Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఉపయోగించటం వల్ల పెరిగిన తలాంతులు

    ఉపయోగించిన తలాంతులే పెరిగిన తలాంతులు. జయం అదృష్టం లేక విధి లీల ఫలితం కాదు. అది దేవుని కృపా బాహుళ్య ఫలం. విశ్వాసం వేవేకం, ప్రతిఫలం. మంచితనం సహనశీల కృషి ఫలితం. మనకున్న ప్రతీ వరాన్న ఉపయోగించవలసినదిగా ప్రభువు కోరుతున్నాడు. ఇది మనం చేసినప్పుడు ఇంకా గొప్ప వరాలు మనకు కలుగుతాయి.. మనకు లోపించిన అర్హతల్ని ఆయన తన అతిలోక శక్తి ప్రదర్శన ద్వారా అనుగ్రహంచదు. కాని మనకున్నది మనం ఉపయోగిస్తుంగా ఆయన మన ప్రనతీ మానసిక శక్తిని పెంచి బలోపేత చెయ్యటానికి మనతో కలసి పనిచేస్తాడు. ప్రభువు సేవ నిమిత్తం మనం చేసే ప్రతీ హృదయపూర్వక త్యాగం వలన మన శక్తులు వృద్ధి అవుతాయి.పరిశుద్దాత్మ సాధనాలుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటుండగా, పాత కోరికల్ని విసర్జింటానికి బలమైన పూర్వ దురభిప్రాయాల్ని జయించటానికి, కొత్త అలవాట్లును రూపొందించు కోవటానికి దేవుని కృప మనలో పనిచేస్తుంది. మనం దేవుని ఆత్మ చెప్పేది విని ఆచరించే కొద్ది,ఆయన శక్తిని మరెక్కువగా స్వీకించేం దుకు ఇంకా ఎక్కువ పని చెయ్యటానికి మేల్కుంటాయి. చచ్చుబడ్డ మానసిక శక్తులు నూతన జీవాన్ని పొందుతాయి.COLTel 301.1

    దేవుని పిలుపుకు స్పందించే దీన, విధేయ సేవకుడు దేవుని సహాయాన్ని పొందవచ్చు.అంత గొప్ప పరిశుద్ద బాధ్యతను అంగీకరించుటమే ప్రవర్తనకు ఔన్నత్యాన్ని ఆపాదిస్తుంది. అత్యున్నత మాననసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని అది క్రియాత్మకం చేసి మనసును హృదయాన్ని శుద్ధికరిస్తుంది.COLTel 302.1

    ఒక బలహీన మనుషుడు దేవుని శక్తి పై విశ్వాసం ద్వారా ఎలా బలవంతుడు కాగలడో అతడి ప్రయాత్నాలు ఎంత స్థిరంగా ఉండగలవో, ఎంత గొప్ప, ఎంత విస్తార ఫలితాలు సంభవిస్తాయో ఇవన్నీ ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక వ్యక్తి ఒకటిద్దిపాటి జ్ఞానంతో ప్రారంభించి సామన్య రీతిలో తనకు తెలిసింది చెబుతూ అదే సమయంలో అదనపు జ్ఞానం కోసం పట్టుడలతో ప్రార్ధిస్తే పరలోక ధనాగారమంతా అతడి అదేశం మేరకు తెరుచుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుసుకుంటాడు. వెలుగును ఇతరులికి అందించటానికి అతడు ఎంత ఎక్కువగా అన్వేషిస్తే అంత ఎక్కువ వెలుగును పొందుతాడు. ఒక వ్యక్తి ఆత్మల పట్ల ప్రేమతో ఇతరులికి దైవ వాక్యన్ని వివరించటానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అది అతడికి అంత స్పష్టమౌతుంది. మనం మన జ్ఞానాన్ని మన శక్తుల్ని ఎంత ఎక్కువగా వినియోగిస్తే అంత ఎక్కువ జ్ఞానాన్ని శక్తిని పొందుతాం.COLTel 302.2

    క్రీస్తు నిమిత్తం చేసే ప్రతి ప్రయత్నం మనకే దీవెనగా పరిణమిస్తుంది. మనం మన ద్రవ్యాన్ని ఆయన మహిమకు ఉపయోగిస్తే ఆయన మనకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఆత్మల్ని గూర్చిన భారాన్ని మన ప్రార్ధనల ద్వారా దేవునికి వ్యక్తం చేస్తూ ప్రజల్ని క్రీస్తుకి ఆకర్షించటానికి మనం కృషి చేస్తుండగా చైతన్యపర్చే దైవ కృపా ప్రభావంతో మన సొంత హృధయాలు స్పందిస్తాయి. మన సొంత ప్రేమ దైవావేశంతో ప్రకాశిస్తుంది. మన క్రైస్తవ జీవితం మరింత వాస్తవకితను, మరింత చిత్తశుద్ధిని సంతరించుకొని మన జీవితం ప్రార్ధనా జీవితమవుతుంది.COLTel 302.3

    దేవున్ని ఎరగటానికి హృదయానికన్న సమార్ధ్యాన్ని బట్టి పరలోకం మానవుడి విలువను అంచాన వేయటం జరుగుతుంది. ఈ జ్ఞానం ఒక ఏరు దాని నుంచి సకల శక్తి ప్రవహిస్తుంది. ప్రతీ మానసిక శక్తి దైవ మానసిక శక్తిగా ఉండే నిమిత్తం దేవుడు మానవుణ్ణి సృజించాడు. మావన మనసును దివ్య మనసును సహవాసంలోకి తేవటానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తున్నాడు. మనం పరలోక విషయాల్ని గురించి మరింత జ్ఞానాన్ని పొందే నిమిత్తం. క్రీస్తు కృపను లోకానికి వెల్లడి చేయటంలో క్రీస్తుకు సహకరించే ఆధిక్యతను మనకిస్తానంటున్నాడు.COLTel 303.1

    క్రీస్తుని చూసినప్పుడు దేవుని గూర్చి మనకు ప్రకాశవంతమైన స్పష్టమైన దృక్పధం ఏర్పడుతుంది. వీక్షించటం వల్ల మనం మార్పు చెందుతాం. తోటి మావనుల పట్ల మంచితనం ప్రేమ మనలో సహజంగా పుడతాయి. మనం దైవ ప్రవర్తనకు ప్రతిరూపమైన ప్రవర్తనను వృద్ధిపర్చుకుంటా. ఆయన పోలికలోకి పెరుగతూ మనం దేవున్ని తెలుసుకనే సామర్ధ్యాన్ని వృద్ధిపర్చుకుంటాం. పరలోక ప్రపంచంతో మన సహవాసం ఇంతలంతలుగా పెరుగుతంది.నిత్యజీవానికి సంబంధించిన జ్ఞాన సంపదను వివేకాన్ని అందుకోవటానికి మనకు నిత్యం పెరుగుతుండే శక్తి ఉంటుంది.COLTel 303.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents