Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ప్రవక్తలు - రాజులు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    21 - ఎలీషా చివరి పరిచర్య

    అహాబు ఇంకా రాజ్యపాలన చేస్తుండగా ప్రవక్త బాధ్యతలు చేపట్టిన ఎలీషా తన జీవితంలో ఇశ్రాయేలు రాజ్యంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోటం చూశాడు. సిరియా రాజు హజాయేలు పరిపాలన కాలంలో ఇశ్రాయేలు ప్రజల మీదికి తీర్పుల మీద తీర్పులు వచ్చాయి. భ్రష్టమైన ఇశ్రాయేలు జాతికి శిక్ష విధించటానికి దేవుడు అతణ్ని అభిషేకించాడు. యెహూ ప్రవేశపెట్టిన దిద్దుబాటు చర్యలవల్ల అహాబు సంతతి నిర్మూలమయ్యింది. సిరియన్లతో నిత్యం జరిగిన యుద్ధాల్లో యెహూ వారసుడైన యెహోయాహాజు యొర్దానుకు తూర్పున ఉన్న కొన్ని పట్టణాల్ని పోగొట్టుకున్నాడు. ఆ రాజ్యమంతా సిరియన్ల అధికారం కిందకు వెళ్లిపోతున్నట్లు కొంతకాలం వరకు కనిపించింది. కాని ఏలీయా ప్రారంభించిన ఎలీషా కొనసాగించిన దిద్దుబాటువల్ల అనేకులు దేవునితట్టు తిరగటం ప్రారంభమయ్యింది. బయలు దేవత_బలిపీఠాల్ని విసర్జించారు. పూర్ణహృదయంతో ఆయన్ని సేవించటానికి ఎంపిక చేసుకున్నవారి జీవితాల్లో నెమ్మదిగా, అయినా కచ్చితంగా, ఆయన ఉద్దేశం నెరవేరుతున్నది.PKTel 168.1

    తప్పుమార్గానపోతున్న ఇశ్రాయేలీయుల పట్ల తనకున్న ప్రేమ వలన వారిపై దేవుడు సిరియన్ల కొరడాను అనుమతించాడు. నైతికంగా బలహీనంగా ఉన్నవారిపట్ల తనకు గల కనికరంవల్ల దుష్టురాలైన యెజెబెలుని అహాబు వంశీకులందరిని హతమార్చటానికి ఆయన యెహూని లేపాడు. దేవుని కృపా సంకల్పం వల్ల మరోసారి బయలు, అషారోతు తాలూకు యాజకుల్ని విసర్జించటం ఆ దేవత బలిపాఠాన్ని కూలదోయ్యటం జరిగింది. శోధనను తొలగిస్తే కొందరు అన్యమతతత్వాన్ని విడిచిపెట్టి తన తట్టు తిరగనున్నట్లు తన దివ్యజ్ఞానంతో దేవుడు చూశాడు. అందుకే వారిమీదికి ఆపద తర్వాత ఆపద వచ్చి పడటానికి అనుమతించాడు. ఆయన తీర్పులు కృపతో సమ్మిళితమయ్యాయి. తన ఉద్దేశం నెరవేరినప్పుడు, తనను విశ్వసించటానికి నేర్చుకున్న వారి పక్షంగా ఆయన అద్భుతాలు చేశాడు. PKTel 168.2

    మంచిని ప్రోదిచెయ్యటానికి చెడును వ్యాప్తి చెయ్యటానికి ప్రభావాలు పోటీ పడుతున్న తరుణంలో, అహాబు యెజెబెలు పరిపాలన కాలంలో తాను ప్రారంభించిన నాశనాన్ని పూర్తిచెయ్యటానికి సాతాను తన శక్తిమేరకు కృషిచేస్తున్న కాలంలో, ఎలీషా తన సాక్ష్యాన్ని కొనసాగించాడు. వ్యతిరేకత ఎదురయ్యింది. అయినా అతడి మాటల్ని ఎవరూ కాదనలేదు. దేశమంతా అతణ్ని సన్మానించింది, గౌరవించింది. సలహాలకోసం అనేకమంది అతడివద్దకు వచ్చారు. యెజెబెలు ఇంకా జీవించి ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోరాము అతడి సలహాను యాచించాడు. ఒకసారి దమస్కుకు వెళ్లినప్పుడు అతణ్ని సిరియా రాజు బెనదదు. తనకు కలిగిన వ్యాధివల్ల తనకు మరణం కలుగుతుందా అని తెలుసుకోటానికి తన దూతల్ని ఎలీషా వద్దకు పంపాడు. అన్నిచోట్ల సత్యం వక్రీకరించబడ్తున్నప్పుడు, ప్రజల్లో అధిక సంఖ్యాకులు దేవునిపై బాహాటంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు, ప్రవక్త ఎలీషా ప్రజలందరికీ నమ్మకంగా తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు.PKTel 169.1

    తాను ఎన్నుకున్న దూతను దేవుడు విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలుపై సిరియా దాడి జరుగుతున్న ఒక సందర్భంలో ఇశ్రాయేలు రాజుకు తన శత్రువు ప్రణాలికల్ని గురించి కార్యకలాపాల గురించి తెలియజేస్తున్నందుకు ఎలీషాని చంపాలని సిరియారాజు ప్రయత్నించాడు. సిరియా రాజు తన సలహాదారుల్లో సంప్రదింపులు జరుపుతూ “ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదమని చెప్పెను.” ఈ ప్రణాలికను దేవుడు ఎలీషాకు ప్రత్యక్షపర్చగా అతడు ఇశ్రాయేలు రాజుకి “వర్తమానము పంపి - ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను. గనుక దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున :PKTel 169.2

    “సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి - మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారినడుగగా అతని సేవకులలో ఒకడు - రాజువైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునులేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతః పురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను.”PKTel 169.3

    ప్రవక్తను చంపాలని నిశ్చయించుకుని సిరియా రాజు “మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండుచోటు చూచిరమ్ము అని” ఆజ్ఞాపించాడు. ప్రవక్త దోతానులో ఉన్నాడన్న వర్తమానం తెలుసుకుని రాజు “అచ్చటికి గుఱ్ఱములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను.”PKTel 169.4

    భయంతో నిండిన ఎలీషా సేవకుడు ఆవార్తను తన యజమానుడికి అందించటానికి త్వరపడి అతడి వద్దకు వెళ్లి, “అయ్యో నా యేలినవాడా, మనమేమి చేయుదుము?” అన్నాడు.PKTel 170.1

    ప్రవక్త “భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై యున్నారు” అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు తనకై తాను తెలుసుకునే నిమిత్తం “యెహోవా, వాడు చూచునట్లు దయచేసి వీనికండ్లను తెరువుమని ఎలీషా ప్రార్ధన” చేశాడు. “యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్నిగుఱ్ఱముల చేత రథములచేతను నింపబడియుండుట చూచెను.” దైవ సేవకుడికి సాయుధులై ఉన్న శత్రుసేనల మధ్య దైవ సేవకుడి చుట్టూ దేవదూతలు ఉన్నారు. వారు గొప్ప శక్తితో దిగివచ్చారు. నాశనం చెయ్యటానికో, ముక్కుపిండి నీరాజనాలు అందుకోటానికో కాదు. కాని బలహీనులు నిస్సహాయులు అయిన ప్రభువు జనులికి సేవజేసే తన సేవకుడి చుట్టూ రక్షావలయంగా నిలవటానికి వచ్చారు. PKTel 170.2

    దైవ ప్రజలు కష్టాల్లో చిక్కుకుని తప్పించుకునే మార్గం లేనట్లు కనిపించినప్పుడు వారు ప్రభువు మీద మాత్రమే ఆధారపడాలి.PKTel 170.3

    సిరియా సేనలు మోహరించి ఉన్న దేవదూతలు ఉనికిని గుర్తించకుండా ధైర్యంగా ముందుకి సాగుతున్నప్పుడు, “ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్ధన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా - ఇది మార్గముకాదు, ఇది పట్టణముకాదు, మీరు నావెంట వచ్చిన యెడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మును తీసికొనిపోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణముకు వారిని నడిపించెను.PKTel 170.4

    “వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు - యెహోవా, వీరు చూచునట్లు వీరికండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి. అంతట ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి నాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా అతడు - నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్లుదురని చెప్పెను. అతడు వారికొరకు విస్తారమైన భోజనము పదార్ధములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి.” 2 రాజులు 6 చూడండి.PKTel 170.5

    దీని తర్వాత కొంతకాలం ఇశ్రాయేలుపై సిరియా దాడులు లేవు. కాని అనంతరం పట్టుదలగల రాజు హజాయేలు నేతృత్వంలో సిరియన్లు షోమ్రోనును ముట్టడించారు. ఈ ముట్టడి జరిగిన కాలంలో ఇశ్రాయేలీయులు తీవ్ర శ్రమలకు గురిఅయ్యారు. అలాంటి శ్రమలకు ఇశ్రాయేలు ప్రజలు మున్నెన్నడు గురికాలేదు. తండ్రుల పాపాలు వాస్తవంగా పిల్లలమీదికి వారి పిల్లలమీదికి వస్తున్నాయి. కొనసాగుతున్న కరవు కష్టాలు కడగండ్ల భయాలు ఇశ్రాయేలు రాజుని ఏదో తీవ్ర చర్యకు ముందుకు నెట్టుతున్న తరుణంలో వారికి ఆ మరుసటిరోజు విడుదల కలుగుతుందని ఎలీషా ప్రవచించాడు.PKTel 171.1

    మరుసటి దినం తెల్లవారుతుండగా యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా” వారు భయపడి “లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండు పేటలోనున్న వాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుటచాలుననుకొని సందెచీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచిపారిపోయి యుండిరి.” విస్తారంగా ఆహారాన్ని కూడ విడిచిపెట్టి పారిపోయారు. యోర్దాను దాటేవరకూ ఎక్కడా ఆగలేదు.PKTel 171.2

    ఆ రాత్రి తీవ్రమైన ఆకలితో నలుగురు కుష్ఠురోగులు పట్టణ గుమ్మంవద్ద ఉన్నారు. వారు సిరియా శిబిరంలోకి వెళ్లి వారి దయదాక్షిణాల్ని సంపాదించి వారి వద్ద భోజనం అడుక్కుందామని ఆలోచించుకున్నారు. వారు సిరియన్ల శిబిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ వారికి “ఏ మనిషియు కనబడలేదు.” తమను అడ్డుకునేవారు గాని బాధపెట్టేవారు గాని లేకపోవటంతో, వారు “ఒక గుడారము జొచ్చి భోజనపానములు చేసి, అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి, తిరిగివచ్చి మరియొక గుడారముజొచ్చి అచ్చటినుండి సొమ్ము ఎత్తికొనిపోయి దాచిపెచ్చిరి. వారు - మనము చేయునది మంచిపనికాదు, నేటి దినము శుభవర్తమానముగల దినము, మనము ఊరుకోననేల?” త్వరత్వరగా వారు ఆ మంచి వార్తతో పట్టణానికి తిరిగివచ్చారు. PKTel 171.3

    కొల్ల సొమ్ము విస్తారంగా లభించింది. ఆహార పదార్ధాలు ఎంత సమృద్ధిగా ఉన్నాయంటే “రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒక రెంటికి రెండు మానికల యవలును అమ్మబడును.” దీన్ని గురించి ఏలీషా ఒక రోజు కిందటే ప్రవచనంగా చెప్పాం. “యెహోవా మాట చొప్పున” మరొకసారి దేవుని నామాన్ని ఆయన ప్రవక్త ఘనపర్చాడు. 2 రాజులు 7:5-16 చూడండి.PKTel 171.4

    దైవ సేవకుడు ఎలీషా ఈ విధంగా ప్రజలకు దగ్గరగా ఉండి నమ్మకంగా సేవచేస్తూ, క్లిష్ట సమయాల్లో సలహాదారుగా రాజులపక్క నిలబడ్డూ తన సేవను కొనసాగించాడు. రాజులు ప్రజల దీర్ఘకాల విగ్రహారాధన హానికరమైన ప్రభావాన్ని ప్రసరించింది. మత భ్రష్టత దుష్ర్పభావం అన్నిచోట్లా కనిపించింది. అయినా అక్కడక్కడ బయలు ముందు తలవంచకుండా దేవునికి నమ్మకంగా నిలిచిన వారున్నారు. ఎలీషా తన సంస్కరణ కృషిని కొనసాగించగా అనేకులు అన్యమతం నుంచి తిరిగివచ్చారు. వీరు యధార్ధ దేవుని సేవలో ఆనందించారు. దైవ కృపవల్ల జరిగిన ఈ అద్భుతాల్ని చూసి ప్రవక్త అమితానందభరితుడయ్యాడు. చిత్తశుద్ధి గలవారందరినీ సత్యంతో కలుసుకోటాని అతడు ఆత్మప్రేరేపణ పొందాడు. తాను ఎక్కడ ఉంటే అక్కడ నీతి బోధకుడుగా సేవచెయ్యటానికి ప్రయత్నించాడు. భూమి మిది చీకటి ప్రాంతాల్లో సేవ చేసే వారికి జాతి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఎంత నిరాశాపూరితంగా కనిపిస్తుందో అంతే నిరాశాపూరితంగా ఆజాతి ఆధ్యాత్మిక పునరుజ్జీవం మానవ దృక్కోణం నుంచి కనిపించింది. అయితే సంఘం సత్యం ప్రకటించటానికి దేవుడు ఏర్పర్చుకున్న సాధనం. ప్రత్యేక సేవ చెయ్యటానికి సంఘానికి ఆయన శక్తినిస్తాడు. అది దేవునికి నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞల్ని ఆచరిస్తుంటే దానిలో దేవుని శక్తి ప్రదర్శితమౌతుంది. సంఘం తన విశ్వాసానికి నమ్మకంగా నిలిచిఉంటే దానికి వ్యతిరేకంగా నిలిచే శక్తి ఏదీ ఉండదు. పొట్టు సుడిగాలిని ఎలా ప్రతిఘటించలేదో, అలాగే విరోధి శక్తులు దాన్ని అణచి వెయ్యలేవు.PKTel 172.1

    సంఘం లోకంపట్ల తన అధీనతను ఉపసంహరించుకుని క్రీస్తు నీతివస్త్రాన్ని ధరించటానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే దాని ముందు తేజోవంతమైన మహిమాన్వితమైన తొలిసంజ ఉంది.PKTel 172.2

    విశ్వసించకుండా నిరీక్షణ లేకుండా ఉన్నవారిని ధైర్యపర్చవలసిందిగా దేవుడు తనను నమ్మే విశ్వాసులికి పిలుపునిస్తున్నాడు. నిరీక్షణ బందీల్లారా, ప్రభువుతట్టు తిరగండి. జీవంగల దేవుని నుంచి శక్తిని పొందండి. ఆయన శక్తిపైన, రక్షించటానికి ఆయన సంసిద్ధతపైన నిశ్చల నిరాడంబర విశ్వాసాన్ని ప్రదర్శించండి. మనం విశ్వాసంతో ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు, నిరాశతో అధైర్యంతో నిండిన దృక్పథాన్ని ఆయన మార్చుతాడు, అద్భుతంగా మార్చుతాడు. తన మహిమకోసం ఇది ఆయన చేస్తాడు.PKTel 172.3

    ఇశ్రాయేలు రాజ్యంలో ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ప్రయాణం చెయ్యగలిగి నంతకాలం ఎలీషా ప్రవక్తల పాఠశాలల్ని అభివృద్ధిపర్చటంలోను పటిష్ఠపర్చటంలోను శ్రద్ధతీసుకున్నాడు. అతడెక్కడున్నా దేవుడు అతడితో ఉండి అతడికి మాటలనిచ్చి అద్భుతకార్యాలు చెయ్యటానికి శక్తిననుగ్రహించాడు. ఒకసారి “ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి - ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికిపోయి తలయొక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరియొకచోట నివాసము కట్టుకొందుము” అని మనవిచేశారు. 2 రాజులు 6:1,2. వారిని ఉద్రేకపర్చటానికి, వారికి ఉపదేశం ఇవ్వటానికి ఎలీషా వారితో కూడా వెళ్లాడు. తమ పనిలో సహాయం అందించటానికి ఒక సూచక క్రియను కూడా చేశాడు. “ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా - అయ్యా నాయేలినవాడా అది యెరువు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక ఆ దైవజనుడు - అదెక్కడ పడెనని అడిగెను, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు - దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను.” 5-7 వచనాలు. PKTel 172.4

    అతడి సేవ ఎంత ఫలప్రదంగాను అతడి ప్రభావం ఎంత విస్తృతంగాను ఉన్నవంటే అతడు మరణశయ్యమీద ఉన్నతరుణంలో యువకుడు విగ్రహారాధకుడు దేవునిపట్ల ఏ మాత్రం భక్తిలేనివాడు అయిన యోవాడు రాజు ఆ ప్రవక్తలో ఇశ్రాయేలుకు ఒక తండ్రిని చూసి, కష్టసమయాల్లో అతడి సముఖం గుట్టాలు రథాలు గల గొప్ప సైన్యంకన్నా ఇశ్రాయేలుకి బలం చేకూర్చిందని సాక్షం ఇచ్చాడు. చరిత్ర ఇలా చెబుతున్నది: “అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలు రాజైన యోవాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు - నా తండ్రి, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.” 2 రాజులు 13:14.PKTel 173.1

    కష్టాల్లో చేయూత అవసరమైన అనేకమందికి ప్రవక్త విజ్ఞత సానుభూతిగల తండ్రిగా వ్యవహరించాడు. ఈ సందర్భంలో దేవుడు లేనివాడు, తాను ఆక్రమించిన ఉన్నత స్థానానికి అనర్హుడు, అయినా హితవు ఎంతో అవసరమైన వాడు అయిన ఈ యువకుణ్ని ఏలీయా విడిచి పెట్టెయ్యలేదు. తన సంకల్పానుసారంగా దేవుడు రాజుకి అతడి గతవైఫల్యాల్ని సవరించుకుని తన రాజ్యాన్ని సక్రమమార్గంలో నడపటానికి ఒక అవకాశాన్నిస్తున్నాడు. ఇప్పుడు యోర్దాను నదికి తూర్పున ఉన్న తన దేశాన్ని ఆక్రమించుకున్న శత్రువైన సిరియా రాజును తరిమివేయ్యాల్సి ఉంది. తప్పులు చేస్తున్న ఇశ్రాయేలు వారి పక్షంగా దేవుని శక్తి మరోసారి ప్రదర్శితం కావాల్సిఉంది.PKTel 173.2

    “నీవు వింటిని బాణములను తీసికొమ్ము” అని మరణిస్తున్న ప్రవక్త రాజుని ఆదేశించాడు. యోవాడు ఆ ఆజ్ఞను పాలించాడు. అప్పుడు “నీ చెయ్యిని వింటిమీద ఉంచుము” అన్నాడు ప్రవక్త. “అతడు తన చెయ్యి వింటిమిద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి - తూర్పువైపున నున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను.” అతడు తెరిచిన ఆ కిటికీలో నుంచి యోర్దాను అవతల సిరియన్ల ఆక్రమణ కింద ఉన్న పట్టణాలు కనిపించాయి. రాజు ఆ కిటికీ తెరిచిన తర్వాత బాణం సంధించమని ఎలీషా రాజును ఆదేశించాడు. బాణం దూసుకు పోతుండగా దైవావేశం కింద ప్రవక్త ఇలా అన్నాడు, “ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు ఆఫెకులో వారిని హతము చేయుదువు” అని చెప్పాడు.PKTel 173.3

    ప్రవక్త ఇప్పుడు రాజు విశ్వాసాన్ని పరీక్షించాడు. యోవాషను బాణం పట్టుకుని “నేలను కొట్టుము” అన్నాడు. రాజు నేలను మూడుసార్లు కొట్టి ఊరకున్నాడు. “నీవు అయిదుమారులైనా ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు, అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.” 2 రాజులు 13: 15-19.PKTel 174.1

    బాధ్యతగల పదవుల్లో ఉన్న వారందరికి వస్తున్న పాఠం ఇది. ఒక కార్యసాధన నిమిత్తం దేవుడు మార్గాన్ని తెరచి దాని విజయానికి భరోసా ఇచ్చినప్పుడు ఆయన ఏర్పర్చుకున్న వ్యక్తి వాగ్దత్త ఫలితాన్ని సాధించటానికి శక్తి వంచనలేకుండా కృషి చెయ్యాలి. ఆ కార్యాన్ని సాధించటంలో చూపిన ఉత్సాహం, శ్రమ నిష్పత్తిలోనే వారికి లభించే జయం ఉంటుంది. తన ప్రజలు తమ పాత్రను నిర్విరామకృతితో నిర్వహించినప్పుడే వారి పక్షంగా దేవుడు అద్భుతాలు చెయ్యగలుగుతాడు. తన సేవకు భక్తి తత్పరులైన మనుషుల్ని, నైతిక ధైర్యం ఉన్న మనుషుల్ని ఆత్మల విషయంలో ప్రగాఢ ప్రేమగల మనుషుల్ని, ఎన్నడూ నీరుకారని ఉత్సాహంగల మనుషుల్ని దేవుడు పిలుస్తున్నాడు. అట్టి వ్యక్తులికి ఏ పనీ కఠినమైన పనికాదు. ఏ పరిస్థితీ అధైర్యపర్చే పరిస్థితికాదు. పైకి ఓటమిగా కనిపించే పరిస్థితి గొప్ప విజయంగా మారే వరకు వారు నిర్భయంగా పనిచేసుకుంటూ పోతారు. దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఆయనతో కలసిచేస్తున్న పనినుంచి వారిని చెరసాల గోడలేకాదు, హతసాక్షి వధ్యాస్తంభాలేకాదు ఏవీ మరల్చలేవు.PKTel 174.2

    యోవాషకి ఇచ్చిన హితవు ప్రోత్సాహంతో ఎలీషా సేవ ముగిసింది. ఏలీయా మీద ఉన్న ఆత్మ పూర్తిస్థాయిలో ఎవరిపై నిలిచాడో ఆ ఎలీషా చివరి వరకూ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అతడు ఎన్నడూ అటూఇటూ ఊగలేదు. సర్వశక్తుని శక్తిపై ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. తన ముందున్న మార్గం పూర్తిగా మూతపడినట్లు కనిపించినా అతడు ఎప్పుడూ విశ్వాసంతో ముందుకు సాగాడు. దేవుడు అతడి విశ్వాసాన్ని గౌరవించి అతడి మార్గం తెరిచాడు.PKTel 174.3

    ఎలీషా తన గురువుననుసరించి అగ్నిరథంపై వెళ్ళలేదు. అతడి మీదకి వ్యాధివచ్చి నిలవటానికి ప్రభువు అనుమతించాడు. మానవ బలహీనత బాధ మసలిన దీర్ఘకాలంలో అతడి విశ్వాసం దేవుని వాగ్దానాలమీద స్థిరంగా నిలిచింది. తన చుట్టూ పరలోక దూతలు ఉండి ఓదార్పు కలిగించి శాంతి చేకూర్చటం అనుభవపూర్వకంగా చూశాడు. దాతాను కొండమీదలా, పరలోక దూతసైన్యాలు, అగ్నిరథాలు, గుఱ్ఱపురౌతులు చుట్టూ ఉండటం చూశాడు. కనుక ఇప్పుడు సానుభూతిని సూచిస్తూ దేవదూతల సముఖం తనతో ఉన్నదని గుర్తించి ఆదరణ పొందాడు. తన జీవితమంతా ఎలీషా గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాడు. దేవుని కృపా సంకల్పాల విషయంలో తన జ్ఞానం వృద్ధి చెందినకొద్దీ విశ్వాసం పక్వం చెంది తన దేవుని మీద అచంచలమైన నమ్మకంగా మారింది. మరణానికి పిలుపు వచ్చినప్పుడు తన శ్రమలనుంచి విశ్రాంతి పొందటానికి సంసిద్ధంగా ఉన్నాడు.PKTel 175.1

    “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది.” కీర్త 116:15. “మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలుగును.” సామె 14:32. ఎలీషా కీర్తనకారుడితో ఇలా నమ్మకంతో గళం కలపగలడు, “దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును.” కీర్త 49:15. సంతోషంగా ఇలా సాక్ష్యమియ్యగలిగాడు, “నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.” యోబు 19:25. “నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును.” కీర్త 17:15.PKTel 175.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents