Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    యూదు జాతి

    ఇద్దరు కుమారుల ఉపమానం తర్వాత ద్రాక్షతోట ఉపమానం చెప్పాడు యేసు. ఒక దానిలో విధేయత ప్రాముఖ్యాన్ని యూదుల నాయకుల ముందు పెట్టాడు. ఇంకో దానిలో ఇశ్రాయేలు పై కుమ్మరించబడడ్డ గొప్ప దీవెనలిని ప్రస్తావించి వాటిని బట్టి వారు దేవునికి విధేయులైయుండాలని సూచించాడు. ఆయన దేవుని ఉద్దేశాన్ని వారి ముందుంచాడు. వారు దాన్ని విధియేత ద్వారా నెరవేర్చగలిగే వారని చెప్పాడు. భవిష్యత్తు తొలగించి తన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలమవ్వటం ద్వారా ఆ జాతి తన దీవెనల్ని పొగొట్టుకుని, తన మీదికి నాశనాన్ని ఎలా తెచ్చుకుంటున్నదో చూపించాడు.COLTel 238.1

    క్రీస్తు ఇలా అన్నాడు “ఇంటి యాజమానుడొకడుండెను.అతడు ద్రాక్షతోట నాటించి దాని చుట్టు కంచె వేయించి అందులో ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను.COLTel 238.2

    ఈ ద్రాక్షతోటను యెషయా ప్రవక్త ఈ మాటల్లో వర్ణిస్తున్నాడు. “నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. అతని ద్రాక్షతోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండమీద నా ప్రియునికొక ద్రాక్షతోటయుండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్ఠమైన ద్రాక్ష తీగలెను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను” యెష 5:12 COLTel 238.3

    ఆ వ్యవసాయదారుడు అడవిలోని నేలను ఎంపకి చేసుకున్నాడు. దాన్ని చుట్టు కంచెవేసి, దాన్ని బాగు చేసి దున్ని బాగు చేసిన దున్ని దానిలో ద్రాక్షతీగెలు నాటి మంచి ద్రాక్ష పంటకు ఎదురుచూసాడు. సేద్యం కాని తక్కిన భూమికన్నా సారవంతమైన ఈ నేల, తన శ్రద్ధ పరిశ్రమ ఫలితాల్ని చూపించి తనకు ఘనత తెస్తుందని ఎదరు చూసాడు. అలాగే దేవుడు ఒక జాతి ప్రజల్నిలోకంలో నుంచి ఎన్నుకున్నాడు. వారు క్రీస్తుచే శిక్షణ పొంది విద్యావంతులు కావలసియున్నారు. ప్రవక్త ఇలా అంటున్నాడు. “ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన మనము”. యెష 5:7 ఈ ప్రజలకు దేవుడు గొప్ప అధిక్యతలిచ్చాడు. తన కృపా బాహుళ్యం చొప్పున వారిపై అనేక దీవెనలు కుమ్మరించాడు. ఫలాలు ఫలించటం ద్వారా వారు తనను ఘనపర్చుతారని ఆయన ఎదురుచూసాడు. వారు ఆయన రాజ్యసూత్రాల్ని వెల్లడి చేయాల్సిన ఉన్నారు. పతనమైన దుష్ట ప్రపంచంలో వారు దేవుని ప్రవర్తనను ప్రదర్శించవలసియున్నారు.COLTel 238.4

    దేవుని ద్రాక్షతోట అయినవారు అన్యజాతుల ప్రజలకన్నా పూర్తిగా భిన్నమైన ఫలాలు ఫలించాల్సి ఉన్నారు. ఈ విగ్రహారాధకప్రజలు దుష్టత్వానికే తమ్మునితాము అంకితం చేసుకున్నారు. దూరాశతో నిండిన వారు దౌర్జన్యాలు, నేరాలు, హింస అవినీతి కార్యాలు అడ్డు అదుపు లేకుండా సాగించారు. ఆ విషవృక్షం ఫలించిన ఫలాలు దుష్టత్వం , భ్రష్టత, దు:ఖం దేవుడు నాటిన ద్రాక్ష తీగె ఇందుకు భిన్నమైన ఫలాలు ఫలించాల్సి ఉంది.COLTel 239.1

    ఆయన మోషేకి కనపర్చినట్లు దేవుని ప్రవర్తన సూచించే అధిక్యత యూదులికి కలిగింది. “నీ మహిమను నాకు చూపుము” అని మోషే చేసిన ప్రార్థనకు జవాబుగా “నా మంచితనమంతయు నీ యెదుట కనపరచెదను” అని ప్రభువు వాగ్దానం చేసాడు. నిర్గ 33:18:19, “అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు - యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యమలు గల దేవుడైన యెహోవా ఆయన వేయవలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును క్షమించును... అని ప్రకటించెను.” నిర్గ 34:6, 7 ప్రభువు తన ప్రజల నుంచి ఈ ఫలాల్నే కోరాడు. తమ పవిత్ర ప్రవర్తనలో, తమ పరిశుద్ధ జీవితాల్లో, తమ దయావాత్సల్యం కృపా బహుళ్యంలో వారు” యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్ధమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును” అని చూపించాల్సి ఉన్నారు (కీర్త 19:7)COLTel 239.2

    యూదు జాతి ద్వారా లోక ప్రజలందరికి దీవెనలు అందించాల్సిన్నది దేవుని ఉద్దేశం. ప్రపంచంమంతటా వెలుగు ప్రసరించటానికి ఇశ్రాయేలు ద్వారా మార్గం సిద్ధం చెయ్యాలన్నది దేవుని ఉద్దేశం. లోకంలోని జాతులన్నీ దుర్నీతి మార్గాల్ని అనుసరించటం వల్ల దేవుని గూర్చిన జ్ఞానాన్ని మర్చిపోయారు. అయితే కృప గల దేవుడు వారిని నాశనం చెయ్యలేదు. తనతో పరిచయం ఏర్పరచుకునేందుకు వారికి తన సంఘం ద్వారా అవకామివ్వాలని నిశ్చయించుకున్నాడు. తన ప్రజల ద్వారా వెల్లడయ్యే నీతి నియమాలు మానవుడిలో దేవుని నైతిక మూర్తి మత్వాన్ని పునరుద్దరించాలన్నది దేవుని సంకల్పం.COLTel 240.1

    ఈ సంకల్పం నెరవేర్పుకే అబ్రాహాముని తన విగ్రహారాధక బంధుజనాన్ని విడిచి పెట్టి కనాను దేశంలో నివసించాటానికి దేవుడు పిలిచాడు. “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు”. అన్నాడు అది 12:2COLTel 240.2

    దేవుడు అబ్రాహాము, యాకోబు అతడి వంశస్తుల్ని ఐగుప్తు దేశానికి తీసుకువచ్చాడు. ఆ దేశంలోని దుష్టులైన ప్రజల మధ్య వారు దేవుని రాజ్యసూత్రాల్ని వెల్లడిపర్చాలన్న ఉద్దేశంతో వారిని తీసుకువచ్చాడు. యోసేపు విశ్వసనీయత, ఐగుప్తు ప్రజల జీవితాల్ని సంరక్షించటంలో అతడు చేసిన అద్భుతమైన సేవ క్రీస్తు జీవితాన్ని సూచించాయి. మోషే ఇంకా అనేకులు దేవునికి సాక్షులుగా నివసించారు.COLTel 240.3

    ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావటంలో ప్రభువు తన శక్తిని కృపను మళ్ళీ ప్రదర్శించాడు. ఐగుప్త దాస్యం నుంచి వారిని విడిపించటంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు. ఆరణ్యం గుండా వారి ప్రయాణాల్లో వారితో ఆయన వ్యవహారణ, కేవలం వారి ప్రయోజనం కోసమే కాదు. చుట్టు ఉన్న జాతులకి ఇవన్నీ సాదృశ్య పాఠాలుగా ఉ ండటానికి ఉద్దేశించినవి. మానవ అధికారం మానవ ఔనత్యం అంతటికన్నా గొప్పవాడనని దేవుడు తన్ను తాను బయలుపర్చుకున్నాడు. దేవుడు తన ప్రజల పక్షంగా చేసిన అద్భుతాలు ప్రకృతి పై తనకున్న శక్తిని ప్రకృతి ఆరాధకుల్లో మిక్కిలి గొప్పవారి పై ప్రదర్శించాయి. అతిశయంతో నిండిన ఐగుప్తు గుండా దేవుడు సంచరించిన రీతిగా చివరి దినాల్లో భూమి పై ఆయన సంచరిస్తాడు. అగ్నితో, తుపానుతో, భూకంపంతో, మరణంతో నేను ఉన్నవాడను అనే ఆ గొప్ప దేవుడు తన ప్రజల్ని విమోచించాడు. వారిని చెరదేశం నుంచి బయటికి తెచ్చాడు. వారిని “తాపకరమైన పాములను తేళ్ళను కలిగిన యెడారిపై నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యము” గుండా నడిపించాడు. (నిర్గ 8:15) వారిక “బండ నుండి” నీళ్ళు రప్పించాడు. ‘ఆకాశ ధాన్యము”తో వారకి ఆహారం పెట్టాడు. కీర్త 78:24 మోషే ఇలా అన్నాడు. ” యెహోవా వంతు ఆయన జనమే. ఆయన స్వాస్థ్యభాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాపవలె కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడను ఆయనతో కూడ ఉండలేదు.” ద్వితి 432:9-12 వారు మహోన్నతుని నీడ కింద నివసించేందు కోసం వారిని ఈ విధముగా ఆయన తన వద్దకు తెచ్చుకున్నాడు.COLTel 240.4

    ఇశ్రాయేలీయుల ఆరణ్య సంచారంలో క్రీస్తే వారి నాయకుడు. మేఘ స్థంబములో పగటి వేళ, అగ్ని స్థంబములో రాత్రి వేళ ఆసీనుడై వారిని నడిపించాడు. ఆరణ్యంలో ఎదురైన అపాయాల నుంచి పరిరక్షించాడు. వారిని వాగ్దత్త దేశంలోకి తీసుకువచ్చాడు. తనను దేవుడుగా గుర్తించని వారందరూ చూస్తుండగా ఇశ్రాయేలీయుల్ని తాను ఎన్నుకున్న ఆస్తిగా ప్రభువు ద్రాక్షతోటగా స్థాపించాడు.COLTel 241.1

    ఈ ప్రజలికి దేవుడు తన పరిశద్దు లేఖనాలు అప్పగించాడు. తన ధర్మశాస్త్ర సూత్రాల్ని వారి చుట్టు కంచెగా ఉంచగా అవి ఆయన నిత్యసత్య నిబంధనలు, ఆయన పవిత్ర న్యాయ సూత్రాలు. ఈ నియామాలకు నిబంధనలకు విధేయులై నివసించుటంలోనే వారికి భద్రత క్షేమం ఉన్నాయి. అవి మాత్రమ వారిని పాప మార్గాలు ఆచరణలు నాశనం చెయ్యకుండా పరిరక్షించాల్సి ఉన్నాయి. ద్రాక్షా తోటలోని బురుజులా ఆ దేశం మధ్యలో దేవుడు తన పరిశుద్దలయాన్ని ఏర్పాటు చేసాడు.COLTel 241.2

    క్రీస్తు వారి ఉపదేశుడు ఆరణ్యంలో వారితో ఉన్నట్లు ఆయన ఇంకా వారికి అధ్యాపకడుగా మార్గదర్శకుడుగా ఉండాల్సి ఉంది. గూడారంలోను దేవాలయంలోను ఆయన మహిమ కృపాసనం మీది పరిశుద్ధ షెకీనాలో ఉంది. వారి తరుపున తన ప్రేమ, ఓర్పు, ఐశ్వర్యాల్ని ఆయన నిత్యం ప్రదర్శించాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని తనకు స్తోత్రంగాను మహిమగాను మలుచుకోవాలని ఆశించాడు. ఆధ్యాత్మికాభివృద్ధికి అవసరమైన ప్రతీ అవకాశం వారికిచ్చాడు. తనకు ప్రతినిధులుగా ఉ ండటానికి తమను తీర్చిదిద్దే ప్రవర్తనను నిర్మించుకోవటానికి తోడ్పడే దేన్నీ దేవుడు వారికివ్వకుండా నిలుపుచెయ్యలేదు.COLTel 242.1

    దైవ ధర్మశాస్త్రానికి వారి విధేయుత ప్రపంచ జాతుల ముందు వారిని ప్రగతి వింతలుగా రూపొందించాల్సి ఉంది. విచితత్రమైన పనులు చెయ్యటానికి జ్ఞాన వివేకాల్ని నిపుణతను ఇవ్వగలిగిన ఆప్రభువు వారికి అధ్యపకుడుగా ఉండి, తన నిబంధనలకు విధేయత ద్వారా వారిని ఉదాత్త సమున్నత వ్యక్తుల్ని చెయ్యగలడు.వారు దేవునికి విధేయులై ఉ ంటే ఇతర జాతులకు వచ్చిన వ్యాధుల నుంచి వారిని కాపాడి వారికి చురుకైన మానసిక శక్తినిస్తాడు. వారి అభివృద్ధి అంతటిలోను వారు దేవుని మహిమను ఆయన ఔన్నత్యాన్ని వెల్లడి చేయ్యాల్సి ఉన్నారు. వారు ఆయనకు యాజకులు అధిపతులు రాజ్యం కావలసియున్నారు. వారు భూమి మీద అత్యున్నతమైన జాతిగా వర్ధిల్లాటానికి వారికి ప్రతీ సదుపాయాన్ని దేవుడు అనుగ్రహించాడు.COLTel 242.2

    దేవుని ఉద్దేశాల్ని మోషే ద్వారా క్రీస్తు వారి ముందు పెట్టి, వారి ప్రగతి ఇక షరతుల్ని తాను స్పష్టంగా వివరించాడు. ఆయన ఇలా అన్నాడు. “నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పర్చుకొనెను... కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు.. తన్ను ప్రేమించి తన ఆజ్ఞాలననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపర్చువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మదిగిన దేవుడనియు” తెలుసుకో. “కాబట్టి నేడు నేను నీ కాజ్ఞాపించు ధర్మము, అనగా విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును,నీ సమస్యమును,నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశు వుల మందలను, నీ గొట్టెలమందలను,మేకల మందలను దీవెంచెదను. సమస్త జనముల కంటె ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు... యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపర్చి నిన్ను ద్వేషించువారందరికి మీదికే వాటిని పంపించును”. ద్వితీ 7:6,9, 11-15 COLTel 242.3

    వారు తన ఆజ్ఞల్ని అనుసరించి నివసించినట్లయితే వారికి శ్రేష్టమైన గోధుమలిస్తానని కొండతెనే నిస్తానని దేవుడు వాగ్దానం చేసాడు. వారని దీర్ఘయుర్ధాయంతో తప్తిపర్చి వారికి రక్షణను చూపిస్తానన్నాడు.COLTel 243.1

    దేవునికి అవిధేయులైనందు వలన అదామవ్వలు ఏదెనుని పొగొట్టు కున్నారు. పాపం వల్ల భూమి శాపానికి గురి అయ్యింది. కాగా దేవుని ప్రజలు ఆయన ఉపదేశాన్ని అనుసరిస్తే వారి భూమి సారాన్ని సౌందర్యాన్ని తిరిగి పొందుతుంది నేలను సారవంతం చేయ్యటానికి దేవుడే సూచనలిచ్చాడు. దాని పునరుద్ధరణకు వారు ఆయతనో సహకరించాలి. ఇలా దేవుని నియంత్రణ క్రింద భూమి అంత ఆధ్యాత్మిక సత్యానికి ఒక సాదృశ్య పాఠమౌతుంది. భూమి ప్రకృతి నిబంధనలకు లోబడి తన పంటను ఇచ్చేందుకు ప్రజల హృదయాలు ఆయన నీతి ధర్మశాసనాలకు ఆయన ప్రవర్తన లక్షణాల్ని ప్రతిబింబించాల్సి ఉన్నాయి. జీవం గల దేవున్ని సేవించి ఆరాధించేవారి ఆధిక్యతను విలక్షణతను అన్యులు సయితం గుర్తిస్తారు.COLTel 243.2

    మోషే ఇలా అన్నాడు ” నా దేవుడైన యెహోవానా కాజ్ఞాపించనట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటని మీరు గైకొని ఆచరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనుమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొట్ట పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నన్ను కట్టడలును నీతి విధులును గల గొప్ప జనమేది”? ద్వితి 4:5-8 COLTel 244.1

    ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తమకు నియమించిన భూబాగమంతటిని ఆక్రమించకోవాల్సి ఉన్నారు. నిజమైన దేవుని సేవను ఆరాధనను తిరస్కరించిన జాతులు తమ స్థలాల్ని విడిచి పెట్టిపోవాల్సి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు ప్రజల ద్వారా తన ప్రవర్తనను వెల్లడించటం ద్వారా మనుషుల్ని తన వద్దకు ఆకర్షించుకోవాలన్నది దేవుని ఉద్దేశం. సువార్త ఆహ్వానం లోకమంతిటికి అందాల్సి ఉంది. బల ర్పణ సేవా ద్వారా జాతుల ముందు క్రీస్తుని ఎత్తి చూపాల్సి ఉంది. ఆయన వంక చూసేవారం దరూ జీవించాల్సి ఉన్నారు. కనానీయురాలైన రాహాబు, మోహాబీయురాలైన రూతువలె విగ్రహారాధన నుంచి యధార్ధ దేవుని ఆరాధనకు మళ్ళే వారందరూ ఆయన ఎంపిక ప్రజలతో ఏకం కావలసి ఉన్నారు. జనాభా పెరిగే కొద్ది ఇశ్రాయేలు ప్రజలు తమ సరిహద్దుల్ని విస్తరించుకుంటు పోయి తుదకు వారు లోకమంతా విస్తరించాలన్నది దేవుని సంకల్పం.COLTel 244.2

    తన కృపా పరిపాలన కిందికి ప్రజలందరినీ తేవాలన్నది దేవుని కోరిక. లోకం ఆనందంతోను శాంతితోను నిండి ఉండాలని ఆయన వాంఛించాడు. ఆయన మానువణ్ణి సంతోషం కోసం సృజించాడు. మానవ హృదయాల్ని పరలోక శాంతితో నింపాలని ఆయన ఆశించాడు. లోకంలో ఉన్న కుటుంబాల పరలోకంలోని ఆ గొప్ప కుటుంబానికి సంకేతంగా ఉండాలని ఆయన ఆంక్షిస్తున్నాడు.COLTel 244.3

    అయితే ఇశ్రాయేలీయులు దేవని సంకల్పాన్ని నెరవేర్చలేదు. ‘శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. నాకు జాతిహీనవు ద్రాక్షవాల్లి వలె నీవెట్లు భ్రష్టసంతానమైతివి”? (యిర్మి 2:21) అన్నాడు ప్రభువు. “ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు (తమరకొరకే) ఫలము ఫలించిరి. ““హేషే 10:1 “కావున యెరూషలేము నివాసులారా, యూదావారాలారా,నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్షాతోటకు చేసిన దానికంటే మరేమి దేనికి చేయగలను ? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి ఆలోచించుడి. నేను నాద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయుబడునట్లు దాని కంచను కొట్టివేసెదను. అది తొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసెదను. అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును. ఆయన న్యాయం కావలెనని చూడగా బలాత్కారము కనెబడెను. నీతి కావెనని చూడగా రోదనము వినబడెను. ” యెష 5:3-7.COLTel 244.4

    ప్రభువు మోషే ద్వారా అపనమ్మకం ఫలితాల్ని తన ప్రజల మందు పెట్టాడు. ఆయన నిబంధనను ఆచరించటానికి నిరకరించుట ద్వారా వారు దేవుని జీవితతం నుంచి ఇష్టపూర్వకంగా తొలగిపోతున్నారు గనుక ఆయన దీవెనలు వారికి ఉండవు. మోషే ఇలా హెచ్చరించాడు. “నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞాలను విధులను కట్టడలను నీవు ఆచరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొట్టె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారుములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో.. అయితే మీరు ” మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో..... నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతల ననుసరించి పూజించి నమ్కరించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను. నీ యెదుట నుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములువినకపోయినుట్ల మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన యెడల మీరున వారి వలె నశించెదరు”. ద్వితి 8:11-14, 17, 19,20COLTel 245.1

    ఈ హెచ్చరికను యూద ప్రజలు లెక్క చెయ్యలేదు,. వారు దేవున్ని మర్చిపోయారు. ఆయన ప్రతినిధులుగా తమ ఉన్నతమైన అధిక్యతల్ని విస్మరించారు. వారు పొందిన దీవెనలు ప్రపంచానికి మేలు చెయ్యలేదు. తమకు దేవుని వలన కలిగిన మేళ్ళన్నీ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఉయోగించుకున్నారు. తమ నుంచి దేవుడు కోరిన సేవను చెయ్యకుండటం ద్వారా వారు దేవున్ని దోచుకున్నారు. తమ తోటి మనుషులికి ఆధ్యాత్మిక నడుపుదల ఇవ్వకపోవటం ద్వారా పరిశుద్ధ ఆదర్శగా నివసించకపోవటం ద్వారా వారిని దోచుకున్నారు. జలప్రళయం ముందటి ప్రజల్లాగ వారు తమ దుష్ట హృదయాల ప్రతీ ఆలోచనను అనుసరించారు. పరిశుద్ధ విషయాల్ని గూర్చి ‘ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యో హవా ఆంటూ వాటిని ఒక ప్రహసనం చేసారు. (యిర్మీ 7:4) అదే సమయంలో వారు దేవుని ప్రవర్తనను గూర్చి అబద్దాలు చెప్పి ఆయన నామాన్ని అగౌవరపర్చి ఆయన ఆలయాన్ని అపవిత్ర పర్చారు.COLTel 246.1

    ప్రభువు ద్రాక్షతోటకు బాధ్యులైన వ్యవసాయకులు తమ బాధ్యత విషయంలో అపనమ్మకంగా ఉన్నారు. యాజకులు బోధకులు ప్రజలకు నమ్మకంగా ఉపదేశమివ్వలేదు. దేవుని మంచితనాన్ని కృపను వారు ప్రజలు ముందుంచలేదు. తమ ప్రేమను సేవను దేవుడు కోరుతున్నట్లు వారికి చెప్పలేదు. ఈ వ్యవసాయకులు తమ సొంత మహిమను అన్వేషించారు. ద్రాక్షతోట ఫలాలు తామే అనుభవించాలని ఆశించారు. ఆదరణ మన్న తమెకే దక్కాలన్నది వార ఆకాంక్ష.COLTel 246.2

    ఇశ్రాయేలు నాయకుల అపరాధం సమాన్య పాపి అపరాధం వంటిది కాదు. ఈ మనుషులు దేవునికి జవాబుదారీ బాధ్యత గలవారు. వారు దైవ వాక్యాన్ని బోధిస్తామని తమ వ్యావహరిక జీవితంలో ఖచ్చితమైన విధేయతను ఆచరిస్తామని ప్రమాణం చేసారు. ఇది చెయ్యటానికి బదులు వారు లేఖనాల్ని వక్రీకరించారు. ఈ జీవితంలోని ప్రతీ చిన్న విషయానికి సంబంధించి ఆచారాల్ని అమలుపర్చి ప్రజలపై పెనుభారం మోపారు. ప్రజలు నిత్యం ఆందోళనతో నివసించేవారు. ఎందుకంటే రబ్బీలు విధించిన విధుల్ని నెరవేర్చటం చాలా కష్టమయ్యేది. మానవ కల్పిత ఆజ్ఞల్ని ఆచరించటం ఆసాధ్యమైనట్లు చూసినప్పుడు ప్రజలు దేవుని ఆజ్ఞల్ని ఆశ్రద్ధ చేసారు.COLTel 246.3

    ద్రాక్షతోట యాజమానిని తానేనని, తమకున్న సంపదంతా తనకు ఉపయోగించేందుకు ట్రస్టుగా తాను ఇచ్చిదనదేనని ప్రభువు తన ప్రజలకు ఉపదేశించాడు. కాని యాజకులు బోధకులు తాము దేవుని ఆస్తి విషయంలో వ్యవహరిస్తున్నామని గురించి తమ పవిత్ర హోదాకు సంబంధించిన పనిని నిర్వహించలేదు. తన కర్తవ్యాన్ని పురోగతి నిమిత్తం తమకు అప్పగించబడ్డ ద్రవ్యాన్ని వనరుల్ని ఆయన కార్యానికి వినియోగించకుండా ఆయన్ని దోచుకుంటున్నారు. వారి దురాశ అత్యాశ వల్ల అన్యజనులు సయితం వారిని తృణీకరించారు. ఈరీతిగా అన్య ప్రపంచం దేవుని ప్రవర్తనను ఆయన రాజ్యనియామాలిని అపార్ధం చేసుకొని దుష్ప్రచారం చెయ్యటానకి అవకాశం కలిగింది.COLTel 247.1

    తండ్రి హృదయంతో దేవుడు తన ప్రజల పట్ల ఓర్పు సహనం కలిగి ఉన్నాడు. కృపలు ఇవ్వటం ద్వారా కృపలు నిలుపు చెయ్యటం ద్వారా ఆయన వారితో విజ్ఞాపన చేసాడు. సహనంతో వారి పాపాలు వారికి ఎత్తి చూపించాడు. వారు వాటిని గుర్తించటానికి ఓర్పుతో కని పెట్టాడు. తనకు రావల్సిన ఫలాల కోసం వ్యవసాయకులు వద్దకు ప్రవక్తల్ని తన సేవకుల్ని పంపాడు. కాని వారిని స్వాగతించే బదులు, వ్యవసాయకులు వారిని శత్రువులుగా పరిగణించారు. వారిని హింసించి చంపారు. దేవుడు ఇంకా ఇతర సేవకుల్ని పంపాడు. వారితో కూడా వ్యవసాయకులు ముందటి వారితో వ్యవహరించినట్లే వ్యవహరించారు. ఈసారి ఆ వ్యవసాయకులు మరింత ద్వేషం ప్రదర్శించారు.COLTel 247.2

    చివరి ప్రయత్నంగా దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన “నాకుమారుని సన్మానించెదరు” అనుకున్నాడు. వారి ప్రతిఘటన మరింత కక్షతో నిండినది. “ఇతడు వారుసడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందుము రండి” అప్పుడు ద్రాక్షతోట మనదవుతుంది. దాని పండ్లను మనం ఇష్టారాజ్యంగా ఉపయోగించుకోవచ్చు. అని తమలో తాము అనుకున్నారు.COLTel 247.3

    యూదుల అధికారులు దేవుని ప్రేమించలేదు. కనుక వారు ఆయనతో సంబంధము లేకుండా ఉన్నారు. తమతో సమాధానపడటానికి ఆయన ప్రయత్నాల్ని వారు తిరస్కరించారు. ద్రాక్షతోట యాజమానికి చెందిన ఫలాన్ని అందుకోవటానికి దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు వచ్చాడు. కాని ఆ వ్యవసాయకులు ఆయన్ని ద్వేషించి, ఈయన్ని మా పాలకుడిగా మేమం గీకరించం అన్నారు. వారు క్రీస్తు సుందర ప్రవర్తన చూసి అసూయపడ్డారు. ఆయన బోధనా విధం వారి బోధనా పద్దతికన్నా భిన్నమైంది. ఆయన విజయాన్ని చూసి వారు భయాందోళనలకు గురి అయ్యాడు. ఆయన వారిన విమర్శించాడు. వారి దొంగాటను బయట పెట్టాడు. తమ క్రియ పర్యవసానాన్ని వారి కళ్ళకు కట్టి ఇది వారిని గంగవెర్రు లెత్తించింది. క్రీస్తు నిత్యం సూచిస్తున్న ఉన్నత ప్రమాణం గల నీతిని వారు ద్వేషించారు. ఆయన బోధన తమ స్వార్ధ పర కార్యాల పై ముసుగును తొలగించే పరిస్తితి వస్తుందని గ్రహించి ఆయన్ని చంపి తొలగించుకోవాలని కృత నిశ్చయులయ్యారు. ఆయన సత్యవర్తన, భక్తి జీవితార్శన్ని ఆయన చేసిన సమస్త కార్యాల్లో ప్రస్ఫుటంగా కనిపించిన సమున్నత ఆధ్యాత్మికతను వారు ద్వేషించారు. ఆయన జీవితం వారి స్వార్ధపరత్వానికి చెంప పెట్టు. వారికి చివరి పరీక్ష నిత్య జీవానికి నడిపే విధేయతా లేదా నిత్య నాశనానికి నడిపే అవిధేయత వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలు పరిశుదుణ్ణి విసర్జించారు. క్రీస్తునో బరబ్బనో ఎంపిక చేసుకోమని అడిగినప్పుడు వారు “మాకు బరబ్బను విడుదల చేయుము” అని కేకలు వేసారు. (లూకా 23:18) క్రీస్తనబడిన యేసును ఏమి చేతును?’ అని పిలాతు అడిగినప్పుడు “సిలువ వేయుము” అని అరిచారు (మత్త 27:22) పిలాతు “మీరాజును సిలువ వేయుదునా?” అన్నప్పుడు ‘కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు” అంటూ యాజకులు అధికారులు బదులు పలికారు (యోహా 19:15) “ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని ” అంటూ పిలాతు చేతులు కడుగుకున్నప్పుడు యాజకులు జనసమూహంతో గొంతు కలిపి ఉద్రేకంగా ‘వాని రక్తము మా మీదను మా పిల్ల మీదను ఉండును గాక’ అని కేకలు వేసారు. మత్త 27:24,25COLTel 248.1

    యూదు నాయకలు తమ ఎంపిక చేసుకున్నారు. సింహాసనాసీనుడైన వాని చేతిలో ఉన్నట్లు యోహాను ఏ పుస్తకం చూశాడో, ఏ పుస్తకాన్ని ఏ మానువడూ తెరవలేడో దానిలో వారి తీర్మానం నమోదయ్యింది.ఈ యూదా గోత్రపు సింహం ఈ పుస్తకంముద్రను విప్పే ఆ మృదినాని ఈ తీర్మానం అతి స్పష్టంగా మారి ముందు సాక్షాత్కరిస్తుంది. తాము దేవుడు అభిమానించే జనమన్నది తాము ఎల్లప్పుడూ దేవుని సంఘంగా గౌరవించబడాలన్నది యూదు ప్రజలు గట్టిగా నమ్మిన అభిప్రాయం. తాము అబ్రాహాము బిడ్డలమని వారు ప్రకటించుకున్నారు. వారికి తమ పునాది ఎంత బలీయంగా కనిపించిందంటే తమ హక్కుల్ని కాదంటే భూలోకాన్ని పరలోకాన్ని ధిక్కరించటానికి సిద్ధమయ్యేవారు. అయితే వారు తన అపనమ్మక జీవితాల ద్వారా దేవుని శిక్షా విధికి ఆయనతో విడిపోవటానికి సిద్ధపడుతున్నారు.COLTel 249.1

    ద్రాక్షతోట ఉపమానంలో యాజకుల ముందు తమ మిక్కిలి నికృష్ణమైన చర్యను క్రీస్తు వివరించిన తర్వాత వారికి ఈ ప్రశ్న వేసాడు.COLTel 249.2

    “ఆద్రాక్షతోట యాజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనే మి చేయవలెను”? ఆ కథనాన్ని యాజకులు ఆసక్తిగా వింటున్నారు. ఆ అంశంతో తమ కున్న సంబంధాన్ని గురించి ఆలోచించకుండా వారు ప్రజలతో శ్రుతి కలిపి ఇలా బదులు పలికారు. “ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆద్రాక్షతోట గుత్తకిచ్చును”.COLTel 249.3

    తెలియకుండానే వారు తమ శిక్షను నాశనాన్ని ప్రకటించుకున్నారు. ఆయన తమ మనసుల్లోని రహస్యాల్ని చదివాడని ఆయన తీవ్ర వీక్షనంలో గ్రహించారు. ఆ వ్యవసాయకుల్లో వారు తమ్మును తాము చూసుకున్నారు. ‘అట్లు కాకపోవును గాక” అని ఆనాలోచితముగా తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.COLTel 249.4

    “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభువు వలనెననే కలిగినె ఇది మనకన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములో ఎన్నడును చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి, దాని ఫలిమిచ్చు జనులకియ్యబడును... మరియు ఈ రాతి మీదపడువారు తనుకలైపోదురు గాని అది ఎవని మీద పడునో వానిని నాశనం చేయున’ అని గంభీరంగాను విచార వదనంతోను క్రీస్తు చెప్పాడు.COLTel 249.5

    యూదు ప్రజలు తనను స్వీకరించి ఉంటే క్రీస్తు ఆ జాతి నాశనాన్ని తప్పించి ఉండేవారు. ఆసూయ ఈర్ష్య వారి హృదాయాల్ని కఠినపర్చాయి. నజరేయుడైన యేసును మెస్సీయగా స్వీకరించకూడదని వారు నిశ్చయించు కున్నారు. వారు లోకానికి వెలుగైన క్రీస్తును నిరాకరించారు. నాటి నుండి వారి జీవితాల్ని చీకటి ఆర్దరాత్రి చీకటి ఆలముకున్నది. ముందే చెప్ని నానశనం యూద జాతికి వచ్చింది. వారి భయంకర ఆవేశాలు అదుపు తప్పి వారి నాశనానికి దారి తీసాయి. అగ్రహావేశాల ఉన్మాదంలో వారు ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. వారి తిరుగుబాటుతనం, తలబిరుసు తనం, దూరావేశం రోమా చక్రవర్తుల ఆగ్రహాన్ని రేపాయి. యెరూషలేము నాశనమయ్యింది. ఆలయం శిధిలాల కుప్పగా మిగిలింది. అది నిలిచిన స్తలం పొలాంలా దున్నబడింది. యూదా సంతతి వారు భయంకర రీతుల్లో మరణించారు. లక్షలాది ప్రజలు అన్యదేశాల్లో బానిసలుగా అమ్మబడ్డారు.COLTel 250.1

    ఒక ప్రజలుగా యూదులు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలుల య్యారు. కనుక ద్రాక్షతోటను వారి వద్ద నుండి తీసివేయటం జరిగింది. వారు దుర్వినియోగం చేసిన ఆధిక్యతలు తరుణాలు, తృణీకరించిన సేవలు ఇతరులికి అప్పగించటం జరిగింది.COLTel 250.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents