Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    11—కొత్త పదార్థాలు పాత పదార్థాలు

    ఆధారం : మత్తయి 13:51,52

    క్రీస్తు ఈ ఉపమానాన్ని చెబుతున్నప్పుడు తమ భవిష్యత్తు సేవకు తన శిష్యులికి శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఆయన ఉపదేశం అంతటిలోను వారికి పాఠాలున్నాయి. వల ఉపమానాన్నిచ్చిన తరువాత “వీటన్నింటిని మీరు గ్రహించితిరా”అని అడిగాడు. “గ్రహించితిమి” అని వారు బదులు పలికారు. అంతట తాము పొందిన సత్యాల సందర్భముగా మరొక ఉపమానంలో తమబాధ్యతను వారి ముందు పెట్టాడు.“అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్ధములను పాత పదార్దములను వెలుపలకి తెచ్చు ఇంటి యాజమానుని పోలి యున్నాడు” అన్నాడు.COLTel 93.1

    ఇంటి యాజమానుడు సంపాదించిన ధనాన్ని అక్రమంగా నిల్వ చెయ్యడు. ఇతరులకి ఇవ్వటానికి దాన్ని వెలుపలికి తెస్తాడు. వినియో గించటంవల్ల అతడి ధనం వృద్ధి అవుతుంది. ఇంటియాజమానుడికి పాతవి కొత్తవి అయిన విలువైన పదార్ధాలున్నాయి. అలాగే తాను తన శిష్యులికి ఇచ్చిన సత్యాన్ని వారు లోకానికి అందించాల్సి ఉందని క్రీస్తు బోధిస్తున్నాడు. సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని అందించే కొద్ది, అది వృద్ధి అవుతుంది. COLTel 93.2

    హృదయపూర్వకంగా సత్యాన్ని స్వీకరించిన వారందరూ దాన్ని ప్రకటించాలని ఆశపడ్డారు. దివ్యమైన క్రీస్తు ప్రేమ వ్యక్తమవ్వాలి. క్రీస్తును విశ్వసించినవారు తమ అనుభవాన్ని ఇతరులికి చెబుతారు. పరిశుద్దాత్మ తమను అడుగడుగన నడిపించిన నడిపింపు, దేవుని గురించి ఆయన పంపిన క్రీస్తును తెలిసుకోవాలన్న తమ తపనన, లేఖన పరిశోధన ఫలితాలు, తమప్రార్ధనలు, తమ హృదయ వేదన,“నీ పాపములు క్షమించబడి యున్నవి” అని క్రీస్తు తమతో అన్న మాటలు వారు ఇతరులికి చెప్పాలి. ఈవిషయాల్ని రహస్యంగా ఉంచటం స్వాభావికం కాదు. క్రీస్తు ప్రేమ హృదయాల నిండా ఉన్నావారు వాటిని దాచరు. పవిత్ర సత్యానికి ప్రభువు వారిని ఏ మేరకు ధర్మకర్తలుగా నియమించాడో ఇతరులికి కూడా ఆ దీవెనను పొందాలన్న ఆకాంక్ష ఆ మేరకు ఉంటుంది. దైవకృపా ధననిధుల్ని వారు వెల్లడి చేసే కొద్ది వారికి క్రీస్తు కృపను మరింత అనుగ్రహించటం జరగుతుంది. సామన్యతలోను, తు.చ తప్పని విధేయతలోను వారికి చిన్న పిల్లల వంటి హృదయాలుంటాయి. వారి ఆత్మలు పరిశుద్ధత కోసం దాహన్ని కలిగి ఉంటాయి. ప్రపంచమంత పంచుకునేందుకు సత్యం, కృపా ధననిధులు వారికి వెల్లడి అవుతాయి.COLTel 93.3

    క్రీస్తు అనుచరుడు ఆయన వాక్యాన్ని నమ్మి, దాని ప్రకారం నివసించి నట్లయితే, అతడు గ్రహించి అభినందించలేని విజ్ఞానశాస్త్రం. ఏది ప్రకృతి ప్రపంచములో ఉండదు. సత్యాన్ని ఇతరులికి నేర్పు సాధనాల్ని అతడికి సమకూర్చనిదేది ప్రకృతిలో ఉండదు. ప్రకృతి విజ్ఞానానికి జ్ఞానానికి గని. సౌందర్యాన్ని ఆస్వాధించేటప్పుడు, నేలను సేద్యం చేయ్యటంలో పాఠాలిన్ని అధ్యయంన చేసేటప్పుడు మొక్కల పెరుగుదలలో భూమి, సముద్రం, ఆకాశంలోని అద్భుతాలన్నిటిలో సత్యాన్ని గూర్చి కొత్త భావన కలుగుతుంది. మనుషులతో దేవుడు వ్యవహరింటానికి సంబంధించిన మర్మాలు, ఆయన జ్ఞానం లోతులు, మానవజీవితంలో కనిపించే రీతిగా ఆయన తీర్పులు - ఇవన్నీ అపార ధననిధులకి నిలయంగా ఉన్నట్లు గ్రహిస్తాం.COLTel 94.1

    కాగా దేవుని గూర్చిన జ్ఞానం రాత పూర్వకంగా ఉన్న దైవ వాక్యంలోనే పతనమైన మానవుడికి అతి స్పష్టంగా వెల్లడయ్యింది. శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యానికి ఇది ధనాగారం.COLTel 94.2

    దైవ వాక్యమంటే పాత కొత్త నిబంధనలోని లేఖనాల సమూహం ఒకటి లేకుండా ఇంకొకటి పూర్తికాదు. పాత నిబంధనలోని సత్యాలు కొత్త నిబందన సత్యాలంత విలువ గలవి అని క్రీస్తు ప్రకటించాడు. క్రీస్తు నేడు మానవ విమోచకుడైనట్లే లోకం ఆరంభంలోను మానవుడికి విమోచకుడు. తన దైవత్వాన్ని మానవత్వంతో కప్పుకొని ఆయన మన లోకానికి రాకముందు ఆదాము, షేతు, హానోకు మోతూ షెల, నోవహులకు సువార్త సందేశం అందించుట జరిగింది. కనానులో అబ్రాహాము సొదొమలో లోతు ఈ వర్తమానాన్ని ప్రకటించారు. రానున్న విమోచకుడి గురించి నమ్మకమైన దైవే సేవకులు తరం తరువాత తరానికి ప్రకటించారు. యూదా వ్యవస్థలోని ఆచారాల్ని క్రీస్తే స్థాపించాడు. వారి బలి అర్పణ వ్యవస్థకు వారి మత కార్యక్రమాలు ఆచారాలన్నిటికి నిజరూపం పునాది ఆయనే. బలులు అర్పించినప్పుడు చిందిన రక్తం దేవుని గొర్రెపిల్ల బలిని సూచిం చింది. ఛాయారూపక అర్పణలు బలులన్నీ ఆయనలో నెరవేరాయి. COLTel 94.3

    పితరులికి ప్రత్యక్షితుడైనట్లు బలి అర్పణ సేవ సూచించినట్లు, ప్రవక్తలు వెల్లడించినట్లు పాత నిబంధన ఐశ్వర్యం క్రీస్తే. తన జీవితంలోను మరణంలోను పునరుత్థానంలోను పరిశుద్దాత్మ తన్ను బయలుపర్చినట్లు గాను కొత్త నిబంధన అమూల్య ధన నిధి క్రీస్తే. తండ్రి మహిమకు బాహ్య ప్రకాశమైన మన రక్షకుడు పాత కొత్త నిబంధనలు.COLTel 95.1

    ప్రవక్తలు ముందే చెప్పిన క్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానాల్ని గూర్చి అపొస్తలులు సాక్ష్యమివ్వాల్సి ఉన్నారు. పరాభవం అవమానం పొందిన క్రీస్తు. పరిశుద్దుడైన, క్రీస్తు, ప్రేమామయుడైన క్రీస్తు వారి ప్రధానంశం కావాల్సి ఉంది. సంపూర్ణ సువార్తను ప్రకటించటానికి, తన జీవితంలోను ఏ బోధనల్లోను వెల్లడైనట్లు గాక, ప్రవక్తలు పాత నిబంధనలో ముందే ఇచ్చినట్లు బలి అర్పణ సేవలో సంకేతాత్మకంగా సూచించినట్లు వారు రక్షకుణ్ణి సమర్పించాల్సి ఉన్నారు.COLTel 95.2

    తన బోధనలో క్రీస్తు పాత సత్యాల్ని సమర్పించాడు. ఆ సత్యాలికి కర్త అయనే. అవి ఆయనే పితరుల ద్వారాను ప్రవక్తల ద్వారాను పలికిన సత్యాలు. అయితే ఇప్పుడు వాటి మీద కొత్త వెలుగును చిమ్మాడు. వాటి అర్థం ఎంత వత్యాసంగా ఉంది! ఆయన ఇచ్చిన వివరణలో గొప్ప వెలుగు గొప్ప ఆధ్మాత్మిక ఉన్నాయి. తమకు దైవ వాక్యం ఎల్లప్పుడు సుభోదక మయ్యేందుకు పరిశుద్దాత్మ తమను చైతన్యపర్చుతాడని ఆయన శిష్యులికి వాగ్దానం చేసాడు.అప్పుడు వారు సత్యాన్ని నూతనంగాను రమ్యంగాను సమర్పించగలుగుతారు. ఏదెనులో విమోచన తాలూకు మొదటి వాగ్దానాన్ని ఉచ్చరించినప్పటి నుంచి క్రీస్తు జీవితం. ప్రవర్తన, మధ్యవర్తిత్వ ఎవరిద్వారా వెలుగులో సమర్పించరాదు. విమోచన సత్యాలు నిత్యం వృద్ది చెంది విస్తరించే సామార్ధ్యం కలవి. పాతవైనప్పటికి అవి ఎప్పుడు కొత్తవే. సత్యాన్వేషకుడికి అవి మరింత మహిమను మరింత శక్తిని ప్రదర్శిస్తాయి.COLTel 95.3

    “ప్రతీ యుగంలోను సత్యానికి ఒక నూతన పరిణామం ఉంటుంది. తరంలోని ప్రజలకి దేవుని వర్తమానం ఉంటుంది. పాత సత్యాలన్నీ ప్రాముఖ్యమే కొత్త సత్యం పాత సత్యంతో సంబంధం లేకుండా స్వంత్రంగా ఉండదు. దాన్ని విస్తరిస్తుంది. పాత సత్యాల్ని అవగాహన చేసుకుంటనే నూతన సత్యాల్ని గ్రహించగలుగుతాం. తన పునరుత్థాన సత్యాన్ని తన శిష్యులికి తెలపాలని క్రీస్తు అనుకున్నప్పుడు ఆయన ‘మో షేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వరముల భావము వారికి తెలిపెను”. లూకా 24:27 కాని తాజాగా వెల్లడయ్యే సత్యంలో ప్రకాశించే వెలుగే పాత సత్యాన్ని వెలుగుతో నింపుతుంది. కొత్త వెలుగును తోసిపుచ్చేవాడు లేక నిర్లక్ష్యం చేసేవాడు నిజంగా పాత సత్యాన్ని కలిగిలేడు. అది అతడికి శక్తి లేని మతం ప్రాణాంలేని ఆకారం అవుతుంది.COLTel 96.1

    పాత నిబంధన సత్యాల్ని నమ్ముతున్నామని వాటిని బోధిస్తున్నామని చెప్పుకుంటూ కొత్త నిబంధన సత్యాల్ని తోసిపుచ్చేవారున్నారు. అయితే క్రీస్తు బోధనల్ని నిరాకరించటంలో పితరులు ప్రవక్తల బోధనల్ని నమ్మునట్లు చూపించుకుంటున్నారు. “అతడు నన్ను గూర్చి వ్రాసెను కనుక మీరు మోషేను నమ్మినట్లయిన నన్నును నమ్ముదురు” (యోహా 5:46) అన్నాడు. క్రీస్తు. కనుక వారి పాత నిబంధన బోధనల్లో సయితం నిజమైన శక్తి లేదు. “అనే నన్న గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” (యోహా 5:39) అని క్రీస్తు వర్ణించిన పాత నిబంధన లేఖనాల్ని వారు తోసిపుచ్చారు. పాత నిబంధనను నిరాకరించటంలో వారు వాస్తవంలో కొత్త నిబంధనను తోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే ఈ రెండు విడదీయలేని మొత్తంలో భాగాలు. ధర్మశాస్త్రాన్ని మినహాయించి సువార్తను, సువార్తను మినహాయించి ధర్మశాస్త్రాన్ని ఎవరూ సమర్పించలేరు. ధర్మశాస్త్రం మూర్తి భవించిన సువార్త, సువార్త వెల్లడయిన ధర్మశాస్త్రం,. ధర్మశాస్త్రం వేరు. సువార్త పరిమళం వెదజల్లే పుష్పం. అది ఫలించే ఫలం.COLTel 96.2

    పాత నిబంధన కొత్త నిబంధనపై వెలుగు విరజిమ్ముతుంది. కొత్త నిబంధన పాత నిబంధన పై వెలుగు విరజిమ్ముతుంది. ఈ రెండూ క్రీస్తులో దేవుని మహిమను వెల్లడి చేస్తున్నాయి. పట్టుదలతో వెదకే వ్యక్తికి నిత్యం లోతైన నూతన భావాలు బయలుపర్చే సత్యాలు రెండు అందిస్తాయి. క్రీస్తులో ఉన్న సత్యం ఆయన ద్వారా వచ్చే సత్యం పరిమితులు లేనిది. దాని లోతుల్లోకి చూస్తుంటే మరింత లోతుగా మరింత వెడల్పుగా కనిపించే నీటి ఊటల్లోకి చూస్తున్నట్లు ఉంటుంది. లేఖన విద్యార్ధి పరిస్థితి. మన పాపాల ప్రాయశ్చితార్థం తన కుమారుణ్ణి ఇవ్వటంలో దేవుని ప్రేమ మర్మాన్ని మనం ఈ జీవితంలో అవగాహన చేసుకోలేం. ఈ భూమి పై మన రక్షకుని పరిచర్య మన అత్యున్నత ఊహకందని అంశంగా ఇప్పుడు ఇకముందు ఎల్లప్పుడు ఉంటుంది. ఈ మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మానవుడు తన మానసిక శక్తి అంతటిని వినియోగించవచ్చుగాక. అతడి మనసు బలహీనపడి అలసిపోతుంది. శ్రద్ధ ఫలితాలు గల అన్వేషకుడికి అనంతమైన, తీరంలేని సముద్రమే కనిపిస్తుంది.COLTel 97.1

    యేసులో ఉన్న రీతిగా సత్యాన్ని అనుభవపూర్కంగా తెలుసుకోవడం సాధ్యం కావచ్చు అని దాన్ని విశదీకరించటం సాధ్యం కాదు. దాని ఎత్తు వెడల్పులోతు మన జ్ఞానానికి మించనవి. మనం మన ఊహ శక్తి అంతటిని వినియోగించినా విశదం చెయ్యలేని ఆకాశమంత ఎత్తయినదైనా, దేవుని స్వరూపాన్ని మానవాళి పై ముద్రించటానికి కిందకు వంగిన ప్రేమను మనం మసకమసకగా రేఖా మాత్రంగా మాత్రమే చూడగలుగుతాం.COLTel 97.2

    అయినా దివ్య దయాళుత్వాన్ని మనం తాళగలిగినదంతా చూడటం మనకు సాధ్యమే. ఇది వినయమనసు విరిగినలిగిన హృదయం గలవారికి వెల్లడి చేయబడుంది. ఆయన మన నిమిత్తం చేసిన త్యాగాన్ని మనం అభినందించే నిష్పత్తిలో దేవుని దయాళుత్వాన్ని అవగాహన చేసుకుంటాం. దీన హృదయంతో దైవ వాక్యన్ని అధ్యయనం చేస్తుండగా మహత్తరమైన విమోచనాంశం మన ప రిశోధనకు మన దృష్టికి వస్తుంది. దాన్ని మనం చూసేకొద్ది దాని కాంతి అధికమౌతుంది. దాన్ని గ్రహించటానికి మనం ఆశతో ఆసక్తితో ప్రయత్నించినపుడు దాని ఎత్తు, దాని లోతు పెరుగుతాయి.COLTel 97.3

    మన జీవితం క్రీస్తు జీవితంతో ముడిపడి ఉండాలి. మనం సర్వదా ఆయన నుంచి శక్తిని పొందాలి. పరలోకం నుంచి వచ్చిన జీవాహారం అయిన ఆయన్ని భుజించాలి.నిత్యంతాజాగా,నిత్యం తన ధన నిధుల నుంచి సమృద్ధిగా ఇచ్చే ఆ ఊట నుంచి మనం చేదుకోవాలి. మనం నిత్యం ప్రభువుని మనముంచుకొని, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లిస్తే,మన మతపరమైన జీవితంలో నిత్యం తాజాతనం ఉంటుంది.మన ప్రార్ధనలు ఒక స్నేహితుడితో మాట్లాడున్నట్లు దేవునితో సంభాషిస్తున్నట్లు ఉంటాయి. తన మార్మల్ని ఆయన మనతో వ్యక్తిగతంగా చర్చిస్తాడు. క్రీస్తు సముఖపు ఆనందం మనకు తరచుగా కలుగుతుంది. హనోకుతో ఉన్న రీతిగా మనతో సహవాసం చెయ్యటానికి ఆయన మనల్ని సమీపించిన పుడు మన హృదయాలు మనలో మండుతాయి. ఇది నిజంగా క్రైస్తవడి అనుభవం అయినప్పుడు అతడి జీవితంలో సామాన్యత, అణకువ, సాత్వికం, దీనత్వం చోటుచేసుకంటాయి. అతడు క్రీస్తుతో ఉన్నాడని, ఆయన వద్ద ఉపదేశం పొందాడని తాను ఎవరితో సహవాసం చేస్తాడో వారికి అవి చాటి చెబుతాయి.COLTel 98.1

    ఇవి వున్నవారిలో క్రీస్తు మతం శక్తినిచ్చే సూత్రంగా, సజీవమైన చైతన్యవంతమైన ఆధ్యాత్మిక శక్తిగా దాన్ని అది వెల్లడి చేసుకుంటుంది. యౌవన జనం తాలూకు తాజాతనం, శక్తి ఉత్సాహానందాలు వ్యక్తిగతంగా ప్రదర్శితమవుతాయి.దైవ వాక్యాన్ని స్వీకరించే హృదయం ఆవిరి అయి పోయిన నీటగుంట, పగిలిపోయని నీటితొట్టివంటిది కాదు. అది నిత్యం ప్రవహించే ఊటలు గల కొండ ఏరువంటిది. దాని చల్లని ధగదగ మెరుస్తూ రాతి బండల పైకి ఎగిసి పెడుతూ పరుగులు తీసే నీరు, అలసి, దాహంతో బాధపడుతున్నవారిని సేద తీర్చుతుంది.COLTel 98.2

    ఈ అనుభవం సత్యాన్ని బోధించే ప్రతీ బోధకుడికి క్రీస్తు రాయబారి అయ్యే అర్హతల్ని ఇస్తుంది. క్రీస్తు బోధన స్పూర్తి అతడి బోధలకు ప్రార్ధనలకు శక్తిని నిర్దిష్టతను ఇస్తుంది. క్రీస్తుని గూర్చిన అతడి సాక్ష్యం సంకుచితంగా నిర్జీవంగా ఉండదు. బోధకుడు మళ్ళీ మళ్ళీ అవే ప్రసంగాలు చెయ్యడు. పరిశుద్దాత్మ చైతన్యానికి అతడి మనసు నిత్యం తెరిచి ఉంటుంది.COLTel 98.3

    క్రీస్తు ఇలా అన్నాడు. “నా శరీరము తిని నారక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు...జీవముగల తండ్రి నన్ను పం పెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును... ఆత్మయే జీవింపజేయుచున్నది... నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి”. యోహా 6:54-63COLTel 99.1

    మనం క్రీస్తు శరీరం తిని రక్తం తాగినప్పుడు మన పరిచర్యలో నిత్యజీవ పదార్థం ఉంటుంది. నిస్సారమైన తరుచుగా పునరావృతమయ్యే అభిప్రాయాలు ఉండవు. ఆసక్తి రేకెత్తించని, చప్పిన ప్రసంగాలుండవు. పాత సత్యాల్ని సమర్పించటముటుంది. కాని వాటిని నూతన వెలుగులో సమర్పిరంచటం జరుగుతుంది. సత్యం విషయంలో ఒక నూతన అవగాహన కులుగుతుంది. అందరూ గ్రహించగల స్పష్టత, శక్తి అందులో ఉంటాయి. అలాంటి పరిచర్యలో కూర్చునే ఆధిక్యత గలవారు. పరిశు ద్దాత్మ ప్రభావానికి సముఖలైతే వారు నూతన జీవిత శక్తిని అనుభవ పూర్వకంగా తెలుసుకంటారు. సత్యం తాలూకు సౌందర్యాన్ని ఔన్నత్యాన్ని గ్రహించటానికి వారి గ్రహణ శక్తులు ఉత్తేజం పొందుతాయి. COLTel 99.2

    పిల్లలు యువతకు విద్య నేర్పే ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి. అన్నదాన్ని ఉపమానంలోని నమ్మకమైన గృహ యాజమానుడు సూచిస్తున్నాడు. అతడు దేవుని వాక్యాన్ని తన ఐశ్వర్యంగా ఎన్నుకుంటే నిత్యం కొత్త అందాన్ని కొత్త సత్యాన్ని వెలికి తెస్తాడు. ఉపాధ్యాయుడు ప్రార్ధన ద్వారా దేవుని మీద ఆధారపడ్డప్పుడు క్రీస్తు ఆత్మ అతడి మీదికి వస్తాడు. దేవుడు అతడి ద్వారాను పరిశుద్దాత్మ మూలంగాన ఇతరుల మనసుల్లో పనిచేస్తాడు. పరిశుద్దాత్మ మనసును హృదయాన్ని నిరీక్షణతోను ధైర్యంతోను, బైబిలు చిత్రాలతోను నింపుతాడు. ఇదంతా అతడు ఉపదేశం పొందుతున్న యువతకు అందించబడుతుంది.COLTel 99.3

    ఉపాధ్యాయుడి ఆత్మలో పరిశుద్ధ లేఖన వాక్కులు కలిగించే పరలోక శాంతి ఆనందాల ఊటలు, అతడితో సంబంధమున్న వారందంరిని దీవించటానికి ప్రభావవంతమైన పెద్దనది అవుతాయి. విద్యార్ధికి బైబిలు అయాసకరమైన పుస్తకమవ్వదు. విజ్ఞత గల ఉపదేశకుడు దైవవాక్యాన్ని విద్యార్థులికి ఆకర్షణీయం వాంఛనీయం చేస్తాడు. అది జీవాహారంలా ఉంటుంది. అది ఎప్పుడు పాతబడదు. దాని తాజాతనం రమ్యత పిల్లల్ని యువతను ఆకట్టుకుంటాయి. అది నిత్యం వెలుగును వేడిమిని ఇస్తూ అయినా ఎన్నడూ అలిసిపోకుండా భూమి పై ప్రకాశించే సూర్యునివంటిది.COLTel 99.4

    పరిశుద్ధమైన దేవుని విద్యను కలిపే ఆత్మ ఆయన వాక్యంలో ఉన్నది. ప్రతీ పూట నుంచి నూతనమైన ప్రశస్తమైన వెలుగు ప్రకాశిస్తుంది. ఇక్కడ సత్యం వెల్లడవుతుంది. దేవుని స్వరం ఆత్మతో మాట్లాడుతుండగా సమాయానికి ఉచితమైన రీతిలో మాటలు, వాక్యాలు ప్రకాశమంతవుతాయి. యువతతో మాట్లాడానికి, దైవ వాక్య, ధన, నిధుల్ని వాక్యం తాలూకు అందాల్ని వారికి ఆవష్కరించటానికి పరిశుద్దాత్మ ముచ్చటపడ్డాడు.ఆ మహో పాధ్యాయుడు పలికిన వాగ్దానాలు ఇంద్రియాల్ని ఆకర్షించి, ఆత్మను దైవిక, ఆధ్యాత్మిక శక్తితో చైతన్యవంతం చేస్తాయి. ఫలవంతమైన మనస్సులో దేవుని విషయాలతో పరిచయం పెరుగుతుంది. ఇవిశోధనకు అడ్డుకట్టగా ఉంటాయి.COLTel 100.1

    సత్యవాక్కుల ప్రాముఖ్యం పెరుగుతుంది వాటి భావం మనం ఎన్నడూ ఊహించని రీతిగా విశాలంగా సంపూర్తిగా ఉంటుంది.వాక్యసిరుల సౌందర్యం మనసును ప్రవర్తనను మార్చే ప్రభావం చూపిస్తుంది. హృదయం పై పరలోక ప్రేమ వెలుగు దైవావేశంలా పడుతుంది. బైబిలు పఠనం దానిపట్ల ఆసక్తిని పెంచుతుంది. ఏ పక్కకు తిరిగినా బైబిలు విద్యార్ధికి దేవుని అనంత జ్ఞానం ప్రేమ కనిపిస్తాయి.COLTel 100.2

    యూదు వ్యవస్థ ప్రాధాన్యం ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు. ఆచార కర్మలు, సంకేతాల అంధకారంలో విశాల గంభీర సత్యాలు మరుగై ఉన్నాయి. దాని మర్మాల్ని తెరిచే తాళపు చెవి సువార్త. విమోచన ప్రణాళిక జ్ఞానం ద్వారా దాని సత్యాల అవగాహనకు మార్గం ఏర్పడింది. ఈ చక్కని అంశాల్ని ఇప్పటికన్నా మెరుగగా అవగాహన చేసుకోవటం మన ఆధిక్యత. మనం లోతైన దైవ సంగతుల్ని అవగాహన చేసుకోవలి. విరిగి నలిగిన హృదయాలతో దైవ వాక్యాన్ని పరిశోధిస్తూ ఆయన మాత్రమే ఇవ్వగల జ్ఞానం పొడవు వెడల్పు లోతు ఎత్తు పెరుగుదల కోసం ప్రార్ధించే ప్రజలకు వెల్లడయ్యే సత్యాల్ని వీక్షించటానికి దేవదూతలు ముచ్చుటపడతారు.COLTel 100.3

    మనం లోక చరిత్ర అంతాన్ని సమీపిస్తుండగా చివరి దినాలికి సంబంధించి ప్రవచనాల్ని అధ్యయనం చెయ్యటం ఎంతైనా అవసరం. నూతన నిబంధన లేఖనాల్లో చివరి గ్రంథం మనం గ్రహించాల్సిన సత్యంతో నిండి ఉన్నది. సాతాను అనేకుల మనోనేత్రాలకి అంధత్యం కలిగించాడు. అందుచేత ఏదో సాకుతో వారు ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చెయ్యటం లేదు. అయితే చివరి దినాల్లో ఏమి జరగబోతున్నదో తన సేవకుడైన యోహాను ద్వారా క్రీస్తు ప్రకటించాడు. ఆయన ఇలా అంటున్నాడు. “సమయము సమీపించినది. గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడను. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులనుగైకొను వారును ధన్యులు”. ప్రక1:3COLTel 101.1

    “అద్వితీయ సత్య దేవుడైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్యజీవము” అని క్రీస్తు అన్నాడు. ఈ జ్ఞానం విలువను మనం ఎందుకు గుర్తించం? ఈ అద్భుత సత్యాలు ఎందుకు మన హృదయాల్లో ప్రకాశించటం లేదు? మన పెదవుల పై ఆడటం లేదు? మన శరీరమంతటా వ్యాపించటం లేదు ?COLTel 101.2

    తన వాక్యాన్నివ్వటంలో మన రక్షణకు అవసరమైన ప్రతీ సత్యాన్ని దేవుడు మనకిచ్చాడు. జీవితపు బావుల్లో నుండి వేల ప్రజలు నీళ్ళు చేదుకుంటున్నారు. అయినా నీటి సరఫరా తగ్గలేదు. వేల ప్రజలు ప్రభువుని తమ మందుంచుకొని వీక్షించటం ద్వారా ఆయన స్వరూపాన్ని సంతరించుకుంటున్నారు. తాము క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన తమను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పుకుంటూ ఆయన ప్రవర్తనను గురించి మాట్లాడేటప్పుడు వారి హృదయం వారిలో మండుతుంది. అయినా ఈ సత్యాన్వేషకులు ఈ సమున్నతమూ పరిశుద్ధమూ అయిన అంశాలన్నిటిని పూర్తిచెయ్యలేదు. రక్షణ మార్మన్ని పరిశోధించే పనిని ఇంకా వేలాది మంది చేపట్టవచ్చు. క్రీస్తు జీవితం మీద, ఆయన కర్తవ్య స్వభావం మీద గమనం నిలిపినప్పుడుసత్యాన్ని కనుగొనటానికి ప్రయత్నం జరిగిన ప్రతీసారి కాంతి కిరణాలు స్పష్టంగా ప్రకాశిస్తాయి. ప్రతీ తాజా అన్వేషణ క్రితం కన్నా ఇంకా ఎక్కువ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడి చేస్తుంది. అది ఎంతకీ తరగని అంశం.క్రీస్తు నరావతారం అధ్యయనం, ఆయన ప్రాయశ్చితార్థ బలిదానం, ఆయన మధ్యవర్తిత్వ సేవ, చిత్తశుద్దిగల విద్యార్థి జీవిత కాలమంతా అధ్యయనం చెయ్యవచ్చు. అంతులేని సంవత్సరాలతో సాగే పరలోకానికి ఎదురుచూస్తూ ‘దైవ భక్తినిగూర్చిన మర్మము గొప్పదైయున్నది” అని ఆశ్చర్యపోతాడు.COLTel 101.3

    ఇక్కడ పొందటానిక సాధ్యపడి ఉండి మనం పొందని వికాసాన్ని నిత్యత్వంలో పొందుతాం. విమోచన పొందిన వారి హృదయాలు, మనషులు నాలుకలు, విమోచనాంశాల్ని అధ్యయనం చేయటంలో నిత్యత్వ కాలం వినియోగమౌతుంది. శిష్యులికి బోధించటానికి క్రీస్తు ప్రయత్నించిన అంశాల్ని వారు అవగాహన చేసుకుంటారు. క్రీస్తు సంపూర్ణత్వం మహిమను గూర్చిన కొత్త అభిప్రాయాలు యుగయుగాల పొడవునా కనిపిస్తాయి. నమ్మకమైన గృహయాజమానుడు తన ధనాగారం నుంచి అనంత యుగాల పొడవున కొత్త పదార్థాల్ని పాత పదార్థాల్ని బయటికి తెస్తాడు.COLTel 102.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents