Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    28—కష్టించి చేసిన పరిచర్య - శ్రమలు

    మూడేళ్లపాటు పరిచర్యకు ఎఫెసు కేంద్రమయ్యింది. ప్రవర్ధమానమైన ఓ సంఘం ఇక్కడ స్థాపితమయ్యింది. ఆసియా ప్రాంతంలోని యూదులు అన్యుల మధ్య సువార్త ఈ పట్టణం నుంచి వ్యాప్తి చెందింది.AATel 206.1

    అపొస్తలుడు కొంత కాలంగా ఇంకొక మిషనెరీ ప్రయాణం గురించి ఆలోచిస్తున్నాడు. పౌలు “మాసిదోనియ అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి - నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడ చూడవలెనని అనుకొనెను”. తన ప్రణాళిక ననుసరించి “తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అనువారినిద్దరిని మాసిదోనియకు” పంపాడు. అయితే ఎఫెసులోని సేనకు తన ఉనికి అగత్వమని భావించి పెంతెకొస్తు అయ్యేవరకు ఎఫెసులో ఉండటానికి తీర్మానించుకొన్నాడు. కొద్ది కాలంలోనే చోటుచేసుకొన్న ఒక ఘటన కారణంగా అతడు అక్కడనుంచి వెళ్లిపోవాల్సివచ్చింది.AATel 206.2

    ఎఫెసులో ఏడాదికోసారి అర్తెమి దేవి గౌరవార్థం ప్రత్యేక కర్మకాండ జరిగేది. ఈ కర్మకాండకు ప్రజలు అన్ని ప్రాంతాలనుంచి వచ్చేవారు. ఈ కాలంలో ఉత్సవాలు వేడుకలు వైభోగంగా జరిగేవి.AATel 206.3

    ఈ వేడుక సమయం కొత్తగా విశ్వాసులైన వారికి తీవ్రమైన పరీక్ష సమయం. తురన్ను పాఠశాలలో సమావేశమయ్యే విశ్వాసుల బృందం ఈ వేడుక గానంలో అపశ్రుతిగా పరిణమించింది. వారు ఉత్సవ ప్రజల ఎగతాళికి నిందలు అవమానాలకు గురి అయ్యారు. పౌలు సేవల వల్ల అన్యమత పూజలకు గొప్ప విఘాతం కలిగింది. పర్యవసానంగా ఆ జాతీయ వేడుకలకు హాజరయ్యే ప్రజల సంఖ్య తగ్గిపోయింది. ఆరాధకుల్లో ఉత్సాహం క్షీణించింది. పౌలు బోధనల ప్రభావం అసలు విశ్వాసుల పరిధిని దాటి విస్తరించింది. ఈ నూతన సిద్ధాంతాల్ని బాహాటంగా అంగీకరించని పలువురు సత్యాన్ని గ్రహించినందువల్ల తమ అన్యమత దేవుళ్ల మీద నమ్మకాన్ని కోల్పోయారు.AATel 206.4

    ఆ అసంతృప్తికి మరో కారణం కూడా ఉంది. అర్తెమి దేవి గుడిని విగ్రహాన్ని పోలిన చిన్న చిన్న విగ్రహాల తయారీ విక్రయాల నుంచి ఎఫెసులో లాభసాటి వ్యాపారం సాగుతున్నది. ఈ పరిశ్రమపై ఆశలు పెట్టుకొన్న వారి లాభాలు తగ్గిపోటంతో అందరూ ఏకమై ఆ మార్పుకు పౌలు బోధలే కారణమని నిందించటం మొదలు పెట్టారు.AATel 207.1

    వెండి గుళ్లను తయారుచేసే దేమేత్రా అనే కంసాలి సాటి కంసాలి పని వాళ్లని పోగుజేసి వారితో ఇలా అన్నాడు, “అయ్యలారా, యీ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియ యందంతట బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియునున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయేగాక, మహాదేవియైన అర్తెమి దేవి యొక్క గుడి కూడ తృణీకరింపబడి ఆసియ యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న యీమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. ఈ మాటలు ప్రజల ఉద్రేకాల్ని రెచ్చగొట్టాయి. “వారు విని రౌద్రముతో నిండినవారై - ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి.”AATel 207.2

    ఈ ప్రసంగ నివేదిక వేగంగా ప్రచురమయ్యింది. ‘పట్టణము బహు గలిబిలిగా ఉండెను” పౌలు కోసం గాలింపు మొదలయ్యింది. కాని అతడి జాడ తెలియరాలేదు. రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన సహోదరులు పౌలుని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. ఆ అపొస్తలుణ్ని కాపాడటానికి దేవదూతలు దిగివచ్చారు. పౌలు హతసాక్షిగా మరణించటానికి సమయం ఇంకారాలేదు.AATel 207.3

    తమకు కావలసిన వ్యక్తి కనిపించకపోవటంతో ప్రజలు దొమ్మిగా వచ్చి “పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియవారైన గాయియు అరిస్కరును” పట్టుకొన్నారు. వారితో “నాటక శాలలో చొరబడిరి”.AATel 207.4

    పౌలును దాచిన స్థలం అక్కడికి ఆట్టే దూరంలో లేదు. తన ప్రియతమ మిత్రులికి ఏర్పడ్డ ప్రమాదాన్ని గురించి పౌలు తెలుసుకొన్నాడు. తన సొంత క్షేమాన్ని విస్మరించి వెంటనే ఆనాటకశాలకు వెళ్లి ఆ దొమ్మీమూకతో మాట్లాడాలనుకున్నాడు. “గాని శిష్యులు వెళ్లనియ్యలేదు” అయితే ఆ ప్రజలకు కావలసిన ఎరగాయి అరిస్కర్లు కాదు. వారికి ఏమంత హాని కలుగకపోవచ్చు. కాగా పాలిపోయిన ఆందోళనతో నిండిన అపొస్తలుడి ముఖంగాని కనిపిస్తే అది ఆ దొమ్మిమూక కార్పణ్యాన్ని రెచ్చగొట్టి అతడి ప్రాణాన్ని ఏమానవుడూ కాపాడలేని పరిస్థితి తెచ్చేది.AATel 207.5

    ఆ జనసమూహం ముందుకు వెళ్లి సత్యాన్ని సమర్థించాలని పౌలు ఇంకా ఆతృతగా ఉన్నాడు. కాని నాటకశాల నుంచి వచ్చిన ఒక వర్తమానం అతణ్ని ఆపింది. “ఆసియ దేశాధికారులలో కొందరు అతని స్నేహితులైయుండి అతని యొద్దకు వర్తమానము పంపి - నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి”.AATel 207.6

    నాటకశాలలోని గలాభా అధికమౌతూ కొనసాగుతూనే ఉంది. “ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరిలాగున, కొందరాలాగున కేకలు వేసిరి, తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు”. పౌలు, అతడి సహచరుల్లో కొంతమంది ,హెబ్రీ మూలాలు గలవారు కావటంతో వారిపట్ల వారి సేవపట్ల తమకు సానుభూతి లేదని చూపించేందుకు యూదులు తహతహలాడారు. కనుక విషయాన్ని ప్రజల ముందుకు తేవటానికి వారు తమలో ఒకణ్ని ఎంపిక చేశారు. అతడి పేరు అలెక్సంద్రు. అతడు ఒక కార్మికుడు, రాగిషనివాడు. తనకు ఎంతో కీడుచేసిన వ్యక్తి అని ఇతణ్ని గురించి పౌలు ప్రస్తావించాడు. 2 తిమోతి 4:14. అలెక్సంద్రు సామర్థ్యం గల వ్యక్తి. ప్రజల ఆగ్రహాన్ని ప్రత్యేకించి పౌలు మిదకి పౌలు అనుచరుల మీదకి తిప్పటానికి ఇతడు తన శక్తి యుక్తులన్నిటినీ వినియోగించాడు. అయితే అలెక్సండ్రు యూదుడని గుర్తించి అతణ్ని పక్కకు నెట్టి “అందరును ఏక శబ్దముతో రెండు గంటల సేపు - ఎఫెసీయుల ఆర్తెమి దేవి మహాదేవి అని కేకలు వేసిరి.”AATel 208.1

    చివరికి పూర్తిగా అలసిపోయి వారు కేకలు వేయటం మానేశారు. కాసేపు అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఆ పట్టణ కరణం ప్రజల గమనాన్ని ఆకర్షించి వారితో మాట్లాడాడు. వారు లేపుతున్న గగ్గోలుకు హేతువేమి లేదని చెప్పి విజ్ఞతతో వ్యవహరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. “ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము ఆర్తెమి మహాదేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలైయున్నదని తెలియనివాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుష్యులను తీసుకొని వచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపలేదు. దేమేత్రికిని అతనితో కూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుకవారు ఒకరితో ఒకరు వ్యాజ్యెమాడ వచ్చును. అయితే మీరు యితర సంగతులను గూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమపుచున్నది. ఇట్లు గుంపుకూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడీలాగు చెప్పి సభను ముగించెను.”AATel 208.2

    తన ఉపన్యాసంలో దేమ్మే “ఈ మన వృత్తియందు లక్ష్యము” తప్పిపోయింది అన్నాడు. ఎఫెసులోని గందరగోళానికి అపొస్తలుల సేవల వెంబడి చోటు చేసుకొంటున్న హింసకు అసలు కారణం ఏంటో ఈ మాటల్లో వెల్లడవుతుంది. సువార్త బోధన వ్యాప్తి వల్ల విగ్రహాల తయారీ వ్యాపారం దెబ్బతింటున్నట్లు దేమేత్రి అతడి సహచర కంసాలులు గుర్తించారు. అన్యమత పూజార్లు కార్మికుల ఆదాయం దెప్పతినే ప్రమాదం ఏర్పడింది. అందుచేత వారు పౌలుపట్ల తీవ్ర వ్యతిరేకతను రెచ్చగొట్టారు.AATel 208.3

    కరణం, తదితర నగర ఉన్నతాధికార్ల తీర్మానం ఏ చట్ట వ్యతిరేక క్రియకూ పాల్పడని నిరపరాధిగా పౌలుని ప్రజల ముందు నిలబెట్టింది. తప్పులు మూఢనమ్మకాలతో నిండిన అన్యమతం పై క్రైస్తవం సాధించిన విజయం ఇదొకటి. తన అపొస్తలుణ్ని సమర్థించి దొమ్మీ మూకను అదుపులో ఉంచేందుకు దేవుడు గొప్ప న్యాయాధికారిని లేపాడు. తన ప్రాణాన్ని రక్షించినందుకు, ఎఫెసు గందరగోళం వలన క్రైస్తవాన్ని అభాసుపాలు కాకుండా కాపాడినందుకు పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు.AATel 209.1

    “ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మిదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలుదేరెను”. తుకికు, తోఫిము అనే నమ్మకమైన ఇద్దరు ఎఫెసీయ సహోదరులు ఈ ప్రయాణంలో పౌలు వెంబడి వెళ్లారు.AATel 209.2

    ఎఫెసులో పౌలు సేవ సమాప్తమయ్యింది. అక్కడ అతడి సేవాకాలం అవిశ్రాంత పరిచర్య జరిగిన సమయం. అనేక శ్రమలు తీవ్ర హృదయ వేదనతో నిండిన సమయం. పౌలు అక్కడ బహిరంగంగా బోధించాడు, ఇంటింటికి వెళ్లి బోధించాడు. కన్నీళ్లతో బోధించాడు, హెచ్చరించాడు. యూదులు అతణ్ని నిత్యమూ వ్యతిరేకించారు. అతడికి వ్యతిరేకంగా నిత్యమూ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఇలా వ్యతిరేకతను దీటుగా ఎదుర్కొంటూ, సువార్త ప్రగతికి అలు పెరుగని ఉత్సాహంతో పాటుపడూ, విశ్వాసపరంగా ఇంకా బాల్యదశలోనే ఉన్న సంఘాన్ని పరిరక్షిస్తూ, పౌలు అన్ని సంఘాల భారబాధ్యతల్ని తన భుజాల మీద వేసుకొన్నాడు.AATel 209.3

    తాను స్థాపించిన సంఘాలు కొన్నింటిలో మత భ్రష్టత చోటుచేసుకొందన్న వార్త అతడికి తీరని వేదన కలిగించేది. సంఘాల సందర్భంగా తన కృషి నిరర్థకమవుతుందేమోనని బెంగపడేవాడు. తన సేవను ప్రతిఘటించటానికి ఉపయుక్తమౌతున్న పద్ధతుల్ని గురించి తెలుసుకొన్నప్పుడు అతడు అనేక రాత్రులు నిద్రలేకుండా ప్రార్థనలోను ఆలోచనలోను గడిపేవాడు. తనకున్న అవకాశం మేరకు, సంఘాల స్థితిగతుల ననుసరించి మందలింపులు, సలహాలు, ఉపదేశం ప్రోత్సాహాలతో సంఘాలకు లేఖలు రాసేవాడు. ఈ లేఖల్లో అపొస్తలుడు తన శ్రమల్ని ప్రస్తావించేవాడు కాదు. కాని క్రీస్తు సేవలో తన కృషినిగూర్చి కష్టసుఖాల్ని గూర్చి అప్పుడప్పుడు సూచన ప్రాయంగా చెప్పేవాడు. కొరడా దెబ్బలు, చెరసాల, చలి, అన్నార్తి, దాహార్తి, నేల పై ప్రయాణంలో, సముద్రం పై ప్రయాణంలో, పట్టణంలో, అరణ్యంలో, స్వదేశస్తులనుంచి, అన్యులనుంచి, కపట సహోదరులనుంచి ఎదురైన అపాయాలువీటన్నిటినీ సువార్త నిమిత్తం అతడు భరించాడు. అతడు “దూషింపబడి”, “నిందింపబడి”, “అందరికి పెంటకుప్పగా . . . ఎంచబడి”, “ఇరికింపబడి”, “హింసింపబడి”, “ఎటుబోయినను శ్రమలుపడి”, “గడియ గడియకు ప్రాణ భయముతో నుండి”, “ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచు” బతికాడు.AATel 209.4

    వ్యతిరేకత తుఫాను నడుమ, శత్రువుల అరుపులు మిత్రుల ఎడబాటు మధ్య భయమంటే ఎరుగని అపొస్తలుడు దాదాపు డీలాపడిపోయాడు. వెనక్కు తిరిగి కల్వరి పై దృష్టి సాలించాడు. సిలువపొందిన రక్షకుని గూర్చిన వర్తమానాన్ని ప్రచురించటానికి నూతన శక్తిపొంది ముందుకు సాగాడు. తనకు ముందు క్రీస్తు నడిచిన రక్తసిక్త మార్గాన్నే తానూ నడుస్తున్నాడు. తన యుద్ధ కవచాన్ని రక్షకుడి పాదాల వద్ద పెట్టేంత వరకూ పోరాటాన్ని విరమించటానికి ప్రయత్నించలేదు.AATel 210.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents