Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    26—“అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు”

    ఆధారం : లూకా 16:1-9

    ప్రజలు తీవ్ర లోకచింతలలో మునిగి ఉన్న సమయంలో క్రీస్తు రాకడ చోటు చేసుకుంది. మనుషులు నిత్యజీవితాసక్తులికి కాక లౌకికాసకులికి, భవిష్యత్తును గూర్చిన విషయాలికి గాన ప్రస్తుతాసక్తులికి ప్రాధాన్యం ఇచ్చారు. మిధ్యను వాస్తవమని వాస్తవాన్ని మిధ్య అని అపార్ధం చేసుకున్నారు. అదృశ్య ప్రపంచాన్ని విశ్వాసమూలంగా వీక్షించలేదు. ఈ జీవితానికి సంబంధించిన సుఖభోగాల్ని ఆకర్షణీయంగా, ప్రాముఖ్యం గల వాటిగా సాతాను వారి ముందుంచగా వారు అతడి శోధనలకు లొంగిపోయారు.COLTel 315.1

    క్రీస్తు ఈ పరిస్థితుల్ని మార్చటానికి వచ్చాడు. ఏ వశీకరణ శక్తి ద్వారా సాతాను వారిని ఆకట్టుకొని వంచించాడో దాన్ని నాశనం చెయ్యటానికి క్రీస్తు ప్రయత్నించాడు. ఇహ పరలోకాల హక్కుల్లో సమన్వయతను సాధించటానికి మనుషుల ఆలోచనల్ని ప్రస్తుతాన్నుంచి భవిష్యత్తుకు తిప్పాలని ఆయన తన బోధనలో ప్రయత్నించాడు. ప్రస్తుత జీవిత విషయాలికి తాము పెట్టే సమయంలో నిత్య జీవితానికి సంబంధించిన విషయాలికి కొంత సమయం కేటాయించాల్సిందంంటూ వారికి పిలుపునిచ్చాడు.COLTel 315.2

    ఆయన అన్నాడు. “ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకు డుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము” మోపబడింది. ఆ ధనవంతుడు తన ఆస్తిని ఆ సేవకుడి చేతికప్పటించాడు. అయితే అతడు అపనమ్మకస్తుడు. ఆ సేవకుడు తనను పద్ధతి ప్రకారం దోచుకుంటున్నాడని ధనవంతుడు గ్రహించాడు. అతణ్ణి తన పనిలో ఉంచుకోకూడదని నిశ్చయించుకొని అతడి లెక్కల దర్యాప్తుకు పూనుకున్నాడు. అతణ్ణి పిలిచి “నిన్ను గూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి ? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వహకుడవై యుండవల్లకాదు”అన్నాడు.COLTel 315.3

    ఉద్వాసన అవకాశాల్ని గుర్తించిన అతడు అవలంభించాల్సిన మూడు మార్గాలు కనిపించాయి. పనిచెయ్యటం,అడుక్కోవడం లేక ఆకలితో బాధ పడటం. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు. “నా యాజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును? త్రవ్వలేను ,భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను.నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనునటుఫ్రీ ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని తన యజామానుని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి - నీవు నా యాజ మానునికి ఎంత అచ్చియున్నావని మొదటి వానినడిగెను. వాడు - నూరు మణుగుల నూనె అని చెప్పగా - నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి బ్బడి మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను. తరువాత వాడు -నీవు ఎంత అచ్చియున్నానని మరియొకని నడుగగా వాడు- నూరు తూముల గోధములని చెప్పినప్పుడు వానితో - నీవు నీ చీటి తీసుకొని యెనుబది తమూలని వ్రాసికొమ్మని చెప్పెను”.COLTel 316.1

    అపనమ్మకస్తుడైన ఈ సేవకుడు తన అపనమ్మకం ఫలాన్ని తనతో ఇతరులు కూడా పంచుకునేటట్లు చేసాడు. వారికి లాభం చేకూర్చు కునేందుకు అతడు తన యాజమానుణ్ని మోసం చేసాడు. ఈ అక్రమ లాభాల్ని అంగీకరించటం ద్వారా తనను వారు తమగృహాల్లోకి మిత్రుడిగా అంగీకరించటానికి కట్టుబడి ఉన్నారు.“అపనమ్మకస్తుడైన ఈ సేవకుడు తన అపనమ్మకం ఫలాల్ని తనతో ఇతరులు కూడా పంచు కునేటట్లు చేసాడు. వారికి లాభం చేకూర్చు కునేందుకు అతడు తన యాజమాణ్ణి మోసం చేసాడు. ఈ అక్రమ లాభాన్ని అంగీకరించటం ద్వారా తనను వారు తమ గృహాల్లోకి మిత్రుడిగా అంగీకరించటానికి కట్టుబడి ఉన్నారు.COLTel 316.2

    “అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యాజమానుడు వాని మెచ్చుకొనెను. లౌకిక వ్యక్తి తన్ను మోసం చేసినవాడి యుక్తిని మెచ్చుకొనెనె”. కాని దేవుని మెచ్చుకొలు ఆ ధనవంతుడి మెచ్చుకోలువంటిది కాదు. ఆన్యాయస్థుడైన గృహ నిర్వాహకుణ్ణి క్రీస్తు మెచ్చుకోలేదు. కాని తను బోధించదలచిన పాఠాన్ని ఉదహరించనటానికి బాగా తెలిసిన ఆ ఘనను వినియోగించుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు. “అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుందురు”.COLTel 316.3

    సుంకరులు పాపులతో కలసి మెలిసి ఉంటున్నందుకు పరిసయ్యులు రక్షకున్ని విమర్శించారు. అయినా వారి పట్ల ఆయన ఆసక్తి తగ్గలేదు. వారి కోసం ఆయన కృషి ఆగలేదు. వారి ఉద్యోగం వారిని శోధనకు గురి చేస్తున్నదని ఆయన గ్రహించాడు. వారి చుట్టు దృష్టికి దుర్మార్గానికి ఆహ్వానం పలికే పరిస్థితులున్నాయి. మొదటి తప్పటడుగు సులభంగా పడింది. కిందికి రావటం వడివడిగా సాగి మరింత అపనమ్మకం మరింత నేరం చోటు చేసుకున్నాయి. ఉన్నతాశయాలికి ఉదాత్త సూత్రాలకు నడిపించేందుకు వారిని చేరటానికి క్రీస్తు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాడు. అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడి ఉపమనాంలో క్రీస్తు మనసులో ఉన్న ఉద్దేశం ఇది. ఉపమానంలో సూచించబడ్డ ఉదంతం లాంటిదే సుకంరుల మధ్య చోటు చేసుకున్నది. క్రీస్తు కథనంలో వారు తమ దురా చారాల్ని గుర్తించారు. వాటి పై వారి గమనం నిలిచింది. తమ అపనమ్మక కార్యాచరణ చిత్రం నుంచి అనేకమంది ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకున్నారు.COLTel 317.1

    క్రీస్తు ఈ ఉపమానాన్ని ప్రత్యక్షంగా శిష్యుల్ని ఉద్దేశించి మాట్లాడాడు ప్రప్రథముగా వారికి సత్యపు పులి వుండి అందించటం జరిగింది. వారి నుంచి అది ఇతరులికి అందాల్సి ఉంది. క్రీస్తు బోధనలో ఎక్కువ భాగం ఆదిలో శిస్యులు గ్రహించలేకపోయారు. ఆయన బోధించిన విషయాల్ని వారు తరుచుగా మర్చిపోయేవారు. అయితే పరిశుద్దాత్మ ప్రభావం క్రింద ఈ సత్యాలు అనంతరం పునరుజ్జీవం పొందాయి శిష్యులు వాటిని నూతన విశ్వాసులకి స్పష్టం చేసి వారిని సంఘంలో చేర్చారు.COLTel 317.2

    “ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి”. కీర్త 62:10 “నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు అకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును.” సామె 23:5 “తమ ఆస్తియై ప్రాపకమని నమ్మిం తమ ధన విస్తారతను బట్టి పొగడు కొనువారికి నేనేల భయపడవలెను? ఎవడును ఏవిధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు... దాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడును లేడు”. కీర్త 49:6,7,8.COLTel 317.3

    రక్షకుడు పరిసయ్యులతో కూడా మాట్లాడుతున్నాడు. శక్తిమంతమైన తన మాటల్ని వారు పరిగణిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వదులుకోలేదు. అనేకులు వాక్యాన్ని విని విశ్వసించారు. పరిశుద్దాత్మ నడుపుదల కింద మనుషులు సత్యాన్ని వినాలి గనుక చాలమంది క్రీస్తు విశ్వాసులవుతారని ఆయన నిరీక్షించాడు.COLTel 318.1

    తాను సుంకరులు పాపులతో మెలగువుతున్నాడన్న ఆరోపణలు సంధించటం ద్వారా క్రీస్తుని అప్రదిష్టపాలు చెయ్యాలని పరిసయ్యులు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఆయన ఆరోపణలు చేస్తున్న పరిసయ్యుల్ని దృష్టిలో పెట్టుకొని తన మందలింపును ఆచరిస్తున్నాడు. సుంకరుల మధ్య చోటు చేసుకున్న సన్నివేశంగా తెలిపిన ఘటనను పరిసయ్యులు ముందుంచుతున్నాడు. వారి కార్యాచరణ ధోరణనిని సూచించే సాధనం గాను, తమ తప్పిదాన్ని సవరించుకోగలిగే ఏకైక మార్గంగాను దాన్ని వారి ముందు పెడుతున్నాడు.యాజమానుడి ఆస్తి ఉపకారిక కార్యాల నిమిత్తం అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడికి అప్పగించటం జరిగింది. కాని అతడు దాన్ని తన కోసం ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలు సంరద్భంగా కూడా ఇదే జరిగింది. దేవుడు అబ్రాహాము సంతానాన్ని ఎంపిక చేసుకు న్నాడు. గొప్ప శక్తి ప్రదర్శనతో వారిని ఐగుప్త దాస్యం నుంచి విడిపించాడు. లోకానికి మేలుకలిగే నిమిత్తం ఆయన వారిని తన పరిశుద్ద సత్యానికి ధర్మకర్తలుగా నియమించాడు. వారు ఇతరులికి వెలుగును అందించే నిమిత్తం వారికి సజీవ దేవోక్తుల్ని అప్పగించాడు.COLTel 318.2

    అయితే తన గృహ నిర్వాహకులు ఆ వరాల్ని తమ్ముని తాము ధనవంతుల్ని చేసుకోవటానికి తమ్ముని తాము ఘనపర్చుకోవటానికి ఉపయోగించుకున్నారు. పరిసయ్యులు స్వార్ధపరత్వం స్వనీతితో నిండి, దేవుడు తన మహిమ కోసం వినియోగించాలని తమకు అప్పగించిన నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు.COLTel 318.3

    ఉపమానంలోని సేవకుడు భవిష్యత్తుకి ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేదు. ఇతరుల సహాయర్ధం తనకు అప్పగించబడ్డ నిధుల్ని తన కోసం ఉపయోగించుకున్నాడు. అతడు ప్రస్తుతాన్ని గురించి మాత్రమే ఆలోచించాడు. ఆ గృహ నిర్వాహకత్వ బాధ్యతను తీసివేసినప్పుడు అతడికి తనదంటూ ఏమి ఉండదు. అయితే తన యాజమాని ఆస్తి ఇంకా అతడి చేతిలోనే ఉంది. కనుక ఆ ఆస్తిని ఉపయోగించుకొని తనకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఈ కార్యసాధనకు అతడు కొత్త ప్రణాళిక పై పని చెయ్యాలి. తన నిమిత్తం సమకూర్చకోవటం కన్న ఆ ఆస్తిని ఇతరులికి ఇవ్వాలనుకున్నాడు. ఆ విధంగా అతడు మిత్రుల్ని సంపాదించవచ్చు. తనను పని నుంచి తీసివేస్తే వారు తనను ఆదుకుంటారని యోచించాడు. పరిసయ్యుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ గృహ నిర్వాహకత్వం త్వరలో వారి నుంచి తొలిగించబడనుంది. వారు తమ భవిష్యత్తుకు ఏర్పాట్లు చేసుకోవలసియున్నారు. ప్రస్తుత జీవితంలో దేవుని దీవెనల్ని ఇతరులికి ఇవ్వటం ద్వారా మాత్రమే వారు నిత్యజీవానికి ఏర్పాట్లు చేసుకోగలుగుతారు.COLTel 319.1

    ఉపమానం చెప్పిన తరువాత క్రీస్తు ఇలా అన్నాడు. “వెలుగు సంబంధులకంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులైయున్నారు. అంటే క్రైస్తవులమని చెప్పుకునేవారు దేవుని సేవ చెయ్యటంలో చూపించే జ్ఞానం చిత్తశుద్ధి కన్నా లోక సంబంధులు తమ కోసం నివసించటంలో చూపించే యుక్తి చిత్తశుద్ధి ఎక్కువని అర్ధం. క్రీస్తు దినాల్లో ఉన్న పరిస్థితి అదే. నేటి పరిస్థితి అదే. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న అనేకుల జీవితాలు చూడండి, ప్రభువు వారికి సామర్ధ్యాలు, శక్తి ప్రభావం ఇచ్చాడు.విమోచన మహాకార్యంలో తనతో కలిసి పని చెయ్యటానికి వారికి ద్రవ్యం అప్పగించాడు. మానవుల శ్రేయానికి బాధలో ఉన్నవారిని బీదలను అదుకోవటానికి ఈ వరాలన్నటిని వినియోగించాల్సి ఉంది. మనం ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టాలి. బట్టలు లేనివారికి బట్టలివ్వాలి. విధవ రాండ్రను తండ్రి లేని పిల్లల్ని ఆదరించాలి. దు:ఖంలో ఉన్న వారిని పీడిత ప్రజల్ని ఆదుకోవాలి. లోకమంతా విస్తరించి ఉన్న దు:ఖం, క్లేశం, బాధ దేవుడు ఉద్దేశించింది కాదు.COLTel 319.2

    ఒకడు జీవిత విలాసాలు సమృద్ధిగా కలిగి నివసించాలని కొందరి పిల్లలు తిండి లేక ఆకలితో అలమటించాలని దేవుడు ఉద్దేశించలేదు. జీవితావసరాలికి మించి ఉన్న డబ్బును మేలు చెయ్యటానికి మానవకోటి శ్రేయానికి ఉపయోగించేందుకు దేవుడు మానవుడికిచ్చాడు.“మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి” అని ప్రభువు అంటున్నాడు. (లూకా 12:33) వారు “ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునైయుండవలెను”1 తిమోతి 6:18 “నీవు విందు చేయునప్పుడు బీదలకు అంగహీనులకు కుంటి వాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము” లూకా 14:13. “దుర్మార్గులు కట్టిన కట్లను విప్పమొండి “కాడి మాను మోకులు తీ” యండి, ” బాధింపబడిన వారిని విడిపిం”చండి, “ప్రతి కాడిని విరుగ” గొట్టండి, మీ “ఆహారము ఆకలిగా ఉన్నవారికి ” పెట్టండి, “దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చు” కో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము” ఇవ్వు. యోష 58:6,7,10 “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి.'. మార్కు 16:15. ఇవి ప్రభువు ఇచ్చిన ఆదేశాలు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న కోట్లాది ప్రజలు ఈ పరిచర్య చేస్తున్నారా?COLTel 320.1

    ఆయ్యో దేవుని వరాల్ని తామే ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య ఎంత పెద్దది! ఎంతమంది ఇల్లు మీద ఇల్లు పొలం మీద పొలం సంపాదిస్తున్నారు! ఎంతమంది వినోదాలకు, విలాస భోజనాలికి, విలాస భవానాలికి, సామానుకి, బట్టలకి తమ ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నారు! సాటి మనుషులు దు:ఖంలో నేరంలో, వ్యాధి బాధల్లో పడి మరణిస్తున్నారు! మన దయావీక్షణానికి, మన నుంచి ఒక్క సానుభూతి పలుకును లేదా క్రియకు నోచుకోకుండా ఎంతమంది మరణిస్తున్నారు!COLTel 320.2

    మనుషులు దేవున్ని దోచుకుంటున్న అపరాధానికి పాల్పడుతున్నారు. మానవాళి బాధ ఉపశమనానికి, ఆత్మల రక్షణకు తమ ద్రవ్యాన్ని వినియోగించటం ద్వారా ఆయనకు తిరిగి వెళ్ళాల్సిన మహిమను ఆయనకు చెందకుండా తమ స్వార్ద క్రియలకు ఉపయోగించకోవటం ద్వారా దేవున్ని దోచుకుంటున్నారు. ఆయన తమకు అప్పగించిన ఆస్తిని స్వాహా చేస్తున్నారు. ప్రభువిలా అంటున్నాడు. ‘తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా..కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశు లకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదును. “మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరడుగుదురు. పదియవ భాగమున ప్రతిష్టితార్పణలను ఇయ్యక దొంగిలింతిరి., ఈ జనులందరును నా యొద్ద దొంగిలించునేయున్నారు. మీరు శాపగ్రస్తులైయున్నారు.” మలా 3:5,8, 9 “ఇదిగో ధనవంతులారా. మీ ధనము చెడిపోయెను. మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను. మీ బంగారమును మీ వెండియు తప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్షముగా ఉండి అగ్నివలె మీ శరీరమును తినివేయును అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి”. మీరు భూమి మీద సుఖముగా” నివసించారు. “ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొఱ్ఱపెట్టుకొనుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి”. యాకో 5:1-3,5,4COLTel 321.1

    ప్రతీ వ్యక్తి తాను పొందిన ఈవుల విషయంలో లెక్క అప్పజెప్పపలసి ఉంటుంది. దాచి పెట్టిన ధనం చివరి తీర్పు రోజున వారికి నిరూపయోగ మౌతుంది. వారు తమది అనటానికి వారికేమి ఉండదు.COLTel 321.2

    అన్యాయస్తుడైన గృహనిర్వాహకుడు తన ఐహిక పోషణకు ఏర్పాట్లు ఏమీ చేసుకోకుండా ఎలా బుద్దిహీనుడై ఉన్నాడో, లోక సంబంధమైన ధనం కూర్చకుంటూ తమ నిత్యజీవిత శ్రేయస్సు గురించి తక్కువ జ్ఞానం తక్కువ ఆశక్తి తక్కువ ఆలోచన కలవారు అంతకన్నా బుద్దిహీనులు. వెలుగు సంబంధులమని చెప్పుకునేవారు తమ తరాన్ని బట్టి చూడగా లోక సంబంధులకంటే తక్కువ యుక్తిపరులు. ఆ మహాతీర్పు దినాన్ని గూర్చిన దర్శనంలో ప్రవక్త ఎవరి గురించి ఇలా ప్రకటించాడో ఆ ప్రజలు వీరే, ” ఆది నమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచునప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు కొండగుహలలోను బండబీటులలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకున పారవేయుదురు. ‘యెష 2:20,21COLTel 321.3

    “అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులకు సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురు.” అన్నాడు క్రీస్తు. దేవుడు క్రీస్తు దూతలు అందరూ బాధలు శ్రమలు అనుభవిస్తున్న వారికి పాపులికి పరిచర్య చేస్తున్నారు. ఈ సేవకు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకుని, ఆయన వరాల్ని ఉపయోగిస్తే మీరు పరలోక వాసుల భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తారు. వారి హృదయాల్లో మీ హృదయాలు సానుభూతితో స్పందిస్తాయి. మీ ప్రవర్తనలు వారి ప్రవర్తనల్లా మార్తాయి. పరలోక నివాసాల్లో ఉండే మీరు మీకు పరదేశులుగా కనిపించరు. లోకంలో అన్నీ గతింంచిపోయినప్పుడు, పరలోక ద్వారపాలకులు మీకు స్వాగతం పలుకుతారు.COLTel 322.1

    ఇతరులికి మేలు చెయ్యటానికి ఉపయోగించిన ధనం ప్రతిఫలా లిస్తుంది. సవ్యంగా వినియుక్తమైన ద్రవ్యం గొప్ప మేళ్ళు సాదిస్తుంది,.. క్రీస్తుకి ఆత్మలను సంపాదించటానికి సాయపడుతుంది. జీవితానికి క్రీస్తు ప్రణాళికను అనుసరించే వ్యక్తి లోకంలో తాను ఎవరి రక్షణ కోసం పాటుబడి త్యాగాలు చేసాడో వారిని దేవుని రాజ్యంలో చూస్తాడు. విమోచన పొందినవారు తమ రక్షణకు సాధనలైనవారిని కృతజ్ఞతతో గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మల రక్షణ సేవలో నమ్మకంగా శ్రమించిన వారికి పరలోకం ప్రశస్తంగా ఉంటుంది. ఈ ఉపమానం బోధించే పాఠం అందరికి ఉద్దేశించింది. క్రీస్తు ద్వారా తాను పొందిన కృపకు ప్రతీ వ్యక్తి బాధ్యుడు. జీవితం చాలా గంభీరమైంది. దానిని ఐహిక విషయాల్లో నిమగ్నం చెయ్యకూడదు. ఆ నిత్యుడు అదృ శ్యుడు మనకు ఉపదేశించిది మనం ఇతరులికి అందించాలని ప్రభువు కోరుతున్నాడు.COLTel 322.2

    ప్రతీ ఏడు కోట్లాది ఆత్మలు హెచ్చరిక పొందకుండా రక్షణ లేకుండా నిత్య నాశనానికి గురి అవుతన్నారు. మనవ వివిధ జీవిత మార్గాల్లో ఆత్మల్ని చేరి రక్షించటానికి ప్రతి గడియలో మనకు ఎన్నో అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ అవకాశాలు నిత్యం వస్తూ పోతూ ఉంటాయి. వాటిని మనం సద్వినియోగపర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దినాలు వారాలు మాసాలు గడుస్తున్నాయి. మనం పని చెయ్యటానికి ఒకరోజు, ఒక వారం ఒక మాసం తక్కువగా ఉంటుంది,. ఎక్కువ కాలం బతికితే అదనంగా కొన్ని సంవత్సరాలకే. అంతట తిరస్కరించటానికి వీలు లేని స్వరం “నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము” అనటం వినిపిస్తుంది.COLTel 323.1

    మనలో ప్రతీ ఒక్కరూ వీటిని పరిగణించాలని క్రీస్తు కోరుతున్నాడు. చిత్తశుద్ధితో లెక్కలు వేసుకోండి. తక్కెడలో ఒక ప్రక్క క్రీస్తుని పెట్టండి. అంటే నిత్యం ధనం, జీవితం, సత్యం, పరలోకం, రక్షించబడ్డ ఆత్మల నిమిత్తం క్రీస్తు ఆనందం. తక్కిన పక్కలోకం ఇవ్వగల ప్రతీ ఆకర్షణ పెట్టండి. ఒక తక్కెడలో మీ సొంత ఆత్మను కోల్పోయిన నష్టం, మీరు ఒక సాధనంగా ఉపయుక్తమై రక్షించగలిగి ఉండే ఆత్మల్ని పెట్టండి. తక్కిన దానిలో మీ కొరకు వారి కొరకు దేవుని జీవితంలో సరితూగే జీవితం పెట్టండి. ప్రస్తుతాన్ని నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తూకం వెయ్యండి.మీరు ఈ పని చేస్తుండగా క్రీస్తు ఇలా అంటాడు. “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పొగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?” మార్కు 8:36COLTel 323.2

    ఐహిక విషయాల స్థానంలో మనం పౌరలౌకిక విషయాలు ఎంపిక చేసుకోవాలన్నది దేవుని కోరిక. ప్రభువు మనముందు పరలోక పెట్టుబడి అవకాశాల్ని పెడుతున్నాడు.ఆయన మన సమున్నత లక్ష్యాన్ని ప్రోత్సహిస్తాడు. మన శ్రేష్టమైన సంపదకు భద్రత కూర్చుతాడు. ఆయన అంటున్నాడు. “బంగారుకంటే మనుష్యులు ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను”. యెష 13:12 చిమ్మెట తినివేసే, తప్పు దహించివేసే ధనం పోయినప్పుడు క్రీస్తు అనుచరులు నశించని పరలోక ధనాన్ని సంపాదించుకుని ఆనందించవచ్చు.COLTel 323.3

    లోక స్నేహతుల స్నేహంకన్నా క్రీస్తు విమోచించినవారి స్నేహం ఉత్త మయ్యింది. లోకంలోని మిక్కిలి శ్రేష్టమైన రాజభవనానికి హక్కు కన్నా క్రీస్తు సిద్ధం చెయ్యటానికి వెళ్ళిన నివాసాలకు హక్కు ఉత్తమమయ్యింది. లోకంలోని ప్రశంసలన్నిటికన్నా రక్షకుడు తన నమ్మకమైన సేవకులతో చెప్పే ఈ మాటలు ఉత్తమమైనవి.“నా తండ్రి చేత ఆశీర్వధింపబడినవార లారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపర్చబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అక్కడికి దొంగలు రారు; చిమ్మెట కొట్టదు”. లూకా 6:38, 12:33 “ఇహమందు ధనవంతులైనవారు... మేలు చేయువారును సత్ క్రియలు అనుధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము”. 1 తిమో 6:17-19.COLTel 324.1

    అందుచేత మీ ఆస్తిని ముందే పరలోకానికి వెళ్ళనివ్వండి.. మీ ధనాన్ని దేవుని సింహాసనం పక్క దాచుకోండి. శోధింప శక్యంగాని క్రీస్తు ఐశ్వర్యానికి మీ హక్కును ధృడపర్చకోండి. “అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురు”.COLTel 324.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents