Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    31 - అన్యజనులకు నిరీక్షణ

    అన్యజనుల నిమిత్తం దేవుని ఉద్దేశాన్ని గురించి యెషయా తన పరిచర్య కాలమంతా స్పష్టమైన సాక్ష్యం ఇచ్చాడు. ఇతర ప్రవక్తలు దైవ ప్రణాళికను గూర్చి ప్రస్తావించారు గాని వారి భాష స్పష్టంగా అర్థం కాలేదు. శారీరకంగా అబ్రహాము సంతతి కానివారిలో అనేకులు ఇశ్రాయేలీయులుగా పరిగణన పొందుతారన్న సత్యాన్ని యూదాకు స్పష్టం చేసే బాధ్యతను దేవుడు యెషయాకిచ్చాడు. ఈ బోధన ఆ కాలం వేదాంతానికి అనుగుణంగా లేదు. అయినా తనకు దేవుడిచ్చిన వర్తమానాన్ని యెషయా నిర్భయంగా ప్రకటించాడు. తద్వారా అబ్రహాము సంతతికి వాగ్దానం చేయబడ్డ ఆధ్మాత్మిక దీవెనల్ని ఆకాంక్షిస్తున్న అనేకులకు నిరీక్షణను కలిగించాడు.PKTel 253.1

    అన్యజనులనిమిత్తం దేవుని సంకల్పాన్ని ఇశ్రాయేలు అవగాహన చేసుకునే సామర్థ్యాన్నిగాని సంసిద్ధతనుగాని తరచు కనపర్చలేదు. అయితే వారిని ప్రత్యేక జనంగా చేసి లోకంలోని జాతుల్లో వారిని స్వతంత్ర జాతిగా తీర్చిదిద్దింది ఈ సంకల్పమే. వారి పితరుడు అబ్రహాముకి దేవుడు నిబంధన వాగ్దానం చేశాడు. అన్యజనులికి వెలుగు ప్రకాశింపజేసే వ్యక్తిగా ఉండేందుకు తన బంధువుల్ని విడిచి దూరప్రాంతాలికి వెళ్లాల్సిందిగా అతడికి పిలుపునిచ్చాడు. తనకు దేవుడు చేసిన వాగ్దానంలో సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువులంత విస్తారమైన సంతానం ఇమిడి ఉన్నప్పటికీ, కనానులో స్థాపితం కానున్న మహా జాతికి అతడు స్థాపకుడు కావడం అన్నది అతడి స్వార్థ ప్రయోజనానికి ఉద్దేశించబడింది కాదు. అతడితో దేవుని నిబంధన లోకంలోని జాతులన్నిటికీ వర్తిస్తుంది. యెహోవా ఇలా అన్నాడు, “నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువారిని శపించెదను. భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును.” ఆది. 12:2,3.PKTel 253.2

    ఇస్సాకు జననానికి కొంచెంముందు ఈ నిబంధనను దేవుడు నవీకరించాడు. మానవాళి విషయంలో దేవుని ఉద్దేశం అబ్రహాముతో చేసిన నిబంధనలో ప్రతిబింబించింది. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింప బడును.” అంటూ వాగ్దత్త కుమారుణ్ని గూర్చి మాట్లాడ్డూ దేవుడు వాగ్దానం చేశాడు. ఆది 18:18. అనంతరం పరలోక దూత మరోసారి ఇలా ప్రకటించాడు, “భూలోకము లోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును.” ఆది. 22:18. PKTel 254.1

    ఈ నిబంధనకు సంబంధించిన విషయాలన్నీ అబ్రహాము పిల్లలకి వారి పిల్లలకి బాగా తెలుసు. సకల జాతులికి ఇశ్రాయేలు ప్రజలు దీవెనగా ఉండేందుకు, “భూలోక మందంతట” (నిర్గమ. 9:16) దేవుని నామమును ప్రచురం చెయ్యటానికి వారిని ఐగుప్తు దాస్యంనుంచి ఆయన విడిపించాడు. వారు ఆయన నిబంధనల్ని ఆచరిస్తూ నివసిస్తే జ్ఞానంలోను వివేకంలోను వారు ఇతర ప్రజలకన్నా ఎంతో ముందుంటారు. కాగా “భూలోకములోని జనముల” నిమిత్తం దేవుని సంకల్పం నెరవేరి కొనసాగేందుకే ఈ ఆధిక్యం వారికి లభించాల్సి ఉంది. ఐగుప్తు దాస్యంనుంచి ఇశ్రాయేలీయుల విముక్తి సందర్భంగాను వాగ్దత్త దేశాన్ని వారు స్వతంత్రించుకున్న సందర్భంగాను చోటు చేసుకున్న అద్భుత కార్యాలు అనేకమంది అన్యజనులు ఇశ్రాయేలీయుల దేవుడే సర్వోన్నతుడని గుర్తించటానికి దారితీశాయి. “నేను ఐగుపుమిద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పించగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురు” అన్నది ఆయన వాగ్దానం. నిర్గమ. 7:5. గర్వి అయిన ఫరో సయితం యెహోవా శక్తిని గుర్తించక తప్పలేదు. “మీరు ... పోవుడి; నన్ను దీవించుడి” అంటూ ఫరో మోషేని అహరోనుని వేడుకున్నాడు. నిర్గమ 12:31,32..PKTel 254.2

    హెబ్రీ ప్రజల దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని గురించిన జ్ఞానం తమకు ముందే విస్తరించి ఉన్నట్లు అన్యుల్లో, కొందరు ఆయనే నిజమైన దేవుడని గ్రహిస్తున్నట్లు ముందుకు సాగుతున్న ఇశ్రాయేలీయులు కనుగొన్నారు. దుష్టత్వంతో నిండిన యెరికో పట్టణంలో అన్యురాలైన ఒక స్త్రీ “మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే” అంటూ సాక్ష్యమిచ్చింది. యెహో. 2:11. ఈ రీతిగా యెహోవాను గూర్చి తనకు వచ్చిన జ్ఞానంవల్ల ఆమెకు రక్షణ కలిగింది. విశ్వాసాన్నిబట్టి “రాహాబు .... అవిధేయులతోపాటు నశింపకపోయెను.” హెబ్రీ 11:31. ఆమెలో కలిగిన మార్పు, దేవుని అధికారాన్ని అంగీకరించే విగ్రహారాధకులపట్ల ఆయన కనపర్చే కృపకు అరుదైన నిదర్శనం ఏమికాదు. విస్తారమైన జనమున్న దేశంలో గిబియోనీయులు తమ అన్యమతాన్ని విడిచిపెట్టి, ఇశ్రాయేలీయుల్లో కలిసిపోయి వారితో నిబంధనపరమైన దీవెనల్ని పంచుకున్నారు.PKTel 254.3

    జాతీయత, జాతి లేక కులంవంటి తేడాల్ని దేవుడు గుర్తించడు. సర్వమానవులు ఆయన సృజించినవారే. సృష్టిద్వారా మానవులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. విమోచనద్వారా అందరూ ఒకటే. ప్రతీ విభజననూ అంతం చెయ్యటానికీ, ఆలయ ఆవరణలోని ప్రతీ భాగాన్ని తెరిచి అందరూ దేవుని వద్దకు వచ్చేందుకు మార్గం సుగమం చేసేందుకు క్రీస్తు వచ్చాడు. ఆయన ప్రేమ ఎంతో విశాలమయ్యింది, ఎంతో లోతయ్యింది, ఎంతో సంపూర్ణమయ్యింది. అది అన్నిచోట్లకు వ్యాపిస్తుంది. సాతాను వంచనలవల్ల మోసపోయిన వారిని అతడి ప్రభావ పరిధినుంచి అది పైకిలేపి, వాగ్దాన ధనస్సు ఆవరించి ఉన్న దైవ సింహాసనానికి దగ్గరగా వారిని ఉంచుతుంది. క్రీస్తులో యూదుడు, గ్రీసు దేశస్తుడు, బానిస, స్వతంత్రుడు అన్న భేదం లేదు.PKTel 255.1

    వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత సంవత్సరాల్లో అన్యజనుల రక్షణ నిమిత్తం యెహోవా సంకల్పాన్ని ఇశ్రాయేలీయులు పూర్తిగా విస్మరించటం జరిగింది. కనుక దేవుడు తన సంకల్పాన్ని వినూత్నంగా ప్రతిపాదించటం అవసరమయ్యింది. ఆవేశంతోనిండి కీర్తనకారుడు ఇలా గానం చేశాడు : “భూ దిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్తులందరును నీ సన్నిధిని నమస్కారము చేసెదరు.” “ఐగుపులోనుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు.” “అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూ రాజులందరును నీ మహిమకును భయపడెదరు.” “యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు మనుష్యులు సీయోనులో యెహోవా నామ ఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెదననియు ఆకాశమునుండి భూమిని” దృష్టించెదననియు నచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడవలెను.” కీర్త. 22:27; 68:31; 102:15, 18-22.PKTel 255.2

    తనపై దేవుడు ఉంచిన నమ్మకానికి దీటుగా ఇశ్రాయేలు నివసించి ఉంటే దాని దీవెనల్ని ప్రపంచంలోని జాతులన్నీ పంచుకునేవి. కాని రక్షణ సత్యాన్ని గూర్చిన జ్ఞానం పొందిన ఈ ప్రజలు తమ చుట్టూ ఉన్న ప్రజల అవసరాల్ని గురించి పట్టించుకోలేదు. వారు దేవుని సంకల్పాన్ని మర్చిపోటంతో అన్యజనులు దేవుని కృప పరిధిలో లేరన్న అభిప్రాయం వారికి ఏర్పడింది. సత్యకాంతిని ప్రకాశింపజెయ్యలేదు. చీకటి రాజ్యమేలింది. జాతుల్ని అజ్ఞానం ఆవరించింది.దేవుని ప్రేమనుగూర్చి ఎవరికీ తెలియలేదు. అపరాధం మూఢనమ్మకాలు పెచ్చు పెరిగాయి.PKTel 255.3

    ప్రవక్తగా పిలుపుపొందిన తరుణంలో యెషయా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. అయినా అతడు నిరాశ చెందలేదు. ఎందుకంటే దేవుని సింహాసనం చుట్టూ ఉన్న దూత గణాలు “సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది” అంటూ పాడుతున్న విజయ గీతం అతడి చెవుల్ని నింపింది. యెష. 6:3. “సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నప్పుడు” (యెష. 11:9) దేవుని సంఘం సాధించే విజయాల్ని గూర్చిన దర్శనాలు అతడి విశ్వాసాన్ని పటిష్టపర్చాయి. “సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను” ఆయన తుదకు నాశనం చేయనున్నాడు. యెష 25:7. సర్వశరీరులపై దేవుని ఆత్మ కుమ్మరింపు జరగాల్సి ఉంది. నీతివిషయమై ఆకలి దప్పులు గలవారు దేవుని ఇశ్రాయేలీయులుగా పరిగణన పొందనున్నారు. ప్రవక్త ఇలా అన్నాడు, “నీటి కాలువలయొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు - నేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును. మరియొకడు యెహోవావాడనని తన చేతిలో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.” యెష. 44:4,5.PKTel 256.1

    మారుమనసు పొందని యూదావారిని లోక రాజ్యాలలోకి చెదరగొట్టటంలో తన ఉద్దేశమేంటో దేవుడు ప్రవక్తకు బయలుపర్చాడు. ప్రభువిలా ప్రకటించాడు, “నా జనులు నా నామము తెలిసికొందురు. నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలిసికొందురు.” యెష. 52:6. వారు విధేయత, నమ్మకం అన్న పాఠాల్ని నేర్చుకోటం మాత్రమేకాదు జీవంగల దేవునిగూర్చిన జ్ఞానాన్ని తాము ప్రవాసులై ఉన్న స్థలాల్లో ఇతరులికి అందించాల్సి ఉన్నారు. పరదేశులలో అనేకులు ఆయన్ని తమ సృష్టికర్తగాను విమోచకుడుగాను గుర్తించి ప్రేమించాల్సి ఉన్నారు. ఆయన సృజన శక్తికి చిహ్నంగా ఆయన పరిశుద్ద సబ్బాతును ఆచరించటం ప్రారంభించాల్సి ఉన్నారు. ఆయన తన ప్రజలను దాస్యం నుంచి విడిపించటానికి “సమస్త జనముల కన్నులయెదుట... తన పరిశుద్ద బాహువును బయలుపరచి”నప్పుడు “భూదిగంత నివాసులందరు” దేవుని రక్షణ చూస్తారు. 10వ వచనం. అన్యమతం నుంచి క్రైస్తవులైన వారిలో అనేకమంది ఇశ్రాయేలీయులితో పూర్తిగా మమేకమై వారితో కలిసి యూదయకు తిరిగి వెళ్లాలని ఆకాంక్షించారు. వీరిలో ఎవరూ “యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయును.” (యెష. 56:3) అని భావించరు. ఎందుకంటే తనకు లోబడి తన ధర్మశాస్త్రాన్ని ఆచరించేవారు అప్పటినుంచి ఆధ్మాత్మిక ఇశ్రాయేలీయులుగా లోకంలోని తన సంఘంగా పరిగణన పొందాలని తన ప్రవక్తద్వారా ఆయన పలికిన వాక్యం చెబుతున్నది.PKTel 256.2

    “విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములోవారిని ఆనందింప జేసెదను. నా బలి పీఠముమిద వారర్పించు దహన బలులును బలులును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే - నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారిపైగా ఇతరులను కూర్చెదను.” 6-8 వచనాలు.PKTel 257.1

    వాగ్దత్త మెస్సీయా రాక సమయంవరకూ గతించనున్న శతాబ్దాల్ని చూడటానికి ప్రవక్తకు తరుణం లభించింది. మొట్టమొదట “బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు” మాత్రమే చూశాడు. యెష. 8:22. సత్యకాంతిని చూడాలని ఆశించిన అనేకుల్ని అబద్ధ బోధకులు తికమకపెట్టే తత్వజ్ఞానంలోకి ప్రేతమతంలోకి నడిపించారు. ఇతరులు ఆచారబద్ధమైన మతాన్ని నమ్ముకుంటున్నారు. వారి జీవితాల్లో యధార్థ పరిశుద్దత శూన్యం. పరిస్థితి ఆందోళకరంగా కనిపించింది. కాని త్వరలోనే ఆ దృశ్యం మారింది. ప్రవక్తముందు అద్భుతమైన దర్శనం విప్పారింది. తన రెక్కలలో స్వస్తతతో నీతి సూర్యుడు ఉదయించటం చూశాడు. అది చూసి పరవశుడై ప్రవక్త ఇలా విస్తుపోయాడు : “వేదనపొందిన దేశముమిద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జేబులూను దేశమును నఫాలి దేశమును అవమాన పరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయలుగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.” యెష 9:1,2. PKTel 257.2

    లోకానికి వచ్చిన ఈ మహావెలుగు ప్రతీ జాతికి, ప్రతీ భాష మాట్లాడే ప్రజలకు, ప్రతీ ప్రజకు రక్షణను అందించాల్సి ఉంది. తన ముందున్న పనిని గురించి తండ్రి ఇలా చెప్పటం ప్రవక్త విన్నాడు, “నీవు యాకోబు గోత్రపువారిని ఉద్దరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమై యుండుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను.” “అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో నున్నవారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.” “చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నాం. వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.” యెష. 49:6,8,9,12.PKTel 257.3

    యుగాల్లోకి ఇంకాముందుకి దృష్టిసారిస్తూ ఈ చక్కని వాగ్దానాల నెరవేర్పును ప్రవక్త చూశాడు. రక్షణ సువార్తమాన దూతలు లోకంలో ఉన్న ప్రతీ జాతికి ప్రతీ ప్రజకు ప్రకటించటానికి వెళ్లటం చూశాడు. సువార్త సంఘాన్ని గూర్చి “ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును, మీరు జనుల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జల ప్రవాహమువలెను మీయొద్దకు దానిని రాజేతును.” అతడు ఈ ఆదేశాన్ని విన్నాడు, “నీ గుడారపు స్థలమును విశాల పరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము. నీ మేకులు దిగగొట్టుము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును.” యెష. 66:12; 54:2,3.PKTel 258.1

    తన సాక్షుల్ని “తరీషు పూలులూదు అను జనులయొద్దకును తుభాలు యావాను నివాసుల యొద్దకును” పంపుతానని యెహోవా ప్రవక్తతో చెప్పాడు. యెష. 66:19.PKTel 258.2

    “సువార్త ప్రకటించుచు సమాధానము
    చాటించుచు
    సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము
    ప్రచురించువాని పాదములు
    నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న
    వాని పాదములు
    పర్వతములమీద ఎంతో సుందరములైయున్నవి”
    PKTel 258.3

    యెష. 52:7.

    నిత్య రాజ్య ఆగమనానికి మార్గం సుగమమయ్యేందుకుగాను దేవుడు తన సంఘాన్ని తన నియమిత సేవ చెయ్యటానికి పిలవటం ప్రవక్త విన్నాడు. ఆ వర్తమానం అతి స్పష్టంగా ఉంది :PKTel 259.1

    “నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరిల్లుము
    యెహోవా మహిమ నీమీద ఉదయించెను”

    “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది
    >కటిక చీకటి జనులను కమ్ముచున్నది
    యెహోవా నీమీద ఉదయించుచున్నాడు
    ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
    జనములు నీ వెలుగునకు వచ్చెదరు
    రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.”

    “కన్నులెత్తి చుట్టుచూడుము
    వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు
    నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు
    నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.”

    “అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు
    వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు
    ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని
    కటాక్షించి నీమీద జాలిపడుచున్నాను
    నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు
    వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు
    నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక
    నిత్యము తెరవబడియుండును.”

    “భూ దిగంతముల నివాసులారా, నావైపు చూచి
    రక్షణ పొందుడి
    దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.”
    PKTel 259.2

    యెష. 60:1-4,10,11; 45:22.

    గొప్ప చీకటితో నిండిన కాలంలో ఆధ్యాత్మిక మేల్కొల్పును గూర్చిన ప్రవచనాలు, లోకంలోని చీకటి ప్రాంతాలకు చేరి, సువార్త పరిచర్య కేంద్రాల్ని స్థాపించటంలో నేడు నెరవేర్పు పొందుతున్నాయి. మార్గదర్శకత్వం అందించే మిషనెరీ బృందాల్ని అన్యదేశాల్లో సత్యంకోసం ఎదురు చూసేవారికి దారి చూపటానికి ఏర్పాటైన ధ్వజాలతో ప్రవక్త సరిపోల్చుతున్నాడు.PKTel 259.3

    యెషయా ఇలా అంటున్నాడు, “ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావముగలదగును. ఆ దినమున శేషించిన తన ప్రజల శేషమును.... విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును. జనములను పిలచుటకు ఆయన యొక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును. భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చును.” యెష. 11:10-12.PKTel 260.1

    విమోచన దినం దగ్గరపడ్తున్నది. “తనయెడల యధార్ద హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” 2 దిన వృ. 16:9. అన్ని జాతుల్లోను ఆయా భాషలు మాట్లాడే ప్రజల్లోను సత్యాన్ని గూర్చిన జ్ఞానంకోసం ప్రార్థన చేస్తున్న స్త్రీలు పురుషులు ఉన్నట్లు ఆయన చూస్తున్నాడు. వారి ఆత్మలకు తృప్తిలేనట్లు, దీర్ఘకాలం వారు బూడిదనే పూజిస్తున్నట్లు ఆయన చూస్తున్నాడు. యెష. 44:20 చూడండి. నీతి విరోధి వారిని పక్కదారి పట్టిస్తాడు. వారు గుడ్డివారిలా దారికోసం తడుముకుంటారు. అయితే వారు యధార్థ హృదయులు. మెరుగైన మార్గాన్ని అన్వేషించేవారు. వారు అన్యమతంలో కూరుకుపోయి ఉన్నా, లిఖిత రూపంలో ఉన్న దైవ ధర్మశాస్త్రం గురించి గాని దేవుని కుమారుడైన యేసును గురించిగాని వారికి తెలియకపోయినా తమ మనసుమీద తమ నడవడిషాద పనిచేస్తున్న దైవశక్తిని వారు అనేక రీతులుగా వెల్లడి చేస్తారు.PKTel 260.2

    దైవ కృపను అనుభవించటంద్వారా కలిగిన జ్ఞానం మినహా దేవుణ్ని గురించి ఇంకేమి ఎరుగనివారు కొన్ని సందర్బాల్లో దైవసేవకుల పట్ల దయగా వ్యవహరించి, తమ ప్రాణాల్ని పణంగా పెట్టి వారిని రక్షించినవారున్నారు. పరిశుద్ధాత్మ అనేకమంది సత్యాన్వేషుల మనసుల్లో క్రీస్తు కృపను ప్రోదిచేసి, తమ నైజానికి విరుద్దంగాను, తమ పూర్వ విద్యకు ప్రతికూలంగాను వారిలో సానుభూమితిని జనింపజేస్తాడు. అది (ఆ వెలుగు) లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.” అది అతడి ఆత్మలో ప్రకాశిస్తున్నది. ఈ వెలుగు ప్రకారం నడిచినట్లయితే అది అతడి పాదాల్ని దేవుని రాజ్యంలోకి నడిపిస్తుంది. మికా ప్రవక్త ఇలా అన్నాడు : “నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును... ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను.” మికా. 7:8,9.PKTel 260.3

    దేవుని రక్షణ ప్రణాళిక సర్వ ప్రపంచానికి చాలినంత విస్తృతమైనది. సాష్టాంగ నమస్కారంచేసే మానవాళికి జీవపు ఊపిరినివ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకం ఇవ్వగలిగిన దానికన్నా ఉన్నతమైన, ఉదాత్తమైన దాన్ని వాంఛించే యధార్థ హృదయుల్ని ఆయన నిరాశపర్చడు. మిక్కిలి నిరాశాజనకమైన పరిస్థితుల నడుమ ఉన్నప్పటికీ, తమకు మించిన ఉన్నత శక్తి ఏదో తమను నింపి తమకు విడుదలను సమాధానాన్ని చేకూర్చాల్సిందనే విశ్వాసంతో ప్రార్థన చేసేవారి వద్దకు ఆయన నిత్యం తన దూతల్ని పంపుతున్నాడు. ఆయా రీతుల్లో దేవుడు వారికి తన్నుతాను ప్రత్యక్షపర్చుకుంటాడు. వారిని తనకృపల పరిధిలో ఉంచుతాడు. మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలియుండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లు” అందరికొరకూ క్రయధనంగా తన్ను తాను అర్పించుకున్న రక్షకునిపై వారి విశ్వాసాన్ని ఆ కృపలు స్థిరపర్చుతాయి. కీర్త. 787.PKTel 261.1

    “బలాఢ్యుని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా?” “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు. భీకరులు చెరపట్టినవారు విడిపింప బడుదురు.” యెష. 49:24, 25. “చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.” యెష. 42:19.PKTel 261.2

    “ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునోవాడు ధన్యుడు.” కీర్త. 146:5. “బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మి కోటను మరల ప్రవేశించుడి.” జెర్యా. 9:12.PKTel 261.3

    అన్యదేశాల్లో ఉన్న యదార్ధ హృదయులందరికీ - దేవుని దృష్టిలో “యధార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును.” కీర్త. 112:4. దేవుడిలా అన్నాడు : “వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలో వారిని నడిపింతును. వారియెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును.” యెష 42:16.PKTel 261.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents