Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రీస్తు ఉపమాన ప్రబోధాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తొలివలుకు

    మహోపాధ్యాయుడైన క్రీస్తు తన శిష్యులతో కలిసి పాలస్తీనా కొండల మీద లేదా పాలస్తీనా లోయల్లో నడిచేటప్పుడో లేదా సరస్సు పక్కనో నది పక్కనో సేద దీరుతున్న తరుణంలోనో తన ఉపదేశంలో ఎక్కువ భాగాన్ని వారికి అందించాడు. తన ఉపమాన బోధనలో, కాపరులు, తాపీ పనివారు, సేద్యం చేసేవారు, బాటసారులు, గృహస్తులు మొదలైన సామాన్యుల అనుభవంలోని సాధారణ సంఘటనలతో దైవ సత్యాన్ని, అనుసంధాన పర్చేవాడు. సుపరిచిత విషయాన్ని యధార్థమైన సుందరమైన ఆలోచనలతో జతపర్చేవాడు. అవి, దేవుడు మనపట్ల ప్రేమాసక్తులు కలిగి ఉన్నాడని, ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలని, మనం ఒకరితో ఒకరు ప్రేమానురాగాలతో నివసించాలన్న చక్కని తలంపులు. ఈ రకంగా ప్రయోగాత్మక సత్యన్ని గూర్చిన బోధనలు దైవ జ్ఞానాన్ని శక్తిమంతంగాను ఆక్షర్షణీయంగాను రూపొందించాయి.COLTel 3.1

    ఈ పుస్తకంలో ఉపమానాల్ని వాటి వాటి అంశాల ప్రకారం వర్గీకరించడం, పాఠాల్ని రూపొందించి ఉదహరించటం జరిగింది. ఈ పుస్తకం ముత్యాలవంటి సత్యాలతో నిండి ఉంది. ఇది అనేకమంది పాఠకులకు దినవారి జీవితంలోని సామాన్య పరిసరాలకు అర్థాన్ని పరమార్ధాన్ని సమకూర్చుతుంది.COLTel 3.2

    క్రీస్తు ఉపమాన ప్రబోధాలు అన్న పుస్తకం ఆంగ్లంలోను ఇతర భాషల్లోను అనేక ముద్రణలు పొందాలని దీని మీద వచ్చే ద్రవ్యం విద్యావ్యాప్తికి దోహదపడాలని రాతప్రతిని తయారుచేసేటప్పుడు రచయిత ఆకాంక్షించింది. గ్రంథకర్త, ప్రచరణ కర్తలు, సంఘ సభ్యుల సంఘటిత కృషి ఫలితంగా క్రైస్తవ విద్యావ్యాప్తికి పెద్ద మొత్తంలో నిధులు సమక్చూటం జరిగింది.COLTel 3.3

    ఈ గ్రంధం తన కర్తవ్య నెరవేర్పులో కొనసాగాలని రక్షకుని బోధనల్ని పాఠకుడు చక్కగాన అవగాహన చేసుకుని ఆయనకి ఆకార్షితుడు కావాలని ఆకాంక్షిస్తూ...COLTel 3.4

    ప్రచురణ కర్తలు,
    ఎలెన్ జి.వైట్ ప్రచురణ ధర్మకర్తలు.

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents