Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోగ్యం

    ఆరోగ్యమనే దీవెన విలువను బహుకొద్ది మంది మాత్రమే అభినందిస్తారు. అయినా మన మానసిక, శారీరకశక్తుల సామర్ధ్యం దాని మీదే చాలా మట్టుకు ఆధారపడి ఉంటుంది. మన ఉద్వేగాలకు ఆవేశాలకు శరీరమే కేంద్రం. మన తలాంతుల్ని అత్యున్నతమైన ప్రయోజనానికి వినయో ఇంచేందుకు శరీరాన్ని ఉత్తమ భౌతిక స్థితిలోను, మిక్కిలి ఆధ్యాత్మిక ప్రభావాకింద ఉంచాలి.COLTel 294.2

    శారీరక శక్తిని తగ్గించేదేదైనా మనసును బలహీనపర్చి మంచి చెడు మద్య గల తేడాను గ్రహించే శక్తిని క్షీణింపచేస్తుంది. మంచిని ఎంపిక చేసుకొనే సామరధ్యం తగ్గుతుంది. మంచిదిగా న్యాయమైందిగా మనకు తెలిసిన దాన్ని చేయటానికి మనకు తక్కువ చిత్తశక్తి ఉంటుంది.COLTel 294.3

    మన శరీరక శక్తుల దుర్నినియోగం మన జీవితాల్ని దేవుని మహిమర్ధాం ఉపయోగించాల్సిన కాలవ్యవధిని తగ్గిస్తుంది. దేవుడు మనకిచ్చిన పనిని నిర్వహించటానికి అది మనల్ని అయోగ్యుల్ని చేస్తుంది. చెడ్డ అలవాట్లును అలవర్చుకోవటం ద్వారా రాత్రి చాలా సమయం మేల్కొని ఉండటం ద్వారా అనారోగ్యకరంగా తిండి తినటం ద్వారా మనం బలహీనతకు పునాది వేస్తాం. వ్యాయామాన్ని ఆశ్రద్ధ చెయ్యటం ద్వారా మనససు లేక శరీరానికి ఎక్కువ పని ఇష్టం ద్వారా మనం మన నాడీమండల సమౌతుల్యాన్ని పాడుచేసుకుంటాం. ప్రకృతి చట్టాల్ని లెక్కచెయ్యకపోవటం ద్వారా తమ జీవితాల నిడవిడి తక్కువ చేసుకొని సేవకు తమ్ముని తాము అనర్హుల్ని చేసుకునేవారు దేవున్ని దోచుకుంటున్న అపరాధానికి పాల్పడు తున్నవారవుతారు. వారు తమ సాటి మనుషుల్ని దోచుకుంటున్నవారు కూడా ఇతరులికి దీవెనగా ఉండే తరుణం వారిని COLTel 294.4

    దేవుడు లోకంలోకి ఏ పనిని నిమిత్తం పంపాడో అది వారి కార్యాచరణ విధానం వల్ల అంతమౌతుంది. తమకున్న కొద్ది కాలంలోనే తాము చేయగల పనికి కూడా వారు తమ్ముని తాము అయోగ్యుల్ని చేసుకుంటారు. మనకు హనికరమైన అలవాట్లు అభ్యాసాల వలన మనం లోకానికి చేయాల్సి మేలును చెయ్యకపోతే దేవుడు మనల్ని అపరాధులుగా పరిగణిస్తాడు.COLTel 295.1

    శారీరక చట్టం ఉల్లంఘన నైతిక చట్ట ఉల్లంఘనే. ఎందుచేతనంటే శారీరక చట్టానికి నైతిక చట్టానకి కర్తఆయనే. ఆయన తన ధర్మశాస్త్రాన్ని ప్రతీ నరం మీద, ప్రతీ కండరం మీద ప్రతీ మానసిక శక్తి మీద తన వేలితో రాసి దాన్ని మనకు అప్పగించాడు. మన శరీరాభాగాల్లో దేన్ని మనం దుర్వినియోగం చేసినా అది ఆచ్చట్ట ఉల్లంఘన అవుతుంది.COLTel 295.2

    దేవుని సేవ చెయ్యటానికి తమ శరీరాల్ని అవి ఉండాల్సిన స్థితిలో ఉంచుకునేందుకు అందరు మానవ శరీరాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. మానవత్వం ద్వారా దైవ సంబంధం పూర్తిగా వెల్లడయ్యేందుకోసం శారీరక జీవితాన్ని జాగ్రత్తగా పరిరక్షించి వృద్ధిపర్చటం జరగాలి. ఆధ్యాత్మిక జీవితానికి శరీర అంగక్రమ నిర్మాణానికి మధ్య గల సంబంధం విద్య తాలూకు ముఖ్యశాఖల్లో ఒకటి. దాని పట్ల గృహంలోను పాఠశాలలోను శ్రద్ధ చూపటం అవసరం. తమ దేహ నిర్మాణం గురించి స్వాభావిక జీవితాన్ని నియంత్రించే నియాల్ని గురించి అందరు తెలుసుకోవటం అసవరం. తమ దేహానికి సంబంధించిన నియమాల్ని తెలుసుకోకుండా ఉంటూ తమ అజ్ఞానం వల్ల వాటిని అతిక్రమించేవారు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. అందరూ జీవితానికి ఆరోగ్యానికి మధ్య ఉండగల ఉత్తమ సంబంధాన్ని నిలుపుకొని జీవించాలి. మనసును దేవుని నియంత్రంణ కింద ఉంచి మన అలవాట్లును దాని అదుపులో ఉంచాలి. “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలో నన్ను పరిశుద్దాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి.” 1 కొరి 6:19,20COLTel 295.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents