Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    18—రాజమార్గములలోనికి కంచెలలోనికి” వెళ్లుడి

    ఆధారం లూకా 14:1, 12-24

    ఒకపరిసయ్యుడు ఇస్తున్న విందులో రక్షకుడు అతిథి, ఆయన ధనవంతు ఆహ్వనాల్ని పేదవారి ఆహ్వానాల్ని అంగీకరించేవాడు. ఆయన తన అలవాటు చొప్పున తన ముందున్న దృశ్యాన్ని తాను భోదించే సత్యాలతో జతపర్చేవాడు.యూదుల జాతీయ మతపర ఉత్సవాలన్నిటిలో పరిశుద్ధ విందు ఒక భాగమై ఉండేది. నిత్య జీవవ దీవెనలకు అది వారికొక గుర్తుగా ఉండేది. అన్యజనులు బయట నిలబడి ఆశతో చూస్తుండగా తాము అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలసి కూర్చుని భుజించనున్న ఆ గొప్ప విందు, వారు ధ్యానించటానికి ముచ్చటపడే అంశం. క్రీస్తు బోధించాలని ఆకాంక్షించిన హెచ్చరిక ఉపదేశాల్ని పాఠాల్ని విందు ఉపమానం ద్వారా ఇప్పుడు ఉదహరించాడు. ప్రస్తుత జీవితానికి, భావి నిత్య జీవితానికి సంబంధించి దేవుని దీవెనల్ని కృప అన్య ప్రజలకు ఉండకూడ దన్నది వారి ఆలోచన. ఆ సమయంలో తాము దేవుడిస్తున్న కృపాహ్వాన్ని అనగా దేవుడని రాజ్యానికి పిలుపును తిరస్కరిస్తున్నారని, తాము తిరస్కరిస్తున్న ఆహ్వానాన్ని తాము ద్వేషిస్తున్న వారికి, ఎవరిని కుష్టురోగము లైనట్లు తిరస్కరించి వారికి తగలకుండా తమ వస్త్రాల్ని వెనక్కి లాక్కుంటున్నారో ఆ అన్యులికి అందించటం జరగుతుందని ఈ ఉప మానం ద్వారా క్రీస్తు సూచించాడు.COLTel 178.1

    తన విందుకు అతిథుల్ని ఎంపిక చేసుకోవటంలో ఆ పరిసయ్యుడు తన స్వార్ధాసక్తుల్నే దృష్టిలో ఉంచుకున్నాడు. క్రీస్తు అతడితో ఇలా అన్నాడు. “నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైను నీ సహదరులనైనను నీ బంధువులనైనను ధవనంతులగు నీ పొరుగా వారినైనను పిలువద్దు. వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలుపుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యువడవగుదువు. నీ నితిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు”.COLTel 178.2

    క్రీస్తు మోషే ద్వారా ఇశ్రాయేలుకిచ్చిన ఉపదేశాన్ని ఇక్కడ పునరుచ్చరి స్తున్నాడు. తమ పరిశుద్ద విందుకి ” నీ ఇంటనున్న పరదేశులును, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు” (ద్వితి 14:29) అని ప్రభువు ఆదేశించాడు. ఈ సమావేశాలు ఇశ్రాయేలీయులకి సాదశ్య పాఠాలు కావల్సి ఉంది. ఈ విధముగా నిజమైన ఆతిథ్యాన్ని గూర్చి నేర్చుకున్న మీదట ప్రజలు ప్రియుల్ని కోల్పోయినవారికి బీదవారికి సహాయ సహకారాలు అందించాల్సి ఉన్నారు. ఈ విందుకి ఇంకా విశాల అర్ధం ఉంది.ఇశ్రాయేలీయులికి దేవుడిచ్చిన దీవెనలు కేవలం వారికే ఉద్దేశించినవి కావు. ప్రపపంచమంత పంచుకునేందుకు దేవుడు వారికి జీవాహారానిచ్చాడు.COLTel 179.1

    “దప్పిగొనినవారలారా, నీళ్ళ యొద్దకు రండి రూకలు లేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి, రండి, రూకలు లేకపోయినను ఏమియ నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము గాని దాని కరొరక మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరెచదెరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్ధము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనియ్యుడి”. యెష 55:12COLTel 179.2

    ఈ కర్తవ్యాన్ని వారు నెరవేర్చలేదు. క్రీస్తు అన్న మాటలు వారి స్వార్ధపరత్వానికి మందలింపు. పరిసయ్యులికి అయన మాటలు రుచిలేని చప్పని పలుకులు. వారిలో ఒకడు ఆ సంభాషణను మరో విధంగా తిప్పలన్న ఉద్దేశంతో గొప్ప భక్తిని నటిస్తూ “దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు” అని అన్నాడు. దేవుని రాజ్యంలో తనకో స్థానం ఖాయమన్నట్లు వ్యక్తి గొప్ప నిశ్చయతతో మాట్లాడాడు. రక్షణ పొందటానికి గల షరతుల్ని మీరుతూనే తాము క్రీస్తు ద్వారా రక్షణ పొందామని ఆనందించే వారి వైఖరిలాంటిది ఇతడి వైఖరి. “నీతిమంతుని మరణము వంటి మరణము నకు లభించను గాక” (సంఖ్యా 23:10) అని ప్రార్ధి:చిన బిలాము స్వభావవంటిది ఇతడి స్వభావం. ఈ పరిసయ్యుడు పరలోకానికి తన యోగ్యతను గురించి ఆలోచించటం లేదు గాని పరలోకంలో తాను ఆనందించానికి ఎదరు చేసేవాటి గురించి కలలు కంటున్నాడు. విందుకు సమావేశమైన అతిథుల మనసుల్ని తమ విధిని గూర్చిన అంశం నుంచి మళ్లించటానికే అతడి సూచన ఉద్దేశించబడింది. వారి మనసుల్ని ప్రస్తుత జీవితం నుంచి ఎప్పుడో సంభవించే నితిమంతులు పునరతానానికి తిప్పటానికి అతడు ప్రయత్నించాడు. ఆ కపట భక్తుడి హృదయాన్ని క్రీస్తు చదివాడు. అతడి మీద దృష్టి కేంద్రీకరించి తమ ప్రస్తుత అధిక్యతల స్వభావాన్ని వాటి విలువను ఆజనసమూహ ముందు పెట్టాడు. భవిష్యతు జీవితపు దీవెనల్లో పాలు పొందాలంటే అప్పుడు తాము నిర్వహించాల్సిన పాత్ర ఉన్నదని వారికి తెలియజేసాడు.COLTel 179.3

    “ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను” విందుకి సమయమైనప్పుడు అహ్వానించిన అతిథుల వద్దకు తన సేవకుడితో ఈ వర్తమానం పంపాడు. “ఇప్పుడు సిద్ధమైయున్నది రండి”. అయితే ఆహ్వానితులు ఉదాసీనతను ప్రదర్శించారు. “వారందరు ఏకమసస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు... నేనొక పొలము కొనియున్నాను. అవశ్యకముగా వెళ్ళి దాని చూడవలెను. నన్ను క్షమింపవలెనని నిన్ను నేను వేడుకొనుచన్నాననెను”. మరియొకడు .. “నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను. వాటిని పరీక్షింపవెల్పుచున్నాను. నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానననెను. మరియొకడు - నేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను. అందుచేత నేను రాలేననెను”.COLTel 180.1

    వీటిలో ఏదీ నిజమైన అవసరాన్ని బట్టి చెప్పినది “ఆవశ్యముగా వెళ్లి దాని చూడవలెను” అన్న వ్యక్తి ఆ పొలం అప్పుడే కొనసాడు. కనుక దాన్ని త్వరగా చూడాలన్న కోరిక దాన్ని కొనటానికి సంబంధించిన ఆసక్తి మాత్రమే. ఎడ్లనుకూడా కొనటం జరిగింది. వాటిని పరీక్షించటమన్నది కొనుగోలు దారుడి ఆసక్తిని తృప్తిపర్చటానికే మూడోవాడి సాకులో అర్ధమేలేదు. ఆహ్వానితుడైన అతిధి పెండ్లి చేసుకున్నానన్నది అతడు విందులో పాలుపొందటానికి అటంకం కాదు. అతడి ప్రణాళికలు అతడికున్నాయి. ఇవి అతడికి తాను విందుకు హాజరవుతనాన్న వాగ్దానం కాన్న వాంఛనీయ మయ్యాయి. అతిథేయుడి సహవాసంలో కన్నా ఇతరుల సహవాసంలో అతడికి ఎక్కువ ఆనందం లభించింది. రాలేకపోతున్నందుకు క్షమాపణ కూడా అతడు అడగలేదు. “రాలేను” అన్నది “నేను రాను” అన్న సత్యానికి ముసుగు మాత్రమేCOLTel 180.2

    సాకులన్నీ పరాధీనమైన మనసును సూచిస్తున్నాయి ఆహ్వానించాలని ఉద్దేశించిన అతిధులకి ఇతర ఆసక్తులు ప్రధానమయ్యాయి. తాము అంగీకరిస్తామని వాగ్దానం చేసిన ఆహ్వానాన్ని వారు పక్కన పెట్టారు. తమ ఉదాసీన వైఖరి వల్ల వారు తమ మంచి మిత్రుణ్ణి కించపర్చారు.COLTel 181.1

    ఈ గొప్ప విందు సువార్త ద్వారా క్రీస్తు అనుగ్రహించే దీవెనల్ని సూచిస్తున్నది. ఈ ఏర్పాటు క్రీస్తు వంటిది పరలోక నుంచి వచ్చిన జీవాహరం. ఆయన రక్షణ సెలయేళ్ళు ఆయననుంచే ప్రవహిస్తున్నాయి. ప్రభువు సేవకులు రక్షకుని రాక గురించి యూదులికి ప్రకటించారు. వారు క్రీస్తును “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా” సూచించారు (యోహా 1:29) ఆయన ఏర్పాటు చేసిన విందులో వారి నిమిత్తం పరలోకం ఇవ్వగల అత్యుత్తమ వరాన్ని దేవుడు వారికిచ్చాడు. అది మానవ జ్ఞానం గ్రహించలేని వరం దేవుడు వారికిచ్చాడు. అది మానవ జ్ఞానం గ్రహించలేని వరం. దేవుని ప్రేమ విలవైన విందును ఏర్పాటు చేసింది. దానికి ఎన్నటికి తరగని వనరుల్ని సమకూర్చింది. “ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెప్పుడును జీవించును” అని క్రీస్తు అన్నాడు (యోహా 6:51)COLTel 181.2

    అయితే సువార్త విందుకు ఆహ్వానాన్ని అంగీకరించేందుకు వారు క్రీస్తుని ఆయన నీతిని పొందాలి అన్న ఒకే ఒక కర్తవ్యాన్ని తమ లోక సంబంధమైన ఆశల్ని ఆసక్తుల్ని లోపర్చాలి. దేవుడు మానవుడికి సమస్తాన్ని ఇచ్చాడు. మానవడు తన ఐహిక స్వార్ధ ప్రయోజనాలకన్నా తన సేవకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ద్వంద హృదయాన్ని అంగీకరించడు.లోక వ్యామోహంలో చిక్కుకున్న హృదయన్ని దేవునికివ్వటం సాధ్యం కాదు.COLTel 181.3

    ఇది అన్నికాలాలికి సంబంధించిన పాఠం.దేవుని గొర్రెపిల్ల ఎక్కడకు వెళ్తే అక్కడకు మనం ఆయన్ని వెంబడించాలి. ఆయన నడుపుదలను ఎన్నుకోవాలి. ఆయన సహవాసాన్ని ఐహిక మిత్రుల సహవాసం కన్నా ఎంతో విలువైందిగా పరిగణించాలి. క్రీస్తు ఇలా అంటున్నాడు. “తండ్రి నైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రడు కాడు”. మత్త 10:37COLTel 182.1

    క్రీస్తు దినాల్లో కుటుంబ భోజనబల్ల చుట్టు కూర్చుని అనుదినాహారర భుజించేటప్పుడు అనేకులు “దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు” అన్నమాటలు వల్లించేవారు. అయితే గొప్ప మూల్యం చెల్లించి ఏర్పాటు చేసిన విందుకి అతిథుల్ని కనుగొనటం ఎంత కష్టమో క్రీస్తు చూపిస్తున్నాడు. ఆయన మాటలు వింటున్నవారు తాము కృపాహ్వానాన్ని తృణీకరించామని గుర్తించారు. వారికి ఐహికమైన ఆస్తులు, సిరిసంపదలు వినోదాలే ప్రధానం. వారందూ ఒకటై సాకులు చెప్పారు. “జీవహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నా తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే పరలోకము నుండి జీవాహరము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును”. యెహాను 6:48-51.COLTel 182.2

    అదే ఇప్పుడు జరుగుతున్నది. నాడు ప్రజలు ఉపయోగించిన సాకుల్నే విందు ఆహ్వానాన్ని నిరాకరించటానికి సువార్త అహ్వానాన్ని తోసి పుచ్చుటానికి నేడు ప్రబలిస్తున్నారు. సువార్తకు విధేయులవ్వటం వల్ల తమ ఐహిక పురోభివృద్దని బలి చేసుకోలేమని అనేకులు చెబుతున్నారు. వారు తమ లోకసంబంధమైన ఆసక్తుల్ని నిత్య జీవం కన్నా ఎక్కువగా లెక్కిస్తున్నారు. దేవుని చేతి నుండి తాము పొందుతున్న దీవెనలే వారిని తమ సృష్టికర్త అయిన విమోచకుడి నుండి వేరుచేసే అడ్డుగోడగా పరిగణమిస్తాయి. వారు తమ లోక వ్యవహరాల్ని విడిచి పెట్టారు. వారు కృపాపరిచారకుడితో “ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపింతును” (అ.కా 24:25) అంటున్నారు. ఇతరలు తాము దేవుని పిలుపుక విధేయులైనట్లయితే తమ సాంఘిక సంబారాల్లో సమస్యలు తలెత్తుతాయని చెప్పుతున్నారు. తమ బంధువలు పరిచయస్తులతో సమారస్యాన్ని కోల్పోవటానికి సిద్ధంగా లేమని వారంటున్నారు. ఇలా వారు ఉపమానంలో వర్ణించబడ్డ నటుల పాత్రలు తామే పోషిస్తున్నట్లు రుజువు చేసుకుంటున్నారు. తాను పంపిన ఆహ్వానాన్ని తాము అంగీకరించకపోవటానికి వారికిచ్చిన అర్హరహితమైన సాకుల్ని తన ఆహ్వానం పట్ల వారి వ్యతిరేకంగా దిక్కరించారు విందు యాజమాని పరిగణిస్తాడు.COLTel 182.3

    “నేనొక స్త్రీని వివాము చేసికొన్నాను; అందుచేత నేను రాలేను” అన్న వ్యక్తి ఒక పెద్ద తరగతిని సూచిస్తున్నాడు. దేవుని పిలుపకు స్పందించకుండా తమను అంటంకపర్చటానికి భార్యల్ని లేక భర్తల్ని అనుమతించేవారు అనేకులన్నారు. “నా భార్య వ్యతిరేకస్తుండగా నేను నా నమ్మకాలు ఆదేశిస్తున్నవా ఇని అచరించలేను. వాటి ఆచరణను ఆమె ప్రభావం కష్టతరం చేస్తుంది” అని భర్త అంటాడు. ‘ఇప్పుడు సిద్ధమైయున్నది. రండి ” అన్న కమ్మని పిలుపును భార్య వలన “నేను రాలేను నన్ను క్షమిచండి నా భర్త కృపాహ్వానాన్ని తిరస్కరిస్తున్నాడు. తన వ్యాపారం తను అడొస్తుందంటున్నాడు. నేను నా భర్తతో ఏకీభవించాలి. కనుక నేను రాలేను ” అంటుంది. పిల్లల హృదయాలు ప్రభావితం అవుతాయి. వారు రావాలని ఆశపడ్డారు అయితే వారికి తల్లితండ్రి అంటే ప్రాణం. వీరు సువార్త పిలుపుకు స్పందించరు గనుక, తాము రానవసరం లేదని పిల్లలు భావిస్తారు. “నన్ను క్షమించండి” అని వారు కూడా అంటారు.COLTel 183.1

    వీరందరూ కుటుంబములో చీలిక భయంతో రక్షకుని పిలుపునకు నిరాకరించారు. దేవునికి విధేయులై ఉండటానికి నిరాకరించటం ద్వారా తమ కుటుంబ సామరస్యాన్ని అభివృద్ధిని కాపాడుకుంటుమన్నది వారి ఊహ. కాని ఇది వట్టి భ్రమ మాత్రమే. స్వార్థాన్ని వారు స్వార్ధం పంటనే కోస్తారు. క్రీస్తు ప్రేమను తిరస్కరించటం ద్వారా మావన ప్రేమకు పవిత్రతను. స్థిరతను ఏది ఇవ్వగలదో దాన్నే వారు తిరస్కరిస్తారు. పరలోకాన్ని పోగొట్టుకోవటమే కాదు. ఎందు నిమిత్తం పరలోకం త్యాగం చేయ్యబడిందో దాని వాస్తవికానందాన్ని కూడా వారు పొందలేరు.COLTel 183.2

    ఉపమానంలో ఆహ్వానితులు తన ఆహ్వానాన్ని ఎలా పరిగణించారో తెలుసుకొని అతిథేయుడు. “కోపపడి - నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను”.COLTel 184.1

    ఆ గృహ యాజమానడు తన కలిమిని తృణీకరించిన వారిని విడిచి పెట్టి, సంపూర్ణులు కాని ఇళ్ళు భూములు లేని ఒక తరగతి ప్రజల్ని ఆహ్వానించాడు. బీదవారిని ఆకలితో బాధపడున్నవారిని తాను సమృద్ధిగా సమకూర్చే పని అభినందించే వారిని అతడు ఆహ్వానించాడు. “సుంకరులును వేశ్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశింతురు”. మత్త 21:31 మనుషులు ఎవరిని చీదరించుకుని ఎవరిని ఆహ్వానిస్తారోCOLTel 184.2

    “భుజించుటకుపరలోకమునుడి ఆయన ఆహారము వారికి అనుగ్రహిం చెను అని వ్రాయబడినట్లు మన పితరులు ఆరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పెను. కాబట్టి యేసు- పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నది. ...జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వసించువాడు ఎన్నడును దప్పిగొనడు”. యెహా 6:30-35.COLTel 184.3

    గుర్తింపుకు ప్రేమకు అర్హులు కానంత తక్కువ వారు దరిద్రులు కారు. చింతలు దు:ఖాలు ఉన్నవారు, అలసిసొలసినవారు, హింసకు గురి అయినవారు తన వద్దకు రావలని క్రీస్తు ఎదురుచూస్తున్నాడు.ఎక్కడా లభించని వెలుగును ఆనందాన్ని ప్రేమను వారికివ్వాలని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ లభించని వెలుగును ఆనందాన్ని ప్రేమను వారికివ్వాలని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నాడు. తన కరుణకు ప్రగాఢ ప్రేమకు పాత్రులుగా ఆయన పరిగణించేవారు పాపులే. వారిని తన వద్దకు నడిపించటానికి, వారితో ప్రేమతో విజ్ఞాపన చెయ్యటానికి ఆయన పరిశు ద్దాత్మను పంపుతాడు.COLTel 184.4

    గృహ యాజమనుడి వద్దకు బీదవారిని గుడ్డివారిని తీసుకువచ్చిన సేవకుడు అతడికి ఇలా నివేదించాడు. “ప్రభువా నీ వాజ్ఞాపించినట్లు చేసితిని గాని ఇంకను చోటున్నది.. అందుకు యాజమానుడు.. నా ఇల్లు, నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము” అన్నాడు. యూదు మతం పరిది వెలపల, లోకం రాజబాటల్లోను చుట్టు తోవలోను జరగాల్సిన సువార్త సేవలను గూర్చి క్రీస్తు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.COLTel 185.1

    ఈ ఆజ్ఞకు విధేయులై పౌలు బర్నబాలు యూదులికి ఇలా ప్రకటించారు. “దేవుని వాక్యము మొదట మీకు చెప్పుడు ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా - నీవు భూదిగంతముల వరకు రక్షణార్ధముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమను మహిమపర్చిరి; మరియు నిత్యజవమునకు నిర్ణయింపడిన వారందరు విశ్వసించిరి”. అ.కా 13:46-48.COLTel 185.2

    క్రీస్తు శిష్యులు ప్రకటించిన సువార్త వర్తమానం క్రీస్తు మొదటి రాకకు ప్రచురించింది. ఆయన పై విశ్వాసం ద్వారా మానవులకు రక్షణ అన్న శు భవార్త అది ప్రజలకు అందించింది. తన ప్రజల్ని విమోచించటానికి ఆయన మహిమతో భవిష్యత్తులో రెండోసారి రావటాన్ని అది సూచించింది. విశ్వాసం ద్వారాను విధేయత ద్వారాను పరిశుద్ద వారసత్వంలో పాలుపంచుకునే నిరీక్షణను అది వారి ముందు ఉంచింది. నేటి ప్రజలకూ ఇదే వర్తమానాన్ని ఇస్తున్నది. దానితో పాటు క్రీస్తు రెండో రాకడ అతి సమీపంగా ఉందన్న ప్రకటన చేస్తున్నది. తన రాకను గురించి ఆయన ఇచ్చిన సూచనలు నెరవేరుతున్నాయి. దైవ వాక్యోపదేశం ప్రకారం ప్రభువు రాకడ అతి సమీపంలో ఉందని మనం అవగాహన చేసుకోవచ్చు.COLTel 185.3

    క్రీస్తు రెండో రాకకు కొంచెం ముందు సువార్త వర్తమానం ప్రకటించబడుతుందని ప్రకటన గ్రంధంలో యెహాను ప్రవచిస్తున్నాడు. “భూనివాసులకు, అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యన ఎగురుచు... దేవునికి భయపడి ఆయనను మహిమపర్చుడి; ఆయన తీర్పు తీర్చుగడియ వచ్చెను గనుక అని ప్రకటించటం అతడు దర్శనంలో చూసాడు (ప్రక. 14:67)COLTel 185.4

    ప్రవచనములో తీర్పును గూర్చి ఈ హెచ్చరిక, దానికి సంబంధించిన వర్తమనాల దరిమిలా మనుషకుమారుడు మేరూరూఢుడై రావటం జరగుతుంది. తీర్పును గూర్చిన ప్రకటన క్రీస్తు రెండో రాకడ సమీపంగా ఉన్నదని ప్రకటించటమే. ఈ ప్రకటన నిత్య సువార్త అని పిలవబడుచున్నది. క్రీస్తు రెండో రాకడను గూర్చిన ప్రబోధం, అది సమీపంగా ఉందన్న ప్రకటన సువార్త వర్తమానంలో ముఖ్యమైన భాగం అని ఇలా సూచించటం జరుగుతున్నది.COLTel 186.1

    చివరి దినాల్లో మనుషులులోక వ్యవహారాల్లో వినోదాలు ధన సంపాదనలో తలమునకలై ఉంటారని బైబిలు చెబుతున్నది. వారు నిత్యజీవానికి సంబంధించిన వాస్తవాలకు గుడ్డివారైవుతారు. క్రీస్తు ఇలా అంటున్నారు. “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు మందటి దినములోన నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగపోయిరి. అలాగుననే మనుష్యకుమారిని రాకడ ఉండును”. మత్త 24:37-39,COLTel 186.2

    అలాగే ఈ దినాల్లోను ఉంది, దేవుడు లేడు, పరలోకం లేదు, ఈ జీవితం తరువాత జీవితం లేదన్నట్లు మనుషులు ధన సంపాదనకు స్వార్దశల తృప్తికి తెగబడుతున్నారు.నోవహు దినాల్లో దుష్టత్వం దుర్మార్గంలో ఉన్న మననుషుల్ని మేల్కొలిపి పశ్చాత్తాపపడటానికి నడిపేందుకు జలప్రళయాన్ని గూర్చిన హెచ్చరికను దేవుడికివ్వటం జరిగింది. అలాగే క్రీస్తు త్వరితాగమన వార్త మనుషుల్ని తమ ఐహిక చింతలు వ్యవహారల నుంచి మేల్కొల్పటానికి ఉద్దేశించబడింది. ప్రభువు ఏర్పాటు చేసిన విందుకు వస్తున్న ఆహ్వానానికి వారు సప్రందించేందుకు గాను నిత్య సత్యాల విషయంలో స్పృహను మేల్కొల్పేందుకు అది ఉద్దేశించబడింది. COLTel 186.3

    లోకమంతటికీ సువర్తాహ్వానం అందించాల్సి ఉంది. ప్రతి జనమునకు ప్రతీ వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును” ప్రక 14:16 చివర ఇహెచ్చరిక, కృపా వర్తమానం మహిమతో భూమండల మంతాప్రకాశించాల్సి ఉంది. అది ధనికులు దరిద్రులు గొప్పవారు సామాన్యులు అన్ని తరగతుల ప్రజలకు అందాల్సి ఉంది. క్రీస్తు ఇలా అంటున్నాడు. “నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము.COLTel 187.1

    సువార్త లేక లోకం నశిస్తున్నది. దేవుని వాక్యానికి కరువు ఏర్పడింది. మానవ సాంప్రదాయాలతో కలగా మిగిలి దైవ వ్యాక్యాని నేర్చుకోనివారు బహుకొద్ది మంది మనుషులికి బైబిలు అందుబాటులో ఉన్నా తమకోసం దేవుడు అందులో పెట్టిన దీవెనల్ని వారు పొందలేకపోతున్నారు. ప్రభువు తన వర్తమనాన్ని ప్రజలకందించమని తన సేవకుల్ని కోరతున్నాడు. నిత్యజీవాన్నిచే వాక్యాన్ని తమ పాపాల్లో నశించే ప్రజలకు అందించటం జరగాలి.COLTel 187.2

    రాజమార్గాల్లోకి కంచెల్లోకి వెళ్లండి అన్న ఆజ్ఞలో తన నామంలో పని చెయ్యాటానికి ఆయన పిలిచేవారు చేయాల్సిన పనిని క్రీస్తు నిర్దేశిస్తున్నాడు. క్రీస్తు సువార్త బోధకులకు ప్రపంచమంతా సేవారంగమే. వారి సంఘ సభ్యత్వంలో మానవ కుటుంబమంతా ఇమిడి ఉన్నది. తన కృపా వాక్యం ప్రతీ ఆత్మకు సుపరిచితమవ్వాల్సిందిగా దేవుడు ఆకాంక్షిస్తున్నాడు.COLTel 187.3

    ఈ సేవను ఎక్కువ భాగం వ్యక్తిగత సేవ ద్వారా పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇది క్రీస్తు పద్ధతి. ఆయన సేవ చాలామట్టుకు వ్యక్తిగత సమావేశాలతో కూడి ఉన్నది. ఒక్క ఆత్మ సమావేశంపై ఆయనకు నమ్మకం. ఆ ఒక్క ఆత్మ ద్వారా వర్తమానం తరచు వేలాదిమందికి అందుతుంది.COLTel 187.4

    ఆత్మలు మన వద్దకు రావటానికి వేచి ఉండకూడదు. మనమే వారిని వెదకాలి. ప్రసంగ వేదిక పై నుంచి దైవ వాక్యం ప్రకటితమైనప్పుడే పని ప్రారంభమౌతుంది. తమ వద్దకు తీసుకు వెళ్తేనే గాని సువార్తను అందుకోలేని జనసమూహాలున్నాయి.COLTel 188.1

    విందుకు ఆహ్వానం మొట్టమొదటగా యూదుల ప్రజలకు ఇవ్వటం జరిగింది. మనుషుల మధ్య బోధకులుగాను నాయకులుగాను నిలవటానికి పిలుపు పొందిన ప్రజలు, క్రీస్తు రాకడను గూర్చి ముందుగానే చెబుతున్న ప్రవచన గ్రంథపు చుట్టలు ఎవరిచేతుల్లో ఉన్నవో ఆ ప్రజలు, ఎవరికి ఆయన పరిచర్య సంకేతాలు, ఛాయారూపక సేవల ద్వారా సూచించ బడిందో ఆ ప్రజలు వారు. ఆ పిలుపుకు యాజకులు ప్రజలు స్పందించి ఉంటే, లోకానికి సువార్త ఆహ్వానాన్ని అందించటంలో వారుCOLTel 188.2

    క్రీస్తు సేవకులతో శ్రుతి కలపి పనిచేసారు. ఇతరులికి అందించాలన్న ఉద్దేశంతోనే వారికి సత్యాన్ని పంపటం జరిగింది. వారు ఆపిలుపును నిరాకరించినప్పుడు దాన్ని బీదలకు, అంగహీనులకు ,కుంటి వారికి గుడ్డి వారికి, ఇవ్వటం జరిగింది. సుంకరులు పాపులు ఆహ్వానాన్ని అంగీకరించారు. సువర్త పిలుపు అన్యజనులకు పంపినప్పుడు ఇదే కార్యాచరణ ప్రణాళిక అమలయ్యింది. ఈ వర్తమానాన్ని మొదటిగా “రాజమార్గములోని ” వారికి - లోక విషయల్లో క్రియాశీలక పాత్ర కలవారికి, ప్రజల ఉపదేశకులు నాయకులికి - ఇవ్వాలి.COLTel 188.3

    ప్రభువు సేవకులు దీన్ని మనసులో ఉంచుకోవాలి. మందకాపరులికి అనగా దేవుడు నియమించిన బోధకులికి ఆచరించాల్సిన దైవ వాక్కుగా వస్తున్నది. సమాజంలో ఉన్న హోదాల్లో ఉన్నవారిని అనురాగపూర్వకంగా సోదర భావంతో కలవాలి. వ్యాపారంలో ఉన్న మనుషులు, కొత్త విషయాలు కనిపెట్టగల విజ్ఞాన శాస్త్రజ్ఞానం గలవారు.ఎవరి మనసులు ఈ కాలానికి ఉద్దేశించిన సత్యాలపై కేంద్రీకృతమాయ్య ఆ సువార్త బోధికులు వీరికి మొదటగా సువార్త ఆహ్వానాన్ని ఇవ్వాలి. COLTel 188.4

    ధనవంతుల విషయంలో జరగాల్సిన సేవ ఉంది. దేవుడు తమకు అప్పగించిన వరాల విషయమై తమ బాధ్యతను గుర్తించేందుకు వారిని మేల్కొల్పాల్సిసన అసవరం ఉంది. జీవించి ఉన్నవారికి మరణించినవారికి తీర్పు తీర్చే ప్రభువుకి తాము లెక్క అప్పగించాల్సి ఉన్నదని వారికి జ్ఞాపకం చెయ్యటం అవసరం. ధనవంతుడికి ప్రేమతోను ‘దైవ భీతితోను మీర చేయాల్సిన సేవ అవసరం. అతడు తన ధనాన్ని నమ్ముకొని తనకున్న ప్రమదాన్ని గుర్తించడు. ఎన్నడూ వాడబారని, విలువైన విషయాలు అతడి మానసిక నేత్రాన్ని ఆకర్షించాల్సిన అవసరం ఉంది. నిజమైన మంచితనం అధికారాన్ని అతడు గుర్తించటం అవసరం . అది ఇలా చెబుతున్నది. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీరు కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సుళువుగా నా భారము తేలికగాను ఉన్నవి”. మత్తయి 11:28-30COLTel 188.5

    విద్య, భాగ్యం లేదా హోదా సంబంధముగా లోకంలో ఘనత వహించిన వారితో ఆత్మపరమైన ఆసక్తుల్ని గురించి మాట్లాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అనేకమంది క్రైస్తవ సేవకులు ఈ తరగతులకు చెందిన వారిని కలవటానికి వెనకాడుతుంటారు. ఇలా జరగకూడదు. ఒక వ్యక్తి మునిగిపోతుంటే అతడు ఒక న్యాయవాది. వ్యాపారి లేక న్యాయమూర్తి గనుక అతడు మరణిస్తుంటే చూస్తూ ఊరకుండం గదా? ఎవరైనా ఏటవాలుగా ఉన్న ప్రదేశం మీదుగా ముందుకు దూసుకుపోవటం మనం చూస్తే వారి సదా లేకవృత్తి ఏదైనప్పటికి వారిని వెనకకు రమ్మని ఆభ్యర్థిస్తాం కదా ? అలాగే ఆత్మ సంబంధమైన అపాయంలో ఉన్నవారిని మనం హెచ్చరించాలి.COLTel 189.1

    ఐహిక విషయాలపై అమిత శద్ద ఉన్నట్లు కనిపిస్తున్న వావరెవరిని ఆలక్ష్యం చెయ్యకూడదు. ఉన్నత సాంఘిక హోదాలో ఉన్నవారు అహంకార రోగంతో బాధపడుతున్నారు. తమకు లేని శాంతి కోసం వారు ఆశగా కని పెడుతున్నారు. సమాజంలో అత్యున్నత స్థానాలో ఉన్నవారు రక్షణ కోసం తహతహలాడుతున్నారు. ప్రభువు సేవకులు తమను వ్యక్తిగతంగా వినయంగా క్రీస్తు ప్రేమతో నిండిన హృదయంతో కలిస్తే, అనేకులు ఆ సహాయాన్ని స్వీకరిస్తారు.COLTel 189.2

    సువార్త వర్తమానం విజయం ప్రతిభావంతమైన ప్రసంగాలు అనర్గళమైన సాక్ష్యాలు లేక భావయుక్తమైన తర్కాల పై ఆధారపడి ఉండదు. అది వర్తమానం సరళత మీద, జీవాహారం కోసం ఆకలిదప్పులు గొంటున్న ఆత్మలకు అనువుగా రూపొందించటం మీద ఆధారపడి ఉంటుంది. “రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను”?- ఇదే ఆత్మకున్న అవసరం.COLTel 190.1

    వేల ప్రజలకు అతి సామన్యంగా అతి నిరాంబరంగా సువార్తను అందించి వారిని విశ్వాసుల్ని చేయవచ్చు. ప్రతిభావంతులు, గొప్ప వరాలున్న వారిగా ప్రపంపచం పరిగణించే పురుషులు స్త్రీల్ని, దేవుణ్ణి ప్రేమించే ఒక వ్యక్తి పలికే సామాన్యమైన మాటలు తరుచుగా సేదదీర్చువచ్చును. లౌకికుడు తనకు ఆసక్తికరమైన విషయాల పై ఎంత స్వాభావికంగా మాట్లాడతాడో వారు ఆ ప్రేమను గూర్చి అంత స్వాభావికంగా మాట్లాడతారు. చక్కగా అధ్యయనం చేసి సిద్ధం చేసుకున్న మాటలు నిరూపయోగమౌతాయి. కానీ దేవుని కుమారుడు లేక కుమార్తె చిత్తశుద్ధితో స్వాభావిక సరళతతో పలికిన మాటలు క్రీస్తుకు ఆయన ప్రేమకు తావు లేకుండా మూతబడ్డ తలుపులు తెరచే శక్తి కలిగి ఉంటాయి.COLTel 190.2

    క్రీస్తు సేవకుడు తన స్వశక్తి పై ఆధారపడి పనిచెయ్యకూడని గుర్తుంచుకోవాలి. రక్షించటానికి ఆయనకున్నశక్తిపై విశ్వాసంతో అతడు దేవుని సింహాసనాన్ని ఆశ్రయించాలి.అతడు దేవునితో ప్రార్ధనలో పోరాడి ఆ మీదట ఆయన ఇచ్చిన సదుపాయాలన్నిటిని వినియోగించి పని చెయ్యాలి. పరిశుద్దాత్మ అతడి సామార్ధ్యమవుతాడు. హృదయాల్ని ప్రభావితం చెయ్యటానికి పరిచర్య చేసే దూతలు అతడి పక్క నిలబడి ఉటారు.COLTel 190.3

    క్రీస్తు అందించిన సత్యాన్ని యెరూషలేము నాయకలు బోధకులు అంగీకరించి ఉంటే వారి పట్టణం ఎలాంటి మిషనెరీ కేంద్రమయ్యేది! భక్తి విడచిన ఇశ్రాయేలు మారుమనసు పొందేది, ప్రభువుకి బ్రహ్మాండమైన సైన్యం పోగుపడేది. అప్పుడు వారు సువార్తను ఎంత వేగంగా అందించ గలిగేవారు! అలాగే పలుకుబడి గలవారిని గొప్ప ప్రతిభ ప్రయోజకత్వం గల వారిని క్రీస్తు విస్వాసుల్ని చేయగలిగితే అప్పుడు పడిపోయిన వారిని లేవదియ్యటం, బహిష్కృతుల్ని పోగుచెయ్యటం, రక్షణ వార్తను వ్యాప్తి చెయ్యటంలో ఎంత గొప్ప సేవ చేయవచ్చు! ఆహ్వానాన్ని త్వరితంగా అందించవచ్చు. ప్రభువు విందుకు అతిథుల్ని త్వరితంగా పోగుచెయ్యవచ్చు.COLTel 190.4

    అయితే మనం బీద తరగుతల్ని నిర్లక్ష్యం చేసి గొప్పవారిని వరాలున్నవారిని మాత్రమే దృష్టిలో ఉంచుకోకూడదు.రాజమార్గాల్లోకి కంచెల్లోకి బీదల వద్దకు దీనుల వద్దకు వెళ్ళాల్సిందిగా క్రీస్తు తన సేవకుల్ని కోరుతున్నాడు. గొప్ప నగరాలు వీధుల్లోను సమాజపు సందుల్లోను కుటుంబాలు వ్యక్తులు - కొత్త స్థలాల్లో కొత్తవారు - ఉండవచ్చు. వీరికి సంఘ సంబంధాలు ఉండ కపోవచ్చు. తమ ఏకాకితనంలో వారు తమని దేవుడు విడిచి పెట్టేశాడని భావించవచ్చు. రక్షణ పొందటానికి ఏమి చెయ్యాలో వారికి తెలియదు.COLTel 191.1

    అనేకులు పాపంలో కూరుకుపోయారు. అనేకులు దు:ఖంలో మునిగివున్నారు. శ్రమలు, లేమి అపనమ్మకం, నిరాశ ఒత్తిడి కింద మిగిలి పోతున్నారు. ప్రతి విధమైన దు:ఖం వారికుంటుంది. శారీరకంగాను ఆత్మపంరగాను తమ కష్టాల్లో ఆదరణ కోసం వారు ఎదురుచూస్తారు. నాశనానికి మరణానికి దారి తీసి మార్గాల్ని శరీరాల్లోను వినోదాల్లోను కనుగొనటానికి సాతాను వారిన నడిపిస్తాడు. పెదాలు తగలగానే బూడిదగా మారే ఏపిలు పండ్లను సాతాను వారికి అందించ చూస్తున్నాడు. వారు తమ రూకల్ని ఆహారం కాని దాని కోసం వెచ్చిస్తారు. త్రప్తినివ్వదానిని కోసం ప్రయాసపడతారు.COLTel 191.2

    బాధలనుభవిస్తున్న వీరిలో క్రీస్తు తాను రక్షించటానికి వచ్చిన ఆత్మల్ని మనం చూడాల్సి ఉంది. వారికి ఆయన ఇస్తున్న ఆహ్వానం ఇది, “దప్పిగొనిని వారలారా, నీళ్లయొద్దకు రండి రూకలు లేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రూకలు లేనివారలారా, మీరు వచ్చి కొని ద్రాక్షారసమును పాలను కొనుడి.. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్ధము భుజించుడి మీ ప్రాణము సారమైన దానియందు సుఖింప నియ్యుడి”. యెష 55:1-3COLTel 191.3

    నైతికంగా బలహీనులైన పరదేశుల్ని బహిష్కృతుల్ని మనం గౌరవంగా చూడాలని దేవుడు ప్రత్యేకాజ్ఞ ఇచ్చాడు. మత విషయాల పట్ల బొత్తిగా శ్రద్ధ లేదు కనిపించేవారు. తమ అంతరంగంలో విశ్రాంతిని సమాధానాన్ని కోరుకుంటున్నారు. పాపంలో లోతుగా కూరుకుపోయినప్పటికి, వారిని రక్షించటం సాధ్యమే.COLTel 192.1

    క్రీస్తు అనుచరులు ఆయన ఆదర్శం ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళేటప్పుడు బాధల్లో ఉన్నవారిని ఓదార్చాడు. వ్యాధిగ్రస్తుల్ని బాగుపర్చాడు. అప్పుడు తన రాజ్యాన్ని గూర్చిన గొప్ప సత్యాల్ని బోధించాడు. ఇదే ఆయన అనుచరులు చేయాల్సిన సేవ. శరీరా భాదల్ని నివారించినప్పుడు ఆత్మకున్న అవసరాల్ని తీర్చటానికి మీ మార్గాలు తెరుచుకుంటాయి. సిలువ పొందిన రక్షకుణ్ణి చూస్తూ ఆ గొప్ప వైద్యుని ప్రేమను గూర్చి పునరద్దురణ శక్తి గల ఆయన ప్రేమను గూర్చి చెప్పగలుగుతారు.COLTel 192.2

    పాపం, దారి తప్పిన అభాగ్యులికి తాము నిరాశ చెందాల్సిన అవసరం లేదని చెప్పండి. వారు తప్పులు చేస్తూ సత్రవర్తనను నిర్మించుకోకపోయినా వారిని పునరుద్ధరించటంలో రక్షించటంలో దేవుడు ఆనందిస్తాడు. ఉప యోగం లేనట్లు కనిపపించే వ్యక్తుల్ని సాతాను ఎవరి ద్వారా పనిచేస్తాడో వారిని తీసుకొని తన కృపకు ఎంపిక చేస్తాడు. అవిధేయులపై పడుతున్న ఉగ్రత నుంచి వారిని కాపాడటానికి సంతోషిస్తాడు. ప్రతీ ఆత్మకు స్వస్థత శుద్ధి లభిస్తాయని వారికి చెప్పండి.ప్రభువు భోజన బల్ల వద్ద వారికొక స్థలముంది. వారికి స్వాగతం పలకటానికి ఆయన ఎదురుచూస్తున్నాడు.COLTel 192.3

    రాజమార్గాల్లోకి కంచెల్లోకి వెళ్ళే వారికి ఎంతో వ్యత్యాసమైన ప్రవర్తన గల ఇతరులు కనిపిస్తారు. వీరికి వారి పరిచర్య అవసరమైతుంది. తమకు అందిన వెలుగు ప్రకారం నివశిస్తూ తమ జ్ఞానం మేరకు దేవుని సేవ చేస్తున్నవారున్నారు. తమ విషయంలోను తమ పరిసరాల్లో ఉన్నవారి విషయంలోను జరగాల్సిన గొప్ప సేవ ఉన్నదని వారు గుర్తించాలి. వారు దేవుని గురించి మరింత జ్ఞానం కోసం తహతహలాడున్నారు. కాని వారు మరింత వెలుగు కిరణాల్ని వీక్షించటం మాత్రమే ప్రారంభించారు. విశ్వాసమూలంగా తాము దూరం నుంచి గ్రహిస్తున్నదీవెన కోసం వారు కన్నీటితో ప్రార్ధిస్తున్నారు. మహానగరాల్లో ప్రబలమైతున్న దుర్మార్గం నడుమ వీరిలో అనేకుల్ని కనుగొనవలసి ఉంది. వారిలో అనేకమంది బహు దీన పరిస్థితుల్లో ఉండటంతో వారిని లోకం గుర్తించటంలేదు. బోధకులు సంఘాలు ఎరుగనివారు అనేకమంది ఉన్నారు. అయితే అతి దీనమైన దయనీయమైన పరిస్థితుల్లో వారు ప్రభువకు సాక్షులు. వారికి అతి తక్కువ వాక్య జ్ఞానం.,COLTel 192.4

    క్రైస్తవ శిక్షణకు తక్కువ అవకాశాలు ఉండవచ్చు. అయినా వస్త్ర హీనత. ఆకలిబాధ చలిబాధ మధ్యవారు ఇతరులికి పరిచర్య చెయ్యటానికి కృషి చేస్తున్నారు. దేవుని కృపకు గృహ నిర్వాహకులైనవారు ఈ ఆత్మల్ని వెదకి వారిని తమ గృహాల్లో దర్శించి పరిశుద్దాత్మ శక్తి ద్వారా వారి అవసరాల మేరకు పరిచర్య చెయ్యాలి. వారితో కలసి బైబిలు పఠించండి. పరిశు ద్దాత్మ మిమ్మల్ని ప్రేరేపిం మేరకు వారితో కలసి ప్రార్ధించండి. క్రీస్తు తన సేవకులకు వర్తమానిన్నిస్తాడు. ఆ వర్తమానం ఆత్మకు పరలోకం నుంచి వచ్చిన ఆహారంలా ఉంటుంది.COLTel 193.1

    ఆ ప్రశస్త వర్తమానం ఒక హృదయం నుంచి ఒక హృదయానికి ఒక కుటుంబము నుంచి ఇంకొక కుటుంబానికి అందించబడుతుంది. “లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము”అని ఉప మానంలో ఉన్న ఆజ్ఞకు తరుచు తప్పుడు అర్ధం చెప్పటం జరుగుతుంది. సువార్తను అంగీకరించానికి మనం ప్రజల్ని ఒత్తిడి చెయ్యాలని ఇది భోధిస్తున్నట్లు పరిగణించటం జరుగుతుంది. కాని ఇది ఆ ఆహ్వానం జరూరీని, సరమర్పించిన రాయితీల కార్యసాధకత్వాన్ని సూచిస్తుంది. మనుషుల్ని క్రీస్తు వద్దకు తీసుకురావాటానికి సువార్త ఎన్నడూ ఒత్తిడిని ప్రయోగించదు.దాని వర్తమాన “దప్పిగొననవారలారా, నీళ్ళ యెద్దకు రండి”, యెష 55:1 ‘ఆత్మయు పెండ్లి కుమార్తయు రమ్ము అని చెప్పుచున్నారు... దప్పిగొనిన వానికి జీవజలము ఉచిత ముగా పుచ్చుకొనినిమ్ము” అన్నదే ప్రక 22:17 దేవని ప్రేమలోని శక్తి దేవుని కృపలోని శక్తి రావలసిందిగా మనల్ని బలవంతం చేస్తుంది.COLTel 193.2

    రక్షకుడు ఇలా అంటున్నాడు. “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము”. ప్రక 3:20 ద్వేషం అతణ్ణి వెనక్కి మళ్ళించలేదు. బెదిరింపులు అతణ్ణి పక్కకు తొలగించలేవు. కాని అతడు ప్రతి నిత్యం ‘నేను నిన్ను ఎట్లు విసర్జింతును”? (హో మే 11:8) అంటూ నశించిన వారిని వెదకుతారు. అతడి ప్రేమకు జయించే శక్తి ఉన్నది. అది లోనికి రావటానికి ఆత్మల్ని బలవంతం చేస్తుంది. వారు క్రీస్తుతో “నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను ” అంటారు. కీర్త 18:35COLTel 194.1

    నశించినవారిని వెదకటంలో క్రీస్తుకి ఉన్న ప్రగాఢప్రేమనే ఆయన తన సేవకులకు ఇస్తాడు. కేవలం “రండి” అని మాత్రము మనం అనకూడదు. ఆ పిలుపును అలకించేవారుంటారు కాని వారి చెవులు దాన్ని గ్రహించ లేనంతగా మొద్దుబారి ఉంటాయి. భవిష్యత్తులో తమ కోసం ఉంచిన మేలును చూడలేనంతగా వారికి గుడ్డితనం కలుగుతుంది. అనేకులు తమ భ్రష్టత్వాన్ని గుర్తిస్తారు. సహాయానికి మేము అర్హులం కాము మమ్మల్ని విడిచి పెట్టెండి అని అంటారు. అయినా దైవ సేవకులు తమ కృషిని అపకూడదు. ఆ ధైర్యం చెందినవారికి నిస్సహయులికి దయ కనికరం ప్రేమతో సహాయం అందించండి. వారిని ధైర్యపర్చండి వారికి నిరీక్షణను బలాన్ని సమకూర్చండి. రావటానికి వారిని దయ ద్వారా బలవంతం చెయ్యండి. “సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి” యూదా 22,23COLTel 194.2

    దైవ సేవకులు ఆయనతో విశ్వాసంతో నడిస్తే వారి వర్తమానానికి ఆయన శక్తినిస్తాడు. దేవుని ప్రేమను గూర్చి ప్రకటించటానికి ఆయన కృపను తోసిపుచ్చటంలో ఉన్న ప్రమాదాన్ని తెలిపి సువార్తను అంగీకరించానికి మనుషుల్ని నడిపించాటానికి వారు సామర్ధ్యం పొందుతారు. మనుషులు తమకు దేవుడిచ్చిన పాత్రను నిర్వహించినట్లయితే క్రీస్తు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. గతంలో ఏ యుగంలోను చోటుచేసుకొని పరివర్తన నేడు మానవ హృదయాల్లో చోటుచేసుకుంటుంది. రక్షకుణ్ణి ప్రచురించే నిమిత్తం జాన్బనియన్ని చెడునడత నుంచి భ్రష్ట జీవితం నుంచి దేవుడు విమోచించాడు. జాన్ న్యూటన్న బానిసల వ్యాపారం నుంచి రక్షించాడు. నేడు మనుషుల్లో నుంచి ఒక బనియన్ ఒక న్యూటన్ విమోచించబడవచ్చు. దేవునితో సహకరించే మానవప్రతినిధుల ద్వారా అనేకమంది దీనులు భ్రష్టులు విమోచన పొందుతారు. వారు తిరిగి మానవుడిలో దేవుని స్వరూపాన్ని పునరుద్దరించటానికి ప్రయత్నిస్తారు. చాలా తక్కువ అవకాశాలున్నవారు తమకు మెరుగైన మార్గం తెలియదు గనుక తప్పు మార్గంలో నడిచిన వారు వెలుగు కిరణాలు పొందనున్నవారు ఉన్నారు. ‘నేను నేడు నీ ఇంట నుండవలసియున్నది” (లూకా 19:5) అన్నవాక్యం జక్కయ్యకు వచ్చినట్లు వారికి వాక్యం వస్తుంది. కరడుగట్టిన పాపులు క్రీస్తు తమను గుర్తించినందున చిన్నపిల్లవంటి సున్నిత హృదయం కలిగి ఉన్నట్లు వెల్లడవుతుంది.COLTel 194.3

    అనేకులు తీవ్ర దోషాలు, పాపం నేపథ్యంలో వచ్చి అవకాశాలు అధిక్యతలు ఉన్నా వాటిని లెక్క చెయ్యని వారి స్థానాన్ని అక్రమిస్తారు. వారు దేవుడు ఏర్పర్చుకున్న ఎంపిక చేసుకున్న ప్రశస్త్రమైన ప్రజలుగా పరిగణన పొందుతారు. క్రీస్తు తన రాజ్యంతో వచ్చినపడు వారు ఆయన సింహాసనం పక్క నిలబడతారు. అయితే “మీకు బుద్ది చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి’ హెబ్రీ 12:25 “పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని” యేసు చెప్పాడు. వారు ఆహ్వానాన్ని నిరాకరించారు. వారిలో ఎవరూ మళ్ళీ ఆహ్వానం పొందరు. క్రీస్తుని నిరాకరిచటంలో యూదులు తమ హృదయాల్ని కఠినపర్చుకొని తమ్మునితాము సాతాను అదుపులో ఉంచుకున్నారు. ఫలితంగా వారు క్రీస్తు కృపను అంగీకరింటం అసాధ్యమయ్యింది. ఇప్పుడు అదే జరుగు తుంది. మనం దేవుని ప్రేమను అభినందించకపోతే ఆత్మను మొత్తబరిచి స్వాధీనంలో ఉంచకపోతే పూర్తిగా నశించపోతాం. ప్రభువు తాను ప్రదర్శించిన ప్రేమకన్నా గొప్ప ప్రేమను ప్రదర్శించలేడు. క్రీస్తు ప్రేమ హృదయాన్ని లొంగదీసుకోకపోతే, మనల్ని చేరే మార్గం ఆయనకింకేది ఉండదు.COLTel 195.1

    మీరు కృపావర్తమానాన్ని నిరాకరించిన ప్రతీసారి మీ అపనమ్మకం మరింత బలపడుతుంది. మీ హృదయద్వారాన్ని క్రీస్తుకు తెరవని, ప్రతీసారి మాట్లాడు ఆ ప్రభువు స్వరాన్ని వినటానికి మీరు మరింత అయిష్టంగా ఉ ంటారు. కృపతాలూకు చివరి విజ్ఞప్తికి స్పందించే అవకాశౄన్ని అంత తగ్గించుకుంటారు. పూర్వం ఇశ్రాయేలు గురించి “ఎఫ్రాయము విగ్రహ ములతో కలిసికొనెను వాటిని అలాగుననే యుండనిమ్ము”. ( హోషే 4:17) అని రాయబడినట్లు మిమ్మల్ని గూర్చి రాయబడకుండును గాక. “కోడి తన పిల్లనలు తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నోమారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు నీకు పాడుగా విడువబడుచున్నది” (లూకా 13:34,35) అంటూ క్రీస్తు యెరూషలేము గురించి దు:ఖించినట్లు మిమ్మల్ని గూర్చి దు:ఖించ కుండును గాక.COLTel 196.1

    చివరి కృపావర్తమానం. అంటే చివరి ఆహ్వనం.మనుషులకు ప్రకటితమయ్యే కాలంలో మనం నివసిస్తున్నాం.“రాజమార్గములలోనికిని కంచెలలోనికి వెళ్లు”ము అన్న ఆజ్ఞ నెరవేర్పు సమాప్తం కావస్తున్నది. క్రీస్తు ఆహ్వానం ప్రతీ ఆత్మకు అందించటంజరుగుతుంది. వార్తాహరులు “ఇప్పుడు సిద్ధమైయున్నది రండి” అని ప్రకటిస్తున్నారు. మావన ప్రతి నిధులోతో కలసి పరలోక దూతలు ఇంకా పనిచేస్తున్నారు. రావలసినదిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ పరిశుద్దాత్మ ప్రతీ ప్రేరణనూ ప్రోత్సహాన్నిస్తున్నాడు.తన ప్రవేశం కోసం ప్రతీ ఆటంకం తొలగిపోయిందని సూచించే ఏదో సంకేతం కోసం క్రీస్తు కని పెడుతున్నాడు. తప్పిపోయిన ఒక పాపిని కనుగొనటం జరిగిందన్న వార్తను పరలోకానికి చేరవెయ్యటానికి దూతలువేచి ఉన్నారు. సువార్త విందుకి ఆహ్వానాన్ని మరొక ఆత్మ అంగీకరించిందని సంతోషంగా వీణెలు మీటుతూ గానం చెయ్యటానికి పరలోక నివాసులు ఎదురు చూస్తున్నారు.COLTel 196.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents