Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    36 - యూదా చివరిరాజు

    తన ఏలుబడి ఆరంభంలో సిద్కియా బబులోను రాజుకి విశ్వాసపాత్రుడు యిర్మీయా ప్రవక్తకు విధేయ అనుచరుడు అయి నివసించాడు. బబులోనీయులికి అనుకూలంగా మెలగడంద్వారాను యిర్మీయాద్వారా దేవుడు పంపిన వర్తమానాల్ని ఆచరణలో పెట్టటంద్వారాను, ఉన్నతాధికారంలో ఉన్న అనేకుల అభిమానాన్ని పొంది వారికి దేవుణ్ని గూర్చిన జ్ఞానాన్ని పంచే అవకాశం కలిగి ఉండేవాడు. అప్పటికే బబులోనులో బానిసలుగా ఉన్న ప్రవాసుల పరిస్థితి మెరుపడేది. వారికి అనేక రకాలుగా స్వేచ్ఛ లభించి ఉండేది. దేవుని నామాన్ని విస్తృతంగా ఘనపర్చటం జరిగి ఉండేది. యూదాలో మిగిలి పోయినవారికి కడకు సంభవించిన విపత్తులు తప్పి ఉండేది.PKTel 306.1

    తమ పరిపాలకుల తాత్కాలిక ఏలుబడికి అణిగి మణిగి నివసించాల్సిందిగా సిద్కియాకు, బబులోను చెరలో ఉన్నవారితో సహా సకల యూదా ప్రజలకు యిర్మీయా ద్వారా దేవుడు హితవు పలికాడు. చెరలో ఉన్నవారు తాము బందీలుగా ఉన్న దేశంలో సమాధానంగా మెలగటం ఎంతో ప్రాముఖ్యం. ఇది మానవ హృదయానికి హేయమైన విషయం. ఈ పరిస్థితుల్ని సొమ్ము చేసుకుని ప్రజల నడుమ అబద్ద ప్రవక్తలు బయలు దేరటానికి సాతాను మార్గం సుగమం చేశాడు. యెరూషలేములోను బబులోనులోను అబద్ద ప్రవక్తలు బయలుదేరి దాస్య శృంఖలాలు విరగగొట్టటం జాతి పూర్వ వైభవం పునరుద్దరించటం జరుగుతుందని ప్రకటించారు.PKTel 306.2

    పొగడ్తతో నిండిన అలాంటి ప్రవచనాల్ని నమ్మి వ్యవహరించటం రాజుని అతడి చెరలోని బానిసల్ని నాశనానికి నడిపించి తమ పక్షంగా దేవుడు అనుసరిస్తున్న కృపాపూరిత విధానానికి ప్రతిబంధకాలు కల్పించటం చేసేవారు. తిరుగుబాటు లేచి పర్యవసానంగా కష్టాలు శ్రమలు సంభవింపకుండేందుకు, తిరుగుబాటు తీవ్ర పర్యవసానాల్ని గురించి యూదరాజుని హెచ్చరించటంద్వారా ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసిందిగా ప్రభువు యిర్మీయాన ఆదేశించాడు. తమ విడుదల దగ్గరలో ఉన్నదని నమ్మి మోసపోకండని లిఖిత వర్తమానంద్వారా బందీల్నికూడా హెచ్చరింటం జరిగింది. “మి మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోస పోకుడి, మిలో కలలు కనువారి మాటలు వినకుడి.” అని విజ్ఞప్తి చేశాడు. యిర్మీ. 29:8. తన సేవకులు ముందుగానే చెప్పినట్లు డెబ్బయి సంవత్సరాల చెర అంతంలో ఇశ్రాయేలును పునరుద్దరించటమన్న ప్రభువు ఉద్దేశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించటం జరిగింది.PKTel 306.3

    ఇశ్రాయేలు నిమిత్తం తన ప్రణాళికల్ని గురించి చెరలో ఉన్న తన ప్రజలికి ప్రభువు ఎంత వాత్సల్యంతో తెలియజేశాడు! తమ విడుదల త్వరలోనే కలుగుతుందన్న అబద్ద ప్రవక్తల మాటల్ని వారు నమ్మినట్లయితే, బబులోనులో వారి జీవితం దుర్భర మౌతుందని ఆయనకు తెలుసు. వారివలన ఎలాంటి ప్రదర్శనగాని తిరుగుబాటుగాని సంభవిస్తే అది కల్దీయుల అధికారి అప్రమత్తం చేసి తమపై మరిన్ని కట్టుబాట్లు, ఆంక్షలు విధించటానికి దారి తీయవచ్చు. పర్యవసానంగా శ్రమలు కలుగవచ్చు. క్లిష్ట పరిస్థితులు తలెత్తవచ్చు. కనుక వారు ఆ పరిస్థితుల్ని అంగీకరించి తమ బానిస బ్రతుకులు గుట్టుగా జీవించాలని ఆయన కోరాడు. వారికి ఇలా హితవు పలికాడు.PKTel 307.1

    “ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి... నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, వారి క్షేమము మి క్షేమమునకు కారణమగును.” 5-7 వచనాలు.PKTel 307.2

    బబులోనులోని అబద్ధ బోధకుల్లో ఇద్దరు తాము పరిశుద్ధులమని చెప్పుకున్నారు. కాని వారు దుర్మార్గులు. ఈ వ్యక్తుల అక్రమ మార్గాన్ని ఖండించి తమ ముందున్న అపాయాన్ని గురించి యిర్మీయా వారిని హెచ్చరించాడు. వారికి కోపం వచ్చింది. ఆ యదార్ధ ప్రవక్త సేవను వ్యతిరేకించటానికి అతడి మాటల్ని విశ్వసించవద్దంటూ ప్రజల్ని రేపి, ప్రజలు బబులోను రాజుకి సహకరించాల్సిందంటూ దేవుడిచ్చిన హితవును ఆచరించవద్దని వారిని రెచ్చగొట్టారు. ఈ అబద్ద ప్రవక్తల్ని నెలకద్నెజరుకి అప్పగించాలని, వారిని అతడి కళ్లముందే వధించాలని ప్రభువు యిర్మీయా ద్వారా పలికాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఈ ప్రవచనం అక్షరాల నెరవేరింది.PKTel 307.3

    నిజదేవుని ప్రతినిధులమని చెప్పుకునేవారి మధ్య గందరగోళ పరిస్థితులు తిరుగుబాటు సృష్టించే మనుషులు కాలం చివరిదాక లేస్తూనే ఉంటారు. అబద్ధ ప్రవచనాలు పలికేవారు పాపాన్ని చిన్న విషయంగా పరిగణించేందుకు మనుషుల్ని ప్రోత్సహిస్తారు. తమ దుష్కార్యాల భయంకర ఫలితాలు వెలుగులోకి వచ్చినప్పుడు తమను నమ్మకంగా హెచ్చరిస్తూ వస్తున్న వ్యక్తిని తమ కష్టాలు శ్రమలకు బాధ్యుణ్ని చేస్తారు. యూదులు తమ దుర్గతికి యిర్మీయానే నిందించారు. అయితే తన ప్రవక్తద్వారా యెహోవా పలికిన మాటలు యధార్ధమైనవని ఎంత ఖచ్ఛితంగా నిరూపితమయ్యాయో అంతే ఖచ్చితంగా ఆయన వర్తమానాలు నేడు వాస్తవమైనవని నిరూపితమౌతాయి.PKTel 307.4

    బబులోనీయులికి లోబడి ఉండాల్సిందిగా హితవు చెప్పటంలో యిర్మీయా మొదటి నుంచి ఒకే విధానాన్ని అవలంబించాడు. ఈ హితవును యూదావారికే కాదు చుట్టూ ఉన్న జాతులకూ ఇచ్చాడు. సిద్కియా ఏలుబడి పూర్వభాగంలో ఎదోము, మోయాబు, తూరు, ఇతర దేశాల రాజులు తామంతా సంయుక్తంగా తిరుగుబాటు చెయ్యటానికి అది అనుకూల సమయమా కాదా తెలుసుకోటానికి బబులోను రాజుకి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యటానికి తమతో చేతులు కలపమని అడగటానికి అతడివద్దకు రాయబారుల్ని పంపారు. ఈ రాయబారులు అతడి జవాబుకోసం ఎదురుచూస్తున్న తరుణంలో దేవుని వద్దనుంచి యిర్మీయాకు ఈ వర్తమానం వచ్చింది, “నీవు కాడిని పలుపును చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. వాటిని యెరూషలేమునకు యూదా రాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.” యిర్మీ 27:2,3.PKTel 308.1

    తమ రాజుల్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకి తాను ఇచ్చానని వారు “అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులై యుందురు.” (7వ వచనం) అని వారికి తెలియజేయమని ఆ రాయబారులికి చెప్పాల్సిందిగా యిర్మీయాని దేవుడు ఆజ్ఞాపించాడు.PKTel 308.2

    అంతేకాదు, తాము బబులోను రాజుకి దాసులవ్వటానికి నిరాకరిస్తే వారిని “బొత్తిగా నాశనము చేయించువరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించెదను” అని ప్రభువన్నట్లు ఆ రాయబారులు తమ రాజులికి తెలపాల్సి ఉన్నారు. ముఖ్యంగా వారు తమకు తప్పుడు బోధచేసే అబద్ద ప్రవక్తలకు దూరంగా ఉండాల్సి ఉంది. ప్రభువిలా ప్రకటించాడు, “కాబట్టి మి ప్రవక్తలేమి, సోదే గాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవించకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ద ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడిక్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములలో కాపురముండనిచ్చెదరు. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును. ఇదే యెహోవావాక్కు” 8-11 వచనాలు. అంత దయాళుడైన ప్రభువు అంతగా తిరగబడే ప్రజలకు విధించే మిక్కిలి తేలికపాటి శిక్ష బబులోను పాలకులకు లొంగి ఉండమనటం. అయితే ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తే అతి కఠిన శిక్షను వారు చవిచూడాల్సి ఉంటుంది.PKTel 308.3

    దాస్యాన్ని సూచిస్తున్న కాడిని మెడమీద పెట్టుకుని మోస్తూ దేవుని చిత్తం ఇది అని తెలుపుతున్న యిర్మీయాను చూసిన సభలో ఉన్న జాతులవారి విస్మయం అంత ఇంత కాదు.PKTel 309.1

    వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నడుమ లొంగుబాటు విధానానికి యిర్మీయా స్థిరంగా నిలబడి ఉన్నాడు. ప్రభువు మాటను వ్యతిరేకించటానికి లేచినవారిలో ప్రముఖుడు అబద్ద ప్రవక్తల్లో ఒకడైన హనన్యా. ఇతడికి దూరంగా ఉండాల్సిందంటూ ప్రజల్ని దేవుడు హెచ్చరించటం జరిగింది. రాజు రాజు ఆస్థానంలోని వారి ప్రాపకం గడించేందు కోసం అతడు నిరసన గళం ఎత్తాడు. యూదులికి ప్రోత్సాహాన్నిచ్చే మాటలు దేవుడు తనకిచ్చాడంటూ ఇలా అన్నాడు : “ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు - నేను బబులోను రాజు కాడిని విరచి యున్నాను. రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసికొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల రప్పించెదను. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదరాజునైన యెకొన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు” యిర్మీ. 28:2-4.PKTel 309.2

    దేవుడు నిర్దేశించిన సమయం వరకు బబులోను రాజుకు లొంగి ఉండాల్సిందిగా యాజకులు ప్రజల సమక్షంలో యిర్మీయా విజ్ఞాపన చేశాడు. తానిచ్చిన యిలాంటి హెచ్చరికల్ని మందలింపు వర్తమానాల్ని అందించిన హోషేయా, హబక్కూకు, జెఫన్యా మొదలైనవారి ప్రవచనాల్ని యూదావారికి ఊటంకించాడు. పశ్చాత్తాపపడని పాపాన్ని గురించిన శిక్షకు సంబంధించిన ప్రవచనాల నెరవేర్పు క్రమంలో చోటుచేసుకున్న ఘటనల్ని వారి దృష్టికి తెచ్చాడు. పాపపశ్చాత్తాపం లేనివారిపై గతంలో దేవుని తీర్పులు పడ్డాయి. తన దూతలద్వారా వెల్లడైన దైవ సంకల్పాల్ని ఖచ్ఛితంగా నెరవేర్చుతూ ఇవి సంభవించాయి. PKTel 309.3

    చివరగా యిర్మీయా ఇలా ప్రతిపాదించాడు, “అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరిన యెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగును.” 9వ వచనం. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోటానికి ఇశ్రాయేలు ఎంపిక చేసుకుంటే ఎవరు యధార్ధ ప్రవక్తో భావిపరిణామాలే తేల్చి చెబుతాయి.PKTel 310.1

    లొంగి ఉండమంటూ యిర్మీయా అందించిన హితవును సవాలు చేస్తూ హనన్యా యిర్మీయా వర్తమాన విశ్వనీయతను ప్రశ్నించాడు. సంకేతాత్మకమైన ఆ కాడిని యిర్మీయా మెడమీద నుంచి తీసివేసి దాన్ని విరిచి ఇలా అన్నాడు, “యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు - రెండు సంవత్సరములలో నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడమీదనుండి తొలగించి దాని విరిచి వేసెదను.”PKTel 310.2

    “అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను.” 11వ వచనం. యిర్మీయా అతడితో వాదమాడకుండా అక్కడనుంచి వెళ్లిపోయాడు. అయితే యిర్మీయాకు దేవుడు ఇంకొక వర్తమానం ఇచ్చాడు. అతడికి దేవుని ఆదేశం ఇది, “నీవు పోయి హనన్యాతో ఇట్లనుము - యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతి యగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుప కాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు....”PKTel 310.3

    “అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను - హనన్యా వినుము; యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్దమును ఆశ్రయింప జేయు చున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు - భూమిమీదనుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవామీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము మరణమౌదువు.” 13-17 వచనాలు.PKTel 310.4

    ఈ అబద్ద ప్రవక్త యిర్మీయాపట్ల అతడి వర్తమానం పట్ల ప్రజలకు అపనమ్మకం పుట్టించాడు. తాను ప్రభువు రాయబారేనని ప్రకటించుకున్నాడు. పర్యవసానంగా మరణించాడు. అయిదోమాసంలో యిర్మీయా హనన్యా మరణాన్ని ప్రవచించాడు. ఏడో మాసంలో ఆ మాటలు నెరవేరాయి. అతడు మరణించాడు.PKTel 310.5

    అబద్ద ప్రవక్తలవల్ల కలిగిన అశాంతి సిద్కియా దేశద్రోహి అన్న అనుమానానికి దారితీసింది. సిద్కియా వెంటనే మేల్కొని నిర్ణయాత్మక చర్య చేపట్టటంవల్ల ఆ ఉపద్రవం తొలగిపోయి సామంత రాజుగా పరిపాలించగలిగాడు. అలాంటి సయోధ్య చర్యకు అవకాశం ఎప్పుడు లభించిందంటే రాయబారులు యెరూషలేమునుంచి చుట్టుపక్కల ఉన్న తమ రాజ్యానికి తిరిగివెళ్లిన వెంటనే “నెమ్మదిపరుడైన అధిపతి” అయిన శేరాయా ఒక ముఖ్యమైన కార్యం నిమిత్తం బబులోనుకి వెళ్తుంటే అతనివెంట యూదరాజు వెళ్లినప్పుడు. యిర్మీ. 51-59. కల్దీయుల ఆస్థానానికి తన ఈ సందర్శన సమయంలో సిద్కియా నెబుకద్నెజరుతో తన స్నేహబంధాన్ని విశ్వసనీయతను నవీకరించుకున్నాడు.PKTel 310.6

    దానియేలు ఇతర హెబ్రీ బందీలద్వారా బబులోను సార్వభౌముడు యధార్థ దేవుని శక్తిని సర్వాధికారాన్ని గూర్చి తెలుసుకున్నాడు. తనకు నమ్మకంగా ఉంటానని సిద్కియా మళ్లీ వాగ్దానం చేసినప్పుడు నెబుకద్నెజరు అతణ్ని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చెయ్యమన్నాడు. సిద్కియా నవీకరించుకున్న ఈ నిబంధనను వాగ్దానాన్ని గౌరవించి ఉంటే హెబ్రీయుల దేవుని ఘనపర్చుతున్నామని చెప్పుకునే వారి ప్రవర్తనను గమనించే అనేకులపై అతడి ప్రభావం బలీయంగా ఉండేది.PKTel 311.1

    అయితే సజీవ దేవుని నామానికి ఘనత తెచ్చే ఆధిక్యతను యూదా రాజు విస్మరించాడు. సిద్కియాను గురించి ఇలాంటి దాఖలా ఉంది : “అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు తన్నుతాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తనచేత ప్రమాణము చేయించిన నెలకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవావైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.” 2 దిన వృ. 36:12,13.PKTel 311.2

    యిర్మీయా తన పరిచర్యను యూదాలో కొనసాగిస్తున్న కాలంలో బబులోనులో ఉన్న బందీ బానిసల్ని హెచ్చరించటానికి, ఓదార్చటానికి, యిర్మీయా ద్వారా ప్రభువు పలుకుతున్న వర్తమానాల్ని ధ్రువీకరించటానికి ప్రభువు యెహెజ్కేలు ప్రవక్తను లేపాడు. సిద్కియా ఏలుబడికి ఇంకా మిగిలిఉన్న కాలంలో బందీలు త్వరలోనే యెరూషలేముకి తిరిగి వెళ్తారని అబద్ద ప్రవచనాలు చెప్పి బందీల ఆశల్ని పెంచుతున్న అబద్ద ప్రవక్తల్ని నమ్మటం బుద్దిహీనమని యెహెజ్కేలు తేటతెల్లం చేశాడు. రకరకాల చిహ్నాలు గంభీర వర్తమానాల ద్వారా యెరూషలేము ముట్టడిని సర్వనాశనాన్ని ప్రవచించాల్సిందిగా దేవుడు యెహెజ్కేలుని ఆజ్ఞాపించాడు.PKTel 311.3

    సిద్కియా ఏలుబడి ఆరోఏట యెరూషలేములోను దేవుని మందిరం ద్వారంలోను ఇంకా చెప్పాలంటే గర్భాలయంలోను చోటుచేసుకుంటున్న హేయకార్యాల్ని ఒక దర్శనంలో ప్రభువు యెహెజ్కేలుకి కనపర్చాడు. విగ్రహాలతోనిండిన గదులు, హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు” కళ్లప్పగించి చూస్తున్న ప్రవక్త ముందునుంచి వెళ్లాయి. యెహె. 8:10.PKTel 311.4

    ప్రజలమధ్య ఆధ్యాత్మిక నాయకులుగా ఉండాల్సినవారు అనగా ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బయిమందీ ఆలయం ఆవరణలోని పరిశుద్ధ స్థలంలో ఉన్న రహస్య గదుల్లో విగ్రహాలముందు ధూపార్చన చేస్తూ కనిపించారు. ఈ యూదా పెద్ద మనుషులు “యెహోవా మమ్మును కానకయుండును” అనుకుంటూ అతిశయించాడు. “యెహోవా దేశమను విసర్జించెను.” అని దేవదూషణకరంగా ప్రకటించారు. 11,12 వచనాలు.PKTel 312.1

    ప్రవక్త తిలకించటానికి “వీటిని మించిన అతి హేయకృత్యములు” ఇంకా ఉన్నాయి. బయటి ఆవరణంనుంచి లోపలి ఆవరణానికి వెళ్లే ద్వారంవద్ద “స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట అతడికి చూపించటం జరిగింది. “యెహోవా మందిరపు లోపలి ఆవరణములో... యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగియుండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి.” 13-16 వచనాలు.PKTel 312.2

    యూదా దేశంలోని ఉన్నత స్థలాల్లో ప్రబలుతున్న దుష్టతను గూర్చిన దిగ్ర్భాంతికర దర్శనమంతటా యెహెజ్కేలును వెంబడించిన దేవదూత ప్రవక్తతో ఇలా అన్నాడు : “నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి యెక్కువగా నాకు కోపము పుట్టించుదరు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింపకుందును.” 17,18 వచనాలు.PKTel 312.3

    తన నామంలో ప్రజలముందు నిలబడటానికి సాహసించే దుష్ట జనుల్ని గురించి యిర్మీయా ప్రవక్తద్వారా ప్రభువిలా అంటున్నాడు : “ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను.” యిర్మీ, 23:11. సిద్కియా రాజ్యపాలన చరిత్ర అంతిమ కథనంలో దాఖలైనట్లు యూదాపై వచ్చిన భయంకర నేరారోపణలో ఆలయ పరిశుద్ధత ఉల్లంఘన ఆరోపణను చరిత్రకారుడు పదేపదే చెయ్యటం జరిగింది. పరిశుద్ధ రచయిత ఇలా అంటున్నాడు, “అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధ పరచిన మందిరమును అపవిత్రపరచిరి.” 2 దిన వృ. 36:14.PKTel 312.4

    యూదా రాజ్య వినాశకాలం వడివడిగా వస్తున్నది. దేవుడు తన కఠినాతి కఠినమైన తీర్పుల్ని ఇక ఎంతమాత్రం ఆపలేడు. “మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింప బడకపోరు” అంటున్నాడు ప్రభువు. యిర్మీ. 25:29.PKTel 313.1

    ఈ మాటల్ని సయితం విని ఎగతాళి చేసి వెక్కిరించారు. “దినములు జరిగి పోవుచున్నవి; ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది” అంటున్నారు పాప పశ్చాత్తాపం లేనివారు. నిశ్చితమైన ప్రవచన వాక్యాన్ని ఇలా ఉపేక్షించటాన్ని యెహెజ్కేలు ద్వారా ప్రభువు తీవ్రంగా మందలించాడు. ప్రభువిలా ప్రకటించాడు “వారికి ఈ మాట తెలియజేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా - ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకుండ నేను దానిని నిరర్ధకము చేసెదను. గనుక నీవు వారితో ఇట్లనుము - దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్ధమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాటలాడుచున్నాను, నేనిచ్చుమాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట యిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు”PKTel 313.2

    యెహెజ్కేలు ఇలా సాక్ష్యమిస్తున్నాడు, “మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను - నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహు దినములు జరుగవలెననియు బహుకాలము జరిగిన తరువాత కలుగుదానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొను చున్నారుగదా కాబట్టి నీవు వారితో ఇట్లనుము - ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండ జరుగును. ఇదే యెహోవా వాక్కు” యెహె. 12:22-28. PKTel 313.3

    దేశాన్ని నాశనదిశగా వడివడిగా నడుపుతున్న వారిలో ప్రధానుడు వారి రాజు సిద్కియానే. ప్రవక్తనోట దేవుడు పలికిన హితవును పెడచెవిన పెట్టి, నెబుకద్నెజరుకు తాను రుణపడి ఉన్న కృతజ్ఞతను విస్మరించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరిట తాను చేసిన గంభీర ప్రమాణాన్ని అతిక్రమించి, యూదా భూపాలుడు ప్రవక్తలకు వ్యతిరేకంగా, తన శ్రేయోభిలాషికి వ్యతిరేకంగా, తన దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. వ్యర్ధమైన తన సొంత వివేకాన్ని పురస్కరించుకుని సహాయంకోసం ఇశ్రాయేలుకి ప్రాచీన శత్రువుని ఆశ్రయించి, “తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలెనని యడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను” పంపాడు.PKTel 313.4

    ప్రతీ పరిశుద్ధ కార్యాన్నీ ఈరకంగా భ్రష్టు పట్టించిన వ్యక్తిని గురించి ప్రభువిలా ప్రశ్నించాడు : “అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణము చేసి దాని నిర్లక్ష్యపెట్టెనో యెవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో, యెవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దనే బబులోను పురములోనే అతడు మృతినొందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను.... ఫరోయెంత బలము ఎంత సమూహము కలిగి బయలు దేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రము చేయజాలడు. తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను, తన చెయ్యి యిచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసెనే అతడు ఎంత మాత్రము తప్పించుకొనడు.” యెహె. 17:15-18.PKTel 314.1

    “దుష్ణుడు దుర్మార్గుడు” అయిన రాజుకి చివరి తీర్పు వచ్చింది. “తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము.” అని ప్రభువు ఆజ్ఞాపించాడు. క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించేంతవరకు యూదాకు మళ్లీ రాజుగా ఎవరూ ఉండటానికి లేదు. దావీదు వంశపు సింహాసనం గురించి దేవుని ఆజ్ఞ ఇది, “నేను దానిని పడద్రోయుదును. పడద్రోయుదును. పడద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు. అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.” యెహె. 21:25-27.PKTel 314.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents