Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    11 అధ్యాయము - అంతిమ కాలములోసాతాను వంచన.

    క్రైస్తవ మతం క్రింద బలవంతముగ లోంగదీసుకొనుట

    ఈ భూమి యొక్క ముగింపు చరిత్ర అంతమునకు మనము సమీపిస్తున్నాము, సాతాను ముందెన్నడు పని చేయునంతగా పనిచేయుచున్నాడు. ఒక వింతైన విధానములో అతడు తన అబద్దం అద్భుతాలు మరియు మాయలు ప్రదర్శిస్తు తానే క్రైస్తవ ప్రపంచమునకు నియంత పరిపాలకుడుగా వ్యహరిస్తున్నాడు, తాను ఎవరినైన కబళించునట్లు సాతానుడు ఒక గర్జిస్తున్న సింహంలా తిరుగుచున్నట్టు కనపర్చు చున్నాడు. అతను తన కట్టుబాటుతో ప్రపంచమంతటిని లోపరచుకోవాలని ఆశించు చున్నాడు. క్రైస్తవ మతంకింద తన మోసపూరితమైన వికృత రూపమును దాచి, ఒక క్రైస్తవ లక్షణాలు కలిగివున్నట్టుగా ఆరోపించుకొనుచు తానే క్రీస్తుగా ప్రకటించుకొనును.మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 8: 346 (1901).LDETel 108.1

    శత్రువు యొక్క ఉద్దేశ్యం సరి జోడి అయునప్పుడు క్రైస్తవత్వము ముసుగులో తన అనుచరుల ద్వారా గొప్ప శక్తి కలికియున్నాడని బయలుపరుచుకొని, సాధ్యమైనంత వరకు ఏర్పర్చబడినవారి సహితం మోసగించునని దేవుని వాక్యం ప్రకటిస్తున్నది. (మత్తయి 24:24). ఎంఎస్, 125,1901.LDETel 108.2

    అనేకమైన అద్భుత కార్యలు చేస్తాడు. దురాత్మలు బైబిలుని విశ్వసిస్తున్నట్లు చెప్పుతాయి. సంఘ వ్వవస్థపట్ల విశ్వాసమున్నట్లు ప్రకటిస్తాయి. దురాత్మల పనిని దైవ శక్తి ప్రదర్శంగా ప్రజలు అంగీకరిస్తారు.- మహా సంఘర్షణ 588 (1911). మన ప్రపంచంలో దుర్మార్గమునకు బలమైన రక్షణ కావలసినది కేవలం విసర్జంచబడిన పాపికి లేదా కించపరిచి అన్యాయంగా వెలివేయబడిన జీవితాలకు కాదు; సమాజములో ధర్మశీలులు, గౌరవనీయులు, మరియు గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతు కనిపించే వారి జీవితాలకు అవసరం. అయితే వారిలో విడిచిపెట్టలేని ఒక పాపమున్నది ఆ దుర్మార్గతను వారు పోషిస్తున్నారు,మేధావులు, తలాంతులుగలవారు, దాతృత్వము మరియు దయా పూర్వకమైన కార్యములు చేస్తున్న మని చెప్పే ప్రతివారు,సాతాను వలలో చిక్కి నాశనము నడిపించే స్థలమునకు ఆత్మలను అకార్షంచే వారు కావచ్చు - ఎడ్యుకేషన్, 150 (1903).LDETel 108.3

    ఎడ్వెంటిస్ట్ సంఘములో కూడా

    బయట నుండి వచ్చే ప్రమాధముకన్న మన మధ్యనుండి వచ్చేవాటికి ఎక్కువుగా మనము భయపడ వలసి వుంది. లోకము నుండి వచ్చే వాటికన్నా బలమునకును మరియు విజయానికి అడ్డంకులు సంఘములో నుండి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దేవుని ఆజ్ఞలను గైకొనుచు మరియు యేసు గూర్చిన విశ్వాసాన్ని కాపాడుచున్నామని సాక్షము చెప్పేకోనేవారిలో గౌరవమున సంపాదించుకొనుట కొరకు ఏ తరగతి వారికన్న తక్కువ ఏమీ కాదు వా ఇంక ఎక్కువ చేయుదురు, కాబట్టి వారి స్థిరమైన జీవితాల ద్వారా, దైవిక ఉదాహరణ మరియు వారి క్రియాశీల ప్రభావంతో, ఇట్టి ప్రాతినిద్యం వహించే కారణమని అవిశ్వాసులు ఖచ్చతంగా అనుకొనుటకు అస్కారము వుంది. కాని పదేపదే సత్యమును గూర్చి వాదించేవారు ఎంత ఎక్కువుగా ప్రకటించు కుంటే అంత గొప్ప అటంకం వస్తుందని రుజువైనది. అపనమ్మకం బలపర్చుటయు, సందేహాలు వ్యక్తం చేయుటయు, చీకటి ప్రేమించుటయు చెడ్డ వదూతల యొక్క ఉనికిలో ప్రోత్సహింబడును,కనుక సాతాను యొక్క యుక్తులు సాపల్యం కోసం మార్గం సుగనం చేయబడుచున్నది. సెలెక్ట్డ్ మెసెజన్స్ 1:122 (1887).LDETel 108.4

    లేఖనములను వ్యతిరేఖిస్తున్న అబద్దమును ప్రేరేపించు ఆత్మలు

    భక్తులు ప్రస్తుత సత్యం గురించిన పూర్తి అవగాహనను పొందాలి, అవి లేఖనాల నుండి కాపాడుకోవలసిన బాధ్యత వుంది. వారు మరణమందు మానవ స్థితి ఏమిటో కచ్చతంగా అర్థం చేసుకోవాలి, ఎందుకనగా మరణించిన వారి ప్రియ స్నేహితులు మరియు బందువులుగా నమ్మించుటకు దెయ్యపు అత్మలు వారికి ప్రత్యక్షమై సబ్బాతు దినము మార్చబడినదనియు, ఇతర లేఖన విరుద్ధమైన సిద్ధాంతాలను ప్రకటిస్తారు. ఎల్లీ రైటింగ్స్ 87 (1854).LDETel 109.1

    అబద్దంలాడే ఈ అపవిత్రాత్మలు అపోస్తులుల వేషం దరించి వారికి వలే ప్రవర్తిస్తూ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన తాము వ్రాసినదంతా అబద్ధమని చెప్పటానికి సాతను వారిని ఉపయోగిస్తాడు. బైబిలు దేవుని మూలముగా కలిగింది కాదని వారంటారు. మహా సంఘర్షణ, 557 (1911).LDETel 109.2

    ఆత్మకు చావులేదు, ఆదివారము పరిశుద్ధత అన్న ఆ రెండు అబద్ధ బోదల ద్వారా సాతాను ప్రజల్ని మోసగిస్తున్నాడు. మొదటిది భూతమతానికి పూనాది వేస్తే రెండోవది రోమను సంఘంతో సత్యసంబందాలు నెలకొల్పుతుంది, మహా సంఘర్షణ,588 (1911).LDETel 109.3

    పరిపాలకులు ప్రజలు ఈ దురాత్మల మోసాలకు పడిపోతారు. క్రీస్తు వేషం దరించి ఆయనలా నటించే వ్యక్తులు బయలుదేరేదరు. లోక రక్షకుడు క్రీస్తుకు మాత్రమే చెందే ఘనత, పూజ తమకు చెల్లించమని కోరారు సూచక క్రియలు చేసి స్వస్థత చేకుర్చుతారు. తమకు దేవుని వద్ద నుంచి ఆత్మవేశం వచ్చిందని చెబుతూ లేఖన సాక్ష్యాన్ని తప్పు పడ్డారు.....దేవుని ప్రజలు మాత్రం ఈ తప్పుదారిని అనుసరించరు. ఈ నకిలి క్రీస్తు బోదలు లేఖనానుసారముగా లేవు. అతను మృగాన్ని, మృగం విగ్రహన్ని ఆరాదించే వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమీ కలపని దేవుని ఉగత ఈ తరగతి ప్రజలు మీద కుమ్మరించ బడుతుందని బైబిలు స్పష్టంగా చెబుతుంది.- మహా సంఘర్షణ,624, 625 (1911).LDETel 109.4

    తప్పుడు పునఃప్రచారం

    నామమాత్ర అడ్వెంటిస్టులు నుండి మరియు సత్యము నుండి తోలిగిపోయున సంఘలలోనుండి దేవునికి నిజాయితీపరులైన బిడ్డలు వుండటం నేను చూసాను, మరియు కడవరి తెగుళ్ళను కుమ్మరించబడక ముందు, సేవకులు మరియు ప్రజలు ఈ సంపూలు నుండి పిలవబడతారు మరియ వారు సంతోషముగా సత్యాన్ని అంగీక రిస్తారు. అయితే సాతానునికి ఈ విషయం తెలుసు. మూడవ దేవదూత బిగ్గరగా స్వరమెత్తి ప్రకటించక ముందు అతడు ఈ మత సంబంధమైన విషయాల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాడు. అప్పుడు సత్యమును తిరస్కరించినవారు దేవుడు వారితో ఉన్నాడని అనుకొందురు. - ఎర్లీ రైటింగ్స్ 261 (1858).LDETel 110.1

    భూమిపై దేవుని తీర్పులు పడకముందు అపోస్తలుల దినాలనుంచి కనుమరుగైన సనాతన దైవభక్తి ప్రజల్లో దర్శనమిస్తుంది. దేవుని ఆత్మ, దేవుని శక్తి ఆయన ప్రజలమీదకి దాగివస్తాయి. ఆ సమయంలో దేవుని ప్రేమిస్తునే లోకశలపై మనస్సు నిలుపుతున్న సంఘాలను అనేక ముంది విడిచిపెట్టారు.... ఈ పరిచర్యను అడ్డుకోటానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. అందును బట్టి అలాంటి ఉద్యమానికి సమయము రాక ముందే నకిలివి ప్రవేశం పెట్టటం ద్వారా దాన్ని రాకుండా చేయుటానికి సాతను ప్రయత్నిస్తున్నాడు. ఏ సంఘాలైతే వంచనతో తన స్వాదీనం క్రిందకు తెచ్చుకోగలరో వాటితో దేవుని ప్రత్యేక దీవేన ప్రదర్శితమైనట్లు చూపిస్తాడు. గొప్ప మతాశక్తిలా కనిపించే పరిస్థితిని కల్పిస్తాడు....దైవవాక్యం ఆత్మ పరిశోధనకు దారి తీసే సత్యాలను ఆత్మ పేక్షలోకాశల పరిత్యాగమూ కోరే సత్యాలను ఉద్దేశించే బైబిలు సాక్ష్యాన్ని మనుష్యులు తృణీకరించటం ఏక్కడైతే జరుగుతుండో అక్కడ దేవుని దీవెనలు ఉండవనడములో సందేహం లేదు. మహా సంఘర్షణ,464 (1911).LDETel 110.2

    సంగీతం ఒక ఉచ్చులా మారినది

    ఇండియానాలో జరుగుతున్నట్లు మీరు వివరించిన విషయాలు (1900 నాటి ఇండియానా సభల సమావేశంలో “పరిశుద్ధశరీరం” ఉద్యమానికి సంబందించి ఈ వ్యాఖ్యలు చేయబడ్డాయి.మరిన్ని వివరాల కోసం, సెలెక్టెడ్ మెసెజన్స్ 2: 3139 లో చూడండి. )కృప కాలం ముగించక మునుపు ఇవి జరుగునని ప్రభవు నాకు చూపించెను. ప్రతి అసహ్యకరమైన కార్యము ప్రదర్శించబడుతుంది. ఎక్కడ చూచిన డోలులతోను, మయమరిపించే సంగీతములతోను,మరియు లోక నాట్యాములతోను, గొప్ప గొప్ప శబ్దాలు చిత్ర విచిత్రముగా ప్రదర్శిస్తారు. వివేకముగల వ్యక్తుల యొక్క ఇంద్రియ జ్ఞానము గందరగోళంగా మారుస్తుంది, కాబట్టి వారు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి విశ్వసము కలగదు......మతిభ్రమించే శబ్దాలకు ఇంద్రియ జ్ఞానము చేడిపోయి పిచ్చివాళ్ళను చేస్తుంది, అయితే నివారించుటకు సరైన వ్వాద్యము ఒక దీవెన కావచ్చు. సైతాను ప్రతి నిదులు యొక్క శక్తులు అరుపులతోను మరియు శబ్దాలతో ఉతృహము చేయుటకు చూస్తున్నాయి. మరియు ఇది పవిత్ర ఆత్మ యొక్క పని అని పిలుస్తారు కూడ... గతంలో ఏ విషయలు జరిగియున్నాయో అవే భవిష్యత్తులో కూడ జరగనైయున్నవి. సాతాను అది నిర్వహిస్తున్న మార్గంలో సంగీతం ఒక ఉచ్చులాగా మార్చుచున్నడు.. సెలెక్టర్ మెసెజన్స్,:36, 38 (1900).LDETel 110.3

    బలముగా సంచరిస్తున్న పరిశుద్ధాత్మ నుండి మన మనసులను నిజంగా దూరముగా తీసుకుకొనిపోవుచున్న వింతైన సాధకముకు మనము చోటివ్వకూడదు. దేవుని పని ఎప్పుడూ ప్రశాంతతతో, గౌరవప్రదమైన లక్షణాలను కలిగివుంటుంది సెలెక్టెడ్ మెసెజన్స్...-2:42 (1908).LDETel 111.1

    భాషలలో అబద్ధాలు మాట్లాడటం

    మూడభక్తి, అబద్ద ఉత్సాహం, భాషల్లో అబద్దలు మాటలాడుట మరియు ద్వనించే సాధనాలు చేయుట దేవుడు సంఘంలో నిలిపియున్నాయని అవే గొప్ప తలాంతులుగా పరిగణించబడుతున్నాయి. కొందరు ఇక్కడే మోసపోతున్నారు.. ఇటువంటి కార్యపలము లన్ని మంచివి కాదు.“వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. మూఢభక్తి, మరియు గట్టిగా ద్వనించడం ఇవి విశ్వాసమునకు ప్రత్యేక సాక్ష్యాలుగా పరిగణించ బడ్డాయి. కొంతమంది శక్తివంతమైనది మరియు సంతోషకరమైన సమయం కావలనే చూస్తున్నరే తప్ప చిన్న కూడికి సమావేశంతో సంతృప్తి పొందలని వారు చూడటం లేదు. వారు దీనికోసమే కృషిచేస్తారు మరియ ఉత్సాహమైన బావోద్వేగము పొందటకు సిద్ధపడతారు. అలాంటి కూటాల ప్రభావము వలన ప్రయోజనము ఏమి యుండదు. ఆవిరైపోతున్న ఆనంద బావోద్వేగము నిరసించిపోయునప్పుడు వారు సమావేశానికి ముందు కంటే ఎక్కువుగా నీర్చించిపోతారు, ఎందుకంటే ఆ ఆనందం సరైన విధానము నుండి రాలేదు. క్రమమైన విధానం మరియ హృదయమును లోతుగా పరిశీలన చేసుకోవడం ద్వారా ఆద్యాత్మిక పురోగతి అత్యంత లాభదాయకముగా జరగును, ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకోవడం, మరియు యదార్థతయు మరియు ఉన్నతమైన వినయంతో క్రీస్తుని గూర్చి వెతకటం అనే క్షణాలు కలిగివుండాలి. -సంఘమునకు ఉపదేశములు 1: 412 (1864) .LDETel 111.2

    దుష్ట దేవదూతలు మానవులుగా కనిపిస్తారు

    దేవునికి విదేయత చూపే మానవుడు తన వైపు ఆకర్షించుకోవటానికి సాతాను ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తాడు. అతడు మరియు అతనితో పడిపోయిన దేవదూతలు మనుష్యుల వలె భూమిపై ప్రత్యక్షమై మోసగించడానికి ప్రయత్నిస్తారు. అయితే దేవుని దూతలు కూడా మనుష్యులవలే ప్రత్యక్షమౌతారు మరియు శత్రువుల యొక్క ఉద్దేశములు నెరవేరకుండ వారిని ఓడించడానికి వారు అన్ని విదాలుగా వారి శక్తిని ఉపయోగిస్తారు. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్,8: 399 (1903).LDETel 111.3

    దుష్ట దేవదూతలు మనుష్యుల రూపంలో ప్రత్యక్షమై సత్యం ఎరిగినవారితో మాట్లాడ తారు.వారు దేవుని యొక్క ప్రతినిదులు చేసిన ప్రకటనలను తప్పుగా అపార్థం చేసుకోను టకు మరియు వక్రబాష్యంచెప్పెదరు.....ఎఫెసీయుల ఆరవ అధ్యాయంలో ఇచ్చిన హెచ్చరికను సెవెంత్-డే అడ్వెంటిస్ట్ వారు మర్చిపోయారా? మనము చీకటి శక్తులతో వ్యతిరేకంగా యుద్ధం చేయుటకు నిమగ్నమై ఉన్నాయి. మన నాయకుడితో మనము సమీపముగా అనుసరించకపోతే సాతాను మనపై విజయం సాధిస్తాడు.. సెలెక్ట్డ్ మెసెజన్స్,:3: 411 (1903).LDETel 112.1

    విశ్వాసుల రూపంలో ఉన్న దుష్ట దేవదూతలు బలమైన అవిశ్వాముగల ఆత్మను తీసుకురావటానికి మన హోదాతో పని చేస్తారు, అయునను మీరు వీటి యందు నిరుత్సాహపడవద్దు, నిజమైన మనస్సుగలవారు ప్రభు యొక్క సహాయముతో సాతాను అనుచరుల అదికారం ఎదిరించేదరు. దుష్ట శక్తులు మన సభలలో సమావేశమయ్యేది దీవెన పొందడానికి కాదు దేవుని ఆత్మ యొక్క ప్రభావాలను ప్రతిఘటించేందుకే.-మైండ్, క్యారెక్టర్, మరియు పర్సనాలిటీ 2: 504, 505 (1909).LDETel 112.2

    మరణమునకు మరోరూపం.

    దుష్ట దేవదూతలుకు చనిపోయిన భక్తులు మరియు పాపులు లేక ఈ ఇరువుల వలే పత్యక్షమవ్వడం అది పెద్ద కష్టమేమి కాదు, మరియు మానవ కళ్ళకు కనిపించేటట్లు ఇవి ప్రాతినిధ్యాలు వహిస్తాయి. వారి ప్రత్యక్షతలు చాలా తరచుగా ఉంటాయి, మరియు మనము ముగింపు కాలమునకు సమీపించే కొలది మరింత కీలకమైన పాత్రను వారు పోషిస్తారు. “ఎవాంజలీజం, 604 (1875).LDETel 112.3

    ఇది సాతాను యొక్క అత్యంత మనోహరము మరియ విజయవంతమైన మోసము--సమాదిలో వారి ప్రియమైన వారిని నిలువరించిన వారి యొక్క సానుభూతి పొందుటకు అంచనా వేస్తాడు. దుష్ట దేవదూతలు ప్రియమైనవారి రూపంలో వచ్చి వారి జీవితాలకు సంబందించిన సంఘటనలు మరియు జీవనశైలిలో వారు చేసిన పనులు చేసేటట్లు ప్రదర్శిస్తాడు. ఈ విదంగా చనిపోయిన వారి మిత్రులు దేవ దూతలుగా వారు చుట్టు తిరుగుచు వారిని ఆవరించి సంభాషించుచున్నట్లు మనుషులను అట్టి నమ్మకములో నడిపిస్తాడు. ఈ దుష్ట దేవదూతలను మరణించిన మిత్రులుగా బావించటం అది ఒకరకమైన విగ్రహారాదన. మరియు చాలామంది వారి మాటలు దేవుని వాక్యము కన్నా గొప్ప విలువైనది గాభావిస్తారు. -ది సైన్స్ ఆఫ్ ది టైమ్స్. ఆగష్టు 26, 1889.LDETel 112.4

    మరణించిన తన ఆప్తులు రూపాలను మనుష్యులు ముందుకు రప్పించే శక్తి అతనికి ఉంది. ఆతను రూపొందించే నకిలి వ్యక్తి అచ్చం చనిపోయిన వ్యక్తిలా ఉంటాడు. అదే రూపం మనముందుంటుంది. అవే మాటలు ,అదే స్వరం మళ్లీ వినిపిస్తాయి. అవి స్పష్టంగా ఉంటాయి.... దురాత్మలు మరణించిన అప్తులు లేదా మిత్రులవలె మారు వేషం వేసుకొని మిక్కిలి ప్రమాదకరమైన తప్పుడు బోధనల్ని ప్రబోదిస్తు అనేకులకు కనిపిస్తాయి. ఈ సందర్శకులు తమ కపటనాటకాన్ని సాగించేందుకు సూచన క్రియలు చేస్తు మన సానుభుతిని పొందుతారు. మృతులు ఏమీ ఏరగరని ఈ రకంగా వచ్చి కనిపించేవారు దయ్యాల ఆత్మలని బోదించే బైబిలు సత్యంతో ఆ దురాత్మల్ని ప్రతిఘటించ టానికి మనం సన్నంద్దగా ఉండాలి.--మహా సంఘర్షణ, 552, 560(1911) .LDETel 112.5

    సాతానుడు క్రీస్తు రూపమును ధరిస్తాడు.

    శత్రువు తన అద్భుతమైన పని శక్తి ద్వారా ప్రపంచాన్ని మోసగించడానికి సిద్ధమౌ తున్నాడు. అతడు వెలుగు దూతలువలే మారువేషము వేసుకొని యేసు క్రీస్తుకు బదులుగావున్నాను అని ఆరోపించుకొనును.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 2:96 (1894).LDETel 113.1

    ఇప్పుడు మనుష్యులు ఇంత సులభంగా మోసగించబడితే, సాతాను మారువేషము వేసుకొని క్రీస్తువలే అద్భుతాకార్యములు చేసినప్పుడు వారు ఎలా నిలబడగలరు? నేను క్రీస్తుని, మారూవేషము వేసుకోని సాతాను మాత్రమే క్రీస్తుగా నమ్మించుటకు ప్రకటించు కొన్నప్పుడు మరియు స్పష్టంగా క్రీస్తు చేసిన క్రియలు తానుచేస్తునప్పుడును వాని మాయరూపమును బట్టి ఎవరు కదలించబడరు? - సెలెక్టడ్ మేసెజన్స్,2: 394 (1897).LDETel 113.2

    సాతానుడు క్రీస్తులాగా మారువేషం వేసుకోనిన క్రీస్తు చేసిన పనినే ఎంచుకుంటాడు. అతడు మాయరూపం దరించి దుర్వినియోగము చేయును, తనకు సాధ్యమైనంత వరకు ప్రతిది పెడత్రోవ పట్టిస్తాడు. -టెస్టమోనిస్ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్ 411 (1898).LDETel 113.3

    ఈ నాటకములో అంతమున జరగబోయే గొప్ప సంఘటనలు త్వరగా తీసుకొచ్చుటకు అంతర బాగమున ఒక శక్తి పని చేయుచున్నది- సాతానుడు క్రీస్తుగా రానైయున్నాడు మరియు రహస్య సమాజములలో తమను తాము కట్టుబడి ఉన్న వారితో కలసి మోసపూరితమైన అవి నీతి కార్యములు జరిగించును. సెలెక్ట్డ్ మెసెజన్స్ :8:28 (1904).LDETel 113.4

    ప్రత్యేకమైన వాటన్నిటిమీద సాతనుడు క్రీస్తుని రూపమును పోలి ఉంటాడుLDETel 113.5

    సాతాను హద్దు దాటి వెళ్ళలేని పరిమితి ఉంది, నిజముగా ప్రదర్శించే శక్తిలేక పోయునప్పటికిన నకిలి పనిని చేయుటకు తనకు సహాయం కావలి కాబట్టి ఇక్కడే అతడు మోసం చేయుటకు పూనుకొనేను. క్రీస్తు రెండవ సారి లోకమునకు వచ్చియున్నాడని మనుషులను నమ్మించడానికి కడవరి కాలములో అతను అలాంటి విదానములో ప్రత్యక్షమగును. తనను తాను వెలుగు దూతవలే ఆతడు మారగలడు. అయితే, ప్రతి విశేషమైన వాటియందు క్రీస్తు రూపాన్ని తానుదరియిస్తాడు, ఇంత వరకు అప్రత్యక్షతలో కొనసాగుతాడు, అయితే సత్యమును అడ్డుకోవాలని చూచే పరో లాంటి వారిని తప్ప అతడు ఇక ఎవ్వరిని మోసము చేయలేడు. -సంఘమునకు ఉపదేశములు 5:698 (1889).LDETel 113.6

    ఈ గొప్ప వంచన నాటకంలో అంతిమ పాత్ర స్వయముగా సాతానే క్రీస్తులా వేషం దరించటం. రక్షకుని రాకతో తన నిరీక్షణ సపలమౌతుందని సంఘం దీర్ఘకాలంగా కనిపెట్టు చున్నది. ఇలా ఉండగా ఇప్పుడు ఆ నయవంచకుడు క్రీస్తు చెప్పినట్లు కనపర్చుతాడు. భూమిమీద ఆయా ప్రాంతాల ప్రజల మద్య తేజోవంతమైన ప్రకాశతతో వెలుగుతున్న మహిమగల వ్యక్తిగా సాతాను తన్నుతాను కనపర్చుకొంటాడు. ప్రకటన గ్రందములో దైవ కూమారుడైన క్రీస్తుని గురించి యోహాను చేసిన వర్ణనకు నచ్చేటట్టు తనుతాను ప్రదర్శించుకొంటాడు. ప్రకటన 1. 13,14 అతని ఆవరించివుండే తేజస్సును మానవ నేత్రం ఎన్నుడూ వీక్షించి ఉండదు. క్రీస్తు వచ్చాడు, క్రీస్తు వచ్చాడు, అన్న జయద్వానాలతో దిక్కులు మారు మ్రోగుతాయి, అతని యందు ఆరాదన భావముతో ప్రజలు సాగిల పడుతుంటే ఈ లోకంలో నివసించి నప్పుడు క్రీస్తు తన శిష్యులను ఆశీర్వదించినట్లుగా సాతను చేతులు పైకేత్తి వారికి దీవెనలు ప్రకటిస్తాడు. అతని స్వరం మెల్లగా, సున్నితముగా, మదురముగా, వుంటుంది. ప్రభువు పలికిన పరమ సత్యాలు కొన్నింటిని మృదువుగా దయారసం ఉట్టిపడే విధంగా భోదిస్తాడు. ప్రజల వ్యాదులను బాగుచేస్తాడు. అనంతరం క్రీస్తుగా నటిస్తు అతను సబ్బాతును ఆదివారానికి మార్చినట్టు ప్రకటించి తాను ఆశీర్వదించిన ఆ దినాన్ని అందరు పరిశుద్ధంగా ఆచరించాలని ఆదేశిస్తాడు. -మహా సంఘర్షణ, 624 (1911).LDETel 114.1

    భక్తుల ప్రార్థనలకు సమాధానం ఇచ్చటకు సాతనుడు నటించును

    సాతాను తన కేసును ఒడిపోతున్నాడని అతనికి తెలుసు. ఇక ఈ ప్రపంచంలో ఎక్కడ అతనికి ప్రవేశం లేదు. మోసము ద్వారా విశ్వాసముగల వారిని జయుంచుటకు చివరి ప్రయత్నంగా నిరాశాపూరితమైన కృషిని అతను చేస్తాడు. అతడు క్రీస్తు రూపాన్ని దరిస్తాడు. యోహాను స్పష్టముగా వివరించబడిన దర్శనములోవున్నట్టు సాతనుడు ఎంతో ఘనముగా రాజటీవిలో వసాలను దరించి ఉరేగుతాడు. ఇలా చేయడానికి అతను శక్తి కలిగివుంటాడు .క్రీస్తు రెండవ సారి వచ్చినట్టుగా బావించే క్రైస్తవ ప్రపంచములో సత్యము యెడల అభిమానము లేని వారే కాదు అవినీతి యందు సమము పొందిన వారు అంటే (ఆజ్ఞలను అతిక్రమించన) వారు అతని మాయలో పడిపోయే అనుచరులకే దర్శనమిస్తాడు. తనను తాను క్రీస్తుగా అతను ప్రకటికుంటాడు, మరియు అతను క్రీస్తుగా ఉన్నాడు, అందము మరియు గంభీరమైన వస్త్రములు ధరించి రాజ తేజస్సుతోను మరియు మృదువైన స్వరముతో మరియు ఆహ్లాదకరమైన పదాలు పలుకులతో తన అసమానమైన మహిమను కనపర్చినప్పుడు ఏది ఏమైనప్పటికిని మానవ కళ్లుకు కపటమనేది కనబడదు. కాబట్టి తానే క్రీస్తు అని నమ్మించగలుగుతాడు. అప్పుడు ఆయన మాయలో పడిపోయి మోసగింపబడ్డ అనుచరులు విజయధ్వని చేయుదురు. క్రీస్తు రెండవసారి వచ్చెను! క్రీస్తు వచ్చెను! అంటారు. అతను భూమి మీద ఉన్నప్పుడు చేసినట్లుగా తన చేతులను పైకెత్తి, మనల్ని ఆశీర్వదించాడు. ...భక్తులు ఆశ్చర్యకరంగా చూస్తారు. వారు కూడా మోసపోతారా? వారు సాతానును ఆరాదిస్తారా? అయుతే దేవుని దేవదూతలు వారి గురించి ఆలోటించే వారు ఉన్నారు. పైకి చూడుము, అనే స్పష్టముగా ఒక బలమైన స్వరము వినబడును. ప్రార్థించువారికి ముందు ఒక విషయముటుంది - వారి ఆత్మలకు చివరికి శాశ్వతమైన రక్షణవుంది. ఈ విషయము నిరంతరం వారి ముందు ఉంది- అంతము వరకు సహించు వారికి శాశ్వత జీవిముపోందే వాగ్దానం వున్నది. ఆహా, వారి కోరికలు ఎంత అభిమానముగాను మరియు నమ్మకముగా ఉన్నాయి. తీర్పు మరియు శాశ్వతము కనిపించుచున్నది.. విశ్వాసము ద్వారా వారి కళ్ళు సింహాసనం మీద దృష్టి నిలిపియున్నారు. దాని ముందు తెల్లటివస్త్రము దరించినవారు నిలబడి ఉన్నారు. వారు పాప సంతృప్తి నుండి వారు దూరంగా వున్నారు ........ మరోకమారు ప్రయత్నంగా సాతానుడు చివరి ఆయుదమును ఉపయోగిస్తాడు, అయితే క్రీస్తు త్వరగారమ్ము, క్రీస్తును మమ్ములను రక్షించటానికి రమ్ము అని ఎడతెగని ప్రార్ధన ఆతడు వింటాడు. అతడి చివరి వ్యూహము, క్రీస్తు రూపమును ధరించడం, మరియు అది వారిని ఆలోచింపచేస్తుంది. అయితే వారి ప్రార్ధనలకు జవాబు దొరుకుతుంది. -ఎంమ్స్ 16, 1884.LDETel 114.2

    అసలైన దానినుండి నకిలిది అని బేదము ఎలాకనుకొగలవు

    క్రీస్తు రాకను అనుకరించటానికి సాతనుకి అనుమతిలేదు -మహా సంఘర్షణ 625 (1911). సాతానుడు.....యేసు క్రీస్తు రూపమును దరిస్తాడు, శక్తివంతమైన అద్భుతాలను చేస్తాడు; మరియు ఈయనే యేసు క్రీస్తని మనుష్యులు అతనిని పూజించుచు మరియు సాష్టాంగా నమస్కారము చేయుదురు. ప్రపంచమంతయు ఎవరినైతే క్రీస్తుగా మహిమ పరుచుచున్నదో ఆయననే ఆరాదించుమని మనకు ఆజ్ఞ ఇవ్వబడుతుంది, మనం ఏంచేద్దాం? ఎవరైతే మనుష్యులకు అతి భయంకరమైన శత్రువుగావున్నాడో అట్టి శత్రవును వ్యతిరేకించుమని క్రీస్తు మనల్ని హెచ్చరించామన్నడని ఆ సమయమందు మనము దైర్యముగా చెప్పవలేను. అతడు ఇంకా దేవుడిగా ప్రకటించుకొనును. అయితే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అది అధికారముతోను కలది మరియు గొప్ప మహిమత్ ను వేవేలా దూతల సమూహముతో కలసి ఆయన వచ్చినప్పుడు మనము అతని స్వరము గుర్తించగలము.- ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 6: 1106 (1888).LDETel 115.1

    సాతను ప్రతి అవకాశమును సద్వియోగము చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు, వెలుగు దూత వలే మారు వేషములో వుండి అతడు అద్భతాలు చేయువాడిగా భూమి అందంతట సంచరించును, మదురమైన భాషతో ఉన్నతమైన అబిమానమును ప్రదర్శిస్తాడు, మృదువైన మాటలు పలుకును మరియు మంచి కార్యములు చేయును. క్రీస్తువలే నటించును. కాని ఒక విషయము మాత్రము స్పష్టంగా గుర్తించబడుచున్నది-- సాతనుడు దేవుని దర్మశాస్త్రము నుండు ప్రజలను దూరము చేయును. అయిన ప్పటికిని సాధ్యమైనంత వరకు చాకచక్యముగా దైర్యమును పూర్తిగా మోసము చేస్తాడు, ఏర్పర్చబడు వారిని సహితము మోసము చేస్తాడు, ఆ కాలమందు కిరీటం ధరించిన రాజులు, అద్యకులు, అధికారులకు ఉన్నత స్థానము వారికుటుంది, అతని అబద్ద సిద్ధాంతాలకు లొగిపోతారు.- పన్డమెంటల్స్ అఫ్ క్రీస్టయన్ ఎడ్యుకేషన్, 471, 472 (1897).LDETel 115.2

    అద్భుతాలు జరుగుతాయి.

    అనారోగ్యంగలవారు మన ముందు స్వస్థత పొందుతారు, మన కళ్లముందు అద్భతాలు జరిగిస్తారు. సాతను యొక్క మోసపూరితమైన అద్భతాలు ప్రదర్శంచటం ఇంక ఎక్కువుగా జరుగుచున్నప్పుడు అట్టి శోదనను ఎదురుకొనుటకు మనము సిద్ధిముగా వున్నామా? సంఘమునకు ఉపదేశములు 1:302 (1862). దుష్ట ఆత్మల ప్రభావంతో మనుష్యులు అద్భుతాలు చేస్తారు. ప్రజల మీద మంత్ర ప్రయోగంచేసి వారు అనారోగ్యనికి గురుచేస్తారు, ఆ తరువాత వారు వేసిన మంత్రం తీసి అనారోగ్యంగా ఉన్నవారు అద్భుతంగా నయం చేయబడ్డారని ఇతరులు ప్రసారంచేసేటట్లు ఒక బ్రమలో నడిపిస్తారు, సాతాను అలాగ మళ్లీ మళ్లీ ప్రయోగిస్తాడు. -సెలెక్టేడ్ మెసెజన్స్,:2:53 (1903).LDETel 116.1

    సాతాను సన్నిహిత సంబందాలు కలిగివున్న అద్భుత దృశ్యాలు త్వరలో జరుగిస్తాడు. సాతాను అద్భుతాలు చేస్తాడని దేవుని వాక్యము ప్రకటిస్తుంది. అతడు ప్రజలను జబ్బుపడేటట్టుచేస్తాడు ఆ తర్వత అకస్మాత్తుగా వారి నుండి సాతాను శక్తిని తొలగిస్తాడు. అప్పుడు వారు నయం చేయబడ్డాము అని వారుబావిస్తారు.. ఈ స్పష్టమైన స్వస్థత కార్యములు సెవెంత్-డే అడ్వెంటిస్టులకు ఒక పరీక్షగా పరిణమిస్తాయి.-సెలెక్టెడ్ మెసెజన్స్, 22:53 (1904).LDETel 116.2

    మోసపు జిత్తుల ద్వారా సాతాను చేసిన అద్భుతాలు యదార్ధమైన సూచక్రియలుగా కనిపిస్తాయి. ఐగుప్తి నుండి విడుదల పొందే సమయమందు ఇశ్రాయేలీయుల మీద ప్రశ్నర్ధకంగా ఉండే ఒక పరిక్ష వారి ముందు ఉంచాలని అతడు బావించియున్నాడు.సెలెక్టేడ్ మెసెజన్స్,:2:52 (1907).LDETel 116.3

    ఆకాశము నుండి అగ్ని

    మనుషుల వాదనలను మనము నమ్ముకోకూడదు.వారు క్రీస్తు వలే అగుపడవచ్చు వారి వెనుక గొప్ప మోసగాడు నిలువబడి యున్నప్పుడు, వారు అనారోగ్యంతోవున్న వారిని స్వస్థపరిచే అద్భుతమైన కార్యములు చేయవచ్చు. ఈ అద్భుతలకు కారకుడైన వాడు, ఇంకా పరలోకము నుండి అగ్నిదిగివచ్చునట్లు మనుష్యులను ఎదుట సూచక్రియలు చేయును? - సెలెక్ట్డ్ మెసెజన్స్ 2:49 (1887).LDETel 116.4

    ఇది అపవాది యొక్క అబద్దాల అద్భుతాలతో ప్రపంచమును బందీగా చేసుకోను చున్నడు. మరియు అతను మనుష్యుల ఎదుట అగ్నిపరలోకము నుండి దిగివచ్చునట్టు చేయును.అతడు అద్భుతాలు కార్యలు చేస్తాడు, మరియు ప్రపంచమంత ఈ అమోగమైన అద్భుతమైన కార్యముల శక్తిలో కొట్టుకొనిపోతుంది. సెలెక్ట్డ్ మెసెజన్స్,:2:51 (1890).LDETel 116.5

    సాతాను సాధ్యమైతే ఏర్పర్చబడిన వారి నందరిని మెసగించును. నేనే క్రీస్తు అని ప్రకటించుకొనును, మరియు అతడు గొప్ప వైద్య మిషనరీగా వ్యవహరిస్తాడు. తాను దేవుడని నిరూపించడానికి మనుష్యుల ఎదుట అగ్ని పరలోకము నుండి దిగివచ్చునట్టు చేయును. - మెడికల్ మినిస్టీ, 87, 88 (1903). LDETel 117.1

    విశ్వాసం నుండి వేరుపడిన శత్రువు యొక్క అనుచరులు ద్వారా కార్యము జరిగించునని వాక్యము తెలియజేయుచున్నది, మరియు వారు అందరు చూస్తుండగా గొప్ప అద్భత కార్యములు జరిగించును అంతేకాదు మనుషుల ఎదుట అకాశము నుండి అగ్ని దిగివచేటట్టు చేయును సెలెక్ట్డ్ మెసెజన్స్, 2:54(1907).LDETel 117.2

    అది ఆకాశము నుండి భూమికి మనుష్యల యెదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప సూచక క్రియలు చేయుచున్నది... అది తన కియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది, ప్రకటన 13.13,14, ఇక్కడ ప్రవచితమైనవి కేవలం మోసాలుకావు. సాతను ప్రతినిధులకు సూచక క్రియలు చేసే శక్తి ఉన్నది. కేవలం నటించటం కాదు. వాటిని బట్టి మనుష్యులు మోసపోతారు.- మహా సంఘర్షణ,553 (1911).LDETel 117.3

    సాతాను దేవుడుగా యెంచడును

    ఈ యుగంలో క్రీస్తు విరోది నిజమైన క్రీస్తుగా కనిపిస్తాడు, అప్పుడు దేవుని ధర్మశాస్త్రము మన ప్రపంచం యొక్క దేశాలలో పూర్తిగా విపలమవుతుంది. దేవుని పవిత్ర నియమమునకు వ్యతిరేకంగా తిరుగుబాటు పూర్తి పక్వానికి వస్తుంది. అయితే ఈ తిరుగుబాటు అంతటికి కారకుడైన నిజమైన నాయకుడు సాతాను వెలుగుదూత వలె దుస్తులు ధరిస్తాడు. మనుష్యులు పూర్తిగా మోసపోతారు మరియు దేవుని స్థానము అతనికి ఇచ్చి, దేవుడుగా ఘనపరుస్తారు కాని సర్వ శక్తిగలవాడు జోక్యం చేసుకోనును, సాతానుడు హెచించ్చుకొనినప్పుడు అపోస్తుల సంఘము ఐక్యము కలిగియున్నది, అయితే తీర్పు దానిమీదకువ చ్చును, అందువల్ల ఒక్కదినముననే దాని తెగుళ్ళు అనగా, మరణం, దుఃఖం కరువు వచ్చును; దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్టుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. (ప్రకటన 18: 8) .టెస్టమోనీస్ టూ మినిస్ట్రీస్ అండ్ వర్కర్స్ 62 (1893).LDETel 117.4

    మన ప్రభువైన యేసు క్రీస్తు రెండోవ సారి పత్యక్ష మగుటకు సమీపమునుండగా, సాతాను అనుచరులు దిగువ నుండి కదులుతాయి, సాతాను యేసు క్రీస్తువలే మారు వేషం వేసుకొని వస్తాడు, కానీ అప్పుడు అతను మానవుడిగా మాత్రమే కనిపించడు, అయితే సత్యాన్ని తిరస్కరించిన ప్రపంచం క్రీస్తు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజుగా వారు అంగీకరించేదరు.- ఎస్జిఎబైబిల్ కామెంటరీ 5: 1105, 1106 (1900).LDETel 117.5

    అద్భుతాలు ఏమినిరూపిచలేవు

    నీకు నీవు దేవుని యెద్దుకు వెళ్ళుము, దివ్యమైన జ్ఞానోదయము పొందుటకు ప్రార్ధించుము, అప్పుడు మీకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది, అపవాది అమోగమైన అద్భుతకార్యమలు ప్రదర్శించేశక్తి పని చేయునప్పుడు మరియు వెలుగు దూతవలే వచ్చినప్పుడు, దేవుని యొక్క యదార్ధమైన పనియు మరియు చీకటి శక్తికి అదికారి అయునా వాడు చేయి మెసకార్యముల మధ్య వ్యత్యాసం స్పష్టముగా కనుకొందువు. సెలెక్ట్డ్ మెసెజన్స్ 3: 389 (1888).LDETel 118.1

    వాక్యము బోధించడం క్రీస్తు చేసిన పని విధానం, మరియు అద్భుతకార్యాల ద్వారా స్వస్థత అనుగ్రహించి, బాధ నుండి ఉపశమనం కలిగించును. కానీ ఇప్పుడు మనము ఈ విధంగా పని చేయలేము అని నాకు ఆజ్ఞాపించబడినది. దేవుని ప్రజల పరిచర్యలో అద్భుతాలు కూడ తోడుగా వెళ్లచున్నది [అధ్యాయం 14 చూడండి). కానీ వారు క్రీస్తు దినాలలో చేసిన ప్రాముఖ్యతను కలిగి ఉండరు. అద్భుతాలు చేసేటప్పుడు ఇక దైవిక ఆమోదానికి రుజువు కాదు.] ఎందుకంటే, సాతానుడు అద్భుతాలుచేయుట ద్వారా తన శక్తిని ప్రదర్శిస్తాడు. దైవికమని చెప్పుకునే స్వస్థత కార్యములు నకిలీవి మరియ కపటమైనవి అని రుజువైనవి కబట్టి నేడు దేవుని సేవకులు అద్భుతాల ద్వారా పని చేయలేక పోవుచున్నారు. సెలెక్టడ్ నెసేజస్ ,:2:54 (1904).LDETel 118.2

    అద్భుతాకార్యములు చేయుటలో దేవుని బిడ్డలకు క్షేమము దొరకదు, అద్భుతాలు ఎవైన చేసినప్పుడు సాతనుడు దానిని వంచించును. -సంఘమునకు ఉపదేశములు 9:16 (1909)LDETel 118.3

    అద్భుతాలు బైబిలును స్థానని అధిగమించ లేవు.

    దేవుని ధర్మశాస్త్రమును వారి నిర్లక్షముచేసి దూరముగా వుంచటమేకాకుండ మరియు అవిధేయత కొనసాగించినప్పటికిని వారి ద్వారా క్రమముగా స్వస్థతలు జరిగుతాయి వారు అలాగే కనపరుచుకొనుచు మరియు వారిలో ఎటువంటి శక్తిని కలిగి ఉన్నప్పటికీ, వారు గొప్ప అదికారం కలిగి ఉన్న, కాని వారిలో దేవుని ఉన్నతమైన శక్తి ద్వార వెంబడించుట లేదు. అయితే ఇలాగ వ్యతిరేకముగా కార్యములు చేసినవాడు మరి ఎవరో కాదు ఆ గొప్ప మోసగాడు యొక్క మోసపూరితమైన పనిఅయున్నది. — సెలెక్టెడ్ మెసెజన్స్,:2:50, 51 (1885). అద్భుత కార్యములు కనపరుచుటవలన బైబిల్ ఎన్నటికీ ప్రక్కకు నెట్టివేయబడదు. సత్యము ఎప్పటికప్పుడు అద్యయనం చేస్తునే వుండాలి, అది దాచిన నిది దాని కోసం వెతకాలి. అద్భుతమైన ప్రకాశము వంటిది ఏదైన దేవుని వాక్యమును ప్రక్కకు త్రోసివేయ లేదు లేదా దాని స్థానమును తీసుకోదు. వాక్యమును పట్టుకొని దానిని ఇముడ్చు కోగలికినటైయితే మనుష్యులు రక్షించుటకు జ్ఞానము అనుగ్రహించును. సెలెక్టేడ్ నెజన్స్ ,:2:48 (1894).LDETel 118.4

    అతని చివరి గొప్ప వంచన మన కళ్లముందే కనిపిస్తుంది. క్రీస్తు విరోది మన ముందే తన ఆశ్చర్యకార్యాల్ని చేయుచున్నాడు, అసలుకు నకిలీ ఎంత దగ్గరగా వుంచింది గనుక లేఖనాల ద్వారా తప్ప నిజమేదో తెలుసుకో వడం అసాద్యం. లేఖనాల సాక్ష్యాన్ని బట్టి ప్రతీ అంశం ప్రతి సూచకక్రీయ నిజానిజాలు నిర్ధారించాల్సి ఉన్నది. మహా సంఘర్షణ,593 (1911)LDETel 119.1

    దాదాపు ప్రపంచమంత వంచనతో నిండివుంది

    ఆత్మల రక్షణ కొరకు యదార్ధంగా ప్రయసపడే స్త్రీ, పురుషులు ఇప్పుడు అవసరమై యున్నారు, సాతాను ఒక శక్తివంతమైన అదికారిగా ఈ ప్రపంచమును తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.మరియు అంతమకాలమున శేషించిన సమయంలో అన్ని అనుకూలమైన విదానములో దేవుడు తన ప్రజలు యొద్దకు వచ్చేను అయితే ఆ సత్యమును మూసివేయుటకు వ్యెతిరేకముగా అతడు పని చేయుచున్నాడు. అతను ప్రపంచ మంతటిని తన స్థాయిలోకి ఊడ్చుకొని వచ్చుటకు చూస్తున్నాడు, దేవుని నియమాలకు నమ్మ కస్టులైన కొందరు మాత్రమే ఆయనను ఎదురించి తట్టుకో గలుగు చున్నారు అయిన అతడు వారిని అదిగమించడానికి ప్రయత్నిస్తున్నాడు సెలెక్టడ్ నెసేజన్స్ 3: 389 (1889).LDETel 119.2

    చనిపోయినవారి రూపాలు ధరించి కనిపించటం సాతాను యొక్క మోసపూరితమైన ఆయుదము, మరియు చాలామంది ప్రేమతో మరియు అబద్ధములు ఆడేవారితో కలుస్తారు. మనలో కొంతమంది విశ్వాసం నుండి తోలిగిపోయివారు దయ్యాల యొక్క సిద్ధాంతాలను లక్ష్యపెట్టెదరు మరియు వారిని బట్టి సత్యమును చెడ్డదిగా వర్ణించెదరని మన ప్రజలను నేను హెచ్చరించాను. ఒక విచిత్రమైన పని జరుగుతుంది, దేవుని సేవకులు న్యాయవాదులు, వైద్యులు, వారి యొక్క వివేచనాత్మను హెచ్చించుకొనుటకు ఎవరైతే ఈ అబద్దాలను అనుమతించార్ అ వంచకుడితో ఏకమై వారికి వారు మోసపోతారు, ఆధ్యాత్మిక మత్తువారిని స్వాదీనంచేసుకుంది.- దిఅప్ వార్డు లూక్,317 (1905).LDETel 119.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents