Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    57—ప్రకటన గ్రంథం

    అపొస్తలుల కాలంలో క్రైస్తవ విశ్వాసులు ఉత్సాహోద్రేకాల్తో నిండి ఉండేవారు. వారు ఎంత కష్టపడి పనిచేశారంటే, తీవ్ర వ్యతిరేకత ఎదురైనా క్రీస్తు రాజ్యసువార్త లోకంలో అన్ని ప్రాంతాలకు స్వల్పకాలంలోనే చేరింది. ఆ కాలంలో యేసు అనుచరులు ప్రదర్శించిన ఉత్సాహాన్ని ప్రతీయుగంలోని విశ్వాసులు స్ఫూర్తిగా పొందేందుకుగాను ఆత్మావేశం పొందిన ప్రవక్త దాన్ని దాఖలు చేసి ఉంచాడు. అపొస్తలుల యుగంలో యావత్ క్రైస్తవ సంఘానికి చిహ్నంగా యేసు ప్రభువు ఎఫెసులోని సంఘాన్ని ఉపయోగించాడు. ఈ సంఘనీ గురించి నమ్మకమైన సత్యసాక్షి ఇలా ప్రకటించాడు:AATel 415.1

    “నీ క్రియలను నీ కష్టమును నీ సహనమ్మను నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.” ప్రకటన 2:2.3.AATel 415.2

    ఎఫెసులోని సంఘం చిన్న పిల్లలాంటి అమాయకత్వం, ఉద్రేకం కలిగి ఉండేది. దేవుని ప్రతీ మాటను ఆచరించటానికి విశ్వాసులు చిత్తశుద్ధితో కృషిచేసేవారు. వారి జీవితాలు క్రీస్తు పట్ల తమ యధార్థ ప్రేమను వెల్లడిచేసేవి. రక్షకుడు వారి హృదయాల్లో నివసిస్తూ ఉండేవాడు గనుక ఆయన చిత్తాన్ని వారు ఆనందంతో జరిగించేవారు. వారి హృదయాలనిండా రక్షకుని పట్ల ప్రేమ ఉండటంతో ప్రభువుకు ఆత్మలను సంపాదించటం వారి ప్రధానాంశమయ్యింది. క్రీస్తు కృప ఐశ్వర్యాన్ని దాచుకోవాలన్న తలంపు వారికి రాలేదు. వారు తమ పిలుపు ప్రాముఖ్యాన్ని గుర్తించారు. ” ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక” అన్న వర్తమాన భారంతో రక్షణ సువర్తమానాన్ని లోకం మారుమూలలకు తీసుకువెళ్లాలని ఉత్సాహంతో ముందంజ వేశారు. వారు క్రీస్తుతో ఉన్నవారని లోకం గుర్తించింది. పశ్చాత్తాపం పొంది, క్షమాపణ పొంది, శుద్ధి పొంది పరిశుద్ధులైన పాపులు దేవుని కుమారుని ద్వారా దేవునితో భాగస్వాములయ్యారు.AATel 415.3

    సంఘ సభ్యులంతా ఉద్దేశంలోను కార్యాచరణలోను ఏకమనస్కులయ్యారు. క్రీస్తు పట్ల ప్రేమే వారిని ఐక్యంగా ఉంచిన బంగరు గొలుసు. ఇలా కొనసాగుతూ వారు ప్రభువును మరెక్కువగా గ్రహించగలిగారు. వారి జీవితాల్లో క్రీస్తు తాలూకు సంతోషం సమాధానం వెల్లడయ్యాయి. వారు తండ్రి లేనివారిని, బాధల్లోవున్న విధవరాండ్రను సందర్శించి లోకం గుర్తింపుకు దూరంగా ఉన్నారు. అలా చెయ్యకపోవటం వారి విశ్వాసానికి విరుద్ధం తమ విమోచనకుణ్ని ఉపేక్షించటం అవుతుందని వారు గుర్తించారు.AATel 416.1

    ప్రతీ నగరంలోను క్రీస్తు సేవ ముందుకు సాగింది. ప్రజలు మారుమనసుపొంది క్రీస్తును స్వీకరించారు. విశ్వాసులైనవారు తాము పొందిన మహదైశ్వర్యాన్ని ఇతరులకు పంచాలని భావించారు. తమ మనసుల్ని వికాసంతో నింపిన వెలుగు ఇతరుల పై కూడా ప్రకాశించేంతవరకు వారు విశ్రమించలేకపోయారు. వేలాదిమంది అవిశ్వాసులకు క్రైస్తవ నిరీక్షణను గూర్చి తెలియజేశారు. అపరాధులు వెలివేతకు గురైనవారికి, సత్యం తెలిసిన వారమని చెప్పుకుంటూ దేవుని ప్రేమించటంకన్నా లోకాన్నే ఎక్కువ ప్రేమించేవారికి, ప్రేమపూర్వకమైన, వ్యక్తిగతమైన విజ్ఞాపనలు చేశారు.AATel 416.2

    అయితే కొంత కాలమైన తర్వాత విశ్వాసుల ఉత్సాహం చల్లారసాగింది. దేవునిపట్ల, ఒండొరులపట్ల వారి ప్రేమ క్షీణించింది. సంఘంలో ఉదాసీన, నిరాసక్త వాతావరణం నెలకొన్నది. కొందరు తమకు సత్యం వచ్చిన అద్భుతమైన తీరును మర్చిపోయారు. వృద్ధ ప్రబోధకులు తమ తమ విధి నిర్వహణలో ఒకరి తర్వాత ఒకరు కూలిపోయారు. ఈ అగ్రగాముల భారాల్ని పంచుకుని తద్వారా విజ్ఞతాయు తమైన నేతృత్యానికి సన్నద్ధపడివుండగల కొందరు యువకార్యకర్తలు తాము తరచువింటున్న సత్యాలతో అలసిపోయారు. సంచలనం రేపే ఏదో కొత్తదనాన్ని కోరుతూ వారు సిద్ధాంతం నూతన అవతారాల్ని ప్రవేశపెట్టటానికి ప్రయత్నించారు. అవి పలువురు మనసులకు నచ్చేవి కాని సువార్త మౌలిక సూత్రాలకు విరుద్ధం. ఆత్మ విశ్వాసంతోను ఆధ్యాత్మిక గుడ్డితనంతోను ఉన్నవారు ఈ తప్పుడు సిద్ధాంతాలు అనేకుల్ని తమ గతానుభవాల్ని శంకించటానికి నడిపించి తద్వారా గందరగోళం అపనమ్మకం సృష్టిస్తాయని గ్రహించలేకపోయారు. AATel 416.3

    ఈ తప్పుడు సిద్ధాంత బోధలవల్ల విభేదాలు తలెత్తాయి. తమ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసునుంచి అనేకుల దృష్టి మరలిపోయింది. సువార్త ప్రచారంలో గడపవలసిన సమయాన్ని సిద్ధాంతపరమైన అల్పవిషయాల చర్చల్లో ఆసక్తికరమైన కట్టుకథలు వినటంలో వ్యర్ధపుచ్చారు. నమ్మకమైన సత్య ప్రబోధం జరిగితే మారుమనసు పొంది విశ్వాసులై ఉండే ప్రజలెందరో ఆ అవకాశం పొందకుండా మిగిలిపోయారు. భక్తి ఆందోళనకరంగా సన్నగిల్లింది. క్రీస్తు అనుచరులుగా చెప్పుకొంటున్న అనేకమంది విషయంలో సాతానుది పైచెయ్యి అవుతున్నట్లు కనిపించింది.AATel 416.4

    సంఘ చరిత్రలోని ఈ క్లిష్ట సమయంలో యోహాను బహిష్కరణ చోటుచేసు కుంది. అతడి స్వరం సంఘానికి క్రితంలోకన్నా ఇప్పుడు ఎంతో అవసరం. తన పూర్వ సహచరులు దాదాపు అందరూ హతసాక్షులయ్యారు. మిగిలివున్న కొద్దిమంది విశ్వాసులూ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. AATel 417.1

    క్రీస్తు సంఘ విరోధులు విజయం సాధించే రోజు ఎంతో దూరంలో లేదనటానికి సూచనలు కనిపిస్తునట్లుంది.AATel 417.2

    ఇలాగుండగా ప్రభువుహస్తం కనిపించకుండా చీకటిలో కదలటం ప్రారంభిం చింది. తన్నుగూర్చిన క్రీస్తు అద్భుత ప్రకటనను, సంఘాల వికాసం నిమిత్తం దైవ సత్యాన్ని తన సంకల్పం చొప్పున యోహానుకి అందించగల స్థలంలో దేవుడు యోహానుని ఉంచాడు.AATel 417.3

    యోహాన్ను బహిష్కరించటంలో దేవుని విశ్వసనీయ సాక్షి స్వరం ఇక ఎన్నడూ వినిపించకుండా ఆపాలని సత్యవిరోధులు సంకల్పించారు. కాని పత్మాసు ద్వీపంలో ఆ శిష్యుడికో వర్తమానం వచ్చింది. ఆ వర్తమాన ప్రభావం లోకాంతం వరకూ సంఘాన్ని బలోపేతం చేస్తూ కొనసాగాల్సివుంది. యోహానుని దేశంనుంచి బహిష్కరించిన వారు తమ దుశ్చర్యకు బాధ్యత వహించాల్సివున్నప్పటికీ, తన ఉద్దేశాల నెరవేర్పులో సాధనాలుగా దేవుడు వారినే ఉపయోగించుకున్నాడు. సత్యజ్యోతిని ఆర్పివేయ టానికి జరిగిన ప్రయత్నమే ఆ సత్యం బలమైన విశ్వాసంగా రూపొందటానికి సాధన మయ్యింది.AATel 417.4

    దేశ బహిష్కృతుడైన అపొస్తలునికి మహిమ ప్రభువు సబ్బాతు నాడు దర్శన మిచ్చాడు. యూదయ నగరాలు పట్టణాల్లోని ప్రజలకు సువార్త బోధించిన దినాల్లో సబ్బాతును ఎలా పరిశుద్ధంగా ఆచరించాడో పత్మాసు ద్వీపంలోనూ యోహాను అలాగే సబ్బాతును ఆచరించాడు. ఆ దినాన్ని గూర్చి తాను చేసిన అమూల్వ వాగ్దానాల్ని తన విషయంలో నెరవేర్చాల్సిందిగా యోహాను ప్రభువును అర్ధించాడు. యోహాను ఇలా రాస్తున్నాడు, “ప్రభువు దినమందు ఆత్మవశుడనై యుండగా బూరధ్యనివంటి గొప్పస్వరము - నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సాఫ్టస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడతిరిగితిని. తిరుగగా ఏడు సువర్ల దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని.” ప్రకటన 1:10-13.AATel 417.5

    ఈ అనుంగు శిష్యుడు దేవుని విశేషానుగ్రహం పొందినవాడు. అతడు తన ప్రభువును గెత్సెమనే తోటలో చూశాడు. ఆయన ముఖం పై శ్రమవల్ల ఏర్పడ్డ రక్త బిందువులున్నాయి. “ఏ మనిషి రూపముకంటే అతని ముఖమును నరరూపముకంటే అతని రూపమును చాల వికారము” యెషయా 52:14. రోమా భటుల చేతిలో ప్రభువును పాత ఊదారంగు అంగీతో, ముళ్ల కిరీటంధరించి ఉండటం యోహాను చూశాడు. ఎహగతాళికి, పలువిధ శ్రమలకు గురైన ఆయన సిలువుపై వేళాడటం చూశాడు. ఇప్పుడు యోహాను మరోమారు ప్రభువును వీక్షించటానికి అనుమతి లభించింది. ఆయన రూపం ఎంతగా మారిపోయింది! తృణీకారానికి అవమానానికి గురైనవాడు దుఃఖాక్రాంతుడు ఇకకాడు. ఆయన వస్త్రం ప్రచండ తేజస్సుగల పరలోక వస్త్రం. “ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్యాలవలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమైయుండెను.” ప్రకటన 114,15,17. ఆయన స్వరం విస్తారజలాల సంగీత సునాదంలా ఉంది. ఆయన ముఖం సూర్వునిలా ప్రకాశిస్తుంది. ఆయన చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుంచి రెండంచులుగల పదునైన ఖడ్గం బయల్వెడలుతున్నది. ఆయన వాక్యం తాలూకు శక్తికి అది చిహ్నం. తిరిగి లేచిన ప్రభువు మహిమతో పత్మాసు ద్వీపమంతా ధగధగలాడుతున్నది.AATel 418.1

    యోహాను ఇలా రాస్తున్నాడు, ” నే నాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్దపడితిని. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను - భయపడకుము.” 17వ వచనం. -AATel 418.2

    మహిమ ప్రభావపూరితుడైన ప్రభువు సమక్షంలో బతికిఉండేందుకు యోహాను బలం పొందాడు. అప్పుడు విస్మయంతో నిండిన పరలోక మహిమలు అతని కన్నుల ముందుకువచ్చాయి. యోహానుకి దేవుని సింహాసనాన్ని చూసే ఆధిక్యత కలిగింది. లోకంలోని సంఘర్షణల్ని దాటిపోయి విమోచన పొంది తెల్లని వస్త్రాలు ధరించిన భక్తుల సమూహాన్ని చూసే ఆధిక్యత పొందాడు. పరలోక దూతల సంగీతం విన్నాడు. గొర్రెపిల్ల రక్తం ద్వారాను, తమ సాక్ష్యం ద్వారాను విజయం సాధించిన భక్తజనుల గానం విన్నాడు. తనకు కలిగిన ప్రత్యక్షతలో దైవ ప్రజల అనుభవంలోని ఆశావహమైన సన్నివేశాలు ఒకదాని వెంట ఒకటి ఆవిష్కృతమయ్యాయి. లోకాంతం వరకు జరగనున్న సంఘ చరిత్ర ముందుగానే యోహానుకి ఆవిష్కృతమయ్యింది. అతి ప్రాముఖ్యమైన అంశాల్ని ఛాయలు, చిహ్నాల రూపంలో ప్రభువు యోహానుకి ఇచ్చాడు. తన కాలంలో నివసిస్తున్న ప్రజలు భావియుగాల్లో నివసించనున్న ప్రజలు తమ ముందున్న అపాయాలు సంఘర్షణల్ని గురించి మంచి అవగాహనను కలిగి ఉండేందుకు యోహాను వాటిని దాఖలు చేయాల్సిందిగా దేవుడు ఆదేశించాడు.AATel 418.3

    క్రైస్తవయుగం పొడవున సంఘానికి మార్గనిర్దేశం కోసం ఓదార్పుకోసం దేవుడు ప్రకటన గ్రంథాన్నిచ్చాడు. అయినా దాన్ని మూతపడ్డ గ్రంథం అని వర్ణించి అందులోని మర్మ విషయాల్ని విశదం చెయ్యటానికి లేదని మత గురువులు తేల్చిచెప్పారు. అందుచేత అనేకులు ప్రవచనాల్ని దూరంగా ఉంచుతూ వాటిలోని మర్మాల్ని అధ్యయనం చెయ్యటానికి సమయం తీసుకోటానికి ఇష్టపడటం లేదు. అయితే తన ప్రజలు ఈ పుస్తకాన్ని అలా పరిగణించకూడదని దేవుడు కోరుతున్నాడు. అది “యేసు క్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత.” ప్రభువిలా అంటున్నాడు. ఆ సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు.” 1,3 వచనాలు. “ఈ గ్రంథ మందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా - ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసియెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు - అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు.” ప్రకటన 22:18-20.AATel 419.1

    ప్రకటన గ్రంథంలో లోతైన దైవ సంగతున్నాయి. ఈ ఆవేశపూరిత గ్రంథం పేరు “ప్రకటన”. ప్రకటన అన్న పేరే అది మూతపడివున్న పుస్తకమన్న వాదనను ఖండిస్తుంది. ప్రకటన అంటే తెలియపర్చేది. ఈ పుస్తకంలో వున్న మర్మాల్ని స్వయంగా ప్రభువే తన సేవకునికి బయలుపర్చాడు. ఆ మర్మాలు అందరూ అధ్యయనం చెయ్యటానికి అందరికి అందుబాటుకావాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. దానిలోని సత్యాలు లోక చరిత్ర చివరి దినాల్లో నివసిస్తున్న వారిని యోహాను దినాల్లో నివసించిన వారిని ఉద్దేశించి ప్రవచించినవి. ఈ ప్రవచనంలో వర్ణితమైన కొన్ని దృశ్యాలు గతానికి సంబంధించినవికాగా కొన్ని ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించినవి. కొన్ని దృశ్యాలు అంధకార శక్తులకు పరలోక యువరాజుకు మధ్య జరుగుతున్న సంఘర్షణ ముగింపును మన దృష్టికి తెస్తున్నాయి. నూతన భూమిలో విమోచన పొందిన వారి విజయాల్ని ఆనందోత్సాహాన్ని వెల్లడిచేసే దృశ్యాలు కొన్ని.AATel 419.2

    ప్రకటన గ్రంథంలోని ప్రతీ చిహ్నం అర్థం వివరించలేకపోయిన కారణంగా ఈ పుస్తకంలోని సత్యం భావం తెలుసుకోటానికి ఈ పుస్తకాన్ని పరిశోధించటం వ్యర్థమని ఎవరూ తలంచకూడదు. ఈ మర్మ విషయాల్ని యోహానుకు బయలుపర్చిన ప్రభువు సత్యం కోసం పట్టుదలతో వెదకే వ్యక్తికి పరలోక విషయాల్ని రుచి చూపిస్తాడు. ఎవరి హృదయాలు సత్వానికి తమ హృదయద్వారాలు తెరుస్తారో వారు దాని బోధనల్ని అవగాహన చేసుకుంటారు. “ఈ ప్రవచన వాక్యములు... విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొను” వారికి వాగ్దానం చేయబడ్డ దీవెనను వారు పొందుతారు.AATel 419.3

    బైబిలులోని పుస్తకాలన్నీ ప్రకటన గ్రంథంలో కలుసుకొని సమాప్తమౌతాయి. దానియేలు గ్రంథం ఇక్కడ పూర్తి అవుతుంది. ఒకటి ప్రవచనం; తక్కింది ఆవిష్కరణ. మూతపడిన పుస్తకం ప్రకటన గ్రంథం కాదు. చివరి దినాలకు సంబంధించిన దానియేలు ప్రవచన భాగం. దూత ఇలా ఆజ్ఞాపించాడు. “దానియేలూ, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము.” దానియేలు 12:4.AATel 420.1

    తనకు వెల్లడి చేసిన సంగతులను లిఖించాల్సిందిగా ఆపొస్తలుడు యోహానును ఆదేశించింది క్రీస్తే. ఆయన ఈ ఆదేశమిచ్చాడు, “నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్డీస్, ఫిలదెల్సియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుము.” “నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను..... నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని వీటి వెంట కలుగబోవువాటిని, అనగా నాకుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీప స్తంభములు ఏడు సంఘములు.” ప్రకటన 1:11, 18-20.AATel 420.2

    ఈ ఏడు సంఘాల పేళ్లు క్రైస్తవ యుగంలో ఆయా కాలాల్లోని సంఘానికి సంకేతాలు. ఏడు సంపూర్ణత్వాన్ని సూచిస్తూ, ఈ వర్తమానాలు కాలంతంవరకూ సాగుతాయనటానికి చిహ్నం. ఉపయుక్తమైన చిహ్నాలు లోకచరిత్రలో వివిధ కొలాల్లో సంఘ పరిస్థితిని వివరిస్తాయి.AATel 420.3

    క్రీస్తు ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడుస్తున్నట్లు చెప్పటం జరిగింది. సంఘాలతో ఆయనకున్న సంబంధాన్ని ఇలా సంకేతాత్మకంగా సూచించటం జరిగింది. తన ప్రజలతో ఆయన నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. వారి వాస్తవిక స్థితి ఆయన ఎరుగును. వారి క్రమాన్ని, భక్తిని, ఆత్మ సమర్పణను ఆయన పరిశీలిస్తాడు. పరలోక మందిరంలో ఆయన ప్రధాన యాజకుడు, మధ్యవర్తీ అయినా లోకంలోని తన సంఘాల మధ్య నడుస్తున్నట్లు ఆయనను వర్ణించటం జరుగుతుంది. కావలివారి దీపం కొడిగొడు తుందేమోనని లేక ఆరిపోతుందేమోనని మెలకువగా అప్రమత్తంగా ఉండి పరిశీలిస్తూ ఉంటాడు. దీపస్తంభాల్ని చూసుకోటం పూర్తిగా మానవులకే విడిచి పెడ్రే మినుకు మినుకుమనే దీపం ఇంకా కాంతి హీనమై ఆరిపోతుంది. అయితే ప్రభువు మందిరంలో ఆయనే నిజమైన కావలివాడు. ఆలయ ఆవరణంలో ఆయన యధార్థ ప్రతిపాలకుడు. ఆయన నిత్య సంరక్షణ ఆయన కృప జీవానికి వెలుగుకు మూలం.AATel 420.4

    క్రీస్తు కుడిచేతిలో ఏడు నక్షత్రాల్ని పట్టుకొనివున్నట్లు చూస్తున్నాం. దేవుడు తనకిచ్చిన సత్యసంపద విషయంలో నమ్మకంగా ఉండే ఏ సంఘమూ విఫలమోతానని భయపడనవసరంలేదని ఇది భరోసాయిస్తుంది. ఎందుకంటే సర్వశక్తుని పరిరక్షణగల ఒక్క నక్షత్రాన్ని కూడా క్రీస్తు చేతుల్లో నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. “ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా.” ప్రకటన 2:1. ఈ మాటలు సంఘ బోధకులకు అనగా దేవుడు ఎవరికి గొప్ప బాధ్యతలు అప్పగించాడో వారిని ఉద్దేశించి పలికిన మాటలు. సంఘంలో సమృద్దిగా ఉండాల్సిన మంగళ మనోహర ప్రభావాలు, క్రీస్తు ప్రేమకు ప్రతిరూపాలు కావలసిన బోధకులతో ముడిపడివున్నాయి. పరలోక నక్షత్రాలు ఆయన నియంత్రణ కింద ఉంటాయి. ఆయన వాటిని వెలుగుతో నింపుతాడు. వాటి కదలికల్ని నిర్దేశిస్తాడు. ఆయన నియంత్రణ లేకపోతే అవి పతనమైన నక్షత్రాలవుతాయి. ఆయన బోధకుల విషయంలోనూ ఇదే వాస్తవం. బోధకులు ఆయన చేతిలో సాధనాలు మాత్రమే. వారు చేసే మంచి అంతా ఆయన శక్తి ద్వారానే చేయగలుగుతారు. ఆయన వెలుగు వారిద్వారా ప్రకాశించాల్సివుంది. రక్షకుడే వారి సామర్థ్యం కావలసివున్నాడు. ఆయన తన తండ్రి మీద ఎలా ఆధారపడివున్నాడో అలాగే వారు ఆయనపై ఆధారపడివుంటే ఆయన సేవను నిర్వహించేందుకు వారికి శక్తి కలుగుతుంది. వారు దేవునిమిద ఆధారపడి సేవచేయగా ఆయన తన ప్రకాశాన్ని వారికిస్తాడు. దాన్ని వారు ప్రపంచానికి ప్రతిబించాల్సివుంది.AATel 421.1

    పౌలు ప్రవచించిన ధర్మవిరోధ సంబంధమైన మర్మం సంఘచరిత్ర ఆరంభంలోనే దాని దుష్కృతాలు మొదలు పెట్టింది. ఎవరిగురించి పేతురు విశ్వాసుల్ని హెచ్చరించాడో ఆ అబద్ధ బోధకులు తమ తప్పుడు సిద్ధాంతాలు బోధించినప్పుడు అనేక మంది ఆ అబద్దాల్ని అంగీకరించారు. కొంతమంది విశ్వాసులు శ్రమలు కలిగినప్పుడు అధైర్యంచెంది తమ విశ్వాసాన్ని విడిచి పెట్టటానికి శోధించబడ్డారు. యోహానుకి ఈ ప్రకటన సందేశం వచ్చిన సమయంలో అనేకులు సువార్త సత్యంపట్ల విశ్వాసం కోల్పోయారు. అయినా కృపామయుడైన దేవుడు సంఘాన్ని తన విశ్వాస రహిత స్థితిలో విడిచి పెట్టలేదు. అనంత కరుణాకటాక్షాలతో నిండిన వర్తమానంలో వారి పట్ల తన ప్రేమను, వారు నిత్యజీవం పొందేందుకు పాటుపడాలన్న ఆకాంక్షను ఆయన వెల్లడించాడు. “నీవు ఏ పరిస్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొంది మొదటి క్రియలు చేయుము” అంటూ విజ్ఞాపనచేశాడు. 5వ వచనం.AATel 421.2

    సంఘంలో లోటుపాట్లున్నాయి. మందలింపు, శిక్ష అవసరమే. సువార్తమౌలిక సూత్రాల్ని విడిచి పెట్టి, రక్షణ నిరీక్షణను పోగొట్టుకొనే ప్రమాదంలోవున్న వారికి హెచ్చరిక, మందలింపు. విజ్ఞాపనతో కూడిన వర్తమానాల్ని దాఖలు చెయ్యటానికి యోహాను ఆత్మ పేరితుడయ్యాడు. కాగా దేవుడు పలికే మందలింపు మాటలు ఎల్లప్పుడూ సున్నితమైన ప్రేమతోను పశ్చాత్తాపపడే విశ్వాసికి సమాధాన వాగ్దానంతోను నిండివుంటాయి. ప్రభువిలా అంటున్నాడు, “ఇదిగో నేను తలుపునొద్దనిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమువిని తలుపు తీసినయెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.” ప్రకటన 3:20.AATel 422.1

    సంఘర్షణ మధ్యవుండి దేవుని పై తమ విశ్వాసాన్ని కాపాడుకునే వారికి అందించటానికి ప్రవక్తకు ప్రభువు వద్దనుంచి ఈ మాటలు వచ్చాయి: “నీ క్రియలు నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమైయుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయనేరడు.” “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధనకాలములో నేనును నిన్ను కాపాడెదను.” విశ్వాసులకు ఈ హితవు వస్తున్నది: “జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.” “నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటమునపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.” 8,10,2,11 వచనాలు.AATel 422.2

    “సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడను” (ప్రకటన 11:9) అని ప్రకటించుకొన్న ఒక నిద్వారా క్రీస్తును గురించి తన సంఘం అనుభవించనున్న శ్రమలను బయలుపర్చాడు. చీకటితోను మూఢన్మకాలతోను నిండిన దీర్ఘ శతాబ్దాల్లోనుంచి కిందికి చూస్తూ, సత్యంపట్ల తమ ప్రేమ కారణంగా వేలాది ప్రజలు హతసాక్షులవ్వటం బహిష్కృతుడుగావున్న ఈ వృద్ధశిష్యుడు చూశాడు. గతంలోని తన సాక్షుల్ని ఆదుకున్న ఆ ప్రభువు, లోకం అంతం కాకముందు నమ్మకమైన తన అనుచరులు శతాబ్దాలు తరబడి అనుభవించనున్న తీవ్రహింసాకాలంలో వారిని విడిచి పెట్టడని కూడా చూశాడు. ప్రభువిలా అంటున్నాడు, “ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోవుచున్నాడు, పది దినములు శ్రమకలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదును.” ప్రకటన 2:10.AATel 422.3

    దుర్మార్గతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యధార్ధ విశ్వాసులకు ప్రభువు చేసిన ఈ వాగ్దానాన్ని యోహాను విన్నాడు: “జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును.” “జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.” “నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను.” 7:3:5,21 వచనాలు.AATel 422.4

    దేవుని కృప, కనికరం, ప్రేమ ఆయన పరిశుద్ధత, న్యాయశీలత, శక్తితో మిళితమవ్వటం యోహాను చూశాడు. తమ పాపాలకారణంగా వారు భయపడ్డ ఆయనలో పాపులు ఒక తండ్రిని గుర్తించటం అతడు చూశాడు. ఈ మహాసంఘరణ అంతం అనంతర కాలాన్ని పరిగణిస్తూ, “జయించినవారు దేవుని వీణెలుగలవారై ఆ స్పటికపు సముద్రమునొద్ద నిలిచి”, “మోషే కీర్తన” గొర్రెపిల్ల కీర్తన పాడుతూ సీయోను మీద ఉండటం చూశాడు. ప్రకటన 15:2,3.AATel 423.1

    “యూదాగోత్రపు సింహము”, “వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల” సంకేతాల కింద రక్షకుణ్ని యోహాను ముందుంచటం జరిగింది. ప్రకటన 5:5,6. ఈ చిహ్నాలు సర్వశక్తుని శక్తి, ఆత్మార్పణ పూరిత ప్రేమ కలయికను సూచిస్తున్నాయి. తన కృపను నిరాకరించేవారికి మిక్కిలి భయంకరమైన యూదా గోత్రపు సింహమే విధేయులు నమ్మకస్తులు అయిన ప్రజలకు దేవుని గొర్రెపిల్లగా పరిణమిస్తుంది. దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవారికి భయంకలిగించే అగ్ని స్తంభమే ఆయన ఆజ్ఞల్ని ఆచరించేవారికి వెలుగు, కృప, విమోచనలకు గుర్తుగా పరిణమిస్తుంది. తిరుగుబాటుదారుల్ని మొత్తటానికి శక్తిగల హస్తమే నమ్మకంగా ఉన్నవారిని విడిపించటానికి శక్తి కలిగి ఉంటుంది. నమ్మకంగా ఉన్నవారందరూ రక్షణ పొందుతారు. “ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.” మత్తయి 24:31.AATel 423.2

    లోకంలోని కోట్లాది జనులతో పోల్చినప్పుడు దైవప్రజలు ఎప్పుడూ అల్పసంఖ్యలోనే ఉంటూ వచ్చారు. కాని దేవుని వాక్యం ఆవిష్కరిస్తున్న సత్యానికి వారు నిబద్ధులైవుంటే దేవుడు వారికి కోటగా నిలుస్తాడు. సర్వశక్తుని కాపుదల కింద వారుంటారు. ఎప్పుడూ దేవుడే అధిక సంఖ్యలో ఉంటాడు. చివరి బూర శబ్దం మృతుల కారాగృహంలోకి చొచ్చుకు పోయినప్పుడు, నీతిమంతులు విజయోత్సాహంతో సమాధుల్లోనుంచి, “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ?” (1 కొరింథీ 15:55) అంటూ బయటికి వచ్చి, దేవునితో, క్రీస్తుతో, దూతలతో, అన్ని యుగాల్లోను నమ్మకంగా నిజాయితీగా నిలిచివున్న వారితో కలిసి నిలబడినప్పుడు దైవ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉంటారు.AATel 423.3

    క్రీస్తు యధార్థ శిష్యులు తీవ్ర శ్రమలో ఆయనను వెంబడిస్తారు. లేమిని భరిస్తారు. నిరాశను తట్టుకుంటారు. ఇది పాపపు అపరాధాన్ని పాపం కలిగించే దుఃఖాన్ని వారికి బోధపర్చుతుంది. వారు పాపాన్ని అసహ్యించుకోటానికి అది దారితీస్తుంది. క్రీస్తు శ్రమల్లో పాలుపంచుకునేవారు క్రీస్తు మహిమలో పాలివారవుతారు. దేవుని శేషించిన సంఘం అంతిమంగా విజయం సాధిస్తుందని ప్రవక్త పరిశుద్ధ దర్శనంలో చూశాడు. అతడిలా రాస్తున్నాడు: “అగ్నితో కలిసియున్న స్పటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని..... జయించినవారు దేవుని వీణిలుగలవారై ఆ స్పటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని. వారు - ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి...” అని ‘చెప్పుచు దేవుని దాసుడగు మోషేకీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.” ప్రకటన 15:2,3.AATel 424.1

    “మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.” ప్రకటన 14:1. ఈ లోకంలో వారి మనసులు దేవునికి సమర్పితమమయ్యాయి. వారు ఆయనను హృదయపూర్వకంగా సేవించారు. కనుక ఇప్పుడు తన నామం “వారి నొసళ్లయందు” ఆయన ఉంచగలడు. ” వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు.” ప్రకటన 22:5. ఒక తావును యాచించే వారిలా వారు బయటికి లోపలికి వెళ్ళరు. “నా తండ్రిచేత ఆశీర్వదించపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని క్రీస్తు ఎవరిని ఆహ్వానిస్తాడో వారి సంఖ్యలో వీరుంటారు. “నీ యజమాని సంతోషములో పాలుపొందుము” అంటూ వారిని తన బిడ్డలుగా స్వాగతిస్తాడు. మత్తయి. 25:34,21.AATel 424.2

    “వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి గొట్టె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు... వీరు దేవుని కొరకును గొట్టె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు” ప్రకటన 14:4. పరిశుద్ధ సేవకు సమాయత్తమై, పరిశుద్ధుల నీతి అయిన తెల్లని నారబట్టలు ధరించి సీయోను పర్వతంపై నిలిచి ఉన్నట్లు ప్రవక్త దృష్టి వారిని చిత్రించుకొంటున్నది. పరలోకంలో దేవుని గొర్రెపిల్లను వెంబడించేవారు ఈలోకంలో ఆయనను వెంబడించినవారే. అసంతృప్తివల్లో చంచలత్వంవల్లో కాక పూర్ణ విశ్వాసం, ప్రేమ, మనఃపూర్వక విధేయతతో కాపరిని మంద వెంబడించినట్లు ఆయనను వెంబడించారు.AATel 424.3

    “నేను వినిన ఆ శబ్దము వీణాలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసము ఎదుట... ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలువది వేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు..... వీరినోట ఏ అబద్దమును కనబడలేదు; వీరు అనింద్యులు.” 2-5 వచనాలు.AATel 425.1

    “మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.” “దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్యరత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మముల యొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి.” “దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొట్టె పిల్లయు దానికి దేవాలయమైయున్నారు.” ప్రకటన 21:2,11,12,21,22.AATel 425.2

    “ఇకమీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; దీపకాంతియైనను సూర్యకాంతియైనను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.” ప్రకటన 22:3-5.AATel 425.3

    “మరియు స్పటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొట్టెపిల్ల యొక్కయు సింహాసనము నొద్దనుండి ఆపట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈ వలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.” “జీవ వృక్షమునకు హక్కు గలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.” 1,2,14 వచనాలు,AATel 425.4

    “ఇదిగో దేవుని వాసము మనుష్యులతో కూడ ఉన్నది. ఆయన వారితో కాపురముండును, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.” ప్రకటన 21:3.AATel 425.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents