Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    59 - “ఇశ్రాయేలీయుల వంశము”

    ప్రతీ జాతికి ప్రతీ జనానికి ప్రతీ వంశానికి ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతీ ప్రజకు నిత్యసువార్త సత్యాల్ని ప్రకటించటంలో భూమి మీద ఉన్న దైవ సంఘం ఈ ప్రవచనాన్ని నెరవేర్చుతున్నది, రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.” యెష 27:6. యేసు అనుచరులు పరలోక జ్ఞానుల సహకారంతో లోకంలోని వ్యర్ధ ప్రదేశాల్ని ఆక్రమించుకుంటున్నారు. వారి కృషి ఫలితంగా విస్తారమైన ఆత్మల పంట వృద్ధి చెందుతున్నది. మునుపెన్నటికన్నా నేడు అంకితభావంతో పనిచేసే సంఘం ద్వారా బైబిలు సత్యం ప్రచారమవ్వటంవల్ల శతాబ్దాల వెనక అబ్రహాముకి, ఇశ్రాయేలు జాతికి అనగా అన్నియుగాల్లోని దేవుని సంఘానికి “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదముగా” చేస్తాను అన్నదేవుని వాగ్దానంలో ప్రవచితమైన దీవెనలు మనుషులకు ఒనగూడుతున్నాయి. (ఆది 12:2).PKTel 497.1

    తాము చెరవెళ్లిన దేశాలనుంచి ఇశ్రాయేలీయులు తిరిగివచ్చిన అనంతరం గతించిన శతాబ్దాల్లోనే దీవెనల్ని గూర్చిన ఈ వాగ్దానం నెరవేరి ఉండాల్సింది. నేడు ఆయన రెండోరాకకు సర్వలోకం సిద్ధపడటానికి మార్గం ఏర్పడుతున్నట్లే అప్పుడు ఆయన మొదటి రాకకు సర్వలోకాన్నీ సిద్ధం చెయ్యాలన్నది దేవుని సంకల్పం. అవమానకరమైన ఆ చెరకాలం చివర జెకర్యా ద్వారా దేవుడు తన ప్రజలికి కృపతో నిండిన ఈ భరోసా ఇచ్చాడు, “నేను సీయోను నొద్దకు మరలవచ్చి, యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేరు పెట్టబడును.” తన ప్రజల్ని గురించి ఆయన ఇలా అన్నాడు, “నేను వారికి దేవుడనైయుందును, ఇది నీతి సత్యములను బట్టి జరుగదు.” జెకర్యా 8:3,8.PKTel 497.2

    ఈ వాగ్దానాల నెరవేర్పు విధేయత షరతుపై జరుగుతుంది. చెరకు ముందు ఇశ్రాయేలీయుల్లో ప్రబలిన పాపాలు పునరావృత్తం కాకూడదు. పునరుద్దరణ కార్యంలో నిమగ్నులైన వారికి “సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనుపరచుకొనుడి.” “ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను” అంటూ హితవు పలికాడు. జెకర్యా 7:9, 8:16.PKTel 497.3

    ఈ నీతి విధుల్ని ఆచరణలో పెట్టేవారికి ఐహికమైన, ఆధ్యాత్మికమైన గొప్ప ప్రతిఫలాల్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. “సమాధాన సూచకమైన ద్రాక్షచెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచుకురియును. ఈ జనులలో శేషించినవారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును... యూదావారలారా, ఇశ్రాయేలువారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును.” జెకర్యా 8:12,13.PKTel 498.1

    బబులోను చెరవలన ఇశ్రాయేలీయుల విగ్రహారాధన వ్యాధి నయమయ్యింది. స్వదేశానికి తిరిగివచ్చాక ప్రజలు ఆధ్యాత్మిక ఉపదేశంపై ఎక్కువ శ్రద్ద చూపారు. నిజమైన దేవుని ఆరాధనను గూర్చి ధర్మశాస్త్ర గ్రంథంలోను ప్రవక్తల రచనల్లోను ఉన్న సంగతులపై దృష్టిపెట్టారు. ఆచార ప్రధానమైన గుడార సేవల్ని పూర్తిగా ఆచరించటానికి ఆలయ పునరుద్దరణ తోడ్పడింది. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా ఆధ్వర్యంలో యెహోవా ఆజ్ఞల్ని సంస్కారాల్ని ఆచరిస్తామని పదేపదే నిబంధన చేశారు. వారికి కలిగిన అభివృద్ధి దేవుడు తమను అంగీకరించి క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడని సూచించినా వారు తమ మరణాంతక హ్రస్వ దృష్టితో మళ్లీమళ్లీ వెనక్కు మళ్లి అనేకమందికి స్వస్తతను ఆధ్యాత్మిక జీవాన్ని ప్రసాదించి ఉండగల దీవెనను స్వార్థాపేక్షతో తమ కోసమే అట్టిపెట్టికున్నారు. PKTel 498.2

    దైవ సంకల్పాన్ని నెరవేర్చటంలోని వైఫల్యం మలాకీ దినాల్లో ప్రస్పుటంగా కనిపించింది. ఇశ్రాయేలు ప్రజల ఐహిక ప్రగతిని ఆధ్యాత్మిక శక్తిని కొల్లగొడ్తున్న దుర్మార్గాల్ని దురాచారాల్ని దైవ సేవకుడు మలాకీ ఘాటుగా విమర్శించాడు. అపరాధుల్ని మందలించటంలో యాజకులని ప్రజలని ప్రవక్త చూడలేదు. మలాకీ ద్వారా ఇశ్రాయేలీయులను గూర్చి ... పలుకబడిన యెహోవా వాక్కు ఏమిటంటే వారు గతంలో నేర్చుకున్న పాఠాలు మర్చిపోకూడదని, ఇశ్రాయేలు ఇంటివారితో యెహోవా చేసిన నిబంధనను వారు నమ్మకంగా ఆచరించాలని, చిత్తశుద్ధి కలిగిన పశ్చాత్తాపం ద్వారానే దేవుని దీవెనలు పొందగలరని. ప్రవక్త వారితో ఇలా విజ్ఞాపన చేశాడు, “దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి.” మలాకీ 1:1,9.PKTel 498.3

    మానవాళి విమోచన కోసం యుగాల పొడవున సాగుతున్న ప్రణాళికను ఇశ్రాయేలు తాత్కాలిక వైఫల్యం నిరర్ధకం చెయ్యలేదు. ప్రవక్త ఎవరితో మాట్లాడున్నాడో వారు ఆ వర్తమానాన్ని లెక్కచెయ్యకపోవచ్చు. అయినా యెహోవా సంకల్పాలు నెమ్మదిగా ముందుకుసాగి వాటి పనిని అవి నెరవేర్చుతాయి. ప్రభువు తన సేవకుడి ద్వారా ఇలా అన్నాడు, “తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” మలాకీ 1:11.PKTel 499.1

    లేవీ కుమారులతో దేవుడు “జీవమునకును సమాధానమునకును” చేసిన నిబంధనను - దీన్ని వారు ఆచరించి ఉంటే వారికి ఎన్నో దీవెనలు కలిగేవి - ఒకప్పుడు ఆధ్యాత్మిక నాయకులుగా ఉండి అతిక్రమం వల్ల “జనులందరి దృష్టికి... తృణీకరింపబడిన” వారికి ప్రభువు ఇప్పుడు దాన్ని నవీకరిస్తానంటున్నాడు. మలాకీ 2:5,9.PKTel 499.2

    రానున్న తీర్పును గురించి దుష్టుల్ని హెచ్చరించి ప్రతీ పాపినీ సత్వర నాశనంతో నిర్మూలించటం యెహోవా ఉద్దేశమని తెలిపాడు. అయినప్పటికీ నిరీక్షణ లేకుండా ఆయన ఎవర్నీ విడిచి పెట్టలేదు. తీర్పుల్ని గూర్చిన హెచ్చరికలతో పాటు దేవునితో సమాధానపడాల్సిందిగా పశ్చాత్తాపపడని పాపికి ఆహ్వానాన్నందించాడు. “మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మా తట్టు తిరుగుదును” అంటూ విజ్ఞాపన చేశాడు ప్రభువు. మలాకీ 3:7.PKTel 499.3

    అలాంటి ఆహ్వానానికి ప్రతీ హృదయం సానుకూలంగా స్పందించాలి. లోకంలో తన పనిని చెయ్యటానికి తాము మళ్లీ సహకరించేందుకు తిరిగి తన వద్దకు రావలసిందంటూ అపరాధులైన తన బిడ్డలతో దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. చేయి చాపి ఇశ్రాయేలు స్వీకరించటానికి దేవుడు వేచి ఉన్నాడు. ఆత్మోపేక్షను ఆత్మత్యాగాన్ని ఆచరిస్తూ ఇరుకు మార్గాన నడవటానికి చేయూతనివ్వటానికి, దేవుని కుమారులుగా వారు తనతో ఉత్తరాధికారాన్ని పంచుకోటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు! వారు విజ్ఞాపనను వింటారా? తమకున్న ఒకే ఒక నిరీక్షణను గుర్తిస్తారా? PKTel 499.4

    మలాకీ దినాల్లో ఇశ్రాయేలీయులు తక్షణ విధేయతను హృదయపూర్వక సహకారాన్ని చూపిస్తూ తమ హృదయాల్ని ఆయనకు సమర్పించటానికి సందేహించటం ఎంత విచారకరం! “మేము దేని విషయములో తిరుగుదుము?” అన్నవారి సమాధానంలో మాలో దోషమేదీ లేదన్న ధోరణి వ్యక్తమౌతున్నది.PKTel 499.5

    తన ప్రజల ప్రత్యేక పాపాల్లో ఒక దాన్ని ప్రభువు తన ప్రజలకు బయలు పర్చుతున్నాడు. “మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి” అంటున్నాడు. ఇంకా పాపం చేయనట్లే భావిస్తూ ఆ అవిధేయ ప్రజలు “దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమి?” అంటున్నారు.PKTel 500.1

    ప్రభువు సమాధానం ఖచ్చితంగా కరాఖండిగా ఉంది : “పదియవ భాగమును ప్రతిష్టితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరును నాయెద్ద దొంగిలించుచునే యున్నారు. మీరు శాపగ్రస్తులైయున్నారు. నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి, దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మి ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాలకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” 7-12 వచనాలు. PKTel 500.2

    మనుషులు ఆయనకు తన భాగాన్ని తిరిగి ఇచ్చేందుకుగాను దేవుడు వారు చేసే పనిని ఆశీర్వదిస్తాడు. సూర్యకాంతిని, వర్షధారల్ని ఆయనే ఇస్తాడు. మొక్కలకు పెరుగుదలను ఇచ్చేది ఆయనే. డబ్బును సంపాదించటానికి ఆరోగ్యాన్ని సామర్థ్యాన్ని ఆయనే ఇస్తాడు. సమృద్ధిగా ఇచ్చే ఆయన చేతుల్లోనుంచే ప్రతీ దీవెనా వస్తుంది. కొంతభాగాన్ని దశమ భాగంగాను కానుకలుగా - కృతజ్ఞతార్పణలు, స్వేచ్చారణలు, అపరాధ పరిహారార్ధ అర్పణల రూపంలో - తమ కృతజ్ఞతలు వెలిబుచ్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. తన ద్రాక్షతోట పంటపండని బీడు భూమి కాకుండేందుకు వారు తమ ఆదాయాన్ని ఆయన సేవకు సమర్పించాలి. తమ స్థానంలో ప్రభువే ఉండి ఉంటే ఎలా వ్యవహరిస్తాడన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి. తమ సకల సమస్యల్ని ప్రార్ధన ద్వారా ఆయన ముందు పెట్టాలి. లోకంలోని అన్ని ప్రాంతాల్లోను జరుగుతున్న ఆయన సేవను వృద్ధిపర్చటం విషయంలో వారు నిస్వార్ధమైన ఆసక్తిని ప్రదర్శించాలి. PKTel 500.3

    వాస్తవికమైన అభ్యుదయం దైవ ధర్మశాస్త్రానికి విధేయంగా నివసించటంపైనే ఆధారపడి ఉంటుందని పాత నిబంధన ప్రవక్తల్లో చివరివాడైన మలాకీ వర్తమానాల్లాంటి వర్తమానాల ద్వారాను, విరోధులైన అన్యజనులచే హింస ద్వారాను ఇశ్రాయేలీయులు చివరికి గ్రహించారు. అయితే అనేకుల విషయంలో విధేయత విశ్వాసం నుంచి, ప్రేమనుంచి పుట్టుకొచ్చింది కాదు. వారి ఉద్దేశాలు స్వార్ధంతో నిండి ఉన్నాయి. జాతీయంగా పేరు ప్రతిష్టలు సంపాదించటానికి సేవలు చేస్తున్నట్లు పైకి కనిపించేవారు. దేవుడు ఎన్నుకున్న ప్రజలు లోకానికి వెలుగుగాలేరు. కాని విగ్రహారాధనకు ఆకర్షితులు కాకుండేందుకు ప్రజలకు దూరంగా నివసించారు. తన ప్రజలకు అన్యజనులకు మధ్య వివాహాల్ని నిషేధిస్తూ దేవుడు ఆంక్షలు విధించాడు. ఇశ్రాయేలీయులు తమ చుట్టు పక్కల ఉన్నవారి విగ్రహారాధక ఆచారాల్లో పాలు పొందకూడదంటూ నిషేధాల్ని విధించాడు. వారు వీటిని వక్రీకరించి, తద్వారా తమకు అన్యజనులకు మధ్య అడ్డుగోడలు నిర్మించి, లోకానికి అందించేందుకు తమకు దేవుడిచ్చిన దీవెనలను లోకానికందకుండా అడ్డుకున్నారు.PKTel 500.4

    అదే సమయంలో యూదులు తమ పాపాల వల్ల దేవునికి దూరమౌతున్నారు. తమ సంకేతాత్మక సేవలోని ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని గ్రహించలేకపోయారు. తాము నీతిమంతులమన్న భావనతో వారు తమ సొంత క్రియల్ని బలుల్ని సంస్కారాల్ని నమ్ముకుని అవి ఎవరిని సూచించాయో ఆ ప్రభువుని నమ్ముకోటం విస్మరించారు. ఇలా “దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు” వారు స్వయంసమృద్ధమైన ఛాందస మతతత్వాన్ని స్థాపించుకున్నారు. ఇందులో లోపించిన దేవుని ఆత్మను కృపను పూరించటానికి కఠినమైన మతాచారాల్ని కర్మల్ని నిష్టగా ఆచరించారు. దేవుడు నియమించిన సంస్కారాలతో తృప్తిచెందక, తమ సొంత ఆంక్షలు నిషేధాలతో దైవాజ్ఞల ఆచరణను ఆయాసకరం చేశారు. తమకు దేవునికి మధ్య ఉన్న దూరం ఎంత పెరిగితే ఈ ఆచారాల్ని వారు అంత నిష్ఠగా ఆచరించారు. PKTel 501.1

    ఈ సూక్ష్మమైన భారమైన నిర్బంధాలతో ప్రజలు ధర్మశాస్త్రాన్ని ఆచరించటం అసాధ్యమయ్యింది. పది ఆజ్ఞల్లోని నీతి సూత్రాలు సంకేతాత్మక ఆలయ సేవలో ప్రతిబింబించిన సత్యాలు, మానవ సంప్రదాయాలు, శాసనాల మాటున కొడిగట్టుకు పోయాయి. యాజకులు అధిపతులు నిర్దేశించినట్లు ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి ప్రయత్నించినవారు మోయలేని భారం కింద పడి మూలిగారు. PKTel 501.2

    ఇశ్రాయేలు ప్రజలు ఒక జాతిగా మెస్సీయా రాకకోసం ఎదురుచూస్తూనే తమ జీవితాల్లోను హృదయాల్లోను ఆయనకు ఎంత దూరంగా ఉన్నారంటే వాగ్దత్త విమోచకుని ప్రవర్తనను గురించి కర్తవ్యాన్ని గురించి వారికి వాస్తవికమైన అభిప్రాయం లేదు. పాప విముక్తిని పరిశుద్ధతను మహిమను శాంతిని వాంఛించే బదులు, తమ జాతీయ శత్రువుల నుంచి విముక్తిని ఐహికాధికార పునరుద్దరణను ఆకాంక్షించారు. ప్రతీ కాడినీ విరగగొట్టటానికి, ఇశ్రాయేలుని అన్ని జాతులకన్నా ఉన్నత స్థాయిలో ఉంచటానికి విజయం సాధించే మెస్సీయా కోసం ఎదురుచూశారు. రక్షకుడు వచ్చినప్పుడు ఆయన్ని విసర్జించటానికి ప్రజలు వారి హృదయాల్ని సిద్ధం చెయ్యటంలో సాతాను ఈ తీరుగా విజయం సాధించాడు. వారి హృదయాల్లోని గర్వం, ఆయన ప్రవర్తనను పరిచర్యను గూర్చిన వారి అభిప్రాయాలు, ఆయనే మెస్సీయా అనటానికి ఉన్న నిదర్శనాల్ని నిష్పాక్షికంగా పరిశీలించకుండా అడ్డుతగిలాయి.PKTel 501.3

    వెయ్యి సంవత్సరాలకు పైగా యూదు ప్రజలు వాత్త రక్షకుని కోసం ఎదురు చూశారు. వారి ఆశలన్నీ ఈ ఘటన మీదే ఆధారపడి ఉన్నాయి. వెయ్యి సంవత్సరాలుగా పాటలో, ప్రవచనంలో, ఆలయ ఆచారంలో, కుటుంబ ప్రార్ధనలో ఆయన నామాన్ని ధ్యానించటం జరిగింది. అయినా ఆయన స్వయంగా వచ్చినప్పుడు ఎవరికోసం తాము అంతకాలంగా కనిపిస్తున్నారో ఆ రక్షకుణ్ని వారు గుర్తించలేదు. “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు.” యోహా 1:11. లోకప్రేమ గుండెలనిండా ఉన్న వారికి ఆయనలో “సురూపమైనను సొగసైనను” కనిపించలేదు. ఆయనను ఆశించటానికి ఆయనలో వారికి ఎలాంటి సౌందర్యం కనిపించలేదు. యెష 53:2.PKTel 502.1

    యూదుల మధ్య నజరేయుడైన యేసు జీవించిన జీవితం తాము ఎవరి ద్రాక్షాతోటకు కాపులుగా నియమితులయ్యారో దాని సొంతదారుడి హక్కుల్ని గుర్తించటానికి వారు చూపించిన అసమ్మతిలో వ్యక్తమైన స్వార్థాశకు మందలింపు. వారు ఆయన సత్యవర్తనను భక్తి జీవితాన్ని ద్వేషించారు. కనుక చివరి పరీక్ష అనగా నిత్యజీవానికి నడిపే విధేయతా పరీక్ష లేదా నిత్య నాశనానికి దారితీసే అవిధేయ జీవిత పరీక్ష వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలు పరిశుద్దుణ్ని విసర్జించి కల్వరి సిలువపై ఆయన మరణానికి బాధ్యులయ్యారు. దేవుని ఉద్దేశాన్ని ఆయన వారి ముందు పెట్టాడు. వారు దాన్ని తమ విధేయత ద్వారా నెరవేర్చి ఉండవచ్చు. భవిష్యత్తును మూసిఉంచే తెరను తొలగించి, తన సంకల్పాల నెరవేర్పులో తమ వైఫల్యంవల్ల దేశం యావత్తు తన దీవెనల్ని పోగొట్టుకుని తన మీదికి నాశనాన్ని ఎలా తెచ్చుకుంటుందో చూపించాడు.PKTel 502.2

    క్రీస్తు ఇలా అన్నాడు, “ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను.” మత్త 21:33. PKTel 502.3

    యెషయా ప్రవక్త శతాబ్దాల ముందు “ఇశ్రాయేలు వంశము” గా దేన్ని వ్యవహరించాడో దాన్ని “యెహోవా ద్రాక్షతోట”గా రక్షకుడు చెబుతున్నాడు. యెష. 5:7.PKTel 502.4

    ఆ కథనాన్ని కొనసాగిస్తూ క్రీస్తు ఇలా అన్నాడు, “పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులుPKTel 502.5

    తన దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరియొకనిమిద రాళ్లు రువ్విరి. మరల అతడు మునుపటికంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు - నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి- ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందమురండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.”PKTel 503.1

    యాజకుల ముందు తమ అతి నీచ నికృష్టకార్యాన్ని, చిత్రించిన మీదట వారికి క్రీస్తు ఈ ప్రశ్నవేశాడు, ” ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయవలెను?” యాజకులు ఆ కథనాన్ని ఆసక్తిగా వింటున్నారు. ఆ అంశంతో తమ సంబంధాన్ని పరిగణించకుండా వారు ప్రజలతో గళం కలిపి ఇలా జవాబిచ్చారు, “ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చును.”PKTel 503.2

    తెలియకుండానే వారు తమ నాశనాన్ని ప్రకటించుకున్నారు. యేసు వారి వంక చూశాడు. ఆయన సూటిగా చూస్తున్న చూపును బట్టి ఆయన తమ హృదయ రహస్యాల్ని చదువుతున్నాడని గ్రహించారు. ఆయన దేవత్వం మెరుపువంటి వెలుగుతో మహత్తరశక్తితో వారి ముందు ప్రకాశించింది. వారు ఆ కాపుల్లో తమ్మును తాము చూసుకున్నారు. అనుకోకుండానే వారు “అట్లనరాదు!” అన్నారు.PKTel 503.3

    గంభీరంగా విచారవదనంతో క్రీస్తు ఇలా ప్రశ్నించాడు : “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనుల కియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మిద పడువాడు తునకలైపోవునుగాని అది ఎవని మిద పడునో వానిని నలిచేయును.” మత్త 21:34-44.PKTel 503.4

    యూదులు తనను స్వీకరించి ఉన్నట్లయితే క్రీస్తు యూదుజాతికి ఏర్పడ్డ ముప్పును తప్పించేవాడు. అయితే అసూయ ఈర్ష వారి మనసుల్ని కఠినపర్చాయి. నజరేతువాడైన యేసును మెస్సీయగా స్వీకరించకూడదని తీర్మానించుకున్నారు. వారు లోకపు వెలుగును నిరాకరించారు. అక్కడనుంచి వారి జీవితాల్ని చీకటి మధ్యరాత్రి చీకటి ఆవరించింది. ప్రవచిత నాశనం వచ్చింది. యూదుజాతి నశించింది. అదువులోలేని వారి భీకర ఆవేశాలు ఉద్వేగాలు వారిని నాశనం చేశాయి. తమ దురాగ్రహంలో వారు పరస్పరం నాశనం చేసుకున్నారు. తిరుగుబాటు మంకుతనంతో కూడిన వారి అహంకారం అతిశయం వారిని రోమా పాలకుల ఆగ్రహానికి ఆహుతి చేశాయి. యెరూషలేము ధ్వంసమయ్యింది. దేవాలయం శిధిలాల కుప్పగా మిగిలింది. అది నిలిచిన స్థలం పొలంలా దున్నబడింది. యూదా ప్రజలు అతి భయకరం మరణం మరణించారు. లక్షలాది ప్రజలు అన్యుల దేశాల్లో బానిసలుగా సేవచేయటానికి అమ్మబడ్డారు.PKTel 503.5

    తాను ఎంపిక చేసుకున్న ఇశ్రాయేలు ద్వారా లోకానికి ఏమి చెయ్యాలని దేవుడు ఉద్దేశించాడో దాన్ని నేటి తన సంఘం ద్వారా దేవుడు చివరకు నెరవేర్చుతాడు. అతడు “ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకు” ఇచ్చాడు. వారు ఆయన నిబంధనను ఆచరించే ప్రజలు. “వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి” నమ్మకమైన ప్రజలు. లోకంలో ప్రభువుకి యధార్ధమైన ప్రతినిధులు లేని సమయం లేదు. వారు ఆయన ఆసక్తుల్నే తమ ఆసక్తులు చేసుకున్న ప్రజలు. ఈ దైవ సాక్షులు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులుగా పరిగణన పొందుతారు. తన ప్రాచీన ఇశ్రాయేలీయులికి దేవుడు ఏ వాగ్దానాలు చేశాడో అవి వీరి పరంగా యెహోవా నేరవేర్చుతాడు.PKTel 504.1

    నశించిన జాతి రక్షణ నిమిత్తం దైవ ప్రణాళికను ఆచరణలో పెట్టి పూర్తి చెయ్యటానికి నేడు దైవ సంఘానికి స్వేచ్చ ఉన్నది. అనేక శతాబ్దాలుగా దైవ ప్రజలకు స్వతంత్రత లేదు. స్వచ్ఛమైన రూపంలో సువార్త ప్రకటన నిషేధాలికి గురి అయ్యింది. మనుషుల ఆజ్ఞల్ని మారటానికి సాహసించిన వారిని కఠినాతికఠినంగా శిక్షించటం జరిగేది. పర్యవసానంగా ప్రభువు నైతిక ద్రాక్షతోటను గుత్తకు తీసుకోకుండా దాదాపు పూర్తిగా విడిచిపెట్టటం జరిగింది. ప్రజలకు దైవవాక్య ప్రకాశం లేకపోయింది. నిజమైన మతాన్ని గూర్చిన జ్ఞానాన్ని అసత్య మూఢ విశ్వాస చీకటి కనుమరుగు చేసే ప్రమాదం ఏర్పడింది. బబులోను చెరకాలంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లాగే లోకంలోని దైవ సంఘం తీవ్ర హింసాకాలంలో వాస్తవమైన చెరలో మగ్గింది.PKTel 504.2

    దేవుని సంఘం ఇక బానిసకాదు. అందుకు ఆయనకు కృతజుతలు. బబులోను చెరనుంచి విముక్తులైన దైవ ప్రజలకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులికి పునరుద్దరించటం జరుగుతుంది. “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను” (ప్రక 14:7) అని ప్రకటన రచయిత యోహాను ప్రవచించిన వర్తమానానికి లోకంలో ప్రతీ ప్రాంతంలోని ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు.PKTel 504.3

    దుష్ట శక్తులు సంఘాన్ని ఇక ఎంతమాత్రం బందీగా ఉంచలేవు. ఎందుకంటే “మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను,” ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకి ఈ వర్తమానం వస్తున్నది, “నా ప్రజలాలా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మాకు ప్రాప్తింప కుండునట్లును దానిని విడిచిరండి.” 8వ వచనం, 18:4. చెరలో ఉన్న ప్రజలు “బబులోనులో నుండి పారిపోవుడి” (యిర్మీ 51:6) అన్న వర్తమానాన్ని పాటించినందువల్ల వాగత దేశానికి తిరిగి వెళ్లినట్లే నేడు దేవునికి భయపడేవారు ఆధ్యాత్మిక బబులోనులోనుంచి బయటికి రండి అన్న వర్తమానాన్ని అనుసరించి బయటికి వస్తారు. పరలోక కనానుగా పిలిచే నూతన భూమిలో దేవుని కృపకు ట్రోఫీలుగా వారు త్వరలో నిలబడాల్సి ఉన్నారు.PKTel 504.4

    మలాకీ దినాల్లో పశ్చాత్తాపంలేని పాపులు “న్యాయకర్తయగు దేవుడు ఏమాయెను?” అని ఎగతాళిగా వేసిన ప్రశ్నకు వచ్చింది ఈ గంభీర స్పందన: “ప్రభువు అనగా మీరు కోరు నిబంధనదూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును.... అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, ఆయన చాకలివాని సబ్బువంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలము చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వ సంవత్సరములలో ఉండినట్లును, యూదావారును యెరూషలేము నివాసులును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును.” మలాకీ 2:17, 8:1-4.PKTel 505.1

    వాగ్దత్త మెస్సీయా వచ్చే సమయం అయినప్పుడు క్రీస్తు అగ్రగామి వర్తమానం ఇది: సుంకరులారా, పాపులారా, పశ్చాతాపం పొందండి. పరిసయ్యులారా, సద్దూకయ్యలారా, పశ్చాత్తాపపడండి “పరలోక రాజ్యము సమీపించియున్నది.” మత్త 3:2.PKTel 505.2

    దేవుడు ఏర్పరచుకొన్న సేవకులు, కృపకాలం చివరి గడియలకు సంబంధించిన ఘటనలపైన, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రానున్న క్రీస్తు రాకకు సంబంధించిన ఘటనలపైన, తీర్పును ఎదుర్కోవాల్సిఉన్న లోకం దృష్టిని ఏలీయా, స్నానికుడైన యోహానుల స్ఫూర్తితోను శక్తితోను నేడు నిలుపుతున్నారు. తాను చేసిన కార్యాల్ని గురించి త్వరలో ప్రతీ వ్యక్తీ తీర్పుపొందుతాడు. దేవుని తీర్పు గడియ వచ్చింది. నిత్య నాశనం అంచున నిలబడి ఉన్నవారికి హెచ్చరిక అందించే గంభీర బాధ్యత ఆయన సంఘ సభ్యులపై ఉంది. ఈ సువిశాల ప్రపంచంలో జరుగుతున్న మహా సంఘర్షణలోని నియమాల్ని వినుకునే ప్రతీ మానవుడికి సుస్పష్టం చెయ్యటం అవసరం. ఇవి మానవాళి భవితవ్యాలకు ప్రధానమైన నియమాలు.PKTel 505.3

    ప్రతీ ఆత్మ భవిష్యత్తూ నిరంతరంగా ఖరారు కానున్న మానవాళి కృప కాలం ఈ చివరి గడియల్లో తన సంఘం మేల్కొని, ఎన్నడూలేని విధంగా క్రియాశీలమవ్వటానికి ప్రభువు కని పెడ్తూఉన్నాడు. సత్యజ్ఞానం ద్వారా క్రీస్తులో స్వతంత్రులయ్యే వారిని తాను ఎన్నుకున్న వారిగాను లోకంలో అందరికన్నా తనకు ప్రియమైనవారిగాను ప్రభువు పరిగణిస్తాడు. తమను చీకటిలోనుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన ఆ ప్రభువు ఘనతను ప్రదర్శించటానికి ఆయన వారిమీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన సమృద్ధిగా అనుగ్రహించిన దీవెనల్ని మనం ఇతరులికి అందించాలి. రక్షణ శుభవర్తమానం ప్రతీ జాతికి, ప్రతీ ప్రజకు ఆయా భాషలు మాట్లాడేవారికి అందాలి.PKTel 506.1

    తన రెండో రాకకు ముందు రోజుల్లోని చీకటిలోను, అపనమ్మకంలోను మహిమ ప్రభువును తన సంఘానికి ప్రత్యేకమైన వెలుగును ఇస్తున్నట్లు పూర్వం ప్రవక్తల దర్శనాల్లో చిత్రించటం జరిగింది. ఆయన నీతి సూర్యుడుగా తన సంఘంపై “ఆరోగ్యము కలుగజేయు” “రెక్కల”తో ఉదయించాల్సి ఉన్నాడు. మలాకీ 4:2. నీతిగా నివసించటానికి, ధైర్యపర్చటానికి, సహాయం , వాస్తవిక స్వస్తత అందించటానికి దోహదపడే ప్రభావం ప్రతీ అనుచరుడినుంచి విస్తరించాలి.PKTel 506.2

    ఈ లోక చరిత్ర మిక్కిలి అంధకార గడిలో క్రీస్తు రాకడ సంభవిస్తుంది. క్రీస్తు రాకకు ముందు దినాలు నోవహు దినాలు లోతు దినాలుగా ఉంటాయి. రానున్న ఈ దినాల్ని గురించి మాట్లాడూ తన సర్వశక్తితోను “దుర్నీతీని పుట్టించు సమస్త మోసముతోను” సాతాను పని చేస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. 2 థెస్స 2:10. పెచ్చు పెరుగుతున్న చీకటివల్ల, లెక్కకుమించిన అపరాధాలవల్ల, సిద్ధాంత వ్యతిరేకతవల్ల చివరి దినాల మోసాలవల్ల అతడి పనితీరు స్పష్టంగా వెల్లడవుతుంది. సాతాను లోకాన్ని బానిసగా చెయ్యటమే కాదు ప్రభువైన క్రీస్తు సంఘాలుగా చెప్పుకుంటున్న సంఘాల్ని అతడి మోసాలు పులియజేస్తున్నాయి. ఈ గొప్ప మతభ్రష్టత మధ్యరాత్రి చీకటిలా గాడాంధకారంగా మారుతుంది. దైవ ప్రజలకు అది శ్రమల రాత్రిగా, ఏడ్పుతో నిండిన రాత్రిగా సత్యం నిమిత్తం కలిగే చిత్రహింసా రాత్రిగా పరిణమిస్తుంది. ఇలాగుండగా ఆ చీకటి రాత్రిలోనే దేవుని వెలుగు ప్రకాశిస్తుంది.PKTel 506.3

    ఆయన “అంధకారములో నుండి వెలుగు” ప్రకాశింపజేస్తాడు. 2 కొరి 4:6. “భూమి నిరాకారముగాను శూన్యముగాను... చీకటి అగాధజలములపై కమ్మి” ఉన్నప్పుడు, “దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు - వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.” ఆది 1:2,3. అలాగే ఆధ్యాత్మిక చీకటి రాత్రి “వెలుగు కమ్ము” అంటూ దేవుని మాట వెలువడుంది. తన ప్రజలతో ఆయన ఇలా అంటున్నాడు, “నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.” యెష 60:1.PKTel 506.4

    లేఖనం ఇలా అంటున్నది, “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది.” 2వ వచనం. తండ్రి మహిమకు బాహ్య ప్రకాశం అయిన క్రీస్తు ఈ లోకంలోకి వెలుగుగా వచ్చాడు. మనుషులికి దేవుణ్ని చూపించటానికి వచ్చాడు. ఆయన “పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించ బడ్డాడని, ఆయన “మేలు చేయుచు... సంచరించుచుండెను” అని ఆయన్ని గురించి లేఖనం చెబుతున్నది. అ.కా. 10:38. నజరేతులోని సమాజమందిరంలో ఆయనిలా అన్నాడు, “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” లూకా 4:18,19. ప్రభువు తన శిష్యులికి నియమించిన పని ఇది “మీరు లోకమునకు వెలుగైయున్నారు... మనుష్యులు మీ సత్రియలను చూచి పరలోకమందున్న మా తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” మత్త 5:14,16. PKTel 507.1

    యెషయా ప్రవక్త ఈ పనినే ఈ మాటల్లో అభివర్ణిస్తున్నాడు : “నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్తసంబంధీకి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీయింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియేగదా నా కిష్టమైన ఉపవాసము? అలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగ లభించును. నీ నీతి నీముందర నడచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును.” యెష 58:7,8.PKTel 507.2

    ఆధ్యాత్మిక చీకటి రాత్రిలో, పడిపోయిన వారిని లేవదీయ్యటంలో దుః ఖిస్తున్న వారిని ఓదార్చటంలో సంఘం ద్వారా దేవుని మహిమ ప్రకాశించాల్సి ఉంది.PKTel 507.3

    మన చుట్టూ అన్ని చోట్ల ప్రజల వేదన రోదనలు వినిపిస్తున్నాయి. అన్నిచోట్లా అవసరాలు దుఃఖాల్లో ఉన్నవారు కనిపిస్తారు. కష్టాలు కడగండ్లతో దుఃఖాలు వేదనలతో కుంగిపోతున్నవారికి చెయ్యందించి ఆదుకోటం మన విధి. ఆత్మ వాంఛల్ని క్రీస్తు మాత్రమే తృప్తి పర్చగలుగుతాడు. క్రీస్తు మనలో వాసం చేస్తుంటే మన హృదయాలు ఆధ్యాత్మికమైన సానుభూతిలో నిండి ఉంటాయి. అప్పుడు క్రీస్తు ప్రేమ వంటి ప్రేమ కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. PKTel 507.4

    అనేకుల్లోనుంచి నిరీక్షణ మాయమయ్యింది. వారికి సూర్యకాంతిని పునరుద్దరించండి. అనేకులు ధైర్యాన్ని కోల్పోయారు. వారితో ఉత్సాహం కలిగించే మాటలు చెప్పి ధైర్యం నింపండి. వారి విషయం ప్రార్ధించండి. జీవాహారం అవసరమయ్యేవారున్నారు. వారికి దైవవాక్యం చదివి వినిపించండి. అనేకులు వ్యాధిగ్రస్తమైన ఆత్మ కలిగిఉన్నారు. లోకంలోని ఏ లేహ్యంగాని తెలంగాని లేక వైద్యుడుగాని దాన్ని నయం చెయ్యటం సాధ్యపడదు. ఈ ఆత్మలకోసం ప్రార్ధన చెయ్యండి. వారిని యేసు వద్దకు తీసుకురండి. గిలాదులో గుగ్గిలం ఉందని అక్కడ ఓ వైద్యుడు ఉన్నాడని చెప్పండి.PKTel 508.1

    వెలుగు ఓ వరం. అది అందరికీ ఉపకరించే దీవెన. కృతజ్ఞతలేని, అపవిత్ర, నిరాసక్త లోకంపై అది దాని ఉపకారాల్ని కుమ్మరిస్తుంది. నీతి సూర్యుని వెలుగు విషయంలోనూ ఇదే వాస్తవం. పాపం, దుఃఖం, బాధ అనే చీకటి సర్వలోకాన్ని కప్పివేసింది. దైవ ప్రేమజ్ఞానమనే వెలుగుతో ఆ చీకటిని పారదోలాలి, పరలోక సింహాసనం నుంచి ప్రకాశిస్తున్న వెలుగును ఏ వర్గానికి, హోదాకి లేక తరగతికి చెందిన ప్రజలకూ మూసివేయటం జరగనియ్యకండి.PKTel 508.2

    నిరీక్షణ, కృప వర్తమానం అన్ని ప్రాంతాలకూ ప్రచురితమవ్వాలి. ఎవరైతే ఆసక్తి సంసిద్ధత చూపిస్తారో వారు బలమైన దేవున్ని అంగీకరించి ఆయనతో సమాధాన పడవచ్చు. అన్యజనులు ఇక నడిరేయి చీకటిలో మిగిలిపోవలసిన అవసరంలేదు. నీతి సూర్యుని తీక్షణమైన కిరణాలముందు చీకటి కకావికలవుతుంది.PKTel 508.3

    సంఘం మార్పుచెందిన సంస్థ అయి లోకానికి వెలుగైన ప్రభువు వెలుగుతో ప్రకాశిస్తూ ఇమ్మానుయేలు మహిమను కలిగి ఉండడానికి క్రీస్తు ప్రతీ ఏర్పాటూ చేశాడు. ప్రతీ క్రైస్తవుడు వెలుగు, సమాధానం అనే ఆధ్యాత్మిక వాతావరణంలో నివసించాలన్నది ఆయన ఉద్దేశం. మనం మన జీవితాల్లో తన ఆనందాన్ని వెల్లడి చెయ్యాలని ఆయన అభిలషిస్తున్నాడు.PKTel 508.4

    “నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను.” యెష 60:1. క్రీస్తు మహా శక్తిమహిమలతో వస్తున్నాడు. తన సొంత మహిమతోను తండ్రి మహిమతోను వస్తున్నాడు. పరిశుద్ధ దూతలు ఆయనకు సేవచేస్తూ ఆయన వెంట వస్తారు. లోకమంతా చీకటితో నిండి ఉండగా ఆయన భక్తుల నివాసాల్లో వెలుగు ఉంటుంది. ఆయన రెండోరాక మొదటి కాంతిరేఖ వారికి కనిపిస్తుంది. ఆయన మహిమ నుంచి స్వచ్చమైన వెలుగు ప్రకాశిస్తుంది. విమోచకుడైన క్రీస్తుని ఆయన భక్తులందరు అభిమానిస్తారు. దుష్టులు పారిపోతుంటే, క్రీస్తు అనుచరులు ఆయన సముఖంలో సంతోషంతో గంతులు వేస్తారు.PKTel 508.5

    రక్షణ పొందిన వారు అప్పుడు తమ వాగ్దత్త స్వాస్యాన్ని అందుకుంటారు. ఇశ్రాయేలు విషయంలో దేవుని సంకల్పం ఈ కరంగా నెరవేరుతుంది. దేవుడు ఉద్దేశించిన దాన్ని రద్దు చెయ్యటానికి మానవుడికి శక్తిలేదు. దుష్టశక్తులు చేస్తున్న పని నడుమ సయితం దేవుని సంకల్పాలు వాటి లక్ష్యసాధనలో క్రమక్రమంగా ముందుకు సాగుతాయి. ఇశ్రాయేలు వంశం విషయంలో కూడా అంటే విభజించబడ్డ రాజ్యచరిత్రలో ఇదే జరిగింది. నేడు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు విషయంలోనూ ఇదే జరుగతుంది.PKTel 509.1

    నూతనమైన భూమిలో ఇశ్రాయేలు పునరుద్దరణ సమయందాక ఉన్న శతాబ్దాల్లోంచి చూస్తు పత్మాసు దీర్ఘదర్శి ఈ సాక్ష్యం ఇస్తున్నాడు :PKTel 509.2

    “అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు, ప్రతి వంశములో నుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప జనసమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱపిల్ల యెదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.PKTel 509.3

    “దేవ దూతలందరును సింహాసనము చుట్టును పెద్దల చుట్టును ఆ నాలుగు జీవుల (“సజీవప్రాణుల” ఆర్.వి.) చుట్టును నిలువబడి యుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి- ఆమేన్, యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానము కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి.”PKTel 509.4

    “అప్పుడు గొప్ప జనసమూహమపు శబ్దమును, విస్తార జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము - సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుండి”, ఆయన “ప్రభువులకు ప్రభువును రాజులకు రాజైనయున్నందునను, తనతో కూడ ఉండినవారు, పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.” ప్రక 7:9-12; 19:6, 7; 17:14.PKTel 509.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents