Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పోయిన వెండి నాణెం

    తప్పిపోయిన గొర్రె ఉపమానం తరువాత క్రీస్తు మరొక ఉపమానం చెప్పాడు.” ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒకనాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి ఆది దొరుకువరకు జాగ్రత్తగా వెదకదా!COLTel 152.3

    తూర్పుదేశాల్లో బీదవారి ఇల్పు సాధారంణంగా ఒక్కటే గదితో కిటీకీలు లేకుండా చీకటిగా ఉండేవి. గదిని అరుదుగా మాత్రమే తుడవటం జరిగేది. నేలపై పడే నాణెం త్వరగా ధూళితో చెత్తతో కప్పబడి ఉండేది. దాన్ని వెదకటానికి పగలు సయితతం దీపం వెలిగించి ఇల్లంతా తుడవటం అవసరమ్యేది.COLTel 153.1

    వివాహంలో భార్య వంతు ద్రవ్యపు నాణెల్లో ఉండేది. దాన్ని ఆమె మిక్కిలి విలువైన ఆస్తిగా కాపాడుకొని ఆనక తన కుమార్తెలికి అందజేసేది. ఈ నాణెల్లో ఒకటి పోవటం తీవ్ర విపత్తుగా పరిగణించటం జరిగేది అది దొరకటం గొప్ప సంతోషాన్ని హేతవయ్యేది. ఆ సంతోషంలో ఇరుగుపొరుగు స్త్రీలు పాలు పంచుకునేవారు. COLTel 153.2

    క్రీస్తు ఇలా అన్నాడు.“ఆది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిని నాణెము దొరికినదని వారితో చెప్పును గదా, అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగును”.COLTel 153.3

    దీనికి మందు దానిలాగే ఈ ఉపమానం ఏదో పోవటాన్ని సరి అయిన అన్వేషణతో అది దొరకటాన్ని ఫలితంగా ఎంతో సంతోషం చోటు చేసుకోవాన్ని పొందుపర్చుతుంది. కాగా ఈ రెండు ఉపమానాలు రెండు తరగతుల ప్రజల్ని సూచిస్తున్నాయి. తప్పిపోయిన గొర్రె అది తప్పిపోయినట్లు ఎరుగును. అది తన కాపరిరనిమందును విడిచి పెట్టింది. అయితే తిరిగి వెళ్ళలేదు. ఇది తాము దేవుని విడిచి పెట్టి దూరంగా వెళ్ళిపోయామని, తాము ఎటూ తోచని అస్తవ్యస్త స్థితిలో ఉన్నానని అవమానకర పరిస్థితిలో ఉండి తీవ్ర శోధనకు గురి అయి వున్నామని గుర్తించే వారిని సూచిస్తుంది. పోయిన నాణెం, అతిక్రమాలు పాపాల్లో నశించినా తమ స్థితిని గుర్తించని వారిని సూచిస్తున్నది. వారు దేవునికి దూరమవుతారు. కాని అది వారికి తెలియదు. వారి ఆత్మలు ప్రమాద స్థితిలో ఉన్నాయి. అయినా వారికి చింత లేదు. దైవకార్యాలు విధుల విషయంలో ఉదాసీనంగా ఉన్న వారిని సయితం దేవుడు ప్రేమిస్తాడని ఈ ఉపమానంలో క్రీస్తు బోధిస్తున్నాడు. వారిని దేవుని వద్దకు చేర్చయటానికి వారి కోసం వెదకాలి.COLTel 153.4

    “నా ప్రజలు త్రోవ తప్పిన గొట్టెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి”. తప్పిపోయిన గొట్టెవలె నేను త్రోవ విడిచి తిరిగితిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నా ఆజ్ఞలను మరచువాడను కాను”. యిర్మీ 50:6, కీర్త 119:176. COLTel 154.1

    గొర్రె మందనుంచి విడిపోయి సంచరించింది. అడవిలోనో కొండల మీదో తప్పిపోయింది. వెండి నాణెం ఇంట్లోనే పోయింది. అది దగ్గరలోనే ఉంది. అయినా దాన్ని తిరిగి సంపాదించటానికి శ్రద్ధగా వెదకటం అసవరం.COLTel 154.2

    కుటుంబాలు నేర్చుకోవలసిన పాఠం ఈ ఉపమానంలో ఉంది. కుటుంబ సభ్యులు ఆత్మల విషయంలో అజాగ్రత్త చోటు చేసుకుటుంది. అందులో ఒక సభ్యుడు దేవునికి దూరంగా ఉంటుండవచ్చు. అయితే కుటుంబబాంధవ్యంలో దేవుడు కుటుంబానికి అప్పగించినవారిలో ఒకరు తప్పిపోవటం గురించి ఎంత తక్కువ ఆందోళన కనిపిస్తుంది..!COLTel 154.3

    పోయిన నాణెం దుమ్ములోను చెత్తలోను పడి ఉన్నప్పటికి అదింకా వెండి నాణెమో, దాన్ని పోగొట్టుకున్న స్త్రీ దాన్ని వెదకుతుంది. ఎందుకంటే అది విలువైనది. అలాగే ప్రతీ ఆత్మ పాపం వల్ల ఎంతగా దిగజారి పోయినా దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. నాణెం మీద రాజు లేక పరిపాలనాధికారి బొమ్మ అధికార పరిధి ఉన్నట్లే మానవుడు తన సృష్టి జరిగినప్పుడు దేవుని స్వరూపాన్ని దేవుని అధికార ముద్రను ధరించాడు. పాప పర్యవసానంగా అది మసకబారినప్పటికి ఆ ముద్ర ఆనవాళ్ళు ప్రతీ ఆత్మ మీద మిగిలి ఉన్నాయి.ఆ ఆత్మను తిరిగి సంపాదించి దాని మీద నీతి పరిశుద్ధత రూపంలో తన స్వరూపాన్ని తిరిగి ముద్రించాలిన దేవుడు కోరుకుంటున్నాడు.COLTel 154.4

    ఉపమానంలోని స్త్రీ తాను పోగొట్టుక్ను నాణెం కోసం శ్రద్ధగా వెదకింది. దీపం వెలిగించి ఇల్లు ఊడ్చింది వెదకటానికి అడ్డువచ్చేవాటన్నిటిని తొలగించిది. పోయింది. ఒకటే నాణం అయిన అది దొరికే వరకు తన కృషి మానలేదు. అలాగే కటుంబములో ఒకసభ్యుడు దేవునికి దూరమైతే అతణ్ణి తిరిగి సంపాదించటానకి ప్రతీ సాధనాన్ని వినియోగించాలి. కుటుంబ సభ్యులు తమ వంతు ప్రయత్నంగా తమ హృదయాల్ని పరీక్ష చేసుకోవాలి. ఏదైనా అపశ్రుతి, ఏదైనా స్వామ్యదోషం ఆ ఆత్మ మారుమనసు పొందక పోవటానికి కారణమేమో పరిశీలించటం అవసరం.COLTel 154.5

    తాను పాపినన్న స్పృహలేని బిడ్డలుకుటుంబములో ఒకడుంటే తల్లితండ్రులు విశ్రమించకూడదు. దీపం వెలిగించండి. దైవ వాక్యాన్ని పరిశోధించండి. ఈబిడ్డ ఎందుకు తప్పిపోయాడో తెలుసుకోవడానికి ఆ దీపం వెలుగుతో ఇంటిలో ఉన్న సమస్తాన్నీ పరీక్షించండి. తల్లితండ్రులు తమ హృదయాల్ని పరిశోధించుకోవాలి. తమ అలవాట్లు అభ్యాసాల్ని పరీక్షించుకోవాలి. పిల్లలు మనకు ప్రభు ఇచ్చిన స్వాస్థ్యం. ఈ ఆస్తిని మన ఎలా వినియోగిస్తామో దానికి మనం దేవునికి జవాబుదారులం.COLTel 155.1

    కొందరు తల్లులు తండ్రులు తమ సొంత బిడ్డలు రక్షకునికి ఆయన ప్రేమకు పరిచుతులు కాకుండా ఉండగా విదేశాల్లో సేవ చేయ్యాలని తపనపడతారు. తమ పిల్లలు రక్షకుణ్ణి ఎరగకుండా ఆయన ప్రేమను చవిచూడకుండా నివసిస్తుండగ తమ గృహం వెలపల క్రైస్తవ సేవలో చురకుగా పనిచేసేవారు అనేకులన్నారు. తమ పిల్లల్ని క్రీస్తు విశ్వాసులు చేసే పనిని అనేకమంది తల్లితండ్రులు బోధకుడికి లేదా సబ్బాతుబడి అధ్యాపకునికి అప్పగిస్తారు. అయితే ఇలా చెయ్యటంలో వారు తమకు దేవుడిచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు. తమ బిడ్డలు క్రైస్తవులుగా ఉంటానికి విద్యను శిక్షణను ఇచ్చిన దేవునికి తాము చేయగల ఉత్తమ సేవగా పరిగణించాలి. ఈ పనికి సహనంతో కూడిన కృషి, జీవితకాలమంతా శ్రద్ధతో ఎడతెగకుండా చేసే శ్రమ అవసరం. దేవుడిచ్చిన ఈ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే అపనమ్మకమైన గృహ నిర్వాహకులమని నిరూపించుకుంటాం. అలాంటి నిర్లక్ష్యానికి దేవుడు ఏ సాకునూ అంగీకరించడు.COLTel 155.2

    అయితే నిర్లక్ష్యం చేసి అపరాధులైనవారు నిస్పృహ చెందకూడదు. నాశాన్ని పోగొట్టుకున్న స్త్రీ అది దొరికే వరకు వెదకింది. అలాగే తల్లితండ్రులు “ఇదిగో, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలును” (యెష 8:18) అంటూ సంతోషంగా దేవుని వద్దకు వచ్చే వరకు ప్రేమతో విశ్వాసంతో తమ కుటుంబ సభ్యుల కోసం పనిచెయ్యాలి.COLTel 155.3

    “యేసు వారిని తన యొద్దకు పిలిచి- చిన్నబిడ్డలను అటంకపర్చక వారిని నా యొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది, చిన్న బిడ్డవలెనె దేవుని రాజ్యము అంగీకరిపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశిపండని మీలో నిశ్చయముగా చెప్పుచునన్నాననెను” లూకా 18:16,17COLTel 156.1

    ఇది వాస్తవమైన గృహ మిషనరీ సేవ. ఆ సేవను పొందుతున్న వారికి అది ఎంత మేలు చేస్తుందో దాన్ని చేసే వారికి కూడా అంతే మేలు చేకూర్చుతుంది. గృహ ప్రాంగణ సువార్త సేవ పట్ల మన ఆసక్తి ద్వారా దేవుని కుటుంబ సభ్యుల కోసం పనిచెయ్యటానికి మనల్ని మనం సమర్ధుల్ని చేసుకంటున్నాం.మనం క్రీస్తుకి నమ్మకంగా జీవిస్తే వారితో మనం నిత్యయుగాల వరకు జీవిస్తాం. ఒకే కుటుంబ సభ్యులుగా మనం పరస్పర చూపించుకునే శ్రద్ధాశక్తులే క్రీస్తులో మన సహోదరులు సహోదరీలు అయినవారిపట్ల చూపించాల్సి ఉన్నాం.COLTel 156.2

    మనం ఇంకా ఇతరుల కోసం పనిచెయ్యటానికి ఇదంతా మనల్ని సిద్ధపర్చా దేవుని సంకల్పించాడు. మన సానునభూతి విశాలమయ్యేకొద్ది మన ప్రేమ వృద్ధి అయ్యే కొద్ది మనం పనిచెయ్యటానికి ప్రతిచోటా పని ఉంటుంది. దేవుని మానవ కుటుంబ లోకమంతా విస్తరించి ఉంది. అందులోని ఏ సభ్యుల్నిదాటి వెళ్ళిపోకూడదు.COLTel 156.3

    మనం ఎక్కడ ఉన్నా మనం వెదకటానికి పోయిన వెండి నాణెం ఉంటుంది. మనం దాని కోసం వెదకుతున్నామా? మతమంటే ఆసక్తి లేనివారిని ప్రతీ దినం కలుస్తాం. వారితో మాట్లాడాం . వారిని సందర్శిస్తాం. వారి ఆధ్యాత్మిక సంక్షేమాన్ని పట్టించుకుంటున్నామా? పాపం పరిహరించే రక్షకుడుగా వారిని క్రీస్తున్ని సమర్పిస్తున్నామా? పాపం పరిహరించే రక్షకుడుగా వారిని క్రీస్తుని సమర్పిస్తున్నామా? క్రీస్తు ప్రేమను అనువస్తున్న మనం ఆప్రేమను గురించి వారికి చెబుతున్నామా? చెప్పకపోతే మనం నశించిన సత్యం, నశించిన - ఈ ఆత్మలతో దేవుని సింహాసనం ముందు నిలిచినప్పుడు వారిని ఎలా కలుస్తాం?COLTel 156.4

    ఒక ఆత్మ విలువను ఎవరు అంచనా వేయగలరు? మీరు దాని విలువ తెలుసుకోగోరితే గెత్సెమనేకి వెళ్ళి అక్కడ క్రీస్తు రక్తం చెమట కార్చుతూ ఆత్మ వేదనతో గడిపిన గంటలు ఆయనతో కలసి గడపండి సిలువ మీదికి ఎత్తబడి అక్కడ వేలాడుతున్న రక్షకుణ్ణి వీక్షించండి “నా దేవా నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి”? (మార్కు 15:34) అంటూ ఆయన తండ్రికి పెట్టిన మొరను అలకించండి. గాయపడ్డ ఆయన పక్కల్ని పాదాల్ని వీక్షించండి. క్రీస్తు తన సమస్తాన్ని సిలువకు పెట్టిన సంగతి జ్ఞాపకముంచు కోండి. మన విమోచన నిమత్తం పరలోకమంతా ప్రమాదంలో పడింది ఒక్క పాపి కోసం క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించి ఉండేవాడని గుర్తుంచు కుంటూ సిలువ పక్కన నిలబడినప్పుడు ఒక ఆత్మ విలువ ఎంతో మీకు తెలియవచ్చు.COLTel 156.5

    మీరు క్రీస్తుతో కలసి మాట్లాడుతూ ఉంటుంటే మానవాత్మకు ఆయన కట్టిన విలువనే మీరు కడతారు. మీ పట్ల క్రీస్తు చూపిస్తున్న ప్రేమనే మీరు ఇతరులపట్ల కనపర్చుతారు. అప్పుడు మీరు క్రీస్తు ఎవరి కోసం మరణించాడో వారి ఆత్మల్ని చెదరగొట్టారు. ఇప్పుడు ఆకర్షించరు కాని సంపాదిస్తారు. క్రీస్తు వ్యక్తిగతంగా తమ కోసం కృషి చెయ్యకపోతే తండ్రి వద్దకు ఎవరూ తిరిగి రావటం జరిగి ఉండేది కాదు. ఈ వ్యక్తిగత కృషి ద్వారానే మనం ఆత్మల్ని రక్షించగలుగుతాం. క్రీస్తుని ఎరగకుండా మరణిస్తున్నవారిని చూసినప్పుడు మీరు ఉదాసీనంగా, సుఖంగా విశ్రమించారు. వారి పాపం ఎంత ఘోరమైందైతే, వారి దుస్తితి ఎంత తీవ్రమయ్యిందైతే వారి పునరుద్ధరణకు మీ ప్రయత్నం అంత పట్టుదలతోను అంతసున్నితంగాను సాగుతుంది. భాధపడుతున్నవారి అవసరాన్ని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి అపరాధ భారంతో కుంగిపోతున్న వారి అవసరాన్ని మీరు గుర్తిస్తారు. వారిపట్ల మీ హృదయం సానుభూతి పెంచుకుంటుంది. వారికి చెయ్యి అందించి అసరగా నిలుస్తారు. విశ్వాసంతోను ప్రేమతోను కౌగిలించుకొని వారిని క్రీస్తు వద్దకు తీసుకువస్తారు. వారినిజాగ్రత్తగా పరిశీలించి ప్రోత్సహిస్తారు. వారి పట్ల మీ సానుభూతి నమ్మకం స్థిర క్రైస్తవ జీవితం నుండి తొలగకుండా వారికి తోడ్పడతాయి.COLTel 157.1

    పరలోక దూతలందరూ ఈ పనిలో సహకరించటానికి సిద్ధంగా ఉన్నారు. పాపంలో నశించిన వారిని రక్షించటానికి కృషి చేస్తున్నవారు వినియోగించుకోవటానికి పరలోక వనరులన్నీ అందుబాటులో ఉన్నాయి. నిర్లక్ష్యంగాను ఉదాసీనంగాను ఉన్న ఘోర పాపుల్ని చేరటానికి దేవదూతలు మీకు చేదోడుగా ఉంటారు. ఒక్క పాపి తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు పరలోకమంతా సంతోషిస్తుంది. సెరాపులు, కెరూబులు తమ బంగారు వీణెలు మీటుతూ, మానవుల పట్ల తమ కృపకూ ప్రేమావాత్సల్యాలకూ తండ్రిని దేవుని గొర్రెపిల్లను స్తుతిస్తూ పాటలు పాడ్డారు.COLTel 157.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents