Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    14—“దేవుడు తాను ఏర్పరచుకొనిన.వారికి త్వరగా న్యాయము తీర్చడా?”

    ఆధారం లూకా 18:1-8

    క్రీస్తు తన రెండో రాకడకు ముందు కాలం గురించి, తన అనుచరులు ఎదుర్కొవలసిన ప్రమాదకర పరిస్థితుల్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా ఆసమయానికి సంబంధించి “వారు విసుకక ప్రార్ధన చేయు చుండవలెననుటకు” ఒక ఉపమానం చెప్పాడు.COLTel 129.1

    ఆయన ఇలా అన్నాడు “దేవునికి భయపడకయు, మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి - నా ప్రతి వాదికిని నాకును వ్యాజ్యెము తీర్చుమని అడుగుచువచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తరువాత అతడు - నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమేకు న్యాయము తీరుస్తానని తనలో తానననుకొనెను మరియు ప్రభువిట్లనెను-అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివరాత్రులు తన్ను గూర్చి మొట్టె పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును”. COLTel 129.2

    ఇక్కడ ప్రస్తావించిన న్యాయాధిపతి న్యాయాన్ని లెక్క చెయ్యలేదు. బాధపడుతున్నవారిపట్ల అతడికి కనికరం లేదు. ఈ విధవరాలిని వ్యాజ్యాన్ని ద్వేషించి తీర్పుగదిలో నుంచి నెట్టివేసాడు. ఆమె వ్యాజ్యం న్యాయమయ్యిం దని న్యాయాధిపతికి తెలుసు. ఆమెకు వెంటనే న్యాయం తీర్చగలిగేవాడు. కాని ఆ పని చెయ్యలేదు. అతడు తన నిరంకుశావధికారిన్న ప్రదర్శించు కోవాలనుకున్నాడు. అందుకు ఆమెను వ్యర్ధంగా ఆర్దిస్తూ బతిమాలుతూ, విజ్ఞాపన చేస్తూ పోనిచ్చాడు. అది అతడికి తృప్తినిచ్చింది. అయితే ఆమె విడువలేదు నిరాశచెందలేదు. అతడి నిర్లక్ష్యాన్ని కాఠిన్యాన్ని లెక్క చెయ్య కుండా ఆ న్యాయాధికారి తన వ్యాజ్యం చేపట్టేవరకు తన మనవిని కొనసాగించింది. “నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయుండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తును” అనుకున్నాడు. తన పలుకుబడిని కాపాడుకోవటానికి, తన పక్షపాత, ఏకపక్ష తీర్పుకి ప్రచారావకాశం ఇవ్వకూడదని భావించి ఆ విధవరాలికి న్యాయం తీర్చాడు.COLTel 129.3

    “మరియు ప్రభువిచొనెను- అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పచుకొనినవారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱ పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును”. క్రీస్తు ఇక్కడ అన్యాయస్థుడైన న్యాయాధిపతికి దేవునికి మధ్య ఉన్న బేధాన్ని చూపిస్తున్నాడు. ఈ న్యాయాధిపతి గోజాడ్తున్న ఆ విధవరాలిని వదలించుకోవటమనే స్వార్ధంతో ఆమె వ్యాజ్యాన్ని అంగీకరించాడు. అతడికి ఆమె పట్ల కనికరం లేదు. ఆమె దుస్థితిని అతడు పట్టించుకోలేదు. తన్ను వెదకే వారి పట్ల దేవుని వైఖరి ఎంత వ్యత్యాసంగా ఉంది! లేమిలోను అపదలోను ఉన్నవారి మొరలను ఆయన అపార కరుణా కటాక్షాలతో పరిగణిస్తాడు.COLTel 130.1

    న్యాయం తీర్చమంటూ న్యాయధిపతిని వేడుకున్న స్త్రీ భర్త మరణిం చాడు. ఆమె పేదరాలు, మిత్రులు లేరు, తాను పోగొట్టుకున్న ఆస్తుల్ని తిరిగి సంపాదించుకునే స్తోమత లేదు. అలాగే మానవుడు పాపం వల్ల దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. తనంతట తానుగా రక్షణ సంపాదించుకోలేడు. కాని క్రీస్తు ద్వారా మనం దేవునికి దగ్గరగా వచ్చాం. దేవుడు ఎంపిక చేసుకున్న వారు ఆయనకు ఎంతో ప్రాణం. వారు ఆయను స్తుతించటానికి ఈ లోకంలోకి చీకటిలో జ్యోతులుగా ప్రకాశించటానికి వారిని చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు పిలిచిన వారు. న్యాయం కోసం తనను గోజాడిన విధవరాలిపట్ల న్యాయాధి కారికి ప్రత్యేకాసక్తి లేదు. అయినా ఆమె విజ్ఞాపనల్ని వదలించుకోవటానికి ఆమె మొరవిని ఆమెకు న్యాయం తీర్చాడు. కాని తన బిడ్డలపట్ల దేవుని ప్రేమ అపారం. లోకంలో ఆయనకు ప్రాణ ప్రదమయ్యింది ఆయన సంఘమే,.COLTel 130.2

    “యెహోవా వంతు ఆయన జనమే.ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకరధ్వని గల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను”,. ద్వివి 32:9,10 “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టనవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొననెంచి మిమ్మును దోచుకొను అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.”జెక, 2:8COLTel 131.1

    “నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చుము” అన్న విధరవాలి మొర దేవుని బిడ్డల ప్రార్ధనను సూచిస్తుంది. వారి ప్రత్యర్ధి సాతాను. అతడు “మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది”. (ప్రక 12:10)దైవ ప్రజల పై తప్పుడు అభిప్రాయాలు కలిగించటానికి, నిందలు మోపటానికి, వారిని మోసగించి నాశనం చెయ్యటానికి అతడు ప్రతి నిత్యం కృషి చేస్తాడు. ఈ ఉపమానంలో సాతాను అతడి అనుచరల శక్తి నుంచి విడుదల కోసం ప్రార్ధించటం ఆయన శిష్యులకి నేర్పిస్తాడు. COLTel 131.2

    సాతాను నేరారోపణ కృషిని, తన ప్రజల వద్ద శత్రువైన సాతానుని ప్రతిఘటించటంలో క్రీస్తు సేవను, జెకర్యా ప్రవచనం మన దృష్టికి తెస్తున్నది. ప్రకవ ఇలా అంటున్నాడు. “యెహోవా దూత యెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడి పార్శ్వమును నిలవుబడుటయు అతడు నాకు కనుపరెచను. సాతానూ యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును,. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవివలెనేయున్నాడు గదా అని యెహోవా సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రమలు ధరించనవాడై దూత సముఖములో” నిలబడ్డాడు జెక 3:1-3COLTel 131.3

    ఇక్కడ దైవ ప్రజల్ని విచారణకు నిలిచిన నేరస్తులుగా సూచిచంటం జరుగుతున్నది. యెహోషువ ప్రధాన యాజకుడుగా గొప్ప శ్రమననుభ విస్తున్న తన ప్రజలకు దీవనెలు కోరుతున్నాడు. అతడు దేవుని ముందు విజ్ఞాపన చేస్తుండగా సాతాను తన ప్రత్యర్ధిగా అతడి కుడిపక్క నిలబడి ఉన్నారు. దేవుని ప్రజలపై నేరారోపణ చేస్తూ వారి పరిస్థితి ఘోరంగా ఉన్నట్లు కనిపించేటట్లు చిత్రిస్తున్నాడు. వారి దుషలిలూలు లోపాల్ని దేవుని ముందు పెడుతున్నాడు. వారి దోషాలు క్రీస్తు దృష్టికి ఎంతో నీచమైనవిగా కనపడి, అందువలన తమ గొప్ప అవసరంలో వారికి సహాయం అందించకుండా ఉంటాడన్న భావనతో వీటిని ఆయన ముందుకి తెచ్చాడు. దైవ ప్రజల ప్రతినిధిగా యెహోషువ మురికి వస్త్రాలు ధరించి నేరస్తుడిగా నిలబడియున్నాడు. తన ప్రజల పాపాల స్పృహ ఉన్న అతడు నిరాశభారం కింద కుంగియున్నాడు. సాతాను అతడిలో దోషాపరాధ భారం కలిగించ్చు టంతో అతడు దాదాపు నిరీక్షణ కోల్పోయాడు. అయినా యెహోషువ వినతిదారుడుగా నిలబడి ఉన్నాడు. సాతాను అతడి ప్రత్యర్ధిగా నిలిచాడు.COLTel 131.4

    నేరం మో పేవాడిగా సాతాను పని పరలోకంలో ప్రారంభమయ్యింది. మానవుడి పతనం నాటి నుండి లోకంలో ఇదే అతడి పని. మనం లోక చరిత్ర అంతాన్ని సమీపించే కొద్ది ప్రత్యేకించి ఇదే అతడి పని కాబోతుంది. తనకు ఎక్కువ వ్యవధి లేదని గుర్తించి, మోసగించటానికి నాశనం చెయ్యటానికి అతడు మరింత ఉద్రేకంతోను పట్టుదలతోను పనిచేస్తాడు. బలహీనతల్లోను, పాప స్వభావంతోను ఉన్నా యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆచరించే ప్రజలు ఈ లోకంలో ఉండటం అతడికి కోపం వస్తుంది. వారు దేవునికి విధేయలు కాకుండా ఉండేలా చూడటానికి కృతనిశ్చయు డవుతాడు. వారు అనర్హులైనందుకు ఆనందిస్తాడు. అందరినీ ఉచ్చులో బంధించి దేవుని నుంచి వేరు చెయ్యటానికి ప్రతీ ఆత్మకు పథకాలు రూపొందించుకుంటాడు. ఈలోకంలో దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చటానికి కృప ద్వారా ప్రేమ ద్వారా క్షమాపణ ద్వారా పాటుపడుతున్న వారినీ దేవున్ని నిందించి ఖండించటానికి తీవ్రంగా కృషి చేస్తాడు.COLTel 132.1

    తన ప్రజల పక్షంగా దేవుని ప్రతీ శక్తి ప్రదర్శన సాతానులో వైరుధ్యం పుట్టిస్తుంది. వారి తరుపున దేవుడు పనిచేసిన ప్రతీసారి వారిని నాశనం చెయ్యటానికి సాతాను అతడి దూతలు మరింత బలంగా పనిచేస్తారు. ఎవరు క్రీస్తుని తమ శక్తిగా ఎంచుకుంటారో వారి మీద అతడికి అసూయ, ద్రుష్టిని ప్రేరేపించి అది జరిగినప్పుడు ఆ నేరాన్ని తాను వాదనకు నడిపిన బాధితుల మీదికి నెట్టటం అతడి ధ్యేయం.వారి మురికి వస్త్రాల్ని లోపాల్ని ఎత్తి పెడ్తాడు. తమ విమోచకుణ్ని అవమానపర్చే వారి కృతఘ్నతా పాపాల్ని, వారిక్రీస్తులా లేనితనాన్ని సమర్పిస్తాడు. ఇదంతా తన వాదనలో వివరించి, వారిని నాశనం చెయ్యటానికి తన చిత్తానుసారంగా వ్యవహరించటానికి తనకు హక్నున్నదని ఇది నిరూపిస్తుందంటాడు. తమ పరిస్థితి ఆధ్వానంగా నిరాశాజనకంగా ఉందని, తమ అపవిత్రత మరక ఎంతకడిగినా వదలదని వారిని భయపెట్టటానికి ప్రయత్నిస్తాడు.ఇలాతమ విశ్వాసాన్ని నాశనం చేస్తే వారుతనశోధనలకు లొంగి దేవునికి నమ్మకంగా ఉండరని అతడిఆశాభావం.COLTel 132.2

    దైవప్రజలు తమంతట తాము సాతాను ఆరోపణలికి జవాబు చెప్పలేరు. ఆత్మావలోకనం చేసుకుంటే వారు నిరాశ నిర్వేదాలకు సిద్ధంగా ఉంటారు. అయితే వారు పరలోక ఉత్తరవాదికి విజ్ఞప్తి చేసుకుంటారు. వారు రక్షకుని నీతిని బట్టి విజ్ఞాపన చేస్తారు. దేవుడు “నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గలవ ఆనిన నీతిమంతుడుగా తీర్చువాడు” అయి ఉన్నాడు. రోమా 3:26 సాతాను ఆరోపణల్ని తిప్పి కొట్టి అతడి ఎత్తుగడల్ని నిరర్థకం చెయ్యమని ప్రభువుకి వారు ధీమాతో మనవి చేసుకుంటారు. “నా ప్రతివాదికిని నాకు న్యాయము తీర్చుము” అంటూ వారు మనవి చేసుకుంటారు. శక్తివంతమైన సిలువ వాదనతో క్రీస్తు ఆ నేరారోపకుడి నోరు మూయిస్తాడు.COLTel 133.1

    “సాతానా, యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవివలెనో యున్నాడు గదా”? దైవ ప్రజల్ని నలుపుతో కప్పిపుచ్చి వారిని నాశనం చెయ్యటానికి సాతాను ప్రయత్నించినప్పుడు క్రీస్తు కలుగజేసకుంటాడు. వారు పాపం చేసిన వారి పాపాపరాధాన్ని క్రీస్తు తన మీద వేసుకుంటాడు. అగ్నిలో నుంచి తీసిన కొరవిలా ఆయన పాపం నుండి మానవాళిని తీసాడు. తన మావన స్వభావం వల్ల ఆయన మానవులతో సంబంధం కలిగి ఉన్నాడు. తన దైవ స్వభావం వల్ల ఆయన ఆనంత దేవునితో కలసి ఉన్నాడు. నశిస్తున్న ఆత్మలకు సహాయం అందుబాటులోకి తెచ్చాడు. ఆయన అపవాదిని గద్దిస్తున్నాడు.COLTel 133.2

    ” యెహోషువా మలిన వస్త్రములు ధరించివాడై దూత సముఖములో నిలువబడియుండగా దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞపించి.. నేను నీ దోషమును పరిహరించి యున్నాను అని సెలవిచ్చెను. అతని తలమీద తెల్లని పాగా పెట్టించుని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి”. అప్పుడు దేవదూత సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అధికారం దైవ ప్రజల ప్రతినిధి అయిన యెహోషువకు ఈప్రమాణం చేసాడు. ‘నా మార్గములో నడుచుచు నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరము మీద అధికారవైనా ఆవరణములను కాపడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును”. (జెక 3:3-7)COLTel 134.1

    దైవ ప్రజల్లో లోపాలున్నప్పటికి క్రీస్తు వారినితోసిపుచ్చాడు.వారి వస్త్రాలను మార్చే శక్తి ఆయయనకుంది. పశ్చాత్తాపపడే, విశ్వసించే వారి మురికి బట్టలు తీసివేసి వారికి తన నీతి వస్త్రాన్ని ధరింపజేసిపరలోక పుస్తకాల్లో వారి పేర్లు కె ఎదురుగా క్షమాపణ అని రాస్తాడు. పరలోక విశ్వం ఎదుట వారిని ప్రకటి స్తాడు. అపవాది అయిన సాతానుని నింద మోపేవాడుగా, వంచకుడుగా వెల్లడిస్తాడు. తాను ఏర్పర్చుకున్నవారికి దేవుడు న్యాయం తీర్చుతాడు.COLTel 134.2

    “నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము” అన్న వినతి సాతానుకి మాత్రమే కాదు దైవ ప్రజల్ని గూర్చి తప్పుడు ప్రచారం చెయ్యటానికి, వారిని శోధించి నానశం చెయ్యటానికి అతడు పురికొలిపిన అతడి అనుచరులకు వర్తిస్తుంది. దేవుని ఆజ్ఞల్ని ఆచరించటానికి తీర్మానించుకునేవారు అంధకారశక్తుల అదుపులో ఉన్న ప్రత్యర్థులు తమకున్నారని అనుభవ పూర్వకంగా గ్రహిస్తారు. అట్టి ప్రత్యర్ధులు క్రీస్తుని అడగడుగున చుట్టు ముట్టారు. ఎంత పట్టుదలతో ఎంత నిశ్చయతతో ఆయన్ని వెన్నంటారో ఏ మానవుడూ గ్రహించలేడు. తమ ప్రభువులాగే ఆయన శిష్యులు కూడా ప్రతినిత్యం శోధనకు గురి అవుతారు...COLTel 134.3

    లేఖనాలు క్రీస్తు రెండో రాకకు ముందు ప్రబలే పరిస్థితుల్ని వివరిస్తు న్నాయి.అప్పుడు పెచ్చు పెరిగే దురాశ. హింస గురించి అపొస్తలుడైన యాకోబు విశదీకరిస్తున్నాడు. అతడిలా అంటున్నాడు.“అదిగో ధనవంతు లారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవయములను గూర్చి ప్రలాపించి యేడువుడి... ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలీ మొట్ట పెట్టుచ్నుది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపడు”. యాకో 5:1-6,COLTel 135.1

    ఇది నేటి పరిస్థితిని వివరిస్తున్న చిత్రం. ఆకలి బాధతో అలమటిస్తున్న మననుషుల రోదన దేవుని ముందు వినిపిస్తుండగా ప్రతీ విధమైన హింస, బవలవంతపు సేవ ద్వారా మనుషులు అక్రమ ధనం కూర్చుకుంటున్నారు.COLTel 135.2

    “న్యాయమనకు ఆటంకము కలగుచున్నది నీతి దూరమున నిలుచున్నది. సత్యము సంతవీధిలో పడియున్నది... ధర్మము లోపల ప్రవేవింపనేరదు సత్యము లేకపోయెను. చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు”. యోష 59:14, 15 ఇది లోకంలో క్రీస్తు జీవితంలో నెరవేరింది. ఆయన దేవుని ఆజ్ఞల బదులు మనుషులు ఏర్పచుకొని ఘనపర్చిన సంప్రదాయల్ని విధుల్ని తోసిపుచ్చి ఆజ్ఞల్ని నమ్మకంగా ఆచరించాడు. ఆ కారణం వల్ల ఆయన్ని ద్వేషించి హింసించటం జరిగింది. ఈ చరిత్రా పునరావృతమవుతున్నది. దైవ ధర్మశాస్త్రానికి పైగా మానవ నిబంధనల్ని సంప్రదాయల్ని ఘనపర్చటం జరుగుతుంద. దేవుని ఆల్ని నమ్మకంగా ఆచరించేవారు నిందలకు హంసకు గురి అవ్వటం జరగుతుంది. క్రీస్తు దేవునికి నమ్మకంగా ఉన్నందుకు సబ్బాతును లిక్రమించాడని దేవదూషణకు పాల్పడ్డాడని ఆరోపణలు మోపారు. ఆయన దయ్యం పట్టినవాడు బయెల్హబూలు అన్నారు. అలాగే ఆయన అనుచరులు నిందలకు అపార్థాలకు గురి అవుతున్నారు. వారిని ఇలా పాపంలోకిక నడిపించి దేవున్ని అగౌరవపర్చటానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు.COLTel 135.3

    ఉపమానంలో దేవునికి భయపడని, మనుషుల్ని లెక్కచెయ్యని న్యాయాధిపత్పివర్తతను అప్పుడు అమలవుతున్న తీర్పు తీరును త్వరలో తన విచారణలో వెలవరించబోతున్న తీర్పు తీరును క్రీస్తు చూపిస్తున్నాడు. కష్టకాలంలో తన ప్రజల లోక పరిపాలకుల మీద లోక న్యాయాధిపతులు మీద ఎంత తక్కువగా ఆధారపడగలరో అన్నియుగాల్లోను తన ప్రజలు గ్రహించాలని ఆయన అభిలాషిస్తున్నాడు. దైవ వాక్యాన్ని తమ మార్గదర్శి గాను, సలహాదారుగాను అంగీకరించని వారి ముందు తమ అనైతికమైన, క్రమశిక్షణ లేని బావోద్రేకాల అదుపులో ఉండే అధికారుల ముందు దేవుడు ఎన్నుకున్న ప్రజలు తరుచు నిలబడల్సి ఉంటుంది.COLTel 136.1

    అన్యాస్తుడైన న్యాయాధిపతి ఉపమానంలో మనం ఏమి చెయ్యాలో క్రీస్తు చూపిస్తున్నప్పుడు దేవుడు తాను ర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఘో పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా”? మనకు ఆదర్శం అయిన క్రీస్తు తన్ను తాను నిరపరాధిగా నిరూపించుకోవటానికి గాని విడపించుకోవానికి గాని ఏమి చెయ్యలేదు. తన కేసుని దేవునికి అప్పగించాడు. అలాగే ఆయన అనుచరులు అరోపణలు చేయటం గాని ఖండిచంటం గాని లేక తమ్ముని తాము విడిపించుకోవటానికి బలప్రయోగానికి పాల్పడటం గాని చెయ్యకూడదు,.COLTel 136.2

    అర్ధం కానట్లు కనిపిచే కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు. మనకు ఎంతటి అన్యాయం జరిగినప్పటికి అవేశకావేషాలకు లోనుకాకడూదు.ప్రతీకారం తీర్చుకోవటానికి పూనుకోవటం వల్ల మనకు మనమే హాని చేసుకుంటాం. దేవుని పై మన నమ్మకాన్ని నశనం చేసుకొని పరిధుద్దాత్మను దు:ఖ పెడతాం . మన పక్క పరలోక దూత ఉంటాడు. అతడు మన పక్షంగా శత్రువుకు వ్యతిరేకంగా ధజం ఎత్తుతాడు. అతడు మనల్ని నీతి సూర్యుని ప్రకాశంతమైన కిరణాలోతో కప్పుతాడు. దీనికి మంచి సాతాను ముందుకు చొచ్చుకుపోలేడు. ఈ కాంతి వలయాన్ని అతడు చేదించలేడు. ప్రపంచం దుర్మార్గంలో ముందుకు పోతున్నప్పుడు మనకు కష్టాలు ఉండవని మనలో ఎవరం చెప్పుకోలేం. అయితే ఈ కష్టాలే మనల్ని మహోన్నతుడైన దేవుని ప్రార్ధన మందిరంలోకి తెస్తాయి. అనంత జ్ఞాని అయిన ప్రభువు సలహాను మనం పొందవచ్చు. “ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర పెట్టుము” అని ప్రభువు అంటున్నాడు. కీర్త 50:15 మన అందోళనలు, మన జీవితావసర సరఫరాలు, దైవ సహాయవసరం. వీటిని తనకు విన్నవంచమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. పట్టుదలతో ప్రార్ధించమని మనల్ని ఆదేశిస్తున్నాడు. కష్టాలు ఎదురైన వెంటనే మన మానవుల్ని ఆయనకు తెలియజేసుకోవాలి. విసుగక ప్రార్ధించటం ద్వారా మనకు దేవుని మీద బలమైన విశ్వాసం ఉన్నదని నిరూపించుకుంటాం. మన అవసరాన్ని గూర్చిన స్పృహ మనల్ని పట్టుదలతో ప్రార్ధించటానికి నడిపిస్తుంది. మన విజ్ఞాపనకు దేవుడు చెలిస్తాడు.COLTel 136.3

    తమ విశ్వాసం నిమిత్తం నిందలు హింస ననుభవించేవారు దేవుడు తమను విడిచి పెట్టేశాడని తలంచటం జరుగుతుంది. ప్రజల దృష్టికి వారు అల్ప సంఖ్యాకులు, తమ శత్రవులు తమ పై జయం సాధిస్తున్నట్లు అందరికీ అనిపించవచ్చు. అయితే వారు తమ మనస్సాక్షిని అతిక్రమించ కుందురు గాక, తమ నిమిత్తం శ్రమల పొంది తమ దు:ఖాల్ని బాధల్నీ భరించిన ప్రభువు వారిని విడిచి పెట్టెయ్యడు. COLTel 137.1

    దైవ ప్రజలు ఒంటరిగాను భద్రతలేనివారుగాను మిగిలిపోవటం జరగదు. ప్రార్ధన సర్వశక్తుని హస్తాన్ని కదలిస్తుంది. ప్రార్ధన వలన “వాజ్యములను కదలించిరి, నీతికార్యములు జరిగించి, వాగ్దానములను పొందిరి. సింహముల నోళ్ళను మూసిరి”. తమ విశ్వాసం కోసం మరణించిన హత సాక్షుల్ని గూర్చిన నివేదకలు విన్నప్పుడు “యుద్దములో పరాక్రమశాలురైరి. అన్యుల సేవలను పారదోలిరి” అనటంలో అర్ధమేంటో మనం గ్రహిస్తాం . హెబ్రీ 11:33,34COLTel 137.2

    మనం మన జీవితాల్ని దేవుని సేవకు సమర్పించుకుంటే ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోనే సేవ చేస్తాం. మనపరిస్థితి ఏదైనప్పటికి మనకు మార్గం చూపించాడానికి మనకో మార్గదర్శకుడున్నాడు. మనకు ఎలాంటి ఆందోళనలున్నా మనకు స్థిరమైన ఆలోచనకర్త, సలహాదారు ఉన్నాడు. మనకున్న దు:ఖం మనకు కలిగిన వియోగం లేక ఒంటరితనం ఎలాంటిదైనా మనకు సానుభూతి చూపే మిత్రుడున్నాడు. ఆజ్ఞానంతో మనం తప్పటడుగు వేస్తే క్రీస్తు మనల్ని విడిచి పెట్టెయ్యడు. నిస్పష్టం, నిర్దిష్టం అయిన ఆయన స్వరం “నేనే మార్గమును, సత్యమును, జీవమును నాద్వారానే తప్ప యెవడను తండ్రి యొద్దకు రాడు” అనటం వింటాం. యోహా 14:6”దరిద్రులు మొట్ట పెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును”. కీర్తన 72:12COLTel 137.3

    తనకు సమీపంగా వచ్చి నమ్మకమైన సేవ చేసేవారు తనను ఘనపర్చుతారని ప్రభువంటున్నాడు“ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.” కీర్త 26:3 మనల్ని ముందుకి మరింత ముందికి నడిపించానికి సర్వశక్తుడు తన హస్తం చాపాడు. దేవుని మార్గాల్లో ముందుకి సాగండి. ముందుకు సాగండని ప్రభువు చెబుతున్నాడు. మీకు సహాయమందిస్తాను అంటున్నాడు. నా నామ మహిమార్ధం మీరడిగితే నేనిస్తాను అంటున్నాడు. మీ పతనాన్ని చూడాలని ఆవశించేవారి మందు నేను ఘనత గౌరవం పొందుతాను. నా మాట మహిమాన్వతంగా జయం సాధించటం వారు చూస్తారు. “మీరు ప్రార్ధన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరుకునని) నమ్మిన యెడల మీరు వాటిని పొందుదురు”. మత్త 21:22COLTel 138.1

    పీడనకు అన్యాయానికి గురి అయినవారు దేవునికి మొర పెట్టుకోవాలి. రాతిగుండె గలవారి నుండి తొలగి మీ సృష్టికర్తకు మీ మానవలుల్ని విన్నవించుకోండి. పశ్చాత్తాప హృదయంతో తన వద్దకు వచ్చే ఒక్కొక్క వ్యక్తిని కూడా ఆయన తోసిపుచ్చాడు. చిత్తశుద్ధితో చేసిన ఒక్క ప్రార్ధన కూడా నిష్పలవవ్వదు. అతి బలహీన మానవుడి మొరను పరలోక గాన బృందం గానాల మధ్య దేవుడు వింటాడు. మన హృదయ వాంచల్ని మన రహస్య మందిరాల్లో వ్యక్తం చేస్తుంటాడు. మార్గంలో నడుస్తున్నప్పుడు వాటిని గూర్చి ప్రార్ధన చేస్తాం. మన మాటలు విశ్వపరిపాలకుని సింహాసనం చేరుకుంటారు. అవి ఏమి మానవుడి చెవికీ వినిపించకపోవచ్చు. కాని అవి నిశ్శబ్దంలో కలిసిపోవు. అవి సాగుతున్న వ్యాపార కార్యకలపాల మధ్య మటుమాయ మవ్వవు. ఆత్మలోని ఆకాంక్షను ఏది మిగిలిచివెయ్యలేదు. వీధి గోలకు పైగా, జనసమూహాల గందరు గోళం పైగా లేచి అది దేవుని ఆస్థానం చేరుతుంది. మనం మనవి చేసుకునేది దేవునికి మన మొత్తుకోళ్ళ అయిన వింటాడు.COLTel 138.2

    మిక్కిలి అపాత్రులమని భావించే మీరు మీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించటానికి భయపడకండి, లోకపాపం నిమిత్తం ఆయన తన్ను తాను క్రీస్తులో అర్పించుకున్నప్పుడు ప్రతీ ఆత్మ వ్యాజ్యాన్ని చేపట్టాడు “తన సొంత కుమారుని అనుగ్రహించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” రోమా 8:32 మనల్ని ధైర్యపర్చి మనకు శక్తినిస్తానని ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాడా?COLTel 139.1

    తన వారసుల్ని సాతాను రాజ్యం నుండి విమోచించాలని కోరుకోవటం కన్నా ఆయన ఎక్కువ కోరుకొనేది మరేది లేదు. అయితే బైట ఉన్న సాతాను శక్తి నుండి విముక్తి పొందక ముందు లోపల ఉన్న అతడి శక్తి నుండి మనం విముక్తి పొందటం అవసరం. ఐహికత్వం నుంచి మనం విముక్తి పొందటం అవసరం. ఐహికత్వం నుంచి స్వార్ధాశల నుండి కఠినమై, క్రీస్తు పోలికలేని గుణ లక్షనాల నుంచి శుద్ధి పొందేందుకు ప్రభువు మనకు శ్రమల కష్టాలు రానిస్తాడు. మనం ఆయన్ని ఆయన పంపిన యేసు క్రీస్తును ఎరిగేందుకు, అపవిత్రతనుంచి శుద్ధి పొంది ఆ శ్రమల నుండి మరింత శు ద్దంగా మరింత పరిశుద్ధంగా మరింత శ్రమల నుంచి మరింత సంతోషంగా ఉండాలన్న గాఢమైన వాంఛ కలిగి ఉండటానికి గాను ఆయన మన ఆత్మల మీదుగా శ్రమలప్రవహాన్ని ప్రవహించనిస్తాడు. స్వార్ధం వల్ల మనం తరుచు కష్టాల కొలిమిలో పడతాం. మన ఆత్మలు నల్లగా మాడిపోతాయి. కాని ముఖ్యమైన పరీక్ష వచ్చినప్పుడు సహనం కలిగి నిలిచి ఉంటే దైవిక ప్రవర్తనను ప్రతిబింబిస్తూ బయటికి వస్తాం. ఆశ్రమను అనుమతించటంలో ఆయన ఉద్దేశం నెరేవరినప్పుడు “ఆయన వెలుగువలెను నీ నీతిని మధ్యాహ్నమునువలెను నిర్దోషిత్వమును వెల్లడిపరుచను”. కీర్త 37:6COLTel 139.2

    ప్రభువు తన ప్రజల ప్రార్ధనల్ని నిర్లక్ష్యం చేస్తాడన్నా భయంలేదు. భయమల్లా శోధన, శ్రమకలిగినప్పుడు వారు అధైర్యపడి సహనంతో ప్రార్ధన చెయ్యరన్నదే.COLTel 139.3

    రక్షకుడు సురో ఫెనికయ స్త్రీ పట్ల దైవ కనికరం ప్రదర్శించాడు. ఆమె దు:ఖాన్ని చూసినప్పుడు ఆయన హృదయం చలించిపోయినది. తన ప్రార్ధనను దేవుడు విన్నాడని తక్షణ హామీ ఇవ్వాలని తహతహలాడాడు. కాని తన శిష్యులికి ఒక పాఠం నేర్పించాలని కొంత సేపు వేదనతో నిండిన ఆమె మొరను లక్ష్య పెట్టలేదు. ఆమె విశ్వాసం ప్రస్పుటమైనప్పుడు ఆమెతో దయగా మాట్లాడి ఆమె కోరిన ప్రశస్త వరం ఇచ్చి ఆమెను పంపివేసాడు. శిష్యులు ఈ పాఠాన్ని ఎన్నడు మరువలేదు. ఎడతెగక ప్రార్ధించటం వల్ల కలిగే ఫలితాన్ని చూపించటానికి దీన్ని దాఖలు చెయ్యటం జరిగింది.COLTel 140.1

    పరలోక గుడారంలో నివసించే ఆ ప్రభువు న్యాయంగా తీర్పు తీర్చుతాడు. ఆయన తన సింహాసనం చుట్టు ఉండే దూత సమూహాల్లోకన్నా పాప లోకంలో శోధనతో పోరాడే తన ప్రజలయందు ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు.COLTel 140.2

    పరలోక విశ్వమంతా ఈ చిన్న లోకంలో అత్యధికాసక్తి చూపిస్తున్నది. ఎందుచేతనంటే లోక ప్రజల కోసం క్రీస్తు అపార మూల్యాన్ని చెల్లించాడు. లోక విమోచకుడు లోకాన్ని పరలోకంతో జ్ఞాన బంధాలతో బంధించాడు. ఎందుకంటే విమోచన పొందని వారు ఇక్కడ ఉన్నారు. అబ్రాహాముతోను మోషేతోను మాటలాడి నడిచిన దినాల్లో లాగే దేవదూతలు ఇంకా భూలోకాన్ని సందర్శిస్తూ ఉంటారు. మన మహానగరాల్లో చురుకుగా సాగే కార్యకలపాల నడుమ, ఏ జన సమూహాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం, క్రీడ, వినోదమే జీవితమన్నట్లు వ్యవహరిస్తూ విశాలమైన వీధులు మార్గాలు వ్యాపార మండీల్ని నింపుతారో వారి నడుమ, ఎక్కడ అదృశ్య వాస్తవాల గురించి ఆలోచించేవారు బహుకొద్దిమందే ఉంటారో వారి నడుమ సయిత పరలోక పరిశీలకులు పరలోక పరిశుద్దులు ఉంటారు. మానవుల ప్రతీమాట ప్రతీ క్రియ పరిశీలించే ఆదృశ్య ప్రతినిధులు ఉంటారు. ప్రతీ వ్యాపార లేక వినోద సమావేశంలో ప్రతీ ఆరాధన సమావేశంలో స్వాభావిక నేత్రానికి కనిపించే వారికన్నా కనిపంచని శ్రోతలు ఎక్కువమంది ఉంటారు. కొన్నిసార్లు అదృశ్య ప్రపంచాన్ని మరుగుపర్చే తెరను పరలోక దూతలు తొలగిస్తారు. మనం చేసే పనులు మనం పలికే మాటలు గమనించటానికి ఉన్న అదృశ్య సాక్షుల పైకి మన ఆలోచనల్ని తిప్పటానికి ఇది చేస్తారు.COLTel 140.3

    మనల్ని సందర్శించే దేవదూతల పరిచర్యను మనం ఇప్పటికన్నా మరింతగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పని అంతటి లోను దేవదూతల సహకారం శ్రద్ధాశక్తులు ఉండటం మంచిదని మనం పరిగణించాలి. దేవుని వాగ్దానాల్ని విశ్వసించి వారి నెరవేర్పును ఆకాంక్షించే దీనులు సాత్వికులు అయిన విశ్వాసులకు వెలుగుతో, శక్తితో నిండిన అదృశ్య సైన్యాలకాపుదల ఉంటుంది. అపారశక్తి గల కెరూబులు, షెరాబులు వేవేల దేవదూతలు ఆయన కుడి ప్రక్క నిలిచి ఉంటారు. “వీరందరు రక్షణయును స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారమ చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా”? హెబ్రీ 1:14COLTel 141.1

    మనుష్యులు మాటలు క్రియలు ఈ దూతలు నమ్మకంగా దాఖలు చేసి ఉంచుతారు. దైవ ప్రజల పట్ల జరిగించిన క్రూర లేక అన్యాయపు కార్యాలు, దుర్మార్గుల శక్తి ద్వారా వారికి సంభవించిన శ్రమ అంతా పరలోక గ్రంథాల్లో దాఖలవుతుంది. “దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివ వారాత్రులు తన్ను గూర్చి మొట్ట పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును”. COLTel 141.2

    “మీ ధైర్యమును విడిచి పెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చినవారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైయున్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది., వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును”. హెబ్రీ 10:35-37.“వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురియు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపికతో కని పెట్టుడి”. యాకో 5:7,8COLTel 141.3

    దేవుని దీర్ఘశాంతం అద్భుతం. పాపితో కృప విజ్ఞాపన చేస్తుండగా న్యాయ విచారణ దీర్ఘకాలం వేచి ఉంటుంది. అయితే “నీతిన్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము “. కీర్త 97:2 ‘ యెహోవా దీర్ఘశాంతుడు” కాని ఆయన ‘మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను, సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి”. సహూము 1:3COLTel 141.4

    లోకం దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్భయంగా అతిక్రమిస్తున్నది. ఆయన దీర్ఘశాంతాన్ని ఆసరా చేసుకొని మనుష్యులు ఆయన అధికారిన్ని కాలరాస్తున్నారు. వారు ఒకరితో ఒకరు చేయి కలపి, “దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా”? (కీర్త 73:11) అని చెప్పుకుంటూ దేవుని వారసుల్ని హింసించి వారిపట్ల క్రూరంగా ప్రవర్తిస్తు న్నారు. కాని వారికి ఒక హద్దున్నది దాని దాటిపోలేరు. వారు ఆ హద్దును చేరుకునే కాలం ఎక్కువ దూరంలో లేదు. ఇప్పుడు సయితం వారు దేవుని దీర్ఘశాంతం హద్దుల్ని ఆయన కృప కనికరాల హద్దుల్ని దాదపు మీరుతున్నారు. తన ఔన్నత్యాన్ని నిరూపించుకోవటానికి, తన ప్రజలన్ని విడిపంచటానికి, పెచ్చరిల్లుతున్న దుర్మార్ధతను అణిచివెయ్యటానికి ప్రభువు కలుగజేసుకుంటాడు.COLTel 142.1

    నోవాహు కాలంలో సృష్టికర్త జ్ఞాపకం భూమి పై దాదాపు తుడుపుపడే స్థితి వచ్చేవరకూ మనుష్యులు దేవుని ధర్మశాస్త్రాన్ని కాలరాచారు. వారి దుష్టత దుర్మార్గత మితిమీరిపోవటంతో ప్రభువు భూమి మీదికి జలప్రళయాన్ని పంపించి లోకంలో ఉన్న దుష్ట ప్రజలందరిని నాశనం చేసాడు,COLTel 142.2

    ప్రతీ యుగంలోని ప్రజలకు దేవుడు పనిచేసే తీరును గూర్చి వెల్లడి చెయ్యటం జరగుతుంది క్లిష్టపరిస్తితి సంభవించినప్పుడు ఆయన తన్ను తాను ప్రత్యక్షపర్చుకొని సాతాను ప్రణాళికల అమలుకు అడ్డుకట్ట వెయ్యటనాకి కలుగజేసుకుంటాడు. దేశాల విషయంలో కుటంబాల విషయంలో వ్యక్తుల విషయంలో ఆయన తన ప్రమేయం ప్రధానంగా కనిపించేందు కోసం తరుచు పరిస్థితులు తీవ్ర రూపం ధరించే వరకు ఊరకుంటాడు. అప్పుడు తన శక్తిని ప్రదర్శించి ఇశ్రాయేలులో దేవుడున్నాడని ఆయన తన ధర్మశాస్త్రాన్ని కొనసాగించి తన ప్రజల నిజాయితీని నిరూపిస్తాడని వెల్లడి చేస్తాడు.COLTel 142.3

    దుష్టత్వం దుర్నీతి ప్రబలుతున్న ఈ కాలంలో గొప్ప క్లిష్టత సమీపంలో ఉందని మనం గ్రహించవచ్చు. దైవధర్మశాస్త్ర అతిక్రమణ లోకవ్యాప్తం అయినప్పుడు, దైవ ప్రజల్ని సాటి మనుషులు శ్రమలకు హింసకు గురిచేసినప్పుడు ప్రభువు కలుగజేసుకుంటాడు.COLTel 143.1

    “నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యోహావా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరుచును నీవు వెళ్ళి నీ అంత:పురంలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసికొనము ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుం డము” అని ఆయన చెప్పే సమయం దగ్గరలోనే ఉన్నది. 26:20,21 క్రైస్తవులమని చెప్పుకునే మనుష్యులు బీదవారిని దోచుకొని హింసించవచ్చు. విధవరాండ్రని తండ్రి లేని వారిని దోచుకోవచ్చు. దేవుని ప్రజల మనసాక్షిని అదుపు చెయ్యలేరు. గనుక వారు పిశాచిక విద్వేషంతో రెచ్చిపోవచ్చు. దీనంతటిని దేవుడు తీర్పులోకి తెస్తాడు. “కనికరము చూపనివాడు కనకిరము లేని తీర్పు పొందును”. (యాకోబు 2:13) తన ప్రజల శరీరాలికి ఆత్మలకి వారు కలిగించిన బాధకు లెక్క అప్పగించటానికి త్వరలోనే వారు విశ్వ న్యాయాధిపతి ముందు నిలబడనున్నారు. వారు ఇప్పుడు తప్పుడు ఆరోపణలకు దిగవచ్చు. దేవుడు తన సేవను చెయ్యటానికి నియమించిన వారిని గెలిచెయ్యవచ్చు. ఆయన్ని విశ్వసించిన వారిని చెరసాలలో వేయవచ్చు. వారిని దేశం నుంచి బహిష్కరించవచ్చు. వారికి మరణశిక్ష విధించవచ్చు. కానీ వారు కలిగించిన భాధకు, చిందించిన రక్తానికి వీరు జవాబుదారులు అవుతారు. తమ పాపాలికి దేవుడు వారికి రెండు రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. భ్రష్ట సంఘానికి చిహ్నమైన బబులోను గురించి ఆయన తన తీర్పును అమలుపర్చే తన సేవకులతో ఇలా అంటున్నాడు. “దాని పాపములు ఆకాశమునంటుచున్నవి,దాని నేరము లను దేవుడు జ్ఞాపకము చేసికొని యున్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యబడును. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలపి పెట్టుడి” ప్రక 18:5,6COLTel 143.2

    ఇండియా నుంచి, ఆఫ్రికా నుంచి చైనా నుంచి సముద్ర దీవుల నండి క్రైస్తవ దేశాలుగా పిలిచే భూభాగల్లోని వేవేల పీడిత ప్రజల నుండి హృదయ వేదనతో నిండిన మొర దేవుని సన్నిధికి చేరుకుంటుంది. ఆ మొరకు సమాధానంగా దుర్నీతిని దేవుడు ప్రక్షాళన చేస్తాడు. అది నోవహు దినాల్లోలా సముద్రంలాంటి విస్తార జలంతో కాదు, సముద్రంలా విస్తారమైన అగ్నితో, అది ఏ మానవుడూ అర్పలేని అగ్ని.COLTel 144.1

    “అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారి ఎవరో వారు తప్పించుకొందురు” ఇళ్ల మిద్దెల మీద నుండి, పాడుపడ్డ మురికి గదుల్లో నుంచి చీకటి కొట్టుల్లో నుంచి వధ్యాస్తంభాల పై నుంచి పర్వతాల నుంచి, అరణ్యాల నుంచి కొండగుహల్లో నుంచి సముద్రపు గుహల్లో నుంచి క్రీస్తు తన బిడ్డల్ని పోగుచేసుకుంటాడు. వారు లోకంలో దిక్కులేనివారు శ్రమలు హింసకు గురి అయినవారు సాతాను మోసపూరిత పథకాన్ని తిరస్కరించినందుకు అవమానానికి గురి అయి లక్షలాది ప్రజలు సమాధుల్లోకి వెళ్ళారు. మానవ న్యాయస్థానాలు దేవుని బిడ్డల్ని నికృష్ణ నేరస్తులుగా తీర్పుతీర్చాయి. ‘దేవుడు తానే న్యాయకర్త” (కీర్త 50:6) అయ్యే దినం దగ్గరలోనే ఉంది. అప్పుడు ఈలోకం చేసిన తీర్పులు తారుమారువ్వుతాయి.“భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును.” యెష 25:8 వారిలో ప్రతీ ఒక్కరికి తెల్లని వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది (ప్రక 6:11) “పరశుద్ద ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును”. యోష 62:12 COLTel 144.2

    దేవుని పిల్లలు ఎలాంటి సిలువలు మొయ్యటానికి, ఎలాంటి నష్టాలు భరించటానికి ఎలాంటి హింస అనుభవించటానికి, ఆ మాటకొస్తే ప్రాణం పొగొట్టుకోవటానికి పిలుపు పొందిన వారు గొప్ప ప్రతిఫలం అందుకుంటారు, “ఆయన దాసులు ఆయన... ముఖదర్శనము చేయుచుం దురు; ఆయన నామము వారి నొసళ్ళయందుండును”. ప్రక 22: 4COLTel 144.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents