Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఈనాటి సంఘం

    ద్రాక్ష తోట ఉపమానం కేవలంయూద జాతికే వర్తించదు. అందులో మనకు కూడా పాఠం ఉంది. ఈ తరంలోని సంఘానికి దేవుడు గొప్ప ఆధిక్యతలు దీవెనలు ఇచ్చాడు. వాటికి ధీటైన ఫలాల కోసం ఆయన కని పెడుతున్నాడు. గొప్ప క్రయం చెల్లించి మనల్ని విమోచించటం జరిగింది. క్రయధనం విలువను బట్టి దాని ఫలితాన్ని మనం గ్రహించగలుగుతాం. ఏ భూమి దైవ కుమారుని కన్నీరు రక్తంతో చెమ్మగిల్లిందో ఆ భూమి మీదే, పరదైసు ప్రశస్త ఫలాలు ఉత్పత్తి కావలసి ఉన్నాయి. దైవవాక్యంలోని సత్యాలు దేవుని ప్రజల జీవితాల్లో వాటి మహిమను ఔన్నత్యాన్ని బయలుపర్చాల్సి ఉన్నాయి. తన ప్రజల ద్వారా క్రీస్తు తన ప్రవర్తనను తన రాజ్య సూత్రాల్ని ప్రదర్శించాల్సి ఉన్నాడు.COLTel 250.3

    దేవుడు చేసే పనిని వ్యతిరేకించటానికి సాతాను కృషి చేస్తాడు. తన సూత్రాల్ని అంగీకరించవలసిందంటూ మనుషుల్ని నిత్యం శోధిస్తూ ఉంటాడు. దేవుడు ప్రజల్ని మోసపోయిన ప్రజలుగా చిత్రిస్తాడు. సహోదరుల మీద నిందలు మోపుతాడు. నీతిని జరిగించే వారి మీద తన నిందాస్త్రాలను ప్రయోగిస్తాడు. తన ప్రజలు నీతి సూత్రాల ఆచరణ ఫలితాల్ని చూపించటం ద్వారా సాతాను ఆరోపణలకు సమాధానం చెప్పాలని ప్రభువు కోరుతున్నాడు.COLTel 251.1

    ఈ సూత్రాలు క్రైస్తవుడి వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, దేవుని సేవకు స్థాపితమైన ప్రతీ సంస్థలో ప్రదర్శితం కావాలి. అందురు లోకానికి చేయగల మేలుకి ప్రతీకారం కావాలి. సువార్త సత్యాలకున్న రక్షణ శక్తికి వారు చిహ్నాలు కావాలి. మావనజాతి నిమిత్తం దేవుని మహోద్దేశం నెరవేర్పులో అందరు సాధనాలు కావాలి.COLTel 251.2

    యూద నాయకులు వైభవోపేతమైన తమ దేవాలయం గురించి, తమ బ్రహ్మాండమైన మతాచార కర్మల గురించి అతిశయించేవారు. అయితే వారిలో న్యాయ దృష్టి, కరుణ, దేవునిపట్ల ప్రేమ లోపించాయి. ఆలయ విశిష్టత, శోభాయానమైన మతాచారాలు వారిని దేవునికి సిఫార్సు చెయ్యలేకపోయాయి. ఎందుకంటే ఏది మాత్రమే ఆయన దృష్టిలో విలువగలదో దాన్ని వారు అర్పించలేదు. దీనమైన, విరిగి, నలిగిన ఆత్మను వారు ఆయనకు అర్పించలేదు. దేవుని రాజ్య ముఖ్య నియామాలు నాశనమైనప్పుడు ఆచారాలు అధికమై ఆడంబరత పెరుగుతుంది. ప్రవర్తన నిర్మాణాన్ని ఆలక్ష్యం చేసినప్పుడు ఆత్మాలంకారం లోపించినప్పుడు సామన్య దైవభక్తిని విస్మరించినపుడు, గర్వం, ప్రదర్శనపట్ల మక్కువ, వైభవో పేతమైన దేవాలయాల్ని ఆకర్షణీయమైన అలంకరణల్ని బ్రహ్మాండమైన ఆచార కర్మల్ని కోరటం జరుగుతుంది. ఇందులో దేవునికి ఘనత మహిమలుండవు. ఆచార కర్మాలు, నటన, ప్రదర్శనతో కూడిన మతం దేవునికి సమ్మతం కాదు. అలాంటి మతారాధనలు పరలోక దూతల స్పందనను పొందలేవు.COLTel 251.3

    దేవుని దృష్టిలో సంఘం మిక్కిలి ప్రశస్తమైంది. వెలపటి ఆకర్షణల్ని బట్టి కాదు గాని లోకం నుంచి దాన్ని వేరు చేసే యధార్ధ భక్తిని బట్టి ఆయన దానికి విలువనిస్తాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానంలో సభ్యుల పెరుగుదల ప్రకారం. ఆద్యాథ్మికానుభవంతో వారి అభివృద్ధి ప్రకారం ఆయన దానికి విలువను కడతాడు.COLTel 252.1

    తన ద్రాక్షతోట నుంచి పరిశుద్దత నిస్వార్ధత ఫలాన్ని అందుకోవటానికి క్రీస్తు ఆకలిగా ఉన్నాడు. ప్రేమ మంచితనం సూత్రాల కోసం ఆయన వెదుకుతున్నాడు. క్రీస్తు ప్రతినిధుల్లో వెల్లడికావలసి ఉన్న సాధు స్వభావం ప్రవర్తన సౌందర్యంతో ఎంతటి కళాసౌందర్యమైనా సరిసాటి కాదు. విశ్వాసి ఆత్మను కృపావాతావరణం అవరించి ఉంటుంది. అతడి మనసు పైన హృదయం పైన పరిశుద్దాత్మ పని చేసి అతణ్ణి జీవార్ధమైన జీవపు వాసనను చేసిన అతడి సేవను దేవుడు దీవించటానికి యోగ్యమైన దానిగా చేస్తాడు. COLTel 252.2

    ఒక సంఘం దేశంలో అతి పెద్ద సంఘం కావచ్చు. దానికి వెలపటి ఆకర్షణ ఏమి లేకపోవచ్చు. సభ్యులు క్రీస్తు ప్రవర్తన నియమాల్ని కలిగి ఉంటే వారి ఆత్మల్లో ఆయన ఆనందం పొంగిపొర్లుతుంది. తమ ఆరాధనల్లో దేవదూతలు వారితో శ్రుతికలుపుతారు. కృతజ్ఞతహృదయాలు అర్పించే స్తుతి వందనాలు మధురమైన ఆహుతిగా దేవుని వద్దకు వెళ్లాయి.COLTel 252.3

    మనం తన దయాళుత్వాన్ని గూర్చితన శక్తిగా గూర్చి చెప్పాల్సిందిగా ప్రభువు కోరుతున్నాడు. స్తుతి వందనాల సమర్పణ ఆయన్ని ఘనపర్చు తుంది. “స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచున్నాడు”కీర్త 50:33 ఇశ్రాయేలు ప్రజలు తమ అరణ్య ప్రయాణం అంతటా పరిశుద్ధ గానంతో దేవుని స్తుతించారు. దేవుని ఆజ్ఞలు వాగ్దానానికి సంగీతం సమకూర్చి ఈ యాత్రిక ప్రయాణికులు తమ ప్రయాణమంతటా పాడుకున్నారు. కనానులో పరిశుద్ద పండుగలకు సమావేశమైనప్పుడు వారు దేవుని ఆశ్చర్యకార్యాల్ని గూర్చి చెప్పుకొని ఆయన నామానికి కృతజ్ఞతలు చెల్లించాల్సి ఉన్నారు.తన ప్రజల జీవితమంతా కృతజ్ఞతలు చెల్లిస్తూ సాగే జీవితమయ్యుండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరీతిగా ఆయన మార్గం” భూమి మీద... తెలియబడ” వలసి ఉంటుంది. ఆయన “రక్షణ” అన్ని జాతుల్లో వెల్లడి కావలసి ఉంది. (కీర్త 67:2)COLTel 252.4

    అలాగే ఇప్పుడు జరగాలి. లోక ప్రజలు ఆబద్ద దేవుళ్ళ దేవతలను పూజిస్తున్నారు. వారిని తమ తప్పుడు ఆరాధన నుంచి నిజదేవుని ఆరాధనకు నడిపించాలి. వారి విగ్రహాల్ని తెగటం ద్వారా గాక వారికి మెరుగైన దాన్ని చూపించటం ద్వారా ఈ కార్యాన్ని సాధించాలి. దేవుని మంచితనాన్ని దయాళుత్వాన్ని ప్రచురం చెయ్యాలి. “నేనే దేవుడను మీరు నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు ” యెష 43:12COLTel 253.1

    మనం విమోచన మహత్తర ప్రణాళిక అభినందించాలని, దైవ ప్రజలుగా మనకున్న ఆధిక్యతల్ని గ్రహించాలని, కృతజ్ఞతలు వందనర్పాణతో విధేయులమై తన ముందు నడవాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. నూతన జీవంతో ప్రతిదినం సంతోషాత్సాహాలతో తనను సేవించాలని అయన మనల్ని కోరుతున్నాడు. మన పేర్లు దేవుని గొర్రెపిల్ల గ్రంథంలో వ్రాయ బడ్డందుకు మనల్ని ప్రేమించే ఆ ప్రభువు పై మన భారాల్ని మోపగలందుకు మనం ఆనందించాల్సిందిగా ఆయన కోరుతున్నాడు. మనం ప్రభువు వారసత్వం గనుక, క్రీస్తు నీతి తన పరిశద్దుల తెల్లని వస్త్రం గనుక, మనకు రక్షకుని త్వరితాగమన నిరీక్షణ ఉన్నది గనుక మనల్ని ఆనందించండి అంటున్నాడాయన.COLTel 253.2

    దేవుని పరిపూర్ణంగా, హృదయశుద్దితో స్తుతించటం ప్రార్ధనలాగనే ఒక విధి. పతనమైన మానవాలి పట్ల దేవుని అద్భుత ప్రేమను అభినందిస్తున్నామని ఆయన ఆనంత సంపూర్ణత నుంచి మనం ఇంకా ఎక్కువ దీవెనలకు ఎదురుచూస్తున్నామని ప్రపంచానికి, పరలోకనివాసులికి చూపించాల్సి ఉన్నాం. మన అనుభవ గ్రంథంలో ప్రశస్తమైన అధ్యాయాల గురించి ఇప్పటికన్నా మరెక్కువగా మనం మాట్లాడం అవసరం. పరిశు ద్దాత్మ ప్రత్యేక కుమ్మరింపు అంనతరం, ప్రభువు నందు మన ఆనందం, ఆయన సేవలో మన సామర్ధ్యాన్ని ఆయన మంచితనం తన బిడ్డల పక్షంగా ఆయన అద్భుత కార్యాలు చెప్పుకోవటం ద్వారా అవి బహుగా వృద్ధి చెందుతాయి.COLTel 253.3

    ఈ అభ్యాసాలు సాతాను శక్తిని వెనక్కి నెట్టివేస్తాయి. అవి సణుగుకునే, పిర్యాదులు చేసే స్వభావాన్ని బహిష్కరిస్తాయి. శోధకుడికి పరాజయం కలుగుతుంది. భూనివాసుల్ని పరలోక భవనాల్లో నివసించటానికి యోగ్యుల్ని చేసే ప్రవర్తనను వారు నిర్మించుకుంటారు. అట్టి సాక్ష్యం ఇతరుల పై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది, మనుషుల్ని క్రీస్తు విశ్వాసులుగా మార్చటానికి ఇంతకన్నా శక్తిమంతమైన సాధనాల్ని ఉపయోగించలేం.COLTel 253.4

    నిశ్చితమైన ఆరాధనలో ఆయన నామ మహిమను పెంపు చేయటానికి మన శక్తి మేరకు కృషి చేస్తూ మనం స్తుతించాలి. మనం కూడా ఇచ్చేందుకు అదే రీతిగా లోకానికి తన ప్రవర్తనను వెల్లడి చేసేందుకు దేవుడు తన వరాల్ని మనకిస్తాడు. యూద వ్యవస్థలోని కానుకలు అర్పణలు దేవుని ఆరాధనలో అత్యవసర భాగంగా ఉండేవి. ఆలయ సేవల నిమిత్తం తమ ఆదాయంలో పదవభాగం ఇవ్వవలసినదిగా ఇశ్రాయేలీయులకి ఉపదేశించటం జరిగింది. ఇది గాక వారు పాప పరిహారం బలులు, స్వేచ్చార్పణలు, కృతజ్ఞతార్పణలు చెల్లించాల్సి ఉండేవి. ఇవి ఆ కాలంలోని సువార్త పరిచర్య నిర్వహణకు ఏర్పాటైన అర్ధిక వనరులు, పూర్వం తన ప్రజల నుంచి కోరిన దాని కన్నా నేడు మన నుంచి ఆయన తక్కువ కోరటం లేదు. ఆత్మల రక్షణార్ధం కొనసాగుతున్న మహత్తర పరిచర్య ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ పనికి ఆయన చేసిన ఏర్పాటు మన దశమ భాగాలు ,కానుకలు అర్పణలు, సువార్త సేవ ఈ రీతిగా పోషించబడాలని ఆయన సంకల్పించాడు. దశమ భాగం తనదని ప్రభువంటున్నాడు. ఆయన సేవ నిమితం ఆయన ధనాగారంలో ఉంచాల్సి పరిశుద్ధ నిధిగా దాన్ని నిత్యం పరిగణించాలి. ఆయన మన స్వేచ్చార్పణల్ని కృతజ్ఞతార్పణల్ని కూడా కోరుతున్నాడు. సువార్తను భూదిగంతాల వరకు ప్రచురించటానికి ఈ అర్పణలనన్నింటిని వినియోగించాల్సి ఉంది.COLTel 254.1

    దేవుని సేవలో వ్యక్తిగత పరిచర్య ఒక భాగం. లోకాన్ని రక్షించటంలో వ్యక్తిగత కృషి ద్వారా మన ఆయనకు సహకరించాలి. “మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి” (మార్కు 16:15) అన్న క్రీస్తు ఆదేశం ఆయన ఆనచురుల్లో ప్రతీ ఒక్కరికి ఆయన ఇచ్చిన ఆదేశం, క్రీస్తు జీవితానికి ఎంపిక చేసుకున్న వారందరూ తమ సాటి మనషుల రక్షణ కోసం పనిచెయ్యటానికి ఎంపిక చేసుకుంటారు. ఆత్మల కోసం ఆయనకున్న ఆకాంక్షే వారికి ఉంటుంది. ఆయన సేవలో అందరు ఒకే స్థానాన్ని ఆక్రమించలేరు. అయినా అందరికి ఒక స్థానం ఒకపని ఉంటుంది.COLTel 254.2

    ప్రాచీనకాలంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, తన సాత్వికం వివేకంతో మోషే వివిధ సమర్ధతలతో యెహోషువ సువార్త సేవ చేసారు. మిర్యాము సంగీతం, దెబోరా సాహసం, భక్తి రూతు ప్రేమ, సమూయేలు విధేయత, విశ్వసనీయత, ఏలియా విశ్వాసం, మెత్తబర్చి వశపర్చుకునే ఏలీషా ప్రభావం - అన్నీ ఆయన సేవకు అవసరమయ్యాయి. అలాగే దేవుని దీవెన ఎవరి మీద కుమ్మరింపుబడిందో వారందరూ వాస్తవకి సేవ చెయ్యటానికి స్పందించాల్సి ఉన్నారు. ఆయన రాజ్య వ్యాప్తికి ఆయన నామ మహిమకు ప్రతీ వరాన్ని వినియోగించాలి.COLTel 255.1

    క్రీస్తును వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించిన వారందరూ సువార్త సత్యాన్ని జీవితం పై దాని రక్షణ శక్తిని ప్రదర్శించాల్సి ఉన్నారు. దాని నెరవేర్పుకు ఏర్పాటు చేయ్యకుండా దేవుడు ఏ విధిని కోరడు. క్రీస్తు కృప ద్వారా మనం దేవుడు కోరే ప్రతి విధిని నెరవేర్చగలం. పరలోక సంపదంతా దేవుని ప్రజల ద్వారా వెల్లడి కావలసి ఉంది. క్రీస్తు ఇలా అంటున్నాడు. “మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు”. యోహా 15:8COLTel 255.2

    భూమి అంతా తన ద్రాక్షతోటని తానే దానిని హక్కుదారుణ్ణి అని దేవుడంటున్నాడు. అది ఇప్పుడు అపహర్త చేతుల్లో ఉన్నప్పటికి అది ఆయనది. సృష్టి మూలంగానే గాక విమోచన మూలంగాను అది ఆయనది. క్రీస్తు లోకం కోసం తన్ను తాను త్యాగం చేసుకున్నాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను... ఆయన తన అద్వితీయ కుమారుని... అనుగ్రహించెను” యోహా 3:16 ఆ ఒక్క వరం ద్వారా ప్రతీ ఇతర వరాన్ని దేవుడు మానవుడికి ఇస్తున్నాడు. సకల ప్రపంచం రోజుకు రోజు దేవుని దీవెనల్ని పొందుతున్నది. కృతజ్ఞత లేని మన మానవకోటి మీద పడే ప్రతీ వర్షపు చుక్క, ప్రతీ కాంతి కిరణం, ప్రతీ ఆకు, పువ్వు, పండు, దేవుని సహనం గురించి ఆయన గొప్ప ప్రేమను గురించి సాక్ష్యమిస్తుంది. COLTel 255.3

    ఈ ఆ గొప్ప దాతకు ఎవరైనా ఏమి తిరిగి ఇచ్చారు ? ఇవ్వగలరు ? దేవుని హక్కుల విషయంలో మనుష్యులు ఎలా వ్యవహరిస్తున్నారు? సామన్య ప్రజలు తమ జీవితాల్ని ఎవరి సేవకు అంకితం చేస్తున్నారు? వారు డడ్బుకి దాసులవుతున్నారు. ధనం, హోదా, వినోదాలు ఇవే లోకంలో వారి గురి, దోచకోవటం వల్ల డబ్బు గడిస్తున్నారు. మనుషుల్ని దోచుకోవటమే కాదు దేవున్ని కూడా దోచుకుంటున్నారు. మనుషులు తమ స్వార్ధాశల్ని తృప్తిపర్చుకోవటానికి దేవుని వరాల్ని వాడుకుంటున్నారు. అందుకో గలిగిన దాన్ని తమ దురాశలు శరీరాశలు తీర్చుకోవటానికి వినియోగించు కుంటున్నారు.COLTel 255.4

    నేడు ప్రపంచం చేస్తున్న పాపమే ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేసిన పాపం, దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవటం, అవకాశాలు దీవెనల్ని నిర్లక్ష్యం చేయ్యటం దేవుని వరాల్ని స్వార్ధానికి ఉపయోగించటం ఇశ్రాయేలుకి నాశనం కలిగించిన పాపాల్లో ఇవి కొన్ని. అవే ఈనాడు లోకం మీదికి నాశనాన్ని తెస్తున్నాయి.COLTel 256.1

    ఓలీవల కొండమీద నిలబడి యోరూషలేము పట్టణం వంక చూస్తు క్రీస్తు కార్చిన కన్నీరు కేవలం యోరూషలేము గురించే కార్చలేదు. యోరూషలేము దుర్గతిలో లోకం నాశనాన్ని ఆయన చూసాడు. “నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు; గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి యున్నవి” లూకా 19:42COLTel 256.2

    “ఈ నీ దినమందైనను”. ఆ దినం అంతమౌతున్నది. కృప ఆధిక్యతల కాలం దాదాపు సమాప్తమయ్యిందిది. ప్రతీకార మేఘాలు అలముకుంటు న్నాయి. దేవుని కృపను తోసిపుచ్చే వారు వేగంగా వస్తున్న ఎవరూ అడ్డుకోలేని నాశనంలో చిక్కుకున్నారు. అయినా లోకం నిద్రమత్తులో మునిగి ఉంది. ప్రజలు తమ నాశన సమయాన్ని ఎరగకుండా ఉన్నారు,.COLTel 256.3

    ఈ క్లిష్ట సమయంలో సంఘం ఎక్కడ ఉంటుంది? సంఘ సభ్యులు దేవుని హక్కుల్ని గౌరవిస్తున్నారా? ఆయన సువార్త దేశాన్ని నెరవేర్చుతున్నారా? ఆయన ప్రవర్తనను లోకానికి కనపర్చుతున్నారా? చివరి కృపా హెచ్చరిక వర్తమానాన్ని సాటి మానవుల దృష్టికి తెస్తున్నారా?COLTel 256.4

    మనుషులు ప్రమాదంలో ఉన్నారు. వేలాది ప్రజలు నశిస్తున్నారు. అయితే క్రీస్తు అనుచరులుగా చెప్పుకునే వారిలో ఎంత తక్కువ మందికి ఈ ఆత్మల విషయమై హృదయం భారంగా ఉంది! లోకం తాలూకు భవిష్యత్తు త్రాసులో వేలాడుతున్నది. అయిన మానవులికి ఇచ్చిన మిక్కిలి ప్రాముఖ్య సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పుకునే వారిని సయితం ఇది చలింపజెయ్యటం లేదు. పరలోక గృహాన్ని విడిచి పెట్టి మానతవ్వాన్ని స్పృశించి మానవత్వాన్ని దేహత్వం ఆకర్షించేందుకు గాను క్రీస్తును నడపించిన ప్రేమ లోపిస్తున్నది. దేవుని ప్రజల్ని స్తబ్దత, పక్షవాతం ఆవరించింది. ఆ క్లిష్ట సమయంలో తమ విధిని అవగాహన చేసుకోకుండా అది వారికి అడ్డు వస్తుంది.COLTel 256.5

    ఇశ్రాయేలీయుల కనానులో ప్రవేశించినపుడు ఆ దేశమంతటినీ స్వాధీనపర్చుకోకపోవటం ద్వారా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. కనానుని పాక్షికంగా జయించిన తరువాత వారు తమ విజయాల ఫలాల్ని అనుభవించ టానికి స్థిరపడ్డారు. అవిశ్వాసంతోను, సుఖ జీవితాసక్తితోను నిండి వారు నూతన భూభాగాన్ని అక్రమించుకవోటానికి ముందుకు సాగే బదులు తాము అప్పటికే జయించిన ప్రాంతాల్లో పోగుపడ్డారు.ఇలా వారు దేవుని నుంచి విడిపోవం మొదలు పెట్టారు.దేవుడు తమను ఆశర్వదిస్తానని చేసిన వాగ్దానాన్ని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో వారు విఫలమవ్వటం ఆయన నెరవేర్చటాన్ని ఆసాధ్యపర్చింది. నేటి సంఘం ఇదే పని చెయ్యటం లేదా?COLTel 257.1

    సువార్త ఆగత్యమైన ప్రపంపచంమతా తమ ముందుండగా, క్రైస్తవలమని చెప్పుకునేవారు సువార్తవాధిక్యతల్ని ఆనందంగా అనుభవించ గల స్థలాల్లో పోగుపడుతున్నారు. కొత్త ప్రాంతాల్ని ఆక్రమించు కోవలసిన అవసరాన్ని వారు గుర్తించరు. రక్షణ వర్తమానాన్ని ప్రాంతీయ హద్దులకు అవత ఉన్న భూబాగాలికి తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని గుర్తించరు. “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి” అంటూ క్రీస్తు ఇచ్చిన ఆను వారు నెరవేర్చరు (మార్కు 16:15) యూదు సంఘం కన్నా వారు తక్కువ అపరాధులా?COLTel 257.2

    క్రీస్తు అనుచరులమని చెప్పుకునేవారు పరలోక విశ్వం మందు తీర్పుకి నిలబడియున్నారు. దేవుని సేవలో వారి నిరుత్సాహం నిరసక్తత వారి బలహీన కృషి వారిని అపనమ్మకమైన విశ్వాసులుగా పేర్కొంటున్నాయి. తాము ప్రస్తుతం చేస్తున్న సేవ తమ ఉత్తమ సేవ అయితే వారికి ప్రశంసలు ఉండవు. అయితే వారి హృదయం సేవ యందు ఉండి ఉంటే వారు ఇంకా ఎక్కువ చేయగలిగేవారు.COLTel 257.3

    తాము ఆత్మార్పణ స్పూర్తిని సిలువను మోసే స్వభావాన్ని చాలావరకు కోల్పోయామని వారికి తెలుసు. లోకానికి తెలుసు. పరలోక గ్రంథాల్లో తమ పేళ్ళకు ఎదురుగా ఉత్పత్తిదారులు కారు. వాడకం దారులని రాయబడేవారు అనేకమంది ఉంటారు. క్రీస్తు నామం ధరించిన అనేకులు ఆయన మహిమను మసకబార్చుతున్నారు. ఆయన సౌందర్యాన్ని కప్పివేస్తున్నారు. ఆయన ఘనతను నిలపివేస్తున్నారు.COLTel 258.1

    సంఘ పుస్తకాల్లో తమ పేర్లున్నవారు అనేకమంది ఉన్నారు. కాని వారు క్రీస్తును ఆనుసరించేవారు కారు. వారు ఆయన ఉపదేశాన్ని అనుసరించరు. ఆయన సేవ చెయ్యరు. అందుచేత వారు సాతాను అదుపులో ఉన్నవారు. వారు మంచి ఏది చెయ్యటం లేదు. కనుక వారు గొప్ప హాని కలిగిస్తున్నారు. వారి జీవితం జీవార్ధమైన జీవపు వాసన కాదు గనుక అది మరణార్ధమైన రమణపు వాసన అయ్యింది.COLTel 258.2

    “అట్టి కార్యమలను బట్టి నేను దండించుకుందునా”? అంటున్నాడు ప్రభువు (యిర్మి 5:9) ఇశ్రాయేలు ఏ ప్రజలు తన ఉద్దేశాన్ని నెరవేర్చుటంలో విఫలులయ్యారు. గనుక దేవుడు వారిని పక్క పెట్టాడు. దేవుని పిలుపు ఇతరులికి అందించటం జరిగింది. ఈ ప్రజలు కూడా అలాగే అపనమ్మ కస్తులుగా నిరూపించుకంటే వారిని కూడా ఆయన అలాగే విసర్జించడా?COLTel 258.3

    ద్రాక్షతోట ఉపమానంలో క్రీస్తు వ్యవసాయకుల్ని అపరాధులుగా ప్రకటించాడు. తోట యాజమానికి కావలసిన ఫాలు ఇవ్వటానికి నిర్వా ‘రించింది వారే. వారు యూదు జాతిలో ప్రజల్ని తప్పుదారి పట్టించి దేవుడు కోరిన సేవలు చెయ్యకుండా ఆయన్ని దోచుకున్నావారు యాజకులు బోధకులే. జాతిని క్రీస్తుకి వ్యతిరేకంగా తిప్పినవారు వారే.COLTel 258.4

    విధేయతకు ప్రామాణికంగా క్రీస్తు దైవ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు సమర్పించాడు. ఇది రబ్బీల వైరుధ్యాన్ని రెచ్చగొట్టింది. వారు మనుషుల భోధనల్ని దైవ వాక్యానికన్నా ఉన్నత స్థాయిలో పెట్టి ప్రజల్ని దేవునికి దూరం చేసారు. దేవుని వాక్యానికి విధేయలవ్వటానికి వారు తమ మానవ కల్పి ఆజ్ఞల్ని విడిచి పెటానికి సమ్మతంగా లేరు. సత్యం నిమిత్తం వారు తమ జ్ఞానాతిశయాన్ని మనవ ప్రశంసను త్యాగం చేయటానికి సమ్మతించరు. క్రీస్తు దైవ విధుల్ని ప్రభోదిస్తూ ప్రజల వద్దకు వచ్చినిపుడు తమకు ప్రజలకు మధ్య వచ్చి కలిగించుకునే హక్కు తనకు లేదని యాజకులు పెద్దలు చెప్పారు. వారు ఆయన మందలిపుల్ని హెచ్చరికల్ని అంగీకరించలేదు. ఆయనకు ఎదురు తిరగటానికి ఆయన్ని నాశనం చెయ్యటానికి ప్రజల్ని ప్రోత్సహాంచారు.COLTel 258.5

    క్రీస్తుని నిరాకరించటానికి దాని పర్యవసానలికి వారే బాధ్యులు. ఒక జాతి పాపం ఒక జాతి నాశనం మత నాయకుల మూలంగానే సంభవిస్తాయి. మన దినాల్లో అవే ప్రభావాలు పనిచెయ్యటం లేదా? ప్రభువు ద్రాక్షతోట వ్యవసాయకుల్ని అనుసరించేవారు అనేకమంది లేరా? వారు యూదు నాయకుల అడుగుజాడల్లో నడవటం లేదా? మత బోధకులు స్పష్టమైన దైవ వాక్యం నుంచి ప్రజల మనసుల్ని మళ్ళించటం లేదా? దైవ ధర్మశాస్త్ర విదేయతపై ప్రజల్ని చైతన్య పర్చే బదులు దాన్ని అతిక్రమించటం పై వారిని చైతన్యపర్చటం లేదా? దైవ ధర్మశాస్త్రానికి విధేయులవ్వాల్సిన అవసరం లేదని అనేక సంఘ ప్రసంగ వేదికల నుంచి ప్రజలకి బోధించటం జరగుఉ తన్నది. మావన సంప్రదాయాల్ని సంస్కారాల్ని, ఆచారాల్ని ఘనపర్చటం జరుగుతుంది. దేవుని వరాల కారణంగా గర్వాన్ని స్వయం తృప్తిని పెంచుకొని వారు దేవుని విధుల ఆచరణను విస్మరించారు.COLTel 259.1

    దైవ ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చటంలో మనుషులు తామేమి చేస్తున్నారో ఎరుగరు. దైవ ధర్మశాస్త్రం దేవుని ప్రవర్తన నకలు. అందులో ఆయన రాజ్య నియామాలు ఉన్నాయి.ఈ నియమాల్ని ఏ వ్యక్తి అంగీకరించడో అతడు దేవుని దీవెనలు పొందే మార్గానికి వెలపల ఉంటారు. ఇశ్రాయేలీయుల ముందు దేవుడుంచిన అవకాశాలు దేవుని ఆజ్ఞలకు విధేయత ద్వారా మాత్రమే క్రియాత్మకమౌతాయి. అదే సమున్నత ప్రవర్తన, అదే సంపూర్ణ దీవెన. మనసు, ఆత్మ, శరీరం పై దీవెన. ఇంటి మీద పాలం మీద దీవెన. ఈ జీవితానికి వచ్చే జీవితానికి దీవెన - మనకు విధేయత ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.COLTel 259.2

    ఆధ్మాత్మిక ప్రపంచంలోనే గాని స్వాభావిక ప్రపంచములోనే గాని, దేవుని చట్టానికి విధేయత షరతు మీదే ఫలాలు ఫలిచంటం జరగుతుంది. దేవుని ఆజ్ఞల్ని లెక్క చెయ్యవద్దని బోధించే మనుషులు దేవుని మహిమ నిమిత్తం ఫలాలు ఫలించకుండా ప్రజలకు ఆటంకాలు కలిగిస్తారు. వారు ప్రభువు ద్రాక్షతోట ఫలాన్ని ఆయనకు ఇవ్వకుండా అట్టి పెట్టుకొని అపరాధులవుతున్నారు.COLTel 259.3

    దైవ సేవకులు మన వద్దకు ప్రభువు ఆదేశం ప్రకారం వస్తారు. వారు క్రీస్తు వలె దేవుని వాక్యానికి విధేయత డిమాండు చేస్తూ వస్తారు. ద్రాక్షతోట ఫలాలికి అంటే ప్రేమ, అణుకువ, ఆత్మ త్యాగంతో కూడిన సేవ ఫలాలికి ఆయన హక్కును వారు సమర్పిస్తారు. యూదు నాయకులవలె, ద్రాక్షతోట వ్యవసాయకుల్లో అనేకులు అగ్రహానికి లోనవ్వం లేదా? దేవుని ధర్మశాస్త్ర విధిని ప్రజలకు సూచిస్తూ ఈ బోధకులు తమ పలుకుబడిన నడవడి ద్వారా దాన్ని నిరాకరించటానికి ప్రజల్ని నడిపించటం లేదా ? అలాంటి నాయకుల్ని దేవుడు అపనమ్మకమైన సేవకులు అంటున్నాడు.COLTel 260.1

    ప్రాచీన ఇశ్రాయేలుతో దేవుడున్న మాటలు నేటి సంఘానికి సంఘ నాయకులికి గంబీర హెచ్చరికను అందిస్తున్నాయి. ఇశ్రాయేలు గురించి ప్రభువిలా అంటున్నాడు. “నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను”. హోషే 8:12 యాజకులకు బోధకులకు ఆయన ఇలా వెల్లడి చేసాడు. “నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీకుమారులను మరతును'. హోష 4:6COLTel 260.2

    దేవుని హెచ్చరికల్ని లెక్క చెయ్యకుండా విడిచి పెడదామా? ఆయన సేవకు వచ్చే అవకాశాల్ని వినియోగించుకోకుండా విడిచి పెడదామా? లోకం అవహేళన, జ్ఞానాతిశయం, మానవాచారాలు సంప్రదాయాలపట్ల నిబద్దత, క్రైస్తవులుగా చెప్పుకునే వారిని ఆయన సేవ చెయ్యకుండా ఆపు చెయ్యలా ? ఇశ్రాయేలు పాపం మన కళ్ళమందు ఉన్నది. నేటి సంఘము హెచ్చరికను పాటిస్తుందా ?COLTel 260.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents