Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    కరుణ ప్రేమ ప్రేరకాలు

    దయ, ప్రేమ, ఉదార ఉద్వేగాలు, ఆధ్యాత్మిక విషయాల త్వరిత అవగాహన చాలా విలువైన తలాంతులు, అవి ఉన్నవారి పై అవి బరువైన బాధ్యతను మోపుతాయి. ఇవన్నీ దేవుని సేవలో వినియుక్తమవ్వాలి. అనేకులు ఇక్కడే పరొబడుతున్నారు. ఈ గుణాలు కలిగి ఉండటంతో తృప్తి చెంది, వాటిని ఇతరులికి పరిచర్య చేయటంలో వినియోగించరు. తమకు అవకాశం కలిగితే పరిస్థితులు అనుకూలిస్తే తామూ మంచి పని చేస్తామని వారు తమ్ముని తాము పొగుడుకుంటారు. అయితే వారు అవకాశం కోసం కని పెడుతంటారు. బీదలకు ఇనుమంతకూడా విదపని పిసినారి కొద్ది బుద్ధిని ద్వేషిస్తారు. అఈతడు తనక కోసమే నివస్తున్నాడని అతడు తన తలాంతుల్ని దుర్వినియోగం చేస్తున్నాడని దుమ్మెత్తిపోస్తారు. తమకూ సంకుచిత బుద్ధి గల వారికి మధ్య ఉన్న తేడాను ప్రస్తావించి కొద్ది బుద్దులు గ తమ పొరుగువారి పరిస్థితి కన్నా తమ పరిస్థితి ఎంతో మెరుగని చెప్పుకుంటారు. అయితే వారు తమ్మును తామే మోసం చేసుకుంటున్నారు. ఉపయోగించని విశేష గుణాల్ని కలిగి ఉండటమే వారి బాధ్యతను పెంచుతుంది. విశేష ప్రేమానురాగాలు కలిగి ఉన్నవారు వాటిని తమ స్నేహితుల పట్ల మాత్రమే కాక తమ చేయూత అవసరమైన వారిందరిపట్ల కనపర్చాలి. సాంఘిక ప్రయోజనాలు తాంతులే. వాటిని మన ప్రభావ పరిధిలో ఉన్నవారందరి వినియోగార్థం అందుబాటులో ఉంచాలి. కొందరికి మాత్రమే దయచూపించే ప్రేమ ప్రేమ కాదు, స్వార్ధం, ఆత్మల మేలు కోసం లేక దేవుని మహిమ కోసం అది పనిచెయ్యదు. తమ ప్రభువిచ్చిన తలాంతుల్ని వృద్ధిపర్చకుండా విడిచి పెట్టేవారు తాము ఎవరిని ద్వేషిస్తున్నారో ఆ కొద్ది బుద్ధి కలవారి కన్నా ఎక్కువ అపరాధులు. మీ ప్రభువు చిత్తమేంటో మీకు తెలుసు కాని దాన్ని మీరు నెరవేర్చలేదని వారికి చెప్పటం జరుగుతుంది.COLTel 300.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents