Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 39—ఆపత్కాలం

    ఆకాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు” దానియేలు 12:1.GCTel 579.1

    మూడో దూత వర్తమానం సమాప్తమైనప్పుడు పాప భూనివాసుల పక్షంగా ఇక కృపా విజ్ఞాపన ఉండదు. దైవ ప్రజలు తమ కర్తవ్యాన్ని ముగిస్తారు. వారు “కడవరి వర్షము” “ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు ” పొందుతారు. తమ ముందున్న ఆపత్కాలానికి వారు సంసిద్ధంగా ఉంటారు. పరలోకంలో దేవదూతలు ఇటూ అటూ పరుగెడుతున్నారు. భూలోకం నుంచి పరలోకానికి తిరిగి వచ్చిన ఒకదూత తన కర్తవ్యాన్ని నెరవేర్చినట్లు, లోకానికి చివరి పరీక్ష జరిగినట్లు, దేవుని ధర్మశాసనాలకు విధేయులై నివసించిన వారందరూ “సజీవుడగు దేవుని ముద్ర” ను పొందినట్లు ప్రకటిస్తాడు. అప్పుడు పరలోక గుడారంలో యేసు చేస్తున్న విజ్ఞాపన పరిచర్య ఆగిపోతుంది. చేతులు పై కెత్తి “సమాప్తమైనది” అని గొప్ప స్వరంతో పలుకుతాడు. గంభీరమైన ఈ ప్రకటన ఆయన చేసేటప్పుడు పరలోక దూతగణాలు తమతమ కిరీటాలు తీసి పక్కన పెద్దారు. “అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుదుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము” ప్రకటన 22:11. ప్రతీ కేసు జీవానికో మరణానికో నిర్ధారించటం జరుగుతుంది. క్రీస్తు తన ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి వారి పాపాలు తుడిచివేశాడు. ఆయన రాజ్యపౌరుల సంఖ్యను కూడా నిర్ధారించటం జరిగింది. “ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును ” రక్షణకు అర్హులైన భక్తులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. యేసు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పరిపాలన చేయనున్నాడు.GCTel 579.2

    ఆయన గుడారాన్ని విడిచి పెట్టినప్పుడు భూనివాసుల్ని అంధకారం అలము కొంటుంది. ఆ భయంకర సమయంలో నీతిమంతులు పరిశుద్ధ దేవుని సముఖంలో విజ్ఞాపకుడు లేకుండా నివసించాలి. దుర్మార్గులపై ఉన్న అదుపు తొలగిపోతుంది. పశ్చాత్తాపం లేని దుష్టులపై సాతానుకు సంపూర్ణ నియంత్రణ లభిస్తుంది. దేవుని దీర్ఘశాంతం అంతమొందుతుంది. ప్రపంచం ఆయన కృపను విసర్జించి ఆయన ప్రేమను తోసిపుచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని కాళ్లతో తొక్కుతుంది. దుష్ట జనులు కృప అవధుల్ని దాటిపోతారు. పదే పదే తృణీకరించబడ్డ దైవాత్మ చివరికి ఉపసంహరించబడుంది. దైవ కృప నీడలేనందున వారికి సాతాను నుంచి పరిరక్షణ ఉండదు. అప్పుడు సాతాను ప్రపంచ ప్రజలకు ఆఖరి శ్రమలు కలిగిస్తాడు. దేవదూతలు మనుషుల ఆగ్రహావేశాల్ని అదుపులో ఉంచటం మానేస్తారు గనుక సంఘర్షణకు అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచ మంతా నాశనానికి సిద్ధమవుతుంది. అది యెరూషలేముకు వాటిల్లిన నాశనంకన్నా మిక్కిలి భయంకరంగా ఉంటుంది.GCTel 580.1

    ఒక దేవదూత ఐగుప్తీయుల మొదటి సంతానాన్ని నాశనం చేసి ప్రజల్ని దుఃఖంలో ముంచగలిగాడు. దావీదు ప్రజల్ని లెక్కించి దేవుని కోపం రేపినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక దేవదూత గొప్ప నాశనం కలిగించాడు. దేవుడు ఆదేశించగా పరిశుద్ధ దూతలు కలిగించిన నాశనం వంటి నాశనాన్నే దేవుడు అనుమతించినప్పుడు దుష్ట దూతలు కలిగిస్తారు. నేడు అన్ని చోట్లా విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్న శక్తులున్నాయి. అవి దేవుని అనుమతి కోసం వేచి వున్నాయి.GCTel 580.2

    దైవ ధర్మశాస్త్రాన్ని గౌరవించే ప్రజల్ని ప్రపంచం మీదికి దేవుని తీర్పులు తెచ్చే ప్రజలని నిందిస్తారు. లోకంలో ఎంతో దుఃఖానికి హేతువవుతున్న ప్రకృతి వైపరీత్యాలకు, సంఘర్షణలకు, రక్తపాతాలకు వారే కారణమని పరిగణిస్తారు. చివరి హెచ్చరికా వర్తమానాన్ననుసరించే మహా శక్తి దుర్మార్గులకు ఎంతో ఆగ్రహం పుట్టిస్తుంది. ఆ వర్తమానాన్నందుకొన్న వారందరిపట్ల వారి కోపం రగులుతుంది. సాతాను వారి ద్వేషాన్ని, హింసాప్రవృత్తిని ఉదృతం చేస్తాడు.GCTel 580.3

    యూదు జాతి నుంచి దేవుని సముఖం చివరగా ఉపసంహరించటం జరిగినప్పుడు అది యాజకులకు ప్రజలకు తెలియలేదు. సాతాను నియంత్రణ కింద ఉన్నప్పటికీ, తీవ్రమైన ఉద్రేకాలకు బానిసలై ఉన్నప్పటికీ తామింకా దేవుడు ఎన్నుకొన్న ప్రజలమే అని ఆ ప్రజలు భావించారు. గుడార పరిచర్య కొనసాగుతూనే ఉన్నది. అపవిత్ర బలిపీఠాలపై బలులర్పించటం సాగుతూనే ఉంది. దేవుని ప్రియకుమారుని రక్తాన్ని చిందించటానికి బాధ్యులైన వారిమీద, దైవ సేవకుల్ని అపోస్తలుల్ని చంపటానికి చూస్తున్న ప్రజల మీద దైవ దీవెనల కుమ్మరింపును కోరటం ప్రతీ దినం జరుగుతూనే ఉంది. అలాగే మార్పులేని పరలోక గుడారపు తీర్మానం వెలుపడటం, లోక ప్రజల భవితవ్యం నిర్ణయమవటం జరిగినప్పుడు దాని గురించి లోక ప్రజలకు ఏమీ తెలియదు. దేవుని ఆత్మను పోగొట్టుకొన్న ప్రజలు నామమాత్రపు మతాచారాల్ని కొనసాగిస్తారు. సాతాను తన కార్యసిద్ధి కోసం తన దుష్ట ప్రణాళికల్ని అనుసరించటానికి ప్రజల్లో పుట్టించే ఉత్సాహం దైవ సేవ నిమిత్తం చోటు చేసుకొనే ఉత్సాహంలా పైకి కనిపిస్తుంది.GCTel 580.4

    సబ్బాతు క్రైస్తవ లోకమంతటా వివాదాంశం అయినందువల్ల ఆదివారాచారణ అషులుకు మత లౌకిక అధికారాలు చేతులు కలిపి కృషి చేస్తున్నందువల్ల అధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైన అంశాన్ని కొద్దిమంది సభ్యులు గల ఒక వర్గం వ్యతిరేకించటం ప్రపంచమంతటా విద్వేషాన్ని పుట్టిస్తుంది. సంఘ సిద్ధాంతాన్ని ప్రభుత్వ శాసనాన్ని వ్యతిరేకించే ఆ చిన్న వర్గాన్ని ఉపేక్షించకూడదని, దేశం యావత్తు గందరగోళ పరిస్థితులకు అరాచకత్వానికి గురి అవటం కన్నా, ఆ కొద్దిమంది వ్యక్తులు బాధపడటం మేలని కొన్ని అభిప్రాయలు వ్యక్తమౌతాయి. పద్దెనిమిది వందల సంవత్సరాల కిందట “ప్రజాపాలకులు” క్రీస్తుకు వ్యతిరేకంగా ఇవేవాదనలను తెచ్చారు. “మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తము” అన్నాడు కయప. యోహాను 11:50. ఇది తిరుగులేని వాదనగా కనిపిస్తుంది. నాలో ఆజ్ఞ పేర్కొంటున్న సబ్బాతును ఘనపర్చే ప్రజలకు వ్యతిరేకంగా శాసనం చివరగా వెలువడుంది. అట్టివారు అతికఠిన శిక్షకు అర్హులని ఆ శాసనం పేర్కొంటూ కొంత కాల వ్యవధి అనంతరం వారిని ప్రజలే చంపవచ్చునన్న స్వేచ్చను ప్రకటిస్తుంది. పాత ప్రపంచంలో రోమను మతం నవీన ప్రపంచంలో ప్రొటస్టాంట్ మతం దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న ప్రజల పట్ల అదే విధానాన్ని అవలంబించింది.GCTel 581.1

    అప్పుడు యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినంగా ప్రవక్త వర్ణించిన శ్రమలు దైవ ప్రజల మీద విరుచుకు పడ్డాయి. “యెహోవా యిట్లనెను- సమాధానము లేని కాలమున భీతిచేతను దిగులుచేతను కేకవేయగా వినుచున్నాము... వారి ముఖములు తెల్లబారుట నాకు కనబడుచున్నవేమి? అయ్యో యెంత భయంకరమైన దినము. అట్టి దినము మరి యొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు. దినము. అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు” యిర్మీయా. 30:5-7.GCTel 581.2

    యాకోబు ఏశావు చేతి నుంచి విముక్తి కోసం ప్రార్ధనలో రాత్రంతా శ్రమననుభవిస్తూ సల్పిన పోరాటం (ఆదికాండం 38:2430) శ్రమకాలంలో దేవుని ప్రజలకు కలుగనున్న అనుభవానికి సంకేతం తండ్రి ఏశావుకు ఉద్దేశించిన దీవెనల్ని పొందటానికి యాకోబు మోసం చేశాడు గనుక ప్రాణాలు తీస్తానన్న బెదరింపులకు జడిసి యాకోబు పారిపోయాడు. అనేక సంవత్సరాలు ప్రవాసంలో గడిపిన తర్వాత దేవుని ఆదేశం మేరకు భార్యలు బిడ్డలతో కలిసి స్వదేశానికి తిరిగి రావటానికి యాకోబు పయనమయ్యాడు. స్వదేశ పొలిమేరలకు వచ్చినప్పుడు కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో యుద్ధశూరుల్ని వెంటబెట్టుకొని ఏశావు వస్తున్నాడన్న వార్త విని యాకోబు భయ కంపితుడయ్యాడు. నిరాయుధులు, నిస్సహాయులు అయిన యాకోబు పరివారం దౌర్జన్యానికి నరమేధానికి గురికావటం ఖాయమనిపించింది. ఆత్మ నిరసన యాకోబు భయాందోళనల్ని ఇనుమడింపజేస్తున్నది. ఎందుకంటే అతను ఎదుర్కొంటున్న అపాయం తాసు చేతులారా సృష్టించుకొన్నదే. కేవలం దేవుని కృపే అతనికి శరణ్యం. ప్రార్ధనే అతని రక్షణ కవచం. అయినా అన్నకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చెల్లించి పొంచివున్న ప్రమాదం నుంచి తప్పించుకొనే దిశగా వ్యక్తిగతంగా చేయ గలిగినదంతా చేశాడు యాకోబు. శ్రమకాలం సమీపించే కొద్దీ క్రీస్తు అనుచరులు ప్రజల ముందు సరియైన జీవితం జీవిస్తూ మనస్సాక్షి స్వాతంత్ర్యానికి హానికలిగించే దురభిమానాన్ని అధిగమించాలి.GCTel 582.1

    తన మానసిక క్షోభను కుటుంబ సభ్యులు చూడకూడదన్న ఉద్దేశంతో వారిని దూరంగా పంపి దేవుని ముందు విజాపన చేసేందుకు యాకోబు ఒంటరిగా ఉన్నాడు. తాను చేసిన పాపానికి క్షమాపణ వేడుకొన్నాడు. తన పట్ల దేవుడు చూపిన కృపకు కృ తజ్ఞతలు తెలుపుకొంటూ తన తండ్రులతోను, బేతేలు వద్దా తాను పరదేశిగా ఉన్న దేశంలోను ఆయన చేసిన నిబంధన అమలుకు విజ్ఞాపన చేశాడు. తన జీవితంలో సంక్షోభం ఏర్పడింది. చుట్టూ అపాయం పొంచి ఉంది. ఆ చీకటిలో ఆ ఏకాంతంలో ప్రార్ధన చేస్తూ దేవునిముందు వినయమనస్సుతో నిలిచాడు. ఆకస్మాత్తుగా ఒక చెయ్యి అతని భుజం మీద పడింది. శత్రువు తన ప్రాణం తీయజూస్తున్నాడని భావించి తన శక్తి మేరకు ఆ వ్యక్తితో పోరాడనారంభించాడు. తెల్లవారటం మొదలుకాగానే ఆ పరాయి వ్యక్తి తన మానవాతీత శక్తిని ప్రదర్శించాడు. అతని తాకిడికి బలాడ్యుడైన యాకోబు కదలలేక పోయాడు. నేలకు ఒరిగాడు. నిస్సహాయుడై ఏడుస్తూనే వేడుకొంటూ ఆ విచిత్ర ప్రత్యర్థి కాళ్ల మీద పడ్డాడు. తాను పెనుగులాడున్నది దేవుని నిబంధన దూతతోనని యాకోబుకి ఇప్పుడు అర్ధమయ్యింది. వికలాంగుడై గొప్ప బాధలో ఉన్నప్పటికీ పోరాటం మానలేదు. తన పాపం నిమిత్తం ఆందోళన సంతాపం శ్రమ దీర్ఘ కాలంగా అనుభవిస్తున్నాడు. ఆ పాపం క్షమించబడిందని ఇప్పుడు అతనికి నిశ్చయత కావలసి వచ్చింది. ఆ దూత వెళ్లిపోవటానికి సమయం వచ్చింది. కాని యాకోబు ఆయనను విడిచి పెట్టటం లేదు. తనను దీవించుమని బతిమాలుతున్నాడు. “తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్ము” అని దూత అనగా “నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనియ్యను” అని సమాధానమిచ్చాడు. ఇక్కడ గొప్ప విశ్వాసం, దృఢత్వం, సహనం కనిపిస్తున్నాయి. అవి డంబం అహంభావంతో కూడిన మాటలైతే యాకోబు అక్కడికక్కడే మరణించి ఉండేవాడు. కాని యాకోబు మాటలు తన బలహీనతను అయోగ్యతను ఒప్పుకొని నిబంధనను కాపాడే దేవుని కృపను నమ్ముకొన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న నిశ్చయతను మాటలు.GCTel 582.2

    “అతడు దూతతో పోరాడి జయమొందెను” హోషేయ 12:4. అవమానం, పశ్చాత్తాపం, ఆత్మసమర్పణ ద్వారా ఈ పాపి తప్పుల కుప్ప అయిన మనిషి పరలోకాధినేతపై జయమొందాడు. వణుకుతున్న చేతితో దైవ వాగ్దానాల్ని అందుకొన్నాడు. అనంత ప్రేమా హృదయం పాపి మనవిని కాదనలేకపోయింది. తన విజయానికి నిదర్శనగా, తన ఆ దర్శాన్ని అనుకరించటానికి ఇతరులకు ప్రోత్సాహకంగా తన పాపాల్ని గుర్తుచేసే దాన్నుంచి తన విజయానికి ప్రతీకగా నిలిచే దానిగా యాకోబు పేరును దేవుడు మార్చాడు. యాకోబు దేవునిపై విజయం సాధించటం మనుషులపై విజయసాధన నిశ్చయతకు సంకేతం. అన్న ఆగ్రహాన్ని ఎదుర్కోటానికి యాకోబు ఏ మాత్రం జంకలేదు. ఎందుచేతనంటే ఇప్పుడు దేవుడే అతని రక్షక దళం.GCTel 583.1

    యాకోబు చేసిన పాపం కారణంగా అతన్ని నాశనం చేసే హక్కు తనకున్నదని సాతాను దేవునిముందు దూతలముందు యాకోబును తప్పుపట్టాడు. యాకోబుపై దాడి చేయటానికి ఏశావును ఎగదోశాడు. యాకోబును నిరుత్సాహపర్చి దేవునిపై నమ్మకాన్ని సడలింపజేయటానికి తన అపరాధాన్ని అతని దృష్టికి తేవటానికి శాయశక్తులా కృషి చేశాడు. యాకోబు నిరాశతో దాదాపు నీరుకారిపోయాడు. దేవుని సహాయం లేకపోతే తనకు నాశం తప్పదని యాకోబు గుర్తించాడు. తాను చేసిన ఘోర పాపాన్ని గురించి పశ్చాత్తాపపడి దేవుని కృపకోసం విజ్ఞాపన చేశాడు. తన సంకల్పాన్ని విడిచి పెట్టకుండా దూతను గట్టిగా పట్టుకొని విలపిస్తూ తన వినతిని మన్నించుమంటూ విజ్ఞాపన చేశాడు.GCTel 583.2

    యాకోబుమీద దాడి చేయటానికి ఏశావును పురికొల్పినట్లే ఆ ఆపత్కాలంలో దైవ ప్రజల్ని నాశనం చేయటానికి సాతాను దుర్మారుల్ని పురికొల్పుతాడు. యాకోబుపై నిందారోపణలు చేసినట్లే దైవ ప్రజలపైనా నిందలు మోపుతాడు. ప్రపంచ ప్రజల్ని తన ప్రజలుగా పరిగణిస్తాడు. కాగా దేవుని ఆజ్ఞలు కాపాడే ఆ చిన్న వర్గం మాత్రం అతని ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తుంది. వారిని ఈ లోకంలో లేకుండా చేస్తే అతని విజయం సంపూర్ణ మవుతుంది. వారిని దేవదూతలు కాపాడున్నారని దాన్ని బట్టి వారి పాపాలు క్షమించబడ్డాయని అతను గ్రహిస్తాడు. అయితే పరలోకంలో ఉన్న గుడారంలో వారి కేసులు తీర్మానం అయ్యాయని అతనికి తెలియదు. తాను శోధించి వారితో చేయించిన పాపాలేమిటో అతనికి కచ్చితంగా తెలుసు. పాపాల్ని కొండంతలు చేసి వారు కూడా తనలాగే పాపులు కావడం వల్ల ఆయన కృపకు అర్హులు కారని దేవుని ముందు వాదిస్తాడు. వారి పాపాలు క్షమించి తనను తన అనుచర దుష్ట దూతల్ని నాశనం చేయటం దేవునికి న్యాయం కాదని వాదిస్తాడు. అందునుబట్టి వారు తనకు చెందిన వారని చెబుతూ తాను నాశనం చేసేందుకు వారిని తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తాడు.GCTel 583.3

    దైవ ప్రజల పాపాల నిమిత్తం సాతాను నిందలు మోపుతున్నందున వారిని కఠినంగా పరీక్షించటానికి దేవుడు అతనికి అనుమతి నిస్తాడు. దేవునిపై వారికున్న నమ్మకం, వారి విశ్వాసం, స్థిరత్వం కఠిన పరీక్షకు గురి అవుతాయి. గతాన్ని నెమరు వేసుకొన్నప్పుడు వారి ఆశలు అడుగంటుతాయి. తమ జీవితాల్లో ఏమంచీ కనిపించదు. తమ బలహీనతలేంటో అనర్హతలేంటో వారికి బాగా తెలుసు. తమ పరిస్థితి ఆశాజనకంగా లేదన్న భావనను, తమ అపవిత్రత డాగు తుడుపు పడటం ఎన్నటికీ జరగని పని అన్న భావనను పుట్టించటానికి సాతాను ప్రయత్నిస్తాడు. వారి విశ్వాసాన్ని నాశనం చేసి తద్వారా వారిని తనశోధనలతో లొంగదీసి దేవునికి దూరం చేయాలన్నది అతని ఆశాభావం.GCTel 584.1

    తమను నాశనం చేయాలని కనిపెడున్న ప్రజలు తమ చుట్టూ ఉన్నా దైవ ప్రజల బాధ సత్యం నిమిత్తం హింసకు గురికావలసి వస్తుందన్నది కాదు. ప్రతీ పాపాన్ని ఒప్పుకోలేదేమోనని తమలోని ఏదో లోపం వల్ల ప్రభువు చేసిన ఈ వాగ్దాన సాఫల్యాన్ని పొందలేమేమోనని వారు భయపడ్డారు. ‘లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను” ప్రకటన 3:10. క్షమాభిక్ష లభిస్తుందన్న నిశ్చయత ఉంటే హింసకుగాని, మరణానికిగాని వారు వెనుదీయరు. అయితే తమ సొంత ప్రవర్తనా దోషాలవల్ల అనర్హులైన వారు తమ ప్రాణాలు పోగొట్టుకుంటే అప్పుడు దేవుని పరిశుద్య నామం నిందకు గురి అవుతుంది.GCTel 584.2

    అన్నిచోట్లా దేశద్రోహ కుట్రల గురించి వారు వింటారు. తిరుగుబాటు కార్యకలాపాలు చూస్తారు. ఈ భ్రష్టత అంతమౌతుందని దుష్టుల దుర్మారతకు తెరపడుందని వారిలో బలమైన ఆశ రేకెత్తుతుంది. తిరుగుబాటును ఆపుమని వారు దేవునికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ వరద వలె లేస్తున్న దుర్మార్గతను అడ్డుకోటానికి దాన్ని వెనుకకు మళ్లించటానికీ తమకు ఏమీ శక్తిలేదన్న ఆత్మ నిందతో వారు చేసే విజ్ఞప్తి అది. వారు తమ శక్తి సామర్థ్యాల్ని ఎల్లప్పుడూ క్రీస్తు పరిచర్యకే వినియోగిస్తూ బలం పొందుతూ ముందుకు సాగుతుంటే వారిని జయించటానికి సాతాను అనుచరణగణానికి శక్తి ఉండదు.GCTel 584.3

    తమ అనేక పాపాల నిమిత్తం గతంలో తాము వ్యక్తం చేసిన పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తూ, ప్రభువిచ్చిన ఈ వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని, వారు దేవుని ముందు దు:ఖా క్రాంతులవుతారు. “ఈలాగు జరుగకుండునట్లు జనులునన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధానపడవలెను. వారు నాతోసమాధానపడవలెను” యెషయా 27:5. తమ ప్రార్థనలకు వెంటనే జవాబు రానందుకు వారి విశ్వాసం సన్నగిల్లదు. తీవ్ర ఆందోళన, భీతి, దుఃఖం అనుభవిస్తూ ఉన్నా వారు తమ విజ్ఞాపన ప్రార్ధనలు మానరు. యాకోబు దూతను ఆశ్రయించినట్లు వారు దేవున్ని ఆశ్రయిస్తారు. “నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనివ్వను” అన్న భాషనే వారి ఆత్మ మాట్లాడుంది.GCTel 585.1

    జ్యేష్ఠత్వాన్ని వంచన ద్వారా సంపాదించి చేసిన పాపాన్ని యాకోబు ముందే ఒప్పుకొని క్షమాభిక్ష వేడుకొని ఉండకపోతే దేవుడు అతని ప్రార్ధనను ఆలకించేవాడు కాదు. అతని ప్రాణాల్ని కాపాడే వాడూ కాదు. అదే విధంగా శ్రమ కాలంలో హింస, భీతి, బాధ గుప్పెట్లో ఉన్నప్పుడు తాము ఒప్పుకోకుండా ఉన్న పాపాలు దైవ ప్రజలకు తమ కళ్లముందు ఆడుతుంటే వారు నిస్పృహకు లోనవుతారు. ఆ నిస్పృహ వారి విశ్వాసాన్ని ఆర్పివేస్తుంది. విడుదల కోసం దేవునితో విజ్ఞాపన చేయటానికి వారికి ధైర్యం చాలదు. తమ అయోగ్యతను గూర్చిన స్పృహ ఉంటుందిగాని బహిర్గతం కావలసిన రహస్య పాపాలు వారి కుండవు. అవి ముందే తీర్పులో పరిగణనకు రావటం, క్షమాపణ పొంది తుడుపు పడటం జరిగింది. అవి వారికి జ్ఞాపకానికి రావు.GCTel 585.2

    జీవితంలోని చిన్నా చితకా విషయాల్లో పొరపాట్లను దేవుడు పట్టించుకోడని నమ్మటానికి సాతాను అనేకుల్ని నడిపిస్తాడు. కాని యాకోబుతో వ్యవహరించిన తీరులో తాను ఏరూపంలోనూ పాపాన్ని అంగీకరించనని, సహించనని దేవుడు స్పష్టంచేశాడు. సాకులు చెప్పటం కప్పిపుచ్చటం ద్వారా తమ పాపాల్ని ఒప్పుకోకుండా వాటికి క్షమాపణ పొందకుండా పరలోక గ్రంథాల్లో మిగిలిపోనిచ్చే వారందరిపైన సాతాను విజయం సాధించటం తథ్యం. వారి ఒప్పుకోలు ఎంత ఉన్నతం, వారి హోదా ఎంత గౌరవప్రదం అయితే దేవుని దృష్టిలో వారి మార్గం అంత అపాయకరం అవుతుంది. వారి విరోధి సాతాను విజయం అంత నిశ్చితం అవుతుంది. దేవుని దినం కోసం సిద్ధబాటును ఆలస్యం చేసేవారు ఆ సిద్ధబాటును శ్రమ కాలంలోగాని తర్వాత మరే సమయంలోగాని సాధించలేరు. అట్టివారి పరిస్థితి విచారకరం.GCTel 585.3

    సిద్ధబాటు లేకుండా ఆ చివరి భయంకర సంఘర్షణ వరకూ వచ్చే నామమాత్ర క్రైస్తవులు తామున్న దుస్థితిలో ఎంతో బాధను వ్యక్తపర్చే మాటల్లో తమ పాపాలు ఒప్పుకొంటుంటే దుష్టులు వారి దుస్థితికి సంతోషిస్తారు. ఈ ఒప్పుకోళ్లు ఏశావు లేదా యూదా ఒప్పుకోళ్లు వంటివి. అలాంటి ఒప్పుకోళ్లు చేసేవారు పాప పర్యవసానాలకు చింత పడ్డారే గాని దాని దుష్టత్వం నిమిత్తం కాదు. పాపం నిమిత్తం యధార్ధ సంతాపం చెందరు. పాపాన్ని అసహ్యించుకోరు. వారు శిక్షకు జడిసి తమ పాపాల్ని ఒప్పుకొంటారు. కాని పూర్వం ఫరోమల్లే శిక్ష తొలగి పోగానే దైవ ధిక్కారానికి తిరిగి పూనుకొంటారు.GCTel 586.1

    మోసపోయిన వారిని, శోధనకు లోనై పాపంలోపడి యధార్థ పశ్చాత్తాపంతో తన వద్దకు తిరిగి వచ్చిన వారిని దేవుడు విసర్జించడని యాకోబు చరిత్ర భరోసా ఇస్తున్నది. ఈ తరగతి ప్రజల్ని నాశనం చేయటానికి సాతాను ప్రయత్నిస్తుండగా క్లిష్ట పరిస్థితుల్లో వారిని ఓదార్చి పరిరక్షించటానికి దేవుడు తన దూతల్ని పంపుతాడు. సాతాను భయంకరమైన దాడులు జరుపుతాడు. అతను గొప్ప మోసగాడు. అయితే ప్రభువు నేత్రం ఆయన ప్రజల మీద ఉంటుంది. ఆయన చెవి తన ప్రజల కేకలు వింటుంది. వారి శ్రమలు తీవ్రమైనవి. అగ్నిగుండపు మంటలు వారిని దహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే ఆ కంసాలి వారిని అగ్నిలో పుటం వేసిన బంగారంలా తీర్చి దిద్దుతాడు. దేవుని బిడ్డలకు వచ్చే అతికఠిన శ్రమల కాలంలో వారిపట్ల ఆయన ప్రేమ వారు సుఖసంతోషాల్లో వృద్ధి చెందిన దినాల్లో మల్లే గాఢంగా సున్నితంగా ఉంటుంది. కాగా వారు అగ్నిగుండంలో బాధ అనుభవించటం అవసరం. క్రీస్తు స్వరూపాన్ని వారు పరిపూర్ణంగా ప్రతిబింబించేందుకు వారి లౌకికత్వం కాలిపోవాలి.GCTel 586.2

    మన ముందున్న శ్రమలు దుఃఖాల కాలం, అలసట, ఆలస్యం ఆకలిని సహించగలిగే విశ్వాసాన్ని, కఠిన పరీక్ష వచ్చినప్పుడు సొమ్మసిల్లి పడకుండా నిలబడే విశ్వాసాన్ని కోరుతుంది. ఆ కాలం కోసం సంసిద్ధమవ్వటానికి గాను అందరికీ కృపకాలం ఏర్పాటయ్యింది. తన సహన శీలం దృఢసంకల్పం కారణంగా యాకోబు విజయం సాధించాడు. అతని విజయం ఎడతెగని ప్రార్థన శక్తికి నిదర్శనం. యాకోబుమల్లే దేవుని వాగ్దానాల్ని విశ్వసించి అతని మల్లే చిత్తశుద్ధి సహనశీలత కలిగి జీవించేవారందరూ అతనిలాగే చివరి విజయం సాధిస్తారు. స్వారాన్ని ఉపేక్షించని వారు, హృదయ వేదనతో దేవుని ముందు నిలబడని వారు, దైవ దీవెసల కోసం దీర్ఘంగా నిజాయితీగా ప్రార్ధించని వారు విజయం పొందలేరు. దేవునితో పోరాడటమంటే ఏంటో తెలిసిన వారు ఎంత తక్కువ మంది! తమ పూర్ణ హృదయంతో తమ సర్వశక్తుల్ని కేంద్రీకరించి దేవుడు కావాలని కోరేవారు ఎంత కొద్దిమంది! వర్ణనాతీతమైన నిస్పృహ కెరటాలవలె ప్రార్థించే వ్యక్తి మీద పడినప్పుడు దేవుని వాగ్దానాల్ని అచంచల విశ్వాసంతో నమ్మేవారు ఎంత కొద్దిమంది!GCTel 586.3

    ఇప్పుడు విశ్వసించని వారు సాతాను మోసాలకు మనస్సాక్షిని ఒత్తిడి చేసే అధికారానికి గురి అయ్యే ప్రమాదంలో ఉన్నారు. ఆ పరీక్షలో వారు గెలిచినప్పటికీ శ్రమకాలంలో వారికి తీవ్రమైన ఆవేదన దుఃఖం ఎదురవుతాయి. ఎందుకంటే దేవునిపై నమ్మకముంచే అలవాటు వారికి లేదు. అశ్రద్ధచేసి తాము నేర్చుకోని విశ్వాస పాఠాలు భయంకరమైన నిరుత్సాహపు ఒత్తిడి కింద వారు నేర్చుకోవాల్సి వుంటుంది.GCTel 587.1

    ఆయన వాగ్దానాల్ని నిరూపించటం ద్వారా ఇప్పుడు మనం దేవునితో పరిచయం ఏర్పరచుకోవాలి. దేవునితో మాట్లాడటం మానటం కన్నా స్వార్థాశలు ఆసక్తులు విడిచిపెట్టుకోవాలి. ఆయన ఆమోదం లేని సంపద, ప్రతిష్ఠ, సుఖభోగాలు, స్నేహం కన్నా ఆయన ఆమోదమున్న తీవ్ర పేదరికం, ప్రచండ ఆత్మోపేక్ష ఎంతో మేలు. మనం ఎక్కువ సమయం ప్రార్ధనలో గడపాలి. మనం మన మనసుల్ని లోకాశల్లో చిక్కుకోనిచ్చినట్లయితే మనకు విగ్రహాలుగా పరిణమిస్తున్న బంగారం, ఇళ్లు, మళ్లు మాన్యాల్ని తీసివేయటం ద్వారా ప్రభువు మనకు సమయాన్ని ఇవ్వవచ్చు. GCTel 587.2

    తాము ఏ మార్గంలో దేవుని దీవెనలు కోరగలరో ఆ మార్గం తప్ప మరే మారాన్నీ అవలంబించటానికి యువత నిరాకరిస్తే వారిని ఎవరూ మోసంచేసి పాపంలోకి దింపలేరు. చివరి హెచ్చరికా వర్తమానాన్ని ప్రకటించే వారు దైవదీవెనల కోసం ప్రార్ధిస్తేఉత్సాహరహితంగా, నిస్సారంగాకాక యాకోబు వలే పట్టుదలతో విశ్వాసంతో ప్రార్ధిస్తేవారు ఇలా చెప్పగలిగే స్థలాలు వారికెన్నో లభిస్తాయి, “నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినది” ఆదికాండము 32:30. దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచిన యువరాజులుగా దేవుడు వారిని పరిగణిస్తాడు.GCTel 587.3

    “ఎన్నటికిని కలుగనంత ఆపద” త్వరలో మనమీద పడనుంది. మనకు ఇప్పుడు లేని అనుభవం అవసరమౌతుంది. సోమరులై ఉన్నందుకు దాన్ని చాలా మంది గడించలేకపోతున్నారు. వాస్తవంగా వచ్చినప్పటికన్నా ఎదురు చూస్తున్నప్పుడు శ్రమ ఎక్కువ భాధాకరంగా ఉంటుంది. కాని మనముందున్న శ్రమ విషయంలో ఇది నిజంకాదు. ఈ శ్రమ స్వరూప స్వభావాల్ని అతి స్పష్టమైన వర్ణన కూడా విషదం చేయలేదు. ఆ ఆపద మయంలో ప్రతీ ఆత్మ దేవుని ముందు నిలబడవలసి ఉంది. “నోవహును దానియేలును యోబును” ఆ దేశంలో ఉన్నా, ‘’నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు” యెహేజ్కేలు 14:20.GCTel 587.4

    మన ప్రధాన యాజకుడు మన కోసం ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తుండగా మనం క్రీస్తులో పరిపూర్ణులం కావటానికి ప్రయత్నించాలి. మన రక్షకుడు శోధనకు లొంగటమన్నది తలంపులో కూడా సాధ్యంకాని పని. మానవ హృదయాల్లో సాతానుకు చోటు దొరికే అంశం ఏదో ఉంటుంది. ఏదో పాప వాంఛ చోటుచేసుకొంటుంది. దాని ద్వారా అతని శోధించటానికి స్థానం దొరుకుతుంది. క్రీస్తు తన్ను గురించి తాను ఇలా అన్నాడు, “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియు లేదు.” యోహాను 14:30. తనకు విజయం చేకూర్చే లక్షణం దైవ కుమారునిలో సాతానుకి కనిపించలేదు. ఆయన తన తండ్రి ఆజ్ఞల్ని ఆచరించాడు. సాతాను ఉపయోగించుకోటానికి ఆయనలో పాపం లేదు. ఆ ఆపత్కాలంలో నిలవాలనే దైవ ప్రజల పరిస్థితి ఇలా పరిశుద్ధంగా ఉండాలి.GCTel 588.1

