Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఈ ధనాన్ని ఆలక్ష్యం చేస్తే పర్యవసానాలు

    సాతాను మానవ మానవులతో పనిచేస్తు దేవుని ప్రమేయం లేకుండా అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చునని నమ్మటానికి వారిని నడిపిస్తాడు. అతడు మోసకరమైన వాదనతో దేవుని వాక్యాన్ని శంకించటానికి అదామవ్వల్ని నడిపించి దాని స్థానే అవిధేయతకు దారి తీసిన సిద్ధాంతాన్ని సరఫరా చేసాడు. ఆ సిద్ధాంతం ఏదెనులో ఏమి సాధించిందో ఇప్పుడూ అదే సాధిస్తున్నది. తాము నేర్పే విద్యతో నాస్తిక గ్రంథకర్తల అభిప్రాయాల్ని మిళితం చేసి బోధించే ఉపాధ్యాయులు దేవుని సందేహించి ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే అభిప్రాయాల్ని యువత మనసుల్లో ప్రవేశపెడుతున్నారు. తాము ఏమి చేస్తున్నారో వారెరుగరు. తాము చేస్తున్న వాటి ఫలితాల్ని వారు గుర్తించరు.COLTel 78.1

    నేడు ఒక విద్యార్ధి పాఠశాల, కళాశాల తరగుతులన్నీ ముగించవచ్చు.తన స్వరశక్తులూ ధారపోసి జ్ఞానం సంపాదించవచ్చు,. అయినా అతడికి దేవుని గూర్చిన జ్ఞానం ఉంటేనే గాని, తన శరీరాన్ని పాలించే చట్టాలకి విధేయుడైతే తప్ప అతడు తన్ను తాను నాశనం చేసుకోవడం తథ్యం. అతడు తప్పుడు అలవాట్ల వల్ల ఆత్మ గౌరవాన్ని కోల్పోతాడు. ఆత్మ నిగ్రహాన్ని కోల్పోతాడు. తనకు సంబంధించిన విషయాల గురించి నిర్దుష్టంగా ఆలోచించలేడు. శరీరాన్ని మనసును చూసుకునే విషయంలో అతడు లెక్కలేని తనంగా వివేకరహితంగా ప్రవర్తిస్తాడు. తప్పుడు అలవాట్లు వ్యసనాల మూలంగా తన్ను తాను పాడు చేసుకుంటాడు. అతడికి సంతోషం ఉండదు. ఎందుచేతనంటే అతడు శుద్ధమైన ఆరోగ్యకరమైన సూత్రాల్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల మనశ్శాంతిని నాశనం చేసే అలవాట్లు అభ్యాసాలు అతణ్ని నియంత్రిస్తాయి. అతడు శ్రమపడి చదివిన చదువు వ్యర్ధమౌతుంది. ఎందుకంటే అతడు తన్ను తాను నాశనం చేసుకుంటాడు. తన శారీరక మానసిక శక్తుల్ని దుర్వినియోగం చేసుకుంటాడు. అతడి శరీరాలయం శిధిలావస్తలో ఉంటుంది. అతడు ఈ జీవితాన్ని ఆనందించడు.. వచ్చే జీవితానికి అనర్హుడవుతాడు. లోక సంబంధమైన జ్ఞానం సంపాదించడం ద్వారా ధనం సంపాదించాలని భావించాడు. కాని అతడు బైబిలుని పక్కన పెట్టడం వల్ల దీనికన్నా ఎంతో విలువైన ఆధ్మాత్మిక ఐశ్వర్యాన్ని పొగొట్టుకున్నాడు.COLTel 78.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents