Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అపొస్తలుల కార్యాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    53—అనుంగు శిష్యుడు యోహాను

    ” యేసు ప్రేమించిన వాడు” గా యోహాను ఇతర అపొస్తలులకన్న ప్రత్యేకత కలవాడు (యోహాను 21:20). క్రీస్తుతో ఒకింత సన్నిహితమైత్రి ఉన్నట్లు కనిపిస్తున్న అతనిపట్ల రక్షకునికి విశ్వాసం ప్రేమ ఉన్నవనటానికి ఎన్నో నిదర్శనాలు కనిపించాయి. అంతర్జాన పర్వతం మీద క్రీస్తు మహిమను, గెత్సేమనేలో ఆయన అనుభవించిన వేదనను వీక్షించటానికి అనుమతి పొందిన ముగ్గురిలో ఇతడు ఒకడు. సిలువ మీద తన చివరి బాధాకర ఘడియల్లో తన తల్లిని ప్రభువు ఇతడి చేతులకే అప్పగించాడు.AATel 387.1

    ఈ శిష్యుడిపట్ల రక్షకుడి ప్రేమకు అతడు ప్రగాఢ భక్తితో ప్రతిస్పందించాడు. పూతీగ బలమైన స్తంభానికి చుట్టుకుని ఉన్నట్లు యోహాను క్రీస్తును హత్తుకొని ఉన్నాడు. తన ప్రభువు నిమిత్తం అతడు తీర్పుగది సంబంధిత అపాయాన్ని లెక్కచెయ్యకుండా సిలువకు దగ్గరగా ఉన్నాడు. క్రీస్తు సమాధినుంచి లేచాడన్న వార్త చెవిని పడ్డప్పుడు సామాధివద్దకు హడావుడిగా వెళ్తూ దారిలో దుందుడుకు పేతుర్ని కూడా దాటిపోయాడు.AATel 387.2

    తన జీవితంలోను ప్రవర్తనలోను యోహాను ప్రదర్శించిన ప్రేమ భక్తి క్రైస్తవ సంఘానికి అమూల్యపాఠాలు నేర్పుతున్నాయి. యెహాను తదుపరి జీవితంలో ప్రదర్శితమైన సుందర ప్రవర్తన అతడికి స్వభావ సిద్ధంగా ఉన్న ప్రవర్తన కాదు. స్వాభావికంగా అతడిలో తీవ్రమైన లోపాలున్నాయి. గర్వం, మంకుతనం, ప్రతిష్ఠకోసం తహతహ మాత్రమేగాక దుడుకుతనం వల్లమాలిన ఆత్మాభిమానం అతడి బలహీనతలు. అతణ్ని అతడి సహోదరుణ్ని ” ఉరిమెడివారు” అని పిలిచేవారు. చెడు కోపం, ప్రతీకార కాంక్ష, విమర్శించటం - ఇవి ఈ ప్రియ శిష్యుడి దుర్గుణాలు. కాని దీని కింద ఉన్న పట్టుదలగల, యథార్థ, ప్రేమపూరిత హృదయాన్ని ఆ పరమ బోధకుడు గుర్తించాడు. యేసు అతడి స్వార్థచింతను మందలించాడు, అత్యాశను భంగపర్చాడు, విశ్వాసాన్ని పరీక్షించాడు. అయితే తన ఆత్మ దేనికోసం ఆశగా ఎదురు చూస్తుందో దాన్ని అతడికి బయలుపర్చాడు. అదే పరిశుద్ధతలోని సౌందర్యం, ప్రేమలోని పరివర్తన శక్తి.AATel 387.3

    రక్షకునితో తన వ్యక్తిగత సహవాసంలో అనేక సందర్భాల్లో యోహాను ప్రవర్తనలోని లోపాలు బహిర్గతమయ్యా యి. క్రీస్తు ఒకసారి సమరయలోని ఒక గ్రామంలోకి తనకు ముందుగా దూతల్ని పంపి తనకు తన శిష్యులికి అల్పాహారం తయారుచేయాల్సిందిగా కోరాడు. అయితే రక్షకుడు ఆ పట్టణం దగ్గరకు వెళ్లినప్పుడు తిన్నగా యెరుషలేము వెళ్లాలనుకున్నట్లు కనిపించింది. ఇది సమరయులికి అసూయ పుట్టించింది. అందువల్ల ప్రభువును తమ వద్ద ఉండాల్సిందిగా కోరేబదులు సామాన్యంగా ఆ దారిని ప్రయాణించే వారికి చేసే మర్యాదల్ని కూడా వారు ఆపుచేశారు. తనను చేర్చుకోమంటూ ఎవరినీ యేసు అభ్యర్థించడు. కనుక సమరయులు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. తమ అతిథిగా ఉండాల్సిందిగా వారు ఆయనను ఆహ్వానించి ఉంటే వారికి గొప్ప దీవెన కలిగేది.AATel 388.1

    క్రీస్తు తన సన్నిధి ద్వారా సమరయుల్ని దీవించాలని ఉద్దేశించినట్లు శిష్యులికి తెలుసు. తమ ప్రభువుపట్ల సమరయులు ప్రదర్శించిన ఉదాసీనత, విద్వేషం, అమర్వాద శిష్యుల్ని ఆగ్రహంతో నింపాయి. ప్రధానంగా యాకోబు యోహానులు తీవ్ర ఆవేశానికి గురి అయ్యారు. తాము సన్మానించి పూజించే ఆ ప్రభువును ఇలా అగౌరవపర్చటం ఘోర తప్పిదమని దాన్ని వెంటనే శిక్షించకుండా విడిచి పెట్టరాదని వారు భావించారు. ఆ ఉద్రేకంలో వారిలా అన్నారు. ఏలియాను బంధించటానికి పంపబడ్డ సమరయ సేనాపతుల్ని వారి సేనల్ని నాశనం చెయ్యటాన్ని దృష్టిలో ఉంచుకుని వారిలా అన్నారు, ” ప్రభువా, ఆకాశము నుండి అగ్నిదిగి వీరిని (ఏలియావలె) నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా?” అన్నారు. తమ మాటలికి యేసు బాధపడ్డట్లు గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ” ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించి” నప్పుడు వారు మరింత ఆశ్చర్యపడ్డారు. లూకా 9 : 54, 56.AATel 388.2

    తనను అంగీకరించాల్సిందిగా ఒత్తిడి చెయ్యటం క్రీస్తు సేవ ఉద్దేశం కానే కాదు. మనస్సాక్షిని ఒత్తిడి చెయ్యటం సాతాను స్వభావం, అతడి అనుచరగణం స్వభావం. నీతి కోసం ఉత్సాహం ఉన్నట్లు నటిస్తూ, దుష్టదూతలతో జట్టుకట్టిన మనుషులు కొన్నిసార్లు మతసంబంధమైన తమ అభిప్రాయాల్ని అంగీకరింపజేసేందుకు తోటి మనుషుల్ని హింసకు గురిచేస్తారు. అయితే క్రీస్తు సర్వదా కృప చూపిస్తున్నాడు. సర్వదా ప్రేమ వెల్లడించటం ద్వారా రక్షించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆత్మలోకి ఏ ప్రత్యర్థినీ ఆయన ప్రవేశింపనీయ్యడు. పాక్షిక సేవను ఆయన అంగీకరించడు. ఆయన ఆశించేది స్వచ్ఛంద సేవ మాత్రమే. అది ప్రేమ ఒత్తిడివల్ల చోటుచేసుకునే మనఃపూర్వక సమర్పణ.AATel 388.3

    తన రాజ్యంలో ఉన్నతమైన స్థానాలు అనుగ్రహించాల్సిందిగా క్రీస్తును యాకోబు యెహాన్లు మరో సందర్భంలో తమ తల్లిద్వారా కోరారు. తన రాజ్య ” స్వరూప స్వభావాల గురించి క్రీస్తు పదేపదే ఉపదేశం ఇస్తూ ఉన్నా, మెస్సీయా వస్తాడని, సింహాసనాన్ని అధిరోహించి మనుషుల కోర్కెల మేరకు రాజ్యపరిపాలన చేస్తాడని ఈయన శిష్యులు ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈ రాజ్యంలో తన కుమారునికి ప్రతిష్టాత్మక స్థానాలు కోరుతూ ఆ తల్లి ఇలా మనవిచేసింది, ” నీ రాజ్యమందు ఈ నాయిద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము.”AATel 388.4

    అందుకు రక్షకుడిచ్చిన జవాబు ఇది, ” మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా?”. శ్రమలు బాధలగురించి ఆయన అన్న మర్మగర్భితమైన మాటలు గుర్తున్నప్పుటికి వారు ఆత్మవిశ్వాసంతో ” త్రాగగలము” అని సమాధానం ఇచ్చారు. తమ ప్రభువుకు కలిగే శ్రమల్లో పాలుపంచుకోటంద్వారా తమ విశ్వసనీయతను నిరూపించుకోటం తమకు అత్యున్నత గౌరవమని భావించారు. సింహాసనానికి బదులు తనకు మిత్రులుగా ఒకడు కుడిపక్క ఒకడు ఎడమపక్క ఇద్దరు నేరగాళ్లతో సిలువపై ఉండగా, ” మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు” అని క్రీస్తు ప్రకటించాడు. యాకోబు యోహానులు తమ ప్రభువు శ్రమల్లో పాలివారు కావలసి ఉన్నారు - ఒకడు త్వరలో నే ఖడ్గానికి ఆహుతి కావటంద్వారాను, ఒకడు దీర్ఘకాలంగా నిందలు హింస భరించి తమ ప్రభువుశ్రమల్లో పాలుపంచు కోటంద్వారాను. ఆయన ఇంకా ఇలా అన్నాడు, “నా కుడి వైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నావశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకును.” మత్తయి 20 : 21,23.AATel 389.1

    ఆ మనవి వెనుక ఉద్దేశాన్ని యేసు గ్రహించి ఆ ఇద్దరి శిష్యుల అతిశయాన్ని ఇలా మందలించాడు: ” అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. నాలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు నా పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడైయుండగోరునో వాడు నా దాసుడైయుండవలెను. ఆలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెనని చెప్పెను.” మత్తయి 20 : 25, 28.AATel 389.2

    దేవుని రాజ్యంలో ఆశ్రిత పక్షపాతంద్వారా హోదాను సంపాదించటం అసాధ్యం. దాన్ని కష్టపడి సంపాదించలేం. లేక అది నచ్చిన వాళ్లకి ఇచ్చే పందేరం కాదు. అది సత్ప్రవర్తన ఫలం. కిరీటం, సింహాసనం ఒక స్థితిని సాధించటానికి చిహ్నాలు. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపద్వారా స్వార్థాన్ని జయించటానికి అవి చిహ్నాలు.AATel 389.3

    ఆ తర్వాత చాలా కాలానికి క్రీస్తు శ్రమల్లో పాలుపంచుకోటం ద్వారా యోహాను తన సానుభూతి పొందినప్పుడు తన రాజ్య ప్రవేశానికి షరతు ఏంటో ప్రభువు అతడికి బయలుపర్చాడు. “నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసమునందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను” అని క్రీస్తు చెప్పాడు. ప్రకటన 3 : 21. ” దీర్ఘకాలము సహించు,” ” దయ చూపించు” ” మత్సరపడ” ని, ” డంబముగా ప్రవర్తించ” ని ” ఉప్పొంగ” ని ప్రేమను, (1 కొరిథి 13: 4, 5) ఆత్మార్పణతో కూడిన ఆయన ప్రేమను, మానవుల రక్షణార్థం జీవించి శ్రమించి మరణించేంతవరకూ ఆత్మార్పణ చేసిన ప్రభువు ప్రేమాస్పూర్తిని విస్తారంగా కలిగి ఉన్నవాడే క్రీస్తుకి అతిసమీపంగా నిలిచి ఉంటాడు.AATel 390.1

    తమ తొలిదినాళ్ల సువార్త సేవలో ఒకసారి యాకోబు యెహానులు క్రీస్తు అనుచరుడుగా గుర్తింపు పొందని ఒక వ్యక్తి క్రీస్తు నామంలో దయ్యాల్ని పోగొడుతున్నాడు. ఆ పనిని చేయవద్దని ఈ శిష్యులు ఆదేశించారు. అది న్యాయమే అని వారు భావించారు. అయితే వారు ఆ విషయాన్ని క్రీస్తుముందు పెట్టినప్పుడు వారిని మందలిస్తూ ఆయన ఇలా అన్నాడు, “వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందించగల వాడెవడును లేడు.” మార్కు 9 : 39. ఏ రూపంలోనైనా క్రీస్తు పట్ల స్నేహభావం కలవారిని తిరస్కరించటం మంచిదికాదు. శిష్యులు సంకుచిత భావాలు,వేర్పాటుతత్వాలు కలిగి ఉండకూడదు. ప్రభువు కనపర్చిన విశాల సానుభూతిని ఆయన శిష్యులూ ప్రదర్శించాలి. ఈ వ్యక్తిని నిరోధించటంలో తాము ప్రభవు ప్రతిష్ఠను కాపాడున్నట్లు యాకోబు యోహాన్లు భావించారు. కాని తాము తమ సొంత గౌరవాన్ని భద్రపర్చుకోటానికి ప్రయత్నిస్తునట్లు వారు గ్రహించటం మొదలు పెట్టారు. తమ తప్పును గుర్తించి మందలింపు అంగీకరించారు.AATel 390.2

    కృపలో పెరగటానికి, ప్రభువు సేవ చేయటానికి అర్హతకు సాత్వికం, వినయం, ప్రేమ అగత్యమని క్రీస్తు నేర్పిన పాఠాలు యోహాను విషయంలో ఎంతో విలువైన పాఠాలు. ప్రతీపాఠాన్ని యోహాను జాగ్రత్తగా మనసులో నిక్షిప్తం చేసుకుని వాటి ప్రకారం తన జీవితాన్ని తీర్చిదిద్దుకోటానికి కృషిచేశాడు. యోహాను క్రీస్తు మహిమను గ్రహించటం ప్రారంభించాడు. క్రితం తాను ఆశించినట్లు లోక మహిమ ప్రాభవాల్ని, అధికారాన్ని కాక ” కృపాసత్య సంపూర్ణుడుగా.... తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె ..... ఆయన మహిమను” కనుగొన్నాడు. యోహాను 1: 14.AATel 390.3

    ప్రభువుపట్ల యోహాను కున్న ప్రగాఢ ప్రేమకు హేతువు తనపట్ల క్రీస్తుకున్న ప్రేమకాదు. దాని ఫలం. యోహాను క్రీస్తువలె ఉండాలని ఆకాంక్షించాడు. క్రీస్తు ప్రేమలోని పరివర్తన కలిగించే ప్రభావంవల్ల అతడు సాత్వికుడు దీనస్వభావి అయ్యాడు. స్వార్ధం క్రీస్తులో మరుగయ్యింది. ఆ అద్భుత జీవితంలోని శక్తికి శిష్యులందరికన్నా యోహాను ఎక్కువగా తన్నుతాను సమర్పించుకున్నాడు. యోహాను . ఇలా అంటున్నాడు, ” ఆ జీవము ప్రత్యక్షమాయెను... ఆ నిత్యజీవమును మేము చూచి” తిమి. ” ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపవెంబడి కృపను పొందితిమి.” 1 యోహాను 1:2; యోహాను 1:16. రక్షకుణ్ని ప్రయోగాత్మకంగా తెలుసుకున్నాడు. ప్రభువు నేర్చిన పాఠాలు అతడి ఆత్మపై ముద్రితమయ్యాయి. రక్షకుని కృపను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతని సామాన్యభాష ప్రేమతోనిండి ఏకధాటిగా వెలువడి దేహాన్ని పరివేష్టించింది.AATel 390.4

    క్రీస్తుపట్ల తనకున్న ప్రగాఢ ప్రేమ ఎల్లప్పుడూ ఆయన పక్క ఉండాలన్న కోరికను యోహోనులో పుట్టించింది. రక్షకుడు పన్నెండుమందినీ ప్రేమించాడు. యోహానుది ఎక్కువగా గ్రహించి స్వీకరించే స్వభావం. అందరికన్నా యోహానే చిన్నవాడు. అతడు చిన్నపిల్లాడిలా విశ్వసించి తన హృదయాన్ని యేసుకు తెరిచాడు. ఇలా అతడు క్రీస్తు సానుభూతిని ఎక్కువగా పొందగలిగాడు. రక్షకుడు అతని ద్వారా లోతైన ఆధ్యాత్మిక బోధల్ని ప్రజలకు అందించాడు. .AATel 391.1

    తండ్రికి ప్రతినిధులంటే యేసుకు మహా ప్రేమ. తండ్రి ప్రేమను గురించి యోహాను మాట్లాడగలిగినంతగా తక్కిన శిష్యులెవ్వరూ మాట్లాడలేదు. ఆత్మలోతాను భావించిందంతా అతడు తోటి మనుషులికి వెల్లడిచేశాడు. దైవ లక్షణాల్ని ప్రవర్తనలో ప్రదర్శించాడు. అతని ముఖంలో ప్రభువు మహిమ కనిపించింది. తనలో మార్పుకలిగించిన పరిశుద్ధతా సౌందర్యం అతని ముఖంలో క్రీస్తు ముఖంలోని వెలుగులా ప్రకాశించింది. పూజ్యభావంతో ప్రేమతో అతడు రక్షకుని పై దృష్టినిలిపాడు. చివరికి క్రీస్తు పోలిక, క్రీస్తుతో సహవాసం అతని ఏకైక వాంఛ అయ్యింది. అతని ప్రవర్తన క్రీస్తు ప్రవర్తనకు అద్దం పట్టింది. AATel 391.2

    యోహానిలా అన్నాడు, ” మనము దేవుని పిల్లలనబడునట్లు తండ్రిమనకెట్టి ప్రేమననుగ్రహించెనో చూడుడి....యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్ష పర్చబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.” 1 యోహాను 3 : 1, 2.AATel 391.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents