దేవునికి దైవకృత మైన పని జరగడం సంఘము చూచుకొనును-సంఘమునకు ఉపదేశములు. 9:46 (1909).LDETel 135.2

  పాత్రను శుద్ధి చేసి బోర్లించకుండ పైకే వుంచు

  కడవరివర్షం గురించి మనము చింతించవలసిన అవసరం లేదు. అయితే మనము చేయవలసిదెల ప్రాత్రను శుద్ధిచేసి బోర్లించకుండ పైకి వుంచాలి అప్పుడు పరలోకము వర్షమును స్వీకరించడానికి సిద్ధముగా ఉంటుంది. మరియు కడవరి వర్షం నా పాత్రలో కురవాలని ప్రార్ధిస్తూ ఉండండి, ఘనముగా ప్రకాశించే దూత, మూడవ దేవదూతతో ఏకమైనా మీద వెలుగు ప్రకాశించింపజేయును, నాకు పనిలో ఒక భాగం ఇవ్వండి; నేను కూడ ద్వనించి ప్రకటించేదను, యేసుక్రీస్తుతో నేను జత పనవాడిగా ఉండనివ్వండి. అని ఆ విధముగా దేవుణ్ణి వెదకండి, నేను ఒక విషయము చెప్పేదను ఆయన మనకు తన కృపను అనుగ్రహించి అన్ని వేళలా నిన్ను తగిన పనివాడిగా నుంచెను.- ది అప్వోడ్ లుక్, 283 (1891).LDETel 135.3

  ఆకస్మిక వేగంతో మరియు అధిక శక్తితో జవాబురావచ్చు, లేదా అది రోజులు మరియు వారాలు ఆలస్యం కావచ్చు, మరియు మన విశ్వాసం పరిక్షింపబడుతుంది, మన ప్రార్థనకు ఎప్పుడు ఎలాగా జవాబివ్వాలో దేవునికి తెలుసు. ఇది దైవికమైన మార్గములో మనము సంబందము పెట్టుకోవటం మన పనిలో ఒక భాగమైయున్నది. అయితే దేవుడు తన పనిలో తన భాగానికి బాద్యుడు. అతను వాగ్దానం చేసిన దేవుడు గొప్ప నమ్మకమైన వాడు. మనలో ఉండవలసినది ఉన్నతమైనదియు మరియు ముఖ్యమైనదియు ఒకే ఆత్మ మరియు ఒకే మనస్సు ఉండాలి. శత్రుత్వము మరియ అసూయలు అన్ని ప్రక్కనపెట్టి వినయపూర్వకముగా వేడుకొనేవాడిగా మెలుకువగా వుండి ఎదురుచూడు. యేసు మన ప్రతినిది మరియు మన అధిపతి పెంటికోస్ట్ దినమున ప్రార్ధించి వేచియున్న శిష్యులకు ఆయన ఏమి చేసియున్నాడో మనకి చేయుటకు సిద్ధముగావున్నాడు. - ది స్పిరిట్ అఫ్ ప్రఫస్సీ. 3: 272 (1878).LDETel 135.4

  పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ఎప్పుడు జరుగుతుంది అని చెప్పుటకు నాయొద్ద ఎటువంటి నిర్దిష్టమైన సమయాన్ని సూచించుటకు లేదు. శక్తివంతమైన దేవదూత పరలోకం నుండి క్రిందికి వచ్చి మూడవ దేవతతో ఏకమై ఈ లోక అంతిమ కార్యమునుము జరిగించును. నా సందేసం ఏమిటంటే కేవలం పరలోకము కొరకు శుద్ధులగుటకు మనము సిద్ధపడడడుటమే క్షేమము, కనుక మన దివిటీలు శుద్ధి చేసుకొని వెలిగించెదం. - సెలెక్ట్డ్ మెసేజస్, 1: 192 (1892)LDETel 136.1

  కడవరి వర్షం అందరు పోందుకోరు

  దేవుని ప్రజలు వారు చేయవలసిన కార్యాలకు ఎటువంటి ప్రయత్నము చేయకపోగా, వారు శుద్ధులగుటకు వారి మీదకు వర్షము కురవాలని మరియు వారి తప్పులను తొలగించబడి వాటిని సరిచేసుకోవాలనే చూస్తున్నరే తప్ప దేనికోసం కాదని నాకు తెలియజేయబడియుంది. అయితే కేవలం వారు శరీరము మరియు ఆత్మ యొక్క అపవిత్రత నుండి శుద్ధులగుటకు ఆధారపడియున్న మరియు మూడవ దేవదూత యొక్క స్వరములో నిమగ్నమై ప్రకటించడానికి అర్హతక లిగియున్న ఇంక వారిలో ఎదొ ఒకటి కదువువుంటుంది. -సంఘమునకు ఉపదేశములు 1: 619 (1867).LDETel 136.2

  సంఘమంత పునరుజ్జీవింపజేయబడలని మన మందరము ఆశించుచున్నామా? ఆ సమయంఎ ప్పటికి రాదు. మార్పు చేందనివారు మరియు యదార్ధమైన శక్తిగల, బలమైన ప్రార్ధనలో ఐక్యము కలిగి ఉండని వారు ఇంక సంఘములోనే వున్నారు. మనము వ్యక్తిగతంగా పని చేయుటకు సిద్ధపడాలి. మరియు మనము తక్కువ మాట్లాడి అధిక ప్రార్ధనచేయటములో నిమగ్న మౌవ్వలి. - సెలెక్ట్డ్ మెసేజర్స్,:1: 122 (1887).LDETel 136.3

  పరిశుద్ధాత్మ కుమ్మరిచినప్పుడు, ప్రారంభ వర్షాన్ని స్వీకరించకపోయిన మరియు, అభినందించకపోయున, తరువాత వచ్చే కడవరి వర్షము యొక్క విలువను వారు చూడరు లేదా అర్ధం చేసుకోలేరు.- టెస్టమోనీస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్. 399 (1896).LDETel 136.4

  దైవప్రేరణ కలిగియున్న వారు మాత్రమే సత్యమునకై అనుకూలముగా నివశిస్తున్నప్పుడు వారు ఇంక ఉన్నతమైన వెలుగు పోందుకుంటారు. చురుకైన క్రైస్తవులుగా లోకమునకు మాదిరిని చూపించుటకు మనము అనుదినము వృద్ధి చేందకపోయునటైయితే. కడవరి వర్షంలో పరిశుదాత్మ యొక్క ప్రత్యక్షతను మనము గుర్తించలేము. కనుక ఇది హృదయాలలో కాక దాని చుట్టు ప్రక్కల కుమ్మరించ బడుతుంది. అది మనము చూడలేము లేదా అందుకోలేము. సంఘమునకు సాక్ష్యాలు, 507 (1897).LDETel 136.5

  నిర్ణయం చేసుకోవాలని ప్రయత్నాలు చేయని వారు తమ చర్యకు పరిశుద్ధాత్మ ఒత్తిడి చెయ్యటానికి కనిపెట్టేవారు చీకటిలో నశిస్తారు. మీరు దేవుని సేవలో పని చెయ్యకుండా కూర్చోకూడదు. -క్రైస్తవ పరిచర్య, 228 (1903).LDETel 137.1

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents