Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఇతర తలాంతులు

    ఈ ఉపమానంలో తలాంతులు సూచిస్తున్నది. ఆత్మ వరాలు మాత్రమే కాదు. అవి మూల వరాలు లేక అభ్యాసం ద్వారా సంపాదించినవి. స్వాభావికమైనవి లేక ఆద్యాథ్మికమైనవి. ఇలా అవి ఏవి అయినా ఇందులో వరాలన్నీ ఇమిడి వున్నాయి. అన్ని వరాలు క్రీస్తు సేవలో వినియక్త కావాలి. ఆయన శిష్యులవ్వటంలో మనకున్న సమస్తంతో మనల్ని మనం ఆయనకు సమర్పించుకకుంటాం. ఆ వరాల్ని ఆయన శుద్ధి చేసి మెరుగుపర్చి మనకు తిరిగి ఇస్తాడు. సాటి మనుషులికి మేలు చేయటానికి ఆయన్ని మహిమపర్చేందుకు వీటిని మనం వినియోగించాల్సి ఉన్నాం.COLTel 276.1

    దేవుడు “ఎవని సామర్థ్యము చొప్పున వానికి” ఇచ్చాడు. తలాంతుల్ని చాపల్యంతో ఇష్టానుసారంగా పంచటం జరగలేదు. అయిదు తలాంతులు వినియోగించటానికి సామర్ధ్యం గలవాడు అయిదు తలాంతులు పొందాడు. రెండింటిని వృద్ధిపర్చగలినవాడు రెండింటిని పొందాడు. తమకు గొప్ప వరాలు లేవని ఎవరూ చింతించకూడదు.ఎందుకంటే అది పెద్దదైనా చిన్నదై ఆ ప్రతీ తలంతూ వృద్ధిపొందటం వలనవాటిని అందరికి పంచినవాడు సమాన గౌరవ పొందాడు. అయిదు తలాంతులు పొందినవాడు అయిదింటి అభివృద్ధిని చూపించాలి.ఒక తలాంతునే పొందినవాడు ఒక తలాంతు వృద్దినే చూపించాలి. “ఒక వ్యక్తికి ఉన్నదాని ప్రకారమే గాని లేనదాని ప్రకారం”అతడి కలిమి దేవుడు వృద్ధిని కోరడు. ( 2 కొరి 8:12 (ఎన్.ఐ.వి))COLTel 276.2

    ఉపమానంలో “అయిదు తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను. అలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించెను”. తలాంతులు ఎంత తక్కువగా ఉన్నా వాటిని ఉపయోగించటం జరగాలి. మనం ఆలోచించా ల్సింది,నేనెంత పొందాను? అన్నది కాదు, నాకున్న దానితో నేనేమి చేస్తున్నాను? అన్నది మనకున్న శక్తుల్ని వృద్ధిపర్చటం దేవుని పట్ల సాటి మనుషుల పట్ల మన ప్రథమ కర్తవ్యం. సామర్థ్యం విషయంలోను ప్రయోజకత్వం విషయంలోను దినదినం వృద్ధి చెందని వారెవ్వరూ జీవితం ఉద్దేశ్యాన్ని నెరవేర్చటం లేదు. క్రీస్తు పై విశ్వాసాన్ని ప్రకటించటంలో ప్రభువుకి సేవకులుగా చేయగలిగినదంతా చేస్తామని మనం ప్రమాణం చేస్తున్నాం. మనం చెయ్యగల మేలంతా చేసేందుకు గాను ప్రతీ మానసిక శక్తిని పరిపూర్ణ స్థాయికి వృద్ధి పర్చుకోవాలి.COLTel 276.3

    ప్రభువుకి గొప్ప పని ఉంది. ఈ జీవితంలో ఆయనకు నమ్మకమైన ఇష్టపూర్వకమైన సేవ చేసే వారికి భావి జీవితానికి ఎంతో ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందజేస్తాడు. ప్రభువు తన సాధనాల్ని ఎంపిక చేసుకుంటాడు. ప్రతీ దినం వివిధ పరిస్థితుల్లో తన కార్యాచరణ ప్రణాళికలో వారికి శిక్షణనిస్తాడు. ఆయన ప్రణాళిక అమలుకు జరిపే ప్రతీ హృదయ పూర్వక ప్రయత్నంలో ఆయన తన సాధనాల్ని ఎంపిక చేసుకుంటాడు. ఆయన ఎంపకి చేసుకోవటం వారి సంపూర్ణులైనందుకు కాదు గాని తనతో సంబంధం ద్వారా వారు పరిపూత్వాన్ని సాధించేందుకు .COLTel 277.1

    ఉన్నత గురి ఉన్నవారినే దేవుడు అంగీకరిస్తాడు.ప్రతీ మానవ సాధనాన్ని తన శక్తి మేరకు కృషి చెయ్యటానికి భాద్యుణ్ణి చేస్తున్నాడు. అందరు నైతిక సంపూర్ణతను సాధించటం అవసరం. పారంపర్య బలహీన తల్ని, నేర్చుకున్న దురభ్యాసాల్ని సర్దుబాటు చెయ్యటానికి నీతి ప్రమాణాన్ని తగ్గించకూడదు. ప్రవర్తన అసంపూర్ణత పాపమని మనం గ్రహించటం అవసరం., ప్రవర్తనలోని నైతిక గుణలక్షణాలన్నీ సంపూర్ణమైన సమన్వయత గల మెత్తంగా దేవునిలో ఉన్నాయి. క్రీస్తును వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించిన వారందరు ఈ గుణలక్షణాల్ని కలిగి ఉంటారు. అది వారి అధిక్యత.COLTel 277.2

    దేవుని జత పనివారుగా ఉండేవారు ప్రతీ శరీరావయవ పరిపూర్ణతకు మానసిక శ్రేష్టతకూ పరిశ్రమించాలి. శారీరక, మానసిక నైతిక శక్తుల్ని ప్రతీ విధి నిర్వహణకు సిద్ధపరిచేదే వాస్తవిక విద్య. అది శరీరాన్ని మనసుని, ఆత్మను దైవ సేవకు తర్బీతు చేస్తుంది. నిత్యజీవం వరకు నిలిచే విద్య ఇదే. ప్రతీ క్రైస్తవుడు ప్రతీ శాఖలో కార్యదక్షతలోను సామర్ధ్యంలోను పెరుగుదల సాధించాలని ప్రభువు కోరుతున్నాడు. ఇష్టపూర్వక సేవను పొందేందు కోసం క్రీస్తు మనకు జీతం చెల్లించాడు. తన రక్తంతో సిలువ శ్రమలతో మనం ఎలా పనిచెయ్యాలో మన పనిలో ఎలాంటి స్వభావం కనపర్చాలో చూపించటానికి ఆయన వచ్చాడు. “లోకమును ఎంతో ప్రేమించి.... తన అద్వితీయ కుమరునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను ” (యోహా 3:16) అనుగ్రహించిన తండ్రిని గౌరవ కిరీటంతో ఘనపర్చి అపూర్వ భక్తితో ప్రేమిస్తూ ఆయన సేవను వృద్ధిపర్చతూ లోకంలో ఆయన నామాన్ని మహిమపర్చగల మార్గాల్ని అధ్యయనం చెయ్యాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు.COLTel 277.3

    అయితే ప్రవర్తన సంపూర్ణత్వాన్ని సాధించటం నల్లేరు పై ఒడంబిక అని క్రీస్తు చెప్పలేదు. యోగ్యమైన సౌష్టమైన ప్రవర్తన, వంశ పారంపర్యంగా వచ్చేది కాదు. అది యాదృచ్చికంగా వచ్చేది కాదు. యోగ్య ప్రవర్తన క్రీస్తు పాత్ర తన కృపను బట్టి వ్యక్తిగత కృషి ద్వారా వస్తుంది. దేవుడు మనకు తలాంతులిస్తాడు. అంటే మానసిక శక్తుల్ని ఇస్తాడు. ప్రవర్తనను మనం నిర్మించుకోవాలి. స్వార్ధంతో కఠినంగా పోరాడటం ద్వారా ప్రవర్తను నిర్మించుకోవాలి. పారంపర్యంగా వచ్చే ప్రవృత్తులతో పోరాటం వెంట పోరాటం జరపాలి. మనల్ని మనం తీవ్రంగా విమర్శించుకోవాలి. ఒక్క దుర్గాణాన్ని కూడా సంస్కరించకుండా విడిచి పెట్టకూడదు.COLTel 278.1

    నా ప్రవర్తన లోపాల్ని దిద్దుకోలేను అని ఎవరూ నిస్పృహ చెందకూడదు. ఈ తీర్మానానికి గనుక మీరు వస్తే మీరు నిత్యజీవాన్ని పొందలేకపోవటం ఖాయం. అది అసాధ్యమవ్వటానికి కారణం మీ చిత్తంలో ఉంది మీరు నిశ్చయించుకోకపోతే జయించలేరు. అసలు సమస్య అపవిత్ర హృదయపు దౌష్ట్యం నుంచి దేవుని నియంత్రణకు లొంగని చిత్తం నుంచి పుడుతుంది. తనకు విశిష్ట సేవ చేసేందుకు దేవుడు యోగ్యలిచ్చిన అనేకులు అంతంత మాత్రమే కృషి చేసినందు వల్ల అతి స్వల్పంగా సాధించగలిగారు. జీవితంలో సాధించాల్సిన ధ్యేయం లేనట్లు చేరాల్సిన ప్రమాణమేది లేనట్లు వేలమంది జీవితాల్ని వెళ్ళదీస్తారు. అలాంటి మనుషులు తమ క్రియలకు దీటుగా ప్రతిఫలం పొందుతారు.COLTel 278.2

    మీరు ఏర్పర్చుకున్న ప్రమాణం కన్నా ఉన్నత ప్రమాణాన్ని మీరెన్నడూ చేరలేరని గుర్తుంచుకోండి. కాబట్టి ఉన్నత గురి ఏర్పర్చుకొని ఆత్మోపేక్ష త్యాగాలతో అది బాధాకరమైన కృషి అయినప్పటికి మెట్టు తరువాత మెట్టు చొప్పున అభివృద్ధి నిచ్చెన చివరికి ఎక్కండి. మీకు ఏది ఆటంకముగా నిలవనివ్వకండి, ఏ మనుషుడు నిస్సహాయంగా అనిశ్చిత స్థితిలో మిగిలిపోవాల్సినంత బలంగా విధి అతడి చుట్టు ఉచ్చుల్ని అల్లలేదు ప్రతికూల పరిస్థితులు వాటిని అధిగమించటానికి మనలో ధృడ నిశ్చయత పట్టుదల సృష్టించాలి.. ఒక్క అడ్డుగోడను కూలగొట్టటం ముందుకు సాగటానికి మరింత శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది. సరియైన దిశలో కృత నిశ్చయంతో ముందుంజ వేయండి. పరిస్థితులు మీకు తోడ్పడతాయి అటంకాలు కాదు.COLTel 279.1

    ప్రభువును మహిమపర్చే నిమిత్తం ప్రవర్తనలోని ప్రతీ సలక్షణాల్ని వృద్ధిపర్చుకోవాలని ఆత్యశతో కృషి చెయ్యండి. మీ ప్రవర్తన నిర్మాణం ప్రతీ దశలోను మీరు దేవున్ని సంతృప్తి పర్చాలి ఈ కార్యాన్ని మీరు సాధించగలరు. ఎందుచేతనంటే హనోకు దుర్మార్గ యుగంలో నివసించినా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. మన దినాల్లో కూడా హనోకులున్నారు.COLTel 279.2

    నమ్మకమైన ఆ రాజనీతిజ్ఞుడు దానియేలులూ నిలబడండి. అతణ్ణి శోధన జయించలేకపోయింది. మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ పాపాల్ని రద్దు చేయటానికి తన ప్రాణాల్ని అర్పించిన ఆ ప్రభువుని ఆశాభంగం పర్చకండి. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” (యోహ 15:5) అంటున్నాడాయన, ఇది జ్ఞాపకముంచుకోండి. మీరు తప్పిదాలు చేస్తే, ఆతప్పిదాల్ని చూసి వాటిని హెచ్చరికలుగా పరిగణిస్తే మీరు విజయం సాధించినట్లే. అలా మీరు అపజయాన్ని విజయంగా మలుచుకుంటారు. అలా మీరు మీ శత్రువుని నిరుత్సాహపర్చి మీ రక్షకుణ్ణి ఘనపర్చుతారు.COLTel 279.3

    దేవుని పోలికలో నిర్మితమైన ప్రవర్తన మాత్రమే ఈ లోకం నుండి వచ్చే లోకానికి మనం తీసుకువెళ్ళగల ఐశ్వర్యం. ఈ లోకంలో క్రీస్తు ఉప దేశాన్ని అనుసరించి నివసించినవారే దైవికమైన ప్రతీ సాధనను తమతో పరలోక నివసాల్లోకి తీసుకువెళ్ళగలుగుతారు. పరలోకంలో మనం నిత్యం అభివృద్ధి చెందాల్సి ఉంది. అందువలన ఈ జీవితంలో ప్రవర్తనను నిర్మించుకోవటం ఎంత ప్రాముఖ్యం! క్రియాత్మకమైన సంపూర్ణత్వాన్ని చేరే ప్రవర్తనను స్తిర విశ్వాసంతో అన్వేషించే ప్రతీ మానవ ప్రతినిధితో పరలోక జ్ఞానులు కలసి పనిచేస్తారు. ఈ పనిలో నిమగ్నమై ప్రతీ వారితో క్రీస్తు నేను మీకు సహాయం చెయ్యటానికి మీ కుడిపక్క నిలిచి ఉన్నాను అంటున్నాడు.COLTel 280.1

    మానవుడి చిత్తం దేవుని చిత్తంలో సహకరించినప్పుడు అది సర్వశక్తిమంతమౌతుంది. ఆయన ఆజ్ఞ మేరకు ఏది జరగాల్సి ఉందో అది ఆయన శక్తితో సాధించటం జరుగుతుంది. ఆయన ఆజ్ఞల్ని ఆచరణ సాధ్యాలవుతాయి.COLTel 280.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents