Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 37—లేఖనాలే రక్ష

    “ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు.” యెషయా 8:20. అబద్ధ బోధకులు, మోసపుచ్చే అంధకార దురాత్మల ప్రభావం నుంచి దైవ ప్రజల్ని పరిరక్షించ గలిగేవి లేఖనాలే. మనుషులు బైబిలు చదివి అందులోని జ్ఞానాన్ని సంపాదించకుండా అడ్డుకోటానికి సాతాను అన్నియుక్తుల్ని ఉపయోగిస్తాడు. కారణమేమిటంటే ఆ గ్రంథంలోని స్పష్టమైన మాటలు అతని మోసాల్ని బట్టబయలు చేస్తాయి. దేవుని పని పుంజుకొంటున్న ప్రతి సందర్భంలోను సాతాను ఉద్వేగభరితుడై మరింత చురుకుగా పనిచేస్తాడు. ఇప్పుడు అతను క్రీస్తుకు ఆయన అనుచరులకు వ్యతిరేకంగా తన చివరి పోరాటానికి సిద్ధమవుతున్నాడు. అతని చివరి గొప్ప వంచన మనకు త్వరలోనే కనిపిస్తుంది. క్రీస్తు విరోధి మన ముందే తన ఆశ్చర్యకార్యాల్ని చేయనున్నాడు. నకిలీ అసలుకు ఎంతో దగ్గరగా వుంటుంది గనుక లేఖనాల ద్వారా తప్ప నిజమేదో అబద్దమేదో తెలుసుకోవటం అసాధ్యం . లేఖనాల సాక్ష్యాన్ని బట్టి ప్రతీ అంశం ప్రతీ సూచకక్రియ నిజానిజాలు నిర్ధారించాల్సి ఉన్నది.GCTel 560.1

    దైవాజ్ఞల్ని ఆచరించటానికి ప్రయత్నించే వారికి ప్రతిఘటన ఎగతాళి ఎదురవుతాయి. దేవుని సహాయంతో మాత్రమే వారు నిలువగలుగుతారు. తమ ముందున్న శ్రమలను భరించటానికి వాక్యంలో ప్రకటితమైన దైవ చిత్రాన్ని వారు అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఆయన ప్రవర్తనను, ప్రభుత్వాన్ని, ఉద్దేశాల్ని గూర్చి సరియైన అవగాహన కలిగి వాటికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడే వారు ఆయనను గౌరవించగలుగుతారు. బైబిలు సత్యాలతో ఎవరు తమ మనసుల్ని పటిష్ఠపర్చుకొంటారో వారు తప్ప ఇంకెవరూ ఆ మహా సంఘర్షణలో నిలువలేరు. ప్రతీ ఆత్మకు రానున్న పరీక్ష- విధేయత చూపటం ఎవరికి దేవునికా? మనుషులకా? అన్నది. ఆ నిర్ణయం తీసుకోవలసిన గడియ దగ్గరలో ఉన్నది. మార్పులేని దేవుని వాక్యం అనే బండపై మన పాదాలు స్థిరంగా ఉన్నాయా? దేవుని ఆజ్ఞలు యేసును గూర్చిన విశ్వాసానికి మద్దతునిస్తూ నిలువటానికి మనం సంసిద్ధంగా ఉన్నామా?GCTel 560.2

    తనను చంపుతారని, తాను సమాధి నుంచి తిరిగి లేస్తానని రక్షకుడు సిలువ మరణానికి ముందు తన శిష్యులికి చెప్పాడు. ఆయన మాటల్ని శిష్యుల మనసుల్లో నాటింపజేయటానికి దేవదూతలు అక్కడే ఉన్నారు. కాని శిష్యులు రోము దాస్యం నుంచి లౌకికమైన విడుదల కోసం చూస్తున్నారు. తమ ఆశలన్నీ ఎవరిమీద పెట్టుకొని ఉన్నారో ఆ ప్రభువు శ్రమలు పొంది అవమానకరమైన మరణం మరణించటమన్నది శిష్యులు సహించలేని ఆలోచన. తాము జ్ఞాపకముంచుకోవలసిన మాటలు వారి మనసుల్లో నుంచి మాయమైపోయాయి. పరీక్షా సమయం వచ్చేసరికి వారు సిద్ధంగా లేనట్లు తేలింది. యేసు మరణం ముందు హెచ్చరిక లేకుండా వచ్చిన దానిలా శిష్యుల్ని అతలాకుతలం చేసింది. యేసు మాటలు శిష్యులకు భవిష్యత్తును విశదపర్చినట్లే ప్రవచనాలు భవిష్యత్తును మన ముందుంచుతున్నాయి. కృపకాల సమాప్తికి, శ్రమకాలానికి మనల్ని సన్నద్ధపర్చే పనికి సంబంధించిన ఘటనలను గూర్చి ప్రవచనాలు స్పష్టంగా ప్రస్తావిస్తున్నాయి. ప్రాముఖ్యమైన ఈ సత్యాలను గూర్చి వేలాది మందికి బొత్తిగా అవగాహన లేదు. వారికి అవి లేనట్లే లెక్క. రక్షణ జ్ఞానం కలిగించే ప్రతీ భావాన్ని భక్తులకు అందకుండా చేయటానికి సాతాను అప్రమత్తంగా ఉంటాడు. శ్రమకాలం వచ్చినప్పుడు వారు సిద్ధబాటు లేకుండా ఉంటారు.GCTel 561.1

    మధ్యాకాశంలో ఎగురుతున్న దూతలు ప్రకటిస్తున్నట్లు చిత్రించేంత ప్రాముఖ్యమైన వర్తమానాన్ని దేవుడు మనుషులకు పంపుతున్నప్పుడు ఆలోచించగల ప్రతీ వ్యక్తి ఆ వర్తమానాన్ని శ్రద్ధగా ఆలకించాలని ఆయన కోరిక. మృగానికి దాని ప్రతివుకు నమస్కరించటాన్ని గురించి వెలువరించిన భయంకర తీర్పులవి (ప్రకటన 14:9 11). మృగం ముద్ర అంటే ఎంటో దాన్ని పొందకుండా ఎలా తప్పించుకోగలమో తెలుసుకొనేందుకు తోడ్పడే అధ్యయనానికి అవి అందరినీ నడిపించాలి. అయితే ప్రజానీకం సత్యం వినకుండా తమ చెవులు మూసుకొంటున్నారు. ప్రజలు కట్టుకథలకు చెవినిస్తున్నారు. చివరి దినాల్ని దృష్టిలో ఉంచుకొని అపోస్తలుడు పౌలు ఇలా అంటున్నాడు, “జనులు హితబోధను సహింపక...కల్పనా కథలవైపుకు తిరుగు కాలము వచ్చును” 2 తిమోతి 4:3,4. ఆ కాలం వచ్చేసింది. జనులు బైబిలు సత్యాన్ని కోరటం లేదు. ఎందుకంటే అది వారి పాపేచ్ఛలకు, లోకాశలకు అడ్డు తగులుతున్నది. వారు కోరుకొంటున్న మోసాల్ని సాతాను సరఫరా చేస్తున్నాడు.GCTel 561.2

    అన్ని సిద్ధాంతాలకు సకల సంస్కరణలకు ప్రామాణికంగా బైబిలుని మాత్రమే ఉపయోగించే ప్రజలు దేవునికి భూమిపై ఉంటారు. మేధావుల అభిప్రాయాలు, శాస్త్రజ్ఞుల అంచనాలు, మత విశ్వాసాలు, మత సభల తీర్మానాలు, అధిక సంఖ్యాకుల స్వరంఇందులో ఏ ఒక్కదాన్ని లేదా వీటన్నిటినీ మత విశ్వాసానికి అనుకూలంగానే ప్రతి కూలంగానే పరిగణించటానికి లేదు. ఏదైనా సిద్ధాంతాన్నిగాని, సూత్రాన్నిగాని అంగీకరించక ముందు దానికి ఆధారంగా “అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” అన్న ప్రమాణ వాక్యాన్ని చూపించుమని డిమాండు చేయాలి.GCTel 562.1

    దేవునికి గాక మానవుడికి ప్రాధాన్యాన్ని ఆకర్షించటానికి సాతాను సర్వదా కృషి చేస్తాడు. తమ విధి ఏమిటో తెలుసుకోటానికి లేఖనాల్ని పరిశోధించే బదులు తమకు మార్గ నిర్దేశం చేసేందుకు మనుషులు బిషప్పుల్ని, పాదురుల్నీ వేదాంత ఆచార్యుల్ని ఆశ్రయించేటట్లు వారిని సాతాను నడిపిస్తాడు. అనంతరం ఈ నేతల మనసుల్ని అదుపుచేయటం ద్వారా తనకు నచ్చిన విధంగా ప్రజల్ని ప్రభావితం చేస్తాడు.GCTel 562.2

    క్రీస్తు జీవపు మాటలు మాట్లాడటానికి వచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఆ మాటలు విని సంతోషించారు. అనేకమంది యాజకులు, పరిపాలకులు సహా ఆయనను విశ్వసించారు. కాని యాజకుల ప్రధాని ప్రజాప్రముఖులు ఆయనను ఖండించి ఆయన బోధలను నిరాకరించటానికి కృత నిశ్చయులయ్యారు. ఆయన మీదికి ఏమి ఆరోపణలు తేవాలా అన్న విషయమై దిక్కుతోచకపోయినా, దైవశక్తి ప్రభావాన్ని ఆయన మాటల్లోని వివేకాన్ని గుర్తించకుండా ఉండలేకపోయినా వారిలో ద్వేషం గూడుకట్టుకొన్నది. ఆయన మెస్సీయ అని చూపించే స్పష్టమైన నిదర్శనాన్ని ఆయన శిష్యులివ్వవలసివస్తుందని వారు తోసిపుచ్చారు. యేసుని వ్యతిరేకిస్తున్న ఈ పెద్దమనుష్యుల్ని ప్రజలు తమ చిన్ననాటించి గౌరవించటానికి, వారి అధికారానికి తలవంచటానికి నేర్చుకొన్నవారే. “మన పాలకులు, పండితులైన మన శాస్త్రులు యేసును ఎందుకు విశ్వసించటంలేదు? ఆయన క్రీస్తే అయి ఉంటే ఈ భక్తాగ్ర గణ్యులు ఆయనను అంగీకరించి ఉండరా?” అని వారు ప్రశ్నించారు. అలాంటి బోధకుల ప్రభావమే యూదు ప్రజలు తమ విమోచకుణ్ని నిరాకరించటానికి దారి తీసింది.GCTel 562.3

    ఆ యాజకుల్ని అధికారుల్ని ముందుకు నడిపిన స్వభావాన్నే ఎంతో భక్తిపరులుగా పైకి కనిపించే అనేకమంది ప్రదర్శిస్తున్నారు. ఈ దినాలకు వర్తించే సత్యాలను గూర్చిన లేఖన సాక్ష్యాన్ని పరిశీలించటానికి వారు నిరాకరిస్తారు. తమ పెద్ద సంఖ్యను భాగ్యాన్ని పలుకుబడిని గూర్చి చెప్పుకొంటూ వారు సత్యాన్ని ప్రబోధించేవారిని, కొద్దిమంది, బీదలు, ఊరూ పేరూలేని వారు, లోకంలో ఎవరికీ లేని నమ్మకాలు కలవాళ్లు అంటూ ద్వేషం వెళ్లగక్కుతారు.GCTel 563.1

    శాస్త్రులు పరిసయ్యులు చూపిస్తున్న అధికార దర్పం యూదులు చెదిరిపోవటంతో ఆగదని క్రీస్తు ముందే గ్రహించాడు. మనస్సాక్షిని శాసించే మానవాధికారాన్ని అందలం ఎక్కించటాన్ని గురించి ఆయన ప్రవచన దృష్టితో చూశాడు. అది అన్ని యుగాల్లోనూ సంఘానికి శాపంగా ఉంటూ వచ్చింది. శాస్త్రులు పరిసయ్యుల మీద ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు, ఈ గుడ్డినాయకుల్ని వెంబడించవద్దంటూ ప్రజలకు ఆయన చేసిన హెచ్చరికలు భావి తరాల వారికి హితబోధగా దాఖలై ఉన్నాయి.GCTel 563.2

    లేఖనాలకు అర్థం చెప్పే హక్కు ప్రబోధక వర్గానికి రోమను సంఘం దఖలుపర్చింది. డైవ వాక్యాన్ని వివరించే హక్కు ప్రబోధకులకే ఉన్నదన్న నెపంతో బైబిలుని సామాన్య ప్రజల అందుబాటులో లేకుండా ఉంచారు. సంస్కరణోద్యమం లేఖనాల్ని ప్రజలందరికి అనుగ్రహించగా, రోమను సంఘం అనుసరిస్తున్న అదే సూత్రం ప్రొటస్టాంట్ సంఘాల్లో ఉన్న జన సమూహాల్ని బైబిలుని సొంతంగా పరిశోధించకుండా ఆటంకపర్చుతున్నది. బైబిలు బోధనలకు సంఘం చెప్పే అర్ధాన్ని మాత్రమే అంగీకరించాల్సిందిగా సభ్యులకు బోధించటం జరుగుతుంది. లేఖన బోధ ఎంత విస్పష్టంగా ఉన్నా సంఘ బోధనలకుగాని సంఘ విశ్వాసానికి గాని విరుద్ధమైన ఏ అంశాన్ని ససేమిరా అంగీకరించని సభ్యులు వేలకొద్దీ ఉన్నారు.GCTel 563.3

    అబద్ధ బోధకుల గురించి బైబిలు నిండా హెచ్చరికలు ఉన్నప్పటికీ అనేకులు తమ ఆత్మల్ని బోధకులకు అప్పగించటానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసులమని చెప్పుకొనే వారిలో అనేకమంది తమ విశ్వాసానికి హేతువు చెప్పమంటే తమ పాదిరి ఉపదేశించింది. నమ్ముతున్నామంటారే తప్ప కారణమేమీ ఇవ్వలేరు. రక్షకుని బోధనల్ని విడిచిపెట్టి బోధకుల మాటల్ని పూర్తిగా విశ్వసిస్తారు. అయితే బోధకులు దోషరహితులా? వారు దైవ వాక్యాన్ని ప్రచురించే వారని దేవుని వాక్యం నుంచి తెలుసుకుంటే తప్ప వారి మార్గదర్శకత్వానికి మన ఆత్మల్ని ఎలా అప్పగించుకోగలం? ప్రపంచ మార్గాలనుంచి పక్కకు తప్పుకోవటానికి చొరవ తీసుకోకపోవటం మేధావులను వెంబడించటానికి అనేకుల్ని నడిపిస్తుంది. తమంతట తాము పరిశోధించటానికి వారు కనుపర్చుతున్న అయిష్టత వల్ల వారు పొరపాటు బంధాల్లో చిక్కుకు పోతున్నారు. ఈ దినాలకు అవసరమైన సత్యాల్ని బైబిలు మన దృష్టికి తెస్తున్నది. సత్యాన్ని ప్రకటించటంలో సహకరిస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని వారు గుర్తిస్తారు. అయినా బోధక వర్గం వ్యతిరేకత సత్యం నుంచి తమను మళ్లించటానికి వారు సమ్మతిస్తారు. మేధ మనస్సాక్షి వాస్తవాన్ని గ్రహించినా వంచనకు గురి అయిన ఈ వ్యక్తులు వారి బోధను కాదని వేరుగా తలంచరు. వారి వ్యక్తిగత పరిశీలన, వారి నిత్యాసక్తులు ఇంకొకరి అవిశ్వాసానికి, అహంకారానికి, ద్వేషానికి బలి అవుతాయి.GCTel 564.1

    తన బానిసల్ని మానవ ప్రభావంతో బంధించటానికి సాతానుకి సవాలక్ష మార్గాలున్నాయి. క్రీస్తు శత్రువులతో ప్రేమానుబంధాలు పెంచుకోనేటట్లు ప్రభావితం చేయటం ద్వారా జనుల్ని తనకు దగ్గర చేసుకొంటాడు. ఈ సాన్నిహిత్యం తల్లిదండ్రులు, పిల్లలు, భార్యభర్తలు వంటిదేదైనాకావచ్చు. కాని దాని ఫలితం ఒక్కటే. సత్యాన్ని వ్యతిరేకించేవారు మనస్సాక్షిని అదుపుచేయటానికి ప్రయత్నిస్తారు. వారి ఆధీనంలో ఉన్న ఆత్మలకు విధి విషయంలో తమ నమ్మకాలను అనుసరించే ధైర్యంగాని స్వతంత్రతగాని ఉండదు.GCTel 564.2

    దేవుని సత్యం మహిము కలిసే ఉంటాయి, వాటిని విడదీయలేం. బైబిలు అందుబాటులో ఉండగా తప్పుడు అభిప్రాయాలతో దేవుని మహిమ పర్చటం అసాధ్యం. జీవితం సవ్యంగా వుంటే చాలు, వ్యక్తి ఏమి నమ్ముతున్నాడన్నది ఏమంత ప్రాముఖ్యం కాదని అనేకుల వాదన. కాని విశ్వాసమే జీవితాన్ని తీర్చి దిద్దుతుంది. సత్యమూ వెలుగూ అందుబాటులో ఉండి కూడా వినటానికి చూడటానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగపర్చుకోకపోతే వాటిని మనం నిరాకరిస్తున్నట్లు లెక్క. వెలుగును విసర్జించి చీకటిని ఎంపిక చేసుకొంటున్నట్లే.GCTel 564.3

    “ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. అయినను తుదకు అది మరణమునకు చేరును.” సామెతలు 16:25. దేవుని చిత్తం తెలుసుకొనే అవకాశం ఉన్నప్పుడు పాపం చేయటానికి ఎలాంటి సాకూ లేదు. అజ్ఞానం సాకు కానేకాదు. ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి అనేక మార్గాలు కలిసే స్థలానికి వస్తాడు. ఆయామార్గాలు ఎక్కడెక్కడికి వెళ్తాయో సూచించే బోర్డు అక్కడ ఉంటుంది. అతను ఆ గమనిక బోర్డును పట్టించుకోకుండా తనకు సరైందిగా తోచే మార్గాన్ని అనుసరిస్తే తాను ఎంత నిజాయితీపరుడైనా అతను అనుసరిస్తున్నది తప్పుదారి కావచ్చు.GCTel 565.1

    బైబిలు బోధించే సత్యాన్ని చదివి తెలుసుకొని దాని ప్రకారం జీవించాలని ఉద్దేశించి దేవుడు మనకు దాన్నిచ్చాడు. “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను” అని అడిగిన న్యాయవాదితో లేఖనాల్ని ప్రస్తావిస్తూ రక్షకుడిలా అన్నాడు, “ధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీవేమి చదువుచున్నావు?” అజ్ఞానం క్షంతవ్యం కాదు. అది వృద్ధులందేగాని యువజనులందేగాని, ధర్మశాస్త్ర అతిక్రమానికి కలిగే శిక్ష నుంచి” వారికి విముక్తి ఉండదుకూడా. కారణమేమంటే ఆ ధర్మశాస్త్రం, దాని నియమాలు విధుల విశదీకరణ వారి చేతుల్లోనే ఉన్నవి. సదుద్దేశాలు మాత్రమే చాలవు. ఒకవ్యక్తికి సవ్యంగా కనిపించేదిగాని లేదా సత్యమని బోధకుడు చెప్పింది కాని చాలదు. అతని రక్షణకు సంబంధించిన విషయం అది. అతను తనకైతానే లేఖనాలు పరిశోధించాల్సి ఉంది. బోధకుడికి సత్యం బాగా తెలుసు అని విశ్వాసి ఎంత బలంగా నమ్మినప్పటికీ అతని విశ్వాసానికి పునాది ఇదికాదు. పరలోకం దిశగా సాగుతున్న ప్రయాణంలో మార్గ సూచనల పట్టిక అతని వద్ద ఉన్నది. అతను ఊహించుకోవలసిన పనిలేదు. సత్యం ఏమిటో లేఖనాలు చదివి తెలుసుకొని ఆ వాక్యకాంతిలో సడుస్తూ తన మాదిరిని అనుసరించాల్సిందిగా ఇతరుల్ని ప్రోత్సహించటం విజ్ఞత గలవారి ప్రధమ కర్తవ్యం. మనం బైబిలుని అనుదినం శ్రద్ధగా పఠించాలి. లేఖనంతో లేఖనం పోల్చుతూ ప్రతీ భావాన్ని లోతుగా పరిశీలించాలి. దేవునికి మనం జవాబుదారులం గనుక దేవుని సహాయంతో మన అభిప్రాయాన్ని మనమే ఏర్పర్చుకోవాలి.GCTel 565.2

    బైబిలు స్పష్టంగా బయలు పర్చుతున్న సత్యాల్ని విద్వాంసులు సందేహాలు అనుమానాలతో నింపి గొప్ప వివేకవంతులుగా నటిస్తూ లేఖనాలకు మర్మమైన అధ్యాత్మికమైన అర్ధం ఉన్నదని అది ప్రస్తుతం వాడిన భాషలో కనిపించటం లేదని బోధిస్తారు. ఈ పెద్దమనుషులు అబద్ధ బోధకులు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే యేసు ఇలా అన్నాడు, “మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగకపోవుట వలననే పొరబడుచున్నారు.” మార్కు 12:24. చిహ్నం లేదా ఛాయారూపం ఉపయుక్తమైతే తప్ప బైబిలు భాషకు ప్రత్యక్ష భావం చెప్పుకోవాలి. క్రీస్తు ఈ వాగ్దానం చేశాడు, “ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయనిశ్చయించు కొనిన యెడల ఆ బోధ... తెలిసికొనును” యోహాను 7:17. మనుషులు బైబిలుని యథాతథంగా అంగీకరిస్తే, వారి మనసుల్ని గజిబిజి పర్చటానికీ, తప్పుదారి పట్టించటానికి అబద్ధ బోధకులు లేకపోతే ఫలితంగా జరిగే పని దేవదూతలకు ఆనందం కలిగించి ప్రస్తుతం తప్పుడు సిద్ధాంతాల్లో కొట్టుమిట్టాడుతున్న వేవేల ప్రజల్ని క్రీస్తు సంఘంలోకి తీసుకువస్తుంది.GCTel 566.1

    మన మానసిక శక్తులన్నింటినీ ధారపోసి లేఖన పఠనం చేసి, మన అవగాహనా శక్తిని కేంద్రీకరించి, మానవులకు దేవుని గాఢమైన విషయాల్ని సాధ్యమైనంత మేరకు గ్రహించాలి. నేర్చుకోగోరే వ్యక్తికి చిన్న పిల్లలకుండే సాధుగుణం వినమ్ర స్వభావం ఉండాలని మరవరాదు. తత్వసంబంధిత సమస్యల్ని గ్రహించే పద్ధతుల్లో లేఖన సమస్యల్ని పరిష్కరించటం సాధ్యం కాదు. విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవటంలో అనేకులు ప్రదర్శించే ఆత్మవిశ్వాసంతో ఎన్నడూ బైబిలు అధ్యయనానికి పూనుకో కూడదు. ప్రార్ధన పూర్వకంగా దేవునిపై ఆధారపడి ఆయన చిత్రాన్ని తెలుసుకోవాలన్న కోరికతో బైబిలు పఠించాలి. నేను ఉన్నాను అనే గొప్ప దేవుని వద్ద నుంచి జ్ఞానం పొందటానికి మనం వినయులమై సిద్ధమనసు కలిగి ఉండాలి. లేకపోతే దుష్ట దూతలు మనకు అంధత్వం కలిగించి సత్యాన్ని గ్రహించకుండా మన మనసుల్ని కఠినపర్చుతారు. GCTel 566.2

    జ్ఞానులు మర్మాలుగా భావించే లేదా ప్రాముఖ్యం కానివిగా తలంచి విడిచి పెట్టే అనేక లేఖన భాగాలు క్రీస్తు ఉపదేశాన్ననుసరించే భక్తుడికి ఎంతో ఆదరణను జ్ఞానాన్ని అందిస్తాయి. దైవ వాక్యం గురించి ధర్మశాస్త్ర వేత్తలు అనేకమందికి స్పష్టమైన అవగాహన లేక పోవటానికి ఒక కారణం తాము ఆచరించటానికి ఇష్టపడని బైబిలు సత్యాల్ని చూడకుండా కళ్లు మూసుకోకుండటానికి వాటిని అర్ధం చేసుకోటానికి మేధ కన్నా ఏకాగ్రతను నీతిని కాంక్షించే చిత్తశుద్ధి అవసరం.GCTel 566.3

    ప్రార్ధన చేసుకోకుండా బైబిలుని ఎన్నడూ పఠించకూడదు. అవగాహనకు సులభమైన అంశాల ప్రాముఖ్యాన్ని గుర్తించటానికి లేదా గ్రహించటం కష్టమైన విషయాలతో సతమతం కాకుండా మనల్ని తప్పించటానికి పరిశుద్ధాత్మ మాత్రమే సమరుడు. దైవవాక్య సౌందర్యానికి ముగ్గులం కావటానికి, దాని హెచ్చరికల నుంచి ఉపదేశం పొందటానికి లేదా దానిలోని వాగ్దానాల నుంచి ఉద్రేకాన్ని శక్తిని పొందటానికి మన హృదయాల్ని సన్నద్ధ పర్చటం పరలోక దూతల కర్తవ్యం. కీర్తన కారుడి ఈ విజ్ఞాపన మనది కావాలి, ” నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము” కీర్తనలు 119:18. శోధనలు తరచు జయించరానివిగా కనిపిస్తాయి. ప్రార్ధనసు బైబిలు పఠనాన్ని అశ్రద్ధ చేయటం దేవుని వాగ్దానాల్ని గుర్తుచేసుకొని వాక్య ఆయుధంతో సాతాన్ని ఎదుర్కోలేక పోటమే అందుకు కారణం. కాగా దైవ సంగతులు నేర్చుకోవటానికి ఆశించే వ్యక్తుల చుట్టూ దేవదూతలుంటారు. గొప్ప అవసరం ఏర్పడ్డప్పుడు వారికి అగత్యమైన సత్యాన్ని వారి స్పురణకు తెస్తారు. “సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు” యెషయ 59:19.GCTel 567.1

    “ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయును” అని యేసు తన శిష్యులికి వాగ్దానం చేశాడు. యోహాను 14:26 అయితే కష్ట సమయంలో పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేయటానికిగాను క్రీస్తు బోధనల్ని ముందే మనం మన మనసుల్లో దాచుకోటం జరగాలి. “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను” అంటున్నాడు దావీదు. కీర్తనలు 119:11GCTel 567.2

    నిత్య జీవాన్ని విలువగలదిగా పరిగణించేవారందరూ అవిశ్వాసానికి లోను కాకుండా చూసుకోవాలి. సత్యానికాధారమైన స్తంభాలనే కూలదోయటానికి ప్రయత్నాలు జరుగుతాయి. నవీన నాస్తిక తత్వ బోధనలకు అతీతంగా ఉండటం సాధ్యంకాదు. అన్ని వర్గాల ప్రజలకు సరిపడే విధంగా సాతాను తన శోధనల్ని మలుచు కొంటాడు. చదువులేని వాళ్లలో అపహాస్యంతో లేదా ఎగతాళితో, విద్య ఉన్నవారితో శాస్త్ర సంబంధిత అభ్యంతరాలు, తాత్విక హేతువాదాలతో లేఖనాలపట్ల అవిశ్వాసం లేదా వ్యతిరేకత పుట్టించటానికి అతను ప్రయత్నిస్తాడు. అనుభవం ఏమంత లేని యువత కూడా క్రైస్తన మత ప్రాధమిక సూత్రాల విషయంలో సందేహాలు సంశయాలు వ్యక్తంచేస్తూ వ్యంగ్యదూషణలకు దిగుతారు. యువతలోని నాస్తికత ఎంత స్వల్పమైన దైనా దాని ప్రభావం ఉంటుంది. ఈ విధంగా అనేకులు తమ తండ్రుల విశ్వాసాన్ని ఎగతాళి చేయటం కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించటం జరుగుతున్నది. హెబ్రీ 10:29. దేవునికి మహిమకరంగాను, లోకానికి దీవెనకరంగాను ఉండగలిగే అనేకమంది జీవితాలు నాస్తిక భావాల దుర్గంధం వల్ల హేయమైపోతున్నాయి. మానవ జ్ఞానం ఆధారంగా జరిగే తీర్మానాల్ని నమ్ముకొని దైవ మర్మాల్ని వివరించి దేవుని జ్ఞానం సహాయం లేకుండా సత్యాల్ని గ్రహించగలమని డంబాలు పలికేవారందరూ సాతాను ఉచ్చుల్లో చిక్కుకొన్న వారే.GCTel 567.3

    లోక చరిత్రలో అతి గంభీర కాలంలో మనం నివసిస్తున్నాం. లోకంలోని అసంఖ్యాక ప్రజానీకం భవిష్యత్తు నిర్ణయం కాబోతున్నది. భవిష్యత్తులో మన క్షేమం ఇంకా ఇతరుల రక్షణ ఇప్పుడు మనం అనుసరిస్తున్న జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు మార్గదర్శకుడు కావాలి. క్రీస్తును విశ్వసించే ప్రతి వ్యక్తి “ప్రభువా, నేనేం చేయాలని కోరుతున్నావు.? “అని ఆయన్ని అడగాలి. ప్రభువు ముందు ఉపవాసంతోను ప్రార్ధనతోను మనల్ని మనం తగ్గించుకొని ఆయన వాక్యంపై మరీ ముఖ్యంగా తీర్పు సన్ని వేశాలపై ధ్యానం చేయటం అవసరం. దైవ సంగతుల్లో ఇప్పుడు మనం వాస్తవానుభవం సంపాదించాలి. ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయటానికి లేదు. ప్రాముఖ్యంగల ఘటనలు మన చుట్టూ సంభవిస్తున్నాయి. మనం సాతాను వశంలోని భూమిపై నివసిస్తున్నాం. దేవుడు నియమించిన కావలివారలారా నిద్రపోకండి. ఏ నిముషంలోనైనా మీరు అజాగరూకులై కునికి నిద్రిస్తే మీదపడి మిమ్మల్ని కబళించటానికి విరోధి సిద్ధంగా ఉన్నాడు.GCTel 568.1

    దేవుని పరిగణనలో తమ యధార్ధ పరిస్థితి విషయంలో అనేకులు మోసపోతున్నారు. తప్పుడు పనులేమీ చేయనందుకు తమ్మును తాము అభినందించుకొంటారు. కాని తాము చేయాలని దేవుడు కోరుతున్న మంచి పనుల గురించి వాటిని తాము చేయక పోవటాన్ని గురించి చెప్పటం వారు మర్చిపోతారు. వారు దేవుని తోటలో చెట్లయి ఉండటమే చాలదు. ఫలాలు ఫలించటం ద్వారా ఆయన ఆశించిన దాన్ని అందిస్తున్నది. తన కృప సమకూర్చుతున్న శక్తితో తాము చేయగలిగిన మేలు చేయనందుకు వారిని ఆయన జవాబు దారులు చేస్తాడు. పరలోక గ్రంథాల్లో వారు నేలకు భారమైన వ్యక్తులుగా దాఖలవుతారు. అయినా ఈ తరగతి ప్రజలు కూడా పూర్తిగా నిరీక్షణ లేని వారు కాదు. దేవుని కృపను తృణీకరించి ఆయన దయను దుర్వినియోగ పర్చిన వారి కోసం దీర్ఘశాంతం గల ఆ ప్రేమా హృదయం విజ్ఞాపన చేస్తుంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును... దినములు చెడ్డవి గనుక సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుము... జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ” ఎఫెసీ 5:1416.GCTel 568.2

    పరీక్షా సమయం వచ్చినప్పుడు తమ జీవితానికి దైవ వాక్యాన్ని ఒరవడిగా గైకొన్న వారు ఎవరో తెలిసిపోతుంది. గ్రీష్మ రుతువులో ఎవర్ గ్రీన్ వృక్షాలకు తక్కిన వృక్షాలకు మధ్య చెప్పుకోదగ్గ తేడా ఉండదు. అయితే శీతాకాలం రాగానే ఎవర్ గ్రీన్ చెట్లలో మార్పేమీ ఉండదు. తక్కిన చెట్ల ఆకులు రాలిపోతాయి. అలాగే కపట క్రైస్తవుడికి యధార్థ క్రైస్తవుడికి మధ్య ఇప్పుడు తేడా ఏమీ కనిపించక పోవచ్చు. అయితే తేడా కనిపించే సమయం వస్తున్నది. వ్యతిరేకత, మత దురభిమానం, అసహనం మళ్లీ తల ఎత్తనివ్వండి. హింసాగ్నులు రాజుకోనివ్వండి. సత్యం విషయంలో అర్ధాంగీకారం గల వారు కపట క్రైస్తవులు ఊగిసలాడి తమ విశ్వాసాన్ని వదులుకొంటారు. యాధార్థ క్రైస్తవులు బండవలె స్థిరంగా నిలబడ్డారు. సుఖసంపదలున్న దినాలకన్నా ఇప్పుడు వారి విశ్వాసం మరింత బలంగాను, వారి నిరీక్షణ మరింత ప్రకాశవంతంగాను ఉంటాయి.GCTel 569.1

    కీర్తన కారుడు అంటున్నాడు. “నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను.” “నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్ట మార్గము లన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. “కీర్తనలు 119:99,104.GCTel 569.2

    “జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు” “వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపుమానదు.” సామెతలు 3:13; యిర్మీయా 17:8.GCTel 569.3