Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    58 - విమోచకుని ఆగమనం

    “బాధలును అంధకారమును దుస్సహమైన వేదన” తో నిండిన దీర్ఘ శతాబ్దాల పొడుగునా (యెష 8:22), మన మొదటి తల్లిదండ్రులు ఏదెను గృహాన్ని కోల్పోయిన నాటినుంచి దైవ కుమారుడు పాపుల రక్షకుడుగా అవతరించిన సమయం వరకూ జరిగిన మానవ చరిత్రలో, పతనమైన మానవజాతి నిరీక్షణ, మానవుల్ని పాపం మరణం దాస్యం నుంచి విముక్తుల్ని చెయ్యటానికి వస్తున్న విమోచకుడిపై కేంద్రీకృతమయి ఉంది.PKTel 479.1

    సర్పంపై దేవుడు ప్రకటించిన తీర్పులో ఆ నిరీక్షణను గూర్చిన మొదటి సూచన ఆదామవ్వలికిచ్చాడు. అప్పుడు వారు వింటుండగా ప్రభువు సాతానుతో “నీకును, స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మిద కొట్టుదువు.” అన్నాడు. ఆది 3:15.PKTel 479.2

    అపరాధులైన ఆ దంపతులు ఈ మాటలు విన్నప్పుడు వారిలో నిరీక్షణ చిగురించింది. ఎందుకంటే సాతాను శక్తిని నాశనం చెయ్యటాన్ని గురించిన ప్రవచనంలో, అతిక్రమం ద్వారా కలిగిన నాశనం నుంచి వారు విమోచన వాగ్దానాన్ని చూడగలిగారు. తాము తమ విరోధి మోసపూరిత ప్రభావానికి లొంగి సరళమైన దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు గనుక శ్రమలనుభవించాల్సి వచ్చినప్పటికీ, వారు పూర్తిగా నిరాశకు లోనుకానక్కరలేదు. తమ అతిక్రమాలికి దైవ కుమారుడు తన సొంతరక్తంతో ప్రాయశ్చిత్తం చెయ్యటానికి అంగీకరించాడు. వారికి కొంత కృపకాలం మంజూరు చేయాల్సి ఉంది. రక్షించటానికి క్రీస్తుకున్న శక్తి ద్వారా ఈ కృపకాలంలో వారు మళ్లీ దేవుని పిల్లలు కావచ్చు. PKTel 479.3

    మానవుణ్ని విధేయతా మార్గం నుంచి పక్కకు తప్పించటంలో జయం సాధించటం ద్వారా సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” అయ్యాడు. 2 కొరి. 4:4. ఒకప్పుడు ఆదాముకున్న పాలనాధికారం అపహర్త హస్తగతం చేసుకున్నాడు. అయితే పాప శిక్షను చెల్లించటానికి దైవకుమారుడు ఈలోకానికి రావటానికి నిర్ధారించుకున్నాడు. తద్వారా మానవుణ్ని విమోచించటమే కాదు అతడు కోల్పోయిన పాలనాధికారాన్ని కూడా పునరుద్దరించటానికి రానున్నాడు. “సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మిద నీకు ప్రభుత్వము కలుగును” (మికా 4:8) అన్నప్పుడు మీకా ఈ పునరుద్ధరణ గురించి ప్రవచించాడు. అపొస్తలుడు పౌలు దీన్ని “ఆయన సంపాదించుకొనిన... స్వాస్థ్యము”గా ప్రస్తావిస్తున్నాడు. ఎఫె 1:14. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” (కీర్త 37:29) అన్నప్పుడు కీర్తనకారుడు మానవుడి ఆదిమ స్వాస్థ్య పునరుద్ధరణను గురించి ఆలోచించాడు.PKTel 479.4

    రక్షకుడుగాను రాజుగాను దైవ కుమారుడి రాక ద్వారా ఈ విమోచన సాకారమవుతుందన్న నిరీక్షణ మనుషుల హృదయాల్లోనుంచి ఎన్నడూ పోదు. ప్రస్తుతంలోని మబ్బుల్లో నుంచి భవిష్యత్తులోని వాస్తవాన్ని అందిపుచ్చుకోగల విశ్వాసం గలవారు ఆదినుంచి కొందరు ఉంటునే ఉన్నారు. ఆదాము, షేతు, హనోకు, మెతూషెల, నోవహు, షేము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు - వీరు ఇంకా ఇతర భక్తుల ద్వారా ప్రభువు తన చిత్రాన్ని బయలుపర్చాడు. తాను ఎంపిక చేసుకున్న ప్రజలు, లోకానికి వాగ్దత్త మెస్సీయాను ప్రకటించాల్సిన ప్రజలు ఆయిన ఇశ్రాయేలీయులికి తన ధర్మవిధుల్ని గూర్చిన జ్ఞానాన్ని, తన కుమారుని ప్రాయశ్చితార్ధ బలిద్వారా కలుగనున్న రక్షణను గూర్చిన జ్ఞానాన్ని దేవుడు ఈ రీతిగా ఇచ్చాడు. PKTel 480.1

    దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత “భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును” (ఆది 12:3) అని అతడికి చేసిన, ఆ తర్వాత అతడి సంతానానికి మళ్లీ మళ్లీ పునరుద్ఘాటించిన వాగ్దానంలో ఇశ్రాయేలీయుల నీరీక్షణ కేంద్రీకృతమై ఉంది. మానవాళి రక్షణ నిమిత్తం దేవుని సంకల్పం అబ్రహాముకి వెల్లడి కావటంతో అతడి హృదయంలో నీతి సూర్యుడు ప్రకాశించాడు. అతడి చీకటి పటాపంచలయ్యింది. చివరగా రక్షకుడే స్వయంగా మనుషుల మధ్య సంచరించినప్పుడు, విమోచకుడి రాక ద్వారా కలుగనున్న విమోచనను గూర్చి ఆ పితరుడి నిరీక్షణను గూర్చి ఆయన యూదులికి సాక్ష్యమిచ్చాడు. “మి తండ్రియైన అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను. అది చూచి సంతోషించెను” అన్నాడు క్రీస్తు. యోహా 8:56.PKTel 480.2

    మరణ శయ్యపై ఉన్న పితరుడు యాకోబు తన కుమారుడు యూదాని దీవిస్తూ పలికిన మాట్లల్లో కూడా ఈ శుభప్రద నిరీక్షణనే వెలిబుచ్చాడు:PKTel 480.3

    “యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు
    నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును
    నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిల పడుదురు.
    యూదా కొదమ సింహము
    నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి
    సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను
    అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను
    అతని లేపువాడెవడు?
    షిలోహు వచ్చువరకు
    యూదా యొద్దనుండి దండము తొలగదు
    అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు
    ప్రజలు అతనికి విధేయులై యుండెదరు.”
    PKTel 481.1

    ఆది 49:8-10.

    మళ్లీ వాగ్దత్త కనాను సరిహద్దుల్లో బిలాము ప్రవచించిన ఈ ప్రవచనంలో లోక విమోచకుని రాకను ప్రవచించటం జరిగింది.PKTel 481.2

    “ఆయనను చూచుచున్నాను గాని
    ప్రస్తుతమున నున్నట్లుకాదు
    ఆయనను చూచుచున్నాను గాని
    సమీపమున నున్నట్టుకాదు
    నక్షత్రము యాకోబులో ఉదయించును
    రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును
    అది మోయాబు ప్రాంతములను కొట్టును
    కలహ వీరులనందరిని నాశనము చేయును.”
    PKTel 481.3

    సంఖ్యా 24:17.

    పతనమైన మానవకోటిని విమోచించటానికి తన కుమారుణ్ని పంపటం తన ఉద్దేశమని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల ముందుంచాడు. ఒక సందర్భంలో, తన మరణానికి కొంచెం ముందు, మోషే ఈ ప్రకటన చేశాడు, “నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు,” రానైయున్న మెస్సీయా కర్తవ్యం గురించి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఉపదేశించాడు. యెహోవా తన సేవకుడు మోషేతో ఇలా అన్నాడు, “వారి సహోదరులలోనుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.” ద్వితి 18:17,18.PKTel 481.4

    పితరుల కాలంలో దైవారాధనకు సంబంధించిన బల్యర్పణలు రక్షకుని రాకను ప్రతినిత్యం సూచించేవి. ఇశ్రాయేలీయుల చరిత్ర పొడుగున ఆలయ సేవలకు సంబంధించిన ఆచారమంతటిలోను ఇలా జరిగేది. గుడార సేవల్లోను ఆ తర్వాత దానిస్తానే వచ్చిన ఆలయ సేవల్లోను ఛాయా రూపకాలు చిహ్నాల ద్వారా క్రీస్తు రక్షకుడుగా, యాజకుడుగా, రాజుగా రావటానికి సంబంధించిన సత్యాల్ని, ప్రజలికి ప్రతీదినం బోధించటం జరిగేది. క్రీస్తుకీ సాతానుకీ మధ్య జరుగుతున్న మహా సంఘర్పణ ముగింపు సంఘటనల పైకి, అనగా విశ్వాన్ని పాపం నుంచి పాపుల నుంచి అంతిమంగా శుద్ధీకరించే ఘటనపైకి సంవత్సరానికోసారి వారి మనసుల్ని తిప్పటం జరిగేది. మోషే ఆచార ధర్మశాస్త్రం ప్రకారం ఆచరించిన బలులు అర్పణలు మెరుగైన సేవను అనగా పరలోక ఆలయ సంబంధిత సేవను నిత్యం సూచించాయి. భూలోక గుడారం “ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది.” అందులో అర్పణలు బలులు అర్పించటం జరిగేది. అందులోని రెండు పరిశుద్ధ స్థలాలు “పరలోకమందున్న వాటిని పోలినవి.” ఎందుకంటే మన ప్రధాన యాజకుడైన క్రీస్తు “మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడు” హెబ్రీ. 9:9,23; 8:2.PKTel 482.1

    నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను” (ఆది 3:15) అని ఏదేనులో ప్రభువు సర్పంతో పలికిన నాటినుంచి, తాను లోక నివాసులపై ఎన్నటికీ ప్రాబల్యం సాధించలేనని సాతాను తెలుసుకున్నాడు. రానున్న విమోచకుడికి ఛాయారూపకంగా ఆదాము అతడి కుమారులు ఆచారబద్ధమైన బలులు అర్పించినప్పుడు వాటిని భూమికి పరలోకానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలికి సంకేతంగా సాతాను అవగతం చేసుకున్నాడు. ఆ తర్వాత గడచిన దీర్ఘశతాబ్దాల్లో ఈ ప్రసారాన్ని అడ్డుకోటానికి అతడు ప్రయత్నించాడు. దేవునికి దురుద్దేశాలు అంటగట్టటానికి, రక్షకుణ్ని సూచించే ఆచరణలికి తప్పుడు భాష్యం చెప్పటానికి, అతడు అవిశ్రాంతంగా కృషి చేశాడు. అనేకమంది మనుషుల్ని బురుడీకొట్టించటంలో విజయం సాధించాడు.PKTel 482.2

    మానవుల్ని తన ప్రేమవల్ల తనతో సమాధానపర్చే వరం వస్తుందని వారికి నేర్పించాలని దేవుడు ఆకాంక్షిస్తుండగా మానవజాతి బద్ద శత్రువు దేవుణ్ని వారి నాశనాన్ని కోరేవాడిగా చిత్రించటానికి ప్రయత్నించాడు. దైవ ప్రేమను వెల్లడిచేయటానికి పరలోకం స్థాపించిన బలులు సంస్కారాల్ని వక్రీకరించటం జరిగింది. పర్యవసానంగా అర్పణలతోను సత్రియలతోను దేవున్ని ప్రసన్నుణ్నిPKTel 482.3

    చెయ్యటానికి పాపులు వ్యర్ధంగా ప్రయత్నించారు. పదేపదే అతిక్రమాలు చెయ్యటంవల్ల జనులు దేవునికి దూరంగా మరింత దూరంగా వెళ్లిపోయి పాప శృంఖలాల్లో మగ్గేటట్లు చెయ్యటానికి అదే సమయంలో మనుషుల దురావేశాల్ని రెచ్చగొట్టటానికి సాతాను ప్రయత్నిస్తాడు.PKTel 483.1

    హెబ్రీ ప్రవక్తలు దేవుని వాక్యం రచించినప్పుడు, మెస్సీయాని గూర్చిన వర్తమానాల్ని సాతాను శ్రద్ధగా అధ్యయనం చేశాడు. బాధపడున్న బలిగా విజయం సాధిస్తున్న రాజుగా క్రీస్తు మనుషుల మధ్య పనిచెయ్యటాన్ని స్పష్టంగా చెబుతున్న మాటల్ని జాగ్రత్తగా పరిశీలించాడు. తోలు గ్రంథపు చుట్టల్లోని పాతనిబంధన లేఖనాల్లో రానున్న రక్షకుడు “వధకు తేబడు గొఱ్ఱపిల్ల”లా ఉంటాడని “మనిషి రూపముకంటే అతని ముఖమును నరరూపముకంటే అతని రూపమును” ఉంటుందని అతడు చదివాడు. యెష 53:7, 52:14. మానవాళి వాగ్ధత్త రక్షకుడు “తృణీకరింపబడినవాడును... మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను... దేవుని వలన బాధింపబడినవానిగాను శ్రమలనొందిన వానిగాను” ఉన్నాడు. అయినా ప్రజలలో శ్రమనొందువారికి... న్యాయము” తీర్చటానికి ఆయన తన మహాశక్తిని వినియోగించాల్సి ఉన్నాడు. ఆయన “బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలుగగొట” వలసి ఉంది. యెష 53:3,4, కీర్త 72:4. ఈ ప్రవచనాలు సాతానుకి భయంపుట్టించాయి. అయినా నశించిన మానవకోటి విమోచనార్థం యెహోవా చేసిన కృపాపూరిత ఏర్పాట్లను అడ్డుకోటానికి తన ప్రయత్నాల్ని అతడు విరమించుకోలేదు. సాధ్యమైనంత మేరకు మెస్సీయాని గూర్చిన ప్రవచనాల ప్రాధాన్యం గుర్తించకుండా ఉండేందుకు ప్రజల కండ్లకు గుడ్డితనం కలిగించి క్రీస్తు వచ్చినప్పుడు వారు ఆయన్ని విసర్జించటానికి మార్గం సరాళం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.PKTel 483.2

    జలప్రళయానికి కాస్త ముందటి శతాబ్దాల్లో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేపటంలో సాతాను కృషి ఫలించింది. జలప్రళయం నేర్పిన పాఠాలు సయితం ప్రజలు ఎక్కువకాలం జ్ఞాపకముంచుకోలేదు. మోసకరమైన వ్యంగ్యసూచనలతో మనుషుల్ని క్రమక్రమంగా సాతాను మళ్లీ తిరుగుబాటుకి నడిపించాడు. మళ్లీ విజయం తననే వరించినట్లు కనిపించింది. కాని మానవుల విషయంలో దేవుని సంకల్పం ఇలా పక్కదారి పట్టటం జరగదు. షేము సంతతివాడు నమ్మకస్తుడు అయిన అబ్రహాము ద్వారా భావితరాల వారి శ్రేయం కోసం దేవుని సంకల్పాన్ని గూర్చిన జ్ఞానాన్ని పరిరక్షించటం జరిగింది. బలి అర్పణల ఆచారం భావంపైన, ప్రధానంగా ఈ సంస్కారాలు బల్యర్పణల వ్యవస్థ ఎవరిని సూచిస్తుందో ఆయన రాకను గురించిన యోహోవా వాగ్దాన భావం పైన ప్రజల గమనాన్నిPKTel 483.3

    నిలపటానికి సత్య ప్రబోధకుల్ని దేవుడు అప్పుడప్పుడు లేపటం జరిగేది. ఈ రకంగా మతభ్రష్టత విశ్వవాప్తం కాకుండా చూడాల్సి ఉంది.PKTel 484.1

    ఈ దైవ సంకల్పం నెరవేర్పు తీవ్ర వ్యతిరేకత లేకుండా జరగలేదు. అబ్రహాము సంతతివారిని ఉన్నతమైన పవిత్రమైన తమ పిలుపును విస్మరించి అబద్ద దేవతలను పూజించటానికి సత్యవిరోధి అన్నివిధాలా ప్రయత్నించాడు. తరచు అతడి ప్రయత్నాలు విజవంతమైనట్లు కనిపించాయి. ఎందుకంటే క్రీస్తు మొదటి రాకకు కొన్ని శతాబ్దాలు ముందు లోకాన్ని చీకటికమ్మింది. ప్రజల్ని అంధకారం కప్పింది. దేవుని గూర్చిన జ్ఞానాన్ని లోకం భవిష్యత్తును గూర్చిన జ్ఞానాన్ని మరుగుపర్చటానికి మనుషుల మార్గాన్ని సాతాను నరక ఛాయలతో నింపుతున్నాడు. వేలాది ప్రజలు మరణఛాయలో కూర్చుని ఉన్నారు. ఈ చీకటిని తొలగించి దేవున్ని చూపించటమే వారికిగల ఏకైక నిరీక్షణ. PKTel 484.2

    క్రీస్తు రాకడ “ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించు సూర్యునివలెను” ఉంటుందని దైవాభిషేకం పొందిన దావీదు ప్రావచనిక దృష్టితో చూశాడు. 2 సమూ 23:4. హో షేయ సాక్ష్యం ఇది: “ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును.” హోషే 6:3. చీకటి నీడల్ని చెదరగొట్టి భూమిపై జీవాన్ని మేల్కొల్పుతూ నిశ్శబ్దంగా మృదువుగా సూర్యకాంతి ప్రకాశిస్తుంది. అలాగే నీతి సూర్యుడు “ఆరోగ్యము కలుగజేయు” “రెక్కల”తో ఉదయిస్తాడు. మలాకీ. 4:2. “చీకటిలో” నివసించే జనులు “గొప్ప వెలుగును” చూస్తారు. యెష. 9:2. ఈ మహోజ్వల విమోచనను గూర్చి ఆనందపరవశుడైన యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు:PKTel 484.3

    “మనకు శిశువు పుట్టెను
    మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
    ఆయన భుజముమీద రాజ్యభారముండును
    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
    నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని
    అతనికి పేరు పెట్టబడును
    ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్దియు క్షేమ
    మును కలుగునట్లు
    సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును
    నియమించును
    న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచు
    టకు
    అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును
    సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని
    నెరవేర్చును.”
    PKTel 484.4

    6,7 వచనాలు.

    మొదటి రాకడకు ముందు ఇశ్రాయేలు చరిత్రలోని అనంతర శతాబ్దాల్లో మెస్సీయా రాకను గురించిన ప్రస్తావన ఈ ప్రవచనంలో ఉన్నదన్నది సాధారణ అవగాహన, “నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్దరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను.” “యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు” అని ప్రవక్త ప్రవచించాడు. యెష 49:6, 40:5. “ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము” అంటూ బాప్తిస్మమిచ్చే యోహాను అనంతరం ధైర్యంగా ప్రకటించింది మనుషులకు ఉద్దేశించిన ఈ వెలుగునే. యోహా 1:23.PKTel 485.1

    ఈ ప్రావచనిక వాగ్దానం క్రీస్తుకే ఇవ్వబడింది : “ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును.... ఈలాగు సెలవిచ్చుచున్నాడు.... బయలు వెళ్తుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు. దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్నుకాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.... వారియందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవును. నీటిబుగ్గల యొద్ద వారిని నడిపించువాడు వారిని తోడుకొని పోవును. నీటిబుగ్గల యొద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు. ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.” యెష 49:7-10.PKTel 485.2

    యూదు ప్రజల్లోని దృఢ విశ్వాసులు ఈ లేఖన భాగాల్ని ఇలాంటి ఇతర లేఖనభాగాల్ని అధ్యయనం చేసి తమ విశ్వాసాన్ని బలపర్చుకున్నారు. వీరు పరిశుద్ధ వంశీకులు. వీరి ద్వారా దేవున్ని గూర్చిన జ్ఞానం పరిరక్షించబడింది. “దీనులకు సువర్తమానము ప్రకటించుటకు,” “నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకు,” “యెహోవా హితవత్సరమును... ప్రకటించుటకును” ప్రభువు ఆయన్ని ఎలా అభిషేకిస్తాడో వారు ఆనంద పారవశ్యంతో చదివారు. యెష 61:1,2. అయినా ఆయన ఆ దైవ సంకల్పాన్ని నెరవేర్చటానికి అనుభవించనున్న శ్రమల్ని గురించి ఆలోచించినప్పుడు వారి హృదయాలు దుఃఖంతో నిండాయి. ఆ ప్రవచన గ్రంథపు చుట్టలోని ఈ మాటల్ని తీవ్ర మనస్తాపంతో గుర్తుంచు కున్నారు :PKTel 485.3

    “మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?
    యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
    లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన
    మొక్కవలెను
    అతడు ఆయన యెదుట పెరిగెను
    అతనికి సురూపమైనను సొగసైనను లేదు
    మనమతని చూచి, అపేక్షించునట్లుగా
    అతనియందు సురూపమైనను లేదు”

    “అతడు తృణీకరించిబడినవాడును ఆయెను
    మనుష్యుల వలన విసర్జింపబడినవాడును
    వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను
    మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను
    అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని
    ఎన్నిక చేయకపోతిమి
    నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను
    మన వ్యసనములను వహించెను
    ఆయినను మొత్తబడినవానిగాను
    దేవుని వలన బాధింపబడినవానిగాను
    శ్రమ నొందినవానిగాను మనమతనిని ఎంచితిమి
    మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను
    మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను
    మన సమాధానార్ధమైన శిక్ష అతనిమీద పడెను
    అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు
    చున్నది.”

    “మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతిమి
    మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవకు తొలగెను
    యెహోవా మనయందరి దోషమును అతనిమీద
    మో పెను” “అతడు దౌర్జన్యము నొందెను
    బాధింపబడినను అతడు నోరు తెరవలేదు
    వధకు తేబడు గొఱ్ఱపిల్లయు
    మౌనముగా నుండునట్లు
    అతడు నోరు తెరువలేదు”

    “అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను
    అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను
    గదా
    సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను
    అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో
    చించినవారెవరు?”

    “అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి
    సమాధి నియమింపబడెను
    ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను
    నిశ్చయముగా అతడు అన్యామేమియు చేయలేదు
    అతనినోట ఏ కపటమును లేదు.”
    PKTel 486.1

    యెష 53:1-9.

    శ్రమలనుభవిస్తున్న రక్షకుణ్ని గూర్చి యోహావా తానే ఇలా జెకర్యా ద్వారా అంటున్నాడు, “ఖడ్గమా నా గొఱ్ఱలకాపరి మిదను నా సహకాపరి మిదను పడుము, ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు” జెకర్యా 13:7. మానవుడి ప్రత్యామ్నాయంగా హామిగా క్రీస్తు దేవుని న్యాయ వ్యవస్థ కింద శ్రమననుభవించాల్సి ఉంది. న్యాయమంటే ఏంటో ఆయన అవగాహన చేసుకోవాల్సి ఉంది. విజ్ఞాపకుడు లేకుండా పాపి దేవుని ముందు నిలబడటమంటే ఏంటో ఆయన అవగాహన చేసుకోవాల్సిఉంది.PKTel 487.1

    కీర్తనకారుడి ద్వారా విమోచకుడు తన్నుగుర్చి తాను ఇలా ప్రవచించాడు : PKTel 487.2

    “నిందకు నా హృదయము బద్దలాయెను
    నేను బహుగా కృషించియున్నాను
    కరుణించువారి కొరకు కనిపెట్టుకొంటిని
    గాని యెవరును కానరైరి
    ఓదార్చు వారికొరకు కనిపెట్టుకొంటిని
    గాని యెవరును కానరైరి
    వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి
    నాకు దప్పియైనప్పుడు చిరక త్రాగనిచ్చిరి.”
    PKTel 487.3

    కీర్త 69:20,21.

    తనపట్ల వ్యవహరణనుగూర్చి ఆయన ఇలా ప్రవచించాడు, “కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గులు గుంపులు కూడా నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు.” కీర్త 22:16-18. PKTel 488.1

    వాగ్దత్త మెస్సీయా పొందనున్న తీవ్ర శ్రమల్ని క్రూర మరణాన్ని గూర్చిన ఈ వర్ణనలు దుఃఖం కలిగిస్తున్నా, అవి విలువైన వాగ్దానాలతో నిండినవి. తనకు తానే “అపరాధపరిహారార్ధబలి” అయ్యేందుకుగాను ఎవరిని “నలుగగొట్టుటకు” దుఃఖపర్చటానికి “యెహోవాకు ఇష్టమాయెను”నో ఆయన్ని గూర్చి యెహోవా ఇలా వెల్లడించాడు :PKTel 488.2

    “అతడు తన్నుతానే అపరాధ పరిహారార్ధ బలి చేయగా
    అతని సంతానము చూచును
    అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము
    అతనివలన సఫలమగును
    అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును.”

    “నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములనుభరించి
    తనకున్న అనుభవ జ్ఞానముచేత
    అనేకులను నిర్దోషులుగా చేయును
    కావున గొప్పవారితో నేనతనికి పాలుపంచిపెట్టెదను
    ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనును
    ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ
    మును ధారపోసెను
    అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను
    అనేకుల పాపములను భరించుచు
    తిరుగుబాటు చేసినవారిని గూర్చి విజ్ఞాపన చేసెను.”
    PKTel 488.3

    యెష 53:10-12.

    పాపుల పట్ల తనకున్న ప్రేమము బట్టే క్రీస్తు విమోచన మూల్యాన్ని చెల్లించాడు. “సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండుటPKTel 489.1

    చూచి ఆశ్చర్యపడెను,” శత్రువు బారినుంచి మానవుల్ని విమోచించ గలిగినవారు ఇంకెవ్వరూ లేరు. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.” యెష 59:16.PKTel 489.2

    “ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు
    నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు
    ప్రియుడు
    అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను
    అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును”
    PKTel 489.3

    యెష 42:1.

    ఆయన జీవితంలో అహం అన్నదానికి తావులేదు. పదవికి, భాగ్యానికి, ప్రతిభకు లోకం అర్పించే నివాళ్లు దైవకుమారుడు అంగీకరించలేదు. విశ్వాసాన్ని చూరగొనటానికి, నివాళులు అందుకోటానికి మనుషులు వినియోగించే సాధనాల్ని మెస్సీయా ఉపయోగించలేదు. ఆయన ఆత్మ పరిత్యాగ స్పూర్తి ఈ మాటల్లో ముందే వివరించటం జరిగింది :PKTel 489.4

    “అతడు కేకలు వేయడు అరువడు
    తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు
    నలిగిన రెల్లును అతడు విరువడు
    మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు
    అతడు సత్యముననుసరించి న్యాయము కనుపరచును.”
    PKTel 489.5

    2,3 వచనాలు.

    తన కాలంలోని బోధకులకన్నా వ్యత్యాసంగా రక్షకుడు మనుషుల మధ్య మెలగాల్సి ఉన్నాడు. ఆయన జీవితంలో అల్లరితో కూడిన వాదనలు, ఆర్బాటంతో కూడిన ఆరాధన, ప్రశంసలందుకునే ప్రయత్నాలు లేవు. మెస్సీయా దేవునిలో మరుగై ఉండాల్సి ఉంది. దేవుడు తన కుమారుని ప్రవర్తనలో వెల్లడి కావలసిఉన్నాడు. దేవుని చేయూత లేకపోతే మనుషులు నీచస్థితికి దిగజారిపోతారు. జీవాన్ని శక్తిని సృష్టికర్త అయిన ఆ ప్రభువే ఇవ్వాలి. మానవుడి అవసరాలు తీరే మార్గం ఇంకొకటిలేదు.PKTel 489.6

    మెస్సీయాను గూర్చి ప్రవచనం ఇంకా ఇలా చెబుతున్నది : “భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును.” దేవ కుమారుడు “ఉపదేశ క్రమమొకటి ఘనపరచి గొప్ప చేసెను.” 4,21 వచనాలు. దాని ప్రాముఖ్యాన్నిగాని అది ఆదేశించే విధుల్నిగాని ఆయన తగ్గించకూడదు. వాటిని ఆయన ఘనపర్చాలి. అదే సమయంలో దేవుని న్యాయ శాసనాలపై మానవుడు విధించిన నిషేధాల్ని కఠినతరం చేసి తద్వారా దేవుని సేవించటంలో మనుషుల్ని నిరుత్సాహపర్చకుండా వాటిని విడిపించాల్సి ఉన్నాడు.PKTel 489.7

    రక్షకుని పరిచర్యను గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఇది : “గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడనుకాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. మునుపటి సంగతులు సంభవించెనుగదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టకమునుపే వాటిని మీకు తెలుపు చున్నాను.” 6-9 వచనాలు.PKTel 490.1

    ఈ వాగ్దత్త సంతానం ద్వారా ఇశ్రాయేలు దేవుడు సీయోనుకి విమోచనను తేవలసి ఉన్నాడు. “యెషయి మొద్దు నుండి చిగురుపుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.” “ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారునికని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.” యెష 11:1; 7:14,15.PKTel 490.2

    “యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పుతీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శచేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పుతీర్చును. భూమివాసులలో దీనులైనవారికి యధార్ధముగా విమర్శచేయును. తన వాగ్గండముచేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.” “ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావముగలదగును.” యెష 11:2-5, 10.PKTel 490.3

    “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా — చిగురు అను ఒకడు కలడు, ...అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనతవహించుకొని సింహాసనాసీనుడై యేలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.” జెకర్యా 6:12,13.PKTel 491.1

    “పాపమును అపవిత్రతను పరిహరించుటకై” ఒక ఊటను తెరవవలసి ఉంది (జెకర్యా 13:1). మనుషులు శుభప్రదమైన ఈ ఆహ్వానాన్ని వినాల్సి ఉంది:PKTel 491.2

    “దప్పిగొనినవారలారా, నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడు. రండి రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.”PKTel 491.3

    “ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్ధము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనియ్యుడి.”PKTel 491.4

    “చెవి యొగ్గి నా యొద్దకు రండి. మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు. నేను మీతో నిత్యనిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును.” యెష 55:1-3.PKTel 491.5

    ఇశ్రాయేలుకి దేవుడు ఈ వాగ్దానం చేశాడు : “ఇదిగో జనులకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని. నీ ఎరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు.” 4,5 వచనాలు..PKTel 491.6

    “నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమునలేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.” యెష 46:13.PKTel 491.7

    తన భూలోక పరిచర్యలో మెస్సీయా తండ్రి అయిన దేవుని మహిమను తన మాటల్లోను క్రియల్లోను బయలుపర్చవలసి ఉన్నాడు. ఆయన జీవితంలోని ప్రతీ క్రియ, ఆయన పలికిన ప్రతీమాట, ఆయన చేసిన ప్రతీ అద్భుతకార్యం దేవుని అనంత ప్రేమను పతనమైన మానవాళికి వెల్లడి చేయాల్సి ఉంది. PKTel 491.8

    “సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా,
    ఉన్నత పర్వతము ఎక్కుము
    యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా,
    బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి
    -ఇదిగో మా దేవుడు అని యూదా పట్టణములకు
    ప్రకటించుము
    ఇదగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా
    ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై
    వచ్చును
    ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది
    ఆయన చేయు ప్రతికారము ఆయన ముందుగా
    నడచుచున్నది
    గొఱ్ఱల కాపరివలె ఆయన తన మందను మేపును
    తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున
    ఆనించుకొని మోయును
    పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును.”
    PKTel 492.1

    యెష 40:9-11.

    “ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు
    అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను
    గ్రుడ్డివారు కన్నులార చూచెదరు
    యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధిక
    మగును
    మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ద
    దేవునియందు ఆనందించెదరు.”

    “చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు
    సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.”
    PKTel 492.2

    యెష 29:18, 19,24.

    ఈ రీతిగా పితరులు ప్రవక్తల ద్వారాను, ఛాయా రూపాలు సంకేతాల ద్వారాను రానున్న పాపవిమోచకుణ్ని గూర్చి దేవుడు లోకంతో మాట్లాడాడు. దీర్ఘకాలంగా దైవావేశపూరితులైన ప్రవక్తల ప్రవచన వాక్కు “సర్వజాతుల ఆకాంక్షితుడి” (హగ్గయి 2:7, ఎన్ఐవి) రాకను సూచించింది. ఆయన జన్మస్థలం, ఆయన జనన సమయం సూక్ష్మ వివరాలతో సహా పేర్కోబడ్డాయి.PKTel 492.3

    దావీదు కుమారుడు దావీదు పట్టణంలో జన్నించాల్సిఉంది. బేత్లహేములో నుంచి “ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు...వచ్చును... పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.” మీకా 5:2.PKTel 492.4

    “యూదయ దేశపు బేత్లో హేమా
    నీవు యూదా ప్రధానులలో
    ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;
    ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి
    నీలో నుండి వచ్చును.”
    PKTel 493.1

    మత్త 2:5.

    “నీ జనమునకు... డెబ్బది వారములు విధింపబడెను.” 490 సంPKTel 493.2

    క్రీ.పూ.క్రీ.పూ. క్రీ.శ. క్రీ.శ. క్రీ.శ.PKTel 493.3

    457408 27 31 34PKTel 493.4

    31/2 31/2PKTel 493.5

    7 వారాలు 62 వారాలు1 వారంPKTel 493.6

    లేక 49 సం||లేక 434 సం||లేక 7 సం||PKTel 493.7

    దైవ జనానికి విధించబడ్డ “డెబ్బది వారముల” చారు.PKTel 493.8

    క్రీస్తు రాకవల్ల ఈ ప్రవచనం వాస్తవికత నిరూపితమయ్యింది.PKTel 493.9

    రక్షకుని మొదట రాక సమయాన్ని ఆయన జీవిత కర్తవ్యం చుట్టూ చోటుచేసుకునే ఘటనల్ని గబ్రియేలు దూత దానియేలుకి తెలియపరిచాడు. దేవదూత ఇలా అన్నాడు, “తిరుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను.” దాని. 9:24. ప్రవచన పరిభాషలో ఒక దినం ఒక సంవత్సరం. సంఖ్యా 14:34, యెహె. 4:6 చూడండి. డెబ్బయి వారాలు లేదా నాలుగువందల తొంభై దినాలు, అంటే నాలుగువందల తొంబై సంవత్సరాలు. ఈ కాలావధికి ప్రారంభ సమయం కూడా నిర్దేశితమయ్యింది. “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము.” (దాని 9:25). అంటే అరవై తొమ్మిది వారాలు లేక నాలుగువందల ఎనభైమూడు సంవత్సరాలన్నమాట. యెరూషలేమును పునరుద్ధరించటానికి, నిర్మించటానికి జారీ అయిన ఆజ్ఞ అర్తహషస్త డిక్రీతో పూర్తిఅయి క్రీ.పూ. 457 శరత్కాలంలో అమలయ్యింది. ఎజ్రా 6:14, 7:1,9 చూడండి. ఈ సమయం నుంచి నాలుగువందల ఎనభైమూడు సంవత్సరాలు క్రీ.శ. 27 శరత్కాలం వరకు వెళ్లాయి. ప్రవచనం ప్రకారం ఈ కాలావధి అభిషిక్తుడైన మెస్సీయా రాకకు చేరాలి. క్రీ.శ. 27లో తన బాప్తిస్మమప్పుడు యేసు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడు. ఆదైన కొద్దికాలంలో ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. అప్పుడు “కాలము సంపూర్ణమైయున్నది” (మార్కు 1:15) అన్న వర్తమానాన్ని ప్రకటించబడింది.PKTel 493.10

    అప్పుడు దేవదూత ఇలా అన్నాడు, “అతడు ఒక వారమువరకు (ఏడు సంవత్సరాలు) అనేకులకు నిబంధనను స్థిరపరచును.” రక్షకుడు తన పరిచర్యలో ప్రవేశించిన తర్వాత ఏడు సంవత్సరాలు సువార్త ప్రకటించటం ప్రధానంగా యూదులికి ప్రకటించటం జరిగింది. మూడున్నర సంవత్సరాలు క్రీస్తు స్వయంగా తానే ప్రకటించాడు. ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు అపొస్తలులు ప్రకటించారు. క్రీ.శ. 31 వసంతకాలంలో యధార్ధ బలి అయిన క్రీస్తు కల్వరి సిలువపై మరణించాడు. అప్పుడు ఆలయంలోని తెర మధ్యకు చినిగి రెండుగా విడిపోయింది. బల్యర్పణ సేవ పవిత్రత ప్రాధాన్యం ఇక లేదని ఇది సూచించింది. లోకంలో బలులు నైవేద్యాలు ఆగిపోటానికి సమయం వచ్చింది.PKTel 494.1

    ఆ ఒకవారం - అంటే ఏడు సంవత్సరాల కాలం - క్రీ.శ.34లో సమాప్తమయ్యింది. ఆ తర్వాత స్తెఫన్ని రాళ్లతో కొట్టి చంపటంతో యూదులు సువార్తను తిరస్కరించటం పూర్తి అయ్యింది. హింస కారణంగా చెదిరిపోయిన శిష్యులు “సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.” అ.కా. 8:14. అనంతరం కొద్దికాలానికి హింసకుడైన పౌలు క్రైస్తవుడై పౌలై అన్యజనులికి అపొస్తలుడయ్యాడు. PKTel 494.2

    రక్షకుని రాకకు సంబంధించిన అనేక ప్రవచనాలు హెబ్రీయుల్ని నిత్యం ఎదురు చూసే ప్రజలుగా నివసించేటట్లు చేశాయి. ఆ విశ్వాసంతోనే అనేకులు మరణించారు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందకుండానే మరణించారు. కాని ఆ వాగ్దానాల్ని దూరం నుంచి చూసినవారు తాము ఈ లోకంలో యాత్రికులం పరదేశులం అని నమ్మి నివసించారు. హనోకు దినాలనుంచి పితరులు ప్రవక్తలు వునరుచ్చరిస్తూ వచ్చిన ఈ వాగ్దానం ఆయన వస్తాడన్న నిరీక్షణను ప్రజల మనసుల్లో సజీవంగా నిలుపుతున్నది.PKTel 494.3

    మొదటి రాకడకు ఖచ్చితమైన సమయాన్ని దేవుడు వెల్లడిచెయ్యలేదు. దానియేలు ప్రవచనం దీన్ని తెలియపర్చినప్పటికీ ఆ వర్తమానాన్ని అందరూ సరి అయిన విధంగా గ్రహించలేదు.PKTel 495.1

    శతాబ్దాలు గడిచిపోయాయి. తుదకు ప్రవక్తల స్వరాలు ఆగిపోయాయి. హింసకుడి హస్తం ఇశ్రాయేలు పై కఠినంగా పడింది. యూదులు దేవున్ని విడిచిపెట్టగా వారి విశ్వాసం మసకబారింది. వారిని వెలుగుతో నింపాల్సిన నిరీక్షణ దాదాపు మాయమయ్యింది. అనేకులకు ప్రవక్తలమాటలు అర్ధం కాలేదు. ఏ భక్తుల విశ్వాసం దృఢంగా ఉండాల్సిందో వారు “దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగు చున్నది” అనటానికి సిద్ధంగా ఉన్నారు. యెహె 12:22. అయితే పరలోక సభల్లో క్రీస్తు రాకడ సమయం నిర్ణయమవ్వటం జరిగింది. “కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.... దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.” గలతీ 4:4,5.PKTel 495.2

    మానవులికి మానవుల భాషలో వర్తమానాలివ్వాలి. నిబంధన దూత మాట్లాడాలి. ఆయన స్వరం తన సొంత ఆలయంలో వినిపించాలి. సత్యానికి కర్త అయిన ఆయన మానవ సూక్తుల పొట్టునుంచి సత్యాన్ని వేరుచెయ్యాలి. ఆ మానవ సూక్తులు సత్యాన్ని నిరర్ధకం చేశాయి. దైవ పరిపాలనా సూత్రాల్ని, విమోచన ప్రణాళికను స్పష్టంగా వివరించటం జరగాలి. పాత నిబంధన పాఠాల్ని మనుషుల ముందుంచటం జరగాలి.PKTel 495.3

    చివరికి రక్షకుడు “మనుష్యుల పోలికగా” (ఫిలి. 2:7) వచ్చి తన కృపా పరిచర్యను ప్రారంభించినప్పుడు, మడిమెను మాత్రమే సాతాను కొట్టగలితే ప్రతీ అవమానాన్ని, బాధను భరించటం ద్వారా క్రీస్తు తన శత్రువు తలను కొడ్తున్నాడు. పాపం వలన కలిగిన వేదన పరిశుద్ధ ప్రభువు గుండెల్ని బరువెక్కిస్తుంది. అయినా క్రీస్తు పాపుల వైరుధ్యాన్ని భరిస్తుండగా పాపి పక్షంగా మానవాళి దాస్య బంధకాల్ని ఛేదిస్తున్నాడు. ప్రతీ ఆవేదన, ప్రతీ పరాభవం మానవాళి విడుదలకు దోహదపడ్తున్నది. PKTel 495.4

    క్రీస్తుని ఒక్క శోధనకు లొంగేటట్లు సాతాను చెయ్యగలిగి ఉంటే, ఆయన పవిత్రతను ఒక్క క్రియవలనగాని తలంపువలన గాని మలినపర్చగలిగి ఉంటే, మానవుడికి హామిగా ఉన్న ప్రభువుపై చీకటి శక్తుల రాజు విజయం సాధించేవాడు. మానవ కుటుంబాన్నంతటినీ సంపాదించుకునేవాడు. కాగా సాతాను మనల్ని దుఃఖం విచారం పాలుచెయ్యగలడే గాని మనకు మలినాన్ని అంటించలేడు. గుండెకోత కలిగించగలడే గాని మనసును అపవిత్రపర్చలేడు. క్రీస్తు జీవితాన్ని సుదీర్ఘమైన సంఘర్షణ శ్రమల దృశ్యంగా చేశాడు. అయితే ప్రతీ దాడితో అతడు మానవాళిపై తన పట్టును బలహీన పర్చుకుంటున్నాడు. .PKTel 495.5

    శోధనారణ్యంలో, గెత్సేమనే తోటలో, సిలువమిద మన రక్షకుడు సాతానుతో కత్తులు దూశాడు. ఆయన పొందిన గాయాలు మానవజాతి తరపున ఆయన సంపాదించిన ట్రోఫీలయ్యాయి. దురాత్మలు ఉల్లసిస్తుండగా, దుష్టులు ఎగతాళిచేస్తుండగా క్రీస్తు సిలువపై వేలాడ్తున్నప్పుడు, అప్పుడు నిజంగా ఆయన మడిమెపై సాతాను కొట్టాడు. “మరణము ద్వారా నశింపజేయుటకు” శక్తి గలవాడైన సాతానుణ్ని మరణము ద్వారా నాశనం చేశాడు. హెబ్రీ 2:14. ఈ కార్యం తిరుగుబాటు నేత గతిని నిర్ణయించి రక్షణ ప్రణాళికను స్థిరపర్చింది. మరణించటం ద్వారా మరణం శక్తిపై విజయం సాధించాడు. తిరిగి లేవటం ద్వారా తన అనుచరులందరి కోసం మరణద్వారాల్ని బద్దలుకొట్టాడు. ఆ చివరి మహా సంఘర్షణలో “అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమెమిద కొట్టుదువు” (ఆది 3:13) అన్న ప్రవచనం నెరవేర్పును చూస్తున్నాం.PKTel 496.1

    “ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాను. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.” 1యోహా 3:2. అతిహోరపాపులు, అత్యవసరం గలవారు, తీవ్ర శ్రమలనుభవిస్తున్నవారు, తృణీకారానికి గురి అయినవారు తండ్రి వద్దకు వెళ్లేందుకుగాను మన విమోచకుడు మార్గం సుగమం చేశాడు.PKTel 496.2

    “యెహోవా, నీవే నా దేవుడవు
    నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించే
    దను
    నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావముననుస
    రించి నీవు పూర్వకాలము చేసిన ఆలోచనలను
    నెరవేర్చితివి.”
    PKTel 496.3

    యెష 25:1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents