Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    27—“నా పొరుగువాడెవడు;”

    ఆధారం లూకా 10:25-37

    “నా పొరుగువాడెవడు”? అన్న ప్రశ్న యూదుల నడుమ అంతులేని వివాదాన్ని రేపింది. అన్యుల విషయంలోను సమరయుల విషయంలోను వారికి ఎలాంటి సందేహమూ లేదు. మీరు పరదేశులు, శత్రువులు కాని తమ స్వజాతి ప్రజల మధ్య సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఈ వేర్పాటును సూచిచంటం ఎలా? యాజకుడు, రబ్లీ, పెద్ద, ఎవర్ని తన పొరుగు వాడిగా గుర్తించాలి? వారుతమ సొంత పవిత్రతను కాపాడుకోవ టానికి ఎన్నో ఆచారాలు కర్మలు ఆచరించే వారు. అజ్ఞానులు అజాగరూకులు అయిన ప్రజాసమూహాల్ని తాకటం వల్ల అపవిత్రత అంటు కుంటుందని, దాన్ని తీసివేసుకోవటానికి శ్రమతో కూడిన కృషి అసవరమౌ తుందని వారు భోధించారు.“అపవిత్రుల్ని” వారు తమ పొరుగువారిగా పరిగణించాలా ?COLTel 325.1

    క్రీస్తు నుంచి సమరయుడి ఉపమానంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పాడు. కేవలం మన సంఘానికో మన విశ్వాసానికో చెందినవాడే మన పొరుగువాడు కాడని ఆయన చూపించాడు. జాతి రంగు లేక వర్ణ బేధంతో దానికి సంబంధము లేదు. మన సహాయం అవసరమైన ప్రతీ మనిషీ మన పొరుగువాడే. అపవాది వల్ల గాయపడ్డ ప్రతీ ఆత్మ మన పొరుగువాడే. దేవుని సొత్తయిన ప్రతీ ఆత్మ మన పొరుగువాడే అన్నాడు.COLTel 325.2

    ధర్మశాస్త్రకోవిధుడొకడు క్రీస్తుకు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ఉపమానం చెప్పాడు. రక్షకుడు బోధిస్తుండగా “ధర్మశాస్రోపదేశకుడొకడు లేచి - బోధకుడా,నిత్యజీవమునకు వారసుడనగుటకు,నేనేమి చేయవలెను? అని ఆయనను శోధించుచు అడిగెను”.ఆ ఉపదేశకుడికి పరిసయ్యులే ఈ ప్రశ్నకు ప్రతిపాదించారు. క్రీస్తును తన మాటల్లో తప్పు పట్టి దెబ్బతియ్యా లన్నది వారి ఎత్తుగడ. వారు ఆయన ఇచ్చే జవాబు కోసం ఆసక్తిగా కని పెడుతున్నారు. రక్షకుడు వారితో వాదానికి దిగలేదు. జవాబును ప్రశ్న వేసిన వాడినుంచే కోరాడు. “ధర్మశాస్త్ర మందేమి వ్రాయడియున్నది? నీవేమి చదువుచున్నావు?” అని ఆయన ప్రశ్నించాడు. సీనాయి కొండపై నుంచి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని క్రీస్తు అంతగా పట్టించుకోవటం లేదని యూదులు భావిస్తున్నారు. అయితే ఆయన రక్షణ సమస్యను ఆజ్ఞలు కాపాడటం మీదికి తిప్పాడు. ఆ ధర్మశాస్తోపదేశకుడిలా బదులు పలికాడు. “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో ను,నీ పూర్ణ మనస్సుతోను,నీ పూర్ణ శక్తితోను,నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్నువలె,నీ పొరుగువానిని ప్రేమింవ వలెననియు వ్రాయబడియున్నదని చెప్పెను”.అందుకు క్రీస్తు “నీవు సరిగా ఉత్తరమిచ్చితివి; అలాగున చేయుము అప్పుడు జీవించెదవు” అన్నాడు.COLTel 325.3

    ఆ ఉపదేశకుడు పరిసయ్యుల విధానాలు ఆచరణలతో తృప్తి చెందలేదు. లేఖనాల వాస్తవ భావాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానతో అతడు వాటిని అధ్యయనం చేస్తున్నాడు. అతడికి ఆ విషయంలో అమితాశక్తి ఉ ంది. కనుక యధార్ధ హృదయంతో “నేనేమి చేయవలెను”? అని ప్రశ్నించాడు. ధర్మశాస్త్రం కోరుతున్న దాన్ని గురించి తానిచ్చిన జవాబులో విస్తారమైన ఆచారాలకు కర్మకాండకు సంబంధించినదంతా అతడు విడిచి పెట్టేశాడు. వాటికి విలువనివ్వలేదు. కాని ధర్మశాస్త్రం,ప్రవక్తల వచనాలు వేటిమీద అనుకొని ఉన్నాయో ఆ రెండు సూత్రాల్ని సమర్పించాడు. ఈ జవాబుకు క్రీస్తు మెచ్చుకోలు అతడికి సూత్రాల్ని సమర్పించాడు. ఈ జవాబుకు క్రీస్తు మెచ్చుకోలు అతడికి రబ్బీలకన్నా ఉన్నతస్థానమిచ్చింది. ధర్మశాస్త్ర కోవిదుడే వ్యక్తీకరించిన దాన్ని అంగీకరిస్తున్నందుకు వారు రక్షకుణ్ణి ఖండించలేకపోయారు.COLTel 326.1

    “అలాగున చేయుము అప్పుడు జీవించెదవు” అన్నాడు క్రీస్తు తన బోధనలో ఒక సూత్రాన్ని ఆచరించి ఒక సూత్రాన్ని అతిక్రమించటానికి వీలులేని ఒక దివ్యమైన మెత్తంగా ధర్మశాస్త్రాన్ని ఆయన ఎప్పుడు సూచించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రమంతటా ఒకే సూత్రం ఉన్నది. మానవుడి భవిష్యత్తు అతడు ధర్మశాస్త్రం మెత్తాన్ని ఆచరించటాన్ని బట్టి నిర్ధారితమౌతుంది.COLTel 326.2

    ఏ మనుషుడూ తన స్వశక్తితో ధర్మశాస్త్రాన్ని ఆచరించలేడని క్రీస్తుకు తెలుసు. సత్యాన్ని కనుగొనేందుకు ఆ ఉపదేశకుణ్ణి స్పష్టమైన విమర్శనాత్మకమైన పరిశోధనకు నడిపించాలని క్రస్తు వాంఛించాడు. క్రీస్తు ప్రభావ,ం కృప ద్వారా మాత్రమే మనం ధర్మశాస్త్రాన్ని ఆచరించగలుగుతాం. పతనమైన మానవుడు సంపూర్ణ హృదయంతో దేవున్ని తన్ను వలె తన పొరుగువాణ్ణి ప్రేమించటానికి పాప ప్రాయశ్చిత్తం పై నమ్మకం శక్తినిస్తుంది.COLTel 327.1

    మొదటి నాలుగు ఆజ్ఞల్ని గాని చివరి ఆరు ఆజ్ఞల్ని గాని తాము ఆచరించలేదని ధర్మశాస్త్రకోవిదుడికి తెలుసు. క్రీస్తు పలికిన శక్తిమంతమైన మాటలు అతడిలో విశ్వాసం పుట్టించాయి. కాని తన పాపాన్ని ఒప్పుకునే బదులు దాన్ని కొట్టిపారెయ్యటానికి ప్రయత్నించాడు. సత్యాన్ని అంగీకరించే బదులు ఆ ఆజ్ఞను నెరవేర్చటం ఎంత కష్టమో చూపించటానికి ప్రయత్నించాడు. ఇలా విశ్వాసాన్ని దాటవెయ్యటానికి ప్రజల దృష్టిలో తన్ను తాను నీతిమంతుడుగా రుజువు చేసుకోవటానికి నిరీక్షించాడు. అతడు తనకు తానుగా దానికి సమాధానం చెప్పగలిగాడు. గనుక అతడి ప్రశ్న అవసరమని రక్షకుని మాటలు సూచించాయి అయినా అతడు ఇంకొక ప్రశ్న వేసాడు. “నా పొరుగువాడు ఎవరు ”? అని.COLTel 327.2

    ఇప్పుడు కూడా క్రీస్తు వాదానికి దిగలేదు. దానికి సమధానంగా ఒక సంఘటనను చెప్పాడు.ఆ సంఘటన జ్ఞాపకం ప్రజల మనసుల్లో ఇంకా తాజాగా ఉంది. ఆ కధనాన్ని ఆయన ఇలా సాగించాడు. “ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమును దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి”.COLTel 327.3

    యోరూషలేము నుంచి యెరికోకి ప్రయాణం చెయ్యటంలో ప్రయాణికుడు యూదయ అరణ్యంలో కొంత భాగం గుండా వెళ్ళాల్సి వచ్చేది, రోడ్డు రాతిబండలు వాటి మధ్య నుంచి ప్రవహించే సెలయేళ్ళతో నిండిన అడవి గుండా వెళ్ళింది. అది బందిపోటు దొంగలకు స్తావరం ఆ ప్రాంతము. ఆ ప్రాంతంలో తరుచు దౌర్జన్యాలు చోటుచేసుకునేవి ఆ ప్రయాణికుణ్ని ఇక్కడే దొంగలు పట్టుకు కొట్టి తన వద్ద ఉన్న విలువైన వస్తువుల్ని దోచుకొని కొర ప్రాణంతో దారి పక్కపడేసి వెళ్ళిపోయారు. అతడు ఆ స్తితిలో పడి ఉండగా ఒక యాజకుడు ఆ మార్గాన వచ్చాడు. అతడు గాయాలతో దారిపక్క రక్తం కారుతు పడి ఉన్న అభ్యాగుణ్ణి చూసాడు ఎలాంటి సహాయం చెయ్యకుండా అతడు తన దారిన వెళ్ళిపోయాడు. అతడు “ప్రక్కగా పోయెను”ఆ తరువాత ఒక లేవీయుడు ప్రత్యక్ష మయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకోవటానికి అతడు ఆగి బాదితుడి వంక చూసాడు. తాను ఏం చెయ్యాలో అతడికి బాగా తెలుసు. కాని అది సంతోషాన్నిచేది విధి కాదు. ఈ దారిని రాకుండ ఉంటే బాగుండేది, అప్పుడు నేను బాధితుణ్ణి చూ సేవాణ్ణి కాను అనుకున్నాడు. అది తనకు సంబంధించిన విషయం కాదని తన్ను తాను సముదాయించుకొని అతడు కూడా ‘ప్రక్కగా పోయెను'.COLTel 327.4

    కాగా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్న ఒక సమరయుడు గాయపడి బాధపడుతున్న ఆ ప్రయాణికుణ్ణి చూసాడు. ముందు వెళ్ళిన ఇద్దరు చెయ్యటానికి నిరాకరించిన పనిని అతడు చేసాడు. అతడు గాయపడ్డ ఆ వ్యక్తికి సున్నితంగా దయగా పరిచారం చేసాడు. “అతనిని చూచి, అతని మీద జాలిపడి, దగ్గరకు పోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి యొక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొనిపో అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి ఇతని పరామర్శించుము. నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తెర్చెదనని అతనితో చెప్పిపోయెను”. యాజకుడు లేవియుడు కరుణను నటించారు. కాని సమరయుడు తాను నిజంగా మారు మనస్సు పొందినవాణ్ణి చూపించుకున్నాడు. ఆ పని యాజకుడికి లేవియుడికి ఎంత ఇబ్బందికరమో అతడికి అంతే ఇబ్బందికరం కాని స్వభావం పరంగాను పనుల విషయంలోను అతడు దేవునితో సామరస్యం కలిగి ఉన్నట్లు నిరూపించుకున్నాడు.COLTel 328.1

    ఈ పాఠం ఇవ్వటంలో క్రీస్తు ధర్మశాస్త్ర సూత్రాల్ని ప్రత్యక్షంగా, శక్తిమంతంగా సమర్పించి వాటిని తన శ్రోతలు ఆచరణలో పెట్టలేదని, చూపించాడు. ఆయన మాటలు ఎంత నిర్దుష్టంగాను సూటిగాను ఉన్నాయి! వినేవారు వాటిని తప్పు పట్టటానికి తావు లేకపోయింది. ధర్మశాస్త్ర ఉపదేశకుడు విమర్శించదగింది. ఆ పాఠంలో ఏది లేదు. క్రీస్తు విషయంలో అతడికున్న పూర్వదురభిప్రాయం తొలగిపోయింది. సమరయుణ్ణి పేరు పెట్టి అభినందించటానికి అతడు తన జాతీయ ద్వేషాన్ని అంహాకార్ని అధిగమించ లేకపోయాడు. “దొంగల చేతిలో చిక్కనవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగవాడాయెను”? అని క్రీస్తు అడిగినప్పుడు “అతిని మీద జాలి చూపినవాడే” అని బదులిచిచ్చాడు.COLTel 328.2

    “అందుకు యేసు - నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను”. అవసరంలో ఉన్నవారికి అదే కనికరం చూపిస్తే నీవు ధర్మశాస్త్రమంతటిని ఆచరిస్తున్నామని రుజువు చేస్తావు అన్నాడు.COLTel 329.1

    యూదులకు సమరయులకు మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసం వారి మత విశ్వసంలో ఉన్న బేధం నిజమైన ఆరాధనలో ఏమేమి ఉండాలి అన్నది. పనియసయ్యులు సమరయుల్ని గురించి మంచి చెప్పేవారు కాదు. వారిపై శాపాలు కురిపించేవారు.యూదులికి సమరయులికి మధ్య వైరం ఎంత తీవ్రమైనదంటే సమరయ స్త్రీని క్రీస్తు నీళ్ళిమ్మని అడగటం ఆమెకు ఎంతో వింతగా కనిపించింది. ఆ స్త్రీ “యూదుడవగు నీవు సమరయు స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు”? అంది “ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయురు” అంటున్నాడు బోధకుడైన యోహాను. యోహా 4:9.COLTel 329.2

    యూదులు క్రీస్తు పట్ల ఎంత ద్వేషం పెంచుకున్నారంటే. వారు దేవాలయంలో ఆయన్ని రాళ్ళతో కొట్టటానికి లేచినప్పుడు ఆయన పై తమకున్న ద్వేషాన్ని వెలిబుచటానికి “నీవు సమరయుడవును దయ్యము పట్టినవాడవును” అన్న మాటలకన్నా కటువైన మాటలు వారికి దొరకలేదు (యోహా 8:48) అయినా యాజకుడు, లేవీయుడు దేవుడు తమకు నియమించిన పనిని చెయ్యకుండా తమ స్వజాతీయుడికి తాము చేయాల్సిన సేవను తాము ద్వేషించి తృణీకరించే సమరయుడికి విడిచి పెట్టి వెళ్ళిపోయారు.COLTel 329.3

    సమరయుడు “నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అన్న ఆజ్ఞను నెరవేర్చాడు. ఇలా చేయం ద్వారా తన్ను ఎవరు ద్వేషిస్తున్నారో ఆ పరిసయ్యులకన్నా తాను ఎక్కువ నీతిమంతుణ్ణి చూపించకున్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి గాయపడ్డ బాటసారికి చికిత్స చేసి అతణ్ణి తన సోదరుడిలా చూసాడు. ఈ సమరయుడు క్రీస్తుకి ప్రతీ. రక్షకుడు ఏ మానవుడూ చూపించలేని ప్రేమను మన పట్ల కనపర్చాడు. మనం ఆయాపడి మరణించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మన పై జాలిపడ్డాడు. ఆయన మనల్ని చూసి పక్కగా పోలేదు. నిస్సహాయ నిరీక్షణ శూన్య స్థితిలో మరణించటానికి మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోలేదు. పరలోక నివాసులు అమితంగా ప్రేమించి అభిమానించే ఆయన తన పరిశుద్ధ ఆనంద గృహంలో ఉండిపోలేదు. మన దురవస్థను అవసరాన్ని ఆయన చూసాడు. మనం పక్షం వహించి, మానవాళి రక్షణే తన కర్తవ్యంగా ఎంచుకున్నాడు. తన శత్రవుల్ని రక్షించేందుకు మరణించాడు. తనను చంపనున్న హంతకుల కోసం ప్రార్ధించాడు. తన ఆదర్శాన్ని ఉదాహరిస్తూ ఆయన తన అనుచరులికి ఇలా సూచిస్తున్నాడు. “మీరు ఒకనినొకుడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను” “నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను” యోహా 15:7, 13:34.COLTel 330.1

    ఈ యాజకుడు లేవీయుడు ఆలయంలోని ఆరాధనకు హాజరయ్యారు. ఆలయ సేవను దేవుడే నియమించాడు. ఆ సేవలో పాలుపొందటం సమున్నత అధిక్యత. అలాంటి గౌరవం పొందిన తరువాత మార్గం పక్క పడి ఉన్న ఒక అజ్ఞాత బాధితుడికి పరిచారం చెయ్యటం గౌరవ భంగమనుకున్నారు. ఇలా తన ప్రతినిధిలుగా తమ సాటి మనుషుడికి మేలు చెయ్యటానికి తమకు దేవుడిచ్చిన అవకాశాన్ని వారు ఆలక్ష్యం చేసారు.COLTel 330.2

    నేడు అనేకమంది ఇలాంటి తప్పునే చేస్తున్నారు. వారు తమ విధుల్ని రెండు స్పష్టమైన తరగతులుగా విభజిస్తారు. ఒక తరగతిలో గొప్ప గొప్ప విషయాలుంచుతారు. అవి దైవ ధర్మశాస్త్రం నియంత్రించాల్సినవి తక్కిన తరగతికి చెందినవి చిన్న చిన్న విషయాలుగా పిలిచేవి. అందులో “నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అన్న దాన్ని విస్మరిస్తారు. ఈ కోవకు చెందిన పనిని ఉద్రేకం ఉద్వేగం వంటి చిత్త చాపల్యానికి వదలెయ్యటం జరగుతుంది. ఇలా ప్రవర్తన మలినమౌతుంది. క్రీస్తు మతం అబద్ద ప్రచారానికి గురి అవుతుంది. బాధలు కష్టాలకు గురి అయిన బాధపడుతున్న మానవాళికి పరచర్య చెయ్యటం తమ ప్రతిష్టకు భంగమని భావించే వారున్నారు. ఆత్మాలయాన్ని శిధిలావస్థకు తెచ్చుకున్న వారిని అనేకులు నిర్లక్ష్యం చేస్తారు. ఇతరులు వారిని వేరే ఉద్దేశ్యంతో ఆలక్ష్యం చేస్తారు. తమ నమ్మకం ప్రకారం వారు క్రీస్తు సేవలో ఉన్నారు. ఏదో మంచి పని స్థాపించటానికి ప్రయత్నిస్తారు. తాము గొప్ప పని చేస్తున్నామని భావిస్తారు. బాధల్లోను లేమిలోను ఉన్న వారిని కన్నెత్తి చూసేందుకు ఆగరు. తాము గొప్ప సేవగా భావించే ఆ పని ప్రగతి నిమిత్తం వారు బీదల్ని హింసించవచ్చు. పేద పనివారిని కష్టాలకు ఇడుములు ఇబ్బందులకు గురిచేసి వారి హక్కుల్ని హరించి వారి అవసరాల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. అయినా తాము ఊహించుకున్నట్లు తాము చేస్తున్న పని దేవుని సేవాభివృద్ధికి గనుక తామలా ప్రవర్తించటం సమర్ధనీయమని భావిస్తారు.COLTel 330.3

    ఒక సహోదరుడు లేక పక్కింటి వ్యక్తి కష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తుండటం చూసి సహాయం చెయ్యకుండా అనేకులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుంటారు తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు గనక వారు తమ స్వార్ధంలో క్రీస్తుకి ప్రతినిధులని అతడు భావించవచ్చు. ప్రభువు సేవకులమని చెప్పుకునేవారు ఆయనతో సహకరించని కారణంగా తమ ద్వారా ఇతరులకు ప్రవహించాల్సిన దేవుని ప్రేమ తోటి మనుషులికి చేరకుండా చాలమట్టుకు నిలిచిపోవటం జరుగుతుంది. మానవ హృదయాలు, పెదవుల నుంచి తిరిగి దేవుని వద్దకు వెళ్ళాల్సిన స్తుతి కృతజ్ఞతలు దేవునికి అందటంలేదు. తన పరిశుద్ద నామానికి చెందాల్సిన మహిమను ఇలా దోచుకోవటం జరుగుతున్నది. క్రీస్తు ఏ ఆత్మల కోసం మరణించాడో, తన సమక్షంలో ఆనంత యుగాల్లో నివసించానికి ఏ ఆత్మల్ని తన రాజ్యంలోకి తీసుకురావలని ఆకాంక్షిస్తున్నాడో వారిని ఆయనకు దక్కకుండా చేసి ఆయన్ని దోచుకోవటం జరుగుతుంది.COLTel 331.1

    దైవ సత్యం మన ఆచరణ ద్వారా గొప్ప ప్రభావం చూపాల్సి ఉండగా అది లోకం పై ఏమంత ప్రభావం చూపదు. నామమాత్రపు మతం ఎక్కువయ్యింది. నిజాయితీ లేదు. మనం క్రీస్తు అనుచరులమని దేవుని వాక్యంలోని ప్రతీ సత్యాన్ని నమ్ముతున్నామని చెప్పుకోవచ్చు. కాని మన నమ్మకం అనుదిన జీవితంలో ప్రతిబింబిస్తే తప్ప అది మన ఇరుగుపొరుగు వారికి ఎలాంటి మేలు చేయలేదు. మనం చెప్పుకునేది ఆకాశమంత ఉన్నతమైనది కావచ్చు. కాని మనం క్రైస్తవులమైతే తప్ప అది మనల్ని గాని మన తోటి మనుష్యుల్ని గాని రక్షించలేదు.COLTel 332.1

    స్వార్ధ ప్రయోజనాల్ని సాధించటానికి చేసే పనులేమి క్రీస్తు సేవకు దోహదపడవు.ఆయన సేవ బాధితులు బీద ప్రజలు మేలు కోసం చేసే పరిచర్య. ఆయన అనుచరులం విశ్వాసులం అని చెప్పుకునే వారి హృదయాల్లో క్రీస్తు చూపిన దయ, సానుభూతి ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి ఆయన ఎంతో విలువైనవారిగా ఎంచి వారి రక్షణార్ధం తన ప్రణాన్నర్పించాడో ఆ మానవుల పట్ల మనకు గాఢమైన ప్రేమ ఉండాలి. ఈ ఆత్మలు ఎంతో విలువైనవి. అవి మనం దేవునికి అర్పించగల ఏ అర్పణ కన్నా ఎంతో ప్రశస్తమైనవి. లేముల్లో ఉన్నవారిని ఉపేక్షిస్తూ లేక పరదేశుల హక్కుల్ని కాలరాస్తూ ఏదో గొప్ప కార్య సాధనకు అవిరళ కృషి చెయ్యటం ఆయనకు అంగీకృతమైన సేవ కాదు.COLTel 332.2

    ఆత్మ పరిశుద్దీకరణ అంటే పరిశుద్దాత్మ చర్య ద్వారా మానవుల్లో క్రీస్తు స్వభావాన్ని నాటటం. సువార్త మతమంటే జీవితంలో క్రీస్తు సజీవమైన క్రీయాశీలమైన నియమమై ఉండటం. అది ప్రవర్తలనో వెల్లడైయే సత్కియాల్లో వ్యక్తమయ్యే క్రీస్తు కృప. సువార్త సూత్రాల్ని వాస్తవ జీవితంలోని ఏ భృగం నుంచి తొలగించటానికి లేదు. క్రైస్తవానుభవంలోను, కృషిలోను ప్రతీ శాఖ క్రీస్తు జీవితాన్ని సూచించాల్సి ఉంది.COLTel 332.3

    దైవ భక్తికి పునాది ప్రేమ. పైకి ఏమి చెప్పుకున్నా ఒక వ్యక్తికి తన సహోదరుడి పట్ల స్వార్ధరహిత ప్రేమ ఉంటేనే గాని దేవుని పట్ల అతడి ప్రేమ. పవిత్ర ప్రేమ కాజాలదు. కాగా ఇతరుల్ని ప్రేమించటానికి ప్రయత్నిం చటం ద్వారా మనం ఈ స్వభావాన్ని సొంతం చేసుకోలేం. దీనికి కావలసినది హృదయంలో క్రీస్తు ప్రేమ. స్వార్ధాసక్తి క్రీస్తులో లీనమైనప్పుడు ప్రేమ స్వాభావికంగా పుడుతుంది. ఇతరులికి చెయ్యూత ఇవ్వటానిక ఇతరులకి మేలు చెయ్యటానికి ప్రేరణ నిత్యం హృదయంలో నుంచి పుట్టుకొచ్చి నప్పుడు, క్రైస్తవ ప్రవర్తన పరిపూర్ణత్వాన్ని సాధిస్తుంది. అప్పుడు పరలోక సూర్యకాంతి హృదయాన్ని నింపి, ముఖంలో ప్రకాశిస్తుంది.COLTel 332.4

    ఏ హృదయంలో క్రీస్తు నివసిస్తాడో దానిలో ప్రేమ లేకపోవటం ఆసాధ్యం దేవుడు మనల్ని ముందు ప్రేమించాడు గనుక మనం ఆయన్ని ప్రేమిస్తే క్రీస్తు ఎవరి కోసం మరణించాడో వారందరిని మనంప్రేమిస్తాం. మానవత్వాన్ని స్పృశించకుండా దేవత్వాన్ని స్పృశించలేం. ఎందుకంటే విశ్వసింహాసనాసీడైన ఆయనలో దేవత్వం మానత్వం సంయుక్తమయ్యాయి. క్రీస్తుతో సంబంధమున్న మనం మనతోటి మనుషులతో ప్రేమ అనే బంగారు గొలుసు ద్వారా అనుసంధాపడతాం. అప్పుడు క్రీస్తు దయకనికరాలు మన జీవితంలో ప్రదర్శిమౌతాయి. లేమిలో ఉన్నవారిని దిక్కులేనివారిని మన వద్దకు ఎవరో తీసుకువచ్చేవరకు వేచి ఉండటం. దు:ఖాలు కష్టాలకు గురి అయిన వారి పట్ల సానుభూతి చూపాల్సిందిగా విప్తిలు మనకు అవసరముండవు., మేలు చేస్తూ సంచరించటం క్రీస్తుకు స్వాభావికమైనట్లే లేమిలో ఉన్నవారికి బాధపడుతున్న వారికి పరిచారం చెయ్యటం మనకు స్వాభావికమౌతుంది.COLTel 333.1

    ప్రేమకు సానుభూతికి ప్రేరణ ఎక్కడ ఉంటుందో ఇతరుల్ని ఆదుకొని పైకి లేపటానికి ఎక్కడ హృదయం తహతహలాడుందో అక్కడ పరిశు ద్దాత్మ పని చెయ్యటం కనిపిస్తుంది. అన్యమతం ఆగాదాల్లో ఉండి లిఖిత దైవ వాక్య జ్ఞానం లేనివారు క్రీస్తు నామాన్ని ఎన్నడూ విననివారు ఆయన సేవకుల పట్ల దయచూపించి తమ ప్రాణాల్ని పనంగా పెట్టి వారిని కాపాడతారు. వారి కార్యలు దైవశక్తి చేస్తున్న పనిని వెల్లడి చేస్తాయి. పరిశుద్దాత్మ క్రూర అటవికుడు హృదయంలో క్రీస్తు కృపను నాటగా, అతడి స్వభావానికి, విద్యకు విరుద్ధంగా అతడిలో దయ కనికరాలు పుడతాయి. ఆ వెలుగు “లోకములోని వచ్చును ప్రతి మనుష్యుని వెలిగించుచు” (యోహా 1:9) అతడి హృదయంలో ప్రకాశిస్తుంది. ఈ వెలుగు ప్రకారం నడుచుకుంటే అది అతడి పాదాల్ని దేవుని రాజ్యా నికి నడిపిస్తుంది.COLTel 333.2

    “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు... యావద్బూమి మీద కాపురముండుటకు... ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒక వేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని, తన్ను వెదకు నిమిత్తము.... వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను”. అ.కా 17:24-27 “ఇదిగో, ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి ... యొక గొప్ప సమూహాము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొట్టెపిల్ల యెదుటను” నిలబడ్డారు. ప్రక 7:9COLTel 334.1

    పడిపోయిన వారిని పైకి లేపటంలో ను దు:ఖంలో ఉన్నవారిని ఓదార్చటంలోను పరలోక మహిమ ఉన్నది. మానవ హృదయాల్లో క్రీస్తు ఎక్కడ ఉన్నా ఆయన అదే రీతిగా వెల్లడవుతాడు. క్రీస్తు మతం ఎక్కడ క్రియశీలమువుతందో అక్కడ అది మేలు చేస్తుంది. దీవెనకరమౌతుంది. అది ఎక్కడ పనిచేస్తే అక్కడ వెలుగును విరజిమ్ముతుంది,COLTel 334.2

    జాతీయత, తెగ, కులాన్ని బట్టి ఎలాంటి ప్రత్యేకతనూ దేవుడు గుర్తించడు.మానవాళి సృష్టికర్త ఆయనే. సృష్టిరీత్యా మనుషులందరు ఏక కుటుంబ సభ్యులు విమోచన మూలంగా అందరూ ఒక్కటే. ప్రతి ఆత్మ దేవుని సముఖంలోకి స్వేచ్చగా ప్రవేశించేందుకు ఆలయంలోని ప్రతీ విభాగాన్ని తెరిచేందుకు ప్రతీ అడ్డుగోడను తొలగించటానికి క్రీస్తు వచ్చాడు. ఆయన ప్రేమ అన్ని చోట్లకు చొచ్చుకుపోయేంత విశాలమైనంది. లోతైనది. సంపూర్ణమైనది. సాతాను మోసాలచే వంచితులైన వారిని అది దేవుని సింహాసం అందుబాటులో అది వారిని అమర్చుతుంది.COLTel 334.3

    క్రీస్తులో యూదుడు, గ్రీసు దేశీయుడు, దాసుడు, స్వతంత్రుడు అన్న బేదం లేదు (గల 3:28, ఎఫె2:23) మత విశ్వాస బేధాలు ఏమైనా , బాధలు కష్టాల్లో ఉన్న మానవాళి పిలుపును విని స్పందించాలి. మతంలోని బేధం వల్ల మనస్పర్ధలు ఉన్నచోట వ్యక్తిగత సేవ ద్వారా ఎంతో మేలు చేయవచ్చు. ప్రేమ అప్యాయతలతో కూడిన పరిచర్య దురభిప్రాయాల్ని తొలగించి దేవునికి ఆత్మల్ని సంపాదించటానికి తోడ్పడుతుంది.COLTel 334.4

    ఇతరుల దు:ఖాలు కష్టాల సమస్యల గురించి మనం ముందుచూపు కలిగి ఉండాలి.అధికులు,సామాన్యులు, ధనికులు, పేదవారి సంతోషంలోను చింతలలోను మనం పాలు పొందాలి. “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” (మత్త 10:8) అంటున్నాడు. ప్రభువు మన చుట్టు బీదలు, అలసిన ఆత్మలు ఉన్నారు. వారికి కనికరపు మాటలు, సహాయక చర్యలు అవసరం. సానుభూతి, సహాయం అవసరమైన విధవరాండ్రున్నారు. తండ్రి తల్లి లేని పిల్లలున్నారు. తన సేవకులు వారిని తన వద్ద నుంచి ట్రస్టుగా స్వీకరించాలిని దేవుడు ఆదేశిస్తున్నాడు. తరుచు వీరిని ఉపేక్షించి దాటిపోవటం జరుగుతుంది. వారు చింకిరిపాతలు వేసుకొని మొరటుగా, అనాగరకంగా ఉండవచ్చు గాక, ఆయినా వారు దేవుని సొత్తు. అయిన వారిని ధర పెట్టి కొన్నాడు. మనలాగే వారు దేవుని దృష్టికి ప్రశస్తమైన వారు. వారు దేవుని కుటుంబములో సభ్యులు. దేవుని గృహ నిర్వాహకు లుగా క్రైస్తవులు వారికి భాధ్యత వహించాల్సి ఉన్నారు. “వారి ఆత్మలకు మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తాను. అంటున్నాడు. ప్రభువు.COLTel 335.1

    అన్ని రకాల దుష్టతతోను పాపం మిక్కిలి ఘోరమైనది. పాపి పై జాలిపడి ఆతడికి చేయూత నివ్వటం మన బాధ్యత. అయితే అందరిని ఒకేవిధముగా చేరలేం. అనేకులు తమ ఆత్మ ఆకలిని దాచుకుంటారు. వీరికి దయ గల మాట లేక దయగల గుర్తింపు ఎంతో సహాయపడుతుంది. ఇంకా కొందరు గొప్ప అవసరంలో ఉంటారు. కాని అది వారికి తెలియదు. ఆత్మకు మూడిన భయంకరనాశనాన్ని వారు గుర్తించరు. కోట్లాది మంది పాపంలో కూరుకుపోవటంతో వారునిత్యత్వాన్ని గూర్చిన సత్యాల్ని గూర్చిన స్పృహను కోల్పోయారు. తమలో దేవుని పోలికను పోగొట్టుకున్నారు. తమకు రక్షణ పొందాల్సిన ఆత్మలున్నవా లేదా అన్నది వారికి తెలియదు. వారికి దేవుని పై విశ్వాసం గాని మనుషుడిపై నమ్మకం గాని లేదు. వీరిలో అనేకమందిని కారుణ్య, ధార్మిక కార్యాల ద్వారా మాత్రమే చేరటం సాధ్యపడుతుంది. వారి శారీరక అవసరాల్ని ముందుకు సరఫరా చెయ్యాలి. వారికి ఆహారం పెట్టాలి. వారిని శుభ్రపర్చాలి. వారికి బట్టలు ధరింపజెయ్యాలి. తమ పట్ల మీకున్న స్వార్ధ రహిత ప్రేమకు నిదర్శనాన్ని చూసినప్పుడు క్రీస్తు ప్రేమను నమ్మటం వారికి సులబమౌతుంది.COLTel 335.2

    తప్పిదాలు చేసి తమ తప్పిదాలకు సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు. దాదాపు తెగించే స్థితికి చేరే వరకు వారు తమ తప్పిదాల్ని పొరపాట్లును చూస్తూ ఉంటారు. ఈ ఆత్మల్ని ఉపక్షించకూడు. ప్రవాహానికి ఎదరుగా ఈ దాల్సిన వచ్చినప్పుడు ప్రవహాం శక్తి అంతా అతణ్ణి వెనక్కి నెట్టుతుంది. అలాంటప్పుడు మునిగిపోతున్న పేతురికి పెద్దన్న హస్తంలా మనం చెయ్యూతనివ్వటం అవసరం. నిరీక్షణను పుట్టించే మాటలు నమ్మకం పుట్టించి ప్రేమను మేల్కొల్పే మాటలు అతడితో మాట్లాడండి.COLTel 336.1

    వ్యాధిగ్రస్తుడైన ఆత్మ గల నీ సోదరుడికి నీవు అవసరం. నీకు కూడా ఒక సోదరుడి ప్రేమ అవసరమయ్యింది కదా. తనలాగే బలహీనుడైన ఒక వ్యక్తి అనుభవం. తనకు సానుభూతి చూపి సహాయం చెయ్యగల వ్యక్తి అతడిక అవసరం.మన సొంత బలహీనతను గూర్చిన జ్ఞానం గొప్ప అవసరంలో ఉన్న మరొకడికి సహాయం చెయ్యటానికి తోడ్పడాలి. దేవుని నుంచి మనం పొందిన ఓదార్పును అందించకుండా బాధననుభవిస్తున్న వ్యక్తిని ఎన్నడూ దాటిపోకూడదు.COLTel 336.2

    క్రీస్తుతో సహవాసం, జీవం గల రక్షకునితో అనుబంధ క్షుద్ర స్వభావాన్ని జయించటానికి మన హృదయానికి ఆత్మకు శక్తి సామర్ధ్యాలిస్తుంది. తనను పైకి లేపే సర్వశక్తిమంతమైన హస్తం గురించి తనపై జాలి చూపేందుకు క్రీస్తులో ఉన్న అనంత మానవీయతను గూర్చి సంచారికి తెలంపడి. దయలేని, సహాయం కోసం వేసే కేకలు వినలేని చట్టం శక్తిని అతడు నమ్మటం చాలదు. అతడు వెచ్చని హస్తాన్ని పట్టుకొని కరుణా కటాక్షాలు, ప్రేమానురాగాలతో నిండిన హృదయాన్ని విశ్వసించాలి. తన సరసన నిత్యం దైవ సముఖం ఉంటుందని ఆయన తన పై నిత్యం ప్రేమ కనికరాల దృష్టి సారిస్తూ ఉంటాడన్న ఆలోచన పై అతడి మనసును నిలపండి. పాపం విషయం వేదన చెందే తండ్రి హృదయం గురించి, ఇంకా చాపి ఉంచిన తండ్రి హస్తం గురించి “జనులు నన్న ఆశ్రయింపవలెనను, నాతో సమాధానపడవలెనను వారు నాతో సమాధానపడవలెను (యెష 27:5) అంటూ పలుకుతున్న ఆయన స్వరం గురించి తలంచమని అతణ్ణి కోరండి.COLTel 336.3

    మీరు ఈ సేవలో కృషి చేస్తున్నప్పుడు మానవ నేత్రాలకు కనిపించని మిత్రులు మీకుంటారు. గాయపడ్డ బాటసారికి పరిచారం చేసిన సమరయుడి పక్క పరలోకదూతలు ఉన్నారు. తమ తోటి మానవులకు పరిచారం చేసే వారందరి సరసన నిలబడి ఉంటారు. మీకు క్రీస్తు సహకారం ఉంటుంది. ఆయన విమోచకుడు. ఆయన పర్యవేక్షణ కింద పనిచేసేటప్పుడు మీరు గొప్ప ఫలితాలు చూస్తారు.COLTel 337.1

    ఈ పరిచర్యలో మీ విశ్వసనీయత మీద ఇతరుల సంక్షేమమే కాదు. ఈ నిత్య జీవిత భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఆయన తన తండ్రితో ఏకమై ఉన్నట్లు మనం ఆయనతో ఏకమై ఉండేందుకు తనతో సాంగత్యానికి పైకి లేపటానికి సమ్మతంగా ఉన్నవారిందరిని పైకి లేపటానికి క్రీస్తు ప్రయత్నిస్తున్నాడు. మన స్వార్ధాశల నుంచి మనల్ని బయటకి తీసుకురావటానికి మనకు బాధలు విపత్తులు రావటానికి అనుమతిస్తాడు. మనలో దయ కనికరం ప్రేమ వంటి తమ ప్రవర్తన లక్షణాల్ని వృద్ధిపర్చటానికి ఆయన కృషి చేస్తాడు. ఈ పరిచర్యను అంగీకరించటం ద్వారా మనం దేవుని రాజ్యంలో జీవించటానికి యోగ్యులమయ్యేందుకు క్రీస్తు పాఠశాలలో చేరుతున్నాం. దాన్ని నిరాకరించటం ద్వారా మనం ఆయన ఉపదేశాన్ని నిరాకరించి ఆయన సముఖం నుంచి నిత్యం వేరుపడటాన్ని ఎంచుకుంటాం.COLTel 337.2

    ప్రభువిలా అంటున్నాడు “నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనని యెడల... అక్కడ నిలువడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును”...... తన సింహాసనం చుట్టు ఉండే దూతల మధ్య ఉండే భాగ్యం (జెక 3:7) లోకంలో తమ సేవలో పరలోక నివాసులికి సహకరించటం ద్వారా పరలోకంలో వారితో సహవాసం కోసం మనం సిద్ధపడుతున్నాం. “రక్షణయును స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులైన” దూతలు హెబ్రీ (1:14) లోకంలో పరిచారము చేయించుకొనుటకు ” కాక “పరిచారము చేయుటకు ” (మత్త 20:28) నివసించిన వారిని స్వాగతిస్తారు. ధన్యమైన ఈ సాంగత్యంలో “నా పొరుగువాడెవడు”? అన్న ప్రశ్నలో ఇమిడి ఉన్నదంతా ఆనంద పారవశ్యంతో నేర్చుకుంటాం.COLTel 337.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents