Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    17—“ఈ సంవత్సరము కూడ ఉండనిమ్ము”

    ఆధారం : లూకా 131:9

    తన బోధనలో క్రీస్తు కృపాహస్తాన్ని తీర్పు హెచ్చరికతో జతపర్చాడు. తాను “రక్షించుటకే కాని నశింపజేయుటకు రాలేదు” అని అన్నాడు. లూకా 9:56 (పుట్ నోట్) “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవాడయనను లోకములోనికి పంపలేదు” యోహా 3:17 దేవుని న్యాయ దృష్టికి, తీర్పును సంబంధించినంతవరకు, పండ్లు లేని అంజూరపు చెట్టు ఉపమానం. క్రీస్తు కృపా పరిచర్యను ఉదాహరిస్తున్నది.COLTel 171.1

    దేవుని రాజ్యం వస్తుందని క్రీస్తు ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి ఆజ్ఞానాన్ని ఉదాసీనతను మందలించాడు. ఆకాశంలో కనిపించే వాతావరణ సూచనల్ని వారు వెంటనే చదవగలిగేవారు. కాని ఆయన పరిచర్యను స్పష్టంగా సూచించే కాల సూచనల్ని గ్రహించలేదు.COLTel 171.2

    ఈనాటి మనుషుల వల్లే ఆ కాలపు మనుషులు తమనే దేవుడు ప్రేమిస్తున్నాడని ఆయన గద్దింపు వర్తమానం తమకు కాదు ఇతరలుకి వర్తిస్తుందని నమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. క్రీస్తు శ్రోతలు ఆయనకి ఒక ఘటనన గూర్చి చెప్పారు. అది గొప్ప సంచలనం రేపింది. యూదయ గవర్నరు అయిన పాంటియాన్ పిలాతు చేపట్టిన కొన్ని చర్యలు ప్రజలకు అభ్యంతకరంగా ఉన్నాయి. యెరూషలేములో ప్రజలు అలజడికి దిగారు. దీన్ని పిలాతు దౌర్జన్యంతో అణిచివేయ్యటానికి ప్రయత్నించాడు. ఒక సందర్భములో అతడి సైనికులు దేవాలయం పై దాడిచేసి ఆవరణంలో బయలుపరిస్తున్న గలిలయ యాత్రికులు అర్పణల్ని మధ్యలో ఆపు చేసేశారు. దుర్ఘటన, బాధితుడి పాపపర్యవసానంగా కలుగుతందుని యూదులు నమ్మారు. ఈ దౌర్జన్య ఘనట గురించి చెప్పేవారు. దాన్ని గురించి రహస్యమైన తృప్తితో చెప్పేవారు. తమ అదృష్టమే తాము చాలా మంచివారమని రుజువుపర్చిందని అందుకే తాము ఈ గలిలయులికన్నా దేవుని కృపను ప్రసన్నతను ఎక్కువ పొందామని వారి భావన. ఈ మనుషుల విషయంలో యేసు మెచ్చుకోలు మాటలు పలుకుతాడని వారు ఎదురు చూసారు. ఈ మనుషులకు వచ్చిన శిక్ష న్యాయమైనదేనని వారు నిశ్చితాభిప్రాయం. రక్షకుని అభిప్రాయం వినేవరుకూ శిష్యులు. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చటానికి సాహించలేదు. మనుషుల ప్రవర్తనల పై తీర్పు వెలిబుచ్చటం గురించి. తమ పరిమిత జ్ఞానంతో శిక్షను కొలవటం గురించి ఆయన వారికి స్పష్టమైన పాఠాలు బోధించాడు. అయినా వారు ఈ మనషులు ఇతరులకన్నా ఎక్కువ పాపులమని ఆయ విమర్శిస్తాడని ఎదురు చూసారు. ఆయన ఇచ్చిన సమాధానం వారిని విభ్రాంతపర్చింది.COLTel 171.3

    ప్రజా సమూహం తట్టు తిరిగి రక్షకుడా ఇలా అన్నడు “ఈ గలిలయులు అట్టి హింసలు పొందనందున వారు గలిలయులకందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరును అలాగే నశింతురు”. వారు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడటానికి వారిని నడిపించటానికి ఈ విపత్తులు ఉద్దేశించబడ్డాయి. ప్రతీకార తుపాను రేగుతున్నది. ఈ తుపాను క్రీస్తు ఆశ్రయం పొందని వారందరి మీద త్వరలో విరుచుకుపడనుంది.COLTel 172.1

    శిష్యులతోను జనసమూహంతోను మాట్లడుతున్నప్పుడు యేసు ప్రవచన దృష్టితో సైన్యాలు యెరూషలేమును ముట్టించడటం చూసాడు.యెరూష లేము పట్టణం మీదికి దండెత్తి వస్తున్న సైన్యాల పద ఘట్టనల్ని విన్నాడు. ఆముట్టడిలో వేవేల ప్రజలు నశించటం చూసాడు. అనేకమంది యూదులు ఆగలిలయుల్లాగ ఆలయావరణంలో బలి అర్పించే తరుణంలో హత మవ్వటం చూసాడు. వ్యక్తుల మీద పడ్డ విపత్తులు అంటే అపరాధి అయిన జాతికి దేవుని వద్ద నుండి వచ్చే హెచ్చరికలు.“మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరును అలాగునే నశింతురు” అని యేసన్నాడు. వారికి కృపకాలం మరికొంచెం సమయం కొనసాగింది. తమశాంతికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవటానికి వారికింకా సమయం ఉంది.COLTel 172.2

    ఆయన ఇంకా ఇలా అన్నాడు. “ఒకమనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాబడియుండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమియు దొరకలేదు. గనుక అతడు - ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు. దీనిని నరికవేయుము దీని వలన ఈ భూమియు ఏల వ్యర్ధమై పోవాలెనని ద్రాక్షతోటమాలితో చెప్పెను”.COLTel 173.1

    క్రీస్తు మాటలు వింటున్నవారు. వాటి అన్వయాన్ని అపార్థం చేసుకోవ టానికి అవకాశం లేదు. దావీదు తన కీర్తనలో ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకువచ్చిన ద్రాక్ష తీగెగా వర్ణించాడు. “ఇశ్రాయేలు వంశము సైన్యముకలధిపతగియు యెహోవా ద్రాక్షతోట. యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము” అంటూ యెషయా రాశాడు. యెష 5:7 క్రీస్తు ఏ తరం ప్రజల వద్దకు వచ్చాడో వారిన ప్రభువు ద్రాక్షతోటలోని అంజూరపు చెట్టు సూచించంది. వారుఆ యన ప్రత్యేక శ్రద్ధను దీవెనల్ని పొందిన ప్రజలుCOLTel 173.2

    తన ప్రజల విషయంలో దేవుని ఉద్దేశాన్ని వారి ముందున్న మహామాన్వితమైన అవకాశాన్ని ఈ చక్కని మాటల్లో వ్యక్తీకరిచటం జరిగింది. ” యెహోవా తన్ను మహిమపర్చుకొనునట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిని చెట్లనియు వారికి పేర్లు పెట్టుబడును”. యెష 6:13 మరణించటానికి సిద్ధంగా ఉన్న యాకోబు తాను ఎక్కువగా ప్రేమించిన కుమారుడు గురించి అత్యావేశం వలన ఇలా అన్నాడు. “యోసేపు ఫలించెడి కొమ్మ ఊటయెద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును. ‘నీతండ్రి దేవుని - దీవెనలతోను” సర్వశక్తిని “దీవెనలతోను క్రింద దాగియున్న ఆగాధ జలముల దీవెనతో నిన్ను దీవించును'. అది 49:22,25 ఈవిధంగా దేవుడు ఇశ్రాయేలుని జీవిత బాపుల పక్క నుండి ద్రాక్షవల్లిగా నాటాడు. ఆయన తన ద్రాక్షతోటను “సత్తువ భూమి గల కొండమీద” నాటాడు. “దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగెలను నాటించెను”. యెష 5:1,2.COLTel 173.3

    “ద్రాక్ష పండ్లు ఫలించెవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను” యెష 5:2 క్రీస్తుకి ముందు యుగాల్లోని యూదులకన్నా క్రీస్తు దినాల్లోని ప్రజలు తమ భక్తిని ఎక్కువగా ప్రదర్శించు కున్నారు. దేవుని ఆత్మవరాలైన సౌమ్య గుణాలు వీరిలో ఇంకా ఎక్కువగా లోపించాయి. యోసేపు జీవితానికి పరిమళాన్ని సౌందర్యాన్ని చేకూర్చిన ప్రశస్త ప్రవర్తన ఫలాలు యూదుజాతితో మచ్చుకి కూడా కనిపించలేదు.COLTel 174.1

    దేవుడు తన కుమారుని ద్వారా పండ్లు కోసం వెదికాడు గాని ఆయనకి పండ్లు దొరకలేదు. ఇశ్రాయేలు జాతి భూమికి భారమయ్యింది. దాని ఉనికి శాపంగా పరిణమించింది. ఎందుచేతనంటే ద్రాక్షతోటలో పండ్లు పండే ఒక మొక్క స్థలాన్ని అది అక్రమించుకుంది. ఇశ్రాయేలీయలు దేవుడు చేసెవని గురించి జాతుల నడుమ తప్పుడు అభిప్రయాలు కలిగించారు. వారు వ్యర్ధులు మాత్రమే కాదు పెద్ద ప్రతిబంధకంగా కూడా తయారయ్యారు. ఏటేటా వారి మతం ప్రజల్ని తప్పుదారి పట్టించి, రక్షణకు బదులు వారిని నాశనానికి నడిపించింది.COLTel 174.2

    ఉపమానంలోని ద్రాక్షతోటమాలి చెట్లు పండ్లు పండకుండా ఉంటే దాన్నినరికివెయ్యాలన్న తీర్పును ప్రశ్నించటం లేదు. ఆ చెట్టు అతడికి తెలుసు. ఫలించని దాని విషయమై తోట యాజమాని ఆసక్తిని అతడు పంచుకుంటున్నాడు. అది పెరిగి పండ్లు పండటం వల్ల అతడికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. యాజమాని తీర్మానం సందర్భంగా అతడు ఈ సమాధానం ఇస్తున్నాడు. ‘అయ్యో, నేను దానిచట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరి. అంత ఉపయోగంలేని మొక్క చాకిరీ చెయ్యటనాకి తోటామలి నిరాకరించటం లేదు. దాని పై మరింత శ్రద్ధ పెట్టటానికి సిద్ధంగా ఉన్నాడు. దాని పరిసరాల్ని అనుకూలంగా చేసి దాని వృద్ధి పై దృష్టి పెడతానన్నాడు.“నా ద్రాక్ష విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొను చున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి”? యెష 5:3,4.COLTel 174.3

    ద్రాక్షతోట యాజమానికి తోటమాలికి అంజూరపు చెట్లు విషయంలో ఒకేలాంటి ఆసక్తి ఉంది. అలాగే తండ్రి కుమారుడు ఇద్దరూ ఎన్నికైన ప్రజలపట్ల తమ ప్రేమ విషయంలో ఒకటిగా ఉన్నారు. తమకు మరిన్ని అవకాశాలిస్తామని క్రీస్తు తన శ్రోతలకు చెబుతున్నాడు. వారు నీతి వృక్షాలై లోకశ్రేయానికి ఫలాలు ఫలించే నిమిత్తం దేవుని ప్రేమ రూపొందించగల ప్రతీ సాధనం ఉపయుక్తమౌతుంది. COLTel 175.1

    తోటమాలి పని ఫలితం గురించి ఉపమానంలో క్రీస్తు వివరించలేదు. ఆవిషయంతోనే కథ అంతమయ్యింది. దాని ముగింపు ఆయన మాటలు విన్ని ఆ తరం ప్రజల మీద ఆధారపడి ఉంది. వారికి ఈ గంభీర హెచ్చరిక వచ్చింది. “లేని యెడల నరికించి వేయుము”. మార్పులేని ఈ మాటలు ఉచ్చరించబడటమో ఉచ్చరించబడకపోవటమో వారి మీదే ఆధారపడి ఉంటుంది. దేవుని ఉగ్రత దినం సమీపంలోనే ఉంది. అప్పటికే ఫలించని ఆ చెట్టు నాశనం చేయబడుతుందని ఇశ్రాయేలు మీద పడ్డ అపదల్లో ద్రాక్షతోట యాజమాని ముందే హెచ్చరించాడు. COLTel 175.2

    క్రమనుగతంగా ఈ హెచ్చరిక ఈ తరంలో ఉన్న మాకూ వస్తుంది. ఓ నిర్లక్ష్య హృదయమా, నీవు ప్రభువు ద్రాక్షతోట ఫలించని ఒక చెట్టు? నీకు వర్తింపచేస్తూ నాశనాన్ని గూర్చి మాటలు ఉచ్చరించటం జరగుతుందా? ఆయన వరాలు నీవెంతకాలంగా కలిగి ఉన్నావు. నీ నుంచి తిరిగి ఇచ్చే ప్రేమ కోసం ఆయన ఎంతకాంగా కని పెడుతున్నాడు. ఆయన ద్రాక్ష తోటలో నాటబడ్డ నీవు ఆ తోటమాలి పోషణ పెంపకంలో ఉన్న ఈవు. ఎన్ని అధిక్యతలు పొందావు! ప్రేమతో నిండిన సువార్త వర్తమానం ఎంత తరుచుగా నీ హృదయాన్ని ఆకట్టుకోలేదు? నీవు క్రీస్తు నామం పెట్టుకున్నావు. ఆయన శరీరమైన సంఘంలో నీవు నామమాత్రపు సభ్యుడవు. అయిన ఆప్రేమామయునితో నీకు సంబంధము లేదు. ఆయన జీవతమనే నది నీలో నుండి ప్రవహించటం లేదు. సౌమ్య గుణలక్షణాలు, అనగా “ఆత్మఫలములు” నీలో ఏకోశానా కనిపించటం లేదు. COLTel 175.3

    పండ్లు కాయని చెట్టుకి కూడా వర్షం సూర్యరశ్ళి తోటమాలిశ్రద్ధ లభిస్తాయి. అది పోషకాల్ని భూమి నుండి తీసుకుంటుంది.అయితే ఫలవంతం కాని కొమ్మలు నేలకు నీడను మాత్రమే ఇస్తాయి.ఫలాలు ఫలించే మొక్కలు దాని నీడలో ఉండి వృద్ధి చెందవు. అలాగే మీకు దేవడిచ్చిన వరాలు లోకానికి మేలు చేయవు. మీరు ప్రతిబంధకంగా లేకపోతే ఇతరులికి అంది ఉండే దీవెనల్ని మీరు దోచుకుంటున్నారు.COLTel 175.4

    మీరు నేలకు భారమవుతున్నారని కొంతమేరకైనా గ్రహించాలి. అయినా దయామయుడైన దేవుడు మిమ్మల్ని నరికివెయ్యలేదు. ఆయన మీపట్ల నిర్లక్ష్యం చూపడు. ఉదాసీనంగా పక్కకు తప్పుకోడు. లేక నాశనమవ్వటానికి మిమ్మల్ని విడిచి పెట్టడు. ఎన్నో శతాబ్దాల క్రితం “ఎఫ్రాయియూ, నెనెట్లు నిన్ను విడిచి పెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్న ఎట్టు విసర్జింతును?.. నా ఉగ్రతాన్ని బట్టి నాకు కలిగిన యోజనను నేను నెరవేర్చును. నేను మరల ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడనుగాని మనుష్యుడను కాను”. (హో షే 11:8,9) అని ఇశ్రాయలు గురించి దు:ఖించినట్లు ఆయన మిమ్మల్ని చూసి దు:ఖిస్తున్నాడు. నేను దాని చుట్టు తవ్వి, ఎరువు వేసేవరకు, ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు అంటూ దయాకనికరాలు గల రక్షకుడు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు.COLTel 176.1

    అదనపు కృపకాలంలో క్రీస్తు ఎంత అంచల ప్రేమతో ఇశ్రాయేలుకి పరిచర్య చేసాడు? సిలువ మీద “తండ్రీ వేరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” (లూకా 23:24) అని ప్రార్ధన చేసాడు. ఆయన అరోహణంఅయిన తరువాత యెరూషలేములో సువార్త ప్రకటిత మయ్యింది. అక్కడ పరిశుద్దాత్మ కుమ్మరింపు చోటు చేసుకుంది. అక్కడ మొదటి సువార్త తిరిగిలేచిన రక్షకుని శక్తిని బయలుపర్చింది. అక్కడ స్తెఫను “అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కన పెడను” (అ.కా 6:15) తన సాక్ష్యాన్నిచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. పరలోకమందున్న దేవుడు ఇవ్వగలిగిందంతా ఇచ్చాడు. “నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను”? అని క్రీస్తు బాధపడ్డాడు (యెష 5:4) కనుక మీ నిమిత్తం ఆయన శ్రద్ధాశక్తులు, శ్రమ ఏమి తగ్గలేదు అవి ఇంకా అధికమయ్యాయి ఆయన ఇలా అంటున్నాడు. “యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి విషయమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారత్రము దాని కాపాడుచున్నాను”. యెష 27:3.COLTel 176.2

    “అది ఫలించిన సరి, లేని యెడల”. దైవ సాధనాలకు స్పందించని హృదయం కఠినమైన చివరికి పరిశుద్దాత్మ ప్రభావానికి లొంగని స్థితికి వస్తుంది. “దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్ధమైపోవలెను”? అని పలకటం జరుగుతుంది.COLTel 177.1

    నేడు ఆయన మిమ్మల్ని “ఇశ్రాయేలూ, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము.. వారు విశ్వాస ఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును.. మనస్పూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని నీడ యందు నివసించువారు మరలవిత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసితంతురు”. హోషే 14:1-8.COLTel 177.2