Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 26—సంస్కరణ కృషి

    చివరి దినాల్లో పూర్తికావలసి వున్న సబ్బాతు సంస్కరణను గూర్చి యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. నా రక్షణ వచ్చుటకు సిద్దముగా ఉన్నది. నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి. నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు” “విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను, నా ప్రార్ధన మందిరములో వారిని ఆనందింప జేసెదను” యెషయా 56:1,2,6,7.GCTel 422.1

    సందర్భాన్ని బట్టి గ్రాహ్యమవుతున్నట్లు ఈ మాటలు క్రైస్తవ యుగానికి వర్తిస్తాయి: “ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను” వచనం 8. ఇక్కడ సువార్త అన్యులను పోగుచేయటాన్ని సూచిస్తుంది. విశ్రాంతి దినాన్ని గౌరవించి ఆచరించే వారిపై దీవెనలుంటాయి. నాల్గో ఆజ్ఞ ఆచరణ విధి క్రీస్తు సిలువ, పునరుత్థానం, ఆరోహణం దాటి ఆ సువార్తమానాన్ని ఆయన సేవకులు సర్వజనులకు ప్రకటించే కాలం వరకు ఉంటుంది.GCTel 422.2

    ఆ ప్రవక్త ద్వారానే ప్రభువు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు: “ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగించుము.” యెషయా 8:16. ఈ బోధ తాలూకు ముద్ర నాలో ఆజ్ఞలో వున్నది. పదింటిలోనూ ఈ ఆజ్ఞ ఒక్కటే ధర్మశాస్త్ర కర్త అయిన దేవుని పేరును బిరుదును మన దృష్టికి తెస్తున్నది. ఆయన భూమ్యాకాశాల సృష్టికర్త అని ప్రకటిస్తూ సర్వజనులు ఆయనను గౌరవించి ఆరాధించాలని సూచిస్తున్నది. ధర్మశాస్త్రం ఎవరి అధికారం వలన మనకు వస్తుందో తెలపటానికి ఇది తప్ప పది ఆజ్ఞలలో ఏ సూచనా లేదు. పోపుల అధికారం సబ్బాతును మార్చినప్పుడు ముద్ర ధర్మశాస్త్రం నుంచి తొలగించబడింది. సృష్టికర్త స్మారక చిహ్నంగా ఆయన అధికారానికి గుర్తుగా నాల్గో ఆజ్ఞలోని సబ్బాతును దాని యధాపూర్వ స్థానంలో తిరిగి ప్రతిష్ఠించాల్సిందిగా యేసు పిలుపు శిష్యులకు వస్తున్నది.GCTel 422.3

    “ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి.” పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు సూత్రాలు కోకొల్లలుగా ఉన్నా అన్ని అభిప్రాయాలు, సిద్ధాంతాలు, సూత్రాల్ని పరీక్షించే ప్రమాణ వాక్యం నిర్దుష్టమైన దైవధర్మశాస్త్రం ఒక్కటే. “ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు.” అంటున్నాడు ప్రవక్త. వచనం 20.GCTel 423.1

    ప్రభువు మళ్లీ ఇలా ఆజ్ఞాపించాడు: “తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము. యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము.” దుర్మార్గులైన లౌకిక ప్రజలు కాదు, “నా జనులు” అని దేవుడంటున్న ప్రజలే తమ అతిక్రమాల నిమిత్తం మందలింపు పొందాల్సి ఉన్నారు. దేవుడింకా ఇలా అంటున్నాడు: “తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించిన వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మారములను తెలిసికొన నిచ్చ కనపరచుదురు” యెషయా 58:1,2. ఇక్కడ ఒక తరగతి ప్రజల్ని మనం చూస్తున్నాం. తాము నీతిమంతులమని భావిస్తారు. దేవుని సేవ చేయటానికి ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. అయితే హృదయాలు పరిశోధించే ప్రభువు గద్దింపు వారిని దైవ నియమాలను కాలరాసేటట్లు చేస్తుంది.GCTel 423.2

    ప్రజలు విడిచిపెట్టిన నియమాలేమిటో ప్రవక్త చూపిస్తున్నాడు: “పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. విరుగబడిన దానిని బాగుచేయు వాడవనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీ కిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు” 12-14 వచనాలు. ఈ ప్రవచనం మనకాలానికీ వర్తిస్తుంది.GCTel 423.3

    రోమా అధికారం సబ్బాతును మార్చినప్పుడు దైవ ధర్మశాస్త్రం పునాదులు పాడవటం జరిగింది. అయితే పరిశుద్ధ దైవ వ్యవస్థ పునరుద్ధరణకు సమయం వచ్చింది. పాడైపోయిన స్థలాలను కట్టాల్సివున్నది. అనేక తరాలుగా పాడైపోయిన పునాదులను పునర్నిర్మించాల్సి ఉన్నది.GCTel 424.1

    సృష్టికర్త పరిశుద్ధపర్చి విశ్రమించిన సబ్బాతును పరిశుద్ధమైన ఏదెను వనంలో ఆదాము పాపరహిత స్థితిలో ఆచరించాడు. పాపంలోపడి పశ్చాత్తాపుడైన ఆదాము ఏదెను గృహాన్ని విడిచి వెళ్లినప్పుడూ సబ్బాతును ఆచరించాడు. హేబెలు మొదలుకొని నోవహు, అబ్రాహాము, యాకోబు వరకూ పితరులందరూ సబ్బాతును ఆచరించారు. దైవ ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్న కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న విగ్రహారాధన మధ్య అనేకమంది దైవ ధర్మశాస్త్ర విధులను మరచిపోయారు. అయితే ప్రభువు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన తరుణంలో తన ప్రజలు తన చిత్తాన్ని తెలుసుకొని తనకు భయపడి నిత్యము తనకు విధేయులై ఉండేందుకు సమావేశమైన తన ప్రజలకు ప్రభువుతన ధర్మశాస్త్రాన్ని మిక్కిలి గంభీరమైన రీతిగా ప్రకటించాడు.GCTel 424.2

    ఆనాటి నుంచి నేటి వరకు లోకంలో దైవధర్మశాస్త్ర జ్ఞానం పరిరక్షితమవుతూ వచ్చింది. నాలో ఆజ్ఞ ప్రస్తావిస్తున్న సబ్బాతు ఆచరణ సాగుతూనే ఉంది. “పాప పురుషుడు” దేవుని పరిశుద్ధ దినాన్ని కాలరాయటంలో సఫలుడైనప్పటికీ అతడి ఆధిపత్యం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిన రోజుల్లో కూడా భక్తులు రహస్య స్థలాల్లో సమావేశమై సబ్బాతు ఆచరించారు. సంస్కరణోద్యమం నాటి నుంచి సబ్బాతును ఆచరించిన వారు ప్రతీ తరంలోనూ ఉన్నారు. నిందలు, హింసలు తరచు భరించవలసి వచ్చినా దేవుని ధర్మశాస్త్రం నిత్యమైనదనటానికి సృష్టినాటి సబ్బాతు ఆచరణ అవశ్యం అనటానికి సాక్షులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు.GCTel 424.3

    క్రీస్తు వచ్చినప్పుడు “నిత్యసువార్త” సందర్భంగా ప్రకటన 14 లోని సత్యాలను బట్టి ఆయన సంఘాన్ని గుర్తించటం సాధ్యపడుతుంది. ఎందుకంటే త్రివిధ వర్తమానం ఫలితంగా ఈ ప్రకటన వెలువడుంది: “దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్దుల ఓర్పు ఇందులో కనబడును”. ఇది ప్రభువు రాక ముందు వెలువడే చివరివర్తమానం. ఈ ప్రకటన జరిగిన వెంటనే లోకం పండిన పంటను కోయటానికి మనుషకుమారుడు రావటాన్ని ప్రవక్త చూశాడు.GCTel 424.4

    గుడారం గురించీ మార్పులేని దైవధర్మశాస్త్రం గురించి తెలుసుకొన్న వారు తమకు కలిగిన అవగాహనా సౌందర్యాన్ని సామరస్యాన్ని చూసి ఆనందంతో విస్మయంతో ఉప్పొంగి పోయారు. తమకు దొరికిన ప్రశస్తమైన సత్యాన్ని క్రైస్తవులందరికీ పంచాలని వారు బహుగా ఆశించారు. క్రైస్తవులు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారని విశ్వసించారు.GCTel 425.1

    క్రీస్తు అనుచరులమని చెప్పుకొనే వారిలో పలువురు తమకు వస్తున్న సత్యాలు లోకం నమ్మే సత్యాలతో భేదిస్తున్నట్లు గమనించినప్పుడు వాటిని స్వాగతించటం జరుగలేదు. నాల్గో ఆజ్ఞను ఆచరించటం త్యాగంతో కూడిన పని. అధిక సంఖ్యాకులు త్యాగం చేయటానికి వెనుకంజవేశారు.GCTel 425.2

    సబ్బాతు యోగ్యతలను గూర్చిన పరిగణన వచ్చినప్పుడు అనేకులు లౌకిక ధోరణిలో వాదించటం మొదలు పెట్టారు. ‘’మేము ఎప్పుడూ ఆదివారమే ఆచరించాం. మా తండ్రులు అదే రోజు ఆచరించారు. అనేక మంది ఆదివారం ఆచరించి భక్తిపరులుగా మరణించారు. వారు చేసింది మంచి పని అయితే మేము చేసేదీ మంచిపనే. ఈ కొత్త సబ్బాతు ఆచరణ ప్రపంచానికి మనకు మధ్యగల సామరస్యాన్ని పాడుచేస్తుంది. దానిపై మనకెలాంటి ప్రభావము ఉండదు. లోకం యావత్తూ ఆదివారం ఆచరిస్తూ వుండగా ఏడో దినాన ఆచరించే చిన్న గుంపు ఏమి సాధించ చూస్తుంది? ” ఇటువంటి వాదనలతోనే యూదులు క్రీస్తును విసర్జించటాన్ని సమర్ధించుకోటానికి ప్రయత్నించారు. తమ తండ్రులు బలులు అర్పించినప్పుడు దేవుడు వాటిని అంగీకరించాడే అదే పద్ధతిని అవలంభించి వారి పిల్లలు రక్షణను ఎందుకు పొందకూడదు? అలాగే లూథర్ దినాల్లో యధార్ధ క్రైస్తవులు కథోలిక్ విశ్వాసంలో మరణించారు గనుక ఆ మతం రక్షణ పొందటానికి సరిపోతుందని పోపుమత వాదులు వాదించారు. అట్టి హేతువాదం మత విశ్వాసానికి లేక భక్తి జీవితానికి ప్రతిబంధకంగా నిలుస్తుంది.GCTel 425.3

    ఆది వారాచరణ స్థిరపడి ఉన్న సిద్ధాంతం అని అది అనేక శతాబ్దాలుగా బహుళ వ్యాప్తి గల ఆచారం అని చాలా మంది వాదించారు. దీనికి జవాబుగా సబ్బాతు, సబ్బాతు ఆచరణ ఇంకా పురాతనమైంది. మరింత వ్యాప్తి గలది. లోకం ఎంత పురాతనమైందో ఇది అంత పురాతనమైంది. దానికి దేవుని సమ్మతి దూతల సమ్మతి ఉన్నది అని నిరూపించటం జరిగింది. భూమికి పునాదులు వేసినప్పుడు, ఉదయ నక్షత్రాలు కూడి పాడినప్పుడు, దైవ కుమారులు సంతోషంతో కేకలు వేసినప్పుడు అప్పుడే సబ్బాతుకు పునాదులు పడ్డాయి. యోబు 38:6,7; ఆదికాండము 2:13. కనుక ఈ వ్యవస్థ మన ఆరాధనను కోరటం సబబే. మహావృద్ధుడు స్థాపించగా ఆయన నిత్యవాక్యం దీని ఆచరణను ఆదేశిస్తున్నది.GCTel 425.4

    సబ్బాతు సంస్కరణ ప్రజల గమనాన్ని ఆకర్షించటంతో ప్రజాదరణ గల బోధకులు దేవుని వాక్యాన్ని వక్రీకరించి ప్రశ్నిస్తున్న ప్రజల మనసులను శాంతపర్చటానికి ఏవేవో వ్యాఖ్యానాల్ని అందించారు. ఎవరైతే తమంతట తాము లేఖనాల్ని అధ్యయనం చేయలేదో వారు ఆ బోధకులు చెప్పింది విశ్వసించారు. ఫాదర్ల వాదనను, కుతర్కాన్ని సంప్రదాయాల్ని, సంఘాధికారాన్ని ఉపయోగించి సత్యాన్ని పక్కన పెట్టటానికి పలువురు కృషి చేశారు. అయితే సత్యప్రబోధకులు నాల్గో ఆజ్ఞ చట్టబద్ధతను సమర్ధించటానికి బైబిలు మీద ఆధారపడ్డారు. సత్య వాక్యమే ఆయుధంగా ధరించిన సామాన్య వ్యక్తులు విద్యాధికుల దాడుల్ని తిప్పికొట్టారు. విద్యాలయాలిచ్చే జ్ఞానంలోగాక లేఖన జ్ఞానంలో నిష్ణాతులైన ఈ భక్తుల హేతుబద్ధ వాదనముందు తమ అనర్గళ కుతర్కం నిలువలేదని గుర్తించి ఆగ్రహంతో నిండి ఉన్నారు.GCTel 426.1

    ఇదే రకమైన వాదన క్రీస్తు విషయంలోను ఆయన అపొస్తలుల విషయంలోను ఉపయుక్తమైన సంగతిని విస్మరించి, తమకు అనుకూలంగా బైబిలులో ఎలాంటి ఆధారమూ లేదని ఎరిగి అనేకమంది ఈ విధంగా ప్రశ్నించటం మొదలు పెట్టారు “సబ్బాతు సమస్యను విద్యాధికులైన మన ప్రఖ్యాత వ్యక్తులు ఎందుకు అవగాహన చేసుకోవటం లేదు.? మీకుమల్లే వారు నమ్మటం లేదు. మీదే సరైన మార్గం, ఈ విద్యాధికులందరిదీ తప్పుడు మార్గం అనటానికి లేదు.”GCTel 426.2

    ఈ కుతర్క వాదనల్ని తిప్పికొట్టటానికి లేఖన బోధనలను యుగయుగాలలో ప్రభువు తన ప్రజలతో వ్యవహరించిన తీరును చరిత్రను ఉటంకించటం సరిపోతుంది. ఎవరైతే తన స్వరాన్ని విని దానికి విధేయులవుతారో, అవసరమైతే ఎవరు ఆ ప్రియ సత్యాలను బోధిస్తారో, ఎవరైతే ప్రజామోదం గల పాపాలను ఖండిస్తారో వారి ద్వారా దేవుడు పని చేస్తాడు. తరచు దేవుడు విద్యాధికుల్ని గొప్ప హోదాల్లో ఉన్నవారిని ఎంపిక చేసుకోపోవటానికి కారణం వారు తమ సంప్రదాయాల్ని, సిద్ధాంతాల్ని వేదాంత వ్యవస్థల్ని నమ్ముకొని తమకు దేవుడు ఉపదేశించాల్సిన అవసరం లేదని భావించటమే. జ్ఞానానికి మూలమైన దేవునితో వ్యక్తిగత సంబంధం ఉన్న వారు మాత్రమే లేఖనాల్ని అవగాహన చేసుకోటానికి లేదా వివరించటానికి సమర్థులై ఉంటారు. విద్యాలయాలందించే పరిజ్ఞానం అంతగా లేని మనుషులు కొన్ని సార్లు సత్యం ప్రకటించేందుకు పిలుపు పొందుతారు. వారికి వచ్చే పిలుపు వారికున్న జ్ఞానాన్ని బట్టి కాదుగాని వారు దేవుని ఉపదేశం అవసరంలేనంత స్వయం సమృదులు కారు గనుక. క్రీస్తు బోధించే పాఠాలు వారు నేర్చుకొంటారు. తమ సాత్వికం తమ విధేయత వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయి. తన సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని వారికి అప్పగించటం ద్వారా దేవుడు వారిని సన్మానిస్తున్నాడు. ఆ సన్మానం ముందు లోకసంబంధమైన గౌరవ సన్మానాలు కొరగానివిగా ఉంటాయి.GCTel 426.3

    ఆగమన వాదుల్లో అధికసంఖ్యాకులు గుడారాన్ని గూర్చిన దైవ ధర్మశాస్త్రాన్ని గూర్చిన సత్యాలను తోసిపుచ్చారు. పెక్కుమంది ఆగమన ఉద్యమంపై నమ్మకాన్ని కోల్పోయి ఆ ఉద్యమానికి వర్తించే ప్రవచనాల విషయంలో అర్ధం పర్ధంలేని పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను అంగీకరించారు. కొందరైతే క్రీస్తు రాకకు పదేపదే నిర్దిష్టమైన తేదీలు నిర్నయించటమన్న పొరపాటుకు లోనయ్యారు. ఇప్పుడు గుడార పరిచర్య అంశంపై ప్రకాశిస్తున్న వెలుగులో రెండో రాక వరకు కొనసాగే ప్రవచన కాలం ఏదీ లేదని ఈ రాకడకు కచ్చితమైన నిర్దిష్టమైన కాలం నిర్ణయం కాలేదని వారు గ్రహించి ఉండాల్సింది. కాని వెలుగు నుంచి తొలగిపోయి ప్రభువు రాకకు తేదీలు నిర్ణయిస్తూ పోయారు. అన్నిసార్లూ వారు ఆశాభంగానికి గురి అయ్యారు.GCTel 427.1

    క్రీస్తురాక గురించి థెస్సలొనీకయ సంఘానికి తప్పుడు అభిప్రాయాలు అందినప్పుడు తము నిరీక్షణను ఆశలను దైవ వాక్యంతో జాగ్రత్త గా పోల్చి చూసుకోవలసిందిగా ఆ సంఘ సభ్యులకు పౌలు హితవు చెప్పాడు. క్రీస్తు రాకకు పూర్వం సంభవించాల్సిన ఘటనలను తెలిపే ప్రవచనాల్ని వారి దృష్టికి తెస్తూ తమ దినాల్లో క్రీస్తు వస్తాడనటానికి హేతువులేదని వారితో అన్నాడు పౌలు. “మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలు పడితేనేగాని ఆ దినము రాదు.” (2థెస్స 2:3) అన్న హెచ్చరిక వస్తున్నది. లేఖన సమర్ధనలేని ఊహాగానాల్లో తలమునకలై ఉంటే తప్పటడుగులు పడటం తథ్యం. ఆశాభంగం అవిశ్వాసుల ఎగతాళికి వారిని గురిచేస్తుంది. వారు నిరుత్సాహపడి తమ రక్షణకు అవసరమైన సత్యాలను శంకించటం జరుగవచ్చు. థెస్సలొనీకయులకు అపోస్తలుడైన పౌలు చేసిన సూచనల్లో చివరి దినాల్లో నివసించే ప్రజలకు మంచి పాఠం ఉన్నది. ప్రభువు రాకకు నిర్దిష్ట సమయంపై తమ దృష్టిని కేంద్రీకరించక పోతే సిద్ధబాటులో ఉద్రేకం ఉత్సాహం ఉండవని పలువురు ఆగమన వాదులు అభిప్రాయపడ్డారు. ఇలా గుండగా, పదేపదే తమలో చోటుచేసుకొన్న ఆశలు ప్రతిసారీ అడియాశలు కావటంతో వారి విశ్వాసం దెబ్బతిన్నది. ప్రవచనంలోని బ్రహ్మాండమైన సత్యాలు వారిని ఆకట్టుకోటం దాదాపు అసాధ్యమయ్యింది.GCTel 427.2

    మొదటి దూత వర్తమానంలో తీర్పును గూర్చి నిర్దిష్ట సమయాన్ని ప్రకటించటం దేవుని ఆదేశం మేరకే జరిగింది. ఏ ప్రవచన కాలాన్ని లెక్కగట్బటంపై ఆ వర్తమానం అనుకోని ఉండి దాని ప్రకారం 2300 దినాలు 1844 శరత్కాలంలో అంత మౌతున్నాయన్న తీర్మానం జరిగిందో ఆ తర్కంలో పొరపాటులేదు. ప్రవచన కాలాల ఆరంభానికి అంతానికి కొత్త తేదీల ఏర్పాటుకు పదేపదే జరిగే ప్రయత్నాలు వాటిని సమర్ధించుకోటానికి చేసే అసంబద్ధ వాదనలు ప్రజల మనసుల్ని సత్యం నుంచి మళ్లించి ప్రవచనాలను విశదం చేయటానికి జరిగే కృషిపట్ల ద్వేషం పుట్టిస్తాయి. రెండో రాకకు నిర్దిష్ట సమయాన్ని ఎంత తరచుగా నియమించి ఎంత ఎక్కువ మందికి బోధిస్తే అది సాతాను ఉద్దేశాలకు అంత చక్కగా సరిపోతుంది. నిర్దిష్ట సమయం దాటిపోయిన తరువాత దాని ప్రబోధకులపట్ల ఎగతాళి ద్వేషం రెచ్చగొట్టి తద్వారా 1843, 1844 ఆగమనోద్యమాన్ని అభాసుపాలు చేయటానికి సాతాను ప్రయత్నించాడు. ఇదే పొరపాటును విడువక కొనసాగించేవారు చివరికి భవిష్యత్తులో ఎంతో దూరంలో ఒక తేదీని ఆయన రాకకు నిర్ణయిస్తారు. ఇలా వారు తప్పుడు భద్రతతో నివసిస్తారు. వారిని బట్టి అనేకులు మోసపోతారు. తప్పును తెలుసుకొని తిరిగిరావటానికి చాలా ఆలస్యమైపోతుంది.GCTel 428.1

    ఆగమన విశ్వాసుల గతానుభవానికి, పూర్వం ఇశ్రాయేలీయుల చరిత్ర చక్కని ఉదాహరణ. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి నడిపించినట్లు దేవుడు తన ప్రజలను ఆగమనోద్యమంలో నడిపించాడు. హెబ్రీ ప్రజల విశ్వాసాన్ని ఎర్ర సముద్రం వద్ద పరీక్షించిన రీతిగానే ఆగమన వాదులకు కలిగిన ఆశాభంగంలో దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. తమ గతానుభవంలో తమతో ఉండి తమను నడిపించిన హస్తాన్ని వారు విశ్వసించివుంటే దేవుని రక్షణను వారు తిలకించేవారు. 1844 లో కలిసికట్టుగా కృషి చేసినవారందరూ మూడో దూత వర్తమానాన్ని స్వీకరించి పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని ప్రకటించివుంటే వారి పనిని దేవుడు బహుగా దీవించేవాడు. దేవుని సత్య ప్రకాశత వరదవలె ప్రపంచాన్ని ముంచేది. లోక ప్రజలకు ఆ హెచ్చరిక ఎన్నో ఏళ్ల కిందటే వెళ్ళేది. చివరగా జరగాల్సిన కార్యం పూర్తి అయ్యేది. తన ప్రజల్ని విమోచించేందుకు క్రీస్తు వచ్చి వుండేవాడు.GCTel 428.2

    అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు నలభై ఏళ్లు సంచరించటం దేవుని చిత్తం కానే కాదు. ప్రత్యక్షంగా వారిని కనాను దేశంలోకి నడిపించి అక్కడ వారిని తన పరిశుద్ధ జనాంగంగా స్థిరపర్చాలన్నదే ఆయన ఆకాంక్ష. కాగా ‘అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేక పోయిరి.” హెబ్రీ 3:19. తమ అవిశ్వాసం మత భ్రష్టత వల్లనే వారు అరణ్యంలో నశించారు. వాగ్దాత్త దేశంలో ప్రవేశించటానికి దేవుడు ఇతరులను లేపాడు. అలాగే క్రీస్తు రాక విషయంలో ఎంతో జాప్యం జరిగి ఈ పాప ప్రపంచంలో తన ప్రజలు ఎన్నో సంవత్సరాలు ఉండిపోవాలన్నది దేవుని చిత్తంకాదు. అవిశ్వాసమే వారిని దేవుని నుంచి వేరుచేసింది. ఆయన అప్పగించిన కార్యాన్ని చేయటానికి వారు నిరాకరించినందువల్ల దాన్ని చేయటానికి ఇతరులను ఎంపికచేసుకొన్నాడు. పాపులు ఆ హెచ్చరికను విని దేవుని ఉగ్రత తమపై కుమ్మరింప బడకముందు క్రీస్తులో ఆశ్రయం కనుగొనేందుకు లోకంపై కనికరంతో తన రాకను యేసు ఆలస్యం చేస్తున్నాడు.GCTel 429.1

    కిందటి యుగాల్లో మల్లే ఇప్పుడు కూడా ప్రజల పాపాలను దోషాలను ఖండించే సత్యాల పట్ల వ్యతిరేకత ఎదురౌతున్నది. “దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్కియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.” యోహాను 3:20. లేఖనాలననుసరించి నివసించలేనప్పుడు అనేకులు అలా నివసిస్తున్నట్లు కనిపించటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ప్రజలకు రుచించని సత్యాలను సమర్ధించే వారి ప్రవర్తనను ఉద్దేశాలను వ్యతిరేకించటానికి పూను కొంటారు. ఈ విధానమే అన్ని యుగాల్లోను వినియుక్తమవుతూ వస్తుంది. ఇశ్రాయేలీయుల్ని శ్రమపెట్టే వాడని ఏలియాను, దేశద్రోహి అని యిర్మీయాను, దేవాలయాన్ని అపవిత్రం చేశాడని పౌలును అన్నారు. సత్యానికి నిలబడ్డ వారిని నాటి నుంచి నేటి వరకూ విద్రోహులు, సిద్ధాంత వ్యతిరేకులు, కుట్రదారులు అని నిందిస్తూనే ఉన్నారు. నిశ్చయత గల ప్రవచన వాక్యాన్ని అంగీకరించటానికి వెనుకాడే అవిశ్వాసులు తమ నాజూకు పాపాలను తెగడే వారికి వ్యతిరేకంగా వచ్చే విమర్శలను సులభంగా నమ్మేస్తారు. ఈ స్వభావం నానాటికీ పెచ్చు పెరుగుతున్నది. దేశ చట్టాలకు దైవ ధర్మశాస్త్రానికి మధ్య సంఘర్షణ ఏర్పడి ఎవరైతే దైవ ధర్మ సూత్రాలను అనుసరిస్తూ నివసిస్తారో వారు దుష్టులుగా ముద్రపడి కఠిన శిక్షకు గురి అయ్యే రోజులు వస్తాయని బైబిలు స్పష్టంగా బోధిస్తున్నది.GCTel 429.2

    ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సత్య ప్రబోధకుడు నిర్వహించాల్సిన బాధ్యత ఏమిటి? సత్యం బోధించటం వల్ల మనుషులు దాన్ని వ్యతిరేకించి ప్రతిఘటిస్తున్నారు గనుక సత్యాన్ని ప్రకటించకూడదని తీర్మానించుకోవచ్చా? తీర్మానించుకో కూడదు. వాక్యప్రకటన వ్యతిరేకతను పుట్టించినంత మాత్రాన పూర్వం సంస్కర్తలు దాన్ని మానుకొని తమ కృషిని విరమించటం ఎంత అసమంజసమో ఇదీ అంతే అసమంజసం. భక్తులు, హతసాక్షులు వెల్లడించిన విశ్వాసం తర్వాతియుగాల ప్రజల మేలుకోసం దాఖలు కావటం జరిగింది. పరిశుద్ధతకు అచంచల విశ్వాసానికి ఆదర్శాలైన వారి జీవితాలు దేవుని సాక్షులుగా నిలువటానికి పిలుపు పొందిన వారిని ఉత్సాహపర్చటానికి వారిని స్పూర్తితో నింపటానికి వస్తున్నాయి. వారు కృపను, సత్యాన్ని పొందారు. తమకోసమేకాదు. తమ ద్వారా దేవుని గూర్చిన పరిజ్ఞానంతో లోకాన్ని వెలుగుతో నింపేందుకు. ఈ తరంలో వున్న తన సేవకులకు దేవుడు వెలుగునిచ్చాడా? ఇస్తే వారు ఆ వెలుగును లోకంలో ప్రవేశింపజేయాలి.GCTel 430.1

    పూర్వం ఒక ప్రవక్తతో ప్రభువిలా అన్నాడు, “ఇశ్రాయేలీయులందరును సిగ్గుమాలినవారును, కఠినహృదయులునై నేను చెప్పినమాట నాలకింపనొల్లక యున్నారు. గనుక నీ మాటలు విననొల్లరు.” అయినా ప్రభువు ఇంకా ఇలా అన్నాడు, “వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము” యెహెజ్కేలు 3:7; 2:7. దైవసేవకునికి ఈ సమయంలో ఈ ఆదేశం వచ్చింది. “తాళక బూర ఊదునట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము.”GCTel 430.2

    సత్యాన్ని స్వీకరించిన ప్రతీవారు ఈ వర్తమానాన్ని అందుకొన్న ఇశ్రాయేలీయ ప్రవక్తమల్లే తమ అవకాశాలమేరకు గంభీరమైన భీకరమైన బాధ్యత వహించాల్సి ఉన్నారు. 6 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించియున్నాను. గనుక నీవు నానోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన దుర్మారతను విచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మారునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందునుగాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్థతను విడువని యెడల అతడు తన దోషమును బట్టి మరణము నొందునుగాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు “యెహెజ్కేలు 33:79,GCTel 430.3

    సత్యాన్ని అంగీకరించటంలోను ప్రకటించటంలోను ఎదురవుతున్న ఆటంకాలు ఎంతో అసౌకర్యాన్ని, ఎన్నో నిందలను కలుగజేస్తున్నవి. సత్యానికి వ్యతిరేకంగా వినిపించటానికి వాదన ఇదొక్కటే. దీన్ని ఎవ్వరూ కాదనలేకపోతున్నారు. అయినా యధార్ధ విశ్వాసుల్ని ఇది ఆపుచేయలేదు. సత్యానికి ప్రజామోదం కలిగే వరకు వీరు వేచి ఉండరు. తమ విధి ఏమిటో తెలుసుకొన్నవారు సిలువను బహిరంగంగా స్వీకరించి అపోస్తలుడైన పౌలుతో గొంతుకలిపి “క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది” అని, మరొక ప్రవక్తతో గళం కలిపి “ఐగుప్తు ధనముకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని” బహిరంగంగా ఒప్పుకొంటారు. 2కొరింథి 4:18; హెబ్రీ 11:26.GCTel 431.1

    మసుషులు పైకి ఏమిచెప్పినా, లోకాశలు ఆసక్తులు కలవారే మతపరమైన విషయాల్లో సిద్ధాంతాలను బట్టికాక అవసరాన్ని బట్టి వ్యవహరిస్తారు. ధర్మం ధర్మం కాబట్టి దాన్ని మనం ఎంపిక చేసుకొని పర్యవసానాల్ని దేవునికి విడిచి పెట్టాలి. నియమాలు, దృఢవిశ్వాసం, సాహస ప్రవృత్తి గల వ్యక్తుల మూలంగానే లోకంలో సంస్కరణలు చోటుచేసుకొన్నాయి. లోకం వారికి జోహారు లర్పిస్తోంది. అట్టి సాహసం గల పురుషులు మహిళల ద్వారానే ఇప్పుడు సంస్కరణలు జరగాల్సి ఉన్నాయి.GCTel 431.2

    ప్రభువంటున్న ఈ మాటలు గమనించండి: “నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొన్న వారలారా, ఆలకించుడి, మనుష్యులుపెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును. బొద్దీక గొట్టెబొచ్చును కొరికి వేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును.” యెషయా 51:7,8.GCTel 431.3