Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    29—“పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు”

    ఆధారం మత్తయి 25:1-13

    ఒలీవల కొండమీద క్రీస్తు తన శిష్యులతో కలసి కూర్చున్నాడు. పర్వతాల వెనక సూర్యుడు అస్తమించాడు. సాయంత్రం నీడలు అలముకుంటున్నాయి. ఏదో వేడకకు సన్నద్ధమౌతున్నట్లు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్న ఒక గృహం అక్కడ నుండి స్పష్టంగ కనిపిస్తుంది. వెలుతుల్లో నుంచి వెలుగు ప్రకాశిస్తుంది. ఆశతో ఎదురుచూస్తున్న జనసమూహం వేచి ఉంది. ఒక పెండ్లి ఊరేగింపు త్వరలో మొదలుకానున్నట్లు కనిపించింది. తూర్పున అనేక ప్రాంతాల్లో పెళ్ళి వేడుకలు సాయంత్రం జరగుతాయి. పెండ్లికుమారుడు బయలుదేరి వెళ్ళి పెండ్లికుమార్తెను కలుసుకొని తన ఇంటికి తీసుకువెళతాడు. ఆడ పెళ్ళివారు పెండ్లికుమార్తె తండ్రి ఇంటి నుండి బయలుదేరి దివిటీల వెలుగులో పెండ్లికుమారుడి ఇంటికి వెళ్తారు. పెండ్లికుమారుడి ఇంటి వద్ద ఆహ్వానితులైన అతిథులికి విందు జరుగుతుంది. క్రీస్తు చూస్తున్న ఆ దృశ్యంలో ఊరేగింపులో కలిసి పెళ్ళివిందుకి వెళ్లటానికి పెండ్లి పార్టీ రాకకు ఎదురు చూస్తున్న గుంపు ఒకటి ఉంది.COLTel 354.1

    తెల్లని వస్త్రాలు ధరించిన పది మంది కన్యకలు పెండ్లికుమార్తె ఇంటి వద్ద వేచి ఉన్నారు. వారిలో ప్రతీ ఒక్కరూ వెలుగుతున్న దివిటీని అదనపు నూనెగల చిన్న సీసాను పట్టుకొని ఉన్నారు. అందరూ పెండ్లి కుమారుడి రాకకోసం ఎదురు చూస్తున్నారు. రాకలో కొంత అలస్యం జరిగింది. గంట ఇంకో గంట ఇలా ఆలస్యం ఎక్కువవుతూ వచ్చింది. వేచి ఉన్నవారు అలసిపోయి నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ “ఇదిగో పెండ్లికుమారుడు,అ తని ఎదుర్కొన రండి” అన్న కేక వినిపించింది. నిద్రమత్తులో ఉన్నవారు హఠాత్తుగా మేల్కొని లేచి నిలబడ్డారు. పెండ్లి ఊరేగింపు దివిటిల వెలుగుతో ఉత్సాహభరితమైన సంగీతంలో ముందుకు సాగటం చూసారు. పెండ్లికుమారుడి స్వరం పెండ్లికుమార్తె స్వరం విన్నారు. ఆ పదిమంది కన్యకలు వాళ్ళ దివిటీలు తీసుకొని త్వరత్వరగా ముందుకి సాగటానికి దివిటీల్ని చక్కబర్చుకున్నారు. కాకపోతే ఐదుగురు కన్యకలు తమ సీసాల్లో అదనపు నూనె నింపుకోలేదు. అంత సుదరీమైన ఆలస్యాన్ని వారు ఊహించులేదు. ఆ అత్యవసర పరిస్థితి వారు సిద్ధంగా లేరు. ఆందోళన చెందుతూ బుద్దిగల తమ స్నేహితురాండ్రని “మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడి” అంటూ ప్రాధేయపడ్డారు. కాని స్థిదముగా ఉన్న ఆ ఐదుమంది కన్యకలు వారి దివిటీలను తాజాగా సరిచేసుకొని తమ అదనపు నూనె సీసాల్ని ఖాళీ చేసారు. వారి వద్ద అదనపు నూనె లేదు. “మీకును మాకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడి” అని బదులు పలికారు.COLTel 354.2

    వారు నూనె కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు పెండ్లి ఊరేగింపు ముందుకి సాగింది. ఆ అయిదుగురు బుద్దిలేని కన్యకలూ వెనుక మిగిలిపోయారు. వెలుగుతున్న దివిటీలు గల అయిదుమంది కన్యకలు జనసమూహంతో కలసి పెండ్లి జనంలో భాగమైన లోపల ప్రవేశించారు. అంతట తలుపుమూశారు. బుద్దిలేని కన్యకలు పెండ్లి విందు జరిగే స్థలానికి వచ్చినప్పుడు తాము అనుకొని తిరస్కారం ఎదరుయ్యింది. విందు అధికారి వారితో “మిమ్మునెరుగును” అన్నాడు. వారు బయట ఖాళీ విధీలో రాత్రి చీకటిలో మిగిలిపోయారు.COLTel 355.1

    పెండ్లి కుమారుడి కోసం వేచి ఉన్న జనుల్ని కూర్చని చూస్తు క్రీస్తు పదిమంది కన్యకల కథను చెప్పి వారి అనుభవాన్ని ఉదాహరణగా తీసుకొని తన రెండో రాకకు ముందు సంఘం అనుభవాన్ని తన శిష్యులికి వివరించాడు.COLTel 355.2

    వేచి ఉన్న రెండు తరగతుల ప్రజలు తమ ప్రభువు కోసం కని పెడుతున్నామని చెప్పుకునే రెండు తరగతుల ప్రజల్ని సూచిస్తున్నారు. వారు తమకు స్వచ్చమైన విశ్వాసమున్నట్లు చెప్పుకుంటున్నారు. గనుక వారిని కన్యకలుగా పేర్కొటం జరిగింది. దివిటీ దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది”(కీర్త 119:105) అంటున్నాడు. కీర్తనకారుడు. నూనె పరిశుద్దాత్మకు చిహ్నాం. జెకర్యా ప్రవచనంలో పరిశుద్దాత్మను ఈవిధంగా సూచించటం జరిగింది. అతడిలా అంటున్నాడు.“నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యెకని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని యుడగగా నేను సువర్ణమయమైన దీప స్థంభమును దాని మీద ఒక ప్రమిదెయును, దీప స్థంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి గొట్టములును కనపడుచున్నవి. మరియు రెండు ఒలీవచెట్లు దీప స్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాట్లాడు చున్న దూత నడిగితిని.. అప్పుడతడు నాతో ఇట్టననె - జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇవి జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను... ఈరెండు ఓలీవ చెట్లు ఏమిటనియు నేనడిగితిని... అతడు.. వీరిద్దరు సర్వలోక నాధుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారైయున్నారనెను.” జెక 4:1-4COLTel 355.3

    ఆ రెండు ఒలీవ చెట్ల నుండి సువర్ణతైలం రెండు బంగారు గొట్టాల ద్వారా దీపస్థంబం ప్రమిదెలోకి, అక్కడ నుంచి సువర్ణ దీపాల్లోకి సరఫరా అయ్యింది. ఆ దీపాలు గుడారానికి వెలుగు సమకూర్చాయి. అలాగే దేవుని సముఖంలో నిలబడే పరిశుద్ధులు నుంచి ఆయన సేవకు సమర్పించుకున్న మానవ ప్రతినిధులకు ఆయన ఆత్మ సరఫరా అవుతుంది. అభిషిక్తులైన ఈ ఇద్దరి కర్తవ్యం ఆయన వాక్యాన్ని పాదాలకు దీపం త్రోవకు వెలుగు చేయగల దైవకృపను దేవుని ప్రజలకు అందించటం. “శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియుగ యోహోవా సెలవిచ్చెను.” జెక 4:6COLTel 356.1

    ఉపమానంలో పెండ్లికుమారుణ్ణి కలవటానికి మొత్తం పది మంది కన్యకలూ వెళ్ళారు.అందరికి దివిటలు నూనెసీసాలు ఉన్నాయి. కొంతకాలం వారి మధ్య ఎలాంటి తేడా కనిపించలేదు. క్రీస్తు రెండో రాకకు ముందు సంఘం విషయంలోను అలాగే ఉంటుంది. అందరికి లేఖన జ్ఞానం ఉంటుంది. క్రీస్తు సమీపంలో ఉన్నాడన్న వర్తమనాన్ని అందరు వింటారు. ఆయన రాకకు విశ్వాసంతో ఎదురు చూస్తారు. అయితే ఉపమానంలో లాంటి పరిస్తితే నేడూ ఉంది. వేచి ఉండాల్సిన కాలం వస్తుంది. విశ్వాస పరీక్ష ఎదురవుతుంది. “ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి”అన్న కేక వినబడ్డప్పుడు అనేకులు సిద్ధంగా ఉండరు. వారికి దివిటీలతో పాటు తమ సీసాల్లో నూనె ఉండదు. వారికి పరిశుద్దాత్మ సరఫరా ఉండదు.COLTel 356.2

    దేవుని ఆత్మ లేకుండా ఆయన వాక్య జ్ఞానం నిరూపయోగం. పరిశు ద్దాత్మ లేని సత్య సిద్ధాంతం ఆత్మను చైతన్యపర్చలేదు. లేక హృదయాన్ని శుద్ది చేయలేదు. ఒకరు బైబిలులోని ఆజ్ఞలు వాగ్దానాలతో పరిచయం కలిగి ఉండవచ్చు. కాని దేవుని ఆత్మ సత్యాన్ని హృదయంలో పొందుకొల్పకపోతే ప్రవర్తనలో మార్పు కలగదు. ఆత్మ వికాసం లేకుండా మనుషులు సత్యాన్ని తప్పును గుర్తించలేరు. వారు సాతాను మోసపూరిత శోధనలకు బలి అవుతారు.COLTel 357.1

    బుద్దిలేని కన్యకలు సూచించే తరగతి ప్రజలు దొంగభక్తులుకారు. వారికి సత్యం పట్ల గౌరవం ఉంటుంది. వారు సత్యప్రగతికి కృషి చేస్తారు. సత్యాన్ని విశ్వసించేవారికి వారు ఆకర్షితులవుతారు. కాని వారు పరిశు ద్దత్మ పనికి తమ హృదయంలో తావివ్వరు. క్రీస్తు యేసు బండమీదపడి తమ పాత స్వభావాన్ని ముక్కలు చేసుకోరు. రాతినేల శ్రోతలు కూడా ఈ తరగతి ప్రజలను సూచిస్తారు. వారు వాక్యాన్ని వెంటనే అంగీకరిస్తారు. గాని దాని సూత్రాల్ని అవగాహన చేసుకోవటంలో విఫలులవుతారు. మనుషుడి కోరిక సమ్మతి ప్రకారం పరిశుద్దాత్మ హృదయంలో పనిచేసి అతడిలో నూతన స్వభావం పాదుకొల్పుతాడు కాని బుద్దిలేని కన్యకలు సూచించే తరగతి వారు పైకి కనిపించే అంతంత మాత్రపు పనితో తృప్తి చెందుతారు. వారు దేవున్ని ఎరుగరు. ఆయన ప్రవర్తనను అధ్యయనం చెయ్యరు. ఆయనతో సంబంధము కలిగి ఉండరు. అందుకే ఆయన్ని ఎలా విశ్వసించాలో ఎలా ఆయన వంక చూసి జీవించాలో వారికి తెలియదు. దేవునికి వారి సేవ ఒక ఆచారంగా మారుతుంది. “జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటిననుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభము నపేక్షించుచ్నుది”. యోహ 33:31 ఇది క్రీస్తు రెండో రాకకు ముందు నివసించే ప్రజల ప్రత్యేక గుణ లక్షణమైన ఉంటుందని అపొస్తలుడైన పౌలు సూచిస్తున్నాడు. పౌలిలా హెచ్చరిస్తున్నాడు. “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము ఏలాగనగా మనుష్యులు స్వార్ధప్రియులు.... దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు”. 1 తిమోతి 3:1-5COLTel 357.2

    అపాయకరమైన కాలంలో సమాధానం. క్షేమం అంటూ కేకలు వేసే ప్రజలు వీరే. వీరు భద్రత ఉన్నదంటూ తమ హృదయాలకు జోలపాడ్డారు. పొంచి ఉన్న అపాయాన్ని గురించి ఆలోచించరు. తమ నిశ్చేష్టత నుంచి ఆదిరిపడి లేచినప్పుడు తమ లేమిని గుర్తింపు దాన్ని పూరించమంటూ ఇతరుల్ని ప్రాధేయపడ్డారు. అయితే ఆధ్యాత్మిక విషయాల్లో ఎవరూ ఇతరుల లోటును తీర్చలేరు. దేవుని కృప అందరికి ఉచితంగా లభిస్తుంది. “దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్చయించు వానిని జీవజలమును ఉచి తముగా పుచ్చుకొననిమ్ము” (ప్రక 22:17) అన్న సువార్త వర్తమానం ప్రకటితమవుతుంది. కాని ప్రవర్తన మరొకరికి మార్పిడి చెయ్యటానికి సాధ్యం కాని వస్తువు. ఎవరూ ఇంకొకరి బదులు నమ్మటం సాధ్యపడదు. ఎవరూ ఇంకొకరి స్థానే పరిశుద్దాత్మను పొందలేరు. పరిశుద్దాత్మ పని ఫలమైన ప్రవర్తనను ఎవరూ ఇంకొకరికి బదిలీ చెయ్యలేరు. “నోవహు దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో (లోకంలో) ఉన్నను నా జీవవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు అని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు”. యోహా 14:20.COLTel 358.1

    సంక్షోభంలో ప్రవర్తన వెల్లడవుతుంది. మధ్యరాత్రిలో “ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి” అన్న స్వరం వినిపించగా గాఢనిద్రలో ఉన్న కన్యకలు మేల్కొనప్పుడు పెండ్లి విందుకి ఎవరు స్థిదంగా ఉన్నది తెలిసింది. రెండు వర్గాలకు అది తెలియని ఘటనే. ఒక వర్గం అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉంది. తక్కింది సిద్ధంగా లేదు. అలాగే ఇప్పుడు ఏదో విపత్తు సంభవించి, హఠాత్తుగా కలిగే మరణం దేవుని వాగ్దానాల పై నిజమైన విశ్వాసం ఉందో లేదో సూచిస్తుంది. మానవ కృపకాలం అంతంలో చివరి పరీక్ష వస్తుంది. అప్పుడు ఆత్మకున్న అవసరాన్ని తీర్చటానికి సమయం మించిపోతుంది.COLTel 358.2

    ఆ పదిమంది కన్యకలు లోక చరిత్ర సాయంసంధ్యలో వేచి ఉన్నారు. అందరూ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. అందరికి పిలుపు ఉంది. పేరు ఉంది, దివిటీ ఉంది, అందరూ దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటు న్నారు. అందరూ క్రీస్తు రాకకు కని పెడుతున్నట్లు కనిపిస్తున్నారు. కాని అయిదు మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారు. విందుశాల వెలపల అయిదు మంది ఆశ్చర్యంతో ఆశాభంఘముతో నిండి మిగిలిపోతారు.COLTel 359.1

    ఆ చివరి దినాన క్రీస్తు రాజ్యంలోకి ప్రవేశం కోరుతూ అనేకులు ఇలా అంటారు,. “నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే”. “ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా ? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా ?” ఆయన జవాబు ఇది, “మీరెక్కడివారో మిమ్మును ఎరుగును.... నా యొద్ద నుండి తొలగిపొండి.”లూకా 13:26,27, మత్త 7:22 వారు ఈజీవితంలో క్రీస్తు సహవాసంలో ప్రవేశించలేదు. అందుచేత వారికి పరలోక భాషతో పరిచయం లేదు. అక్కడి ఆనందానికి వారు పరదేశులు. “ఒక మనుషుని సంగతులు అతని లోనున్న ఆత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు”.COLTel 359.2

    “మిమ్మును ఎరుగను” అన్న మాటలు మానవుల చెవులకు వినిపించే మాటలన్నిటిలోను మిక్కిలి విచారకరమైన మాటలు. మీరు ఆలక్ష్యం చేసే ఆత్మ సహవాసం మాత్రమే మిమ్మల్ని పెండ్లి విందులోని ఉత్సాహ జన సమూహంలో భాగంగా చెయ్యగలుగుతుంది. అది లేకపోతే ఆ సన్నివేశంలో మీరు పాలు పొందలేరు. దాని వెలుగు చూడటానికి మీరు నోచుకోరు దాని సుమధుర సంగీతాన్ని వినలేరు. లోకాశలు ఆసక్తులతో బండబారిన హృదయంలో అక్కడి ప్రేమ, ఆనందం, సంతోషం రేకెత్తించలేవు. అక్కడి సాంగత్యానికి మిమ్మల్ని మీరే అనర్హుల్ని చేసుకొని పరలోకం వెలుపల ఉంటారు.COLTel 359.3

    “ఇదిగొ పెండ్లికుమారుడు” అన్నప్పుడు మేల్కొని అప్పుడు మన ఖాళీ సిద్ధాల్లో నూనె నింపుకోవటానికి ప్రయత్నించటం ద్వారా మనంప్రభువు రాకకు సిద్ధపడలేం. ఇక్కడ మన జీవితాల్లో నుంచి క్రీస్తును దూరంగా ఉంచి, పరలోకంలో ఆయనతో సాంగత్యానికి యోగ్యతను సంపాదిచటం ఆసాధ్యం .COLTel 360.1

    ఉపమానంలోని బుద్దిగల కన్యకలు తమ దివిటీల్లోను సీసాల్లోను నూనె ఉంచుకున్నారు. వారు వేచి ఉన్న రాత్రంతా వారి దివిటీలు తేజోవంతగా వెలిగాయి. ఆ వెలుగు పెండ్లికుమారుని గౌరవం పెంచటానికి తోడ్పడింది. చీకటిలో ప్రకాశిస్తూ అది పెండ్లి కుమారుడి ఇంటికి పెండ్లి విందుకు వెళ్ళే మార్గాన్ని వెలుగుతో నింపటానికి తోడ్పడింది.COLTel 360.2

    అలాగే క్రీస్తు అనుచరులు లోకంలోని చీకటిలో వెలుగును ప్రకాశింపజెయ్యాల్సి ఉన్నారు. దైవ వాక్యాన్ని స్వీకరించే వ్యక్తి జీవితంలో అది పరివర్తన శక్తిగా మారేకొద్ది పరిశుద్దాత్మ ద్వారా గొప్ప వెలుగు అవుతుంది. దైవ వాక్య సూత్రాల్ని మానవ హృదయంలో పాదుకొల్పటం ద్వారా పరిశు ద్దాత్మ వారిలో దేవుని గుణశీలాల్ని వృద్ధిపర్చుతాడు. ఆయన మహిమా ప్రకాశం - ఆయన ప్రవర్తన - ఆయన అనుచరుల్లో ప్రకాశించాల్సి ఉంది. పెండ్లి కుమారుడి ఇంటికి, దేవుని పట్టణానికి గొర్రెపిల్ల పెండ్లి విందుకి మార్గాన్ని వెలుగులో నిం పేందుకు ఈ విధముగా వారు దేవుని మహిమపర్చాల్సి ఉన్నారు.COLTel 360.3

    పెండ్లి కుమారుడి రాక ఆర్ధరాత్రి వేళ సంభవించింది. అది మిక్కిలి అంథకార గడయ, అలాగే క్రీస్తు రాకడ లోక చరిత్ర మిక్కిలి అంధకార గడియలో చోటు చేసుకుంటుంది. మనుషుకుమారుని రాకడకు ముందుండే ప్రపంచ పరిస్థితుల్ని నోవహూ దినాలు లోతు దినాలు చిత్రీకరిస్తున్నాయి. “దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో” సాతాను గొప్ప శక్తితో పనిచేస్తాడని ఈ కాలాన్ని సూచిస్తున్న లేఖనాలు తెలుపుతున్నాయి. (2 థెస్స 2:9, 10) ఇంతలంతలవుతున్న చీకటిని బట్టి, కోకొల్లల తప్పిదాల్ని బట్టి, సంఘ వ్యతిరేక సిద్ధాంతాల్ని బట్టి ఈ చివరి దినాల మోసాల్ని బట్టి సాతాను పని స్పష్టంగా వెల్లడవుతుంది. సాతాను లోకాన్ని బానిసత్వంలోకి నడిపించటమే కాదు అతడి మోసాలు క్రీస్తు యేసు ప్రభువు సంఘాలుగా చెప్పుకుంటున్న సంఘాల్ని పులిపిండితో పాడు చేస్తున్నాయి కూడా. ఈ గొప్ప భ్రష్టత అర్ధరాత్రి చీకటి అయి విస్తరిస్తుంది. అది దుర్గమ ప్రదేశమవుతుంది. అది దైవ ప్రజలకు మహాశ్రమ రాత్రిగా దు:ఖ రాత్రిగా సత్యం నిమిత్తం కలిగే హింసారాత్రిగా పరిణమిస్తుంది. అయితే ఈ రాత్రి గాడాంధకారంలో నుంచి దేవుని వెలుగు ప్రకాశిస్తుంది.COLTel 360.4

    ఆయన “అంధకారములో నుండి వెలుగు ప్రకాశింపచేస్తాడు. 2 కొరిధి 4:5 “భూమి నిరాకరముగాను శూన్యముగాను (ఉండి) ... చీకటి ఆగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పై అల్లాడచుండెను. దేవుడు - వెలుగుకమ్మని పలుకగా వెలుగు కలిగినె'. అది 1:2,3 అలాగే ఆధ్మాత్మిక చీకటి రాత్రిలో “వెలుగుకమ్మని” దేవుడు పలుకుతాడు. తన జనులతో ఆయన “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము యోహోవా మహిమ నీ మీద ఉదయించెను” అంటాడు. యెష 60:1COLTel 361.1

    లేఖనం ఇలా అంటున్నది. “చూడుము భూమిని చీకటికమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యోహోవా నీమీద ఉదయించు చున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది”. యెష 60:2COLTel 361.2

    లోకాన్ని కమ్ముకుంటున్న చీకటి దేవుని గూర్చిన దురవగాహన చీకటి. మనుషులు ఆయన ప్రవర్తనను గూర్చిన జ్ఞానాన్ని కోల్పోతున్నారు. మనుషులు దాన్ని అపార్థం చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో దేవుని నుంచి ఒక వర్తమానం -- వికాసాన్నిచ్చే ప్రభావం గల, రక్షించే శక్తిగల వర్తమానం -- ప్రకటించబడాల్సి ఉంది. ఆయన ప్రవర్తనను ప్రచురించాలి. ఈ లోకపు చీకటిలో ఆయన మహిమ తాలూకు వెలుగు, కృపాసత్యాల కాంతి ప్రకాశించాల్సి ఉంది. యెషయా ప్రవక్త పలికిన ఈ మాటల్లో ఈ పనిని సూచిచంటం జరిగింది: “యెరుషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి - ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుము. ఇదిగో తన బహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యోహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద నున్నది. ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది.” యెష 40:9, 10.COLTel 361.3

    పెండ్లి కుమారుడి రాకకు ఎదురు చేసేవారు “ఇదిగో మీ దేవుడు” అని ప్రజలతో చెప్పాలి. ఆయన ప్రేమ పూరిత ప్రవర్తన వెల్లడే కృప తాలూకు వెలుగు చివరి కిరణాలు లోకానికి అందించాల్సిన చివరి కృపా వర్తమానం. దేవుని ప్రజలు ఆయన మహిమను ప్రదర్శించాల్సి ఉన్నారు. దేవుని కృప తమలో కలిగించిన మార్పును వారు తమ జీవితంలోను నడవడిలోను కనపర్చాలి.COLTel 362.1

    నీతి సూర్యుని వెలుగు సత్కైయల ద్వారా ప్రకాశించాలి. సత్యాన్ని ప్రచురించటంలో, పరిశుద్ద క్రియల్లో అది ప్రజ్వలించాలి. తండ్రి మహిమకు బాహ్య ప్రకాశం అయిన క్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడు. దేవుని ప్రతినిధిగా మనుషుల వద్దకు వచ్చాడు. దేవుడు ఆయన్ని “పరిశద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనని”, “ఆయన మేలు చేయుచు.. సంచరించు చుండెను’ అని ఆయన్ని గూర్చి లేఖనం చెబుతుంది. (అ.కా. 10:38) నజరేతులోని సమాజ మందిరంలో ఆయన ఇలా అన్నాడు, “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” లూకా 4:18, 19. ఈ సేవను చేయాల్సిందిగా ఆయన తన శిష్యుల్ని ఆదేశించాడు. ఆయన అన్నాడు, “మీరు లోకమునకు వెలుగైయున్నారు, ” “మనుష్యులు మీ సృయలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” మత్త 5:14, 16.COLTel 362.2

    యెషయా ప్రవక్త ఈ సేవనే ఈ మాటల్లో వర్ణిస్తున్నాడు, “నీ ఆహారమును ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము నిచ్చుటయు ఇదియేగదా నా కిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శ్రీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడచును. యోహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును.” యెష 58:7, 8.COLTel 363.1

    ఆధ్యాత్మిక చీకటి రాత్రిలో, పడిపోయిన వారిని పైకి లేపటంలో, దు:ఖిస్తున్న వారిని ఓదార్చటంలో సంఘం ద్వారా దేవుని మహిమ ప్రకాశించాల్సి ఉంది. లోకం అంగలార్పులు మన చుట్టూ వినిపిస్తున్నాయి. ప్రతీ చోట లేమిలో ఉన్నవారు దు:ఖంలో ఉన్నవారు కనిపిస్తారు. జీవితంలోని శ్రమల్ని, దు:ఖాన్ని తగ్గించి, కొంత ఉపశమనాన్ని చేకూర్చటం మనవిధి.COLTel 363.2

    ప్రసంగాలు ఉపన్యాసాల కన్నా ఆచరణాత్మక సేవ ఎక్కువ ఫలవంతమౌతుంది. మనం ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలి, బట్టలు లేని వారికి బట్టనివ్వాలి, నీడలేని వారికి ఆశ్రయమివ్వాలి. ఇంతకన్నా ఎక్కువగా తోడ్పడటానికి మనం పిలుపు పొందుతున్నాం. ఆత్మ కొరతను క్రీస్తు ప్రేమ మాత్రమే తీర్చగలదు. క్రీస్తు మనలో నివసిస్తుంటే దివ్య సానుభూతి మన హృదయాన్ని నింపుతుంది. యదార్థమైన, క్రీస్తు ప్రేమ వంటి ప్రేమ, కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది.COLTel 363.3

    లేమిలో ఉన్నవారికి మన ఈవుల్నే కాదు, మన ఉత్సాహముఖవైఖరిని, నిరీక్షణ, ఆదరణ ఇచ్చే మాటల్ని, మన హార్థిక కరచాలనాన్ని కూడా దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు వ్యాధి గ్రస్తుల్ని బాగుచేసినప్పుడు ఆయన వారి మీద చేతులుంచాడు. మనం సహాయం చేయజూస్తున్న వారితో మనం అలాగే సన్నిహితంగా మెలగాలి.COLTel 363.4

    నిరీక్షణ పోగొట్టుకున్నవారు అనేకమంది ఉన్నారు. వారిలో తిరిగి నిరీక్షణను ఆనందాన్ని నింపండి. అనేకులు గుండె చెదిరి ఉన్నారు. వారితో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కూర్చే మాటలు మాట్లాడండి. వారి కోసం ప్రార్థించండి. జీవాహారం అవసరమైనవారున్నారు. వారికి దైవ వాక్యం చదివి వినిపించండి. అనేక మందిని ఆత్మరుగ్మత పీడిస్తుంది. దాన్ని బాగు చేసే తైలం లేదు వైద్యుడులేదు. ఈ ఆత్మల కోసం ప్రార్థించండి. వారిని క్రీస్తు వద్దకు తీసుకురండి. గిలాదులో తైలముందని అక్కడ ఒక మహావైద్యుడున్నాడని వారికి చెప్పండి. COLTel 364.1

    వెలుగు గొప్ప దీవెన. అది లోకానికే మహాదీవెన. కృతజ్ఞతలేని, అపరిశు ద్ద, భ్రష్ట ప్రపంచం పై అది దాని నిధుల్ని కుమ్మరిస్తూ ఉంటుంది. అలాగే నీతి సూర్యుడు తన వెలుగును కుమ్మరిస్తూ ఉంటాడు. పామనే చీకటి. దు:ఖం, బాధతో నిండిన ఈ లోకమంతా దైవ ప్రేమా జ్ఞానంతో వెలిగిపోవాల్సి ఉంది. దైవ సింహాసనం నుంచి ప్రకాశించే వెలుగు నుంచి ఏ జాతి, హోదా లేక తరగతి ప్రజల్ని మినహాయించకూడదు.COLTel 364.2

    కృప నిరీక్షణల వర్తమానాన్ని లోకం నలుమూలలకూ చేరవేయాలి. ఇచ్చయించేవారు చెయ్యి చాపి ఆయన శక్తిని అందుకుని ఆయనతో సమాధానపడవచ్చు. వారికి సమాధానం ఉంటుంది. అన్యజనులు అర్థరాత్రి చీకటిలో పడి ఉండనవసరం లేదు. నీతి సూర్యుని కిరణాల ముందు చీకటి మాయమౌతుంది. నరకం శక్తిని కోల్పోతుంది.COLTel 364.3

    తమకు లేనిదాన్ని ఎవరూ ఇవ్వలేరు. దేవుని సేవలో మానవుడు దేన్నీ ప్రారంభించలేడు. ఏ వ్యక్తీ తనంతటతాను దేవునికి సత్యదూతకాలేడు. దేవదూతలు బంగారు గొట్టాల్లోకి పోసిన, బంగారు ప్రమిద నుంచి గుడారంలో దీపాల్లోకి ప్రవహించాల్సిన సువర్ణతైలమే నిత్యం తేజోవంతంగా అఖండంగా ప్రకాశించే వెలుగును ఉత్పత్తి చేసింది. మనుషుడికి నిత్యం బదిలీ అయ్యే దైవ ప్రేమే వెలుగును అందించటానికి అతడికి సామర్థాన్నిస్తుంది. విశ్వాసం ద్వారా దేవునితో ఏకమైన వారి హృదయాల్లోకి ప్రేమ అనే సువర్ణతైలం ప్రవహిస్తుంది. తిరిగి అది సత్కియల్లోను, దేవునికి యధార్థమైన, హృదయపూర్వకమైన సేవలోను తేజోవంతంగా ప్రకాశించాల్సి ఉంది.COLTel 364.4

    నిరుపమానమైన పరిశుద్ధత్మ వరంలో పరలోక వనరులన్నీ సమర్పించబడ్డాయి. మానవులికి దేవుని కృపైశ్వర్యం ప్రవహించకపోవటానికి దేవుని ఆంక్ష ఏదీ కారణం కాదు. పొందటానికి అందరూ సమ్మతంగా ఉంటే ఆయన అందరినీ తన ఆత్మతో నింపుతాడు. దేవుడు తన కృపా సంపదను, శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వరాన్ని అందించే సాధనం అయ్యే ఆధిక్యత ప్రతీ ఆత్మకూ ఉంది. తన ఆత్మను ప్రవర్తనను లోకానికి తెలియపర్చటానికి ప్రతినిధులు కావాలని కోరనంతగా క్రీస్తు మరి దేనినీ కోరటం లేదు. రక్షకుని ప్రేమ మానవుల ద్వారా ప్రదర్శితం కావాల్సిన అవసరం కన్నా గొప్ప అవసరం ప్రపంచానికి మరేదీ లేదు. మానవ హృదయాలకు ఆనందం గాను దీవెనగాను ఉండగల పరిశుద్ధ తైలం ప్రవహించటానికి సాధనాల కోసం పరలోకం ఎదురుచూస్తున్నది.COLTel 365.1

    లోకానికి వెలుగైన క్రీస్తు ప్రకాశం ఇమ్మానుయేలు మహిమ కలిగి, మార్పు చెందిన సమాజంగా తన సంఘం రూపుదిద్దుకోవటానికి క్రీస్తు అన్ని వనరుల్నీ ఏర్పాటు చేశాడు. ప్రతీ క్రైస్తవుడు వెలుగు, సమాధానల వాతావరణంలో నివసించాలన్నది ఆయన ఉద్దేశం. మనం మన జీవితాల్లో తన ఆనందాన్ని వెల్లడించాలని ఆయన కోరుతున్నాడు.COLTel 365.2

    పొంగి పొరలే దైవ ప్రేమ హృదయంలో నివసించే పరిశుద్ధాత్మను కనపర్చుతుంది. దేవునికి తన్నుతాను సమర్పించుకున్న మానవ సాధనం ద్వారా దైవ సంపూర్ణత ఇతరులికివ్వటానికి ప్రవహిస్తుంది. .COLTel 365.3

    నీతి సూర్యుని “రెక్కలు ఆరోగ్యము కలుగజేయును” మలా 4:2. అలాగే ప్రతీ యదార్థ విశ్వాసి నుంచి ధైర్యపర్చే, సహాయమందించే, నిజమైన స్వస్థత కూర్చే ప్రభావం వ్యాపించాలి.COLTel 365.4

    క్రీస్తు మతమంటే పాప క్షమాపణే కాదు అందులో ఇంకా ఎక్కువే ఉంది. మన పాపాల్ని తీసివేసి ఆ ఖాళీని పరిశుద్దాత్మ కృపలతో నింపటమని దాని అర్థం. హృదయంలో నుంచి స్వార్దశ తీసివేసి దాన్ని క్రీస్తు నిత్య సముఖంతో నింపటమని దాని అర్థం. క్రీస్తు ఆత్మను పరిపాలిస్తే పవిత్రత, పాపరాహిత్యత ఉంటాయి. మహిమ, సంపూర్ణత, సువార్త ప్రణాళిక పరిపూర్తి జీవితంలో నెరవేరాయి. రక్షకుణ్ని అంగీకరించటం పరిపూర్ణ సమాధానాన్ని, పరిపూర్ణ ప్రేమను, పరిపూర్ణ హామిని తెస్తుంది. జీవితంలో వెల్లడైన క్రీస్తు ప్రవర్తన సౌందర్యం, పరిమళం, లోకాన్ని రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ని పంపాడని సాక్ష్యమిస్తున్నాయి.COLTel 365.5

    ప్రకాశించటానికి ప్రయాసపడమని క్రీస్తు తన శిష్యుల్ని ఆదేశించటం లేదు. మీ వెలుగు ప్రకాశించనియ్యండి అంటున్నాడు. మీరు దేవుని కృపను పొందినట్లయితే ఆ వెలుగు మీలో ఉంటుంది. ఆటంకాల్ని తొలగించండి. అప్పుడు దేవుని మహిమ వెల్లడవుతుంది. ఆ వెలుగు చీకటిని తొలగించటానికి ప్రకాశిస్తుంది. మీ ప్రభావ పరిధిలో మీరు ప్రకాశిస్తారు. ఆయన తన స్వంత మహిమను మానవత్వ రూపంలో వెల్లడి చెయ్యటం పరలోకాన్ని మనకు ఎంత సమీపంగా తెస్తుందంటే, గర్భాలయాన్ని నింపుతున్న సౌందర్యం రక్షకుడు నివసించే ప్రతీ ఆత్మలోనూ కనిపిస్తుంది. లోపల నివసిస్తున్న క్రీస్తు మహిమను చూసి మనుషులు ఆకర్షితులవుతారు. దేవుని విశ్వసించిన అనేక ఆత్మల స్తుతి వందనార్పణల నుంచి మహిమ తిరిగి దేవుని వద్దకు ప్రవహిస్తుంది.COLTel 366.1

    “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను”.యెష 60:1. పెండ్లికుమారుణ్ని ఎదుర్కోటానికి వెళ్లేవారికి ఈ వర్తమానం వస్తున్నది. శక్తితోను ప్రచండమైన మహిమతోను క్రీస్తు వస్తున్నాడు. తన మహిమతోను తండ్రి మహిమతోను తన పరిశుద్ధ దూతలందరితోను వస్తున్నాడు. లోకమంతా చీకటిలో ఉండగా ప్రతీ క్రైస్తవ భక్తుడి నివాసంలో వెలుగు ఉంటుంది. ఆయన రెండో రాకడ మొదటి వెలుగు కిరణ: వారికి కనిపిస్తుంది. స్వచ్చతగల ఆ వెలుగు ఆయన దేదీప్యమానత నుంచి ప్రకాశిస్తుంది. తనకు సేవ చేసిన వారందరూ విమోచకుడైన క్రీస్తును ప్రశంసిస్తారు. దుష్టులు ఆయన సన్నిధి నుంచి పారిపోతుండగా క్రీస్తు అనుచరులు ఆనందిస్తారు, క్రీస్తు రెండో రాక సమయాన్ని చూస్తూ పితరుడు యోబు ఇలా అన్నాడు, “నా మట్టుకు నేను చూచెదను మరి ఎవరును కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను.” యోబు 19:27. నమ్మకమైన తన అనుచరులకు క్రీస్తు అనుదినం కలిసే మిత్రుడు, సన్నిహిత నేస్తం. వారు ఒకరితో ఒకరు కలిసి నివసిస్తారు. దేవునితో సాన్నిహిత్యం కలిగి నివసిస్తారు. వారి మీద దేవుని మహిమ ఉదయిస్తుంది. క్రీస్తు ముఖంలోని దేవుని మహిమాజ్ఞానం తాలూకు వెలుగు వారిలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఆ మహిమరాజు అఖండ ప్రకాశంలో వారు ఆనందిస్తారు. వారు పరలోక సాంగత్యానికి సిద్ధపడి ఉన్నారు. ఎందుకంటే పరలోకం వారి మనసుల్లో ఉంది. COLTel 366.2

    పైకెత్తిన తలలలో, తమ పై పడుతున్న నీతి సూర్యుని ప్రకాశవంతమైన కిరణాలతో, తమ రక్షణ సమీపిస్తుందన్న ఆనందంతో, పెండ్లికుమారుణ్ని ఎదుర్కోటానికి “ఇదిగో మనలను రక్షించునని మనము కని పెట్టుకొనియున్న మన దేవుడు” (యెష 25:9) అంటూ వారు ముందుకి వెళ్తారు.COLTel 367.1

    “అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనుల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము - సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు: ఆయనను స్తుతించుడి, గొట్టె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది: ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది... మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొట్టెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము.” ఆయన “ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును... తనతో కూడా ఉండినవారు పిలువ బడినవారు, యేర్పరచబడినవారు, నమ్మకమైనవారు” అని పిలువబడతారు. ప్రక 19:6-7, 17:14.COLTel 367.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents