Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    20—ఆలాభం నష్టమే

    ఆధారం లూకా 12:13-21

    క్రీస్తు బోధిస్తున్నాడు. యథావిదిగా ఆయన శిష్యులే గాక ఇతరులు కూడా ఆయన చుట్టు సమావేశమయ్యారు. తాము పాత్ర పోషించాల్సి ఉన్న దృశ్యాల గురించి క్రీస్తు తన శిష్యులతో మాట్లాడున్నాడు. వారికి తాను అప్పగించిన సత్యాల్ని వారు ప్రచురించాల్సి ఉన్నారు. వారికి ఈ లోక పాలకులతో సంఘర్షణ ఏర్పడనుంది. తన నిమిత్తం వారు న్యాయ స్థానాల ముందు మేజిస్ట్రేటులు రాజులు ముందు నిలబడనున్నారు. తమకు ఎవరూ ఎదరు చెప్పలేని జ్ఞానాన్ని ఇస్తానని ఆయన భరోసా ఇచ్చాడు. జన సమూహాల హృదయాల్ని కదిలించి, ప్రత్యర్థుల్ని తికమక పెట్టిన ఆయన మాటలు. ఆయన తన అనుచురిలికి వాగ్దానం చేసిన పరిశుద్దాత్మశక్తిని గూర్చి సాక్షమిచ్చాయి.COLTel 206.1

    అనేక మంది దేవుని కృపను స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించటానికే ఆశించారు. సత్యాన్ని స్పష్టంగా వివరించుటలో క్రీస్తు ప్రదర్శించని అద్భుతమైన శక్తిని వారు గుర్తించారు. పరిపాలకులు న్యాయాధిపతుల ముందు మాట్లాడటానికి జ్ఞానాన్నిస్తానని తన అనుచరులికి ఆయన చేసిన వాగ్దానాన్ని వారు విన్నారు. తమలోక ప్రయోజనాలికి ఆయన తమకు శక్తిని ఇవ్వడా?COLTel 206.2

    “ఆ జనసమూహంలో ఒకడు - బోధకుడా; పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని” ఆయన్ని అడిగాడు. ఆస్తి పంపకాన్ని గురించి మోషే ద్వారా ప్రభువు ఉపదేశం ఇచ్చాడు. జ్యేష్టుడికి తండ్రి ఆస్తిలో రెండు రెట్లు వచ్చేది. (ద్వితీ 21:17) అతడి తమ్ముళ్ళకి సమాన భాగాలు వచ్చేవి. ఈ వ్యక్తి తన అన్న తనను మోసం చేసి తండ్రి ఆస్తిని దక్కించుకున్నాడని భావించాడు. తనదని తాను ఊహించిన ఆస్తిని పొందటానికి తన సొంత ప్రయత్నాలు బెడిసికొట్టునప్పుడు క్రీస్తు కలుగజేసుకుంటే తన కార్యం సఫలమౌతుందని భావించాడు. శాస్త్రులు పరిసయ్యుల్ని నిందిస్తూ ఆయన చేసిన హృదయాన్ని కదలించి ఏ విజ్ఞప్తుల్ని గంభీర ఖండనాల్ని అతడు విన్నాడు. అధికారంతో నిండిన అలాంటి మాటలు ఆయన తన సోదరుడితో మాట్లాడితే, తనకు రావలసిన భాగాన్ని ఇవ్వటానికి అతడు నిరాకరించడని ఆలోచించాడు.COLTel 206.3

    క్రీస్తు ఇస్తున్న గంభీర ఉపదేశం నడుమ, ఈ వ్యక్తి తన స్వార్ధపు స్థితిని కనపర్చుకున్నాడు.తన ఐహిక ప్రయోజనాల్ని వృద్ధి పర్చగల ఆప్రభువు ప్రతిభను అతడు అభినందించాడు. అయితే ఆధ్యాత్మిక సత్యాలు అతడు మనసు పై పట్టు సాధించలేదు.పిత్రార్జితాన్ని కైవసం చేసుకోవటమొక్కటే అతడి హృదయవాంఛ. మహిమ ప్రభువు, భాగ్యవంతుడు అయినా మన నిమత్తం బీదవాడైన యేసు దివ్య ప్రేమ నిధుల్ని అతడి ముందు పెడుతున్నాడు.“అక్షయమైనదియు, నిర్మలమైనదనియు వాడభారనిది యునైన” (1 పేతు 1:4) COLTel 207.1

    పిత్రార్జితానికి హక్కుదారుడు కావలసినదిగా పరిశుద్దాత్మ అతడితో విజ్ఞాపన చేస్తున్నాడు. అతడు క్రీస్తు శక్తిని నిదర్శనాన్ని చూసాడు. ఆ మహోపాధ్యయుణ్ణి కలవటానికి తన హృదయ వాంఛను ఆయనకు వ్యక్తం చేసుకోవటానికి ఇప్పుడు అతడికి తరుణం వచ్చింది. బనియన్ రచించిన రూపకంలో ఇతరులపై బురద చల్లే వ్యక్తిలా అతడి దృష్టి ఐహిక విషయాలపై కేంద్రీకృతమై ఉంది. తన శిరస్సు కు పైగా ఉన్న కిరిటాన్ని అతడు చూడలేదు. సిమియోను మాగస్ వలె అతడు దేవుని వరాన్ని లౌకిక ప్రయోజనం సాధించే సాధనంగా పరిగణించాడు.COLTel 207.2

    లోకంలో రక్షకుని పరిచర్య త్వరత్వరగా అంతంకావస్తుంది. తన కృపారాజ్య స్థాపనలో తన కర్తవ్యాన్ని ముగించటానికి ఆయనకి కొన్ని మాసాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా ఆయన్ని తన కర్తవ్యం నెరవేర్చకుండా ఆ భూపంపిణీ వివాదాన్ని తీర్చటానికి మానవుడి అత్యాశ అడ్డు తగిలేది. ఆయన జవాబు ఇది, “ఓయూ మీ మీద తీర్పరిగానైనను పంచి పెట్టువానిగానైనను నన్నెవడు నియమించెను”?COLTel 207.3

    ఏది న్యాయమో యేసు ఈ మనిషికి చెప్పగలిగేవాడే. ఈ సంరద్భములో ఏది న్యాయమో ఆయనకు తెలుసు. కాని సోదరులిద్దరూ దురాశపరులే కాబట్టి వారిద్దరూ తగువుపడుతున్నారు. వాస్తవానికి క్రీస్తు ఇలాంటి వివాదాల్ని తీర్చటం నాపని కాదని చెప్పాడు. ఆయన వేరొక కార్యాన్ని నిర్వహిచటానికి వచ్చాడు. ఆయన సువార్త ప్రకటించటానికి తద్వారా మనుషుల మనసుల్ని నిత్య సత్యాల పై నిలపటానికి వచ్చాడు.COLTel 207.4

    ఆయన పేరట సేవలందించే వారందరికి క్రీస్తు ఈ విషయం పై స్పందించటలో ఒక పాఠం ఉంది. తన పన్నెండుగురు శిష్యుల్ని పంపినప్పుడు ఆయన ఇలా అన్నాడు. “వెళ్ళుచు- పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠురోగులను, శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి”. మత్త 10:7,8 వారు ప్రజల లౌకిక వ్యవహారాల్ని చక్కపర్చుకూడదు. దేవునితో సమాధానపడటానకి మనుషుల్ని నడిపించటం వారి పని, మానవశ్రేయానికి పాటుపడటానికి వారికి ఈ సేవే శక్తినిస్తుంది.COLTel 208.1

    మానవుల పాపాలు దు:ఖాలకు పరిష్కారం క్రీస్తే. సమాజ రుగ్మతల్ని బాగుచేయగలది ఆయన కృపా సువార్త మాత్రమే. పేద వారిపట్ల ధనికుల అన్యాయం. ధనికుల పట్ల పేదల ద్వేషం వేరులు స్వార్ధస్వభావం ఉన్నాయి. క్రీస్తుకి లొంగి నివసించటం ద్వారా మాత్రమే దీన్ని నిర్మూలంచటం సాధ్యమవు తొంది. ఆయన మాత్రమే స్వార్దహృదయాన్ని తీసివేసి ప్రేమతో నిండిన నూతన హృదయాన్ని మనకిస్తాడు. క్రీస్తు సేవకులు పరలోకం నుంచి వచ్చిన ఆత్మతో సువార్త ప్రకటిస్తూ మానవ శ్రేయస్సు కోసం ఆయన పనిచేసినట్లు పనిచెయ్యలి. దాని పలితం మానవశక్తి సాధించలేని రీతిలో మావనాళికి జరిగే మేలులోను ఉన్నత స్థితిలోను ప్రదర్శితమౌతుంది. COLTel 208.2

    ఈ వ్యక్తిని ఆందోళన పర్చిన సమస్యను ఇలాంటి వివాదాలన్నిటిని వేళ్ళతో పెకలిస్తూ మన ప్రభువు ఇలా అన్నాడు. “మీరు ఏవిధమైన భయమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి, ఒకని కులిమి విస్తరించుట వాని జీవమునకు మూలముకాదు .COLTel 208.3

    “మరియు ఆయన వారితో ఈ ఉపవాసము చెప్పెను - ఒక ధనువంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు - నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకుని - నేనీలాగు చేతును. నా కొట్లు విప్పి, వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా, అనేక సంవత్సరములకు , విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు - వెట్టివాడా, యీరాత్రి నీ ప్రాణము నడుగు చున్నాను; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని వానితో చెప్పెను. దేవుని యెడల ధనవంతుడుకాక తన కొరకే సమకూర్చకొనువాడు అల ఆగుననే యుండనని చెప్పెను”. COLTel 208.4

    బుద్దిహీనుడైన ధనవంతుడి ఉపమానం ద్వారా, లోకానే తమ సర్వస్వంగా ఎంచుకునేవారి బుద్దిహీనతను క్రీస్తు ఎండగట్టాడు. ఈ వ్యక్తి తనకున్న సమస్తాన్నీ దేవుని వద్ద నుంచి పొందాడు. సూర్యకాంతి నీతిమంతుడి మీద దుష్టుడి మీద ఒకే రీతిగా పడుతుంది. మొక్కలు ఏపుగా పెరిగేటట్లు , పొలాలు సమృద్ధిగా పండేటట్లు ప్రభువు చేస్తాడు. తన పంటను ఏం చెయ్యాలని ఈ ధనవంతుడు సందిగ్ధంలో పడ్డాడు. అతడి కొట్లు ధాన్యంతో నిండిపోయాయి. తనకు అదనంగా పండిన పంటను నిల్వ చెయ్యటానికి స్థలం లేదు.COLTel 209.1

    తన భాగ్యమంతా ఎవరి వద్ద నుండి వస్తుందో ఆ దేవుణ్ణి గూర్చి అతడు ఆలోచించలేదు. అతడు బీదలకు సహాయం చేసేందుకు దేవుడు తనని తన ఆస్తి పై గృహ నిర్వాహకుడిగా నియమించాడని అతడు గుర్తించలేదు. దేవుని ధర్మకర్తగా వ్యవహరించే మంచి అవకాశం అతడికి కలిగింది. కాని అతడు సొంత సుఖసౌఖ్యాల కోసమే పాటుపడ్డాడు.COLTel 209.2

    బీదలు, దిక్కులేనివారు, విధవరాండ్రు, బాధలు శ్రమలు అనుభ విస్తున్నవారి పరిస్థితి. ఈ ధనువంతుడి దష్టికి వచ్చింది. అతడి వస్తువులు ఉంచటానికి అనేకమైన స్థలాలున్నాయి. అతడు తన సమృద్దిలో చిన్న భాగం ఇచ్చి ఉంటే అనేక కుటుంబాల లేమి నివారణ అయ్యేది. ఆకలితో బాధపడుతున్న అనేకులకు, ఆహారం, వస్త్రాలు లేని అనేకులకు వస్త్రాలు లభించేవి. అనేక హృదయాలు ఆనందంతో నిండేవి. ఆహారం కోసం వస్త్రాల కోసం చేసిన ఎన్నో ప్రార్ధనలు సఫలమయ్యేవి. మధురమైన స్తుతిగానం మిన్నంటేది ప్రభువు బీదల ప్రార్ధనల్ని అలకించాడు. ఆయన తన అనుగ్రహం చేత పేదలకు సదుపాయం ఏర్పాటు చేసాడు (కీర్త 68:10) అనేకుల అవసరాలు తీర్చటానికి ధనవంతుడు పేదల మొరలకు చెవులు మూసుకొని తన సేవకులతో ఇలా చెప్పాడు. “నేనీలాగు చేతును - నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో- ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది. నుఖించుము. తినుము, త్రాగుము నంతోషించుమని చెరప్పుకుందుననుకొనెను”,.COLTel 209.3

    ఈ మనుష్యుడి ధ్యేయాలు నశించిపోయే జంతువుల గురుగుల కన్నా గొప్పవి కావు. అతడు దేవుడు లేనట్లు, పరలోకం లేనట్లు భావి జీవితం లేనట్లు నివసించాడు. తనకున్నదంతా తనదే అన్నట్లు దేవునికి గాని మానవుడికి గాని తాను అచ్చిలేనన్నట్లు నివసించాడు.. “దేవుడు లేడని బుద్దిహీనులు తమ హృదయములో అనుకొందురు” (కీర్త 14:1) అంటూ కీర్తనకారుడు రాసినప్పుడు అతడు ఈ ధనువంతుణ్ణి వర్నించాడు.COLTel 210.1

    ఇతడు తన కోసమే నివసించాడు. తన కోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. భవిష్యత్తుకి సమృద్ధిగా సమకర్చుకున్నాడు. ఇప్పుడతడు తన శ్రమ ఫలాల్ని అనుభవించటం తప్ప ఇంకేమి లేదు. తాను అందరికన్నా ధన్యుణ్ణి పరిగణించుకున్నాడు. తన అభివృద్ధి తన వివేకం వ్యవహర దక్షత వల్ల సాధ్యమయ్యిందని అతిశయపడ్డాడు. తన పట్టణ పౌరులు అతణ్ణి జ్ఞాన వివేకాలు కలిగి వృద్ధి చెందుతున్న పుర ప్రముఖుడుగా గౌరవించారు. “నీకు నేవే మేలు చేసికొంటివని మనుష్యులు నిన్ను ” సుత్తిస్తారు. కీర్త 49:18COLTel 210.2

    అయితే “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెట్టితనము” 1 కొరి. 31:19.ఈ ధనవంతుడు ఎన్నో సంవత్సరాలు ఆనందించటానికి ఎదురు చూస్తుండగా, ప్రభువు ఎంతో వ్యత్యాసమైన ప్రణాళిక తయారు చేసాడు. అపనమ్మకస్తుడైన ఈ గృహ నిర్వాహకుడి “వెఱ్ఱవాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగు చున్నారు” అన్న వర్తమానం వచ్చింది. ఇది ద్రవ్యం సరఫరా చెయ్యలేని డిమాండు. అతడు దాచుకున్న ధనం ఆ తీర్పు నిలిపివేతను కొనలేదు. తన జీవిత కాలమంతా శ్రమపడి సంపాదించింది ఒక్క నిముషంలో అతడికి నిరర్ధకమయ్యింది. “నీవు సిద్ధపరచినవి ఎవరివగును”? అతడి విశాలమైన పొలాలు, ధాన్యంతో నిండిన కొట్లు అతడి అదుపులో నుంచి వెళ్ళిపోతాయి. ” వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు.”. కీర్త 39:6COLTel 210.3

    ఇప్పుడు అతడికి ఏది విలువగలదో దాన్ని అతడు సంపాదించలేదు. స్వార్ధాశలతో జీవించటంలో అతడు తన నోటి మనష్యుల పట్ల దయగా ప్రవహించగల దైవ ప్రేమను నిరాకరించాడు. ఇతడు ఆధ్యాత్మిక విషయాల బదులు ఐహిక ప్రయోజనాల్ని ఎంచుకున్నాడు. అందుకు వాటితోనే అతడు అంతం కావలసి ఉంది. ‘ఘనత నొంది యుండియు బుద్దిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు”. కీర్త 49:20COLTel 211.1

    “దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును” ఇది నిత్యసత్యం, మీరు మీ స్వార్ధ ప్రయోజనాల కోసమే ప్రణాళికలు రచించుకొని ధనం, సంపాదించుకొని పూర్వం బబులోను నిర్మాణకుల్లాగ ఎత్తయిన గొప్ప భవనాలు నిర్మించుకోవచ్చు. కాని నాశన దూత ప్రవేశించలేనంత ఎత్తయిన గోడ బలమైన గుమ్మం కట్టలేరు. రాజైన బెల్పస్సరు “గొప్ప విందు చేయించి” బంగారు వెండి ఇత్తడి ఇనుప కట్ట రాయి అను వాటితో చేసిన దేవతలను” స్తుతించాడు. అయితే అతడి గోడమీద ఒక అదృశ్యం హస్తం అతడి నాశన శాసనాన్ని లిఖించగా అతడి రాజభవనం గుమ్మాల వద్ద శతృసేనల పద ఘట్టనలు వినిపించాయి. “ఆ రాత్రి యందే కల్దీయుల రాజగు బెల్పస్సరు హతుడాయెను” అతడి సింహాసనంపై ఒక పరాయి రాజు కొలువుతీరాడు (దాని 5:30) స్వార్ధం కోసం నివసించటం నాశననానికి నడుపుతుంది. స్వలాభం కోసం పుట్టే అత్యాశ ఆత్మను నాశనానికి నడిపిస్తుంది. స్వార్ధానికి సమకూర్చుకోవటం సాతాను స్వభావం. ఇవ్వటం, ఇతరుల మేలు కోసం స్వార్ధాన్ని త్యాగం చేయ్యటం క్రీస్తు స్వభావం.COLTel 211.2

    “ఆ సాక్ష్యమేమనగా - దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారునియందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే”. 1 యెహా 5:11, 12COLTel 212.1

    ఈ హేతువు చేత “మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు” అని ఆయనన్నాడు.COLTel 212.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents