Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మానసిక శక్తులు

    దేవుడు మాన మానసిక శక్తుల శిక్షణను కోరుతున్నాడు. తన సేవకులికి లోకస్తులకన్నా ఎక్కువ జ్ఞానం మరింత స్పష్టమైన అవగాహన ఉండాలన్నది ఆయన సంకల్పం. అజాగ్రత్తగా లేక సోమరితనంగా ఉండటం వల్ల అసమర్ధులు అజ్ఞానులు అయ్యే పనివారి విషయంలో ఆయన అంసతృప్తి చెందుతాడు మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ మనసుతో ప్రేమించాల్సిందిగా కోరుతున్నాడు. మన సృష్టికర్తను మన పూర్ణ మనసుతో ఎరిగి, ప్రేమించేందుకు మన మానసిక శక్తిని సంపూర్ణ స్థితికి వృద్ధిపర్చుకోవాల్సిన బాధ్యతను ఇది మన మీద పెడుతున్నది.COLTel 280.3

    మన జ్ఞానానికి ఇతరులికి అందించాలన్న ధ్యేయంతో మనం సాధ్యమైనంత విద్యను సముపార్జించాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. దేవుని పక్షంగా తాము ఎక్కడ ఎలా పని చెయ్యటానికి లేక మాట్లాడటానికి పిలుపు పొందుతారో ఎవరు ఎరుగరు. మనుషుల్ని మార్చి ఎలా ఉపయో గించుకోగలడో మన పరలోకపు తండ్రి మాత్రమే గ్రహించగలడు. మన దుర్బల విశ్వాసం గ్రహించలేని అవకాశాలు మన ముందున్నాయి. దేవుని నామనికి మహిమ కలిగే రీతిగా దైవ వాక్యంలోని సత్యాల్ని అవసరమైతే లోకాధికారుల మందు సమిహించేందుకు మన మనసులు శిక్షణ పొందాలి. దేవుని పనిచర్య నిమిత్తం మానసికంగా యోగ్యత సంపాదించటానికి ఒక్క అవకాశాన్ని కూడా మనం జారవిడువకూడదు.COLTel 280.4

    విద్య అవసరమైన యువత దాన్ని సపాదించటానికి ధృడమైన కృషి చెయ్యాలి. అవకాశం కోసం కనిపెట్టకండి. అవకాశాన్ని సృష్టించుకోండి. మీకు వచ్చే చిన్న తరుణాల్ని అందిపుచ్చుకోండి, పొదుపు పాటించండి మీ డబ్బును కడుపుకి లేక వినోదాలికి ఖర్చు పెట్టకండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న రీతిగా ప్రయోజకులు సమర్ధులు కావటానికి పట్టుదలతో కృషి చెయ్యకండి. మీరు చేపట్టిన కార్యమేదైనా దానిలో ఖచ్చితంగాను నమ్మకంగాను వుండండి. మానసికంగా పటిష్టతను సాధించటానికి ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోండి. పుస్తకాలు చదువుతూ ఉపయుక్తమైన శారీరక శ్రమను చేర్చి నమ్మకమైన కృషి, జాగృతి ప్రార్ధన ద్వారా పరలోక జ్ఞానాన్ని సముపార్జించండి. ఇది మీకు సామాన్య విద్యనిస్తుంది. ఇలా మీరు పటిష్ట ప్రవర్తనను నిర్మించుకొని ఇతరుల మనసుల పై ప్రభావాన్ని చూపవచ్చు. వారిని నీతిమార్గంలో నడిపించటానికి ఇది మీకు శక్తి సామర్ధ్యాలిస్తుంది.COLTel 281.1

    మన జాగృతి కలిగి మనకున్న అవకాశాల్ని అధిక్యతల్ని గుర్తించినట్లయితే స్వయంగా విద్యను ఆర్జించే విషయంలో మరెక్కువ సాధించటం సాధ్యడుతుంది. వాస్తవిక విద్యలో కళాశాలలు నేర్పగల విద్యకన్నా ఎక్కువే ఇమిడి ఉంది. విజ్ఞాన శాస్త్ర అధ్యయనాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండాల్సి ఉండగా, దేవునితో ముఖ్య సంబంధము ద్వారా సంపాదించాల్సి ఉండగా, దేవునితో ముఖ్య సంబంధము ద్వారా సంపాదించాల్సిన ఉన్నత శిక్షణ ఒకటి ఉంది. ప్రతీ విద్యార్ధి బైబిలు పట్టుకొని ఆ మహెపాధ్యాయునితో మాట్లాడే స్థానంలో తన్ను తాను ఉంచుకోవాలి దైవసత్యాల అన్వేషణలో ఎదురయ్యే గడ్డు సమస్యల్ని పరిష్కరించటానికి మనసుకు శిక్షణ క్రమశిక్షణ ఇవ్వాలి.COLTel 281.2

    దేవుని సేవ చేయ్యగోరే ప్రతీ సేవకుడు స్వయం శిక్షణ పాటించాలి. వాగ్దాటి లేదా గొప్ప వరాలు మనము సాధించగలిగే దానికన్నా ఇది ఎక్కువ సాధిస్తుంది. స్వయం శిక్షణ గల సమాన్య మనసు స్వయం శిక్షణ లేని అత్యున్నత విద్య గొప్ప వరాలు గల మనసు సాధించగలిగే దాని కన్నా ఎంతో ఎక్కువ సాధించగలుగుతుంది,.COLTel 282.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents