Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

మహా సంఘర్షణ

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయం 11—సామంత రాజుల నిరసన

    సంస్కరణకు అనుకూలంగా నిల్చిన ఉత్తమ సాక్ష్యాలలో ఒకటి 1529 లో స్పయిర్ నగరంలో జరిగిన డయట్ లో జర్మనీ దేశపు క్రైస్తవ సామంత రాజుల నిరసన అని చెప్పవచ్చు. ఆ దైవ జనుల ధైర్యం, విశ్వాసం దృఢత్వం భావితరాలకు భావ స్వాతంత్ర్యం, అంతరాత్మ స్వాతంత్ర్యం సాధించి పెట్టాయి. వారి నిరసన దిద్దుబాటు సంఘానికి “ప్రొటస్టాంట్” అన్న పేరును ఇచ్చింది. దాని సూత్రాలు “ప్రొటస్టాంబు తత్వంలో ప్రధానాంశాలు” అయ్యాయి. డి అబినీ, పుస్త 13, అధ్యా 6.GCTel 177.1

    సంస్కరణోద్యమానికి భయంకర చీకటి దినం వచ్చింది. లూథర్ సమాజ బహిష్కుతుడని ఆయన సిద్ధాంతాల ప్రబోధణ గాని వాటి స్వీకరంగాని నిషిద్ధమన్న వరమ్స్ సభ ఆదేశం ఉన్నప్పటికీ సామ్రాజ్యంలో మత సహనం అప్పటి వరకూ ఉంటూనే వచ్చింది. సత్యాన్ని వ్యతిరేకిస్తున్న శక్తుల్ని దేవుని కృప అదుపులో ఉంచింది. సంస్కరణ కృషిని నలగ దొక్కాలని చార్లెస్ 8 కృత నిశ్చయంతో ఉన్నాడు. కాని ఆ దుష్క్రియ చేయటానికి అతడు చేయి ఎత్తినప్పుడల్లా దెబ్బపడకుండా ఒక శక్తి అడ్డుకున్నది. రోము అధికారాన్ని వ్యతిరేకించే వారందరి తక్షణ నాశనం తథ్యమన్నది పదేపదే కనిపించేది. కాని సమయం వచ్చినప్పుడు తూర్పు సరిహద్దులో టర్క్ సైన్యం దర్శనమివ్వటం లేదా ఫ్రాన్స్ రాజు లేదా పెరుగుతున్న చక్రవర్తి ప్రాబల్యం విషయంలో అసూయచెంది పోపే యుద్ధానికి దిగటం జరిగేది. ఇలా రాజ్యాల మధ్య యుద్ధం, గందరగోళం వల్ల సంస్కరణోద్యమం బలోపేతమై విస్తరించింది.GCTel 177.2

    తుదకు పోపు మతావలంబులైన రాజులు తమ మధ్య ఉన్న విభేదాలను సరిచేసుకొని సంస్కర్తలతో కలసికట్టుగా పోరాడటానికి తీర్మానించుకొన్నారు. సర్వసభ్య సమావేశం జరిగే వరకు మత సంబంధిత విషయాల్లో ప్రతీ రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని 1526 లో స్పయిర్స్ లో జరిగిన డయట్ తీర్మానించింది. అయితే ఈ రాయితీకి కారణమైన గండాలు గడిచిపోయిన మరుక్షణమే సిద్ధాంత వ్యతిరేకతను చితక తొక్కడానికి 1529 లో స్పయిర్స్ లో రెండోసారి డయటు సమావేశ పర్చాడు చక్రవర్తి. సాధ్యమైనంత వరకు శాంతి పద్ధతులలో ప్రోత్సహించి సంస్కరణకు వ్యతిరేకంగా సామంతరాజుల సహకారాన్ని పొందాలన్నది చార్లెస్ అభిమతం. అది సాధ్యం కాకుంటే కరవాలం తిప్పేందుకు చార్లెస్ సిద్ధమే.GCTel 177.3

    పోపునేతల స్కంధావరంలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. వారు పెద్ద సంఖ్యలో స్పయిలో సమావేశమై సంస్కర్తల పట్ల వారిని ఆదరిస్తున్న వారిపట్ల తము ప్రాతికూల్యాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. అప్పుడు మెలంగ్ తన్ అన్న మాటలివి, “లోకం అసహ్యించుకొని తుడిచి పారేసిన వాళ్లం మేము. అయినా క్రీస్తు తన బీద ప్రజలవంక చూసి వారిని భద్రంగా కాపాడాడు”- అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5. డయలకు హాజరైన సువార్త వాద సామంతరాజుల నివాసాల్లో కూడా సువార్త బోధ జరగకూడదన్న ఆంక్ష జారీ అయ్యింది. కాగా స్పయిర్స్ జనులు వాక్యదాహర్తితో నిషేధాజ్ఞను లెక్కచేయకుండా దైవ వాక్యం వినటానికి సేక్సనీ ఓటరు దేవాలయంలో జరుగుతున్న ఆరాధనకు వేల సంఖ్యలో హాజరయ్యారు.GCTel 178.1

    ఈ ఘటన సంక్షోభానికి నాంది పలికింది. మనస్సాక్షి స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ జారీ చేసిన తీర్మానం తీవ్ర అశాంతికి దారితీస్తున్నందున దాని రద్దుకు చక్రవర్తి ఆదేశించటమయ్యిందని డయలో ఒక ప్రకటన జరిగింది. ఈ నిరంకుశ చర్య సువార్త వాద క్రైస్తవులలో కోపోద్రేకాలు రేపింది. ఒక రిలా అన్నారు, “క్రీస్తు మళ్లీ కైఫా పిలాతుల చేతుల్లో పడ్డాడు.” రోము మతవాదులు మరింత దౌర్జన్యానికి పూనుకొన్నారు. పోపు మత దురభిమాని ఒకరిలా అన్నారు, “లూథరన్లకన్నా టర్కులే నయం. టర్కులు ఉపవాసదినాలు ఆచరిస్తుంటే లూథరన్లు వాటిని అతిక్రమిస్తున్నారు. దేవుని పరిశుద్ధ లేఖనాలు, సంఘంలోని పాత తప్పులు, ఈ రెంటిలో ఒకటి ఎన్నుకోవలసి వస్తే మనం మొదటిదాన్ని తిరస్కరించాలి” (” ఫేబర్ ప్రతి రోజూ సువార్త వాదులమైన మామీదికి ఏదో ఒక కొత్త రాయి విసరుతూనే ఉంటాడు” అన్నాడు. మెలంతన్ నిండుసభలో అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5.GCTel 178.2

    మత సహనం చట్టబద్ధంగా నెలకొన్న వ్యవస్థ. కనుక తమ హక్కుల ఉల్లంఘనను వ్యతిరేకించాలని సువార్తవాద రాష్ట్రాలు తీర్మానించాయి. వమ్స్ శాననం విధించిన నిషేధానికి లూథర్ ఇంకా బద్దుడు కావలసి ఉన్నందువల్ల స్పయిర్స్ సభకు హాజరు కావటానికి అనుమతి లేదు. కాని ఈ అత్యవసర పరిస్థితిలో ఆయన సహచరులు తన కార్యానికి మద్దతు నివ్వటానికి దేవుడు లేపిన సామంతరాజులు భర్తీ చేశారు. లూథర్ కి సంరక్షకుడుగా వ్యవహరించిన ఉత్తముడు సేక్సనీవాడు అయిన ఫ్రెడ్రిక్ మరణించాడు. ఆయన సోదరుడు వారసుడు అయిన డ్యూక్ జాన్ సంస్కరణను ఆనందంగా ఆహ్వానించాడు. డ్యూక్ జాన్ శాంతి కాముకుడు. అయినా విశ్వాస సంబంధిత విషయాల్లో గొప్ప ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని కనపర్చాడు. GCTel 178.3

    సంస్కరణను అంగీకరించిన రాష్ట్రాలు బేషరతుగా రోము అధికారానికి లొంగాలని ప్రీస్టులు డిమాండ్ చేశారు. సంసర్తలైతే గతంలో తమకున్న స్వాతంత్ర్యం కొనసాగాలని కోరారు. దైవ వాక్యాన్ని ఆనందంగా స్వీకరించిన రాష్ట్రాలు రోము నియంత్రణ కిందకు వెళ్లడానికి ససేమిరా అన్నాయి.GCTel 179.1

    చివరగా ఒక రాజీ ప్రతిపాదన వినవచ్చింది. దానిలో ఈ అంశాలున్నాయి: సంస్కరణ బలంగా పాదుకోని చోట వమ్స్ శాసనం కఠినంగా అమలుకావాలి; ఎక్కడైతే ప్రజలు దాన్ని అమలు పర్చలేక పోతున్నారో, ఎక్కడైతే తిరుగుబాటు ప్రమాదం ఉన్నందువల్ల దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారో అక్కడ నూతన సంస్కరణలు తేకూడదు. వివాదాస్పద అంశాల్ని ప్రస్తావించకూడదు; మాస్ ఆచరణను వ్యతిరేకించకూడదు; రోమను కథోలికు లూథర్ మతానికి మారటానికి అనుమతించ కూడదు.” - అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5. ఈ చట్టం డయట్ ఆమోదం పొందింది. పోపుమత ప్రీస్టులకు ప్రిలేట్లకు ఇది సంతృప్తి కలిగించింది.GCTel 179.2

    ఈ శాసనం అమలైతే సంస్కరణ విశ్వాసం ప్రవేశించని చోట్లకు సంస్కరణను విస్తరించటం, సంస్కరణ సత్యం ఎక్కడైతే ఉన్నదో అక్కడ దాన్ని బలమైన పునాది మీద స్థాపించటం జరగదు.”- అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5. వాక్ స్వాతంత్ర్యం నిషిద్రమౌతుంది. రోము మతం నుంచి మార్పిడులకు ఆమోదముండదు. ఈ ఆంక్షలు నిషేధాల విషయంలో సంస్కరణ వాదులు వెంటనే లొంగిపోవాలి. ప్రపంచం పెట్టుకొన్న ఆశలు కుప్పకూలిపోడానికి సిద్ధంగా ఉన్నాయి. రోము మత తత్వ పునరుద్ధరణ... పూర్వ దురాచారాన్ని తు.చ. తప్పకుండా తిరిగి తెస్తుంది. ” ఇప్పటికే మతమౌఢ్యం వల్ల, విభేదాలవల్ల, అల్లకల్లోలమైన సంస్కరణ కృషి పూర్తి నాశనానికి ” అవకాశం సులభంగా లభిస్తుంది.. అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5.GCTel 179.3

    సువార్త వాదులు సంప్రదింపుల కోసం సమావేశమయ్యారు. నిరాశగా ఒకరి వంక ఒకరు చూసుకొన్నారు. ఏంచేద్దాం?” అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకొన్నారు. లోకానికి అతి ముఖ్యమైన సమస్యలు వారి ముందున్నాయి. సంస్కరణ అధినాయకుడు లొంగిపోయి శాసనాన్ని అంగీకరిస్తాడా? నిజంగా ఇది భయంకర సమస్య. ఈ సంక్షోభ సమయంలో సంస్కర్తలు వాదోపవాదాలు చేసుకొని తప్పుదారి పట్టటం ఎంత సులభం! లొంగి పోవటానికి మంచి సాకులు ఎన్ని మంచి కారణాలు వారికి దొరికేవి! లూథర్ మతావలంబులైన సామంతరాజులు తమ మతాన్ని అవలంబించవచ్చునని హామీ ఇచ్చారు. తమ పాలనకింద ఉన్న ప్రజలు దిద్దుబాటు విశ్వాసాన్ని ఈ చట్టం అమలుకు ముందు స్వీకరించి ఉంటే వారికి కూడా ఈ వరం వర్తిస్తుంది. ఇది వారికి తృప్తికరంకాదా? లొంగిపోటం వల్ల ఎన్ని ప్రమాదాలు తప్పించుకోవచ్చు! వ్యతిరేకించటం ఎన్ని ప్రమాదాలకు, ఎన్ని సంఘర్షణలకు దారితీస్తుంది! భవిష్యత్తులో ఎన్ని అవకాశాలు వస్తాయో ఎవరు చెప్పగలరు? అందుకే శాంతిని కోరుకొందాం. రోము చాపిన మైత్రి హస్తాన్ని అందుకొని జర్మనీ గాయాలు మాన్పుదాం. ఇలాంటి వాదనలతో సంస్కర్తలు తాము తీసుకొనే ఏ చర్యనైనా సమర్ధించుకొని ఉండే వారు. తాము చేపట్టిన పనిని అది స్వల్ప వ్యవధిలోనే తప్పక ధ్వంసం చేసి ఉండేది.GCTel 180.1

    సంతోషించదగ్గ విషయమేంటంటే ఈ ఏర్పాటుకు ఆధారమైన సూత్రాన్ని వారు పరిశీలించారు. ఆ తర్వాత విశ్వాసంతో పనులు ప్రారంభించారు. ఏంటి ఆ సూత్రం? మనస్సాక్షిని ఒత్తిడి చేసి స్వేచ్ఛా పరిశోధనను నిషేధించే హక్కు రోముకున్నదన్నదే ఆ సూత్రం. అయితే తమ్మునుతాము పాలించుకొనేందుకు ప్రొబస్టాంట్ ప్రజలకు మత స్వతంత్రత ఉందిగదా? ఔను ఉంది. అయితే అది ఆ ఏర్పాటులో నిర్దేశించిన ప్రత్యేకాను గ్రహమేగాని హక్కుకాదు. ఆ ఏర్పాటు వెలపల ఉన్నవారందరి విషయంలో అధికారం అన్న గొప్ప సూత్రమే ముఖ్యం. అంతరాత్మ సందర్భంగా కోర్టుకు అధికారం లేదు. రోము తప్పుచేయని న్యాయనిర్ణేత ఆచరణ తప్పనిసరి. రోము ప్రతిపాదించిన ఈ ఏర్పాటును అంగీకరించటం మతస్వేచ్ఛ దిద్దుబాటు సేక్సనికి మాత్రమే పరిమితమై ఉండాలని ఒప్పుకోటమే ఔతుంది. ఇక తక్కిన క్రైస్తవలోకానికి సంబంధించినంతవరకు స్వేచ్ఛాపరిశోధన, దిద్దుబాటు విశ్వాసావలంబన, నేరాలు, ఆ నేరాలకు శిక్ష చీకటి కొట్టులో ముగ్గటం, మంటల్లో సజీవదహనం కావటం, మతస్వేచ్ఛను స్థానిక మొనరించటంవీటికి వారు సమ్మతిస్తారా? దిద్దుబాటు విశ్వాసాన్ని స్వీకరించటం ఇదే చివరిసారి అన్న ప్రకటనకు వారు సమ్మతించగలిగారా? సంస్కరణ వాదుల చివరి ఎకరం నేలను స్వాధీనపర్చుకొన్నామని, రోము ప్రాబల్యం ఎక్కడున్నదో అక్కడ దాని అధికారం సాగుతుందని ప్రకటన వెలువడినప్పుడు వారు సమ్మతించారా? ఈ ఏర్పాటుమేరకు పోపు ప్రాబల్యం గల రాష్ట్రాల్లో వందలు వేలకొద్దీ అమాయక ప్రజలు బలి కావలసి వచ్చినప్పుడు వారి రక్తం చిందించిన పాపం మాదికాదని సంస్కరణ వాదులు విజ్ఞాపన చేయగలిగి ఉండేవారా? అత్యవసర సమయంలో సువార్త కర్తవ్యానికి క్రైస్తవలోక స్వేచ్చలకు అది ద్రోహం తలపెట్టటమై ఉండేది. “. విలీ, పుస్త 9, అధ్యా 15. అది చేసేకన్నా “తమ సర్వస్వం - వారి రాష్ట్రాలు, వారి కిరీటాలు, వారి ప్రాణాలు త్యాగం చేసి ఉండేవారే” - డి అబినే, పుస్త 13, అధ్యా 5.GCTel 180.2

    “ఈ డిక్రీని తిరస్కరిద్దాం. అంతరాత్మకు సంబంధించిన విషయాల్లో మెజార్టీతో పని లేదు” అన్నారు. సామంతరాజులు, ప్రతినిధులు ఉన్నారు. “1526 లో వెలువడ్డ డిక్రీ దేశంలో శాంతి సమాధానాలు నెలకొల్పింది. అందుకు మేమెంతో కృతజ్ఞులం. అది రద్దుపడితే జర్మనీలో శ్రఘులు, విభజనలు చోటుచేసుకొంటాయి. సభ సమావేశమయ్యే వరకు మత స్వేచ్ఛను పరిరక్షించటం మాత్రమే డయట్ చేయగలుగుతుంది.”- అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5. అంతరాత్మ స్వాతంత్ర్యాన్ని కాపాడటం ప్రభుత్వ విహిత కర్తవ్యం. ఇదే మత సంబంధిత విషయాల్లోగాని, అధికారానికి హదు, పౌర అధికారంతో మతాచారాలను నియంత్రించటానికి లేదా అమలుపర్చటానికి ప్రయత్నించే ప్రతి లౌకిక ప్రభుత్వం సువార్తవాద క్రైస్తవులు ఏ సూత్రం కోసం పోరాడారో దాన్నే నాశనం చేస్తుంది.GCTel 181.1

    వారి “మొండి ధైర్యాన్ని ” అణగదొక్కాలని పోపునేతలు, నిశ్చయించుకొన్నారు. సంస్కరణ మద్దతుదారుల మధ్య విభేదాలు పుట్టించటానికి తమను బహిరంగంగా బలపర్చని వారిని భయపెట్టటానికి ప్రయత్నించారు. చివరగా స్వతంత్ర నగరాల ప్రతినిధులను డయట్ ముందుకు పిలిచి తాము ప్రతిపాదించిన షరతులకు వారు సమ్మతిస్తారో లేదో స్పందించాల్సిందని కోరారు. వారు కొంచెం వ్యవధిని కోరినా అది లభించలేదు. పరీక్షా సమయం వచ్చినప్పుడు వారిలో దాదాపు సగం మంది సంస్కర్తలను సమర్థించారు. అంతరాత్మ స్వాతంత్ర్యాన్ని వ్యక్తిగత నిర్ణయ హక్కుని త్యాగం చేయటానికి ఇలా నిరాకరించిన వారు తమవైఖరి భవిష్యత్తులో తమను విమర్శకు, ఖండనకు, హింసకు గురిచేస్తుందని ఎరుగుదురు. ప్రతినిధుల్లో ఒకరు ఇలా అన్నారు. ‘’మేము దేవుని వాక్యం నిజంకాదని అయినా బొంకాలి లేదా మంటల్లో కాలైనా చావాలి” - అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5.GCTel 181.2

    డయట్ లో చక్రవర్తి ప్రతినిధి ఫెర్డినాండ్ రాజు చక్రవర్తి జారీ చేసిన డిక్రీని సామంతరాజులు అంగీకరించి మద్దతు చేసేందుకు వారిని ప్రలోభ పెడితే తప్ప అది ప్రమాదకరమైన విభజనలకు దారితీయవచ్చునని గ్రహించాడు. అలాంటి వారిపై ఒత్తిడి తేవటం వారి సంకల్పాన్ని మరింత పటిష పర్చుతుందని గుర్తించిన ఆయన తియ్యగా మాట్లాడి ఒప్పించటానికి ప్రయత్నించాడు. “డిక్రీని అంగీకరించుమంటూ వాళ్ల గడ్డాలు పట్టుకొన్నాడు. వారి అంగీకారం చక్రవర్తికి ఎంతో అనందాన్ని కలిగిస్తుందన్నాడు.” దేవునిపై నమ్మకమున్న ఈ వ్యక్తులు లోకరాజులను మించిన అధికారిని గుర్తించిన వారు. వారిలా మెత్తగా పలికారు, శాంతిని కొనసాగించి దేవుని ఘనపర్చే ప్రతి విషయంలోనూ మేము చక్రవర్తికి విధేయులమై ఉంటాం”- అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5.GCTel 182.1

    రాజాజ్ఞ “సామ్రాజ్య డిక్రీగా జారీ అవటానికి సిద్ధంగా ఉన్నదని” వారి “ముందున్న ఒకే మార్గం అధిక సంఖ్యాకులకు లొంగిపోవటమేనని” చివరికి డయట్ సమక్షంలో రాజు ఓటరుకు అతడి మిత్రులకు ప్రకటించాడు. సంస్కరణ వాదులు చర్చించేందుకుగాని సమాధానం చెప్పుకొనేందుకుగాని వారికి అవకాశమివ్వకుండా వెంటనే సభనుంచి వెళ్లిపోయాడు. ” తిరిగి రావలసిందంటూ అభ్యర్థిస్తూ రాజు వద్దకు వారు ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు. కాని అది విఫలయత్నమయ్యిందా.” వారి ఫిర్యాదులకు రాజిచ్చిన సమాధానం ఒక్కటే. “అది తీరిన సమస్య. ఇక మిగిలిందాల్లా లొంగుబాటే.” - అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 5.GCTel 182.2

    క్రైస్తవ సామంత రాజులు పరిశుద్ధ లేఖనాల్ని మానవ సిద్ధాంతాలు విధులకన్నా ఉన్నతంగా పరిగణిస్తారని చక్రవర్తి వర్గాలు గుర్తించాయి. ఇంకా ఈ సూత్రాన్ని అంగీకరించటం జరిగిన స్థలాల్లో పోపు ప్రాబల్యానికి తెరపడుతుందని కూడా వారు గుర్తించారు. ‘’కనిపించే వాటిని మాత్రమే చూచే ” వేలాది ప్రజలమల్లే చక్రవర్తి పోపు చేపట్టిన కార్యం బలమైనదని సంస్కరణ వాదుల కార్యం బలహీనమైనదని చెప్పుకొంటూ వారు తృప్తి చెందారు. సంస్కర్తలు మానవ సహాయంపైనే ఆధారపడి ఉంటే పోపు మనుషులు భావించినట్లు వారు శక్తిశూన్యులై ఉండేవారే. సంఖ్యపరంగా బలహీనులైనా, రోముతో భేదించినా వారికున్న బలం వారి కుంది. వారు డయట్ నివేదికపై దైవ వాక్యానికి విజ్ఞప్తి చేసుకొన్నారు. చక్రవర్తి చార్లెస్ నుంచి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తుకు విజ్ఞప్తి చేసుకొన్నారు.” అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 6.GCTel 182.3

    మనస్సాక్షికి లోబడిన తమ నమ్మకాలను పరిగణించటానికి ఫెర్డినాండ్ తిరస్కరించాడు. గనుక అతడు హాజరు కాకపోవటాన్ని సామంత రాజులు లెక్కచేయకుండా తమ నిరసనను జాప్యం లేకుండ జాతీయ సభముందుకు తేవాలని తీర్మానించారు. కనుక ఒక గంభీరమైన ప్రకటనను రూపొందించి డయట్ కు సమర్పించారు.GCTel 183.1

    “మన ఏకైక సృష్టికర్త అయిన దేవుడు, సంరక్షకుడు, విమోచకుడు, రక్షకుడు, ఒకనాడు మనకు కానున్న న్యాయాధిపతి ముందు సర్వజనుల ముందు, సకల ప్రాణుల ముందు మా పక్షంగాను, మా ప్రజల పక్షంగాను నిరసిస్తూ ఇందు మూలంగా తెలియజేస్తున్న దేమిటంటే ప్రతిపాదిత డిగ్రీని దేవునికి ఆయన పరిశుద్ధ వాక్యానికి, మా మనస్సాక్షికి, మా ఆత్మల రక్షణకు విరుద్ధమైన ఏ విషయాల్లోను ఏ రూపంలోను అంగీకరించం, అనుసరించం”GCTel 183.2

    ఏమిటి, ఈ రాజాజ్ఞను ధ్రువపర్చటమా! సర్వశక్తిగల దేవుడు తన్నుగూర్చిన జ్ఞానాన్ని పొందటానికి పిలిచినప్పుడు ఈ మనిషి దేవుని జ్ఞానాన్ని పొందరాదన్నమాట.” “దైవ వాక్యంతో ఏకీభవించని సిద్ధాంతం స్థిరమైన సిద్ధాంతం కాదు... ఏ యితర సిద్ధాంతం బోధనూ ప్రభువు నిషేధిస్తున్నాడు. లేఖనాలను స్పష్టమైన ఇతర లేఖనాలతో సరిపోల్చి విశదం చేయాలి. క్రైస్తవుడికి అవసరమైన విషయాలన్నింటిలోను ఈ పరిశుద్ధ గ్రంధం సులభంగా అర్ధమౌతుంది. చీకటిని తొలగించటానికి అది ఏర్పాటయ్యింది. పాత కొత్త నిబంధనల్లోని పుస్తకాల్లో ఉన్న విధంగా విరుద్ధమైనదేది దానికి కలుపకుండా ఆయన పవిత్ర వాక్యబోధను సాగించటానికి దైవకృప చొప్పున మేము తీర్మానించు కొన్నాం. ఈ వాక్యంలో మాత్రమే సత్యముంది. సిద్ధాంతానికి జీవితానికి స్థిరమైన నియమం అదే. అది ఎన్నడూ మనల్ని నిరాశ పర్చదు, మోసగించదు. ఈ పునాదిపై నిర్మించుకొనేవాడు దుష్టశక్తులన్నిటినీ ఎదిరించగలుగుతాడు. దానికి వ్యతిరేకంగా లేచే మానవాహంకారం దేవుని ముందు కూలిపోతుంది.”GCTel 183.3

    ” ఈ కారణం వలన మా మీద మోపిన కాడిని విసర్జిస్తున్నాం’‘ 66 అదే సమయంలో ఘనత వహించిన చక్రవర్తి అన్నింటికన్న ఎక్కువగా దేవుని ప్రేమించే క్రైస్తవ యువరాజుగా మాపట్ల వ్యవహరిస్తాడని మేము నిరీక్షిస్తున్నాం. చక్రవర్తికి సామంత ప్రభువులైన మీకు మాత్రమే విధేయతలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నాం. అలా చేయటం మాన్యాయమైన విధి.”- అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 6.GCTel 183.4

    ఇది డయట్ ను ఆకట్టుకొంది. అసమ్మతివాదుల ధైర్యానికి అధిక సంఖ్యాకులు ఆశ్చర్యాందోళనలతో నిండారు. భవిష్యత్తు భయంకరంగాను అనిశ్చతంగాను కనిపించింది వారికి. విభేదాలు, కలహాలు, రక్తపాతం తప్పవనిపించింది. పోతే తమ కార్యం న్యాయమైనదని భావిస్తూ, సర్వశక్తిగల దేవుని మీద ఆధారపడిన సంస్కరణ వాదులు ధైర్యంగా, దృఢంగా ఉన్నారు.”GCTel 184.1

    ఈ ప్రసిద్ధ నిరసన సూత్రాలు ప్రొటస్టాంటు సత్యానికి పట్టుకొమ్మ, వ్యక్తి విశ్వాసానికి సంబంధించిన విషయాల సందర్భంగా ప్రొటస్టాంటు తత్వం రెండు దురాచారాలను వ్యతిరేకిస్తుంది. మొదటిది సివిల్ మేజిస్ట్రేటుల జోక్యం . రెండోది సంఘ నిరంకుశాధి కారం. ఈ దురాచారాల సందర్భంగా మేజిస్ట్రేటులకు బదులు మనస్సాక్షి అధికారాన్ని, సంఘాధికారానికి బదులు దైవ వాక్యాధికారాన్ని ప్రొటస్టాంటు తత్వం ప్రబోధిస్తోన్నది. మొట్టమొదటగా ప్రొటస్టాంటు తత్వం దైవ సంబంధిత అంశాల్లో పౌర అధికారాన్ని నిరాకరిస్తూ ప్రవక్తలు అపోస్తలులతో గొంతు కలుపుతూ, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను అంటున్నది. చార్లెస్ ® కిరీటం సమక్షంలో యేసుక్రీస్తు కిరీటాన్ని హెచ్చించింది. అంతేకాదు. ఇంకా ముందుకు వెళ్లింది. మానవుల బోధలన్నీ దైవ లేఖనాలను అనుసరించివుండాలని సిద్ధాంతీకరించింది.”- అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 6. మరీ ముఖ్యంగా ప్రొటస్టాంటు వాదులు సత్యం విషయమై తము నిశ్చితాభిప్రాయాల్ని ప్రకటించే హక్కు తమకున్నదని కుండబద్దలు కొట్టి చెప్పారు. నమ్మి ఆచరించటమేగాక వాక్యం బోధిస్తున్నది ప్రకటిస్తామని చెప్పి ఈ విషయంలో కలుగజేసుకొనేందుకు ప్రీస్టులకుగాని మేజిస్ట్రీలకుగాని హక్కులేదని ఉద్ఘాటించారు. స్సయిర్స్ నిరసన మత అసహనానికి వ్యతిరేకంగా ఎత్తిన గళం. తమ అంతరాత్మ ప్రబోధాన్ననుసరించి దేవుని ఆరాధించే హక్కు తమకున్నదని మనుషులు చేసిన ప్రకటన.GCTel 184.2

    ప్రకటన వెలువడింది. వేలాదిమంది మనసులపై అది ముద్రితమై పరలోక గ్రంథాల్లో దాఖలయ్యింది. ఏ మానవ యత్నమూ దాన్ని చెరిపివేయలేదు. సువార్తవాద జర్మనీ యావత్తు నిరసనను తన విశ్వాస ప్రకటనగా అంగీకరించింది. ప్రతీచోట మనుషులు ఈ ప్రకటనలో నూతన యుగ అవగాహనను చూశారు. స్పయి లోని ప్రొటస్టాంటులతో ఒక సామంతరాజు ఇలా అన్నాడు, “ఉద్రేకంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా మీ భావాలను ప్రకటించటానికి మీకు కృపననుగ్రహించిన సర్వశక్తిగల దేవుడు నిత్యకాలం వరకు దృఢమైన క్రైస్తవ జీవితంలో మిమ్మల్ని సంరక్షించునుగాక.” - అదే పుస్తకం, పుస్త 13, అధ్యా 6.GCTel 184.3

    కొంత వరకు జయం సాధించిన సంస్కరణ వాదం లోకం అనుగ్రహాన్ని సంపాదించటానికి సమయానుకూలంగా వ్యవహరించటానికి అంగీకరించివుంటే అది దేవుని చిత్తాన్నిగాని, తన సొంత ఉద్దేశాన్ని గాని నెరవేర్చి ఉండకపోవును. దాని నాశనాన్ని అదే కొనితెచ్చుకున్నట్లు అవ్వును. ఈ సంస్కరణల అనుభవం నుంచి రానున్న తరాల ప్రజలు వాదాలు నేర్చుకోవచ్చు. దేవున్ని ఆయన వాక్యాన్ని వ్యతిరేకించే సాతాను పనితీరు ఏమాత్రం మారలేదు. లేఖనాలు జీవితానికి మార్గదర్శకాలు కావటాన్ని సాతాను పదహారో శతాబ్దంలోలాగే నేడూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. మన కాలంలో అయితే లేఖన సిద్ధాంతాల విషయంలోను నీతి సూత్రాల విషయంలోను భ్రష్టత ఏర్పడింది. విశ్వాసానికి జీవిత విధానానికి బైబిలే ఏకైక నిబంధన అన్న మహత్తర ప్రొటస్టాంటు సూత్రాన్ని తిరిగి అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మత స్వాతంత్ర్యాన్ని నాశనం చేయటానికి సాతాను సర్వవిధాలా కృషిచేస్తూనే ఉన్నాడు. స్పయిర్స్ నిరసన కారులు విసర్జించిన క్రైస్తవ వ్యతిరేక శక్తే తాను కోల్పోయిన ఆధిక్యాన్ని తిరిగి సంపాదించటానికి ఇతోధిక ఉత్సాహంతో ఇప్పుడు కృషి చేస్తున్నది. సంస్కరణ సంక్షోభ సమయంలో ప్రదర్షితమైన దైవ వాక్యానుసారమైన జీవన విధాన నియమాలు నేడు సంస్కరణకు స్పూర్తినిస్తున్నది.GCTel 185.1

    ప్రొటస్టాంటులకు ప్రమాద సూచనలు కనిపించాయి. నమ్మకంగా నిలబడ్డ వారిని కాపాడేందుకు దైవహస్తం సిద్ధంగా ఉన్నదన్న సూచనలు కూడా కనిపించాయి. దాదాపు ఇదే సమయంలో “మెలాంగ్ తన్ తన మిత్రుడు సైమన్ గైనేయస్ ని స్పయిర్స్ నగర వీధుల గుండా తీసుకొని వెళ్లి రైన్ నదిని దాటుమని చెప్పాడు. అప్పుడు కురిసిన మంచును చూసి గైనేయస్ ఆశ్చర్య పడ్డాడు. నాకు తెలియని గంభీర వదనంగల వృద్ధుడొకడు నా ముందు నిలిచి ఫెర్డినాండ్ పంపిన కోర్టు అధికార్లు (నేయస్ని అరెస్టు చేయటానికి కాసేపటిలో రానున్నారు’ అని మెలాంగ్ తన్ అన్నాడు.”GCTel 185.2

    పోపు మత విద్వాంసుడు ఫేబర్ ఆరోజు చేసిన ప్రసంగంలో (నేయసను తీవ్రంగా విమర్శించి చివరిలో ‘హేయమైన అపరాధాలకు” పాల్పడ్డాడంటూ గైనేయస్సు ఆక్షేపించాడు.” కోపం లేనట్లు నటిస్తూ ఫేబర్ మరుక్షణమే రాజు వద్దకు వెళ్లి హైడెల్ బర్గ్ ఆచార్యుడు గైనేయసను బంధించటానికి ఉత్తర్వు సంపాదించాడు. గైనేయసన్ను హెచ్చరించేందుకు దేవుడు తన దూతను పంపాడనటంలో మెలాం తనకి ఎలాంటి సందేహము లేదు. GCTel 186.1

    హింసకుల చేతినుంచి గైనేయసను రైన్ నదీజలాలు కాపాడేంతవరకు ఆ నది గట్టుపై మెలాంగ్ తన్ కదలకుండా మెదల కుండా నిలిచి ఉన్నాడు. గ్రెనేయస్ ఆ నదినిదాటి ఆవలి గట్టుకు చేరినప్పుడు నిరపరాధుల రక్తం కోసం అర్రులు సాచే క్రూరుల నోటి నుంచి చిట్టచివరికి ఆయనను దేవుడు కాపాడాడు. అని కేకలు వేశాడు మెలాంగ్ తన్. మెలాంగ్ తన్ తిరిగి ఇంటికి వెళ్లే టప్పటికి అధికారులు గ్రెనేయస్ కోసం గాలిస్తూ వచ్చి ఇల్లంతా వెదకి గందరగోళం సృష్టించారని తెలుసుకున్నాడు. ” అదే పుస్తకం, పుస్త 13, ఆధ్యా 6.GCTel 186.2

    లోకంలోని అధికులముందు సంస్కరణ కృషి మరింత ప్రాధాన్యం సంతరిచుకోవలసి ఉంది. సువార్త వాద సామంత రాజులకు దర్శన మివ్వటానికి పెర్డినాండ్ రాజు నిరాకరించాడు. కాని తన కార్యాన్ని చక్రవర్తి ముందు సంఘనాయకులు రాజకీయ వేత్తల ముందు విన్నవించుకోటానికి అనుమతి ఇచ్చాడు. వివాదాల వల్ల దేశంలో తలెత్తిన గందరగోళాన్ని సద్దుమణిచేందుకు స్పయిర్స్ నిరసన జరిగిన మరుసటి ఏడాది ఆ బర్గ్ లో ఒక డయట్ ను చార్లెస్ V ఏర్పాటు చేసి దానికి తానే స్వయంగా అధ్యక్షత వహిస్తానని ప్రకటించాడు. ప్రొటస్టాంటు నాయకులంతా అక్కడ సమావేశం కావలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.GCTel 186.3

    సంస్కరణోద్యమానికి పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపించింది. దాని మద్దతు దారులు మాత్రం తమ కార్యాన్ని దేవుని కప్పగించి సువార్త పక్క దృఢంగా నిలబడ్డామని వాగ్దానం చేశారు. డయలకు హాజరు కారాదని కేంటన్ కౌన్సిలర్లు సేక్సనీ ఓటర్ కి విజ్ఞప్తి చేశారు. సామంత రాజుల్ని తన వలలో చిక్కించుకోటానికి వారు డయటక్కు హాజరు కావలసిందిగా చక్రవర్తి వారిని కోరాడని అన్నారు. బలవంతుడైన విరోధితో ఒక నగరంలో తలుపులు మూసుకొని ఉండటానికి వెళ్లటం ప్రమాదాన్ని కోరితెచ్చుకోటం కాదా? అయితే మరి కొందరిలాఅన్నారు, “సామంతరాజులు ధైర్యంతో మసలుకొంటే చాలు. దైవ కార్యం విజయం సాధిస్తుంది.” ” దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు” అన్నాడు లూథర్. అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 2. ఓటరు తన మంది మార్బలంతో ఆగ్స్ బర్గ్ కి పయనమయ్యాడు. ఆయన ముందున్న ప్రమాదమేంటో అందరికీ తెలిసిందే. భయాందోళన నిండిన హృదయంతో విచార వదనాలతో అనేకులు ముందుకు వెళ్లారు. వారితోపాటు కోబర్గ్ వరకూ వెళ్లిన లూథర్ ఆ ప్రయాణంలోనే రచించిన “దేవుడు మనకు బలమైన కోట అన్న పాట పాడూ దిగులు చెందుతున్న వారి ఆత్మలో ఉత్సాహోద్రేకాలని నింపాడు. ఆత్మావేశంతో నిండిన ఆ గీతంతో అనేక ఆందోళనలు మాయమయ్యాయి. అనేక హృదయ భారాలు తొలగిపోయాయి.GCTel 186.4

    లేఖన నిదర్శనాలతో క్రమపద్ధతిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఒక ప్రకటనను రూపొందించి దాన్ని డయట్ ముందు పెట్టాలని సంస్కరణ వాద సామంత రాజులు నిశ్చయించుకొన్నారు. దాన్ని రూపొందించి సిద్ధంచేసే బాధ్యతను లూథర్ మెలాంగ్ తన్లు వారి సహచరులకు అప్పగించారు. ఈ ప్రకటనను ప్రొబస్టాంటులు తమ విశ్వాస వ్యక్తీకరణగా అంగీకరించి ప్రాముఖ్యమైన ఆ పత్రాలపై సంతకాలు చేయటానికి సమావేశమయ్యారు. అది అతి గంభీర సమయం. క్లిష్ట సమయం కూడా తమ కార్యం రాజకీయాంశాలతో మిళితమై గందరగోళానికి దారితీయకూడదని సంస్కరణ వాద నేతలు ఆందోళన చెందారు. దిద్దుబాటు ప్రభావం దైవ వాక్యం ప్రసరించేదే కావాలి తప్ప వేరే ప్రభావాలకు తావుకాకూడదన్నది వారి మనోగతం.GCTel 187.1

    ప్రకటన పత్రంపై సంతకాలు చేయటానికి క్రైస్తవ సామంతరాజులు ముందుకు వస్తుండగా వారిని వారిస్తూ మెలాంగ్ తన్ ఇలా అన్నాడు, “ఈ విషయాల్ని వేదాంతపండితులు సువార్త బోధకులు ప్రతిపాదించాలి. ఈ లోకంలో ప్రబల శక్తిగల సామంత భూపాలుర ఆధిపత్యాన్ని ఇతర విషయాలకు అట్టి పెట్టు కుందాం.” దానికి సమాధానంగా సేక్సనీకి చెందిన జాన్ ఇలా అన్నాడు, “నన్ను మినహాయించవద్దని మనవి. ఏది మంచిదో అది చేయటమే నా అభిమతం. కిరీటం అంత ప్రాముఖ్యం కాదు నాకు. ప్రభువు నా రక్షకుడని ఒప్పుకోటానికి నేను ఆశపడున్నాను. ఓటరుగా నేను ధరించే టోపీకన్నా న్యాయాధిపతిగా నేను వేసుకొనే అంగీకన్నా యేసుక్రీస్తు సిలువే నాకు ముఖ్యం.” ఇలా అన్న తరువాత అతడు ప్రకటన పత్రంపై తన పేరు రాశాడు. ఇంకొక సామంతరాజు కలం తీసుకొంటూ అన్నమాటలివి, “నా ప్రభువైన యేసుక్రీస్తును గౌరవించేందుకు అవసరమైతే నా సంపదను, నా ప్రాణాన్ని విడిచి పెట్టటానికి సిద్ధంగా వున్నాను. నా ప్రజలను, రాజ్యాన్ని, నా తండ్రుల దేశాన్ని విడవనైనా విడుస్తానుగాని ఈ ప్రకటన పత్రంలోవున్న సిద్ధాంతాన్ని మాత్రం విడువను”. అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 6. ఆ దైవ భక్తుల విశ్వాసం ధైర్యసాహసాలు అట్టివి.GCTel 187.2

    చక్రవర్తి ముందు హాజరవ్వటానికి ఏర్పాటైన సమయం వచ్చింది. చార్లెస్ తన సింహాసనాన్ని అధిష్టించాడు. ఓటర్లు, సామంతరాజులు ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. చక్రవర్తి ప్రొటస్టాంటు సంస్కరణ వాదులకు దర్శన మిచ్చాడు. వారి విశ్వాస ప్రకటన పత్రాన్ని చదివాడు. ప్రతిష్టాత్మకమైన ఆ సభలో సువార్త సత్యాన్ని సుస్పష్టంగా వివరించటం పోపు సంఘం దోషాలను ఎత్తిచూపటం జరిగింది. అది సంస్కరణ చరిత్రలో మహత్తర దినమని క్రైస్తవ చరిత్రలోను మానవజాతి చరిత్రలోను మహోజ్వల దినాల్లో ఒకటని పేరుగాంచింది.”. అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 7.GCTel 188.1

    వరమ్స్ లో జాతీయ సభముందు విటన్బర్గ్ సన్యాసి ఒంటరిగా నిలచి కొన్నేళ్లు గతించాయి. ఇప్పుడు ఆయన స్థానంలో సామ్రాజ్యమంతటిలో ఉత్తములు, మిక్కిలి శక్తిమంతులు అయిన సామంతరాజులు ఉన్నారు. ఆర్ట్స్ బర్గ్ సభకు హాజరు కాకూడదని లూథర్ ని నిషేధించారు గాని తన మాటల ద్వారా, ప్రార్థనల ద్వారా ఆయన అక్కడ ఉన్నాడు. అంత వైభవోపేతమైన సభలో ప్రఖ్యాతిగాంచిన విశ్వాసులు క్రీస్తును బహిరంగంగా ప్రశంసించిన సమయం వరకు జీవించి ఉన్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను” - అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 7. లేఖనాలు చెబుతున్నది ఈ రీతిగా నెరవేరింది, “సిగ్గుపడక రాజుల యెదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను” కీర్తనలు 119:46.GCTel 188.2

    సువార్త నిమిత్తం చెరసాల పాలైన పౌలు దినాల్లో సామ్రాజ్య ప్రధాన నగరంలోని యువరాజులు ప్రముఖ పౌరుల ముందుకు సువార్తను తేవటం జరిగింది. కనుక ఈ తరుణంలో వేదిక నుంచి బోధించటాన్ని చక్రవర్తి నిషేధించిన సువార్త రాజ భవనం నుంచి ప్రకటిత మయ్యింది. సేవకులు, దాసులు కూడా వినటానికి యోగ్యంకానిదని అనేకులు పరిగణించిన సువార్తను సామ్రాజ్యంలోని అధికారులు ప్రభువులు విస్మయంతో విన్నారు - రాజులు, గొప్పవారు, శ్రోతలు. పట్టాభిషేకం పొందిన యువరాజులు బోధకులు. ప్రసంగం రారాజు దేవుని సత్యం. అపోస్తలుల కాలం నుంచి నేటి వరకు ఇంత గొప్ప కార్యం జరగలేదు. ఇంత గొప్ప సాక్ష్యం వినబడలేదు” అంటున్నాడొక రచయిత.- డి అబినే, పుస్త 14, అధ్యా 7.GCTel 188.3

    “లూథరన్లు చెబుతున్న దంతా వాస్తవమే. దాన్ని కాదనలేం.” అన్నాడో పోపు మతవాద బిషప్. ” ఓటరు అతడి మిత్రులు రూపొందించిన ప్రకటన పత్రాన్ని హేతుబద్దమైన కారణాలతో నీవు తోసిపుచ్చగలవా?” అడిగాడు డాక్టర్ ఏక్ తన సహచరుణ్ణి. “అపోస్తలులు ప్రవక్తల రచనల దృష్ట్యా తోసి పుచ్చలేము” కాని ఫాదర్లు, సభలు చెబుతున్న దాన్ని బట్టి తోసిపుచ్చగలం” సమాధానం చెప్పాడతను. ” నా కర్దమయ్యింది, నీవు చెప్పేదాని ప్రకారం లూథరన్లు లేఖనాను సారంగాను మనం లేఖనానికి విరుద్ధంగాను ఉన్నామనేగా?” ప్రశ్నించాడు డా. ఎక్.. అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 8. GCTel 189.1

    జర్మనీ సామంతరాజులలో కొందరు దిద్దుబాటు విశ్వాసాన్ని స్వీకరించారు. ప్రొటస్టాంటుల విశ్వాసమే సత్యమని స్వయాన చక్రవర్తీ ప్రకటించాడు. విశ్వాస ప్రకటనపత్రం అనేక భాషల్లోకి అనువాదమై ఐరోపా ఖండమంతా ప్రచురితమయ్యింది. అనంతర తరాల్లో మిలియన్ల కొద్దీ ప్రజలు దానిని తమ విశ్వాస ప్రకటనగా అంగీకరించారు.GCTel 189.2

    నమ్మకమైన దైవ సేవకులు ఒంటరిగా కృషి చేయటం లేదు. అంధకార శక్తులు ఉన్నత స్థలాల్లోని దుష్టత దురాత్మలు వారికి వ్యతిరేకంగా జట్టుకట్టినప్పటికీ దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టలేదు.GCTel 189.3

    పూర్వ ప్రవక్తమల్లే వారి నేత్రాలు తెరచుకోవటం జరిగినట్లయితే వారు దేవుని సముఖానికి, సహాయానికి రుజువులు చూడగలిగి ఉండేవారు. శత్రుసైన్యం తమను చుట్టుముట్టి తప్పించుకోటానికి అవకాశం లేకుండా చేసిన సైన్యాన్ని చూడుమంటున్న తన సేవకుణ్ణి గురించి ఏలియా ప్రవక్త ఈ ప్రార్ధన చేశాడు, “యెహోవా వీడు చూచునట్లు, దయచేసి వీని కండ్లను తెరువుము” 2 రాజులు 6:17.5. పర్వతం రధాలతోను, అగ్ని గుర్రాలతోను నిండి ఉండటం దైవ సేవకుణ్ణి సంరక్షించేందుకు పరలోక సైన్యం మోహరించి సంసిద్ధంగా ఉండటం అతను చూశాడు. సంస్కరణ కార్యంలో నిమగ్నులై ఉన్న వారిని దూతలు ఆవిధంగా సంరక్షిస్తారు.GCTel 189.4

    లూథర్ నిష్టగా ఆచరించిన సూత్రాల్లో ఒకటి సంస్కరణకు మద్దతు కోసం లౌకికాధికారాన్ని ఆశ్రయించటంగాని దాన్ని రక్షించుకోటానికి ఆయుధాలు ఉపయోగించటంగాని చేయకూడదన్నది. సామ్రాజ్యంలోని సామంత భూపాలురు సువార్తను విశ్వసించినందుకు సంతోషించాడు. అయితే వారు సంయుక్త సంరక్షక సమితి ఏర్పాటును ప్రతి పాదించినప్పుడు “సువార్త సిద్ధాంతాన్ని దేవుడు మాత్రమే పరిరక్షించాలి. మానవుడు ఇందులో ఎంత తక్కువ కలుగజేసుకుంటే అంత బలంగా దేవుడు మనకు మద్దతు నిస్తాడు. వారు ప్రతిపాదించిన ముందు జాగ్రత్తలు భయానికి పాపపూరితమైన అపనమ్మకానికి సూచన” అని ఉద్ఘాటించాడు.- డి అబినే, లండన్ ఏడి, పుస్త 10, అధ్యా 14.GCTel 189.5

    దిద్దుబాటు విశ్వాసాన్ని నాశనం చేయటానికి శక్తిమంతులైన శత్రువులు ఏకమవుతున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా వేలాది మంది కత్తులు దూస్తున్న తరుణంలో లూథర్ ఇలా రాశాడు, “సాతాను తన ఉగ్రతను ప్రదర్శిస్తున్నాడు. నీతి నిజాయితీ లేని మతాధి పతులు కుట్ర పన్నుతున్నారు. మనపై యుద్ధం విరుచుకు పడే ప్రమాదం కనిపిస్తుంది. దైవాత్మ ప్రభావం వల్ల వారు శాంతిని కోరేందుకుగాను ప్రజలు విశ్వాసం ద్వారాను ప్రార్ధన ద్వారాను దైవ సింహాసనం ముందు వీరోచితంగా పోరు సల్పాల్సిందని వారిని హెచ్చరించండి. మనం ప్రధానంగా చేయవలసిన పని ప్రార్ధించటం. ఇప్పుడు తాము పదునైన ఖడ్గానికి, సాతాను ఆగ్రహానికి గురి అయి ఉన్నారని ప్రజలు తెలుసుకోవాలి. వారు ర్ధన చేయాలి.” డి.అబినే, పుస్త 10, అధ్యా 14.GCTel 190.1

    కొంతకాలం అయిన తర్వాత సంస్కరణ వాద సామంత రాజులు తల పెట్టిన సమితిని ప్రస్తావిస్తూ, ఈ సమరంలో మనం ప్రయోగించే ఒకే ఒక అస్త్రం “ఆత్మఖడ్గము” అని ప్రకటించాడు లూథర్. సేక్సనీ ఓటరుకు ఆయన ఇలా రాశాడు, “ప్రతిపాదించిన మిత్రతను అంగీకరించటానికి మా మనస్సాక్షి ఒప్పకోటంలేదు. “మన సువార్త ఒక్క రక్తపు బొట్టు కారటానికి కారణమవటం చూడటంకన్న పదిసార్లు మరణించటానికైనా మేము సిద్ధమే.మన పాత్ర వధకు తెచ్చిన గొర్రెపిల్లలా ఉండటం. మనం క్రీస్తు సిలుపను ధరించాలి. తమరు భయంలేకుండా ఉండండి. మన శత్రువులు తమ ప్రగల్భాల వల్ల సాధించగల దానికన్నా మనం మన ప్రార్థనల ద్వారా ఎక్కువ సాధించగలుగుతాం. మన సహోదరుల రక్తంతో మీ చేతులు మలినం కాకూడదని నేను కోరుకొంటున్నాను. మనల్ని మనం తన ట్రిబ్యూనళ్లకు అప్పగించుకోవాలన్నది చక్రవర్తి అభీష్టమైతే మనం అందుకు సిద్ధమే. మా విశ్వాసాన్ని మీరు కాపాడలేరు. ప్రతివ్యక్తి వ్యక్తిగతంగా విశ్వసించి అందులోని ప్రమాదాన్ని ఎదుర్కోవాలి.”- అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 1.GCTel 190.2

    రహస్య ప్రార్ధన నుంచి వచ్చిన శక్తి దిద్దుబాటు కాలంలోని ప్రపంచాన్ని కుదిపివేసింది. దైవ సేపకులు దైవ వాగ్దానాల బండపై పరిశుద్ధమైన ప్రశాంతతతో తమ పాదాలు మోపారు. ఆగ్స్ బర్గ్ పోరాటంలో లూథర్ కనీసం మూడు గంటలు ప్రార్ధనలో గడపకుండా ఒక్కరోజు కూడా గడవలేదు. అధ్యయనానికి మిక్కిలి అనుకూలంగా ఉండే సమయం నుంచి ఎంపిక చేసుకొన్న గంటలివి. తన గదిలో ఏకాంత ప్రార్థనలో ” ఆరాధన భావం, భయం, నిరీక్షణ నిండిన మాటలతో ఒక స్నేహితుడితో మాట్లాడే రీతిగా తన ఆత్మను దేవునిముందు ఒలకబోయటం వినిపించేది. ” “నీవు మాతండ్రివని, దేవుడవనీ బిడ్డల్ని హింసించే వారిని చెల్లాచెదురు చేస్తావని నాకు తెలుసు. ఎందుకంటే మా మూలాన నీవే అపాయంలో ఉన్నావు. ఇది నీకార్యం, నీ ఒత్తిడి చేతనే మేము ఈ కార్యాన్ని చేపట్టాం. కనుక ఓతండ్రి మమ్మల్ని కాపాడు”. అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 6.GCTel 191.1

    భారంతో కుంగి భయాందోళనలకు గురి అయిన మెలాంగ్ తన కి లూథర్ ఇలా రాశాడు, “క్రీస్తులో కృప సమాధానం, లోకంలో కాదు సుమా. క్రీస్తులో ఆమెన్.” నిన్ను అతలాకుతలం చేస్తున్న చింతలు ఆందోళనలంటే నాకు అమితమైన ద్వేషం. నీవు చేపట్టిన కార్యం అనుచిత కార్యమైతే దాన్ని విడిచి పెట్టు. అది న్యాయమైందైతే నిర్భయంగా నిద్రించుమని మనల్ని ఆదేశిస్తున్న ప్రభువిచ్చిన వాగ్దానాన్ని మనం శంకించటం దేనికి? ...న్యాయం కోసం సత్యం కోసం పని చేయటానికి క్రీస్తు వెనుకాడడు. ఆయన జీవిస్తున్నాడు. పరిపాలిస్తున్నాడు. ఇక మనకేమి భయం?” అదే పుస్తకం, పుస్త 14, అధ్యా 6.GCTel 191.2

    తన సేవకుల మొర దేవుడు ఆలకించాడు. ఈ అంధకార లోక పాలకులు వ్యతిరేకించినప్పటికీ సత్యాన్ని ప్రచురించటానికి సామంత రాజులకు సువార్త ప్రబోధకులకు కృపను ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రభువిలా అంటున్నాడు, “ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచ బడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు” 1 పేతురు 2:6. ప్రొటస్టాంటు సంస్కర్తలు క్రీస్తుపై తమ నిర్మాణం నిర్మించుకొన్నారు. నరక ద్వారాలు వారిని జయించలేక పోయాయి.GCTel 191.3