    క్రీస్తు రక్తం ప్రాయశ్చిత్తం కూర్చుతుందని విశ్వసించి ఈ జీవితంలోనే మనం పాపానికి దూరంగా వుండాలి. మనం తనతో ఏకం కావలసిందిగా వాంచిస్తూ, మన బలహీనతను తన బలంతో, మన అజ్ఞానాన్ని తన జ్ఞానంతో మన అయోగ్యతను తన యోగ్యతతో సంయుక్తం చేయవలసిందిగా మన ప్రశస్త రక్షకుడు ఆహ్వానిస్తున్నాడు. దైవ సంకల్పమన్న పాఠశాలలో మనం నేర్చుకోవలసిన పాఠాలు యేసు సాత్వికం, యేసు వినయమనసు, మనం ఎంపిక చేసుకొనే సులువైన, ఆహ్లాదకరమైన మార్గం గాక ప్రభువు మన ముందు ఉంచుతున్న యాధార్ధ జీవిత లక్ష్యాన్ని ఉంచుతున్నాడు. దేవుడు ఏర్పాటుచేసిన ఆదర్శాన్ననుసరించి మన ప్రవర్తనలను రూపుదిద్దుకొనే ప్రక్రియలో ఆయన నియమించిన సాధనాల్ని వినియోగించుకోవటం మనపై ఉన్న బాధ్యత. ఈ పనిని అలక్ష్యం చేయటంగాని, వాయిదా వేయటంగాని చేయకూడదు. అది మన ఆత్మలకు గొప్ప ముప్పు.GCTel 588.2

    పరలోకంలో ఇలా ప్రకటిస్తున్న గొప్ప స్వరాన్ని అపోస్తలుడు యోహాను దర్శనంలో విన్నాడు, “భూమీ, సముద్రమూ, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీ యొద్దకు దిగి వచ్చి యున్నాడు” ప్రకటన 12:12. ఈ భక్తుడికి ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలు భయంకర దృశ్యాలు. తనకు ఎక్కువ సమయం లేకపోవటంతో సాతాను ఉగ్రరూపం ధరిస్తాడు. ఆ ఆపత్కాలంలో అతని వంచన, విధ్వంసం పరాకాష్ఠకు చేరాయి.GCTel 588.3

    అద్భుతకార్యాలు చేసే దయ్యాల శక్తివల్ల భయంకర, మానవాతీత దృశ్యాలు త్వరలో ఆకాశంలో కనిపిస్తాయి. ఆ దురాత్మలు ప్రపంచంలోని రాజుల్ని మోసగించి దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాతానుతో కలసి పోరాడటానికి వారిని సంఘటిత పర్చటానికి బయలుదేరాయి. పరిపాలకులు ప్రజలు ఈ దురాత్మల మోసాలకు పడిపోతారు. క్రీస్తు వేషం ధరించి ఆయనలా నటించే వ్యక్తులు బయల్దేరారు. లోక రక్షకుడు క్రీస్తుకు మాత్రమే చెందే ఘనత, పూజ తమకు చెల్లించాల్సిందిగా కోరారు. సూచక క్రియలు చేసి స్వస్థత చేకూర్చుతారు. తమకు దేవుని వద్ద నుంచి ఆత్మావేశం వచ్చిందని చెబుతూ లేఖన సాక్ష్యాన్ని తప్పు పడ్డారు.GCTel 589.1

    ఈ మహా వంచన నాటకంలో చరమాంకం స్వయాన సాతానే క్రీస్తులా వేషం ధరించటం. రక్షకుని రాకతో తన నిరీక్షణ సఫలమౌతుందని సంఘం దీర్ఘకాలంగా కనిపెడున్నది. ఇలా ఉండగా ఇప్పుడు ఆ నయవంచకుడు క్రీస్తు వచ్చేసినట్లు కనపర్చుతాడు. భూమిమీద ఆయా ప్రాంతాల ప్రజల మధ్య తేజోవంతమైన ప్రకాశతతో వెలుగుతున్న మహిమగల వ్యక్తిగా సాతాను తన్నుతాను కనపర్చుకొంటాడు. ప్రకటన గ్రంథంలో దైవ కుమారుడైన క్రీస్తును గురించి యోహాను చేసిన వర్ణనకు నప్పేటట్లు తన్నుతాను ప్రదర్శించుకొంటాడు. ప్రకటన 1:13-15. అతన్ని ఆవరించివుండే తేజస్సును మానవ నేత్రం ఎన్నడూ వీక్షించి ఉండదు. క్రీస్తు వచ్చాడు, క్రీస్తు వచ్చాడు” అన్న జయధ్యానాలతో దిక్కులు మారుమోగుతాయి. అతని ముందు ఆరాధన భావంతో ప్రజలు సాగిలపడుంటే ఈ లోకంలో నివసించినప్పుడు క్రీస్తు తన శిష్యుల్ని ఆశీర్వదించిన రీతిగా సాతాను చేతులు పైకెత్తి వారికి దీవెనలు ప్రకటిస్తాడు. అతని స్వరం మెత్తగా, సున్నితంగా, మధురంగా ఉంటుంది. ప్రభువు పలికిన పరమ సత్యాలు కొన్నింటిని మృదువుగా దయారసం ఉట్టిపడే విధంగా ప్రబోధిస్తాడు. ప్రజల వ్యాధులు బాగుచేస్తాడు. అనంతరం క్రీస్తుగా నటిస్తున్న అతను సబ్బాతును ఆదివారానికి మార్చినట్లు ప్రకటించి తాను ఆశీర్వదించిన ఆ దినాన్ని అందరూ పరిశుద్ధంగా ఆచరించాలని ఆదేశిస్తాడు. తన దూతలు అందించిన వెలుగును సత్యాన్ని తిరస్కరించి ఏడో దినాన్ని ఆచరించేవారు తన నామాన్ని దూషిస్తున్నారని ప్రకటిస్తాడు. ఇది అన్ని మోసాల్నీ తలదన్నిన మోసం. సీమోననే గారడీవానిచే మోసపోయిన సమరయ ప్రజల మల్లే ప్రజలు కొద్దివారేగాని, గొప్పవారేగాని అందరూ ఈ మంత్రాలు తంత్రాలకు ఆకర్షితులై ఇది “దేవుని మహాశక్తి” అని ఆశ్చర్యపడతారు. అ.కా. 8:10.GCTel 589.2

    దేవుని ప్రజలు మాత్రం ఈ తప్పుదారిని అనుసరించరు. ఈ నకిలీ క్రీస్తు బోధలు లేఖనానుసారంగా లేవు. అతను మృగాన్ని, మృగం విగ్రహాన్ని ఆరాధించే వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమీ కలపని దేవుని ఉగ్రత ఈ తరగతి ప్రజల మీద కుమ్మరించబడుందని బైబిలు స్పష్టంగా చెబుతున్నది. ఇంకో విషయం ఏమిటంటే క్రీస్తు రాకను అనుకరించటానికి సాతానుకి అనుమతిలేదు. ఈ విషయమై మోసపోవద్దని క్రీస్తు తన అనుచరుల్ని హెచ్చరించాడు. తన రాకడ తీరుతెన్నుల్ని గూర్చి ముందే విస్పష్టంగా తెలిపాడు: “అబద్దపు క్రీస్తులును అబద్దపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మాహత్కార్యములను కనపరచెదరు... కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి. ఇదిగో లోపలిగదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును” మత్తయి 24:2427; 31; 25:31. ప్రకటన 1:7; 1 థెస్సలో 4:16, 17. ఈ రాకడలో నకిలీకి అవకాశం లేదు. ఇది విశ్వమంతటికి బట్టబయలయ్యే విషయం. ప్రపంచమంతటికీ కళ్లకు కట్టినట్లు కనిపించే ఘటన.GCTel 590.1

    లేఖనాల్ని శ్రద్ధగా పఠించి సత్యం పట్ల ప్రేమను పెంచుకొన్న వారు మాత్రమే లోకాన్ని చెరపట్టే మోసాల్లో పడకుండా కాపుదల పొందుతారు. బైబిలు సాక్ష్యాన్ని బట్టి పేషం ధరించిన మోసగాణ్ణి వారు గుర్తుపడ్డారు. పరీక్షా సమయం అందరికీ వస్తుంది. శోధన జల్లింపుతో నిజమైన క్రైస్తవులెవరో తేలిపోతుంది. ఇప్పుడు దైవ ప్రజలు తమ ఇంద్రియ జ్ఞానాన్ని బట్టికాక దైవ వాక్యం మీద స్థిరంగా నిలకడగా బలంగా ఉన్నారా? అలాంటి క్లిష్ట పరిస్తితి ఏర్పడినప్పుడు బైబిలును మాత్రమేనమ్మగలరా? ఆ దినాన స్థిరంగా నిలబడటానికి అవసరమైన సిద్ధబాటును పొందకుండా సాధ్యమైతే వారిని తప్పుదారి పట్టించటానికి సాతాను విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. వారి మార్గాలకు అడ్డంకులు కల్పించటానికి, లోక భాగ్యంతో వారిని బంధించటానికి, ఈ లోక చింతలతో వారి మనసుల్ని అణగార్చి వారిపై ఆ పరీక్షా దినం దొంగవలె పడటానికి పరిస్థితుల్ని సమకూర్చుతాడు.GCTel 590.2

    ఆజ్ఞలు ఆచరించే ప్రజలకు వ్యతిరేకంగా క్రైస్తవ లోకంలోని వివిధ పరిపాలకులు జారీచేసే శాసనాలకు ప్రభుత్వ పరిరక్షణను ఉపసంహరిస్తూ తమను నాశనం చేయటానికి పూనుకొన్న శత్రువులకు తమను విడిచి పెట్టగా, దైవ ప్రజలు నగరాలు పట్టణాలు గ్రామాలు విడిచిపెట్టి ప్రజలులేని ఏకాంత స్థలాల్లో చిన్నచిన్న గుంపులుగా నివసిస్తారు. అనేకులకు పర్వతాల్లోని స్థలాలు ఆశ్రయదుర్గాలవుతాయి. పైడ్ మాంట్ లోయల్లో తలదాచుకొన్న క్రైస్తవుల వలే వారు భూమిపై ఉన్నత స్థలాల్ని మందిరాలు చేసుకొని ‘‘పర్వతములలోని శిలల” నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. యెషయా 33:16. అయితే అన్ని దేశాల్లోను అన్ని తరగతుల ప్రజల్లోను అధికుల్లోను అధముల్లోను, ధనికుల్లోను, దరిద్రుల్లోను, నల్లవారిలోను తెల్లవారిలోను అనేకమంది అన్యాయమైన క్రూరమైన దాస్యానికి గురిఅవుతారు. దేవుని ప్రియమైన బిడ్డలు బందీలై శ్రమలనుభవిస్తారు. మరణ శిక్ష కింద ఖైదుల్లో మగుతారు. కొందరు చీకటి కొట్లలో మరణించేందుకు మిగిలివుంటారు. వారి మూల్గులు వినటానికి ఎవరూ ఉండరు. సహాయం అందిచేవారు అసలే వుండరు.GCTel 590.3

    ఈ భయంకర గడియల్లో ప్రభువు తన ప్రజల్ని మర్చిపోతాడా? జలప్రళయ దినాల్లోని ప్రపంచంపై దేవుని తీర్పు పడ్డప్పుడు భక్తుడైన నోవాహును దేవుడు మర్చిపోయాడా? మైదానంలో ఉన్న పట్టణాల్ని దహించటానికి పరలోకం నుంచి అగ్ని దిగివచ్చినప్పుడు ఆయనలోతును మర్చిపోయాడా? ఐగుపులో విగ్రహారాధకులమధ్య నివసించిన యోసేపును మర్చిపోయాడా? బైలు ప్రవక్తలకు జరిగిందే తనకుకూడా జరుగుతుందని యెజెబెలు బెదరించినప్పుడు ఏలీయాను ఆయన మర్చిపోయాడా? చెరసాల చీకటి కొట్టులో మగ్గుతున్న యిర్మీయాను ఆయన మర్చిపోయాడా? అగ్ని గుండంలో ఉన్న ముగ్గురు యువకుల్నీ ఆయన మర్చిపోయాడా? లేదా సింహాలబోసులో ఉన్న దానియేలును ఆయన మర్చిపోయాడా?GCTel 591.1

    “అయితే సీయోను- యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు. ప్రభువునన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురుగాని నేను నిన్ను మరవను. చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి. యెషయా 49:14-16. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, “మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడు” జెకర్యా 2:8.GCTel 591.2

    శత్రువులు వారిని ఖైదులో వేసినా వారి ఆత్మలకు క్రీస్తుకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఖైదు గోడలు ఆపలేవు. వారి బలహీనతల్ని చూడగలిగినవాడు, ప్రతిశోధనను ఎరిగిన వాడు అయిన ప్రభువు లోక అధికారాలన్నింటికి పైగా ఉన్నాడు. పరలోకం నుంచి వెలుగును సమాధానాన్ని తెచ్చే దేవదూతలు వారి వద్దకు వస్తారు. ఐదు రాజభవనం అవుతుంది. ఎందుచేతనంటే విశ్వాసంలో భాగ్యవంతులు అక్కడ నివసిస్తారు. ఫిలిప్పులోని చెరసాలలో పౌలు, సీలలు మధ్యరాత్రిలో ప్రార్ధనచేసి స్తుతి గీతాలు పాడినప్పుడు సంభవించినట్లు చీకటి గదులు వెలుగుతో నిండుతాయి.GCTel 591.3

    దైవ ప్రజల్ని శ్రమలపాల్టేసి నాశనం చేయటానికి ప్రయత్నించే వారిని దేవుని తీర్పులు వెంటాడాయి. ఆయన దీర్ఘాశాంతాన్ని బట్టి దుర్మార్తులు దుష్క్రియలు చేయటంలో పేట్రేగి పోతారు. వారికి శిక్ష తప్పదు. అది భయంకరంగా వుంటుంది. ఎందుకంటే అది ఎన్నడో పడాల్సిన శిక్ష. “నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యకరమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తసకార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అసుకొండమీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.” యెషయా 28:21. దయకనికరాలు గల మన దేవుడు శిక్షించటం అపూర్వ కార్యమే. “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము పొందుటవలన నాకు సంతోషము లేదు.” యెహేజ్కేలు 33:11 ప్రభువు “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన వేయి వేలవుందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును “క్షమించును” గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. ” “యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు” నిర్గమకాండము 34:6,7; నహూము 1:3. అతిక్రమానికి తృణీకారానికి గురి అవుతున్న తన ధర్మశాస్త్రాధికారాన్ని తన భయంకర నీతి కార్యాల ద్వారా ఆయన నిరూపిస్తాడు. తీర్పును అమలుపర్చటానికి ఆయన చేస్తున్న ఆలస్యాన్ని బట్టి అతిక్రమాలకు పాల్పడేవారికి వేచి ఉన్న ప్రతి దండన ఎంత కఠోరమైనదో ఊహించవచ్చు. ఏ జాతి ప్రజల విషయంలో ఆయన ఎక్కువ సహనం పాటించి తన పరిగణనలో వారి పాపపు పాత్ర పూర్తిగా నిండే వరకు వారిని మొత్తడో ఆ ప్రజలు ఏమీ కలుపబడని దేవుని ఉగ్రత పాత్రలోని పానాన్ని చివరగా తాగుతారు.GCTel 592.1

    పరలోక గుడారంలో తన విజ్ఞాపన సేవలను క్రీస్తు ముగించినప్పుడు మృగానికి దాని ప్రతిమకు నమస్కారం చేసి ఆ ముజ్రను పొందేవారిపై వాక్యం చెబుతున్న ఉగ్రత కుమ్మరించబడుంది. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించటానికి దేవుడు సిద్ధమవుతున్నప్పుడు ఆ దేశం మీదికి ఆయన పంపిన తెగుళ్ళ వంటివే దేవుని ప్రజల చివరి విమోచనకు ముందు ప్రపంచంపై పడనున్న భయంకరమైన తీర్పులు. ఆ భయంకరమైన తెగుళ్లను వర్ణిస్తూ ప్రకటన గ్రంథ రచయిత ఇలా అంటున్నాడు, “ఆ క్రూరమృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను.” సముద్రము ” పీనుగు రక్తము వంటి దాయెను. అందువలనసముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను” “నదులు... జలధారలు... రక్తమాయెను” ఈ శిక్షలు భయంకరమైనవే అయినా దేవుని తీర్పుల న్యాయబద్ధతను రుజువుపర్చుతున్నాయి. దేవుని దూత ఇలా అంటున్నాడు, “పవిత్రుడా, పరిశుదుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే.” ప్రకటన 16:26. దైవ జనులకు మరణదండన విధించటంలో వారి ప్రాణాల్ని తమ సొంత చేతులతో తీసినంత దోషిత్వాన్ని వారు మూటకట్టుకొన్నారు. అలాగే హేబేలు నాటి నుంచి చిందించిన పరిశుద్ధుల రక్తం నిమిత్తం తన కాలంలోని యూదులు అపరాధులని క్రీస్తు ప్రకటించాడు. ఎందుకంటే వారిదీ ప్రవక్తల్ని చంపిన వారిదీ ఒకే స్వభావం. వారు చేసిన పనిని చేయటానికి వీరూ ప్రయత్నించారు.GCTel 592.2

    ఆ తరువాత వచ్చిన తెగుళ్ళలో “అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలి” పోయారు. 8,9 వచనాలు. ఈ భయంకర సమయంలో భూమి పరిస్తితిని ప్రవక్తలు ఇలా వర్ణిస్తున్నారు, “పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది., ధాన్యము నశించెను... తైల వృక్షములు వాడిపోయెను...నరులకు సంతోషమేమియు లేకపోయెను.” (విత్తనము మంటి పెద్దల క్రింద కుళ్ళిపోవుచున్నది. పైరు మాడిపోయినందునధాన్యపు కొట్టు వట్టివాయెను... మేతలేక పశువులు బహుగా మూలుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి మేతకు అలాడుచున్నవి... నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలి పోవుటయు” సంభవిస్తుండటంతో ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేవసగా మందిరములో వారు పాడుపాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును. ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి” యోవేలు 1:1012; 1720; ఆమోసు 8:3.GCTel 593.1

    ఈ తెగుళ్లు లోకవ్యాప్తం కావు. అలాగైతే భూనివాసులు పూర్తిగా నాశనమై పోయేవారు. అయినా ఆ తెగుళ్లు మనుషులు ఎన్నడూ కనివిని ఎరుగని అతిభయంకర వ్యాధులుగా పరిణమిస్తాయి. కృపకాలం ముగింపుకు ముందు దేవుని తీర్పులన్నీ కృపతో మిళితమై ఉన్నాయి. పాపి తన పాపానికి దీటైన శిక్షకు గురికాకుండా విజ్ఞాపనాత్మకమైన క్రీస్తు రక్తం కాపాడింది. కాని చివరి తీర్పులో కృపతో మిళితంకాని దేవుని ఉగ్రతకు పాపి గురి కావలసి ఉంటుంది.GCTel 593.2

    ఆ దినాన వేవేల ప్రజలు తాము దీర్ఘకాలంగా తృణీకరించిన దేవుని కృప నీడ రావటానికి తాపత్రయ పడ్డారు. “రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినక పోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కునుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురుగాని అది వారికి దొరకదు.” ఆమోసు 8:11,12.GCTel 594.1

    దైవ ప్రజలకు శ్రమలు కలుగుతాయి. అయితే వారు హింసకు దుఃఖానికి గురి అయినప్పుడు, ఆకలిగొని భోజనానికి అల్లాడేటప్పుడు మరణించటానికి వారిని దేవుడు విడిచి పెట్టాడు. ఏలీయాను సంరక్షించిన దేవుడు ప్రాణాలు త్యాగం చేస్తున్న తన బిడ్డల్లో ఒకరిని కూడా దాటిపోడు. తమ తల వెంట్రుకలెన్నో లెక్క తెలిసిన ఆ ప్రభువు వారిని సంరక్షిస్తాడు. కరవు వచ్చినప్పుడు వారిని తృప్తిపర్చుతాడు. దుష్టులు ఆకలితోను, తెగుళ్ళతోను మరణిస్తుండగా దేవదూతలు నీతిమంతుల్ని కాపాడి వారి అవసరాల్ని తీర్చుతారు.GCTel 594.2

    “నీతిని అనుసరించి నడచు” వ్యక్తికి ఈ వాగానం ఉన్నది, “తప్పక అతనికి ఆహారము దొరకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును” “దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను” యెషయా 33:15,16; 41:17.GCTel 594.3

    “అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకురాకపోయినను, గొట్టెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను” ఆయనను ప్రేమించేవారు “యెహోవాయందు ఆనందించెదరు” తమ రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషిస్తారు. హబక్కూకు 3:17,18.GCTel 594.4

    “యెహోవా నిన్ను కాపాడు వాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును.” (’వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును, డాలునై యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయిమంది పడినను నీ కుడి ప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతి ఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస్థలముగా చేసికొని యున్నావు. నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు” కీర్తనలు 121:5-7; 91:3-10.GCTel 594.5

    అయినప్పటికీ పూర్వం హతసాక్షుల వలే దైవ ప్రజలు తమ సాక్షాన్ని ప్రాణ త్యాగాలతో ఇవ్వాల్సి ఉంటుందని మానవ దృష్టికి తోస్తున్నట్లు కనిపిస్తుంది. తమ శత్రువుల చేతిలో మరణించటానికే ప్రభువు తమను వదిలేశాడని వారు భయపడటం మొదలు పెట్టారు. అది నిజంగా భయాందోళనలు చోటుచేసుకొనే సవుయం. విడుదల కోసం అహోరాత్రులు దేవునికి వారు మొర పెట్టుకొంటారు. దుష్టుల ఉత్సాహం ఉవ్వెత్తున లేస్తుంది. “ఇప్పుడు మీ విశ్వాసం ఎక్కడికి పోయింది? నిజంగా మీరు దేవుని బిడ్డలైతే మా చేతుల్నుంచి దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించటంలేదు?” అంటూ వారు ఎగతాళి చేస్తారు. కనిపెడూ ఉన్న ఆ ప్రజలు కల్వరి సిలువపై యేసు మరణించటాన్ని ప్రధాన యాజకులు అధికారులు పలికిన ఈ గేల్ వాక్యాల్ని గుర్తుచేసుకొంటారు, “వీడు ఇతరులను రక్షించెను, తన్నుతాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము.” మత్తయి 27:42. యాకోబులాగ అందరూ దేవునితో పోరాడుతున్నారు. అంతర్గతంగా సాగుతున్న సంఘర్షణ వారి ముఖాల్లో కనిపిస్తుంది. ప్రతీ ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. అయినా వారి విజ్ఞాపన ఆగదు.GCTel 595.1

    మనుషునికి దివ్యదృష్టి ఉంటే వాక్యాన్ని అనుసరిస్తూ క్రీస్తు సహవాసాన్ని కలిగిన దైవజనుల చుట్టూ శక్తి సంపన్నులైన దూతలు సమూహాలు మోహరించి ఉన్న దృశ్యాల్ని చూస్తారు. ఆ దూతలు వారి దుస్థితిని కళ్ళారా చూస్తారు. వారి ప్రార్ధనల్ని సానుభూతితో వింటారు. ఆ అపాయం నుంచి దైవ ప్రజల్ని బైటికి లాగటానికి తమ సేనాపతి క్రీస్తు ఆనతికి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దైవ ప్రజలు ఒకింతసేపు ఓపికతో వేచి ఉండాలి. దైవ ప్రజలు పాత్రలోనిది తాగి బాప్తిస్మం పొందాల్సి ఉన్నారు. తమకు ఎంతో బాధగా ఉన్న ఆ ఆలస్యమే వారి వినతులకు ఉత్తమ సమాధానం. వారిని విడిపించటానికి ప్రభువు పనిచేస్తూ వుండగా ఆయనపై విశ్వాసముంచి వేచి ఉండే కాలంలో వారు విశ్వాసాన్ని, నిరీక్షణను ఓర్పును ఆచరణలో పెట్టాల్సి ఉంది. వారు తమ మతానుభవంలో వీటిని అంతగా ఆచరణలో పెట్టి ఎరుగరు. కాగా ఎంపిక అయిన ప్రజల నిమిత్తం శ్రమలకాలం తగ్గించబడుంది. “దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొడ్డ పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ... ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును” లూకా 18:7, 8. మనుషులు భావిస్తున్న దానికన్నా అంతం త్వరగా వస్తుంది. గోధుమల్ని కోసి పనలుకట్టి దేవుని కొట్లలో కూర్చటానికిగాను గురుగుల్ని కాల్చి నాశనం చేయటానికి మోపులు కట్టటం జరుగుతుంది.GCTel 595.2

    విశ్వాసపాత్రులైన దైవ సేవకులు తమ సేవలను నమ్మకంగా కొనసాగిస్తూ ఉంటారు. ఆజ్ఞలను ఆచరిస్తూ నివసించే వారిని చంపటానికి సాధారణ శాసనం ఒక నిర్దిష్ట సమయాన్ని పేర్కొంటున్నప్పటికీ వారి విరోధులు కొన్ని సందర్భాల్లో ఆ విషయం తెలుసుకొని నిర్దిష్ట సమయానికి ముందే వారిని చంపటానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రతీ విశ్వాసి చుట్టూ మోహరించి ఉన్న బలాఢ్యులైన రక్షక భటుల్ని ఎవరూ దాటి ముందుకు పోలేరు. పట్టణాలు గ్రామాల నుంచి పారిపోతున్నప్పుడు వారిని తమ శత్రువులు అటకాయిస్తారు. కాని వారి మీదికి దూసిన కత్తులు ముక్కలై గడ్డి పరకల్లా రాలిపోతాయి. యుద్ధ శూరుల రూపంలో ఉన్న దేవదూతలు వీరిని ఆదుకొని కాపాడారు.GCTel 596.1

    తన ప్రజల విడుదలకు అన్నియుగాల్లోనూ దేవుడు పరిశుద్ధ దూతల ద్వారా పని చేస్తూ వచ్చాడు. మానవ వ్యవహారాల్లో దేవదూతలు క్రియాశీల పాత్ర పోషిస్తారు. వెలుగులా మెరిసే దుస్తులు ధరించి వారు కనిపించారు. మనుషుల వేషంలో బాలసారుల దుస్తులు ధరించి వారు కనిపించారు. భక్తులకు దూతలు మానవ రూపంలో కనిపించారు. అలసిన వారిలా మధ్యాహ్న సమయాన చెట్ల కింద విశ్రాంతి తీసుకొన్నారు. మానవ గృహాల్లో ఆతిథ్యాన్ని అందుకొన్నారు. దారి తప్పిన ప్రయాణికులకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. తమ సొంత చేతులతో బలిపీఠంపై అగ్ని వెలిగించారు. చెరసాల తలుపులు తెరచి దైవ సేవకుల్ని విడిపించారు. రక్షకుని సమాధి రాయిని తొలగించటానికి పరలోక సర్వాంగ కవచం ధరించి వచ్చారు.GCTel 596.2

    తరచు మనుష్యుల రూపంలో దేవదూతలు నీతిమంతుల సమావేశాలకు హాజరవుతారు. సొదొమకు వెళ్లినట్లు దుష్టుల సమావేశాలకు వెళ్తారు. మనుషుల క్రియలు లిఖించటానికి వారు దేవుని సహనం హద్దులు దాటారేమో తనిఖీ చేయటానికి వెళ్తారు. దేవుడు కృపామయుడు. ఆయనకు యధార్థంగా సేవచేసే కొద్ది మందిని బట్టి ఆయన విపత్తులను అదుపులో ఉంచి ప్రజల శాంతి సమాధానాల్ని పొడిగిస్తాడు. పాపులు బతికి ఉన్నారంటే అది తాము ఎగతాళి చేస్తూ హింసిస్తున్న కొద్దిమంది విశ్వాసుల మూలంగానే అని వారు గుర్తించరు.GCTel 597.1

    ఈ లోక పరిపాలకులకు తెలియకపోయినా తరచూ వారి సభల్లో మాటాడేవారు దేవదూతలే. మానవుల కళ్లు వారిని చూస్తాయి. మానవుల చెవులు వారి వినతి వింటాయి. వారి ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తాయి. వారి సలహాల్ని ఎగతాళి చేస్తాయి. మానవుల చేతుల మీదుగా వారికి అవమానం అమర్యాద జరుగుతుంది. సభా మందిరాల్లోను న్యాయాస్థానాల్లోను ఈ పరలోక దూతలు మానవ చరిత్రలో తమకు అపార జ్ఞానం ఉన్నదని నిరూపించుకొంటారు. బాధితుల తరపున అనర్గళంగా మాట్లాడి వారికి మద్దతు పలికే వారికన్నా తామే బాగా వాదించగలవుని ఈ దూతలు నిరూపించుకొంటారు. దేవుని పనికి ఎనలేని హానికలిగించి ఆయన ప్రజలను శ్రమలు పాలుజేసి ఉండే ఉద్దేశాలకు వారు అడ్డుకట్ట వేస్తారు. దుర్మార్థతను నిలువరిస్తారు. అపాయకర పరిస్థితుల్లో “యెహోవా యందు భయభక్తులు గలవారిచుట్టూ ఆయన దూత కావలి యుండి వారిని రక్షించును.” కీర్తనలు 34:7.GCTel 597.2

    గొప్ప ఆశతో దైవ ప్రజలు వస్తున్న రాజు సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కావలివారిని పలకరించి, రాత్రి యెంత వేళైనది?” అని వారడిగితే “ఉదయమునగును రాత్రియునగును” అన్న జవాబు వెంటనే వస్తుంది. యెషయా 21:11,12. పర్వత శిఖరాలపై కాంతి రేఖలు కనిపిస్తున్నాయి. ఆయన మహిమ కొద్ది కాలంలోనే బయలు పడుంది. నీతి సూర్యుడు ప్రకాశించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయం రాత్రి రెండూ సమీపంలో ఉన్నాయి - నీతిమంతులకు అంతంలేని దినారంభం, దుష్టులకు ఉదయంలేని కాళరాత్రి.”GCTel 597.3

    ప్రార్ధనలో పోరాడుతున్న వారు తమ మనవుల్ని దేవునిముందు ఉంచుతున్న తరుణంలో వారికీ దేవునికీ మధ్య ఉన్న తెర దాదాపు తొలగిపోతుంది. అంతంలేని దినం ఉదయకాంతితో గగనమండలం మెరిసిపోతుంటే దూత పాటల మాధుర్యం వంటి ఈ మాటలు వారికి వినిపిస్తాయి, “మీ విశ్వాసాన్ని నిలుపుకోండి. సహాయం వస్తున్నది.” అలసిన తన యోధులు ధరించేందుకుగాను విజయుడైన క్రీస్తు మహిమా కిరీటం పట్టుకొని ఉంటాడు. తెరచిన ద్వారాల్లోనుంచి ఆయన పలుకుతున్న ఈ మాటలు వినిపిస్తాయి, “ఇదిగో నేను మీతో ఉన్నాను, భయపడకుడి మీరు పోరాడుతున్న శత్రువులు కొత్తవారు కాదు. మీ తరపున నేను పోరాడాను, పోరాడున్నాను కూడా. నా నామంలో మీరు గొప్ప విజేతలవుతారు.”GCTel 597.4

    మన ప్రశస్త రక్షకుడు మనకు అవసరమైనప్పుడు సహాయం అందిస్తాడు. పరలోక మార్గం ఆయన అడుగుజాడలతో మనకు అంకితమయ్యింది. మన పాదాల్ని గాయపర్చే ప్రతీములు ఆయన పాదాల్ని గాయపర్చింది. మనం మోయాల్సిన ప్రతీ సిలువను ఆయన మనకు ముందే మోశాడు. ఆత్మను శాంతి సమాధానాలకు సిద్ధం చేసే కృషిలో సంఘర్షణల్ని ప్రభువు అనుమతిస్తాడు. దైవ జనులకు శ్రమకాలం అగ్ని పరీక్ష కాగా ఆది నిజాయితీగల ప్రతి విశ్వాసి కన్నులెత్తి పైకి చూడాల్సిన సమయం. తన్ను ఆవరించి ఉన్న వాగ్దాన ధనుస్సును విశ్వాసం ద్వారా అతను వీక్షించవచ్చు.GCTel 598.1

    “యెహోవా విమోచించువారు సంగీత నాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు. నిత్యసంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గల వారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేను నేనే మిమ్ము నోదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిదపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్తయగు యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను? క్రుంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రము యొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు...నీ నోట నామాటలు ఉంచి నాచేతినీడలో నిన్ను కప్పియున్నాను” యెషయా 51:11-16.GCTel 598.2

    “ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమ పడిన దానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధపాత్రను నీ చేతిలో నుండి తీసివేసి యున్నాను. నీ వికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగ నిచ్చెదను” 21-23 వచనాలు.GCTel 598.3

    గతిస్తున్న యుగాలపై దృష్టి ఉంచి దేవుడు తన ప్రజలు ఎదుర్కోనున్న క్లిష్ట సమయం పై గమనాన్ని నిలిపాడు. ఈ ఆపదలో లోకరాజ్యాలు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాయి. చెరలోని బందీలమల్లే ఆకలికో దౌర్జన్యానికో ఆహుతి కావాల్సి వస్తుందని వారు నిత్యం భయపడూ ఉంటారు. అయితే ఇశ్రాయేలీయుల కోసం ఎర్ర సముద్రాన్ని విభజించిన ఆ పరిశుద్ధ దేవుడు వారిని విడిపిస్తాడు. ‘’నేను నియమింపబోవు దినము రాగా వారు నావారైనా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ” మలాకీ 3:17. నమ్మకమైన క్రీస్తు సాక్ష్యుల రక్తం ఈ తరుణంలో చిందించటం జరిగితే అది హతసాక్షుల రక్తంలా దేవునికి ఆధ్యాత్మిక పంట పండటానికి విత్తే విత్తనంగా పరిణమించదు. వారి యధార్ధ క్రైస్తవ జీవితం ఇతరులను సత్యంలోకి ఆకర్షించే సాక్ష్యంగా ఉండదు. ఎందుకంటే వారి కఠిన హృదయాలు కెరటాలుగా లేచిన దైవకృపను తోసిపుచ్చాయి. ఆ కృప ఇక తిరిగి రాదు. నీతిమంతులు ఇప్పుడు తమ శత్రువులైన దుష్టులకు ఆహుతి అయితే అది చీకటి రాజు సాతానుకి ఘన విజయం అవుతుంది. కీర్తన కారుడిలా అంటున్నాడు, “ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదురము మీద ఆయన నన్ను ఎక్కించును” కీర్తనలు 27:5. క్రీస్తు ఇలా అంటున్నాడు, “నాజనమా, ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలు పరచును. నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము. ఉగ్రత తీరిపోవువరకు కొంచెము సేపు ఆగియుండము.” యెషయా 26:20, 21. ఆయన రాకకోసం ఎవరు ఓపికతో కనిపెడతారో ఎవరిపేర్లు జీవగ్రంథంలో దాఖలై ఉంటాయో వారి విడుదల మహావైభవంగా ఉంటుంది.GCTel 599.1