Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    18—అన్యుల మధ్య సువార్త ప్రకటన

    పిసిదియలోని అంతియొకయనుంచి పౌలు బర్నబాలు ఈ కొనియకు వెళ్ళారు. అంతియొకయలో లాగే ఈ స్థలంలోనూ వీరు తమ సొంత ప్రజల సమాజమందిరంలో తమ సేవను ప్రారంభించారు. వారికృషి గొప్పగా ఫలించింది. “అనేకులు, యూదులును గ్రీకు దేశస్థులును విశ్వసించిరి”. అపోస్తలులు సేవచేసిన ఇతర స్థలాల్లోలాగ ఈకొనియలో “అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగపుట్టించిరి”.AATel 125.1

    అపొస్తలులు తమ కర్తవ్యం నుంచి తొలగిపోలేదు. ఎందుకంటే అనేకులు క్రీస్తు సువార్తను అంగీకరిస్తున్నారు. ప్రతికూలత, ఈర్ష్య, ద్వేషాలు ఎదురైనావారు ‘ధైర్యముగా మాటలాడుచు” తమ పని చేసుకొంటూ పోయారు. దేవుడు “వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను.” దైవామోదాన్ని గూర్చిన ఈ నిదర్శనాలు నమ్మే మనసున్న వారి హృదయాలపై బలమైన ప్రభావం చూపాయి. సువార్తనంగీకరించిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.AATel 125.2

    అపొస్తలులు ప్రకటిస్తున్న వర్తమానం పట్ల ప్రజాదరణ పెరగటం అవిశ్వాసులైన యూదులికి కన్నుకుట్టింది. వారిలో ఈర్య ద్వేషం పెరిగాయి. పౌలు బర్నబాల పరిచర్యను తక్షణమే ఆపుచెయ్యాలని తీర్మానించుకొన్నారు. అబద్ధ సమాచారం సృష్టించి, ఆ నగరమంతా తిరుగుబాటు చేసే ప్రమాదం ఏర్పడిందని అధికారుల్ని భయ పెట్టారు. జనులు పెద్ద సంఖ్యలో అపొస్తలుల వెనుక ఉన్నారని అది ప్రమాదకరమైన రహస్య కార్యకలాపాలకేనని ప్రచారం చేశారు.AATel 125.3

    ఈ ఆరోపణల ఫలితంగా శిష్యులను తరచుగా అధికారులముందుకి తీసుకురావటం జరిగింది. అయితే వారి ప్రత్యుత్తరం స్పష్టంగా, హేతుబద్ధంగా, తాము ఏమి బోధిస్తున్నారన్న విషయమై వారి వివరణ ప్రశాంతంగా సమగ్రంగా ఉండటంతో వారి పక్షంగా ఎవరో బలమైన మద్దతు పలికారు. తాము విన్న అబద్ద సమాచారాన్ని బట్టి న్యాయాధికారులు, ద్వేషభావంతో ఉన్నా వారు వీరికి శిక్ష విధించటానికి సహసం చేయలేదు. పౌలు బర్నబాల బోధనలు మనుషుల్ని సచ్చీలురుగా చట్టాలకు విధేయులై జీవించే ప్రజలుగా తీర్చి దిద్దుతాయన్న విషయాన్ని వారు కాదనలేకపోయారు. ఆపొస్తలుల బోధల్ని ప్రజలు అంగీకరించినట్లైతే ఆ నగర ప్రజల వైతిక స్థితి మెరుగుపడ్తాదని వారు ఒప్పుకుతీరాల్సివచ్చింది. AATel 125.4

    ష్యులు ఎదుర్కొంటున్న వ్యతిరేకతద్వారా సత్యాన్ని గూర్చిన వర్తమానం ప్రజాదరణ పొందింది. కొత్త బోధకుల పనిని అడ్డుకోడానికి తాము చేసిన ప్రయత్నాలు నూతన విశ్వాసానికి ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నట్లు యూదులు గమనించారు. “ఆ పట్టణపు జన సమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి”.AATel 126.1

    విషయాలు మారుతున్న తీరునుబట్టి యూదునాయకులు క్రోధంతో నిండి తాము ఉద్దేశించిన కార్యాన్ని దౌర్జన్యంతో సాధించాలనుకున్నారు. అజ్ఞానులైన అల్లరి మూకల్ని రెచ్చగొట్టి గందరగోళం సృష్టించి దానికి కారణం శిష్యుల బోధలే అని విమర్శించారు. ఈ తప్పుడు నేరారోపణలతో న్యాయాధికారుల మద్దతు పొంది తమ దుష్కార్యాన్ని నెరవేర్చుకోవాలని వారు భావించారు. అపొస్తలులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయటానికి తరుణం ఇవ్వకూడదని, పౌలు బర్నబాల్ని రాళ్ళతో కొట్టటంద్వారా జనసమూహం జోక్యం చేసుకోవాలని ఆ రకంగా వారి పనికి ముగింపు తేవాలని వారు నిశ్చయించుకున్నారు.AATel 126.2

    అపొస్తలుల మిత్రులు క్రైస్తవ విశ్వాసులు కాకపోయినా, యూదుల దురా లోచనల గురించి శిష్యుల్సి హెచ్చరించి జనసమూహాల ఆగ్రహానికి అనవసరంగా గురికావద్దని ప్రాణాలు కాపాడుకోటానికి వాళ్ళనుంచి తప్పించుకొని పారిపోటం మంచిదని వారికి హితవు చెప్పారు. ఆ ప్రకారంగానే పౌలు బర్నబాలు ఈకొనియ నుంచి రహస్యంగా వెళ్ళిపోయారు. వారి సేవను కొంతకాలం విశ్వాసులే కొనసాగించాల్సి ఉన్నారు. కాని వారు మాత్రం ఆ స్థలాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోలేదు. ప్రజల ఆవేశకావేషాలు సర్దుమణిగిన తర్వాత తిరిగి వచ్చి తాము ప్రారంభించిన పనిని ముగించాలన్నది వారి సంకల్పం.AATel 126.3

    ప్రతీ యుగంలోను ప్రతీ దేశంలోను దేవుని సత్యాన్ని విసర్జించటానికి తీర్మానించుకొనేవారినుంచి దైవ సేవకులు తీవ్రవ్యతిరేకతను ఎదుర్కోటం జరుగుతుంటుంది. తరచు అపార్థాలు అబద్దాలద్వారా సువార్త విరోధులు విజయాలు సాధిస్తున్నట్లు కనిపిస్తారు. ప్రజల్ని కలుసుకొని వారితో మాట్లాడే మార్గాల్ని మూసివేయటంలో జయం పొందుతున్నట్లు కనిపిస్తారు. కాని ఈ మార్గాలు నిత్యం మూతపడి ఉండవు. తరచు కొంత వ్యవధి అనంతరం దైవ సేవకులు తమ సేవను కొనసాగించటానికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు వారి పక్షంగా అద్భుత కార్యాలు చేసి తన నామ మహిమార్థం స్మారక చిహ్నాలు స్థాపించటానికి. వారికి దోహదం చేస్తాడు.AATel 126.4

    ప్రబలుతున్న హింసవల్ల ఆ పోస్తలులు ఈ కొనియ విడిచి పెట్టి లుకయునియలోని లుస్త్ర దెర్బె పట్టణాలకు వెళ్ళారు. ఈ పట్టణ నివాసుల్లో చాలామంది మూఢనమ్మకాలుగల అన్యులు. కాగా వారిలో కొందరు సువార్తను విని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్న ప్రజలున్నారు. ఈ పట్టణాల్లోను వాటి చుట్టూ ఉన్న ప్రదేశాల్లోను సేవచేయటంద్వారా యూదులమంచి ఎదురవుతున్న వ్యతిరేకతమ హింపను తప్పించుకోవచ్చునని భావించారు.AATel 127.1

    లుస్తలో కొంతమంది యూదులున్నా యూదుల సమాజమందిరంలేదు. లష్ట్ర పట్టణ ప్రజల్లో అనేకమంది బృహస్పతి ఆలయంలో పూజలు చేస్తున్నారు. పౌలు బర్నబాలు ఆ పట్టణంలో సంచరించి ఆ పట్టణ వివాసుల్ని సమావేశపర్చి వారికి సువార్త సత్యాల్ని వివరిస్తున్న తరుణంలో ఆ సిద్ధాంతాల్ని బృహప్పతి పూజకు సంబంధించిన విషయాలతో ముడి పెట్టటానికి చాలామంది ప్రయత్నించారు.AATel 127.2

    విగ్రహారాధకులైన ఈ ప్రజలకు సృష్టికర్త అయివ దేవుని గూర్చి మానవాళి రక్షకుడైన దైవ కుమారుణ్ని గూర్చి బోధించటానికి ఆపొస్తలులు ప్రయత్నించారు. తొలుత అద్భుతమైన దైవ కార్యాలికి అనగా సూర్యచంద్ర నక్షత్రాలకు, రుతువుల క్రమానికి, మంచు మకుటాలు ధరించిన బ్రహ్మాండమైన పర్వతాలకు, మానవ అవగాహనకు మించిన నిపుణతను మేధను చాటే ఎత్తయిన వృక్షాలు మొదలైన ప్రకృతి వింతలకు వారి గమనాన్ని తిప్పారు. సర్వశక్తుని ఈ కార్యాలద్వారా ఆ అమ్యలు విశ్వపాలకుడైన దేవుని తెలుసుకోటానికి వారి మనసుల్ని ఈ అపోస్తులులు నడిపిస్తున్నారు.AATel 127.3

    ఈ అపొస్తలులు సృష్టికర్తను గూర్చిన ఈ ప్రాథమిక సత్యాల్ని లుస్ట్ర ప్రజలకు విశదపర్చిన తర్వాత దైవకుమారుడు మానవుల్ని ప్రేమించాడు గనుక ఆయన పరలోకంనుంచి ఈలోకంలోకి వచ్చాడని చెప్పారు. ఆయన జీవితం గురించి, ఆయన చేసిన పరిచర్యగురించి తాను రక్షించటానికి వచ్చిన ప్రజలు ఆయనను విసర్జించటం గురించి, ఆయన తీర్పును గురించి, ఆయనకు విధించిన సిలువ మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన పరలోకానికి ఆరోహణ మవ్వటం గురించి, అక్కడ ఆయన మానవుల పక్షంగా ఉత్తరవాదిగా వ్యవహరించటం గురించి వారు మాట్లాడారు. ఈ రీతిగా పౌలు బర్నబాలు దేవుని ఆత్మతోను దేవుని శక్తితోను లు(స్త్రలో సువార్తను ప్రకటించారు.AATel 127.4

    వ్యాధిగ్రస్తుల్ని స్వస్తపర్చేవాడుగా యేసు సేవను గూర్చి ఒకప్పుడు పౌలు ప్రజలతో చెబుతున్నప్పుడు సభలో ఒక వికలాంగుణ్ని చూశాడు. అతడు పౌలు పంకే చూస్తూ చెప్తున్న మాటల్ని హృదయపూర్వకంగా విశ్వసించాడు. ఆ వికలాంగుడి పట్ల పౌలుకి జాలి పుట్టింది. “స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి” విగ్రహారాధకులైన ఆ జాసమూహం ముందు లేచి తన కాళ్ళపై నిలబడమని పౌలు ఆజ్ఞాపించాడు. అంతవరకు ఆ అవిటివాడు కూర్చొని మాత్రమే ఉండగలిగేవాడు. కాని ఇప్పుడతడు పౌలు ఆజ్ఞామ వెంటనే శిరసావహించాడు. తన బతుకులో మొట్టమొదటిసారిగా లేచి నిలబడ్డాడు. విశ్వాసంతో చేసిన ఈ ప్రయత్నంలో శక్తి వచ్చింది. ఆ వికలాంగుడు “గంతులువేసి నడువపాగెను”AATel 127.5

    జనసమూహములు పౌలు చేసిన దాని చూచి లుకయొనియ భాషలో . దేవతలు మనుష్యు రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చియున్నారని కేకలు” - వేశారు. దేవతలు అప్పుడప్పుడు భూమిని సందర్శిస్తారు అన్నవారి సాంప్రదాయానికి ఈ చిత్రీకరణ అనుగుణంగా ఉంది. తన రూపాన్ని బట్టి, హుందాతనాన్ని బట్టి, తన ముఖంలో కనిపించే ఔదార్యాన్ని బట్టి బర్నబాని దేవతల తండ్రి అయిన బృహస్పతి అన్నారు. “ముఖ్యప్రసంగియైనందువ” పట్టుదల కలిగి చురుకుగా వ్యవహరిస్తున్నందున, హెచ్చరిక ఉపదేశం ఇవ్వటంలో చక్కగా మాట్లాడున్నందున పౌలుని వారు హెర్మే అన్నారు.AATel 128.1

    అపొస్తలులికి తమ కృతజ్ఞతను వ్యక్తంచెయ్యటానికి ఆతృతగా ఉన్న లుస్త్ర ప్రజలు వారిని గౌరవించటానికి బృహస్మతి పూజారిని ప్రోత్సహించగా అతడు “యెడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలెనని యుండెను” పౌలు బర్నబాలు విశ్రాంతి తీసుకోటానికి ప్రయత్నిస్తున్నారు. వారికి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు గురించి ఏమీ తెలియదు. కాసేపటికి వారు బస చేసిన ఇంటి వద్దకు సంగీతంతోను కేకలతోను ప్రజలు రావటం వారు గుర్తించారు.AATel 128.2

    ఆ ప్రజల రాకకు వారి ఆనందోత్సాహానికి కారణం ఏంటని అపొస్తలు ప్రశ్నించి తెలుసుకొన్నప్పుడు వారు “తమ వస్త్రములను చించుకొని సమూహములోనికి చొరబడి” ఆ కార్యాన్ని ఆపటానికి పూనుకొన్నారు. పౌలు గొంతెత్తి పెద్ద స్వరంతో ప్రజల్ని సంబోధించగా గోలతగ్గింది. పౌలిలా అన్నాడు, “అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వవభాము గలవారమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరిగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారమునను గ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుటచేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండ చేయలేదు”.AATel 128.3

    తాము దేవుళ్ళంకామని అపొస్తలులు ఖండితంగా చెబుతున్నప్పటికీ, పూజింపదగినవాడు దేవుడొక్కడేనని వారికి బోధించటానికి పౌలు ఎంతగానో ప్రయత్నిస్తున్నపటికీ ఆ అన్యులు తాము తల పెట్టిన బలి అర్పణ కార్యక్రమాన్ని విరమించుకోటం లేదు. ఈ మనుష్యులు దేవుళ్ళేనన్నది వారి నిశ్చితాభిప్రాయం. వారి ఉత్సాహం పట్టుదల ఎంతో గొప్పది అయినందువల్ల వారు తమ దోషాన్ని గుర్తించటం లేదు. వారిని ఆపటం “బహు ప్రయాసమాయెను” అని దాఖలాలు చెబుతున్నాయి.AATel 129.1

    అపొస్తలుల అద్భుత శక్తిని తామే స్వయంగా చూశామన్నది లుస్త్ర ప్రజల హేతువాదం. మునుపు ఎన్నడూ నడవని మనిషి నడవటం సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి సంతోషించటం వారు చూశారు. ఎంతో కష్టం మీద పౌలు వారిని ఒప్పించాక దేవుని ప్రతినిధులుగాను మహావైద్యుడు దేవుని కుమారుడు అయిన యేసు ప్రతినిధులుగాను తాను బర్నబా చేస్తున్న పరిచర్యను విశదం చేసిన మీదటే ఆ ప్రజలు తమ యత్నాన్ని విరమించుకొన్నారు.AATel 129.2

    పౌలు బర్నబాలు లుస్త్రలో చేస్తున్న పరిచర్య అకస్మాత్తుగా ఆగిపోయింది. “అంతియొకయనుండియు ఈకొనియ నుండియు యూదులు” కొందరు లుస్త్ర ప్రజలమధ్య అపొస్తలుల పరిచర్య విజయవంతమైనట్లు తెలుసుకొని ద్వేషపూరితులై వారిని వెంబడించి హింసించాలని నిర్ధారించుకొన్నారు. లుస్త్ర చేరుకొన్న తర్వాత ఈ యూదులు లుస్త్ర ప్రజల్లో తమలోని ద్వేషభావాన్ని వెదజల్లారు. ఇటీవలే పౌలు బర్నబాల్ని దేవుళ్ళుగా పరిగణించిన ప్రజలే యూదుల అసత్యవర్ణనలు దూషణనలవల్ల అపొస్తలుల్ని ఇప్పుడు హంతకులకన్నా ఘోరమైన నేరస్తులుగా భావించి వారు మరణార్హులని విమర్శిస్తున్నారు. అపొస్తలులికి బలి అర్పించటానికి ఆమోదం లభించనందుకు నిరాశ చెందిన లుస్త్ర ప్రజలు పౌలు బర్నబాల్ని తీవ్రంగా వ్యతిరేకించటానికి సిద్ధమయ్యారు. యూదులు తమను రెచ్చగొట్టగా వారు అపొస్తలుల పై దాడి చెయ్యటానికి ఆయత్తమయ్యారు. పౌలు మాట్లాడటానికి ఆమోదించవద్దని అతణ్ని మాట్లాడనిచ్చినట్లయితే ప్రజల్ని అతడు మంత్రముగ్ధుల్ని చేస్తాడని లుస్త్ర ప్రజల్ని హెచ్చరించారు.AATel 129.3

    సువార్త వ్యతిరేకుల పన్నాగాలే కొద్దికాలంలో అమలయ్యాయి. లుస్త్ర ప్రజలు దుష్ప్రభావానికి లోనై సాతాను సంబంధమైన ఆగ్రహావేశాలతో పౌలును పట్టుకొని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. తన మరణం సమీపించిందని అపొస్తలుడు భావించాడు. సెఫను హతసాక్ష్యం ఆ సమయంలో తాను నిర్వహించిన పాత్ర పౌలు మనసులో మెదులాడింది. ఒళ్ళంతా దెబ్బలతో తీవ్రమైన బాధతో మూలుగుతూ పౌలు నేల కూలాడు. అంతట ఆగ్రహంతో రెచ్చిపోతున్న జనసమూహం “అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి”.AATel 129.4

    పౌలు బర్నబాల పరిచర్య మూలంగా క్రీస్తును విశ్వసించిన లుస్త్ర విశ్వాసుల గుంపు చీకటితో నిండిన ఈ పరీక్షా సమయంలో నమ్మకంగా నిలిచింది. నిర్దేతుకమైన ఈ వ్యతిరేకత, క్రూరమైన ఈ హింస భక్తిపరులైన ఈ విశ్వాసుల విశ్వాసాన్ని దృఢపర్చింది. ప్రమాద భరితమైన ఈ పరిస్థితిలో చనిపోయాడని తాము భావించిన పౌలు చుట్టూ సమావేశమవ్వటం ద్వారా వారు తమ విశ్వసనీయతను ప్రదర్శించారు.AATel 130.1

    విశ్వాసులు శోకిస్తూ ఉండగా అపోస్తలుడు హఠాత్తుగా తల పైకెత్తి దేవున్ని స్తోత్రిస్తూ లేచి నిలబడ్డాడు. అనుకోని విధంగా దైవ సేవకుడు బతకటం దేవుని శక్తివలన జరిగిన అద్భుత కార్యంగా విశ్వాసులకు కనిపించింది. తమ విశ్వాస మార్పిడికి దేవుని ఆమోద ముద్రగా వారు దాన్ని గ్రహించారు. ఎంతో సంతోషించి వారు దేవుని స్తుతించారు. వారి విశ్వాసం బలపడింది.AATel 130.2

    లుస్త్రలో యేసు విశ్వాసాన్ని స్వీకరించిన వారిలో ఒకడు పౌలు శ్రమల్ని కళ్ళారా చూసినవాడు, అనంతరం క్రీస్తుకు ప్రముఖ సేవకుడు కానున్నవాడు, కష్టతరమైన స్థలాల్లో దైవ సేవను ప్రారంభించటంలో ఎదురు కానున్న సుఖదు:ఖాల్ని పౌలుతో పాలుపంచుకోనున్నవాడు అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడే యువకుడైన తిమోతి. ప్రజలు ఆ పట్టణంలో నుంచి పౌలును ఈడ్చుకు వెళ్తున్నప్పుడు చూసినవారిలోను, ప్రాణంపోయినట్లు కనిపించిన ఆ దేహం పక్క నమ్మకంగా నిలిచిన వారిలోను, రక్తం కారుతున్న గాయాలతో లేచి నిలబడటం చూసినవారిలోను, తాను క్రీస్తు నిమిత్తం శ్రమలనుభవించటానికి తనకు తరుణం లభించినందుకు అతడు దేవున్ని సన్నుతించటం విన్నవారిలోను ఈ యువ శిష్యుడు ఒకడు.AATel 130.3

    పౌలుని రాళ్ళతో కొట్టిపట్టణం వెలుపట పడేసిన మరుసటి దినం అపొస్తలులు దెర్బేకు వెళ్ళారు. అక్కడ వారి సేవలు ఫలభరితమయ్యాయి. పలువురు క్రీస్తును తమ రక్షకుడుగా స్వీకరించారు. కాని “వారు ఆ పట్టణములో (లుస్త్రలో) సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత” తాము ఇటీవల పరిచర్య చేసి విడిచి పెట్టాల్సి వచ్చిన స్థలంలో ఉన్న విశ్వాసుల్ని విశ్వాసంలో స్థిరపర్చకుండా విడిచి పెట్టి వేరే స్థలంలో పరిచర్య చేయటానికి వీలుగాని బర్నబాగాని ఇష్టపడలేదు. కనుక పొంచి ఉన్న ప్రమాదానికి భయపడకుండా “లుస్త్రకును ఈ కొనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు నిలుకడగా ఉండవలెనని... వారిని హెచ్చరించిరి” సంతోషకరమైన సువార్తను అనేకమంది స్వీకరించి తద్వారా అపనిందలకు వ్యతిరేకతకు తమ్మును తాము గురిచేసుకొన్నారు. తాను చేసిన సేవ సుస్థిరత సాధించాలన్న ఉద్దేశంతో వీరిని విశ్వాసంలో పటిష్ఠపర్చటానికి ఈ అపోస్తలులు పాటుపడ్డారు.AATel 130.4

    సువార్త క్రమంలోని రక్షణల్ని నూతన విశ్వాసుల చుట్టూ ఉంచటానికి జాగ్రత్త తీసుకోటంద్వారా అపొస్తలులు వారి పెరుగుదలకు ప్రాముఖ్యాన్నిచ్చారు. లుక యొనియ పిసిదియాల్లో విశ్వాసులున్న స్థలాలన్నిటిలో సంఘాలు వ్యవస్థీకృతమయ్యాయి. ప్రతీ సంఘంలోను అధికార్ల నియామకం జరిగింది. విశ్వాసుల ఆధ్యాత్నిక క్షేమాభివృద్ధికి క్రమ పద్ధతి స్థాపితమయ్యింది.AATel 131.1

    క్రీస్తు విశ్వాసులందరూ ఒక సంఘంగా ఏర్పడటమన్నది సువార్త ప్రణాళికకు అనుగుణమైన విషయం. ఈ ప్రణాళికను తన సువార్త సేవ అంతటిలోను పౌలు శ్రద్ధగా అనుసరించాడు. ఏ స్థలంలోనైనా తన పరిచర్యద్వారా ప్రజలు క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తే వారిని సరియైన కాలంలో ఒక సంఘంగా వ్యవస్తీకరించేవాడు. విశ్వాసుల సంఖ్య పెద్దది కాకపోయినా వారిని సంఘంగా ఏర్పాటు చేసేవాడు. “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును” (మత్తయి 18:20) అన్న ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకొని ఒకరికొకరు సహాయమందించుకోటానికి క్రైస్తవులికి ఇలా నేర్పించటం జరిగింది.AATel 131.2

    అలా స్థాపితమైన సంఘాల్ని పౌలు మర్చిపోలేదు. ఈ సంఘాల సంరక్షణ అతని హృదయం పై పెరుగుతున్న భారమయ్యింది. విశ్వాసుల సమూహం ఎంత చిన్నదైనా అది నిత్యం అతని మనసులో, ఆలోచనల్లో ఉండేది. చిన్న సంఘాల్ని అతడు నిత్యం ప్రేమాదరాలో కని పెడ్తూ ఉండేవాడు. సభ్యులు సత్యం విషయంలో బలోపేతులు కావటానికి, తమ చుట్టూ ఉన్న ప్రజలకోసం వారు స్వార్థరహితంగా పనిచేయటం నేర్చుకోటానికి వారి పై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గుర్తించి పౌలు చిన్న సంఘాల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొన్నాడు.AATel 131.3

    త్యాగనిరతి ఆత్మల విషయంలో నమ్మకమైన, యధార్థమైన కృషి అన్న క్రీస్తు ఆదర్శాన్ని పౌలు బర్నబాలు తమ మిషనెరీ పరిచర్య అంతటిలోను అవలంబించారు. వారు నిత్యం అప్రమత్తంగా ఉండి ఉద్రేకోత్సాహాలతో అవిశ్రాంతంగా పనిచేశారు. వారు ఇష్టాయిష్టాన్ని గాని వ్యక్తిగత సౌకర్యాన్నిగాని పరిగణలోకి తీసుకోలేదు. ప్రార్థనతో ఆందోళనతో నిండిన హృదయాలతో నిర్విరామ కృషితో వారు సత్యాన్ని విస్తారు. సత్యాన్ని విత్తటంతోపాటు సత్యాన్ని స్వీకరించేందుకు తీర్మానించుకొన్నవారికి అత్యంత విలువైన ఉపదేశాన్ని ఇచ్చారు. నూతన విశ్వాసుల్లో ఈ చిత్తశుద్ధి ఈ పరిశుద్ధభయభీతులు సువార్త ప్రాముఖ్యంపై చెరగని ముద్రవేశాయి.AATel 131.4

    తిమోతి వంటి ప్రతిభ పాటవాలుగల మనుషులు క్రైస్తవాన్ని స్వీకరించినప్పుడు దైవ సేవాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరాన్ని వారికి వివరించటానికి పౌలు బర్నబాలు ప్రయత్నించారు. ఆ అపొస్తలులు మరో స్థలానికి వెళ్ళినప్పుడు ఈ సభ్యుల విశ్వాసం క్షీణించలేదు. వృద్ది చెందింది. వారు ఆధ్యాత్మిక విషయాల్లో పటిష్ఠమైన ఉపదేశం ఇచ్చారు. తమ తోటి మానవుల రక్షణార్థం స్వార్థరహితంగా, నిజాయితీగా, ఓర్పుతో ఎలా కృషి చెయ్యాలో వారికి నేర్పించారు. పౌలు బర్నబాలు అన్యజనుల మధ్య సువార్త పరిచర్య చేసినప్పుడు వారు కొత్త విశ్వాసులకు శ్రద్ధగా ఇచ్చిన ఈ శిక్షణే వారి విజయానికి ప్రబల కారణం.AATel 131.5

    మొదటి మిషనెరీ ప్రయాణం వేగంగా ముగింపుకు వస్తున్నది. నూతనంగా వ్యవస్థీకృతమైన సంఘాల్ని ప్రభువుకి సమర్పిస్తూ ఈ అపొస్తలులు పంపూలియాకు వెళ్ళారు. “మరియు పెర్గీలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడనుండి ఓడ యెక్కి... అంతియొకయకు తిరిగి వచ్చిరి”.AATel 132.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents