Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 3—ఆధ్యాత్మిక అంధకార యుగం

    పాపుల అధికార స్థాపనకు దారితీసిన భ్రష్టత్వం సంభవించబోతున్నదని థెస్సలోనీయులకు రాసిన రెండో ఉత్తరంలో అపోస్తలుడైన పౌలు ప్రవచించాడు. “మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలు దేరితేనేగాని... ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాని నంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరచు” కొంటేనేగాని క్రీస్తు దినం రాదని ఆయన తెలిపాడు. సహోదరులను అపోస్తలుడు ఇంకా ఇలా హెచ్చరిస్తున్నాడు. “ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది.” 2 థెస్సలో.2:3, 4,7. పోపుల అధికారానికి మార్గం సుగమం చేసిన తప్పులు సంఘంలోకి పాకటం ఆరంభదినాల్లో సయితం పౌలు చూశాడు.GCTel 32.1

    కొంచెం కొంచెంగా, ఆరంభంలో దొంగచాటుగా, చడీచప్పుడు లేకుండా, తర్వాత, తనబలం పెరిగేకొద్ది, మనుషుల మనస్సులపై తన అదుపు పటిష్ఠమయిన కొద్దీ మరింత బహిరంగాంగా “ధర్మవిరోధ సంబంధమైన మర్మము” తన మోసకరమైన, దేవదూషణకరమైన పనిని కొనసాగించింది. ఎవరూ గమనించకుండానే అన్యమతాచారాలు క్రైస్తవ సంఘంలోనికి అడుగుపెట్టాయి. అన్యమతాధికారం కింద కొనసాగిన భయానక హింసవలస రాజీ తత్వం సర్దుబాటు వైఖరి కొద్దికాలం అదుపులో వున్నాయి. కాని హింస ఆగిపోయి క్రైస్తవ మతం రాజుల కోటల్లోకి, దర్బారుల్లోకి ప్రవేశించటంతో క్రీస్తు దీనత్వాన్ని నిరాడంబరతను క్రైస్తవ మతం పక్కన పెట్టింది. అపోస్తలుల్ని పక్కకు నెట్టి అన్యమత యాజకులు, పాలకుల విలాసాలను అహంభావ పూరిత అధికారాన్ని స్వీకరించింది. దైవవిధుల స్థానే మానవ సిద్ధాంతాన్ని సంప్రదాయాల్ని అంగీకరించింది.GCTel 32.2

    నాలుగో శతాబ్దం మొదటి భాగంలో కాన్ స్టెయిన్ క్రైస్తవ మతాన్ని నామమాత్రంగా స్వీకరించటం ఆనందోత్సాహాలు కలిగించింది. నీతి రూపం ధరించిన లౌకిక తత్వం సంఘంలోకి నడిచి వచ్చింది. ఇక సాతాను దుష్కృత్యాల కార్యక్రమం వేగంగా ముందుకి సాగింది. చావుదెబ్బ తిన్నట్టుగా కనిపించిన అన్యమతం విజేత అయింది. అన్యమత స్పూర్తి సంఘంలో రాజ్యమేలింది. అన్యమత సిద్ధాంతాలు, కర్మకాండ, మూఢనమ్మకాలు క్రీస్తు నామకార్ధ భక్తుల విశ్వాసంలోను ఆరాధన ప్రక్రియలోను భాగమయ్యాయి.GCTel 33.1

    అన్యమతానికి క్రైస్తవ మతానికి మధ్య కుదిరిన సయోధ్య ఫలితంగా దేవుని ఎదిరిస్తూ దేవునికన్న తన్నుతాను హెచ్చించు కొంటాడని ప్రవచనం నిర్దేశిస్తున్న “పాపపురుషుడు” రూపొందటం జరిగింది. బ్రహ్మాండమైన ఆ తప్పుడు మత వ్యవస్థ సాతాను శక్తి సృష్టించిన వ్యవస్థ. సింహాసనం ఎక్కి తన ఇష్టారాజ్యంగా భూమిని పరిపాలించేందుకు సాతాను ప్రయత్నాలకు స్మృతి చిహ్నమిది.GCTel 33.2

    క్రీస్తుతో సయోధ్యకు సాతాను ఒకప్పుడు ప్రయత్నించాడు. అతను శోధనారణ్యంలో దైవకుమారుని వద్దకు వచ్చి లోకరాజాల్ని, వాటి వైభోగాల్ని ఆయనకు చూపిస్తూ, తన ఆధిక్యాన్ని గుర్తించినట్లయితే అవన్నీ తనకు దానం చేస్తానని చీకటి యువరాజైన సాతాను యేసుతో చెప్పాడు. గర్వాంధుడైన శోధకుణ్ణి క్రీస్తు గద్దించి అక్కడనుంచి పొమ్మన్నాడు. అయితే ఇదే శోధనతో సాతాను మానవుడిపై మరెక్కువ విజయం సాధిస్తున్నాడు. లోకసంబంధమైన ప్రయోజనాలు, గౌరవ ప్రతిష్ఠలు సంపాదించేందుకు సంఘం లోకంలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తుల ఆదరాభిమానాల్ని అండదండల్ని అన్వేషించింది. ఇలా క్రీస్తును తృణీకరించినమీదట సంఘం సాతాను ప్రతినిధి అయిన రోమా బిషప్పు పోపు అధికారానికి దాసోహమన్నది.GCTel 33.3

    రోమా మతతత్వ సిద్ధాంతాల్లో ఒకటి లోకంలో క్రీస్తు సంఘానికి కనిపించే అధినాయకుడని లోకంలోని బిషప్పులు పాదుర్ల మీద అతడికి సర్వాధికారం వున్నదని బోధించేది. దీన్ని మించిందేమిటంటే పోపుకు దేవుని పేర్లు ఆపాదించటం, అతణ్ణి “ప్రభువైన దేవుడు పోపు” గాను పాపరహితుడుగాను వ్యవహరించటం. నర్వమానవులు తనను స్తుతించాలన్నది అతడి కోరిక. శోధనారణ్యంలో తాను వ్యక్తం చేసిన కోరికనే ఇప్పుడు రోమా సంఘం ద్వారా సాతాను వ్యక్తం చేస్తున్నాడు. ప్రజలు పెద్ద సంఖ్యలో అతడికి నీరాజనాలర్పిస్తున్నారు. భయభక్తులతో దేవుని ఆరాధించే ప్రజలు మోసకారి అయిన అపవాది కోరికల్ని క్రీస్తు ఎదుర్కొన్న మాదిరిగానే దేవుని సవాలు చేసే ఈ కోరికల్ని “నీ దేవుడైన ప్రభునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను” అంటూ ఎదుర్కొంటారు. లూకా 4:8. సంఘానికి శిరస్సుగా ఏ మానవుణ్ణి నియమించినట్లు తన వాక్యంలో ఎక్కడా దేవుడు సూచన ప్రాయంగా కూడా చెప్పలేదు. పోపు సర్వాధికార సిద్దాంతం లేఖన భోధనలకు బద్ద విరుద్ధం. అన్యాయపు ఆక్రమణ ద్వారా తప్ప క్రీస్తు సంఘంపై పోపుకు ఎలాంటి అధికారమూ లేదు.GCTel 33.4

    ప్రొటస్టాంటులు, సంఘ సిద్ధాంత వ్యతిరేకులు, యధార్ధ సంఘం నుంచి ఇష్టపూర్వకంగా వేర్పాటు కోరేవారని రోమా మత వాదులు సర్వదా నిందిస్తూ వుంటారు. కాని ఈ నింద వారికే వర్తిస్తుంది. క్రీస్తు ధ్వజాన్ని నేలకూల్చి “పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ”ను (యూదా 3) విడిచిపెట్టింది వారే.GCTel 34.1

    తన వంచనలు గ్రహించి తన ప్రాబల్యాన్ని ప్రతిఘటించే సామర్థ్యాన్ని పరిశుద్దలేఖనాలు ప్రజలకు కలుగజేస్తాయన్నదని సాతానుకి బాగా తెలుసు. సాతాను దాడుల్ని రక్షకుడు వాక్యంతో తిప్పికొట్టాడు. ప్రతీ దాడిలోను “అని వ్రాయబడి ఉన్నది” అంటూ నిత్య సత్యమనే డాలును క్రీస్తు ప్రదర్శించాడు. అపవాది ప్రతి ప్రతిపాదనను వాక్యవివేకంతోను వాక్యశక్తితోను ఆయన ఎదుర్కొన్నాడు. మనుషులపై తన పట్టు నిలుపుకొని దురాక్రమణ దారుడయిన పోపు అధికారాన్ని నెలకొల్పేందుకుగాను సాతాను వారిని లేఖన సంబంధమైన అజ్ఞానంలో వుంచాలి. బైబిలు దేవుని హెచ్చించి పరిమిత జ్ఞానం గల మానవుల్ని తమ వాస్తవ స్థానంలో ఉంచుతుంది. అందుచేత బైబిలులోని సత్యాలు మరుగున పడివుండాలి. ప్రజలకు అందుబాటులో ఉండకూడదు. ఈ తర్కాన్నే రోమా సంఘం ఉపయోగించింది. వందలాది సంవత్సరాలుగా బైబిలు ప్రచురణను నిషేధించింది. ప్రజలు బైబిలును చదవటంగాని దాన్ని తమ ఇళ్ళలో ఉంచుకోవటంగాని నిషిద్ధం. నియమ నిబంధనలులేని మతగురువులు అధికారులు తమ మోసాల్ని కొనసాగించేందుకు బైబిలు బోధనలకు తమకు ఇష్టం వచ్చిన భాష్యాలు చెప్పారు. ఈ విధంగా లోకంలోని సంఘంపైన దేశ పరిపాలకులపైన అధికారంగల దైవ ప్రతినిధిగా దాదాపు ప్రపంచమంతా పోపును అంగీకరించటం జరిగింది.GCTel 34.2

    తప్పును బయలుపెడుతున్న బైబిలును ఈ విధంగా తొలగించి సాతాను తన ఇష్ట ప్రకారం వ్యవహరించాడు. పోపుల అధికారం “పండుగకాలములను న్యాయపద్ధతులను నివారణ చేయబూనుకొనును”( దానియేలు7:25) అని ప్రవచనం వచించింది. ఈ పని చేయటంలో ఆ మతాధికారం జాప్యం చేయలేదు. అన్యమతం నుంచి అనుచరులను రాబట్టటానికి విగ్రహారాధనకు ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసి తద్వారా నామ మాత్రపు క్రైస్తవ మతావలంబనను ప్రోత్సహించటం ద్వారా క్రైస్తవారాధనలో విగ్రహారాధనకు మృత భక్తుల అవశేషాల పూజకు అంకురార్పణ చేసింది. ఒక సర్వసభ్య సమావేశం ఆవేశంతో విగ్రహారాధన వ్యవస్థ స్థాపితమయ్యింది. ఈ అపవిత్ర కార్యాన్ని పూర్తిచేయటానికి దైవ ధర్మశాస్త్రంలో విగ్రహారాధనను నిషేధిస్తున్న రెండో ఆజ్ఞను తీసివేసి పది అన్నసంఖ్యను అలాగే ఉంచటానికిగాను పదవ ఆజ్ఞను రెండుగా విభజించింది రోమా మతం.GCTel 35.1

    అన్యమతానికి రాయితీలిచ్చే స్పూర్తి దైవాధికారాన్ని అలక్ష్యం చేయటంలో మరో మార్గాన్ని తెరిచింది. అంకిత భావం లోపించిన సంఘనేతల ద్వారా కృషి చేస్తూ సాతాను నాల్గో ఆజ్ఞనుకూడా తాకి దేవుడు ఆశీర్వదించి, పరిశుద్ధ పర్చిన సనాతన సబ్బాతును పక్కన పెట్టటానికి ప్రయత్నించాడు (ఆదికాండము 2:2,3). దాని స్థానంలో అస్యులు “సూర్యారాధన దినం”గా గౌరవించిన పండుగ దినాన్ని నిలపటానికి ప్రయత్నించాడు. ఈ మార్పు ప్రయత్నం మొదట బాహాటంగా జరగలేదు. తొలిశతాబ్దాల్లో క్రైస్తవులందరూ యధార్ధ సబ్బాతునే ఆచరించారు. దైవభక్తి విషయంలో వారు ఎంతో ఉద్రేకంగా ఉన్నారు. దైవ ధర్మశాస్త్రం మార్పులేనిదని నమ్మి అందలి పవిత్ర సూత్రాన్ని అమితాసక్తితో ఆచరించారు. కాగా తన లక్ష్యాన్ని సాధించటానికి తన ప్రతినిధుల ద్వారా సాతాను చాలా యుక్తిగా పని చేశాడు. ప్రజల దృష్టిని ఆదివారంపై నిలపటానికి క్రీస్తు పునరుతానాన్ని గౌరవించే పండుగ దినంగా దాన్ని ప్రకటించాడు. ఆరోజు ఆరాదన కార్యక్రమాలు జరిగాయి. కాని అది ఇంకా వినోద కార్యకలాపాల దినంగానే నిలిచింది. సబ్బాతు ఇంకా పరిశుద్ధ దినంగానే ఆచరణలోవుంది.GCTel 35.2

    తాను ఉద్దేశించిన కార్యాన్ని పూర్తిచేసేందుకోసం సాతాను సబ్బాతును కఠినమైన నిషేధాలతోనింపి దాని ఆచరణను భయంకరమైన ఆచారంగా తయారు చేయటానికి క్రీస్తు మొదటి రాకకు ముందున్న యూదుల్ని ఉపయోగించుకున్నాడు. సబ్బాతునుగూర్చి తాను సృష్టించిన తప్పుడు అభిప్రాయాల్ని ఆసరాచేసుకొని అది యూదీయ వ్యవస అంటూ దానిపై బురద చల్లాడు. క్రైస్తవులు ఆదివారాన్ని సామాన్యంగా ఆనందోత్సవ దినంగా ఆచరిస్తూ వుండగా యూదుమతం పట్ల ద్వేషాన్ని సూచిస్తూ సబ్బాతును ఉపవాస దినంగాను సంతాపదినంగాను ఆచరించటానికి వారిని నడిపించాడు.GCTel 35.3

    నాల్గో శతాబ్ది తొలి భాగంలో రోమా సామ్రాజ్య మంతటిలోను ఆదివారాన్ని పండుగ దినంగా ప్రకటిస్తూ కాన్ స్టెయిన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశాడు. సూర్యదినాన్ని అన్యులూ, క్రైస్తవులు గౌరవించారు. విరుద్ధ భావాలు గల అన్యమతం క్రైస్తవ మతాల ప్రజల్ని ఏకంచేయటమే చక్రవర్తి అభిమతం. ఈ మేరకు సంఘ బిషప్పులే చక్రవర్తిని అర్ధించారు. అత్యాశ, ఆధికార దాహంతో తపించిపోతున్న బిషప్పులు ఆలోచించి క్రైస్తవులు అన్యులు ఒకే రోజున ఆరాధించినట్లయితే ఆది అన్యులు క్రైస్తవ మతాన్ని నామమాత్రంగా స్వీకరించటానికి తద్వారా తాము సంఘాధికారాన్ని ప్రాబల్యాన్ని పెంచుకోటానికి దోహదపడుందనుకొన్నారు. భక్తివైరాగ్యాలుగల పలువురు క్రైస్తవులు ఆదివారానికి కొంత పరిశుద్ధత ఉన్నదని క్రమేపీ విశ్వసించినప్పటికీ నిజసబ్బాతు ప్రభువు పరిశుద్ధ దినమని నమ్మి నాల్గో ఆజానుసారంగా సబ్బాతును ఆచరించారు.GCTel 36.1

    ఈ అపూర్వ వంచకుడు తన పనిని పూర్తి చేయలేదు. క్రైస్తవ ప్రపంచాన్ని తన ధ్వజం కింద సమీకరించి, క్రీస్తు రాయబారినని చెప్పుకొంటున్న పోపు ద్వారా తన అధికారాన్ని చెలాయించటానికి కృతనిశ్చయతతో ఉన్నాడు. సగం మారిన అన్యులు దురాశాపరులైన అధికారులు, లోకాశలతో నిండిన సంఘ సభ్యుల ద్వారా సాతాను తన కార్యాన్ని సాధించాడు. అప్పుడప్పుడు పెద్ద సభలు ఏర్పాటయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సంఘనేతలు ఈ సభలకు హాజరయ్యారు. దాదాపు ప్రతీ సభలోను దైవ స్థాపితమైన సబ్బాతును తగ్గించి ఆదివారాన్ని హెచ్చించటం జరిగింది. ఈ విధంగా అన్యమత పండుగ దైవ వ్యవస్థగా తుదకు గౌరవ స్థానం పొందింది. బైబిలు సబ్బాతు యూదుమత అవశేషమన్న నిందపడగా దాని నాచరించిన వారు శాపగ్రస్తులన్న అపవాదు పడ్డారు.GCTel 36.2

    ” ఏది దేవునడబడునో ఏది పూజింపబడునో “(2థెస్స. 2:4) దానికన్నా తన్నుతాను హెచ్చించు కోటంలో ఈ మహాభ్రష్టుడు విజయం సాధించాడు. సర్వమానవ జాతికీ ఒకే ఒక యధార్ధ సజీవ దైవాన్ని చూపించే ఏకైక ధర్మశాస్త్ర సూత్రాల్ని అతడు మార్చివేశాడు. ఆకాశాన్ని భూమిని సృజించింది దేవుడని ఆ కారణంచేత ఆయన అబద్ద దేవుళ్లకు భిన్నమైనవాడని నాలో ఆజ్ఞ సూచిస్తున్నది.GCTel 36.3

    ఏడోదినం సృష్టి కార్యానికి స్మారక చిహ్నం. దాన్ని పరిశుద్ధపర్చి మానవునికి విశ్రాంతి దినంగా ఇచ్చాడు దేవుడు. జీవానికి మూలంగాను, గౌరవానికి ఆరాధనకు అర్హుడుగాను మానవ మనసుల్లో దేవుని నిలపటానికి అది ఏర్పాటయ్యింది. మానవులు దేవునికి ఆయన ధర్మశాస్త్రానికి విధేయులు కాకుండా వారిని దారి మళ్లించేందుకు సాతాను శ్రమిస్తాడు. అందునుబట్టి దేవుని సృష్టికర్తగా పేర్కొంటున్న ఆజ్ఞమీద తన దృష్టిని కేంద్రీకరిస్తాడు.GCTel 37.1

    సమాధి నుంచి క్రీస్తు ఆదివారం లేచాడు గనుక అదే క్రైస్తవ సబ్బాతని ప్రొటస్టాంటుల వాదన. దీనికి వాక్యం నుంచి రుజువులు లేవు. క్రీస్తుగాని ఆయన శిష్యులుగాని ఆదివారానికి ఆ గౌరవాన్ని ఇవ్వలేదు. క్రైస్తవ వ్యవస్థగా ఆదివారాచరణ “ధర్మవిరోధి సంబంధమైన మర్మము”(2థెస్స. 2:7) లో నుంచి పుట్టుకొచ్చింది. పౌలు దినాల్లోనే ఇది తన పనిని ఆరంభించింది. పోపులు కన్న ఈ చిన్నారిని ప్రభువు ఎక్కడ ఎప్పుడు దత్తత తీసుకున్నట్లు? లేఖనాల ఆమోదంలేని ఈ మార్పుకు ఏ మంచి కారణం ఇవ్వగలం?GCTel 37.2

    ఆరో శతాబ్దంలో పోపుల అధికారం స్థిరంగా నెలకొన్నది. దాని అధికార కేంద్రం సామ్రాజ్య నగరం రోములో ఏర్పాటయ్యింది. రోమా నగర బిషప్పు సంఘమంతటికి అధినాయకుడయ్యాడు. అన్యమతం స్థానే పోపుల మతం నెలకొన్నది. మృగానికి ఆ ఘటసర్భం “తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును” (ప్రకటన 13:2) ఇచ్చింది. దానియేలు ప్రకటన గ్రంథాల్లోని ప్రవచనాలు చెబుతున్న 1260 సంవత్సరాలు సాగిన పోపుల హింస ఇపుడు ప్రారంభమయ్యింది. (దానియేలు 7:25, ప్రకటన 13:57.) క్రైస్తవులు తమ మనస్సాక్షిని చంపుకొని పోపుల కర్మకాండను ఆరాధన వ్యవస్థను అంగీకరించటమో లేక అగ్ని జ్వాలలకు, కసాయి వాడి గండ్రగొడ్డలికి ఆహుతి కావటమో నిర్ణయించుకునేవారు. యేసు పలికిన ఈ మాటలు ఇప్పుడు నెరవేరాయి. “తల్లిదండ్రుల చేతను సహోదరులచేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపుదురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.” లూకా 21:16,17) నమ్మకంగా నిలిచినవారి విషయంలో హింస ముందటికన్న మరింత భయంకరంగా సాగింది. ప్రపంచం ఒక విశాల రణరంగమయ్యింది. క్రీస్తు సంఘం కొన్ని వందల సంవత్సరాలు అజ్ఞాతంలోను అంధకారంలోను ఆశ్రయం పొందింది. ప్రవక్త ఆ స్థితిని ఇలా వర్ణిస్తున్నాడు, “ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను” ప్రకటన 12:6) GCTel 37.3

    రోము సంఘం అంధకారములోకి రావటంతో చీకటి యుగాలు ప్రారంభమయ్యాయి. దాని అధికారం పెరిగిన కొద్దీ చీకటి దట్టమయ్యింది. నిజమైన పునాది అయిన క్రీస్తు మీది విశ్వాసం రోములోని పోపు మీదకు మార్పిడి అయ్యింది. పాపక్షమాపణకు నిత్యజీవానికి దేవకుమారుని నమ్ముకోటానికి బదులు పోపును, పోపు అధికారం పొందిన మతాచార్యుల్ని, అధికారుల్ని ప్రజలు నమ్ముకొన్నారు. తమకు ఈ లోకంలో పోపే మధ్యవర్తి అని అతని ద్వారా తప్ప ఎవరూ నేరుగా దేవుని ఏమీ అర్థించకూడదని అంతేకాక పోపు దేవుని స్థానంలో తమకు ఉన్నాడని ఆకారణంగా తాము ప్రశ్నించకుండా అతనికి విధేయులు కావాలని మత గురువులు ప్రజలకు బోధించారు. అతని ఆదేశాల్లో ఏమాత్రం తేడా చోటుచేసుకున్నా దాని పర్యవసానం అపరాధుల దేహాలు, ఆత్మలు కఠినమైన శిక్షకు గురి కావటం. ఇలా దేవుని మీద నుంచి తప్పుల తడకలు కఠిన హృదయులు అయిన మానవుల మీదకు, ప్రధానంగా వారిద్వారా అధికారం చెలాయించిన చీకటిరాజు మీదకు, ప్రజల మనసుల్ని మరల్చటం జరిగింది. పాపం కపటవేషం ధరించి పరిశుద్ధతగా చెలామణి అయ్యింది. లేఖనాల్ని అణచివేసి తానే సర్వం సహాధికారినన్న స్థితికి మానవుడు దిగజారితే దాని ఫలితం వంచన, మోసం, నికృష్టమైన దుర్మార్గతే. మానవ చట్టాలు సంప్రదాయాలు అందలమెక్కడంతో దైవ , దర్మశాస్త్రాన్ని తోసిరాజనటంవల్ల ఉత్పన్నమయ్యే దుర్నీతి దర్శనమిచ్చింది. ఈGCTel 38.1

    క్రీస్తు సంఘానికి అవి అపాయకరమైన దినాలు. నమ్మకంగా సత్యధ్వజాన్ని మోసినవారు నిజంగా కొద్దిమందే. సత్యం పక్షంగా సాక్ష్యం చెప్పే సాక్షులు లేకపోలేదు. అయినా తప్పుడు బోధ మూఢనమ్మకం పూర్తి విజయాన్ని సాధిస్తున్నట్లు నిజమైన మతం లోకంలో నుంచి మరుగై పోతున్నట్లు కొన్ని సార్లు అనిపించవచ్చు. సువార్త మరుగున పడింది. అయితే మతం వేర్వేరు రూపాలు ధరించి విస్తరించింది. కఠినమైన వసూళ్ల భారంతో ప్రజలు కుంగిపోయారు.GCTel 38.2

    పోపును తపు మధ్యవర్తిగా పరిగణించటం మాత్రమేగాక పాపక్షమాపణకు తమ క్రియల్ని నమ్ముకోవాలని ప్రజలకు బోధించారు. దీర్ఘతీర్థయాత్రలు, ప్రాయశ్చిత్తం కలిగించే క్రియలు, మృత భక్తుల అవశేషాల పూజ, గుళ్లు, గోపురాలు, మండపాల నిర్మాణం, సంఘానికి పెద్దమొత్తాల్లో విరాళాలు- దేవుని కోపం చల్లార్చి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి ఇవి ఇంకా ఇలాంటి పనులెన్నో చేయటం తప్పనిసరి అని భోదించారు. చిన్న పొరపాట్లు దొర్లినప్పుడు ఉగ్రుడవటానికి లేక దానాలతోను ప్రసన్న కార్యాలతోను తృప్తిపడటానికి దేవుడు మనుషుల వంటివాడా ఏంటి?GCTel 38.3

    రోమాసంఘ నాయకులలో సయితం దుర్నీతి ప్రబలంగా వున్నా సంఘం పలుకుబడి రాసురాసు అధికమయ్యింది. పోపులకు ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక అధికారం ఉన్నదో అదే సంఘం ఆరంభ యుగాల్లో రోమా బిషప్పులకు ఉండేదని దాదాపు ఎనిమిదో శతాబ్ది చివరలో పోపులు ప్రకటించుకొన్నారు. హక్కును స్థిరపర్చుకోటానికిగాను అధికార ప్రదర్శనకు ఒక సాధనం కావాలి. అబద్దాలకు జనకుడైన సాతాను దాన్ని వెంటనే ప్రతిపాదించాడు. మాంకులు(సన్యాసులు) ప్రాచీన రచనల దొంగనకళ్ళు తయారు చేశారు. ముందెన్నడు వినియెరుగని సభల ఆదేశాలు బయలు పడ్డాయని అవి లోకంలో పోపు సర్వాధికారాన్ని ఆరంభ దినాలనుంచి ధ్రువపర్చుతున్నాయని ప్రకటించారు. సత్యాన్ని విసర్జించిన సంఘం ఈ మోసాన్ని ఆగమేఘాలమీద అంగీకరించింది.GCTel 39.1

    నిజమైన పునాదిపై నిర్మించే నమ్మకమైన పనివారు (1కొరిం 3:10, 11) బిత్తరపోయారు. ఆ తప్పుడు సిద్ధాంతాల చెత్త దైవ సేవకు అంతరాయం కలిగించింది. నెహెమ్యా కాలంలో యెరూషలేము గోడలపై వున్న కట్టడం పని వారి మల్లే కొంతమంది ఇలా చెప్పటానికి సిద్ధంగా వున్నారు. “బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్నచెత్త విస్తారము, గోడ కట్టలేము” నెహెమ్యా 4:10. తమ ప్రగతికి అడ్డుకట్ట వేసేందుకు కలిగించే ఆటంకాలు, హింస, మోసం దుర్మార్థతతో సతమతమౌతూ విసిగిపోయి నమ్మకస్తులైన కొంతమంది కట్టడం పనివారు నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. తమ ఆస్థికి తమ జీవితాలకు భద్రత చేకూరే నిమిత్తం వారు నిజమైన పునాదిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇతరులు తమ ప్రత్యర్థుల వ్యతిరేకతను లెక్కచేయకుండా ధైర్యంగా ఇలా పలికారు. “వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము” చేసుకోండి. (14 వచనం) వారు తమ పనిని కొనసాగించారు. ప్రతీవారు తమ ఖడ్గాన్ని ధరించారు. ఎఫెసీ 6:17.GCTel 39.2

    సత్యం పట్ల అదే ద్వేషభావం అదే వైరుధ్యం ప్రతి యుగంలోను దైవ విరోధుల్ని ఆవేశపర్చి ముందుకు నెట్టుతున్నది. దైవ సేవకులలో కూడ అదే అప్రమత్తత అదే విశ్వసనీయత అవసరం. క్రీస్తు తనతొలి శిష్యులతో చెప్పిన మాటలు ఆయన అనుచరులకు లోకాంతం వరకు అనుసరణీయాలు. “నేను మీతో చెప్పుచున్నది అందరితోను, చెప్పుచున్నాను. మెలకువగా నుండుడి”.GCTel 39.3

    చీకటి మరింత దట్టమయ్యింది. విగ్రహారాధన విస్తరించింది. విగ్రహాల ముందు కొవ్వువత్తి దీపాలు వెలిగాయి. విగ్రహాల ముందు ప్రార్థనలు వినిపించాయి. అర్ధం పర్థంలేని ఆచారాలు మూఢభక్తి ఆదరణ పొందాయి. మూఢనమ్మకాలు మానవ మనస్సుల్ని పూర్తిగా నియంత్రించాయి. ఫలితంగా వారిలో యుక్తాయుక్త జ్ఞానం నశించినట్లు కనిపించింది. మత గురువులు, బిషప్పులు, సుఖభోగ ప్రియులు, విషయాసక్తులు, అవినీతి పరులు కాగా వారిని ఆదర్శంగా తీసుకొన్న ప్రజలు అజ్ఞానంలోను నేరంలోను కూరుకుపోవడంలో ఆశ్చర్యం ఏముంది?GCTel 40.1

    తమ ఊహాగానాలలో పోపులు మరోమెట్టు ఎక్కారు. అది పదకొండో శతాబ్దంలో పోపు గ్రెగరి viii రోమా సంఘం పరిపూర్ణ సంఘమంటూ ప్రకటించటం. అతను చేసిన ప్రతిపాదనలలో ఒకటి వాక్య ప్రకారం సంఘం ఎన్నడు పొరపాటు చేయలేడు ఇకముందెప్పుడు చేయదు అన్నది. పోతే ఈ ఉద్ఘాటనకు లేఖనంలో రుజువు వున్నదా అంటే అదెక్కడా కనిపించదు. అహంకారంతో నిండిన ఈ జగద్గురువు చక్రవర్తుల్ని దించటానికి తనకు అధికారమున్నదని ప్రకటించి తాను వెలువరించిన తీర్పును మార్చే హక్కు ఎవరికీ లేదని అయితే తక్కిన వారి తీర్పులను మార్చే ప్రత్యేక ఆధిక్యత మాత్రం తన కున్నదని కరాఖండిగా చెప్పాడు.GCTel 40.2

    ఈ కళంక రహిత ప్రబోధకుడి నిరంకుశ ప్రవర్తనకు ఇతను జర్మను చక్రవర్తి నాలో హెన్రీతో వ్యవహరించిన తీరే చక్కని ఉదాహరణ. తన అధికారాన్ని లెక్క చేయలేదన్న కారణంతో పోపు ఈ చక్రవర్తిని వెలివేసి సింహాసనం నుంచి దించివేశాడు. తన సామంత రాజులు తనను వదిలి వెళ్లిపోటం, పోపు ప్రోత్సాహంతో వారు తనపై ఎదురు తిరిగి భయపెట్టడం చూసి హెన్రీ రోముతో సమాధాన పడవలసిన అవసరం ఏర్పడింది. భార్యను విశ్వాసపాత్రుడైన సేవకుణ్ణి వెంటబెట్టుకొని పోపుముందు వినయంగా హాజరయ్యేందుకు నడి శీతాకాలంలో హెన్రీ ఆర్ట్స్ పర్యతశ్రేణి దాటాడు. పోపు గ్రెగరీ విశ్రాంతి తీసుకొంటున్న భవనం చేరుకొన్న హెన్రీని పోపు భవన ప్రాంగణంలోకి ప్రవేశపెట్టారు ద్వారపాలకులు. రాజభటులు లేకుండా ఎముకలు కొరికే చలికాలం చలిలో, తలపై టోపీలేకుండా, వట్టి కాళ్ళతో, దయనీయమైన దుస్తులతో పోపు సముఖంలోకి వెళ్లడానికి అనుమతికోసం హెన్రీ చక్రవర్తి వేచి ఉన్నాడు. క్షమాభిక్ష వేడుకొంటూ మూడు దినాలు గడిపితేనేగాని ఆ జగద్గురువు దిగి వచ్చి రాజుకు క్షమాపణ మంజూరు చేయలేదు.దానికి కూడా ఒక షరతు విధించాడు. తన అధికార చిహ్నాలను తిరిగి ఉపయోగించక ముందు లేక తన రాజ్యాధికారాన్ని వినియోగించుకోక పూర్వం పోపు అనుమతి పొందాలి. ఈ విజయంతో తారాపథాని కెగసిపోయిన గ్రెగరీ చక్రవర్తి రాజుల గర్వాన్ని అణచటం తన బాధ్యత అని డంబాలు పలికాడు.GCTel 40.3

    గర్విష్టుడైన పోపు నిరంకుశత్వానికి, అహంకారానికి క్రీస్తు సాత్వీకానికి, సాధుత్వానికి మధ్య భేదం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నది! క్షమాపణ, సమాధానం అనుగ్రహించేందుకు లోనికి రావటానికి హృదయ ద్వారం వద్ద నిలబడి తట్టుతున్నట్లు ఆయన తన్నుతాను కనపర్చుకొంటున్నాడు. తన శిష్యులకు ఇలా బోధించాడు, “మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను” మత్తయి 20:27. GCTel 41.1

    రోము ప్రబోధిస్తున్న సిద్దాంతాల్లో నిత్యము పెరుగుతున్న అసత్యాన్ని గతిస్తున్న శతాబ్దాలు గుర్తిస్తూనే వున్నాయి. పోపుల పాలన స్థాపనకు ముందే అన్యమత తత్వవేత్తల బోధనలు ప్రజల దృష్టిని ఆకర్షించి తమ ప్రభావాన్ని సంఘంపై ప్రసరించాయి. క్రైస్తవాన్ని స్వీకరించినట్లు చెప్పుకొన్న అనేకమంది తమ అన్యమత సిద్ధాంతాల్ని విడిచి పెట్టలేదు. వాటి అధ్యయనం కొనసాగించటమేగాక అన్యుల మధ్య క్రైస్తవ మత ప్రభావం ప్రసరించటానికి అవి మంచి సాధనం కాగలవని చెప్పి ఇతరులను ప్రోత్సహించారు. హానికరమైన తప్పులు ఈ విధంగా సంఘంలో ప్రవేశించాయి.GCTel 41.2

    మనిషికి స్వాభావికంగా అమరత్వం ఉన్నది ఆత్మకు చావులేదు అన్న బోధ వీటిలో ప్రధానమైనది. భక్తులకు ప్రార్థనలు చేయటం, కన్యమరియను ఆరాధించటం వంటి రోము స్థాపిత సిద్ధాంతాలకు ఈ సిద్ధాంతం పునాది వేసింది. చివరగా దుష్టులకు నిత్య నరకమున్నదన్న తప్పుడు బోధ దీని నుంచి పుట్టిందే. ఈ తప్పుడు బోధ ఆదిలోనే పోపుల విశ్వాసంలో భాగమయ్యింది.GCTel 41.3

    ఆపై అన్యమతం సృష్టించిన మరో కట్టుకథకు మార్గం ఏర్పడింది. దానికి రోము పెట్టిన పేరు ‘పర్గెటరి’ (పాపప్రాయశ్చిత్త స్థలం) సులభంగా, మూఢ భక్తితో నమ్మేసే జనాలను భయపెట్టటానికి రోము ఈ సిద్ధాంతాన్ని వినియోగించుకొంది. ఈ తప్పుడు బోధ ఫలితంగా శిక్షాస్థలం ఒకటున్నదని, నిత్యనాశనానికి పాత్రులు కాని ఆత్మలు తమ పాపాలకు ఈ స్థలంలో శిక్షననుభవిస్తాయని అపవిత్రత నుంచి విముక్తి కలిగిన తర్వాత ఆ ఆత్మలకు పరలోక ప్రవేశం లభిస్తుందని బోధించారు.GCTel 41.4

    తన అనుచరుల భయాలు వ్యసనాలను రోము సొమ్ము చేసుకోటానికి ఇంకో కల్పిత కథ అగత్యమయ్యింది. శిక్షా పరిహార సిద్ధాంతం (ది డాక్ట్రిన్ ఆఫ్ ఇండల్ జెన్సెస్) ఈ అవసరాన్ని తీర్చింది. తన రాజకీయ పాలనను విస్తరింప జేసేందుకు తన సైన్యంలో చేరి తన శత్రువుల్ని శిక్షించే వారికి, లేదా తన ఆధ్యాత్మిక ఆధిక్యాన్ని అంగీకరించని వారిని నిర్మూలించే వారికి గత, ప్రస్తుత భావి పాపాల క్షమాపణను, వారి భాధలు, జరిమానాల నివారణను పోపు వాగ్దానం చేశాడు. సంఘానికి ద్రవ్యం చెల్లించటం ద్వారా తాము పాపవిముక్తి పొందగలరని మరణించి నరకం మంటలలో మగ్గుతున్న తమ మిత్రులకు విడుదల సంపాదించగలరని ప్రజలకు భోధించాడు. రోము ఇలాంటి మార్గాలు అవలంబించటం ద్వారా తన ధనాగారాన్ని నింపుకొని, తల దాచుకోటానికి కూడా స్థలంలేని ఆ ప్రభువు రాయబారులుగా నటిస్తున్న మత గురువుల విలాసాల్ని, భోగాల్ని వ్యసనాల్ని పోషించింది. GCTel 42.1

    లేఖనాలు ఆదేశిస్తున్న ప్రభురాత్రి భోజన సంస్కారానికి మారుగా విగ్రహపూజా పునస్కారాలతో నిండిన మాసను నెలకొల్పారు. రొట్టెను ద్రాక్షారసాన్ని క్రీస్తు వాస్తవ “శరీరంగాను, రక్తంగాను మార్చుతున్నట్లు తమ సౌజ్ఞల ద్వారా పోపుమతాచార్యులు నటించారు. కార్డినల్ వైజ్ మన్, ది రియల్ ప్రజెన్స్ ఆఫ్ ది బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ది బ్లెసెడ్ యూకరిస్ట్ ఫు ఫ్రమ్ స్క్రిప్ఫర్ లెక్చర్ 8, పేరా 26. దేవదూషణ కరమైన దురభిమానంతో కూడిన సమస్తానికి సృష్టికర్త అయిన, దేవుని సృజన శక్తి తమకున్నదని బహిరంగాంగా చెప్పుకొన్నారు. ఈ భయంకరమైన, దేవదూషణ కరమైన తప్పుడు సిద్ధాంతాన్ని తాము నమ్ముతున్నట్లు ప్రకటించ వలసిందిగా క్రైస్తవుల్ని ఒత్తిడి చేశారు. ప్రకటించని వారికి మరణ దండన విధించారు. నిరాకరించిన వేలాది ప్రజలు మంటలలో మాడిమసై పోయారు.GCTel 42.2

    పోపులు స్థాపించిన శిక్షా సాధనాల్లో మిక్కిలి భయంకరమైంది విచారణ (ఇన్ క్విజిషన్). దీన్ని పదమూడో శతాబ్దంలో స్థాపించారు. చీకటి యువరాజైన సాతాను పోపు మత నాయకులతో కలిసి పని చేశాడు. వారి రహస్య సమావేశాల్లో సాతాను అతని అనుచరులు మనుషుల మనసుల్ని అదుపుచేశారు. కంటికి కనిపించని దేవదూత వారిమధ్య నిలిచి వారి దుష్ట ఆదేశాన్ని దాఖలు చేసి మానవ దృష్టికి మిక్కిలి భయంకర క్రియల చరిత్రను రాశాడు. “మహాబబులోను” “పరిశుద్దుల రక్తమనే మద్యాన్ని తాగింది” ఆ భ్రష్ట అధికారంపై ప్రతీకారం తీర్చుకోమంటూ లక్షలాదిమంది హతసాక్షులు దేవునికి మొర పెట్టుకొన్నారు.GCTel 42.3

    పోపులపాలన లోకముంతటిలోను గొప్ప నిరంకుశ శక్తిగా పరిణమించింది. లోకమతాధినేత ఆదేశాలను రాజులు చక్రవర్తులు శిరసావహించారు. మనుషుల భవిష్యత్తు- అది భూమి మీదేగాని పరలోకంలోనేగాని- అతని చేతుల్లో ఉన్నట్లు కనిపించింది. వందలాది సంవత్సరాలుగా రోము సిద్ధాంతాన్ని ప్రజలు స్వీకరించారు. అది నిర్దేశించిన కర్మకాండను ఆచరించాడు. అది నియమించిన పండుగల్ని జరుపుకొన్నారు. రోము మతగురువుల్ని సన్మానించి ధారాళ విరాళాలతో పోషించారు. రోమను సంఘం అప్పుడు పొందిన గౌరపం, అప్పుడు సాధించిన ఔన్నత్యం, అప్పుడు చెలాయించిన అధికారం, తర్వాత ఎన్నడు అనుభవించలేదు.GCTel 43.1

    ఏది ఏమైనా “పోపుల మిట్టమధ్యాహ్నాం ప్రపంచానికి మధ్యరాత్రి” జె.ఎ.నిలీ, ది హిస్టరీ ఆఫ్ ప్రొటస్టాంటిజమ్, పుట 1, అధ్యా.4. ప్రజలకు మాత్రమేకాదు మతాచార్యులకు కూడా పరిశుద్ధ లేఖనాలు మరుగయ్యాయి. పూర్వం పరిసయ్యుల మల్లే పోపు మతనాయకులు వెలుగును ద్వేషించారు. ఎందుకంటే అది వారి పాపాల్ని బయలుపర్చుతుంది. నీతికి ప్రామాణికమైన దైవ ధర్మశాస్త్రాన్ని తొలగించి హద్దులేని అధికారాన్ని చెలాయించారు. అడ్డు ఆపు లేకుండా దుష్కృత్యాలు చేశారు. దగా, పేరాశ, దుర్నీతి పెచ్చరిల్లాయి. డబ్బుకోసం, పదవి కోసం మనుషులు ఏ నేరానికైనా వెనుకాడలేదు. పోపులు, ఉన్నత మతగురువుల భవంతులు అతినీచమైన రాసలీలలకు ఉనికిపట్టులయ్యాయి. పరిపాలనా బాధ్యతలు గల కొందరు మతాధికారులు చేసిన నేరాలు చూసి లౌకిక పరిపాలకులు అసహ్యించుకొని మనుషులు సహించరాని మృగాలుగా వర్ణించి వారిని తమ పదవుల నుంచి తొలగించటానికి ప్రయత్నించారు. కొన్ని శతాబ్దాల వరకు జ్ఞానంలోను, కళల్లోను, నాగరికతలోను ఐరోపా ప్రగతి సాధించలేక పోయింది. క్రైస్తవ ప్రపంచాన్ని ఒక రకమైన నైతిక, వైజ్ఞానిక పక్షవాతం పట్టి పీడించింది.GCTel 43.2

    రోము పరిపాలన కింద లోకంలోని భయంకర పరిస్థితి హోషేయా ప్రవక్త పలికిన ఈ మాటలకు అద్దం పట్టింది. “నా జనులు జ్ఞానవములేనివారై నశించుచున్నారు...నేను నిన్ను విసర్జింతును...నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ద సాక్ష్యము పలుకుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యెను, జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు” హోషేయా 4:6,1,2. ఇవి దైవ వాక్యం వెలివేత పర్యవసానాలు.GCTel 43.3